
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఈ వెంచర్‌లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాయి.
ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment