కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చుతున్న భర్తల్ని చూశాం. జీవిత సహచరి కోసం ఎన్నో త్యాగాలను చేసే పుణ్యపురుషుల గురించి విన్నాం. కానీ ఒక భర్త భార్య ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఇంకెవ్వరూ చూడకుండా ఉండేందుకు ఏకంగా ఐలాండ్‌నే కొనేశాడు. విచిత్రంగా అని పిస్తోందా? అయితే ఈ కథనం చదవాల్సిందే.
దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్ కోసం హిందూ మహా సముద్రంలోని ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.418 కోట్లు) వెచ్చించి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.
దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ సదాక్ కథనం ప్రకారం మిలియనీర్ అయిన తన భర్త బీచ్‌లో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అదీ తాను బికినీ వేసేందుకు, ఇబ్బంది పడకుండా, సురక్షితంగా ఉండేందుకు ఇలా చేశాడని ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అయితే గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ద్వీపం ఖచ్చితమైన లొకేషన్‌ను షేర్ చేయడం లేదు కానీ, ఇది మాత్రం ఆసియా ఖండంలోనే ఉంది అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు 30 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
కాగా ఈ జంట దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వీరికి పెళ్లయ్యి మూడేళ్లు. సౌదీ అల్ సదాక్ ఇన్‌స్టాగ్రామ్ టిక్‌టాక్ ద్వారా ఆమె లగ్జరీ స్టయిల్‌తో బాగా పాపులర్.
ఇదీ చదవండి: రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో
Comments
Please login to add a commentAdd a comment