ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది.
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!
ఈ వార్తలు నిజమేనా?
అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్‌ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్‌చెకర్ (Newschecker) వెబ్‌సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment