
న్యూఢిల్లీ: లిక్విడేషన్‌లో ఉన్న ఆర్‌కామ్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం (రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్) రూ.3,720 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేస్తామని రిలయన్స్ జియో ప్రతిపాదన చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రూ.3,720 కోట్ల బిడ్‌ను రిలయన్స్ 2019 నవంబర్‌లోనే సమర్పించం గమనార్హం. దీరికి రుణదాతల కమిటీ కూడా ఆమోదం తెలిపింది.
ఈ మేరకు చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జియో అనుబంధ కంపెనీ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు తెలిపింది. ఆలస్యం చేయడం వల్ల ఆస్తుల విలువ క్షీణిస్తుందంటూ.. దివాలా పరిష్కార ప్రణాళిక మేరకు వెంటనే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపింది.