మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి తాను విడాకులు తీసుకోవడానికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు. 2021లో విడాకులు తీసుకున్న మెలిందా అంతకు ముందు పరిస్థితులను గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
2021 కంటే ముందే తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు, ఆ తరువాత 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మెలిందా విడాకులను భయంకరమైనవిగా వివరించారు. విడాకులు తీసుకున్న తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పుడు నేను నా పనులను నేనే చేసుకుంటున్నాను. మెడికల్ స్టోరుకు వెళ్లడం, రోజూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం వంటివి హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను విడాకుల తరువాత పొందుతున్నాని మెలిండా అన్నారు.
27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన మెలిండా గేట్.. విడాకుల తరువాత 'బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్' నుంచి కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం మెలిండా తన ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment