St. Louis
-
అమెరికాలో జైల్లో ఖైదీల బీభత్సం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటే సెయింట్ లూయిస్ జైల్లో ఖైదీలు శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల పరామర్శకు వచ్చే బంధువులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఖైదీల కేసుల్లో కోర్టు విచారణలు సైతం నిలిపివేశారు. దీంతో వారంతా అసహనానికి గురయ్యారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. జైలు అధికారులతో ఘర్షణకు దిగారు. వారిని శాంతింపజేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉండగా, దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్ లూయిస్ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
సెయింట్ లూయిస్ అగ్ని ప్రమాద బాధితులకు నాట్స్ సాయం
సెయింట్ లూయిస్ : ఉత్తర అమెరికా తెలుగుసంఘం (నాట్స్) మరోసారి అమెరికాలో తెలుగువారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. రెండు నెలల కిందట సెయింట్ లూయిస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ పిలుపునిచ్చింది. నాట్స్ సభ్యులు దీనిపై స్పందించి తమ వంతు చేయూత అందించారు. ఇలా సేకరించిన 7500ల డాలర్ల మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించారు. నాట్స్ టీం వైఎస్ఆర్ కే ప్రసాద్, రమేశ్ బెల్లం, నాగశ్రీనివాస శిష్ట్ల ,రాజ్ ఓలేటి, రంగా సురేష్, వెంకట్ చింతాల ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రుల సంఘీభావం
సెయింట్ లూయిస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెయింట్ లూయిస్‌లోని ఎన్ఆర్ఐలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆంధ్ర రాష్ట్రమంతటా ప్రజలు నీరాజనాలు పడుతుండగా.. విదేశాల్లోనూ జననేత పాదయాత్రకు ప్రవాసాంధ్రులు అండగా నిలుస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెయింట్ లూయిస్‌లోని క్రీవ్ సరస్సు సమీపంలో కిలోమీటర్ నడిచి పార్క్‌లో కేక్ కట్ చేసి.. జననేత వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ ప్రాంతమంతా 'కావాలి జగన్ రావాలని జగన్' స్లోగన్లతో మారుమోగిపోయింది. భారతదేశం నుంచి వచ్చిన ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు ప్రసంగించి.. అక్కడున్నవారిలో ఉత్తేజాన్ని నింపారు. సుబ్బారెడ్డి పమ్మి(యూఎస్ఏ సెంట్రల్ కమిటీ), నవీన్ గుడవల్లి(సెయింట్‌లూయిస్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు), గోపాల్ రెడ్డి తాడిపత్రి(సెంట్రల్ కమిటీ), ఆర్కే దగ్గుమతి, రంగా చక్కా, సుధాకర్ రెడ్డిలతో మరికొందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
కండర కండడు!
‘‘నీ కండలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. శభాష్‌రా అబ్బాయి... అసలు నీకు బాడీబిల్డర్ అవాలని ఎందుకు అనిపించింది?’’ అని ఎవరైనా అడిగితే- ‘‘అమ్మాయిలు నా వంకే కన్నార్పకుండా చూడడానికి!’’ అని నవ్వుతాడు పద్ధెనిమిది సంవత్సరాల డెవన్ హిల్. అది అతని కుర్రతనపు చిలిపి మాట కావచ్చు...నిజమే కావచ్చు. ఎందుకోసం కండలు పెంచినా అవిపదిమందిలో హిల్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తెస్తున్నాయి. సెయింట్ లూయిస్(అమెరికా) నగరానికి చెందిన హిల్ ఉదయం నాలుగుగంటలకే నిద్ర లేచి జిమ్‌కు వెళతాడు. ‘‘ఈ సమయంలో నా స్నేహితులందరూ గుర్రు పెట్టి నిద్రపోతుంటారు’’ అని ఫ్రెండ్స్ మీద జోకులు వేసే హిల్, రోజుకు 5 వేల క్యాలరీలకు తక్కువ కాకుండా రకరకాల పదార్థాలు తింటాడు. దృఢమైన కండరాల కోసం ఆ మాత్రం తినాలంటాడు. ప్రతి మూడు గంటల కొకసారి తింటాడు. ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తిండి ఉండాల్సిందే. కండలు పెంచడానికి హిల్ పడే కష్టాలు చూసి కొందరు జాలిగా-‘‘అయ్యో పాపం!’’ అని కూడా అంటుంటారు. ‘‘మనం దేన్నయినా అమితంగా ప్రేమించినప్పుడు, ఎంత కష్టపడుతున్నామనేది లెక్కలోకి రాదు. ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది’’ అంటాడు హిల్ కాస్త గంభీరంగా. గత సంవత్సరం గ్రీస్‌లో బాడీబిల్డింగ్‌లో ‘వరల్డ్ ఛాంపియన్షిన్’ టైటిల్‌ను చేజిక్కించుకున్న గిల్ మరిన్ని విజయాలు సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. పది సంవత్సరాల వయసులో ఈ కుర్రాడికి ‘బాడీ బిల్డింగ్’ మీద ఆసక్తి కలిగింది. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు. ‘‘ఈ కండల గొడవలో పడి యవ్వనపు సరదాలను మిస్ కావడం లేదా?’’ అని అడిగితే ‘‘అసలైన సరదా అంతా దీనిలో ఉంది’’ అంటాడు గిల్ కండలను గర్వంగా చూపిస్తూ! రోజుకు 5 వేల క్యాలరీలకు తక్కువ కాకుండా రకరకాల పదార్థాలు తింటాడు. దృఢమైన కండరాల కోసం ఆ మాత్రం తినాలంటాడు. ప్రతి మూడు గంటల కొకసారి తింటాడు. ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తిండి ఉండాల్సిందే.