కండర కండడు!
‘‘నీ కండలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. శభాష్‌రా అబ్బాయి... అసలు నీకు బాడీబిల్డర్ అవాలని ఎందుకు అనిపించింది?’’ అని ఎవరైనా అడిగితే-
‘‘అమ్మాయిలు నా వంకే కన్నార్పకుండా చూడడానికి!’’ అని నవ్వుతాడు పద్ధెనిమిది సంవత్సరాల డెవన్ హిల్. అది అతని కుర్రతనపు చిలిపి మాట కావచ్చు...నిజమే కావచ్చు. ఎందుకోసం కండలు పెంచినా అవిపదిమందిలో హిల్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తెస్తున్నాయి.
సెయింట్ లూయిస్(అమెరికా) నగరానికి చెందిన హిల్ ఉదయం నాలుగుగంటలకే నిద్ర లేచి జిమ్‌కు వెళతాడు. ‘‘ఈ సమయంలో నా స్నేహితులందరూ గుర్రు పెట్టి నిద్రపోతుంటారు’’ అని ఫ్రెండ్స్ మీద జోకులు వేసే హిల్, రోజుకు 5 వేల క్యాలరీలకు తక్కువ కాకుండా రకరకాల పదార్థాలు తింటాడు. దృఢమైన కండరాల కోసం ఆ మాత్రం తినాలంటాడు. ప్రతి మూడు గంటల కొకసారి తింటాడు. ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తిండి ఉండాల్సిందే.
కండలు పెంచడానికి హిల్ పడే కష్టాలు చూసి కొందరు జాలిగా-‘‘అయ్యో పాపం!’’ అని కూడా అంటుంటారు.
‘‘మనం దేన్నయినా అమితంగా ప్రేమించినప్పుడు, ఎంత కష్టపడుతున్నామనేది లెక్కలోకి రాదు. ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది’’ అంటాడు హిల్ కాస్త గంభీరంగా. గత సంవత్సరం గ్రీస్‌లో బాడీబిల్డింగ్‌లో ‘వరల్డ్ ఛాంపియన్‌షిన్’ టైటిల్‌ను చేజిక్కించుకున్న గిల్ మరిన్ని విజయాలు సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. పది సంవత్సరాల వయసులో ఈ కుర్రాడికి ‘బాడీ బిల్డింగ్’ మీద ఆసక్తి కలిగింది. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు.
‘‘ఈ కండల గొడవలో పడి యవ్వనపు సరదాలను మిస్ కావడం లేదా?’’ అని
అడిగితే ‘‘అసలైన సరదా అంతా దీనిలో ఉంది’’ అంటాడు గిల్ కండలను గర్వంగా చూపిస్తూ!
రోజుకు 5 వేల క్యాలరీలకు తక్కువ కాకుండా రకరకాల పదార్థాలు తింటాడు. దృఢమైన కండరాల కోసం ఆ మాత్రం తినాలంటాడు. ప్రతి మూడు గంటల కొకసారి తింటాడు. ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తిండి ఉండాల్సిందే.