ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న వైర్‌లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభించనుంది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్‌బుల్ వైర్‌లెస్ ఇంట్నెట్ 1.5 జీబీపీఎస్ వేగంతో పనిచేస్తుంది. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.
సెప్టెంబర్ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్‌ఫైబర్‌ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చు. వైఫై 6కి సపోర్ట్ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి
జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లతో పోలిస్తే దీని స్పీడ్ ఎక్కువ. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం చాలా సులభమని జియో పేర్కొంది. దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో వైఫై హాట్ స్పాట్, 5జీతో అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతుంది. జియో ఎయిర్‌ఫైబర్‌తో ఇల్లు లేదా ఆఫీస్‌లో గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్‌కు త్వరగా కనెక్ట్ చేయడం సులభం’ అని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.
జియో ఎయిర్‌ఫైబర్ వర్సెస్ జియో ఫైబర్
టెక్నాలజీ: జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ మాత్రం పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. తద్వారా ఫైబర్ కేబుల్స్ వల్ల తలెత్తే ఇబ్బందుల గట్టెక్కొచ్చు.
స్పీడ్: జియో ఎయిర్‌ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది జియో ఫైబర్ 1జీబీపీఎస్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే, జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ స్థానికంగా ఉండే టవర్ల ఆధారంగా మారుతుందని గమనించాలి.
కవరేజ్: జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ టెక్నాలజీ సాయంతో విస్తృతమైన కవరేజీని అందింస్తుంది.
ఇన్‌స్టాలేషన్: జియో ఎయిర్‌ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించబడింది.యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ అవసరం.
ధర: జియో ఎయిర్‌ఫైబర్ ధర దాదాపు రూ. 6,000. జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే ఖరీదైంది. ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ ఉంటుంది.
చదవండి👉🏻 గూగుల్‌కు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment