అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు.
అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.
నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.
భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కే బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment