సెయింట్ లూయిస్ : ఉత్తర అమెరికా తెలుగుసంఘం (నాట్స్) మరోసారి అమెరికాలో తెలుగువారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. రెండు నెలల కిందట సెయింట్ లూయిస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ పిలుపునిచ్చింది. నాట్స్ సభ్యులు దీనిపై స్పందించి తమ వంతు చేయూత అందించారు. ఇలా సేకరించిన 7500ల డాలర్ల మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించారు. నాట్స్ టీం వైఎస్ఆర్ కే ప్రసాద్, రమేశ్ బెల్లం, నాగశ్రీనివాస శిష్ట్ల ,రాజ్ ఓలేటి, రంగా సురేష్, వెంకట్ చింతాల ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment