program
-
గిరిజన.. సందీపం
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. రుతుస్రావం సమయంలో హైజీనిటీ.. బాల్య వివాహాలు.. గృహ హింస.. ఇలా ఎన్నో అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి కనీసం బయట మాట్లాడటానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గ్రామగ్రామానికీ, ఇంటింటికీ, ప్రతి స్కూల్‌కీ తిరుగుతూ వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డిగ్రీ కుర్రాడు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరిలా కురోళ్లలా ఫోన్లు, గేమ్స్ ఆడుకుంటూ ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా సామాజిక స్పృహతో సమస్యలపై అవగాహన పెంచుతూ.. పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఓ డిగ్రీ కుర్రాడు. అతడే నిజామ్ కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న సందీప్ నాయక్. అతడు చేస్తున్న పనిని మెచ్చి వందలాది మంది సందీప్ వెనుక నడుస్తున్నారు. 15 ఏళ్ల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సమీపంలోని జైతారం తండాలో జన్మించిన సందీప్.. 15 ఏళ్ల వయసు నుంచే సమాజంలోని సమస్యల గురించి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలను సందర్శించేవాడు. ఎన్నో సవాళ్లతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సందీప్.. వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా పాఠశాలల నుంచి పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని గర్తించాడు. ఈ సమస్యకు వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పడ్డాడు. బాల్య వివాహాలు, బాల కారి్మక వ్యవస్థ, లింగ అసమానతలు, గృహ హింస, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత, ప్యాడ్స్ వినియోగం లేకపోవడం వంటి సమస్యలు కారణమని గుర్తించాడు. వీటన్నింటినీ రూపుమాపేందుకు, వాటిపై సమాజంలో అవగాహన పెంచేందుకు గొంతెత్తాలని నడుం బిగించాడు. అనుకున్నదే తడవుగా ‘వాయిస్ ఫర్ వెల్ఫేర్’ పేరుతో ఓ ఎన్జీవో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు సమస్యలపై పోరాడుతున్నాడు.మహిళల గొంతుకగా.. సంస్థ ద్వారా చిన్నారులు, మహిళల గొంతుకగా నిలిచేందుకు కృషి చేస్తున్నాడు. నిజామ్ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న సందీప్ కార్యకలాపాలకు మెచ్చి తోటి విద్యార్థులతో పాటు తెలిసిన వాళ్లు అతడి వెనుక నడుస్తున్నారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలు, చిన్నారులకు ఎన్నో విషయాలపై అవగాహన కలి్పస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లి.. చిన్నారులకు చదువు చెబుతున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే చదువు ఒక్కటే మార్గమని సందీప్ చెబుతున్నాడు. -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు. అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో సాంకేతికతలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని కామన్వెల్త్ మీడియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. దీనివల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందుకు కృషి చేస్తోన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను రేవంత్‌రెడ్డి అభినందించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చన్నారు.ఐఏఎంసీ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు.. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దన్న రేవంత్.. కామన్ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. -
కేన్సర్‌ను జయించా.. సినీనటి సోనాలి బింద్రే
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్.. బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మంత్ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది. వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహ సాగర్ వివరించారు. రొమ్ము కేన్సర్ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులగా మారారు. వారి నుండి నేను ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ.. -
మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’
ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కొన్ని పథకాలు పెడదారి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ యోజనలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఇంటి సామగ్రి పొందాలనే ఆశతో 30 జంటలు ఈ కార్యక్రమంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే దుర్గ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. 301 జంటలకు వివాహం జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం విష్ణుదేవ్ సాయి కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వివాహాలు చేసుకున్న జంటలలో 30 జంటలు మళ్లీ పెళ్లిచేసుకున్నాయని మీడియాకు తెలియవచ్చింది. అలాగే ఇక్కడ పెళ్లిళ్లు చేయిస్తామంటూ కొందరు ఏజెంట్ల తయారైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరు కొందరు జంటల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు భోగట్టా. ఒక జంటకు ఇద్దరు పిల్లలను ఉన్నప్పటికీ వారు ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియవచ్చింది.దుర్గ్‌లోని అగ్రసేన్ భవన్లో ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో సినిమా తరహా దృశ్యాలు అనేకం కనిపించాయి. ఒకరు పెళ్లి విషయంలో గొడవ పడుతూ, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు కనిపించింది. అలాగే ఒక ఏజంట్ ఏడు జంటలను మళ్లీ పెళ్లి కోసం తీసుకువచ్చినట్లు నిర్వాహకుల విచారణలో తేలింది. కాగా ఈ ఏజెంట్ ఆ జంటల నుంచి రూ. రెండు వేలు చొప్పున వసూలు చేశాడని సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకునే జంటలకు రూ. లక్షతో పాటు ఇతరత్రా సామాను అందిస్తుంటుంది. -
WhatsApp Scam: వాట్సాప్ లింక్ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
కర్నూలు: ట్రేడ్స్ ఎక్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు తన వాట్సాప్‌కు లింక్ పంపి ఫోన్లో ఉన్న డేటా సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని మోసగించారని, చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రిజ్వాన్ బాషా ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని , విచారణ జరిపి డబ్బులు వాపసు ఇప్పించాల్సిందిగా కర్నూలుకు చెందిన విష్ణు కోరారు. ● ఆస్తి కోసం కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాల్సిందిగా హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వినతి పత్రం అందించారు. ● భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు వేయనివ్వకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. ● పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మోసం చేశాడని, తన పొలానికి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆరు ఎకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన హుసేనప్ప ఫిర్యాదు చేశారు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైఎస్సార్ జిల్లాకు చెందిన మంజునాథ్ రెడ్డి డబ్బులు తీసుకుని నకిలీ నియామక పత్రాలు పంపి మోసం చేశాడని నాగలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణుచరణ్లు ఫిర్యాదు చేశారు. -
అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ ఏడువేల మందికి పైగా అతిథులను రామ మందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు.. మొదటి రోజు (జనవరి 16) నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండవ రోజు (జనవరి 17) రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. మూడవ రోజు(జనవరి 18) గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. నాల్గవ రోజు(జనవరి 19) పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన చేయనున్నారు. ఐదవ రోజు(జనవరి 20) రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. ఆరవ రోజు(21 జనవరి 21) రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఏడవ రోజు(జనవరి 22) ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? -
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
అమెజాన్ సంచలన నిర్ణయం - టెకీలకు పండగే..
ప్రపంచంలోని చాలా దేశాలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'అమెజాన్' (Amazon) సంస్థ ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఈ విభాగంలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి అమెజాన్ సన్నద్ధమైంది. ఏఐ రెడీ (AI Ready) ప్రోగ్రామ్ పేరుతో సంస్థ 2025 నాటికి సుమారు 20 లక్షల మందికి దీనిపైన ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఎనిమిది కోర్సులతో.. ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ వంటి దాదాపు ఎనిమిది కోర్సులతో ఏఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సిద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పించింది. ఇప్పటికే సుమారు రెండు కోట్ల కంటే ఎక్కువ మంది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్‌లో ట్రైనింగ్ పొందినట్లు అమెజాన్ వెల్లడించింది. కాగా, ఇప్పుడు ఏఐ రెడీ ప్రోగ్రామ్ ద్వారా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యువతను మాత్రమే కాకుండా సీనియర్లకు కూడా దృష్టిలో ఉంచుకుని అమెజాన్ ఈ కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. వీరికే డిమాండ్ ఏఐ వల్ల ఉద్యోగులకు ముప్పు వాటిల్లుతుందని ఓ వైపు కొందరు చెబుతుంటే.. మరి కొందరు ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా కంపెనీలు ఏఐ గురించి తెలిసిన వారి కోసం వెతుకుతోంది. ఈ విభాగంలో నైపుణ్యం కలిగిన వారికి పెద్ద మొత్తంలో శాలరీలు ఇవ్వడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ సుమారు 73 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు తెలిసిన వారికి జాబ్స్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యం అందిస్తోంది. నిజానికి ప్రతి నలుగురు కంపెనీ యజమానుల్లో ముగ్గురు ఏఐలో శిక్షణ ఉన్న వారి కోసం సర్చ్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరింత ఉద్యోగావకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. -
19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు. అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల జాబితాను అప్డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంలో తెలిపారు. ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్డేట్లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్లోని ఫాగ్రాడల్స్‌ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్స్కోయ్లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. రష్యాలోని క్లూచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది? అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. అగ్ని పర్వతంలో ఏముంటాయి? మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది. సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది. డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది. లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది. లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది. వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం. క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం. యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
ఎర్రవల్లిచౌరస్తా: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం సోమవారం అంజన్న నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అభయాంనేయస్వామికి ఆకుపూజ, పంచామృత అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఉదయాన్నే బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ఎదుట కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ పేర్కొన్నారు. -
టీడీపీ కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్
అమరావతి: టీడీపీ నిర్వహించిన కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు నిచ్చినప్పటికీ.. ప్రజలు, టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. ఇళ్లల్లో నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేదు. చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’ -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్‌లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
'బాబుతో నేను' కార్యక్రమానికి స్పందన కరువు
అమరావతి: 'బాబుతో నేను' కార్యక్రమానికి టిడిపి నేతలు నుండి స్పందన కరువవుతోంది. కార్యక్రమానికి మద్దతు కోసం నేతలు పడరాని పాట్లు పడతున్నారు. 'బాబుతో నేను' కార్యక్రమంలో అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని అచ్చెం నాయుడు బహిరంగ లేఖ రాశారు. పాల్గొనని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ఆడియో లీకైంది. ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇదీ చదవండి: అమావాస్యనాడు పవన్ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు -
బిల్ గేట్స్ ప్రశ్నకు ఖాన్ సమాధానం - వీడియో వైరల్
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల తన సొంత పోడ్కాస్ట్ 'అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తయింది. రెండవ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్లో సాల్ ఖాన్‌కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫోటో చూపించి.. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఈ వ్యక్తి కనిపించారా? ఇద్దరి పేర్లూ ఒకేలా ఉన్నాయని ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ నాకు తెలుసు, నేను అకాడమీ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఫ్యాన్స్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పాడు. ఇదీ చదవండి: అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అంతే కాకుండా.. మెయిల్స్‌లో నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు మ్యాథ్స్ అంత సులభంగా ఎలా చేస్తారు అని ఉండేదని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు బిల్ గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
సమర్థవంతంగా జువెనైల్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్ జస్టిస్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్ జస్టిస్‌పై రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జువెనైల్కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి వివరించారు. జువెనైల్ జస్టిస్ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ బాటకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: బీజేపీ ‘చలో బాటసింగారం’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, ఇతర నేతలను అరెస్టు చేసి వారు బాటసింగారం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇతర నాయకులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధంలో ఉంచారు. కాన్వాయ్కి డీసీఎం అడ్డుగా పెట్టి.. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో మధ్య లో నిలిపేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించాలని కిషన్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడే పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని భావించారు. దీంతో బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వివిధ స్థాయిల పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారిని, ఆఫీసు బాధ్యులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన కిషన్‌రెడ్డి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా రఘునందన్‌రావు ప్రశ్నించారు. అంతా కలిసి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా బాట సింగారం వైపు బయలుదేరారు. అయితే పోలీసులు ఓర్ఆర్ఆర్ వద్దే కాన్వాయ్కి ఎదురుగా డీసీఎంను నిలిపి అడ్డుకున్నారు. నా చర్మం ఊడిపోతోంది.. మీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా పోలీసుల వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలు రోడ్డుపై వర్షంలో తడుస్తూనే బైఠాయించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో తనను రోడ్డు పైనుంచి లేపేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ చర్యలతో నా చర్మమంతా ఎరుపుగా మారి కమిలిపోయి ఊడి పోతోంది. మిమ్మల్ని లోక్‌సభ స్పీకర్ ముందు నిలబెడతా.. మీపై ఫిర్యాదు చేస్తా.. మీరు సీఎం కేసీఆర్ కుటుంబానికి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారు. నన్ను చంపుతారా?..చంపండి..ఇంటికి మాత్రం వెళ్లను..’ అంటూ కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని బలవంతంగా ఆయన వాహనంలో కూర్చోబెట్టి పోలీసులే నడుపుతూ ఆరాంఘర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మాసబ్ ట్యాంక్, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచి్చంది. పార్టీ పరంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం: ఈటల బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఎంపీ అరవింద్‌ను బంజారాహిల్స్‌లోని నివాసంలో, డీకే అరుణను జూబ్లీహిల్స్‌లోని నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. ఈటలను శామీర్‌పేటలోని ఇంటి వద్దే అడ్డుకోగా, ఆయన కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రమంత్రి హక్కులను భంగం కలిగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన డబుల్ ఇళ్లను పేదలకు ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు. తార్నాకలో రాంచందర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. -
స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు
సాక్షి, భీమవరం: భీమవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యు.రవిప్రకాష్ అర్జీదారుల సమస్యల తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించామని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ► భీమవరం వన్‌టౌన్‌కు చెందిన వ్యక్తి తనను 2020లో యూనియన్ బ్యాంక్ మేనేజర్, మరికొందరు కలిసి రూ.19 లక్షల వరకు మోసం చేశారని దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చార్జిషీట్ వేయలేదని ఫిర్యాదు చేశారు. ► పోడూరుకు చెందిన మహిళ తనకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని నకిలీ వీసా పత్రాలు ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేసింది. ► వీరవాసరానికి చెందిన మహిళ తనకు పక్క ఇంటి వారితో సరిహద్దు గొడవలున్నాయని, దౌర్జన్యం చేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. ► మొగల్తూరుకి చెందిన మహిళ ఒక వ్యక్తి తన వెంటపడుతూ వేధిస్తుండటంతో పాటు తనకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరింది. ► వీరవాసరానికి చెందిన మహిళ తనను భర్త, అత్తమామలు, మరుదులు వేధిస్తుండగా గృహహింస కేసు పెట్టానని, వారంతా రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకున్న తర్వాత తిరిగి వేధిస్తున్నారని ఎస్పీ వద్ద వాపోయింది. ► స్పందన కార్యక్రమం అనంతరం ఎస్పీ రవిప్రకాష్ పోలీస్ క్వార్టర్లో ఏర్పాటుచేసిన జిల్లా పోలీసు వెల్ఫేర్ ఆస్పత్రిని సందర్శించారు. -
విజయవాడలో అవార్డులు అందుకున్న ‘జగనన్న ఆణిముత్యాలు’ (ఫొటోలు)
-
Vijayawada: ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులు అందించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
పుదూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
Live: జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం
-
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే..
ప్రస్తుత ఆధునిక కాలంలోనూ అనేక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇవి వినేందుకు చాలా వింతగా అనిపిస్తాయి. తాజాగా రాజస్థాన్‌లోని భీల్వాడాలో అటువంటి ఉందంతమే చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతి తన ప్రియునితో వెళ్లిపోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం వెదుకులాట సాగించి, ఆమెను కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేది లేదని, తాను ఇంటికి తిరిగివెళ్లేది లేదని తెగేసిచెప్పింది. కుమార్తె ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడం చూసి, కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లేనని భావిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు గుర్తుగా శోక సందేశాన్ని కూడా ప్రచురించారు. దానిలో కుమార్తె మరణించిన 13 రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసి, బంధువులను ఆహ్వానించారు. కాగా ఈ సంతాప సందేశం సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. ఆమె ఫొటో ముద్రించిన కార్డు వైరల్ అవుతోంది. సజీవంగా ఉన్న కుమార్తె మృతి చెందిదని పేర్కొంటూ, బంధువులను దశదిన కర్మలకు ఆహ్వానించడాన్ని స్థానికులు వింతగా భావిస్తున్నారు. రతన్‌పురా గ్రామానికి చెందిన ప్రియ జాట్ తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తనకు ఇష్టమైన యువకునితో వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హమీర్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కుమార్తె అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను వెదికి, కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకు వెళ్లబోగా, ఆమె కుటుంబ సభ్యులకు కలిసేందుకు నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తె జూన్ 1న చనిపోయిందని పేర్కొంటూ, జూన్ 13న సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వైరల్ అవుతున్న ఈ కార్డును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు -
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నా
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాన కార్యక్రమం... డ్రోన్ వీడియో
-
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
-
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్
-
ఢీ షో డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
మళ్లీ మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు
-
రాజకీయ పార్టీలకు అతీతంగా పాలన చేస్తున్న ఘనత సీఎం జగన్ దే
-
మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
-
గ్రామగ్రామాన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
మళ్ళీ జగనన్నే రావాలి
-
జగనన్నవల్లే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగాను
-
ఇది వరకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది అంటూ మహిళా భావోద్వేగం
-
జగనన్నే మా భవిష్యతుకు మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలి
-
మళ్ళీ మా జగనన్న రావాలి అంటూ గుంటూరు మహిళలు..
-
మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్న జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మా పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలతో ఈ కార్యక్రమం తీరు తెన్నులను వివరించారు. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహ సారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించాం. పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది మా ప్రయత్నం. అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్సార్సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించాము. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది దాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు స్థానికంగా ఎంత ఏరియా కవర్ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్ల వ్యవస్థతో పాటు మండల ఇన్ ఛార్జులు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థలు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’అనే నినాదంతో.. ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్..’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. రియల్ ఛేంజ్.. ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది. సీఎం జగన్‌పై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే సీఎంను మేమంతా నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్‌లో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో.. తమ నాయకుడితో మాట్లాడే అవకాశం కూడా లభిస్తోంది. కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి.. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1 కోటి 60 లక్షల కుటుంబాలను సీఎం జగన్ ప్రతినిధులుగా మేం నియమించిన గృహసారథులు, సమన్వయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, సమన్వయకర్తలు కీలక భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తారు. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్సార్సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం. చదవండి: వైఎస్సార్సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి సీఎం జగన్ సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుందని సజ్జల అన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సంక్షేమ కార్యక్రమాలపై ఒక వీడియోను ప్రదర్శించారు. -
కృత్రిమ మేధ కబ్జాపర్వం!
దొడ్డ శ్రీనివాస రెడ్డి : కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా మన జీవితాల్ని కబ్జా చేస్తోంది. కంప్యూటర్ నిపుణుడు క్రిస్టఫర్ స్ట్రాచె 1951లో మాంచెస్టర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాంతో మొదలైన ఏఐ శకం నేడు అన్ని రంగాల్లోకి శరవేగంగా చొరబడుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపెడుతూ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ‘కృత్రిమ మేధ మనిషి మేదస్సును చేరుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు, లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు ఎంత సమయం పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం’అని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ఏఐ నిపుణుడు స్టువర్ట్ రసెల్ నాలుగేళ్ల క్రితం అన్న మాటలివి. అయితే మనిషి మేదస్సును అందుకోవడంలో కృత్రిమ మేధకు ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది. కోడ్ రాస్తుంది... చాట్‌జీపీటీ ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ ప్రోగ్రాం కోడ్ రాయగలుగుతుంది. అయితే కృత్రిమ మేధపై పెరుగుతున్న పరిశోధనలను పరిశీలిస్తే ఈ ఏడాదిలోనే సంక్లిష్టమైన కోడింగ్‌లను రాయగల సత్తా ఏఐ సమకూర్చుకోగలుగుతుందని అర్థమవుతోంది. మనిషి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడానికి రెండేళ్ల క్రితమే ఏఐ ఆధారిత ‘టురింగ్ బోట్స్’అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టురింగ్ బోట్స్ స్వయంగా సాఫ్ట్వేర్లను రూపొందించే దిశగా అవతరిస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లలో 10 శాతానికిపైగా టురింగ్ బోట్స్ కోడ్లను, టెస్ట్‌లను రాయగలుగుతాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలను ఇవి ఆక్రమించబోతున్నాయని, ఆ ఉద్యోగులు ఇక పర్యవేక్షణ, నిర్వహణ ఉద్యోగులుగా మారబోతున్నారనేది ఫోరెస్టర్ అభిప్రాయం. వచ్చే ఏడాదికల్లా చాలావరకు వ్యాపార సంస్థలు కోడింగ్‌కు సంబంధించి 30 శాతం వరకు కృత్రిమ మేధపై ఆధారపడబోతున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక నిర్ధారణకు వ చ్చింది. ఈ ఏడాది ఫార్చూన్–500 కంపెనీల ద్వారా వెళ్లే అన్ని రకాల సమాచారాల్లో 10 శాతానికిపైగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లే సృష్టించబోతున్నాయని ఫోరెస్టర్ చెబుతోంది. అదే 2025 నాటికి అన్ని వ్యాపార సంస్థల నుండి వెలువడే సమాచారంలో 30 శాతానికిపైగా కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లే సృష్టించబోతున్నాయని వ్యాపార పరిశోధనా సంస్థ గార్ట్నర్ అంచనా. అలాగే 2026 నాటికి వ్యాపార సంస్థల మధ్య లావాదేవీల్లో సగానికి పైగా ఏఐ ద్వారానే సాగబోతున్నాయని, 2030 నాటికి మొత్తంగా కృత్రిమ మేధ ఆధారంగా ఐదో వంతు వ్యాపార లావాదేవీలు సాగుబోతున్నాయని కూడా గార్ట్నర్ అభిప్రాయం. 2026 నాటికి 75 శాతం బడా కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యం, సప్లయ్ చెయిన్, అభివృద్ధి కార్యక్రమాలను కృత్రిమ మేధే నిర్వహించబోతోందని డేటా కార్పొరేషన్ ఐడీసీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1.7 కోట్ల మంది కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్లు పనిచేస్తుండగా 2026 నాటికి వాళ్ల మధ్య జరిగే లావాదేవీల్లో 10 శాతం ఏఐ ద్వారా ఆటోమేట్ కాబోతున్నాయని గార్ట్నర్ చెబుతోంది. దీనివల్ల మొత్తంగా 8,000 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని కూడాఈ సంస్థ వెల్లడించింది. మనిషి అవసరం లేదు.. మనిషి రోజువారీ పనులన్నింటినీ అతిత్వరలో కృత్రిమ మేధ హస్తగతం చేసుకోబోతోందని ఏఐ నిపుణుడు కామ్ ఫులీ హెచ్చరిస్తున్నారు. ఆదాయం, చదువు విషయంలో సమాజంలో చివరన ఉన్న అత్యధిక జనాభాను ఏఐ తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని ఆయన అంటున్నారు. ‘ఒకçప్పుడు కంపెనీలు ఆదాయం కోసం ఉద్యోగుల సంఖ్యను 5–10 శాతం తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేసేవి, కానీ ఇప్పుడు అందుబాటులోకి వ చ్చిన ఏఐతో ఒక శాతం ఉద్యోగులతో మొత్తం పని ఎలా చేయించవచ్చో ఆలోచిస్తున్నాయి’అని ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహన్ జోషి ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతోందని దాని స్థాపిత సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరిస్తున్నారు. మనిషి మాదిరి అనేక లక్ష్యాలను పూర్తిచేయగల ఏఐ చాట్‌బోట్ వల్ల మనుషులు నిర్వహించే అనేక ఉద్యోగాలకు ఎసరుపెట్టబోతోందని, అయితే మనిషికున్న సృజనాత్మకశక్తి కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆల్డ్మన్ అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సమాచారం అందించే రెస్యూమ్బిల్డర్.కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు చెందిన వెయ్యి కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల స్థానంలో ఇప్పటికే చాట్‌జీపీటీ లేదా ఇతర చాట్బోట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. మరో సర్వేలో 44 శాతం కంపెనీలు కృత్రిమ మేధను తమ కంపెనీ వ్యవహారాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. గతేడాది ఐబీఎం సంస్థ సంపాదించుకున్న మొత్తం 9,130 పేటెంట్లలో 2,300 కృత్రిమ మేధతో సంబంధం ఉన్నవే కావడం రానున్న కాలంలో ఏఐ విస్తృతిని చెప్పకనే చెబుతోంది. నియంత్రణ ఎలా? ఇందుకలడందుగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లోకి, అన్ని విభాగాల్లోకి చోచ్చుకుపోతున్న కృత్రిమ మేధ నియంత్రణ సాధ్యమా? దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన పద్ధతులేమిటన్నది ఇప్పుడు కంపెనీ అధిపతుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు వేధిస్తున్న ప్రశ్న. కృత్రిమ మేధ నిర్వహించే కార్యకలాపాలను, తప్పొప్పులను న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలి, సైబర్ సెక్యూరిటీని ఎలా సాధించాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే ఏఐ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) లేదా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)ను నియమించుకుంటోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా జరిగే కార్యకలాపాల నియంత్రణ అన్నది ప్రతి వ్యాపార సంస్థకు పెద్ద బాధ్యత కాబోతోందని ఫోరెస్టర్ చెబుతోంది. ఇటీవల జరిగిన డేటా రోబో సర్వేలో ఏఐపై ప్రభుత్వ నియంత్రణలకు 81 శాతం మంది టెక్ కంపెనీల అధిపతులు సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ ప్రజల సంరక్షణార్థం అమెరికా ఇటీవల ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు పాటిస్తున్న మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చడంపై చాలా వరకు వ్యాపార సంస్థలు సుముఖంగా ఉన్నాయి. -
లక్షలాది సమస్యలకు పరిష్కార వేదిక స్పందన
-
విశాఖ గర్జన సూపర్ సక్సెస్
-
ఒంగోలులో వెలవెల బోయిన తెలుగుదేశం మహానాడు
-
ఇస్రో చూసొద్దామా.. లక్కీ ఛాన్స్ మిస్సవకండి.. దరఖాస్తు చేయండిలా..
రాజమహేంద్రవరం రూరల్/భానుగుడి (కాకినాడ సిటీ): అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు వీలుగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇందుకు యువికా–2022 పేరుతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ప్రతిభావంతులైన విద్యార్థులు సందర్శించవచ్చు. చదవండి: New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు అంతరిక్షంలో ఎలా ఉంటుంది, ఉపగ్రహ ప్రయోగాలు ఎలా చేస్తారు తదితర విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. నిపుణులతో చర్చలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ స్ఫూర్తితో భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు 82,412 మంది ఉన్నారు. అందరూ ఈ అవకాశానికి ప్రయతి్నంచాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేయడమిలా.. ఇస్రో ప్రధాన వెబ్సైట్ ‘ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఇన్’లో సొంత ఈ–మెయిల్ ఐడీతో విద్యార్థి లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత రెండు రోజులకు ఇస్రో నిర్వహించే ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనాలి. ఆ తరువాత అదే వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 10వ తేదీ లోగా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థులు తరగతిలో తమ ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఎంపికైన వారి జాబితాను అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతారు. పరిశీలన అనంతరం ఇస్రో తుది జాబితా ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే వడపోతలో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం కల్పిస్తారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28వ తేదీ వరకూ 13 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం అవకాశం కల్పించారు. శిక్షణ, బస, ప్రయాణ తదితర అన్ని ఖర్చులనూ ఇస్రో భరిస్తుంది. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపిక చేస్తారిలా.. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి 10 శాతం, క్రీడల్లో ప్రతిభకు 10 శాతం ఎన్సీసీ, స్కౌట్ విభాగాల్లో ఉన్న వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే వారికి 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక చేస్తారు. అవకాశాన్ని అందుకోవాలి జిల్లాలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ రంగంలోనైనా అవకాశాలను అందిపుచ్చుకున్న వారినే విజయం వరిస్తుంది. చిన్న వయస్సులోనే శాస్త్ర, సాంకేతిక అంశాలు పరిచయమైతే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. వివరాలకు 99127 88333 సెల్ నంబరులో సంప్రదించాలి. – ఎం.శ్రీనివాస్ వినీల్, జిల్లా సైన్స్ అధికారి, కాకినాడ -
శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమం
-
ఏపీ విద్యాశాఖ మరో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన..
-
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్‌కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్‌లను విజేతలుగా ఎంపిక చేసింది. వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్‌గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు. చదవండి: హైదరాబాద్ వినియోగదారుల ఫోరంలో ఎస్బీఐకి దెబ్బ -
చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో అంగన్వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్’ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు. ఎన్ఐఎన్ నిర్ధారణతో... సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిట్స్‌లో ఇలా ►జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు. ►వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్ పంపిణీ చేయనున్నారు. ►కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్ పౌడర్, విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి. -
స్నేహగీతం
-
1న బీడీడీ చాల్స్‌కు శంకుస్థాపన
సాక్షి, ముంబై: వర్లీ బీడీడీ చాల్స్ అభివృద్ధి పనుల భూమి పూజా కార్యక్రమానికి ఆగస్టు ఒకటో (ఆదివారం) తేదీన ముహూర్తం ఖరా రైంది. అందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) అధికార వర్గాలు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భూమి పూజా కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగే ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే తదితర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని మాడా అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా భూమిపూజా కార్యక్రమం గతంలో కూడా ఒకసారి వాయిదా పడింది. ఆ తరువాత ఈ నెల 27న జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. వేలాది కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సందర్భంలో నూతన గృహ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి భావించారు. అదే సందర్భంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి బయలుదేరడంతో ఆయన నాలుగైదు రోజులు బిజీగా ఉన్నారు. దీంతో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన భూమి పూజా కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు ఆగస్టు ఒకటో తేదీన మళ్లీ ముహూర్తం ఖారు చేయడంతో వర్లీ ప్రాంత వాసుల్లో ఆనందం చిగురించింది. ఈసారైన భూమిపూజా కార్యక్రమం సఫలమవుతుందా...? లేక మరేమైన అడ్డంకులు ఎదురవుతాయా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. -
నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఏఎన్ నారాయణమూర్తి
సాక్షి, విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియామకం ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ సీఎండీగా హరనాథ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కెఎస్ఆర్ లైవ్ షో 15 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 12 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 11 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 02 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 01 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 30 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 27 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 25 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 24 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 21 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 20 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 19 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 18 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 16 June 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 09 June 2021
-
ఫోర్త్ ఎస్టేట్ 1 june 2021
-
మాస్టర్స్ అఫ్ డ్యాన్స్
-
యేసు క్రీస్తు జీవనమార్గం
-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా 2020
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరాన్ని ఏఐ ఏడాదిగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఐ బేస్డ్ ఎస్టిమేషన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ప్రారంభంతో పాటు 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాలెండర్‌ను కూడాయ కేటీఆర్ ఆవిష్కరించారు. ఎఐ టెక్నాలజీ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందనీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ టెక్నాలజీ మారుమూల గ్రామానికి సైతం చేరువ చేసేందుకు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ప్రమాదాల సమాచారం, ఒక్క ఫొటోతో పంటకు పట్టిన తెగులు ఏంటి వాటి నివారణ చర్యలు లాంటివి రైతు పొలంలోనే ఉండి తెలుసుకునే టెక్నాలజీ కూడా రాబోతోందన్నారు. అలాగే బీటెక్ కాలేజుల్లో ఐఐటీ హైదరాబాద్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ప్రారంభించిందనీ, త్వరలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అన్ని కాలేజుల్లో ఏఐ కోర్స్ ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందాలు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ కేర్, మొబిలిటీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఇంటెల్, పీహెచ్ఎఫ్ఐ, ఐఐఐటీహెచ్‌లతో.. నివిదతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు, ఆడోబ్, కెపాసిటీ బిల్డింగ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకోసం ఐఐఐటీహెచ్‌తో ఎడ్యూకేషన్, ట్రైనింగ్ నిమిత్తం వాద్వాని ఆర్టిఫిషియల్‌తో, హెక్సగాన్ వ్యాపబుల్ సెంటర్ ఏర్పాటుకు, నార్వే క్లస్టర్ ఆఫ్ ఐప్లెడ్ ఏఐతో, మహింద్రా కాలేజీతో, నాస్కామ్తో మంత్రి సమక్షంలో పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి. హైదరాబాద్ నగరంలో జరిగిన ఏఐ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్పందనపై నమ్మకాన్ని పెంచండి
‘‘ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యం కావాలి. స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎన్నో ఆశలతో వస్తారు. వారి సమస్యలకు అధికారులు పరిష్కారం చూపగలిగితే ఎంతో సంతో షిస్తారు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో స్పందనపై చిత్తూరు, వెఎస్సార్ కడప జిల్లాల పరిధిలోని ఉన్నతాధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర మున్సిపల్ అడ్మిని్రస్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం బృంద చర్చ నిర్వహించారు. అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీ క్యాంపస్ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ అధికారులకు సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమరి్పంచేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించి అధికారులకు నాణ్యమైన స్పందన జరిపేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతిలో స్పందనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి స్పందన మెరుగ్గా ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. హాజరైన అధికారులు, (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం స్పెషలాఫీసరు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నారు. అర్జీలను తిరస్కరించే సమయంలో ఆలోచించి చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 45,665 ఫిర్యాదులు వస్తే అందులో 8,239 ఫిర్యాదులు తిరస్కరింపబడ్డాయన్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 49,131 సమస్యలు వస్తే 5,476 సమస్యలు తిరస్కరించారని చెప్పారు. సీఎం ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలు చాలావరకు చిన్నచిన్న సమస్యలేనని, వీటిని సకాలంలో పరిష్కరించగలిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పా రు. అయితే చాలా మంది అధికారులు స్పందనలో వచ్చే అర్జీలను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలు సలహాలు, సూచనలు వస్తుంటాయని వాటిని స్వీకరించాలని చెప్పా రు. అధికారులు వివిధ రకాల పనుల్లో ఉన్నప్పటికీ, స్పందనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ స్పందనపై నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల అధికారులకు స్పందన నిర్వహణపై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ వెట్రిసెలి్వ, డీఐజీ రాజశేఖర్ బాబు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీ– 2.చంద్ర మౌళి, ట్రైనీ కలెక్టర్ çపృధ్వీతేజ్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, మదనపల్లె సబ్–కలెక్టర్ కీర్తి చేకూరి, తిరుపతి,చిత్తూరు ఆర్డీవోలు కనక నరసారెడ్డి, సి.రేణుక, డీఆర్వో విజయ చందర్, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్ విజయవంతం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అధికారులకు నిర్వహించిన గ్రూప్ డిస్కషన్ విజయవంతమైందని సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ చెప్పారు. అధికారులు పలు అంశాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ అన్ని స్థాయిల్లో జరగాలని తెలిపారు. చెవిరెడ్డికి సీఎంవో అధికారుల కితాబు తిరుపతి రూరల్ : రాష్ట్రంలోనే వినూత్నంగా, ఆదర్శవంతంగా స్పందన కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కితాబు ఇచ్చారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో స్పందన కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి వర్క్‌షాపులో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, స్పందన కార్యక్రమం రాష్ట్ర కో–ఆర్డినేటర్, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులను కేవలం బాధితులుగా, ఫిర్యాదుదారులుగా కాకుండా, అతిథులుగా చూస్తూ వారికి టీ, స్నాక్స్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారని సీఎంవో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ఎమ్మెల్యే రూ.7 లక్షల సొంత నిధులను సైతం అందించటం అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. స్పందన కార్యక్రమం నిర్వాహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందని సూచించారు. -
సిద్ధిపేటను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం..
సాక్షి, సిద్ధిపేట: గాంధీ మహాత్ముడు ప్రవచించిన స్వచ్ఛతను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే విధంగా ర్యాలీ నిర్వహించడం హర్షణీయం అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా అనర్థాలకు గురవుతున్నామని, సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత సిటీగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. బతుకమ్మ చీరలు పంపిణీ.. బతుకమ్మ,దసరా పండగలను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ పరిషత్‌లో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సిద్ధిపేట ప్లాస్టిక్ రహితంగా మారాలన్నారు. ప్రతిఒక్కరూ తడి,పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి కాగానే కొత్త రోడ్లు వేస్తామని చెప్పారు. ప్లాసిక్ వస్తువులు ఇళ్లలో వాడకూడదన్నారు. మాంసం, చికెన్ దుకాణాలకు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అవసరమని తెలిపారు. ఇంటింటికి నల్లా మాదిరి.. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు పైపులు ద్వారా త్వరలో సరఫరా చేస్తామన్నారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో మొక్కలు విధిగా పెంచాలని సూచించారు. అధికారులపై మంత్రి ఆగ్రహం... సిద్ధిపేట పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఛైర్మన్, పురపాలక అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కిర్రాక్ డ్యాన్స్
-
ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
-
జిల్లా వ్యాప్తంగా భారీ ‘స్పందన’
జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’ మొత్తం అర్జీలు : 1,293 సాధారణ ఫిర్యాదులు : 1,203 ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 90 కలెక్టరేట్లో.. జిల్లాస్థాయి ‘స్పందన’కు అర్జీలు : 653 సాధారణ ఫిర్యాదులు : 603 ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 50 సాక్షి, అనంతపురం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’ పేరుతో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవానికి విశేష స్పందన లభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో 1,293 మంది అర్జీలు అందజేశారు. జిల్లాస్థాయి ‘స్పందన’ కార్యక్రమం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డితో పాటు ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 653 అర్జీలు అందించారు ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ నిర్ణీత ముగింపు సమయం మధ్యాహ్నం 1.30 గంటల కంటే అదనంగా గంట సమయం నిర్వహించి మధ్యాహ్నం 2.30 గంటలకు ముగించారు. ప్రభుత్వంపై నమ్మకంతో.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకం ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి ప్రజాసంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారు. ఆయన 30 రోజుల పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనే విశ్వాసం కలిగింది. ఈ కారణంగానే మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అరగంట ఆలస్యంగా.. జిల్లా కేంద్రంలో ‘స్పందన’ కార్యక్రమం అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ముగింపు మాత్రం ఒక గంట అదనంగా నిర్వహించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 10.30 గంటలకు జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. రాప్తాడు నియోజకవర్గంలో ‘జలశక్తి అభియాన్’ ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు హాజరయ్యారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ చేరుకున్నారు. అప్పటికే రెవెన్యూ భవన్ కింది భాగంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కలెక్టర్ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు సాధారణ ఫిర్యాదులు స్వీకరించారు. మధ్యాహ్నం ఒక గంట నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యాదులు తీసుకున్నారు. పరిష్కార సమయం చూపలేదు.. అర్జీ చేసుకున్న ప్రజలకు ఇచ్చిన రసీదులో సమస్య పరిష్కారానికి సంబంధించి నిర్ణీత సమయం నమోదు చేయలేదు. అర్జీలో స్వీకరించిన తేదీ మాత్రమే ఉంది. పరిష్కార సమయం కూడా నమోదు చేయాలని విధి విధానాల్లో ఉంది. ఈ విషయంపై జేసీ–2 హెచ్.సుబ్బరాజు మాట్లాడుతూ... రాబోయే కార్యక్రమం నుంచి సమస్య పరిష్కార గడువును నమోదు చేయిస్తామన్నారు. 72 గంటల్లోగా పరిష్కారం గత ప్రభుత్వం తరహాలో ప్రజల ఫిర్యాదులను చెత్తబుట్టల పాలు చేయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు అందించే ఫిర్యాదులకు నెంబర్లను కేటాయించి 72 గంటల్లోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించాం. జిల్లా కేంద్రంలో ఉంటే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరవుతా. – పెనుకొండ ఆర్డీఓ, కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేదోడిని.. డబ్బు ఇచ్చుకోలేను మాది బుక్కరాయసముద్రం మండలంలోని చెదల్ల గ్రామం. తాడిపత్రి గ్రామ సర్వే నెం.436–ఏలో 3.80 ఎకరాలు, 436–సీలో 2.16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి నా కుమార్తెల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు చేయించేందుకు మీసేవలో ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిసారీ వీఆర్వో గంగన్న దరఖాస్తు తిరస్కరణకు గురైందనే చెబుతున్నాడు. ఇప్పటికే రూ.5వేలు ఇచ్చినా.. మరో రూ.10వేలు ఇవ్వాలంటున్నాడు. పేదోడిని, ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది సార్. – జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు రైతు నరసింహారెడ్డి ఫిర్యాదు – స్పందన: తాడిపత్రి తహసీల్దార్ గోపాల్‌రెడ్డితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -
తాడిపత్రిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
శుభ్రతపై నిర్లక్ష్యమేల?
ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్ (వాటర్ శానిటేషన్ హైజిన్) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి. ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల బాధ్యత.. ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది. నిరాశే మిగిలింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు. అమలుపై దృష్టి సారిస్తాం ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్‌పై సూచనలు అందిస్తున్నాం – సంగీత, ఎంఈఓ, ధన్వాడ -
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
కృష్ణ జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
గుంటూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కర్నూలు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
విశాఖలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
మైదుకూరులో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
విశాఖలో రవాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కృష్ణ జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
నంద్యాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంత జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
మైదుకూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ఆళ్లగడ్డలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
గంపలగూడెం మండలంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
చుట్టూ పచ్చచొక్కాలు.. మధ్యలో ఓ ఖాకీ చొక్కా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కసారి ఈ ఫొటో పరికించి చూడండి. చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా కనిపిస్తోంది కదూ.. సదరు ఖాకీ దొర విశాఖ నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్.. అంతే కాదండోయ్.. ఈయనగారు కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వయానా సోదరుడు. అయితే ఏంటి.. మంత్రులు, రాజకీయ నేతల కుటుంబీకులు ఉద్యోగాలు చేయకూడదా? అని అంటారేమో!.. ఎందుకు చేయకూడదూ.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తన ఉద్యోగ ధర్మానికి, రాజకీయాలను కలగలిపేయకూడదన్నదే ఇక్కడ ప్రస్తావనాంశం.. ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధమన్నదే ఇక్కడ చర్చనీయాంశం. విమర్శలకు తావిస్తున్న అంశం కూడా.. ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీబీఎన్ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా ఫక్తు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా విశాఖ నగరంలోనే ఏసీపీ ప్రభాకర్ తిష్ట వేశారు. అంతేకాదు.. మధ్యలో ఒకట్రెండేళ్లు తప్ప గత పాతికేళ్లుగా పెద్దగా బదిలీలు లేకుండా ఈ ప్రాంతంలోనే పాతుకుపోయారు. సర్వీస్‌లో ఎలాంటి ఘనకార్యాలు లేకుండానే ఈయనకు ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చిన సందర్భంలోనూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వాధికారి అయి ఉండీ.. పచ్చచొక్కా కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను ఆవిష్కరించడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు పోలీస్ అధికారి.. అ«ధికార టీడీపీకి ఎంతటి వీరవిధేయత చూపుతున్నారో ఈ ఫొటోతోనే స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా చెయ్యడమేంటని విమర్శలు జోరందుకుంటున్నాయి. -
సారూ..నా భర్తను విడిపించండి
పరిగి : పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించాలని పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లికి చెందిన పద్మ అనే మహిళ మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించింది. మంగళవారం మండల పరిధిలోని జాఫర్పల్లిలో ఏర్పాటు చేసిన గోదాముల ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేయగా ఆయనకు మొరపెట్టుకుంది. అయితే మంత్రి వచ్చే కంటే ముందే గోదాములు నిర్మించిన సమయంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జాఫర్‌పల్లికి చెందిన పీఏసీఎస్ డైరక్టర్ లాల్‌కృష్ణ ప్రసాద్ మంత్రి కార్యక్రమానికి ముందు హల్చల్ చేశాడు. తనతో పాటు గ్రామస్తులకు చేసిన పనులు, మెటీరియల్‌కు సంబంధించి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకుండా గోదాములు ప్రారంభిస్తే తమ డబ్బులు ఎవరిస్తారని అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు కల్పించుకుని మంత్రి కార్యక్రమంలో గొడవ చేయొద్దని ఏమైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వాగ్వాదం ఎక్కువైంది. మరికొద్దిసేపట్లో మంత్రి వస్తాడనగా పోలీసులు లాల్‌కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తలరించారు. కొద్దిసేపటికే మంత్రి రావటంతో లాల్‌కృష్ణ ప్రసాద్ భార్య తన భర్తను విడిపించాలని మంత్రిని కలిసి మొరపెట్టుకుంది. పోలీసులతో మాట్లాడతానని మంత్రి చెప్పి కార్యక్రమం ముగించుకని వెళ్లి పోయారు. ఇద్దరిపై కేసు నమోదు మంత్రి పర్యటన సమయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించటంతో పాటు అతనితో గొడవకు దిగారనే కారణంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయటంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు. జాఫర్‌పల్లికి చెందిన లాల్‌కృష్ణప్రసాద్, అదే గ్రామానికి చెందిన వెంకటయ్యలపై కేసు నమోదు చేశామని ఎస్సై కృష్ణ తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
ఫ్రీగా వన్‌ప్లస్ 6..కానీ
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 6ను ఎట్టకేలకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు ఒకవైపు హల్చల్ చేస్తుండగానే.. మరో గుడ్‌న్యూస్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రారంభానికి ముందే, వన్ ప్లస్టీం తన అభిమానులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము వాడుతున్న వస్ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకటించిన ల్యాబ్ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్ బ్యాక్ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ ది ల్యాబ్ వన్‌ప్లస్ 6 ఎడిషన్ అనే బ్లాగ్‌లో వెల్లడించింది. గతంలో వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 5టీ నిర్వహించినట్టుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్టు తలిపింది. ఎంట్రీలు పంపించేందుకు చివరి తేదీ మే 2. మే 12 న విజేతలను ప్రకటిస్తారు. రివ్యూలు ఇంగ్లీషులో మాత్రమే ఉండాలి. ఈ ల్యాబ్ ప్రోగ్రాం కోసం కేవలం 15మందిని ఎంపిక చేస్తారు. ఇతర నియమాలు, నిబంధనలు తదితర వివరాలు కోసం https://oneplus.typeform.com/to/W08XQ0 లింక్‌లో లభ్యం. అన్నట్టు ఏప్రిల్ 22నుంచే అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా 'నోటిఫై మీ' సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
శునకానికి పెద్దకర్మ
బుగ్గారం(ధర్మపురి): మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో జం తువులపై తమకు ఉన్న ప్రేమ అమితమైనదని చాటిచెప్పారు మండలంలోని చందయ్యపల్లె గ్రామానికి చెందిన గాదె శంకరయ్య,చిలుకవ్వ దంపతులు. తమ కన్న బిడ్డలతో సమానంగా పెం చుకు న్న బబ్బి అనే శునకం ఇటీవల చనిపోవడంతో సంప్రదాయబద్ధంగా దశదినకర్మ నిర్వహించారు. శంకరయ్య– చిలుకవ్వ దంపతులకు కొన్నాళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో పలు ఆలయాలు తిరిగారు. క్రమంలో వారి బంధువుల్లో కొందరు శునకం కూనలకు బారసాల జరిపితే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆ తంతు జరిపారు. కొద్దికాలానికి వారికి కుమారుడు నాగరాజు, కుమార్తె పూజిత జన్మించారు. దీంతో వారికి శునకాలపై విశ్వాసం పెరిగింది. అప్పటినుంచి వాటిని తమ పిల్లలతో సమానంగా పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి పెంపుడు శునకం బబ్బి చనిపోయింది. గత బుధవారం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజులకు బుధవారం పెద్దకర్మ జరిపించారు. దాదాపు 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. -
మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం
చందానగర్: మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. చందానగర్ జనప్రియ 9 వ్యాలీలో శుక్రవారం ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ‘నేను శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశంలో 99 శాతం మంది మహిళలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు రావాలి.. సమాజంలో ప్రతి చోట మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బయటకొచ్చి తమ బాధలు చెప్పుకోవాలి. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. – సుజాత త్రిపాఠి చర్చ జరగాలి.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలి. ఇంట్లో, బయట ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది తమ సమస్యలను బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. – పూనం పారిక్ చైతన్యం వస్తుంది.. ఇలాంటి కార్యక్రమాలతో మహిళల్లో చైతన్యం వస్తుంది. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాటిని అధిగమించి నవ సమాజ నిర్మాణం కోసం పోరాడతారు. – మృణాల్ అభినందనీయం.. అందరూ మనకెందుకులే అని ఊర్కొంటే మహిళల్లో చైతన్యం రాదు. వేధింపులకు గురవుతున్న సమాజంలో కుటుంబ పరువు పోతుందనే భయంతో ఎందరో నిశ్శబ్దంగా బతుకుతున్నారు. ‘సాక్షి’ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. – జయశ్రీ ప్రశ్నించాలి.. వేధింపులకు తలవంచకుండా ప్రతి మహిళ ప్రశ్నించాలి. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ఎదగాలి. అప్పుడే మహిళా శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. – రజిని ఈ కార్యక్రమం నేడు ఉదయం 10గంటలకు ‘సాక్షి టీవీ’లో ప్రసారమవుతుంది. -
అనంతలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమం
-
28న గుంటూరులో వాక్ విత్ జగన్ కార్యక్రమం
-
సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
- సకాలంలో నీరిచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాదే - ఏరువాకలో ఉప ముఖ్య మంత్రి చిన రాజప్ప పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొలమూరులో జిల్లాస్థాయి శుక్రవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చినరాజప్ప మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి సాగునీటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ రసాయన ఎరువుల విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గి తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు ప్రత్యామ్మాయ మార్గాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జేష్ట పౌర్ణమి రోజున రైతులు తొలి అరక దున్ని సాగును ప్రారంభించటం ఆనవాయితీకి అనుగుణంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, పశు సంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఏరువాకలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పొలమూరులోని వ్యవసాయ క్షేత్రంలో భూమితల్లికి, నాగలికి పూజలు నిర్వహించి కాడెద్దులతో దుక్కిదున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మి, ఫిషరీస్ జెడీ కోటేశ్వరరావు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బిఎంవి రామరాజు ఏపీ సీడ్స్ మేనేజర్ భాస్కరరావు, ఏరువాక శాస్త్రవేత్త ప్రవీణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
మానవీయ విలువలపై విద్యార్థులకు శిక్షణ
టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం జూన్ 3 నుంచి 9 వరకూ ప్రత్యేక శిక్షణ 1000 మంది విద్యార్థులకు అవకాశం జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ రామారెడ్డి దానవాయిపేట (రాజమహేంద్రవరం) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 9 వరకూ శుభప్రదం కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. శుభప్రదం శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మానవీయ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. లాలాచెరువు శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల ప్రాంగణంలో 500 మంది బాలికలకు, పెద్దాపురంలోని శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల ప్రాంగణంలో 500 మంది బాలురకు విడివిడిగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. 8, 9 తరగతుల విద్యార్థిని, విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. దరఖాస్తుల కోసం జిల్లాలోని అన్ని టీటీడీ కల్యాణ మంటపాలు, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వివరాలకు 9393051987 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా ధర్మ ప్రచార మండలి కార్యదర్శి కె.సతీష్, సభ్యులు జి.నాగరాజు, కె.సత్యసాయిరామ్, చిట్టిబాబు, ఎన్.యోగి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీలో బడికొస్తా కార్యక్రమం
-
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ఏలూరు రూరల్: బాలల హక్కులను పరిరక్షిం చేందుకు ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తానని జిల్లా జడ్జి సునీత అన్నారు. ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ‘బాలల ఆదరణ, రక్షణ’ అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. బాలల న్యాయ చట్ట ప్రయోజనాలను తెలుసుకుని పొరుగువారికి తెలియజేయాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ బోర్డు మెజిస్ట్రేట్ డి.ఉమాదేవి మాట్లాడుతూ పేదరికంలో మగ్గిపోతున్న పిల్లలు చోరీ కేసుల్లో ఇరుక్కుంటున్నారన్నారు. వీరికి విద్య, జీవనోపాధి కల్పించాలి్సన అవసరం ఉందన్నారు. ప్రొహిబిషన్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రీజినల్ ఇన్స్పెక్టర్ నంద గోపాల్ మాట్లాడుతూ పిల్లల్లో నేర ప్రవృత్తిని గుర్తించి సన్మార్గంలో నడిపించాలని లేకపోతే నేరస్తులుగా మారతారన్నారు. చైల్డ్‌రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, జిల్లా లీగల్ సెల్ అథారిటీ, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్‌రైట్స్ ఫోరం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సంస్థ ప్రతినిధులు పి.ఫ్రాన్సిస్, నేతల రమేష్‌బాబు, యాపిల్ కృష్ణ, నికోలా, మాధవి, వసతి గృహం సూపరింటెండెంట్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు అంబాజీపేట (పి.గన్నవరం) : వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో అంబాజీపేట మండలం జిల్లాలోనే అథమ స్థానంలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని, గంగలకుర్రు అగ్రహారం అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క గ్రామంలో కూడా నూరు శాతం నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకంటే అధికారుల నిర్లక్ష్యమే అధికంగా కనబడుతోందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు 530కి గానూ ఇప్పటికే 270 గ్రామాల్లో నూరు శాతం ఐఎస్ఎల్ నిర్మించామని వివరించారు. ఈ 270 గ్రామాల్లో అంబాజీపేట మండలం నుంచి ఒక్క గ్రామం కూడా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 830 అంగన్వాడీ కేంద్రాలకు 100 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరుకు లక్ష్యం చేరుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఐఎస్ఎల్ నిర్మించుకున్నవారికి తక్షణమే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది బిల్లులు ఆన్లైన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఐఎస్ఎల్ నిర్మాణాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేరని, కేవలం సెలవు చీటీ టేబుల్‌పై ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ మట్టపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
29న పల్స్‌పోలియో
అయిదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలి అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రయ్య కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : ఈ నెల 29న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలియో చుక్కల మందు వేస్తారన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై రూట్ సూపర్వైజర్లకు కాకినాడలోని తన కార్యాలయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. జీవనాధారం కోసం వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీలు, కోళ్లఫారాల్లో పని చేస్తున్నవారి చిన్నారులను గుర్తించి తప్పకుండా పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి రోజు ఎంపిక చేసిన పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయాలని, రెండు, మూడు రోజుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తీవ్ర జ్వరం, విరేచనాలు, అస్వస్థతతో బాధ పడుతున్న చిన్నారులకు చుక్కల మందు వేయరాదన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయాలన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి సంబంధిత పీహెచ్సీ, సీహెచ్‌సీలకు పల్స్‌పోలియా చుక్కల మందు సరఫరా, పోలియో కేంద్రాల్లో పాటించాల్సిన విధులు, బాధ్యతలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేష¯ŒS అధికారి డాక్టర్ అనిత, కాకినాడ, పెద్దాపురం డివిజన్ల సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
జన్మభూమిలో జనాగ్రహం
రెండున్నరేళ్లయినా ఇంతేనా? ∙సమస్యలు పరిష్కరించేదెప్పుడు? ∙‘సంక్షేమం’లో ఏమిటీ ‘పచ్చ’పాతం? ∙అడుగడుగునా నిలదీసిన జనం ∙ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టిన గ్రామసభలు ∙పలుచోట్ల పలుచగా హాజరైన ప్రజానీకం రెండున్నరేళ్లుగా సమస్యలు పరిష్కారం కాకపోవడం.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న ‘పచ్చ’పాతంపై జనాగ్రహం వెల్లువెత్తింది. నాలుగో విడత జన్మభూమి గ్రామసభలు సాక్షిగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులను.. అధికారులను నిలదీశారు. తమ కష్టాలను గట్టెక్కించని జన్మభూమి గ్రామసభలు దేనికంటూ ప్రశ్నించారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెదవి విరుపులు.. నిలదీతలు.. బైఠాయింపులు.. బహిష్కరణలు.. ఇలా సోమవారం ప్రారంభమైన నాలుగో విడత జన్మభూమి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మూడు విడతల జన్మభూమి సభలు పెట్టారు. అప్పుడిచ్చిన దరఖాస్తులకే ఇంతవరకూ దిక్కూమొక్కూ లేదు. మరోసారి జన్మభూమి పెట్టి వాటినైనా పరిష్కరిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో ఈ గ్రామసభలు దరఖాస్తులు తీసుకోవడానికేనా అని జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఆసక్తి చూపని జనం పింఛన్లు, రేష¯ŒSకార్డులు, ఇళ్ల రుణాలు ఇస్తామని ప్రభుత్వం ఊదరగొట్టినా ఈసారి జన్మభూమిపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేనందువల్ల నే ప్రజల హాజరు పలుచబడింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అప్పటికప్పుడు నానాతంటాలూ పడటం కనిపించింది. కోరుకొండ, జగ్గంపేట మండలం గొల్లగుంట జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. వచ్చినవారు కూడా పింఛన్లకోసమే వచ్చినట్టు ఉందంటూ గొల్లగుంటలో స్వయంగా అధికారులే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కోరుకొండ జన్మభూమికి ఆశించిన స్థాయిలో జనం రాలేదు. గత్యంతరం లేక అప్పటికప్పుడు విద్యార్థులను తీసుకువచ్చి మమ అనిపించేశారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లో జరిగిన గ్రామసభల్లో కూడా జనం పెద్దగా లేకపోవడం కనిపించింది. అడవిబిడ్డల ఆగ్రహం ∙‘‘మూడు జన్మభూమి కార్యక్రమాల్లో పింఛన్లు, రేష¯ŒSకార్డులు, పోడుభూమి పట్టాల కోసం తిరుగుతున్నాం. మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేనప్పుడు నాలుగో విడత జన్మభూమి ఎందుకు’’ అంటూ ప్రజల తరఫున చింతూరు మండలం తులసిపాకలులో ఎంపీపీ చిచ్చడి మురళి అధికారులను నిలదీశారు. వచ్చే జన్మభూమినాటికైనా పరిష్కరించకుంటే ఊరి పొలిమేర్లకు కూడా రానివ్వబోమని హెచ్చరించారంటే విలీన మండలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ∙ఎటపాక మండలం గుండాలలో గత జన్మభూమి సందర్భంగా ఇచ్చిన విజ్ఞాపనలు ఏమయ్యాయో చెప్పాలని గిరిజనులు అధికారులను ప్రశ్నించారు. అర్హులకు కూడా పింఛన్లు రద్దు చేయడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ∙గత జన్మభూమిలో చెప్పిన సమస్యలు ఇంతవరకూ పరిష్కరించలేదని చింతూరు మండలం చిడుమూరులో ప్రజలు ఐటీడీఏ పీవో గుగ్గిలి చినబాబును ప్రశ్నించారు. ∙రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం వాతంగిలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందుల పాలే్జస్తున్న అధికారుల తీరుతో విసుగెత్తిపోయిన వాల్మీకి గిరిజనులు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు. ఇంకా.. ∙గత జన్మభూమిలో పింఛన్లు, రేష¯ŒSకార్డుల కోసం ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని, వాటి సంగతి తేల్చకుండా, మరోసారి జన్మభూమి ఎందుకంటూ కోటనందూరు మండలం ఎస్ఆర్ పేట గ్రామసభలో అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీశారు. ∙రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో అర్హులైనవారికి ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ∙కరప మండలం అరట్లకట్ట జన్మభూమిలో 100 రోజుల పనిదినాలు కల్పనగానే మిగిలిందని నినదించిన కూలీల గొంతును పోలీసు బలంతో నొక్కేశారు. పబ్లిక్‌గా బయటపడిన ‘పచ్చ’పాతం ∙కోనసీమ ముఖద్వారం రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు జన్మభూమి గ్రామసభ వేదికగా అధికార పార్టీ ‘పచ్చ’పాతం పబ్లిక్‌గా బయటపడింది. ఆ మండలంలో పింఛన్ల కోసం 900 మంది దరఖాస్తు చేసుకుంటే 500 మంజూరయ్యాయి. అందులో జన్మభూమి జరుగుతున్న ముమ్మిడివరప్పాడులో 16 మంది దరఖాస్తు చేసుకుంటే తొమ్మిది మంజూరయ్యాయి. వీటిల్లో ఐదు మాత్రమే ఖరారు చేసినట్టు సభలో అధికారులు ప్రకటించారు. ఆ ఐదూ కూడా తెలుగు తమ్ముళ్లు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీలు చెప్పిన టీడీపీవారికే కట్టబెట్టారు. అర్హులు ఎంతోమంది ఉంటే ‘తమ్ముళ్ల’కే కట్టబెట్టడమేమిటంటూ వేదికపై ఉన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ∙రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండల స్త్రీశక్తి భవనంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరో అడుగు ముందుకేశారు. కొత్తగా మంజూరు చేస్తున్న పింఛన్లను తనకు, టీడీపీకి వ్యతిరేకంగా పని చేసినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని సూచించారు. డిప్యూటీ సీఎం సాక్షిగా ప్రొటోకాల్ ఉల్లంఘన పెద్దాపురం మండలం వడ్లమూరులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఇక్కడ సంక్షేమ పథకాల పంపిణీలో స్థానిక సర్పంచ్ పాలచర్ల రమాదేవికి బదులు ఆమె భర్త ఉమామహేశ్వరరావు (బుజ్జి), ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జయంతికి బదులు ఆమె భర్త చల్లా శ్రీనివాస్‌లు డిప్యూటీ సీఎంతోపాటు పాల్గొనడం చర్చనీయాంశమైంది. -
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు జాహ్నవి
భానుగుడి (కాకినాడ): తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జనవరి 3వ తేదీ నుంచి జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు రాజమహేంద్రవరం శ్రీ గౌతమి పబ్లిక్ స్కూల్ విద్యార్థి బి. జాహ్నవీదేవి ప్రదర్శన ఎంపికైంది. గత నెలలో కాకినాడలోని ఎంఎస్ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన 6 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయి పోటీలు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సీబీఆర్ విద్యా సంస్థల్లో నిర్వహించారు. ఆ పోటీల్లో అత్యుత్తమ పరిశోధనాత్మక ప్రాజెక్టుగా నిలిచిన బి. జాహ్నవీదేవి ప్రదర్శన ‘ఇంప్రోపర్ డిస్పోజల్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ 104వ ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికైంది. బ్యాటరీలను వాడి పడేస్తే ప్రమాదమే వాడివదిలేసిన బ్యాటరీల వలన కలిగే నష్టాలను జాహ్నవీదేవి తన ‘ ఇంప్రోపర్ డిస్పోజల్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ లో ప్రాజెక్టు రూపంలో సంక్షిప్త పరిచింది. బ్యాటరీలను కాల్చేయడం లేదా భూమిలో పాతిపెట్టడం వలన హానికర పొగ వాతావరణంలోకి విడుదలవుతుందని, దాంతో వాయుకాలుష్యం, రేడియో ధార్మిక పదార్థాలు భూమిలో కలవడం వలన భూమి కాలుష్యం పెరిగి ప్రజలకు ఆస్తా ్మ, ఇతర శ్వాస సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు రావడాన్ని క్షేత్రస్థాయి పరిశీలనలతో ప్రాజెక్టులో జాహ్నవి ప్రవేశపెట్టింది. ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికయిన జాహ్నవిని డీఈఓ ఆర్.నరసింహారావు, జిల్లా సై¯Œ్స అధికారి జి.వసంతకుమార్, కో–ఆర్డినేటర్ కేసరి శ్రీనివాసరావు అభినందించారు. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు నా ప్రాజెక్టు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన అధ్యాపకులకు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు. –బి.జాహ్నవీ దేవి, రాజమహేంద్రవరం -
అద్భుతాల ఆవిష్కర్తలు
భవిష్యత్ టెక్నాలజీకి వారసులు విశేషంగా ఆట్టుకుంటున్న ఇన్స్పైర్ కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హంసవాహిని విద్యాలయ వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్ స్పైర్–2016 అలరిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు ఈ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అక్కడే ఉండి సిబ్బందికి, విద్యార్థులకు వసతి తదితర ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. . జిల్లాలోని 122 పాఠశాలల నుంచి 13,500 మంది విద్యార్థులు శనివారం ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శనలో ఉంచి నమూనాలను ఎన్సీఈఆర్టీ సంచాలకులు ఎం.వి.రాజ్యలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు తిలకించారు. విద్యార్థుల్లో సజనాత్మకత వెలికి తీసే విధంగా వినూత్నంగా అనేక పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా అరించాయి. ఉప విద్యాశాఖాధికారులు ఆర్ఎస్ గంగాభవాని, దడాల వాడపల్లి, డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవర జెడ్పీ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు. -
రేడియోలు కనబడవు... పాఠాలు వినబడవు
తొలి రోజు సగం పాఠశాలలకే పరిమితం ఉపాధ్యాయుల్లో కానరాని చైతన్యం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ‘విందాం–నేర్చుకుందాం’ కార్యక్రమం తొలి రోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి, సులభంగా పాఠాలు అర్థమయ్యేందుకు రూపొందించిన ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయి సిబ్బందిలో చిత్తశుద్ధి కొరవడడం, అ«ధికారులు– ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పాఠశాలల పనివేళల్లో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానుంది. విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్, ఆకాశవాణి, దూరదర్శన్ చానళ్ల సంయుక్త పర్యవేక్షణలో ఉండే ఈ కార్యక్రమానికి రాజీవ్ విద్యామిషన్ పాఠ్యాంశాలకు రూపకల్పన చేయగా, ఆకాశవాణి దూరదర్శన్ చానల్ ప్రసారం చేస్తుంది. ఇదీ కార్యక్రమం... ప్రతి మంగళవారం ఒకటి, రెండు తరగతులకు, బుధ, గురు, శుక్రవారాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొడుపు కథలు, హాస్యోక్తులు, నాటికలతో పాటు విలువైన సమాచారంతో విద్యా సంవత్సరం పొడవునా పాఠాలు ప్రసారమయ్యేలా కార్యక్రమం రూపొందించారు. నిష్ణాతులయిన ఉపాధ్యాయుల ద్వారా రాజీవ్ విద్యామిషన్ పాఠాలను ప్రసారం చేస్తుంది. జిల్లాలో 3751 పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 3320 ప్రాథమిక,, 431 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలిరోజు అధికారిక అంచనా ప్రకారం 1900 పాఠశాలల్లో మాత్రమే రేడియో పాఠాల కార్యక్రమం జరిగినట్టు సమాచారం. కొరవడిన సమన్వయం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు అధికారుల్లో సమన్వయం లేకపోవడం వల్లే సుమారు 1850 పాఠశాలల్లో రేడియో పాఠాలు వినలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఆదేశాలివ్వడం, పాఠశాలల్లో రేడియోలు పనిచేయకపోవడం, కొన్ని చోట్ల రేడియోలే లేకపోవడంతో తొలిరోజు సగం పాఠశాలల్లోని విద్యార్థులు పాఠాలు వినలేకపోయారు. తొలిరోజు కాలం, క్యాలెండర్ తదితర పాఠాలు బోధించారు. పాఠశాలలకు కేటాయించిన మేనేజ్మెంట్ నిధుల్లో రేడియోలను కొనుగోలు చేయాలని, ఆ నిధులతో రేడియోలు రిపేర్ చేయించుకోవాలని అ«ధికారులు ఆదేశాలు జారీ చేసినా ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోలేదన్న ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు గ్రాంట్లను పలు పనులకు ఉపయోగించడం వల్ల నిధుల కొరతతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తాం విందాం– నేర్చుకుందాం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు సమాచారం ఇచ్చాం. ఏడాది పాటు కార్యక్రమానికి గ్యాప్ రావడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. - చామంతి నాగేశ్వరరావు, అకడమిక్ మానటరింగ్ ఆఫీసర్ (రాజీవ్ విద్యామిషన్) చర్యలు తీసుకుంటాం విద్యార్థుల్లోని సృజనకు పదునుపెట్టే ఈ కార్యక్రమం పాఠశాలల్లో ప్రారంభం కాలేదన్న విషయంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలకు డీఈఓకు నివేదిస్తాం. ఈ కార్యక్రమంపై కొన్ని రోజుల ముందే నియమ, నిబంధనలతో పాఠశాలలకు సమాచారం అందించాం. రేడియో పాఠాలు ప్రారంభం కాని పాఠశాలలను గుర్తించాలని మానటరింగ్ అధికారులను ఆదేశించాను. - మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ -
ప.గో. జిల్లాలో గడప గడపకు YSRCP
-
నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్
కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు పొందలేని వారిలో నైపుణ్యతను పెంచి వారికి ఉపాధి కల్పించేందుకు ‘వికాస్’ సంస్థ కృషి చేస్తుందని కలెక్టర్‌హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లో బుధవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయవర్సిటీతోపాటు వికాస్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేష¯ŒS మిషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఏడాదికి 10 వేల చోప్పున మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది లక్ష్యమన్నారు. నన్నయ వర్సిటీ పరిధిలోని 450కిపైగా గల అనుబంధ కళాశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి కల్పించడమే తమ థ్యేయమని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు అన్నారు. 5 వరకు శిక్షణ : ఉభయ గోదావరి జిల్లాల్లోని 12 హెచ్ఆర్డీ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని ఏపీఎస్ఎస్టీసీ ప్రాజెక్టు డైరెక్టర్ వీఎ¯ŒSరావు తెలిపారు. అనంతరం వారు ఉభయ గోదావరి జిల్లాల్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లి నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యాచ్‌కి 60 మందికి శిక్షణ ఇస్తారని, 30 రోజుల శిక్షణ అయిన వెంటనే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ ఎస్‌ఎస్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. రంగయ్య, మేనేజర్ విజయ్‌కుమార్, డీఆర్డీఏ జేడీఎం ఎం.సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
స్వశక్తితో ఎదగాలి
ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ సభలో మంత్రి రావెల సూచన పలువురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సాక్షి, రాజమహేంద్రవరం : దళితులు, గిరిజనులు ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని వదిలి ఎవరి కాళ్లపై వారు నిలబడాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. ’ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ కార్యక్రమాన్ని శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పథకాలను లబ్థిదారులకు అందించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ. 12,000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులను పూర్తి స్థాయిలో వారి అభివృద్ధికే కేటాయిస్తున్నామన్నారు. రూ.2000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులతో అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. దశలవారీగా సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలను సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.. జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో 1011 మంది లబ్థిదారులకు రూ.6.92 కోట్ల చెక్కును మంత్రి రావెల అందజేశారు. పది మంది గిరిజన జంటలకు గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందించారు. 437 డ్వాక్రా సంఘాలకు రూ.9.37 కోట్లను చెక్కును అందించారు. ఐటీడీఏ పరిధిలో బహిరంగ మలవిసర్జనలేని 37 గ్రామాలకు ప్రోత్సాహక బహుమతిగా రూ.1.85 కోట్ల చెక్కును అందజేశారు. 132 గ్రామాల్లో షెడ్లు, సోలార్ లైట్లు ఏర్పాటుకు అవసరమయ్యే రూ.2.66 కోట్ల చెక్కును అందించారు. పలువురు లబ్ధిదారులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రత్నాబాయి, అప్పారావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అదనపు సంయుక్త కలెక్టర్ పి.రాధాకృష్ణమూర్తి, సాంఘింక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, ఐటీడీవో పీవో చక్రధరబాబు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. వెలవెల ’దళిత, గిరిజన బాట’ పేరుతో శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమం జనాలు లేక వెలవెలబోయింది. దళితులు, గిరిజనులకు వివిధ శాఖల ద్వారా అందించే యూనిట్ల ప్రదర్శన, సబ్‌ప్లా¯ŒS నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నాలుగు రోజుల నుంచి ఇతర పనులన్నింటినీ పక్కనబెట్టి ఏర్పాట్లు, జనసమీకణలో తీరకలేకుండా గడిపారు. స్థానికంగా ప్రజలు రారన్న భావనతో ఏజెన్సీ ప్రాంతం నుంచి 25 ఆర్టీసీ బస్సుల్లో గిరిజనులను తరలించారు. ఆర్ట్స్ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీగా కుర్చీలు వేయించారు. అయితే సభ ప్రాంగణం సగం కూడా నిండలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమలో ఒక్కో నేత చెప్పిందే చెప్పడంతో విగుసు చెందారు. పలువురు సభ చుట్టుపక్కల వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన కేంద్రాలను వీక్షించి వెళ్లిపోయారు. సభకు వచ్చిన జనాల కన్నా ముందు వరసలో కూర్చున్న అధికారులు, విలేకర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన సాంఘిక, సంక్షేమ వసతి గృహాల నుంచి విద్యార్థులను సభ వద్దకు తరలిచారు. -
‘ఓపెన్’ అయ్యారు
వ్యవస్థలో కీలకాంశాలపై అవగాహన కల్పించిన పోలీసు అధికారులు ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్ ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు l ఆశ్చర్యపరిచిన జాగిలాల విన్యాసాలు ∙పోలీసులు వాడే తుపాకీలను మన సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అవి ఎలా పనిచేస్తాయి? ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి చూసికొట్టొచ్చు? తుపాకీల సామర్థ్యం ఎంత? వాటిలో రకాలెన్ని? ఏయే సమయాల్లో ఏయే తుపాకీలను వాడతారు? ∙వైర్లెస్ సెట్లను పోలీసు యంత్రాంగం ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తుంది. పోలీసు సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ∙పోలీసు జాగిలాలు దొంగలను ఎలా పసిగడతాయి. నేర పరిశోధనలో వీటి పాత్ర ఏంటి? వీటికి ఏ విధంగా ట్రైనప్ చేస్తారు? ∙క్లూస్ టీం విధులు? చోరీల గుట్టు ఎలా రట్టు చేస్తుంది? వేలిముద్ర సేకరణలో ఈ టీం ఎలా వ్యవహరిస్తుంది? ∙డ్రోన్ పరికరం విశిష్టత, అది ఎలా పనిచేస్తుంది? వినియోగం ఎలా? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు కాకినాడలోని జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్’ వేదికైంది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ‘పోలీసుల విధులు –బాధ్యతలు’పై విద్యార్థులతో ఓపెన్ హౌస్ నిర్వహించారు. వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై.. పోలీసుల ఆయుధాలు, సమాచార వ్యవస్థ, పోలీసు జాగిలాలు గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. స్వయంగా తుపాకీలను చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరికి ఎస్పీ రవిప్రకాష్‌తోపాటు, ఏస్పీ దామోదర్, ఏఆర్ డీఎస్పీ వాసన్, పలువురు సీఐలు, ఎస్సైలు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. – కాకినాడ క్రైం డ్రోన్.. అదిరేన్.. ఓపెన్‌హౌస్‌లో నిఘా, భద్రత కోసం వినియోగించే డ్రోన్ పరికరం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్ పరికరాన్ని పోలీసులు రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయగానే ఒక్కసారిగా ఆకాశంలోకి రివ్వున ఎగిరి పెరేడ్ గ్రౌండ్ అంతా చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. డ్రోన్ పరికరంతో అనేక ఫలితాలు సాధించామని, గోదావరి, కృష్ణ పుష్కరాల్లో డ్రోన్ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులదే కీలకపాత్ర ‘ఓపెన్ హౌస్’లో ముందుగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలకపాత్రని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. దేశ భద్రత కోసం త్రివిధ దళాలు, బోర్డర్ సెక్యూరిటీ కోసం బీఎస్ఎఫ్, ఇండో, టిబెట్, సెక్యూరిటీ కోసం సీఐఎస్ఎఫ్ లాంటి అనేక విభాగాలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా అంతర్గత భద్రత కోసం ఏడాదిలో సుమారు 700 నుంచి 1200 మంది వరకు పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని చెప్పారు. పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా అక్టోబర్ 21ను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. జిల్లాలో విద్యార్థులకు పోలీసుల విధులు–బాధ్యతలు, సమాజంలో పోలీసుల పాత్ర వంటి వాటిపై వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా, వాట్సప్ వంటి వాటి కోసం వెంపర్లాడ వద్దని సూచించారు. -
శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ
-
బోధనా సామర్థ్యం పెంపుదలే లక్ష్యంగా మరో ‘సంకల్పం’
వచ్చే నెల నుంచి పాఠశాలల్లో తనిఖీలు గ్రేడింగులు ఇచ్చేందుకు నిర్ణయం రాయవరం : గతేడాది లానే ఈ ఏడాది కూడా విద్యాశాఖ ‘సంకల్పం’ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో మార్చి నెలలో తనిఖీలు నిర్వహించి పాఠశాలలకు గ్రేడింగులు ఇవ్వగా.. ఈ విద్యా సంవత్సరంలో అక్టోబరు నెల్లోనే తనిఖీలు నిర్వహించేందుకు సర్వశిక్షాభియాన్ సన్నద్ధమవుతోంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీ తనాన్ని అమలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూనే.. వాటిని అభివృద్ధి చేసేందుకు ఎస్ఎస్ఏ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న అంశాలను తనిఖీ బృందాలు పరిశీలించి వాటి ఆధారంగా పాఠశాలలకు గ్రేడింగులు ఇస్తారు. వచ్చే నెలలో తనిఖీలు.. సర్వశిక్షాభియాన్ అధికారులు సంకల్పం షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దసరా సెలవుల అనంతరం జిల్లాలోని అన్ని మండలాల్లో తనిఖీ బృందాలు పర్యటించి పాఠశాలలను పరిశీలిస్తాయి. ప్రతి మండలంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలు పాఠశాలల తనిఖీ చేపట్టనున్నాయి. ఉదయం అసెంబ్లీ జరిగే సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక పాఠశాల, మధ్యాహ్నం నుంచి సాయంత్రం తరగతులు ముగిసే వరకూ మరో పాఠశాలను సందర్శిస్తారు. మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ మండల ఎంఆర్సీ కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, తనిఖీలో గుర్తించిన అంశాలపై చర్చిస్తారు. గతేడాది.. ‘సంకల్పాన్ని’ గత విద్యా సంవత్సరంలో ప్రారంభించి మార్చి నెలలో 11 బృందాలు 519 పాఠశాలలను పరిశీలించి 109 ఉత్తమ పాఠశాలలను, 22 అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పాఠశాలలను సత్కరించాల్సి ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే సంకల్పంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకుంటే 10 పాయింట్లు కలిపారు. 89 అంశాల పరిశీలన.. పాఠశాలల్లో నిర్దేశించిన 89 అంశాలను తనిఖీ బృందాలు పరిశీలిస్తాయి. వీటిలో ముఖ్యంగా పాఠశాల అసెంబ్లీ నిర్వహణ, రిజిస్టర్లు, మధ్యాహ్న బోజన పథకం, లైబ్రరీ, సబ్జెక్టుల వారీగా విద్యార్థుల నైపుణ్యం తదితర అంశాలను పరిశీలిస్తారు. అక్టోబరులో ఈ కార్యక్రమం కింద పరిశీలించిన పాఠశాలలను నాలుగు నెలల అనంతరం మరోసారి పరిశీలిస్తారు. ఈ మధ్యలో ఆ పాఠశాలలో వచ్చిన మార్పును గమనించి గ్రేడింగ్ ఇస్తారు. జిల్లాలో గతేడాది పరిశీలించిన 519 పాఠశాలలను మినహాయించి జిల్లాలోమిగిలిన 3905 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. -
అంతర్జాతీయ హిందీ సదస్సులో పాల్గొన్న నాంపల్లి
భద్రాచలం : హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 16, 17 తేదీల్లో మొదటి సారిగా జరిగిన అంతర్జాతీయ హిందీ సదస్సులో భద్రాచలానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు నాంపల్లి మధుసూదనరావు పాల్గొన్నారు. ‘భారతీయ భాషాయే దశా దిశా’ అనే అంశం పై ప్రసంగించి పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం మణుగూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మన్యప్రాంతం నుంచి అంతర్జాతీయ హిందీ సదస్సుకు హాజరైన నాంపల్లిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పలువురు భాషా వేత్తలు అభినందించారు. -
నేటి నుంచి గైట్‌లో మేథ 2016
వెలుగుబంద (రాజానగరం) : స్థానిక గైట్ కళాశాలలో సాంకేతిక విద్యా ఉత్సవాలు ‘మేథ 2016’ బుధవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్టు కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 15న భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ కళాశాలలో ప్రతి ఏటా మేథ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజున జెఎన్టీయూకే వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా యువ ఇంజనీర్లకు విద్య, విజ్ఞానపరమైన వివిధ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. -
జిల్లాలో ఏమిటీ నియంతృత్వం
రాచరిక పాలన సాగుతోంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే రాజా ధ్వజం గొల్లప్రోలు : జిల్లాలో రాచరికవ్యవస్థ కన్నా ఘోరంగా నియంతృత్వ ధోరణితో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. మండలంలోని తాటిపర్తి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సందర్భంగా పిఠాపురం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో తొలుత కన్నబాబు మాట్లాడుతూ రాజులపాలన గుర్తుతెచ్చే విధంగా జిల్లాలో పాలన సాగుతోందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై పోలీసులచే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కన్నీళ్లు కార్చి కన్నెర్ర జేస్తున్న వర్మ... నాడు ఓట్లు కోసం కన్నీరు కార్చిన ఎమ్మెల్యే వర్మ అధికారంలోకి వచ్చాక ప్రజలపై కన్నెర్ర చేస్తూ హింసిస్తున్నాడని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఏడ్చే నాయకులను నమ్మవద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని నాయకులు నీరు, మట్టి, ఇసుకను అమ్ముకుని దందాను సాగిస్తున్నారని, చివరకు గాలిని కూడా అమ్ముకోవడానికి వెనుకాడరన్నారు. వైఎస్సార్ సీపీ కాకినాడ నియోజకవర ్గకన్వీనర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగుతోందన్నారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కాకినాడ సిటీ పార్టీ కన్వీనర్లు ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, మండల కన్వీనర్ అరిగెల రామయ్యదొర, స్థానిక నాయకులు దాసం వెంటకలక్ష్మి, ఎంపీటీసీ గారపాటి శ్రీనివాసరావు, బుజ్జి, దాసం కామరాజు, గోవిందు, సామినీడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ధ్రువతార ఆరుద్ర
జయంతి సభలో ఆచార్య ఎండ్లూరి రాజమహేంద్రవరం కల్చరల్ : ఆధునిక సాహితీ వినీలాకాశంలో ఆరుద్ర ఒక ధ్రువతార అని, బహుముఖీన ప్రతిభాశాలి, తెలుగు సాహిత్యానికి దశ, దిశ నిర్దేశం చేసిన మహనీయుల్లో ప్రముఖుడని తెలుగు సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. ఆరుద్ర జయంతి సందర్భంగా బుధవారం గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిగట్టుపై ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద ఆరుద్ర చిత్రపటాన్ని ఉంచిSసభ్యులు పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథి ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఆరుద్ర కవి, విమర్శకుడు, పరిశోధకుడు, సినీగేయ రచయిత అని, అచ్చ తెలుగుతనానికి ప్రతీక ఆరుద్ర సాహిత్యమని పేర్కొన్నారు. ఆరుద్ర గీతాలలో జీవనవేదాంతం, తాత్తి్వకచింతన కనపడతాయంటూ ‘కొండగాలి తిరిగింది’అనే పాటలో ‘ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది’ అనే పదాలను ఉటంకించారు. ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని ఆయన ఒంటిచేత్తో చేసిన ‘సమగ్రాంధ్ర సాíహిత్య చరిత్ర’కు మించిన పరిశోధన రాలేదని ఎండ్లూరి వివరించారు. ‘నాకు జందెంలేదు, నా భార్యకు తాళి లేదు’అని ఆరుద్ర చెబుతూండేవారన్నారు. ఆరుద్ర మార్క్సిస్టు,నాస్తికుడు అయినా ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా’వంటి భక్తిగీతాలను రచించారని, సంపూర్ణ రామాయణం వంటి సినిమాకు రచనాసహకారం అందించారని వెల్లడించారు. ‘టెక్నిక్‌లేని కవిత్వాన్ని నేను ఊహించుకోలేను’ అని ప్రకటించిన ఆరుద్ర కవనంలో చమత్కారాలకు లోటు లేదన్నారు. ‘నీవెక్కదలుచుకున్న ౖ రెలు ఒక్క జీవికాలం లేటు’ అన్న ఆరుద్ర మాటలు నేటికీ ప్రాధాన్యత కోల్పోలేదన్నారు. ఒకసారి సినీనిర్మాత రామానాయుడితో ఆరుద్ర కారులో వెడుతుండగా ‘ఆరుద్రగారూ!మీకు ఇక్కడ భూములేమైనా ఉన్నాయా?’ అని రామానాయుడు అడిగారని, ఆరుద్ర వెంటనే ‘ఆ కనిపించే రుద్రభూములన్నీ నావే’ అన్నారని ఎండ్లూరి తెలిపారు. అధ్యక్షత వహించిన బ్రౌనుమందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి ఆరుద్రకు తన కుటుంబంతోగల అనుబంధాన్ని తెలియజేశారు. గాయనీగాయకులు ఆరుద్ర రచించిన ‘వేదంలాఘోషించే గోదావరి’గీతాన్ని ఆలపించారు. రాయుడు చంద్రకుమార్, పిరాట్ల శ్రీహరి, శ్రీవల్లి వసుంధర, రాళ్ళపల్లి నీలాద్రి, జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
బోట్‌క్లబ్ (కాకినాడ) : వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సాహిత్య అవార్డు గ్రహీత, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక విద్యుత్‌నగర్‌లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుకొనేటప్పుడు మంచి వాతావరణం ఎంతో అవసరమని యండమూరి పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నెల్లాల్ల ముందు నుంచి ఎటువంటి మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిదన్నారు. పరీక్షకు వెళ్లేటప్పుడు నేను తప్పకుండా ఈ పరీక్షలో పాసవుతానన్న దృఢసంకల్పంతో ఉండాలని సూచించారు. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే సమాధానలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత ఆలోచించుకొని జవాబులు రాయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్‌తో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారని, పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో దానికి దూరంగా ఉండాలన్నారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకొని పరీక్షలు సక్రమంగా రాసి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అనంతలో గడపగడపకు వైఎస్సార్సీపీ
-
మొక్కలతో మానవ మనుగడ
ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : కాలుష్యం పెరిగిపోతోందని, మొక్కలు నాటకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక 220 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఏపీ ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ విజయకుమార్, ఏడీఈ (టెక్నికల్) పుల్లయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గిరిజనుల్లో వెనుకబాటు తనం పారదోలాలి
కాకినాడ రూరల్ : గిరిజనుల్లో వెనుకబాటు తనాన్ని పారదోలి వారిలో చైతన్యాన్ని నింపి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా ముందుకు నడిపించడమే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసీ దినం ప్రకటించిన ఉద్దేశమని జిల్లా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మోనటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు అన్నారు. మంగళవారం తిమ్మాపురంలోని ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గిరి పుత్రిక పథకం ద్వారా ఎస్టీ వర్గాల వివాహానికి రూ.50 వేలు, ఎస్టీ గర్భిణి మహిళలకు పౌష్టికాహార కిట్లు, సామాజిక పింఛన్ల ద్వారా కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇంటర్ విద్య కోసం విద్యార్థికి రూ.70 వేలు సహాయం ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంపస్ ప్రత్యేకాధికారి వై.సోమలత మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 700 గిరిజన జాతులు ఉన్నాయని అన్నారు. జిల్లా నీటి నిర్వహణ ఏజెన్సీ పీడీ ఎ.నాగేశ్వరరావు మాట్లాడుతూ 90 దేశాల్లో ఆదివాసీలు ఉన్నారని, 15 శాతం ఉన్న గిరిజనులంతా పేదరికంలో మగ్గుతున్నారన్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు సభికులను ఆకర్షించాయి. క్యాంపస్ మాజీ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్‌కుమార్, మహారాష్ట్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్ర, అధ్యాపకులు కుబేరుడు, టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనను విజయవంతం చే యాలి
నడిగూడెం: ఈ నెల 7న హైద్రాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కనగాల వెంకట్రామయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగూడెం మండలం నుంచి 200 మంది కార్యకర్తలను తరలించేలా ప్రయత్నం చేయాలని మండల నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రొండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలంపల్లి నాగార్జున్, నాయకులు పరబ్రహ్మచారి, రామక్రిష్ణ, దున్నా మధు, గురునాదం, ఏడుకొండలు, ప్రసాద్ పాల్గొన్నారు. -
'వచ్చే ఎన్నికల్లో విజయం మాదే'
ప్రధాని మోడీ సభను జయప్రదం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వినాయక్‌నగర్: భవిష్యత్తు బీజేపీదేనని, వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని నిజమాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుంటే, టీఆర్ఎస్ సర్కారు మాత్రం నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వెల్లో నిర్వహించనున్న ప్రధాని మోడీ బహిరంగ సభ పోస్టర్లను ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందని, టీడీపీకి క్యాడర్ కరువైందని, టీఆర్ఎస్ సర్కారుకు రోజురోజుకు ఆదరణ తగ్గుతోందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకే భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ నేతలు బాల్‌రాజ్, జాలిగం గోపాల్, గంగాధర్, యెండల సుధాకర్, న్యాలం రాజు, లింగం, భూమేశ్, నాగరాజు, రోషన్ లాల్ భోరా, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు ప్రజలు తగిన బుద్ధి చేప్తారు
-
పచ్చదనంతోనే ఆరోగ్యం
రాష్ట్రాన్ని గ్రీన్‌బెల్ట్‌గా మార్చేందుకు ‘వనం – మనం’ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప రామవరంలో ముగ్గురు మంత్రుల చేతులు మీదుగా కార్యక్రమం ప్రారంభం జగ్గంపేట : పచ్చదనంతోనే ఆరోగ్యం చేకూరుతుందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లాలో ‘వనం – మనం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం మండలంలోని రామవరం గ్రామంలో చినరాజప్ప, ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామవరం పంచాయతీ ప్రాంగణం, మర్రిపాక, ఇర్రిపాక గ్రామాలతోపాటు మార్గం పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం మొక్కలు మాత్రమే ఉన్నాయని గ్రీన్‌బెల్ట్‌కు అవసరమైన 33శాతం వరకు మొక్కలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ ద్వారా మొక్క పెంచుకునేవారికి మూడు సంవత్సరాలకు రూ.750 అందజేస్తామన్నారు. కొండలు, సముద్రతీరంలోను మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, కలెక్టర్ అరుణ్‌కుమార్, జెడ్పీ సీఈవో పద్మ, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీటీసీ జ్యోతుల నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఎస్వీఎస్ వర్మ, పెందుర్తి వెంకటేష్, ఏలేరు చైర్మన్ జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, రవి కిరణ్ వర్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, కందుల కొండయ్యదొర, ఎస్వీఎస్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కృష్ణ జిల్లాలో వనం - మనం
-
విజయవాడలో గడప గడపకు YSRCP
-
అంతర్జాతీయ వేదికపై మిషన్ కాకతీయ
► సోమవారం నుంచి ఢిల్లీలో ఇండియన్ వాటర్ వీక్, 20 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు ► చెరువుల పునరుధ్దరణపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్న రాష్ట్రం ► చివరి రోజు మంత్రి హరీష్‌రావు హాజరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా సుస్థిర నీటి యాజమాన్యానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తతంగా చర్చించేందుకు ‘ఇండియన్ వాటర్ వీక్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివధ్ధికి నీటి యాజమాన్యం’ పేరుతో సోమవారం ప్రారంభం కానున్న సదస్సు ఈ నెల 8వరకు కొనసాగనుంది. ఇందులో అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు, వ్యక్తులతో పాటు జల వనరులతో ముడిపడి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమతమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ వేదిక రాష్ట్రంలో చెరువుల పునరుధ్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 1500ల ప్రతినిధుల ముందు మిషన్‌పై వివరణ.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాధమికంగా వేసిన అంచనా మేరకు..దేశంలో సగానికి పైగా జనాభాకు స్వఛ్చమైన రక్షిత నీటిని పొందలేకపోతున్నారు. సుమారు 8.2కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందడం లేదు. దేశంలో ఏడాదికి నీటి జనిత రోగాల కారణంగా 73లక్షల పనిదినాలు కోల్పోతోంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరుల లభ్యత లేకపోవడంతో భవిష్యత్ అవసరాలపై ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా నీటి యాజమాన్యంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. చుక్క నీటిని ఒడిసిపట్టేలా, లభ్యత నీటిని పారిశ్రామిక, విద్యుత్, సాగు, తాగునీరు అవసరాలకు సమర్ధంగా వినియోగించే అంశాలు, ఇందులో భాగంగానే వ్యవసాయ, ప్లానింగ్, విద్యుత్, గ్రామీణ, పట్టణాభివృధ్ధి, పర్యావరణ, అటవీ శాఖలు, ఐఐటీ, భారత నీటి, వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిపి సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించనుంది. ఈ సదస్సులో సుమారు దేశాల నుంచి మొత్తంగా 1500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సద్సులో పాల్గొనాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుని ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయితే ఇరతర కార్యాక్రమాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ సమావేశాలకు వెళ్లే అవకాశం లేదు. అయితే తొలి రోజు నుంచి ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. 8న ముగింపు సమావేశానికి నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన చెరువులు, వాటిని నిర్ణీత కాలానికి నిర్దేశించకున్న బడ్జెట్లకు అనుగుణంగా చేపట్టిన పునరుధ్దరణ కార్యక్రమాలు, ఇప్పటికే మొదటి విడత ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌లో రాష్ట్రం వివరించే అవకాశం ఉంది. -
'డిక్టేటర్' బాలయ్యతో చిట్ చాట్
-
నట ప్రసాద్
-
'ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు'
-
'ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు'
వచ్చే ఏడాది జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలైన గ్రూప్ డీ, సీ, బీ పోస్టులకు కేవలం రాత పరీక్షలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. తక్కువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూను తొలగించే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అవయవ దానం చాలా ప్రాముఖ్యత గల అంశమన్నారు. కేరళ నుంచి కొందరు బాలికలు, ఢిల్లీ నుండి దివేష్ అనే బాలుడు అవయవ దానం గురించి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. అవయవ దానాన్ని కొన్ని రాష్ట్రాలు సులువుగా మార్చాయని పేర్కొన్నారు. తమిళనాడు ఈ విషయంలో బాగా కృషి చేస్తుంది. ముఖ్యమైన అవయవాలైన కిడ్నీలు, గుండె మార్పిడిలో అవయవదానం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆదర్శ గ్రామ యోజన పథకంలో ఎంపీలు చురుగ్గా పాల్గొంటున్నారన్నారని మోదీ కితాబిచ్చారు. బంగారు నగదీకరణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మోదీ అశోక చక్ర ఉన్న బంగారు నాణేన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత గల పథకాలను ప్రవేశపెడుతామన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా కృషికి ధన్యవాదాలు తెలిపారు. భారత్, ఆఫ్రికా సదస్సు గురించి మాట్లాడుతూ.. భారత్, ఆఫ్రికాల మధ్య చాలా అంశాలలో సారూప్యత ఉంది. భారత సంతతీయులు చాలా మంది ఆఫ్రికాలో ఉన్నారు. ఈ రోజు ముంబైలో జరగనున్న దక్షిణాఫ్రికా-భారత్ ఐదవ వన్డే రసవత్తరంగా ఉంటుందనే ఉత్సుకతను మోదీ వ్యక్తం చేశారు. -
సామూహిక పాదపూజకు అనూహ్య స్పందన
-
ప్రజల ఆశలు వమ్ము చేయొద్దు
- కలెక్టర్ కేవీ రమణ కడప సెవెన్‌రోడ్స్: ప్రజలు ఎన్నో ఆశలు నింపుకుని ‘మీ కోసం’ కార్యక్రమంలో అర్జీలు ఇస్తుంటారని, వారి ఆశలు వమ్ము కాకుండా వాటిని పరి ష్కరించాలని కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం సబా భవనంలో నిర్వహించిన మీకో సం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీ లించారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా పరిష్కారం కాని సమస్యలుంటే అర్జీదారునికి రాతమూలకం గా తెలుపాలని స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. జేసీ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్వో సులోచన తదితరులు పాల్గొన్నారు. ‘మీ కోసం’లో వచ్చిన అర్జీల్లో కొన్ని.. - ప్రొద్దుటూరులో ఉన్న రేషన్‌కార్డును చాపాడు మండలానికి మార్చాలని ప్రొద్దుటూరులోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన వెంకయ్య కోరారు. - మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బోరు, మామిడిచెట్లు మంజూరు చేయించాలని కమలాపురం మండలం మారుతీనగర్వాసి అబ్దుల్‌ఖాదర్ విన్నవించారు. - హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పక్కా గృహం మంజూరు చేయించాలని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన నాగేంద్రరాజు విజ్ఞప్తి చేశా రు. - తన భూమిలో సర్వే రాళ్లను ఇతరులు తొలగించారని, వారిపై చర్య తీసుకోవడంతోపాటు సర్వే ద్వారా హద్దులు నిర్ణయించాలని జమ్మలమడుగు మండలం సిరిగేపల్లెకు చెందిన శివశంకర్ కోరారు. - తెలుగుగంగ ప్రాజెక్టు కింద 4 ఎకరాల భూమి కోల్పొయిన తమకు ఎకరన్నర భూమి మాత్రమే ప్రభుత్వం ఇ చ్చిందని, పంటలకు అవసరమైన రు ణం, బోరు మంజూరు చేయాలని మై దుకూరు మండలం ఏకర్లపాలెం గ్రా మానికి చెందిన జయరాములు అర్జీ ఇచ్చారు. - వికలాంగుల కోటా కింద తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఖాజీపేట మండలం కొత్తనెల్లూరుకు చెందిన లక్ష్మినారాయణ కోరారు. -
సాక్షి మైత్రి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన ఆలాపనలు
-
ప్రాణం తీసిన సరదా...
- శుభకార్యానికి వచ్చి.. - తుంగభద్రనదిలో దంపతుల గల్లంతు - రెండు కుటుంబాల్లో విషాదం సరదా ప్రాణం తీసింది.. బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతులు తుంగభద్ర అందాలను తిలకిచేందుకు వెళ్లి నదిలో గల్లంతయ్యారు. భార్య మృతిచెందగా, భర్త ఆచూకీ తెలియరాలేదు. ఈ సంఘటనతో ఆ సందడి ఒక్కసారిగా మూగబోయింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ఆవహించింది. అలంపూర్ : బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతుల సరదా ప్రాణాల మీదుకు తెచ్చింది. నదీ తీరంలో బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం దంపతుల గల్లంతుతో ఒక్కసారిగా విషాదంగా మారింది. సరదాగా విహరిద్దామని వచ్చిన వారు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆచూకీ తెలియరాలేదు. వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు నగరం ఖడక్‌పురకు చెందిన నూర్‌బాషా (26) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు అక్కడి బుధవారపేటకు చెందిన యాస్మిన్ (20) తో ఏడాదిక్రితం వివాహమైంది. ఈమెకు అలంపూర్ పట్టణానికి చెందిన యూసూఫ్బాషా వరుసకు చిన్నాన్న అవుతారు. అతని కుమారుడి పుట్టు వెంట్రుకలు కార్యక్రమం శుక్రవారం అలంపూర్ పట్టణంలోని తుంగభద్రా తీరంలో ఉన్న బీబీదర్గా వద్ద నిర్వహించారు. ఈ వేడుకలకు దంపతులతోపాటు బంధుమిత్రులు హాజరయ్యారు. భోజనాలు చేసిన వారు కొద్దిసేపు విహరించడానికి వెళ్లారు. ఎంతకూ తిరగి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకసాగారు. చివరకు సాయంత్రం యాస్మిన్ మృతదేహం కనిపించగా నూర్‌బాషా జాడ మాత్రంలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పర్వతాలు, తహశీల్దార్ మంజుల పరిశీలించారు. స్థానిక గజ ఈతగాళ్లతో గల్లంతైన నూర్ బాషా కోసం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
సూర్యుడే దిక్కూ... మొక్కూ!
గజం నేలపై పడే సౌరశక్తితో మీరు ఏమేం చేయవచ్చో తెలుసా? మీ ఇంట్లోని మిక్సీని వాడుకోవచ్చు. లేదంటే... టీవీలో మీకిష్టమైన ప్రోగ్రామ్ చూడటంతోపాటు... ఫ్యాన్లు, బల్బులు ఆన్ చేసేసుకోవచ్చు. సూర్యుడికి అంత శక్తే ఉంటే.. కరెంటు కష్టాలు ఎందుకన్నదేనా మీ సందేహం..? అయితే చదివేయండి మరి... భూమ్మీద బతికే అన్ని ప్రాణులకు శక్తిని అందించేది సూర్యుడేనని ఒక నమ్మకం. దీని మాటెలా ఉన్నా... ఒక్కో గజం నేలపై పడే సూర్యకిరణాల్లోని శక్తి 1361 వాట్ల విద్యుత్తుకు సమానమని అంచనా. కాకపోతే సూర్యకిరణాల్లో సగం మోతాదును వాతావరణం శోషించుకుంటుంది... అంతరిక్షంవైపు తిరిగి వెళ్లిపోతుంది. మిగిలిన 700 వాట్లు కూడా తక్కువేమీ కాదు. అంతెందుకు.... కేవలం 14.5 సెకన్ల కాలం భూమ్మీద పడే సూర్యశక్తితో ప్రపంచ ప్రజలందరూ ఏడాదిపాటు కరెంటు కోతల్లేకుండా గడిపేయవచ్చునంటే ఆశ్చర్యమే కదా? అయినా సరే.. చాలా తక్కువ మంది మాత్రమే సౌరశక్తిని వాడుతున్నారు. ఎందుకు? ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే..,. అవగాహన లేమి రెండోది. ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహకాలు లేకపోవడం మరో అడ్డంకి. ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం... పదేళ్ల క్రితంతో పోలిస్తే సౌరశక్తి ఘటకాలు (సోలార్ ప్యానెల్స్) రేట్లు దాదాపు 90 శాతం వరకూ తగ్గాయి. అయినా కేవలం ఐదువాట్ల సోలార్ లాంతరు ఖరీదు వెయ్యి రూపాయల వరకూ ఉంది. ఒక కుటుంబం మొత్తానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 1.5 కిలోవాట్ల వరకూ విద్యుత్తు అవసరమవుతుందనుకుంటే ఇందుకోసం దాదాపు రెండు లక్షల వరకూ (బ్యాటరీలు, ఇన్వర్టర్, సోలార్ ప్యానెళ్లు ఇతర పరికరాలు కలిపి) ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇంత మొత్తం పెట్టుబడి పెడితే విద్యుత్తుబిల్లు నెలకు వందల్లో మాత్రమే మిగులుతుంది. దీంతో వినియోగదారులు ఈ టెక్నాలజీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సోలార్‌ప్యానెళ్లు భారీసైజులో నిర్ణీత సైజులో ఉండటం వల్ల స్థలాభావం కూడా ఒక అడ్డంకి అవుతోంది. సౌరశక్తికి ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర కొత్త, సంప్రదాయేతర ఇంధనవనరుల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టినా వాటిల్లోని లోటుపాట్లు లక్ష్యసాధనకు సహకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్‌లు వేర్వేరుగా 30 నుంచి 40 శాతం సబ్సిడీలు ఇస్తున్నాయి. పది శాతం వరకూ వినియోగదారుడు డిపాజిట్ చేస్తే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందిస్తుంది. 60 నెలలపాటు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. వందవాట్ల సోలార్‌ప్యానెల్ అనుబంధ పరికరాలను కొనుగోలు చేశామనుకుంటే దీనికోసం వినియోగదారుడు రూ.3 వేల వరకూ డిపాజిట్ చేయాలి. రూ.13 వేల వరకూ బ్యాంక్ రుణం ఉంటుంది. నెలకు రూ.300 చొప్పున చెల్లిస్తూండాలి. వందవాట్ల ప్యానెల్‌తో ఇంటి అవసరాలు తీరతాయా? అంటే కచ్చితంగా తీరవు. ఫలితంగా కరెంటు బిల్లులో తగ్గేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక కిలోవాట్ మోడల్‌ను తీసుకుంటే బ్యాంకు వాయిదా రూ.2 వేల నుంచి రూ.2500 వరకూ ఉంటుంది. మూడు నాలుగేళ్లకు ఒకసారి బ్యాటరీలను మార్చుకోవాల్సి రావడం అదనపు భారం. ప్రత్యామ్నాయం లేదా? నేలపై పడే మొత్తం సౌరశక్తిని విద్యుత్తుగా మార్చగల టెక్నాలజీ, సోలార్ ప్యానెళ్లు అందుబాటులో ఉంటే అసలు సమస్యే ఉండకపోను. మార్కెట్లో లభించే సోలార్ ప్యానెళ్లు సౌరశక్తిలో 15 నుంచి 20 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరులపై మరీ ముఖ్యంగా సౌరశక్తిపై ప్రపంచవ్యాప్తంగా విస్తత పరిశోధనలు జరుగుతున్నాయి. సోలార్ ప్యానెళ్ల సామర్థ్యాన్ని 40 శాతం వరకూ పెంచే సరికొత్త పదార్థ మిశ్రమాన్ని ఇటీవలే గుర్తించారు. నానోటెక్నాలజీ సాయంతో సోలార్ ప్యానెళ్ల ద్వారా క్షణాల్లో నీటిఆవిరి తయారు చేసి... తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు, సూర్యుడి నుంచి వెలువడే వేడిని ఒకదగ్గరకు కేంద్రీకరించి... ఉప్పులాంటి లవణాల్లో నిల్వచేసి అవసరమైనప్పుడు వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు భవనాల గోడల్లా వాడే దళసరి అద్దాలనే పారదర్శక సోలార్ ప్యానెల్స్‌గా మార్చే దిశగా జరగుతున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే మనమంతా పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని సౌరవిద్యుత్తును వాడటం తథ్యమే అనిపిస్తుంది. అంతవరకూ మనం చేయగలిగిందల్లా... వేచి చూడటమే! {పత్యేకంగా శుద్ధి చేసిన సిలికాన్‌ను రెండు కాంటాక్ట్ ప్లేట్ల మధ్య బంధిస్తారు. ఫ్రంట్, బ్యాక్ కాంటాక్ట్‌లు ధన,రుణ ఆవేశాలతో ఉంటాయి. ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటూ రుణావేశంతో ఉంటుంది. పీటైప్ సెమీ కండక్టర్ మాత్రం ధనావేశంతో ఉంటుంది. ఎలక్ట్రాన్లు పీ నుంచి ఎన్ వైపు ప్రయాణించేటప్పుడు అక్కడ ఒక విద్యుత్ క్షేత్రమేర్పడి కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే ఎన్‌వైపు వెళ్లేలా చేస్తుంది.సూర్యరశ్మి ఫొటోవోల్టాయిక్ సెల్‌ను తాకినప్పుడు సెమీకండక్టర్ పదార్థంలోని అణువుల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఉత్తేజితమవుతాయి.ఈ ఉత్తేజిత ఎలక్ట్రాన్లు పీ-ఎన్ జంక్షన్‌లోని విద్యుత్ క్షేత్రాన్ని తాకినప్పుడు ఎన్‌టైప్ సెమీకండక్టర్‌వైపు ఆ తరువాత ఫ్రంట్ కాంటాక్ట్ నుంచి ప్రయాణించడం మొదలవుతుంది. సోలార్ ప్యానెల్ లేదా ఫొటో వోల్టాయిక్ సెల్స్‌ను సిలికాన్ వంటి అర్ధ వాహకాలతో తయారు చేస్తారు. సిలికాన్‌పై సూర్యకిరణాలు పడినప్పుడు అణువుల్లోని ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై ప్రవహిస్తాయి. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటాం. -
సాక్షి మైత్రి మహిళకు విశేష స్పందన!