NATS
-
డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా డల్లాస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్‌ను ఈ సారి కూడా చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలు, వెయ్యికి పైగా ఫుడ్ క్యాన్స్‌ను నాట్స్ డల్లాస్ సభ్యులు సేకరించారు.అలా సేకరించిన ఆహారాన్ని తాజాగా టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సభ్యులు అందించారు. నాట్స్ 918 పౌండ్లు బరువు ఉన్న ఆహారపు పదార్ధాలను ఫుడ్ బ్యాంక్‌కు ఇవ్వడం ద్వారా దాదాపు 765 మందికి ఒక పూట భోజన సదుపాయం కల్పించవచ్చని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు తెలిపింది.. గత పద్నాలుగు ఏళ్లుగా ప్రతి సంవత్సరం నాట్స్ చేస్తున్న ఈ ఫుడ్ డ్రైవ్‌ని నిర్వహిస్తున్న నాట్స్‌ని నార్త్ టెక్సాస్ ఫుడ్ డ్రైవ్ ప్రతినిధులు ప్రశంసించారు.నాట్స్ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న యువ వాలంటీర్లను, సభ్యులను వారిని ప్రోత్సహించి, సహకారం అందించిన తెలుగువారందరిని నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి అభినందించారు. ఆహార పదార్ధాలను అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేకరణ కార్యక్రమంలో అత్యంత చురుగ్గా పాల్గొన్న వేద శ్రీచరణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటి, అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ న్యాలమడుగుల, బద్రి బియ్యపు, ఉదయ్ పాకలపాటి, నాట్స్ యువ సభ్యులు వేద శ్రీచరణ్, అద్వైత్, అర్ణవ్, అరిహంత్, అథర్వ్లతో పాటు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఎస్సీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నాట్స్ జాయింట్ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ నారె లు పాల్గొన్నారు.ఈ ఫుడ్ డ్రైవ్‌కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి ధన్యవాదాలు తెలిపారు.. గత 14 సంవత్సరాలుగా ఫుడ్ డ్రైవ్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీం ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా లాస్ ఏంజిల్స్ సిమివ్యాలీలో 5కే వాక్‌థాన్ నిర్వహించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు మంచి స్పందన లభించింది. పద్మవిభూషణ్ రతన్ టాటా స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు 100 మందికి పైగా స్థానిక తెలుగువారు, భారతీయులు పాల్గొన్నారు. రతన్ టాటా సేవా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని ఈ వాక్‌థాన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు తెలిపారు. రతన్ టాటా గొప్పతనాన్ని, ఆయన సేవా భావాన్ని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు గుర్తు చేశారు. ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్లకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, అధ్యక్షులు సిద్ధార్థ కోల, శ్రీనివాస్ మునగాల, రాధ తెలగం, అరుణ బోయినేని, గురు కొంక లతో పాటు సహాధ్యక్షులు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి తదితరుల సహకారంతో ఈ వాక్‌ధాన్ దిగ్విజయం అయింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిపెట్టింది. టాంపాలో జరిగిన నాట్స్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను వచ్చే ఏడాది జులైలో టాంపాలో నిర్వహించనుంది.దీనికి సంబంధించిన కార్యచరణ, ప్రణాళికకు సంబంధించి నాట్స్ బోర్డ్ సభ్యులు, నాట్స్ చాప్టర్ విభాగ నాయకులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు.. నిధుల సేకరణ, కార్యక్రమాల నిర్వహణ, స్థానిక తెలుగు సంస్థల సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే నాట్స్ కొత్త చాప్టర్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాట్స్ సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించారు. నాట్స్ జీవిత కాల సభ్యత్వాన్ని ప్రోత్సహించేలా నాట్స్ నాయకులు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. కొత్త చాప్టర్లు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫుడ్ డ్రైవ్, కాపీ విత్ కాప్, హైవే దత్తతలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. టాంపలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ చాప్టర్ నాయకులు తమ వంతు కృషి చేయాలని కోరారు. అమెరికాలో జరిగే ఈ అతి పెద్ద తెలుగు పండుగకు చాప్టర్ల నాయకులు తమ ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలను ఆహ్వానించి సంబరాల సంతోషాన్ని పంచుకునే అవకాశాన్ని అందరికి కల్పించాలన్నారు. ఇంకా నాట్స్ బోర్డు సమావేశంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు గంగాధర్ దేసు, మోహనకృష్ణ మన్నవ, బాపు నూతి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజేంద్ర మాదల, నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడితో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.టాంప కన్వన్షన్ సెంటర్‌ను పరిశీలించిన నాట్స్ బృందంఔరా అనిపించేలా అమెరికా తెలుగు సంబరాల వేదిక. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి టాంప వేదికగా జులై 4, 5, 6 తేదీల్లో జరగగున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన వేదికను నాట్స్ జాతీయ నాయకులు, టంపా నాట్స్ విభాగం బృంద సభ్యులు పరిశీలించారు. సంబరాలకు వేదిక అద్భుతంగా ఉండాలనే సంకల్పంతో నాట్స్ టంపా విభాగం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకుంది. హిల్స్‌బరో నది ఒడ్డున అద్భుతమైన ప్రకృతి రమణీయతల మధ్య ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండటం పై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సెంటర్ పక్కన అతిధ్యానికి తిరుగులేదనిపించేలా ఉన్న హోటల్స్, దగ్గరల్లోనే టూరిజం స్పాట్లు ఉన్నాయని నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. అమెరికాలో ఉండే ప్రతి తెలుగు కుటుంబం సంబరాల్లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా గుత్తికొండ పిలుపునిచ్చారు. సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ సభ్యులందరం కలిసి కృషి చేద్దామని ఆయన కోరారు. హద్దులు లేని ఆనందాల కోసం ఆత్మీయ, అనుబంధాలను పంచుకునేందుకు అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారు తరలిరావాలని శ్రీనివాస్ గుత్తికొండ ఆహ్వానించారు.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల బృందం ఇదే..!నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణలో శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, జగదీష్ చాపరాల, మాలినీ రెడ్డి, అచ్చిరెడ్డి, ప్రసాద్ ఆరికట్ల, విజయ్ కట్టా, సుధాకర్ మున్నంగి లు సంబరాల వివిధ కమిటీల బాధ్యతలు తీసుకుని సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. బిందు బండా, సుమంత్ రామినేని, సురేష్ బుజ్జా, శ్రీనివాస్ బైరెడ్డి, మాధురి గుడ్ల, రవి కానూరి, ప్రసాద్ కొసరాజు, భరత్ ముద్దన, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, కృష్ణ భగవరెడ్డి, శ్యామ్ తంగిరాల, మాలినీ రెడ్డి తంగిరాల, మధు తాతినేని, మాధవి యార్లగడ్డ, రామ కామిశెట్టి, అనిల్ అరమండ, భాస్కర్ సోమంచి, శివ తాళ్లూరి, ప్రసన్న కోట, ప్రహ్లాదుడు మధుసూదుని, శిరీషా దొడ్డపనేని, రవి కానూరు, కిరణ్ పొన్నం, వీర జంపాని, సుధీర్(నాని) వాలంటీర్లు ఈ సంబరాల విజయం కోసం తమ వంతు కృషి చేయనున్నారు.(చదవండి: టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్) -
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్‌లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది. అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్‌తో పాటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.(చదవండి: మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు) -
మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన కల్పించారు. డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతుఆసియన్ అమెరికన్ డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు. తెలుగు లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు) -
ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి చిలుకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? ఇలాంటి ఎన్నో అంశాలను ఆ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి., అప్పులు, ఆదాయ వనరులు, రిటైర్మెంట్ ప్లానింగ్, బేసిక్ మనీ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సవివరంగా ఈ సదస్సులో వివరించారు. నెట్లా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్ వీలునామాలు, ట్రస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారి ఆర్ధిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఆర్ధిక అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కృషి చేసిన నాట్స్ వెబ్, మార్కెటింగ్ బృందాలు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రుతో లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సభ్యులందరికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటికి నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్) -
నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అన్ని రాష్ట్రాల్లోనూ చాప్టర్లను ప్రారంభిస్తూ తెలుగువారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రంలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. అపెక్స్ సీనియర్ సెంటర్లో నార్త్ కరోలినా చాప్టర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ జాతీయ నాయకత్వం, నాట్స్ ఇతర చాప్టర్ల నుంచి వచ్చిన నాట్స్ నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నార్త్ కరోలినా చాప్టర్ కోఆర్డినేటర్‌గా ఉమా నార్నెకు బాధ్యతలు అప్పగించారు. నార్త్ కరోలినా నాట్స్ చాప్టర్ సభ్యులుగా వేణు వెల్లంకి, రాజేష్ మన్నెపల్లి, రవితేజ కాజ, దీపికా దండు, కల్పన అధికారి, శ్రీను కాసరగడ్డ లు నాట్స్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని నాట్స్ దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేపడుతూ తెలుగువారికి చేరువయ్యిందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ లక్ష్యాలను పిన్నమనేని వివరించారు. నాట్స్ అంటే అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి నాట్స్ సభ్యుడు, వాలంటీర్ కృషి ఎంతో ఉందని నాట్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ మధు కొర్రపాటి అన్నారు. నాట్స్ వైద్య శిబిరాలు, నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. నార్త్ కరోలినా లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ ఉందనే భరోసాను నార్త్ కరోలినా నాట్స్ సభ్యులు, నాయకులు కల్పించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించి వారందరిని ఒక చోట కలిపే వేదికగా నాట్స్ ఎదిగిందని అదే తరహాలో నార్త్ కరోలినాలో కూడా ఇక్కడ నాట్స్ సభ్యులు తెలుగువారికి చేరువ కావాలని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ, సమాజ సేవే లక్ష్యాలుగా నార్త్ కరోలినా నాట్స్ విభాగం పనిచేయాలన్నారు. అందరితో కలిసి పనిచేస్తూ నాట్స్ ప్రతిష్టను పెంచాలని నాట్స్ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ వెబ్ చైర్ వెంకటేష్ కోడూరి, న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్ హరీష్ కొమ్మాలపాటి తదితరులు పాల్గొన్నారు. నవంబర్‌లో చేపట్టనున్న “థాంక్స్ గివింగ్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమంతో పాటు ఇతర క్రీడా పోటీల గురించి నార్త్ కరోలినా నాట్స్ టీం తెలిపింది. యువతలో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందించడం, మహిళా ఆరోగ్యంపై కార్యక్రమాలు, నిధుల సేకరణను ప్రోత్సహించడం, కొత్త దాతలు, వాలంటీర్లను ఆకర్షించడం, సోషల్ మీడియాలో ప్రచారం లాంటి అంశాలపై నాట్స్ నార్త్ కరోలినా టీం ప్రధానంగా చర్చించింది. నాట్స్ కొత్త చాఫ్టర్ తమ నగరంలో ప్రారంభం కావడంపై ఈ ప్రారంభ సభకు విచ్చేసిన నార్త్ కరోలినాలోని తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై వాక్ అండ్ టాక్ ఈవెంట్ నిర్వహించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మాసంగా భావించి దానిపై చైతన్యం తీసుకొస్తుంటారు. దీనిలో భాగంగానే నాట్స్ బ్రెస్ట్ కేన్సర్ పై తెలుగువారిని అప్రమత్తం చేసేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ పాస్ట్ చైర్ ఉమెన్ అరుణ గంటి లు సారథ్యం వహించారు. న్యూజెర్సీలో స్థానిక తెలుగు వైద్యులు బ్యూలా విజయ కోడూరి, చరిష్మా భీమినేనిలు ఇందులో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ప్రతి ఎనిమిది మంది మహిళలలో ఒకరికి బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అవుతున్న ఈ రోజుల్లో, బ్రెస్ట్ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..? బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను, 40 ఏళ్ళ వయసు దాటిన స్త్రీలకు మామోగ్రామ్ పరీక్ష అవశ్యకతను ఈ ఈవెంట్లో చక్కగా వివరించారు. కేన్సర్‌పై మహిళల సందేహాలను నివృత్తి చేశారు. తెలుగువారి కోసం న్యూజెర్సీలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. అన్నింటి కంటే ఆరోగ్యం చాలా విలువైనదని.. దానిని కాపాడుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలని మందాడి కోరారు. రోజు వారీ బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్లే అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అన్నారు.. ఈ సమయంలో తెలుగువారిని ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసేందుకు బ్రెస్ట్ కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించామని శ్రీహరి మందాడి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ న్యూజెర్సీ ఉమెన్ యెంపవర్మెంట్ టీమ్ శ్రీదేవి జాగర్లమూడి , ప్రణీత పగిడిమర్రి, ప్రసూన మద్దాలి, శ్రీదేవి పులిపాక, ఇందిరా శ్రీరామ్, స్వర్ణ గడియారం, గాయత్రి చిట్టేటి ఈవెంట్ విజయవంతంలో కీలకపాత్ర వహించారు. న్యూ జెర్సీ నాట్స్ నాయకులు రాజ్ అల్లాడ, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణసాగర్ రాపర్ల, హరీష్ కొమ్మాలపాటి, రామకృష్ణ బోను పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కొరకు వాక్ అండ్ టాక్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో ఎలా సీట్లు పొందాలి.? దానికి ముందుస్తుగా ఎలాంటి కసరత్తు చేయాలి.? ఎలాంటి పరీక్షలకు సిద్ధం కావాలి.? మిడిల్ స్కూల్, హైస్కూల్ స్థాయిలోనే దానిని ఎలా సన్నద్దమవ్వాలనే కీలక విషయాలపై ఈ సదస్సు ద్వారా నాట్స్ అవగాహన కల్పించింది. సెడార్ రాపిడ్స్, మారియన్, రాబిన్స్, హియావత నగరాల నుండి పలువురు భారతీయ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. అయోవా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త శివ రామ కృష్ణారావు గోపాళం ఈ సదస్సుకు అనుసంధానకర్త వ్యవహారించారు. కృష్ణ ఆకురాతి, సాగర్ పురాణం, జగదీష్ బాబు బొగ్గరపులు ఈ సదస్సులో ఎన్నో విలువైన సూచనలు చేశారు. తల్లిదండ్రుల, విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు.. విద్యార్ధుల చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శివ రామకృష్ణారావు గోపాళం తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు కాలేజీ ప్రవేశాలపై చక్కటి అవగాహన ఇలాంటి సదస్సుల వల్ల లభిస్తుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం కోసం ఇంత చక్కటి సదస్సును ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గిరీష్ కంచర్ల, నవీన్ ఇంటూరి అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత అనుభవాలను వివరించిన హిమాన్షు భూషణ్, రవి కొంపెల్లాలకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. సుమన్ ఒంటేరు ఫోటోగ్రాఫింగ్, ఆడియో విజువల్ సిస్టమ్‌లలో సహాయం చేసినందుకు నాట్స్ అభినందించింది. అయోవాలో కాలేజీ ప్రిపరేషన్ అవగాహన సదస్సు విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి) -
అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం
అమెరికాలో తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాన్ని ప్రారంభించి తెలుగు వారికి సేవలందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అయోవాలో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. అయోవా చాప్టర్ సమన్వయకర్తగా శివరామకృష్ణారావు గోపాళంకు నాట్స్ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కృష్ణ ఆకురాతి, నవీన్ ఇంటూరి, జగదీష్ బాబు బొగ్గరపు, గిరీష్ కంచర్ల, డాక్టర్ విజయ్ గోగినేని, శ్రీని కాట్రగడ్డ తదితర సభ్యులు నాట్స్ అయోవా చాప్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది.నాట్స్ అయోవా చాప్టర్ ప్రారంభోత్సవంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ జమ్ముల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెంబర్షిప్ రామకృష్ణ బాలినేని తోపాటు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్ళపాటి, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీస్ లీడర్ అంజయ్య వేలూరు తదితరులు పాల్గొన్నారు.మనం పూర్వ జన్మలో చేసిన కర్మఫలం వల్ల, మన తల్లిదండ్రులు చేసిన మంచి పనుల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నామని, అలాగే మనం చేసే ఈ సమాజ సేవ మరుసటి తరానికి, మన పిల్లల భవిష్యత్తుకి తోడ్పడుతుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అయోవా నాట్స్ జట్టు సభ్యులకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలను ప్రశాంత్ పిన్నమనేని నిర్థేశించారు. తెలుగు వారి అవసరాలకు అనుగుణంగా నాట్స్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. నాట్స్ తన కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు సమాజంలో ఉన్న అందర్నీ ఒకటి చేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. మన సంస్కృతిని భాషని కాపాడటం తో పాటు సంఘ సేవ, సమాజ సేవ అనేది నాట్స్ లక్ష్యాల్లో భాగమని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. డాక్టర్స్ హెల్ప్ లైన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ ఎంతోమందికి ఉపయోగపడిందని, అనేక మంది డాక్టర్లు నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సేవలందిస్తున్నారు అని తెలిపారు. నాట్స్ ద్వారా కొత్త స్నేహితులను పొందటంతో పాటు వృత్తిపరంగా కూడా అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు అన్నారు. కొత్త జట్టు సభ్యులందరూ నాట్స్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.శ్రీ హరీష్ జమ్ముల అయోవా టీంని పరిచయం చేసి, వారికి తన అభినందనలు తెలిపారు. నాట్స్ కార్యక్రమాలను, మహిళా సాధికారత కార్యక్రమాలను రామకృష్ణ బాలినేని వివరించారు. నాట్స్ సంస్థలో మహిళలు, పిల్లలు చురుకుగా పాల్గొనాలని అందరినీ కోరారు. దసరా పండుగనాడు అయోవా చాప్టర్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, అయోవా తెలుగు వారందరూ కలిసి అయోవా నాట్స్ చాప్టర్‌ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి పాటుపడతామని శివరామకృష్ణ రావు గోపాళం హామీ ఇచ్చారు. అయోవా లో నాట్స్ తన కార్యకలాపాలను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని, అయోవాలో చాప్టర్‌ని ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు సంస్థ నాట్స్ అని కృష్ణ ఆకురాతి తెలిపారు.గిరీష్ కంచర్ల,నవీన్ ఇంటూరి సభకు విచ్చేసిన అతిధులు అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు.జగదీష్ బాబు బొగ్గరపు, డాక్టర్ విజయ్ గోగినేని, నవీన్ ఇంటూరి, శ్రీని కాట్రగడ్డ, గిరీష్ కంచర్ల మొదలైన వారు నాట్స్ లో భాగస్వామ్యం కల్పించినందుకు జాతీయ కార్యవర్గానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. చాప్టర్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన సమన్విత వర్మ, శ్రీనిధి కొంపెల్ల, సుమన్ ఒంటేరు, జయంత్ గద్దె, సురేష్ కావుల, డాక్టర్ సుందర్ మునగాల తోపాటు అయోవా తెలుగువారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. -
న్యూ జెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూ జెర్సీలో దాదాపు 200 మంది తెలుగు క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఈ టోర్నీలో ఎడిసన్ కింగ్స్ విజేతగా నిలిచింది. రామ్ కోట ఎడిసన్ కింగ్స్ కెప్టెన్‌గా టీంను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఎఫ్ 5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు.ఈ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా విశేష కృషి చేశారు. నాట్స్ న్యూ జెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి చేసిన కృషి మరువలేనిదని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. తెలుగువారిని కలిపే ఏ కార్యక్రమంలోనైనా నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ నాయకులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి తదితరులు ఈ టోర్నీ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకులు గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు విచ్చేసి క్రికెటర్ల క్రీడా స్ఫూర్తిని అభినందించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్స్ టీపీ రావు, బిందు యలమంచిలి, మాజీ అధ్యక్షుడు గంగాదర్ దేసు, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని నాట్స్ చేస్తున్న భాష, సేవా కార్యక్రమాలు, మెంబెర్షిప్ డ్రైవ్ గురించి అందరికీ తెలియజేశారు. న్యూజెర్సీ నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశం..!
లాస్ ఏంజిల్స్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలతో తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే నాట్స్ 2024-2026 కి సంబంధించిన నూతన కార్యవర్గం తొలి సమావేశంలో లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించింది. . డిసెంబర్ 15వ తేదీన బాలల సంబరాల నిర్వహణ, అక్టోబర్, నవంబర్ మాసాల్లో తెలుగు వారిని ఐక్యం చేసేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఓ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు.ముఖ్యంగా నాట్స్ హెల్ఫై లైన్ సేవలను మరింత విసృత్తం చేసే దిశగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని నాట్స్ మార్గదర్శకులు రవి ఆలపాటి పిలుపునిచ్చారు. సాటి తెలుగువారికి సాయపడేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నారు. లాస్ ఏంజిల్స్‌లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా ఉంటుందనే భరోసా ఉందని.. ఆ భరోసాను మరింతగా వృద్ధి చేసే బాధ్యత నాట్స్ సభ్యులపై ఉందన్నారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ చాప్టర్ విభాగ సమావేశానికి నాట్స్ మార్గదర్శకులు డాక్టర్ రవి ఆలపాటి, డాక్టర్ వెంకట్ ఆలపాటి, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, శ్రీ మనోహర రావు మద్దినేని, రాజ్యలక్ష్మి చిలుకూరిలు నూతన కార్యవర్గానికి విలువైన సూచనలు చేశారు.నాట్స్ లాస్ ఏంజిల్స్ కో ఆర్డినేటర్‌గా మురళీ ముద్దననాట్స్ లాస్ ఏంజిల్స్ 2024-2026కి మురళీ ముద్దన కో ఆర్డినేటర్‌గా, బిందు కామిశెట్టి జాయిట్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఇంకా నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం నుంచి శంకర్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి, శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, శ్యామల చెరువు, లత మునగాల, సిద్ధార్థ కోల, శ్రీరామ్ వల్లూరి, శివ కోత, అరుణ బోయినేని, హరీష్ అందె, చంద్ర మోహన్ కుంటుమళ్ల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గురు కొంక, రాధా తెలగం, పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి తదితరులు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారు.(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!) -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!
అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు వారిలో సామాజిక బాధ్యత పెంచేలా హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో నాట్స్ దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్) లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పచ్చదనాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. అమెరికాలో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేందుకు హైవే దత్తత లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. నాట్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అక్కడ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. విద్యార్థుల సేవా సమయానికి గుర్తింపు ఇస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేందర్ కడియాల, వీర తక్కెళ్లపాటి లను అందరూ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చికాగో చాప్టర్ సభ్యులు హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల మరియు ఇతర చాప్టర్ సభ్యులు తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలాతో పాటు నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు వాలంటీర్లకు విలువైన సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక బాధ్యతను పెంచే అడాప్ట్ ఏ హైవే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!) -
సివిల్ సర్వీసెస్ రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది. నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పేద విద్యార్ధుల కోసం బాపు నూతి చూపిన చొరవ ప్రశంసనీయమని, నాట్స్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు సమాజంలోని యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు.50 వేల పుస్తకాలను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసే పేద విద్యార్ధులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలకు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం) -
రండి.. వరద బాధితులను ఆదుకుందాం ..!
తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు లక్షల మంది జీవితాలను ముంచేశాయి. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు మానవత్వంతో స్పందించి ముందుకు రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పిలుపునిచ్చింది. విజయవాడ, ఖమ్మం, నల్గొండ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు అమెరికాలో ఉండే ప్రతి ఒక్క తెలుగు కుటుంబం స్పందించాలని కోరింది. సాటి తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాట్స్ పేర్కొంది. వరద బాధితుల కోసం నాట్స్ వెబ్సైట్ మరియు గో ఫండ్ ద్వారా నాట్స్ విరాళాల సేకరణకు నడుంబిగించింది. ప్రతి ఒక్కరూ తాము చేయగలిగిన సాయాన్ని విరాళంగా అందించాలని కోరింది.(చదవండి: యూఎస్ అధ్యక్ష ఎన్నికలు: ఇండో-అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకు..) -
‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగం
టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళలకు రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్) ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ఈ డ్రైవ్‌లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఇదీ చదవండి: డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రాఎన్ఏపీఎస్లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్‌ఏటీఎస్‌కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు. నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్ డిమాండ్ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్
అమెరికాలో డాక్టర్ చదవాలనుకునే విద్యార్ధులకు అత్యంత కీలకమైన ఎంక్యాట్పై నాట్స్ అవగాహన కల్పించింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సు మెడికల్ చదవాలనుకునే విద్యార్ధులకు దిశా నిర్థేశం చేసింది. ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి శ్రీచరణ్ మంచికలపూడి తన విజయానికి బాటలు వేసిన మార్గాలను వివరించారు. ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి..? ఏయే అంశాల మీద పట్టు సాధించాలి..? అందుకు అవలంబించాల్సిన మార్గాలేమిటి.? ఏ అంశాలను ఎలా నేర్చుకోవాలి.? ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కుల కోసం ఎలా కృషి చేయాలి.? ఇలాంటి ఎన్నో అంశాలను శ్రీచరణ్ మంచికలపూడి చక్కగా వివరించారు. ముందుగా ఈ సదస్సులో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి వివరించారు. ఈ సదస్సుకు సంకీర్త్ కటకం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆన్లైన్ ద్వారా విద్యార్ధులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీచరణ్ మంచికలపూడికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు. (చదవండి: అట్లాంటా భారత రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం) -
అట్లాంటా భారత రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం
అట్లాంటాలోని భారతీయ రాయబార అధికారి రమేశ్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులు కలిసి నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అట్లాంటా నాట్స్ నాయకులు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది, అట్లాంటా నాట్స్ నాయకులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో చర్చించారు. నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన, గృహహింస బాధితులకు అండగా నిలబడటం, మానసిక పరిణితి పెంచేలా సదస్సులు, ప్రతిభ గల విద్యార్ధులకు పురస్కారాలు, స్థానిక కమ్యునిటీ సేవలు ఇవన్నీ నాట్స్ ఎలా చేస్తుంది..? అమెరికాలో తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనే విషయాలను కాన్సులేట్ అధికారులకు వివరించారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న అట్లాంటా భారత రాయబార కార్యాలయాన్ని నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించింది. ప్లోరిడాలో కూడా భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాల్లో నాట్స్ చురుకుగా పాల్గొంటుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.. భారత రాయబార కార్యాలయంతో తమ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ప్రశాంత్ వ్యక్తం చేశారు.(చదవండి: ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు)a -
టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్‌కు నాట్స్ అభినందనలు..
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ జాబితాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేరింది. వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా విజయనంతరం నాట్స్ సంబరాల్లో మునిగి తేలారు.అదే విధంగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇతర టీం సభ్యులకు నాట్స్ అభినందనలు తెలిపింది. అదే విధంగా భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించరాని నాట్స్ కొనియాడింది. మరోవైపు సంచలన క్యాచ్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సైతం నాట్స్ పొగడ్తలతో ముంచెత్తింది. అతడి క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తిండిపోతుందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఫినిక్స్ చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫినిక్స్ చాప్టర్‌ని నాట్స్ ప్రారంభించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాహుల్ కోనే ఫినిక్స్ చాప్టర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నాగ పడమట నాయకత్వంలో ఈ ఫినిక్స్ చాప్టర్ ముందుకు సాగనుంది. సతీశ్ గంధం, వేణు దమరచద్, కిషోర్ రావు కోదాటి, అభిలు ఫినిక్స్ చాప్టర్ సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు ఫినిక్స్‌లో జరిగిన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫినిక్స్ నాట్స్ విభాగ నాయకులను అభినందించారు. ఫినిక్స్‌లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరంగా చేసేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ అందిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు నాట్స్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. నాట్స్ ఫినిక్స్ నాయకులు నాట్స్‌ను ఫినిక్స్‌లో బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ అనుదీప్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వాన్ని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై డాక్టర్ సుధీర్ యార్లగడ్డ, కిరణ్ వేదాంతం స్థానిక తెలుగు వారికి అవగాహన కల్పించారు. ఫినిక్స్‌లో రక్షణ, భద్రత అంశాలపై స్థానిక భద్రతాధికారి క్రిష్ పెరేజ్ ఎన్నో విలువైన సూచనలు చేశారు. రామ నిఠల విద్యార్ధుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫినిక్స్‌లో తెలుగువారికి అండగా నాట్స్ ఉందనే భరోసాను ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రవి కొమ్మినేని, వెంకటేష్ ఏనుగుల, ప్రవీణ్ రెడ్డి పాటి తదితరులకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ నాయకుడు నాగ పడమట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !) -
రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపం
తెలుగుజాతి ముద్దు బిడ్డ... తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష వైభవానికి రామోజీరావు చేసిన కృషి మరువలేనిదన్నారు.. ప్రతి తెలుగువాడికి రామోజీరావు జీవితం ఓ స్ఫూర్తిదాయక పాఠమని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. రామోజీరావు ఈనాడు, ఈటీవీ సంస్థలను ఉన్నత విలువలు ఉన్న సంస్థలుగా నిలబెట్టి మనందరికి విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. రామోజీరావు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగువారందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపాన్ని వెలిబుచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నాట్స్ సభ్యులు ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.(చదవండి: రష్యా నది నుంచి భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత) -
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విజయమని అభివర్ణించింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను నాట్స్ వ్యక్తం చేసింది.అమెరికాలో ఉండే తెలుగు ప్రజల తరఫున నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి(బాపు) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది. బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా నాట్స్ మన గ్రామం-మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ అండ్ వీల్ పేరుతో మొబైల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటిజం కేర్ ఆన్ వీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు. నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణాజిల్లాల నుండి జానపద, గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.... మహిళా సాధికారత కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామినేనితెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావునాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహించేలా పురస్కారాలు అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానంజానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ) -
శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నంధ్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు మరొకరి మీద ఆధారపడకుండా వాళ్లు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. సున్నిపెంట గ్రామంలో పదిమంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ శిబిరాన్ని బాపు నూతి ప్రారంభించారు. కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమని అలాంటి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాపయ్య చౌదరి లాంటి వారు మానవత దృక్పథంతో తమ సేవా కార్యక్రమాలను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామమైన సున్నిపెంటలో చేయటం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ)