donatation
-
ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ విరాళం అందించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు.ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి భారీ సాయం అందించింది. -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్‌చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘ఆమని’ని ఆదుకోండి.. దాతల సాయం కోసం వేడుకోలు..
సాక్షి, కృష్ణా: ఆడుతూ, పాడుతూ చదువుకునే వయసులో ఆ చిన్నారిని కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది. రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద బతుకుబండి లాగిస్తున్నారు. అయితే చిన్న వయసులోనే కుమార్తె మంచానికి పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం. తమ ఉన్నదంతా కూతురు వైద్యానికి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. కష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన కర్నాటి పోతురాజు చిన్న కుమార్తె వెంకట నాగ ఆమని ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే తరచు అనారోగ్యం పాలవడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమనికి తమిళనాడు రాయవెల్లూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటివరకూ చికిత్స కోసం రూ.7లక్షల వరకూ ఖర్చు చేశారు. అయితే కిడ్నీ మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నా ఆర్థిక స్తోమత లేక ఆమని తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీ మార్పిడికి సుమారు 15 లక్షలు అవుతుందని, అవి సమకూరితే తన కిడ్నీ కూతురికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోతురాజు తెలిపారు. మానవతా దృక్ఫదంతో ఆమని చికిత్స కోసం దాతలు సాయం చేసి, తన కుమార్తెను బతికించాలని వేడుకుంటున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే వారు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు 9347464615, 9247298421 కు పంపించాలని కోరుతున్నారు. కర్నాటి వెంకటేశ్వరమ్మ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్: 6284875577 IFSC Code: IDIB000P032 వెంకటాపురం, పశ్చిమ గోదావరి జిల్లా -
నాట్స్‌కు సొంత కారును విరాళమిచ్చిన తెలుగు మహిళ
న్యూ జెర్సీ: అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి తమ వంతు సహకారం అందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూజెర్సీకు చెందిన తెలుగు మహిళ బినోదిని వుతూరి తను వాడే సెడన్ కారును నాట్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించిన బినోదిని.. సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన మద్దతును తెలుపుతూ ఉంటారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలను తెలుసుకున్న బినోదిని తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటితో మాట్లాడి తన సొంత కారును విరాళంగా ఇస్తానని ప్రకటించగా, అనుకున్న విధంగానే ఆమె కారుకు సంబంధించిన యాజమాన్య హక్కులను నాట్స్ కు బదలాయించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని సహకరించారు. నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహనకృష్ణ మన్నవ ఆధ్వర్యంలో నాట్స్ న్యూజెర్సీ విభాగం నుంచి శ్రీ హరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీవెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సురేశ్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, రాంబాబు వేదగిరి, మురళీ మేడిచెర్ల తదితర నాట్స్ నాయకులు బినోదిని ఇంటికి వెళ్లి కారు డాక్యుమెంట్లను స్వీకరించారు. నాట్స్ కోసం బినోదిని తన కారును విరాళంగా ఇవ్వడంపై నాట్స్ నాయకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం -
సీఎం సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ విరాళం
కోవిడ్ –19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ రూ.1,11,00,011 (కోటీ 11 లక్షల 11 రూపాయలు) విరాళం అందజేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సి.రాజేంద్రప్రసాద్ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. -
రాజీవ్ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు
న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూపీఏ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి భారీగా నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యూపీఏ హయాంలో రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్‌జీఎఫ్‌కి ఆమే చైర్ పర్సన్. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. -
లక్ష మందికి ఉపాధి
‘‘ఇలాంటి ఒక సమస్య మన ముందుకు వస్తుందని ఎవరం ఊహించలేదు. కానీ మనందరం యోధులం. కలసికట్టుగా దీనిపై పోరాటం చేద్దాం’’ అంటున్నారు విజయ్ దేవరకొండ. కరోనా కష్ట సమయంలో సమాజానికి తన వంతు సహాయంగా రెండు ప్రకటనలు విడుదల చేశారు విజయ్. ఈ రెండు ప్రకటనలను ఒకటి అత్యవసరంగా కావాల్సినవి, భవిష్యత్తులో కావాల్సినవిగా విభజించారాయన. మొదటిది ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం. గత ఏడాదిగా వర్కవుట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం లక్ష మంది యువతకు ఉపాధి కల్పించడమే అని పేర్కొన్నారు. దీనికోసం కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు విజయ్ తెలిపారు. రెండవది ‘మిడిల్ క్లాస్ ఫండ్’. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని మధ్య తరగతి కుటుంబాలకు ఈ ఫండ్ ద్వారా సహాయం చేయనున్నారు ఆయన. దీనికోసం 25 లక్షలు ప్రకటించారు. అవసరం ఉన్నవారు ‘ది దేవరకొండ ఫౌండేషన్.ఆర్గ్’ ద్వారా టీమ్‌ను సంప్రదించవచ్చన్నారు. ‘‘లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటి దగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు. అందుకే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్న షాప్‌లో సరుకులు కొనవచ్చు. ఆ బిల్‌ను మేము ‘ది మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి చెల్లిస్తాం. ఈ సమయంలో మనందరికీ కావాల్సింది ప్రేమ. ఒకరి నుంచి ఒకరికి భరోసా’’ అన్నారు విజయ్. ‘మిడిల్ క్లాస్ ఫండ్’కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించారు. విజయ్ చేస్తున్న ఈ పనిని దర్శకులు కొరటాల శివ, పూరి జగన్నాథ్ అభినందించారు. -
పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. భారతదేశంలో కోవిడ్ -19, లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు నగదు సహాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విటర్ ద్వారా సుందర్ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు గూగుల్ 800 మిలియన్ డాలర్ల సాయాన్నిప్రకటించింది. అలాగే చిన్న వ్యాపారాలకు మూలధనాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ల డాలర్లను పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా వాస్తవాల నిర్ధారణ, తప్పుడు సమాచారంపై లాభాపేక్ష లేకుండా పోరాటం చేసేందుకు 6.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 కోట్లు) తక్షణ సాయాన్ని అందిస్తున్నట్టు కూడా గూగుల్ ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచ మొత్తం ఈ సేవలు అందించనుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) మహమ్మారి కరాళ నృత్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్లోకి వెళ్లి పోయాయి. రవాణా సహా, ఇతర వాణిజ్య సేవలన్నీ నిలిచిపోయాయి. వినిమయ డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకు పోతున్నాయి. ఉపాధి మార్గాలు లేక ముఖ్యంగా రోజువారీ కార్మికులు, పేద వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం భారీఎత్తున విరాళాల సేకరణ కూడా చేపట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి గివ్ ఇండియా అనే సంస్థ. తినడానికి తిండిలేక నానా అగచాట్లు పడుతున్న కోవిడ్-19 బాధిత కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకుంటోందీ సంస్థ. మాస్క్ లు, సబ్బులు, శానిటరీ కిట్స్తోపాటు ప్రధానంగా నగదు నేరుగా బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ గివ్ ఇండియాకు తన తాజా విరాళాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, గివ్ ఇండియా సమాజంలో ఇప్పటివరకు రూ .12 కోట్లు సమీకరించింది. కాగా మహమ్మారి కారణంగా భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగింది. సోమవారం 35 కొత్త మరణాలు సంభవించగా, కేసుల సంఖ్య 9,152 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి : కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija — GiveIndia (@GiveIndia) April 13, 2020 -
కరోనా విరాళం
పద్మావతి గల్లా – 10 లక్షలు (‘సీసీసీ మన కోసం’కు) పద్మావతి గల్లా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సీ.సీ) – 25 లక్షలు ( తెలంగాణ ప్రభుత్వానికి ) సాయికుమార్ కుటుంబం – 7 లక్షల 12 రూపాయిలు (‘సీసీసీ’కు సాయి కుమార్, ఆయన తనయుడు ఆది సాయికుమార్ 5 లక్షల నాలుగు రూపాయిలు అందించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కి సాయి కుమార్ లక్షా ఎనిమిది రూపాయిలు, సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ లక్ష రూపాయిలు ప్రకటించారు) ఆది, సాయికుమార్ సాగర్ – 5 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి ) కేటీఆర్‌కి చెక్ అందిస్తున్న సాగర్ -
నెమార్ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు
రియో డి జనీరో: బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్, ప్యారిస్ సెయింట్–జెర్మయిన్ క్లబ్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ నెమార్ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చాడు. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు స్థానిక టీవీ చానల్ తెలిపింది. ఈ మొత్తాన్ని ‘యూనిసెఫ్’తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్ కోసం వినియోగించనున్నారు. -
సీసీసీకి టాలీవుడ్ డైరెక్టర్ విరాళం..
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంపత్ నంది కోరారు. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. సోమవారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ప్రభాస్ – 50 లక్షలు నాని – 30 లక్షలు అల్లు అర్జున్ – 20 లక్షలు నారా రోహిత్ – 30 లక్షలు (ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి 10 లక్షలు) సందీప్ కిషన్ – 3 లక్షలు యువీ క్రియేషన్స్ – 10 లక్షలు సుశాంత్ – 2 లక్షలు సంపూర్ణేష్ బాబు – 1 లక్ష బ్రహ్మాజీ – 75 వేలు సతీష్ వేగేశ్న – 50 వేలు (తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ కి) సమీర్ రెడ్డి – 50 వేలు , ప్రసాద్ మూరెళ్ళ – 50 వేలు (తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కి) సాహు గారపాటి, హరీష్ పెద్ది – 5 లక్షలు -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. శుక్రవారం విరాళం ప్రకటించినవారి వివరాలు. ► ప్రభాస్ – 3 కోట్లు (ప్రధాన మంత్రి సహాయనిధికి) ► అల్లు అర్జున్ – కోటీ 25 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, కేరళ ప్రభుత్వానికి 25 లక్షలు) ► సుకుమార్ – 10 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు) ► నిర్మాత అశ్వనీదత్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు) ► నిర్మాత యస్. రాధాకృష్ణ (చినబాబు) – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు) ► నిర్మాతల నవీన్ యర్నేని, వై. రవిశంకర్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు) ► తమన్ – 5 లక్షలు ( హైదరాబాద్, చెన్నై సంగీత కళాకారుల యూనియన్‌కు) ► జీవితా రాజశేఖర్ దంపతులు సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ► సుధీర్‌బాబు – 2 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 1 లక్ష, తెలంగాణకు 1 లక్ష) ► ప్రణీతా సుభాష్ – 1 లక్ష (లక్ష విరాళం కాకుండా ప్రణితా ఫౌండేషన్ ద్వారా 50 కుటుంబాలను ఆదుకుంటున్నట్లు ప్రకటించారు. -
కరోనా కట్టడికి నితిన్ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తనవంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల చొప్పున మొత్తం 20లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు నితిన్. మార్చి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగస్వామ్యులు కావాలని నితిన్ విజ్ఞప్తి చేశారు. హిందీకి ‘భీష్మ’ సౌత్ కథలెప్పుడూ బాలీవుడ్‌కి కలిసొస్తూనే ఉంటాయి. పోకిరి, మర్యాద రామన్న, అర్జున్ రెడ్డి వంటి తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం‘జెర్సీ, ఆర్ఎక్స్ 100’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో సౌత్ సినిమా ‘భీష్మ’ కూడా ఈ లిస్ట్‌లో చేరనుందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లను సాధించి, పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ రీమేక్‌లో హీరోగా రణ్‌బీర్ కపూర్‌ను యాక్ట్ చేయించాలని చూస్తున్నారట. రణ్‌బీర్ కపూర్ -
మాకు పది లక్షల విరాళం
సీనియర్ నటుడు వీకే నరేష్ అధ్యక్షతన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోయింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనం తీసి ఖర్చు చేయడం సమంజసం కాదని భావించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసోసియేషన్‌కు పది లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ‘‘ఇంతవరకూ ‘మా’ అసోసియేషన్ అదనపు నిధుల కోసం సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోంది. ఈసారి కూడా అదే తరహాలో నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాజశేఖర్. -
సెయింట్ లూయిస్ అగ్ని ప్రమాద బాధితులకు నాట్స్ సాయం
సెయింట్ లూయిస్ : ఉత్తర అమెరికా తెలుగుసంఘం (నాట్స్) మరోసారి అమెరికాలో తెలుగువారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. రెండు నెలల కిందట సెయింట్ లూయిస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ పిలుపునిచ్చింది. నాట్స్ సభ్యులు దీనిపై స్పందించి తమ వంతు చేయూత అందించారు. ఇలా సేకరించిన 7500ల డాలర్ల మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించారు. నాట్స్ టీం వైఎస్ఆర్ కే ప్రసాద్, రమేశ్ బెల్లం, నాగశ్రీనివాస శిష్ట్ల ,రాజ్ ఓలేటి, రంగా సురేష్, వెంకట్ చింతాల ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేరళ వరద బాధితులకు రూ.కోటి విరాళం
కేరళ రాష్ట్రం ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందిస్తున్నారు. నటుడు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, విజయ్, విశాల్, విక్రమ్.. ఇలా పలువురు విరాళం అందించారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ తన వంతు సాయంగా కోటి రూపాయలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో తన బృందంతో సంగీత కచేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ప్రజల సహాయార్థం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో ఫ్లోరిడాలో కేరళ ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1.52లక్షల విరాళం
కరీంనగర్ క్రైం : నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ చొరవతో బ్యాంక్‌కాలనీ, మోహర్‌నగర్‌కాలనీవాసులు రూ.1.52లక్షల విరాళాన్ని శుక్రవారం సీపీ కమలాసన్‌రెడ్డి సమక్షంలో అందజేశారు. ఎస్సై మాధవరావు, బ్లూకోట్ సిబ్బంది శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్, కాలనీవాసులు మన్మోహన్రావు, సంజీవరావు, నర్సింగరావు పాల్గొన్నారు. వాహనాల వేలం వివిధ రకాల ప్రమాదాలు, సరైన ధ్రువపత్రాలు లేక పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నామని సీపీ తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం లేక్ పోలీసులు గుర్తించి ఆర్ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో దుస్తులు ధరింపజేశారు. -
50 లక్షలు విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు
ప్రధాని పిలుపుతో సైన్యానికి అందజేత బెంగళూరు: నగరంలోని ఒక ప్రైవేటు స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఉమ్మడిగా ముందుకొచ్చి భారత జవాన్ల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సైనికులకు స్ఫూర్తిదాయకమైన సందేశాలు పంపించాలని ప్రజలకు పిలునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని న్యూ హారిజన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ భారత సైనికులకు తమవంతుగా మద్దతు తెలుపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత సైనికుల సంక్షేమ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసినట్టు ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మోహన్ మంఘ్నాని తెలిపారు. కర్ణాటక, కేరళ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జరనల్ కేఎస్ నిజ్జర్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘సందేశ్ టు సోల్జర్’ మిషన్‌కు మద్దతుగా తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు చైర్మన్ చెప్పారు.