Bill Gates Showed Salman Khan Pic To Khan Academy Academy Video Viral - Sakshi
Sakshi News home page

Bill Gates: బిల్ గేట్స్ ప్రశ్నకు ఖాన్ సమాధానం - వీడియో వైరల్

Published Thu, Aug 17 2023 8:22 PM | Last Updated on Thu, Aug 17 2023 8:55 PM

Bill gates showed salman khan pic to khan academy academy video viral - Sakshi

ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల తన సొంత పోడ్‌కాస్ట్ 'అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తయింది. రెండవ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌ని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఎపిసోడ్‌లో సాల్ ఖాన్‌కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫోటో చూపించి.. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని ఇంటర్నెట్‌లో సర్చ్ చేస్తే ఈ వ్యక్తి కనిపించారా? ఇద్దరి పేర్లూ ఒకేలా ఉన్నాయని ఎప్పుడైనా క‌న్‌ఫ్యూజ్ అయ్యారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ నాకు తెలుసు, నేను అకాడమీ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఫ్యాన్స్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పాడు.

ఇదీ చదవండి: అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అంతే కాకుండా.. మెయిల్స్‌లో నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు మ్యాథ్స్ అంత సులభంగా ఎలా చేస్తారు అని ఉండేదని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు బిల్ గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement