Melinda Gates
-
విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి తాను విడాకులు తీసుకోవడానికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు. 2021లో విడాకులు తీసుకున్న మెలిందా అంతకు ముందు పరిస్థితులను గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.2021 కంటే ముందే తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు, ఆ తరువాత 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మెలిందా విడాకులను భయంకరమైనవిగా వివరించారు. విడాకులు తీసుకున్న తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.ఇప్పుడు నేను నా పనులను నేనే చేసుకుంటున్నాను. మెడికల్ స్టోరుకు వెళ్లడం, రోజూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం వంటివి హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను విడాకుల తరువాత పొందుతున్నాని మెలిండా అన్నారు.27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన మెలిండా గేట్.. విడాకుల తరువాత 'బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్' నుంచి కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం మెలిండా తన ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.pic.twitter.com/JYIovjNYKo— Melinda French Gates (@melindagates) May 13, 2024 -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్ చెట్టాపట్టాల్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మార్చి1న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తన ప్రియురాలు పౌలా హర్డ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంబానీ, వరుడు అనంత్ అంబానీతో కలిసి పోజులిచ్చారు. దీంతో బిల్‌గేట్స్- పౌలా హార్డ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఒరాకిల్ సంస్థ మాజీ సీఈఓ భార్య పౌలా హార్డ్‌ను బిల్‌గేట్స్ గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడాది అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ ఎంగేజ్మెంట్లో ప్రత్యేక్షమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో బిల్ గేట్స్‌తో ఆమె సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరూ మార్చి 2022లో ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డబ్ల్యూటీఏ సెమీఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తూ మీడియా కంట కనబడ్డారు. బిల్‌గేట్స్-పౌలాహర్డ్ స్నేహబంధం గురించి అడినప్పుడల్లా దాటవేస్తూ వచ్చారు. గత ఏడాది జూలైలో పౌలా హర్డ్ ధరించిన డైమండ్ రింగ్ ధరించి కనిపించడంపై వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ప్రతినిధి హర్డ్ దశాబ్దాలుగా ఆ ఉంగరాన్ని ధరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ఏకంగా రూ. 3.4 లక్షల కోట్ల విరాళాలిచ్చిన మహిళ ఎవరో తెలుసా?
పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం. ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్‌లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్‌లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. 1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్‌లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్‌తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు. -
చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రేమ పక్షులు..త్వరలోనే పెళ్లి
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇటలీలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు బిలియనీర్ బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్ సిక్స్ ( Page Six) నివేదించింది. ప్రస్తుతం, జెఫ్ బెజోస్‌కు చెందిన లక్షల కోట్ల షిప్ (సూపర్ యాచ్ )ఇటలీలో ఉంది. ఈ నౌకలో బెజోస్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్ ఇతర స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలే బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్లో ఉన్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తూ వార్తల్లో నిలించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఇదే విషయంపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా మాట దాట వేస్తూ వచ్చారు. ఇప్పుడు పబ్లిక్‌గా తిరగడంతో త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి తర్వలోనే జరగనుందంటూ పుకార్లు జోరందుకున్నాయి. 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త మిలిందా ఫ్రెంచ్ గేట్స్ డేటింగ్ అంశం అమెరికా మీడియాలో హల్ చల్ చేస్తోంది. మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. ఫాక్స్ న్యూస్మాజీ కరస్పాండెంట్, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ జోన్ డు ప్రీతో మళ్లీ ప్రేమలో పడ్డారని టీఎంజెడ్ సహా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని నివేదించింది. అంతేకాదు కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లోని ఫైవ్ స్టార్ హోటల్లో ఈ జంట, కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు బస చేసినట్లు కూడా రిపోర్ట్ చేసింది. Bill Gates ex-wife Melinda finds love again; reportedly dating a former TV reporter Melinda Gates, ex-wife of billionaire Bill Gates, is reportedly dating a former Fox News reporter TMZ reports that the 58-year-old philanthropist has been dating Jon Du Pre, 63, for months now. pic.twitter.com/A0ixRbudvR — Instablog9ja (@instablog9ja) November 9, 2022 కాగా బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ ఆగస్టు 2021లో విడాకుల అంశాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు బిల్‌గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానంటూ మిలిందా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు. మరోవైపు తాజా కథనాలపై మిలిందాగ గానీ, జాన్ డ్యూ ప్రీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
విడాకుల కన్నా అదే ఎక్కువ బాధించింది: బిల్‌గేట్స్
ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్‌గేట్స్. సండే టైమ్స్‌తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్‌గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్‌తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: బిల్‌గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!! -
అసహ్యం వేస్తుంది..కేరక్టర్ మంచిది కాదు!! బిల్‌గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న 2019 ఆగస్ట్‌లో మాన్‌హట్టన్ జైలు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ ఎప్‌స్టిన్‌ను ఎందుకు కలుసుకున్నారో చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు బిల్ గేట్స్ నుంచి మీరు విడిపోవడానికి ఎప్స్టీన్తో రిలేషన్షిప్ ప్రధాన కారణమా? అని ప్రశ్నించగా.. అనేక కారణాలలో ఇది కూడా ఒకటి అని బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎప్‌స్టిన్‌ను బిల్ గేట్స్ ఎందుకు కలుసుకునేవారు. ఇదే విషయాన్ని బిల్‌గేట్స్ అడిగితే కారణాలు చెబుతారు. అందుకే నేనే అతనెవరు? అతని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. ఓ సారి అతన్ని కలిశాను. కలిసిన తరువాత అనిపించింది. నేను ఎప్స్టిన్ ఎందుకు కలిశానా' అని చింతించాను. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని, ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేసేది. మంచి వ్యక్తిత్వం కాదని అభివర్ణించింది. ఇక ఇంటర్వ్యూలో..జెఫ్రీను కలవడం మీరు(మిలిందా) బిల్‌గేట్స్ విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యిందా? అని జర్నలిస్ట్ అడిగినప్పుడు.. మేమిద్దరం విడిపోవడానికి అనే కారణాలున్నాయి. అందులో ఇదొకటి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బిల్, మిలిండాలకు ఆగస్టులో విడాకులు మంజూరు కాగా..ఎప్స్టీన్తో గడిపి తాను చాలా పెద్ద తప్పు చేశానని సీఎన్ఎన్తో గేట్స్ అన్నారు. కానీ, తన ఫౌండేషన్‌కు నిధుల సేకరణే లక్ష్యమని చేసిన వ్యాఖ్యాల్ని మిలిందా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..
వాషింగ్టన్: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్‌గేట్స్ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. (చదవండి: ప్రియుడితో బిల్‌గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!) కొన్ని రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్ గేట్స్ తన వివాహ వేడుక గురించి వోగ్ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్. (చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!) ‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది. ‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. జెన్నీఫర్ భర్త నాయల్ నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్‌గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్‌గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
అమ్మాయిలతో ‘పులిహోర’.. బిల్‌గేట్స్‌కు గట్టి వార్నింగ్!
ఇదేం కొత్త ఆరోపణ కాదు. కాకపోతే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చిలిపి చేష్టలు’ తమ దృష్టికి రావడంతో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ స్వయంగా ఆయన్ని మందలించారనే కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. సదరు ఘటన 2008లో జరిగింది. ఓ మిడ్ లెవల్ ఉద్యోగితో పులిహోర కలుపుతూ ఆయన(బిల్ గేట్స్) పంపిన మెయిల్స్ వ్యవహారం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ దృష్టికి వచ్చింది. దీంతో జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్(మైక్రోసాఫ్ట్ ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ ), మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ కలిసి గేట్స్‌ను వ్యక్తిగతంగా సంప్రదించారు. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు ఆపితే మంచిదని ఆయన్ని సున్నితంగా మందలించారు కూడా!. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బిల్‌గేట్స్ నీళ్లు నమలడం, ఉద్యోగిణికి కేవలం వెకిలి మెయిల్స్ మాత్రమే పంపడం, పైగా శారీరక సంబంధం దాకా యవ్వారం వెళ్లకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలిపెట్టారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో పేర్కొంది. ఇక ఈ కథనంపై ఇటు మైక్రోసాఫ్ట్గానీ, అటు స్మిత్‌గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది. ఇదిలా ఉంటే 2019లో బిల్‌గేట్స్ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లైంగిక ఆరోపణలపై న్యాయపరమైన విభాగంతో దర్యాప్తునకు ఆదేశించింది మైక్రోసాఫ్ట్. ఆ దర్యాప్తు గోప్యంగా కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఎప్పుడైతే బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ విడాకులు ప్రకటించారో.. అప్పటి నుంచి వరుసబెట్టి ఆయనపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా బిల్‌గేట్స్ చిలకొట్టుడు వ్యవహారాలే మెలిండాతో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి కారణమనే వాదన సైతం తెర మీద వినిపిస్తుంటోంది. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ఎవరంటే.. క్లిక్ చేయండి: ‘బిల్‌గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’ -
ప్రియుడితో బిల్‌గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహ వేడుక సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు సదరు మ్యాగజైన్ ప్రచురించింది. కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్‌తో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు పీపుల్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. నాజర్‌ది సంపన్న కుటుంబమే.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా తరఫున నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాయల్ నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది. చివరకు సోషల్ మీడియా వేదికగా జెన్నీఫర్ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు పీపుల్ మ్యాగజైన్ తెలిపింది. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది ‘నాయల్ నాజర్.. నువ్వు నాకు దొరికిన ఒక అదృష్టానివి. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది. మన జీవితం కలిసి పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జెన్నీఫర్. ‘ ప్రపంచంలో నేను అదృష్టవంతుడ్నే కాదు.. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్‌ని కూడా. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ప్రతీ ఉదయాన్ని, ప్రతీ రోజుని ఒక కల అంత అందంగా ఆస్వాదించేలా చేసిన నీకు చాలా థాంక్స్’ అని నాజర్ తెలిపాడు. బిల్‌గేట్స్-మిలిందా మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్‌గేట్స్ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్‌గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్ గేట్స్. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట. -
బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు ఖరారు
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు ఖరారయ్యాయి. అమెరికాలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి వారి విడాకుల పత్రాలపై సంతకాలు చేయడంతో వారి 27 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్లు అయింది. అయితే వారి మధ్య ఆస్తుల పంపకాలు ఎలా ఉంటాయన్న వివరాలేమీ కోర్టు డాక్యుమెంట్స్‌లో కనిపించలేదు. 1987లో మైక్రోసాఫ్ట్‌లో కలుసుకున్న వీరు 1994లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం విడిపోతున్నట్లు ఈ ఏడాది మేలో బిల్‌గేట్స్ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రకటించారు. తాము విడిపోతున్నప్పటికీ తమ సంస్థ అయిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌లో కలసి పని చేస్తామని చెప్పారు. ఒక వేళ వారు కలసి పని చేయలేమని భావిస్తే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కో–చైర్, ట్రస్టీగా రాజీనామా చేస్తారని ఇటీవలే ఫౌండేషన్ ప్రకటించింది. -
అవును వాళ్లిద్దరు విడిపోయారు.. అధికారికంగా.!
బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ దాంపత్య జీవితానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదే ఈ పరిణామం.! 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా మే నెలలో విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత వారి నిర్ణయాన్ని అంగీకరిస్తూ వాషింగ్టన్ కు చెందిన కింగ్ కౌంటీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. దీంతో బిల్ గేట్స్, మెలిందా గేట్స్ బంధానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది. మే నెలలో బిల్‌గేట్స్ - మెలిందాలు తాము విడిపోతున్నట్లు, విడాకుల కోసం కింగ్ కౌంటీ కోర్ట్‌ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు. దీంతో వారు విడిపోవడంపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు మరోమారు చర్చకు దారితీశాయి.. అమెరికా చట్టాల ప్రకారం డివోర్స్ కావాలంటే మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంది. అందుకే బిల్‌గేట్స్ దంపతులు విడాకుల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో కింగ్ కౌంటీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. బ్లూం బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం.. విడాకులతో సుమారు 152 బిలియన్ల డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస్తిని ఎలా పంచుకుంటారో తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఫ్రెంచ్ గేట్స్‌కి బదిలీ చేసినట్టు అమెరికన్ మీడియా 'టీఎంజీ' తన కథనంలో పేర్కొంది. ఇక వాషింగ్టన్ న్యాయ నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో ఆస్తులు,ఇతర వ్యవహారాల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో.. విడిపోయే సమయంలో కూడా ఆ నిబంధనలపై కట్టుబడి ఉండాలి. వాటికి లోబడే బిల్‌గేట్స్-మెలిందా గేట్స్ ఆస్తుల్ని పంచుకోవాలని న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ ఆస్తి ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరి ఆస్తి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా?
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా బిల్ గేట్స్ అని మనందరికీ తెలుసు, కానీ మనలో ఎంత మందికి గేట్స్ అమెరికాలో అతిపెద్ద రైతు అని తెలుసు. మీలో చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు కానీ, ఇది నిజం. గేట్స్ అమెరికా అతిపెద్ద రైతులలో ఒకరు. బిల్ గేట్స్, అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ల్యాండ్ రిపోర్ట్, ఎన్ బీసీ రిపోర్ట్ ప్రకారం.. గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. నార్త్ లూసియానాలోనే గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు. అలాగే నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. ఒకసారి గేట్స్‌ను రెడ్డిట్లోని తన వ్యవసాయ భూముల గురించి అడిగినప్పుడు దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.. “ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది” అని అన్నారు. బిల్ గేట్స్ , మెలిండా వ్యవసాయ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆస్పష్టంగా ఉంది. చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
బిల్‌గేట్స్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెలిందా
వాషింగ్టన్: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారు వివరించలేదు.. కానీ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్‌కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆమె తమ ఇద్దరి సమిష్టి సంపద 130 బిలియన్ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు గాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్ ట్రస్ట్, ఎస్టెట్ లాయర్ ఉన్నారని డెయిలీ మెయిల్ కోట్ చేసింది. మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
ఇంజనీర్‌తో ఎఫైర్: అందుకే బిల్ గేట్స్ రాజీనామా?!
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వివరాలు.. తన జీవితం ఇక పూర్తిగా సామాజిక సేవకే వినియోగించాలనుకుంటున్నానని, అందువల్లే మైక్రోసాఫ్ట్ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు బిల్‌గేట్స్ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో మరింత బిజీగా మారిపోయారు. అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన బిల్‌గేట్స్ అధికారప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి మాట. ఆ బంధానికి స్నేహపూర్వంగానే ముగింపు పలికారు. బోర్డు నుంచి వైదొలగడానికి, దీనికీ ఎటువంటి సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా భార్య మిలిందా గేట్స్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్ గేట్స్ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వీరి బంధం బీటలు వారడానికి యాన్ విన్‌బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయనకు మరో మహిళతోనూ ఎఫైర్ ఉందన్న వార్తలు వెలువడటం గమనార్హం. కాగా స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%. చదవండి: అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే! -
గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’..
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలయనీర్ బిల్ గేట్స్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నట్లు గేట్స్ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి మెలిందా 2019లోనే న్యాయవాదులను కలిసి చర్చించారని వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మెలిందా అక్టోబర్, 2019 నాటికి అనేక సంస్థలకు చెందిన న్యాయవాదులతో విడాకుల గురించి చర్చించారని.. వారి వైవాహిక జీవితం “అతకలేని విధంగా విచ్ఛిన్నమైందని” మెలిందా వారికి తెలిపినట్లు వాల్ స్ట్రీట్ వెల్లడించింది. గతేడాది కోవిడ్ సమయంలోనే వీరి విడాకుల గురించి చర్చలు జరిగాయని.. వారి సంపద 145 బిలియన్ డాలర్లను విభజించడానికి న్యాయవాదుల బృందం మధ్యవర్తిత్వం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. ఓ లైంగిక నేరస్థుడితో గేట్స్‌కు ఉన్న డీలింగ్ వల్లే మెలిందా భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొంది. అతడు ఎవరంటే జెఫ్రీన్ ఎప్స్టీన్. ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధాల గురించి తెలిసినప్పటి నుంచి మెలిందా చాలా బాధపడ్డారని నివేదిక పేర్కొంది. 2013 నుంచి బిల్‌గేట్స్, ఎప్స్టీన్తో డీలింగ్స్ కలిగి ఉన్నట్లు వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది. గత సంవత్సరం న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జెఫ్రీ ఎప్స్టీన్ను చాలాసార్లు కలుసుకున్నారని, అతని న్యూయార్క్ టౌన్హౌస్లోనే గేట్స్ చాలా సమయం గడిపేవారని తెలిపింది. ఈ వార్తలపై బిల్ గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. గేట్స్, ఎప్స్టీన్ మధ్య సమావేశాలు దాతృత్వంపై దృష్టి సారించాయని తెలిపారు. ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్.. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఆర్థికవేత్త. అతను లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడ్డాడు. అతనిపై సెక్స్ కోసం తక్కువ వయస్సు గల అమ్మాయిలతో విస్తారమైన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాకు సంబంధించిన సమాఖ్య ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎప్స్టీన్ 2019 ఆగస్టులో 66 సంవత్సరాల వయసులో జైలులో మరణించాడు. చదవండి: గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు? -
గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు?
మే 3న గేట్స్ దంపతులు విడాకులపై సంతకాలు పెట్టారు. 4న ఆ సంగతి ప్రపంచానికి చెప్పారు. 5న గేట్స్ దీర్ఘకాల ప్రియ స్నేహితురాలు యాన్ బిన్బ్లాడ్ పేరు బయటికి వచ్చింది! 6న గేట్స్ చైనీస్ ఇంటర్ప్రెటర్ ఝ షెల్లీ వాంగ్ పేరు గేట్స్‌తో జత అయింది!! ‘సర్ అలాంటివారు కారు..’ అని షెల్లీ అంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఒక భార్య, ఒక భర్త విడిపోయారంటే అందుకు మరొక మహిళే కారణమా!! 36 ఏళ్లు షెల్లీకి. చక్కగా, చలాకీ గా ఉంటారు. ‘నేను అలాంటి మనిషిని కాదు’ అనడం లేదు తను. గేట్స్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గేట్స్ కి యాన్ కి, గేట్స్ కి షెల్లీ కి మధ్య ఏముంది? వట్టి ప్రేమేనా? అంతకన్నా ఉన్నతమైన భావన ఏదైనానా?! నిజంగా గేట్స్ గుండెల్లో ఎవరైనా ఉన్నారా? లేక.. ఎవరో ఒకరు ఉండకపోతారా అని మీడియానే ఆయన గుండె తలుపుల్ని తట్టి చూస్తోందా?! భార్యాభర్తలుగా తామిద్దరం విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించగానే, అందుకు యాన్ విన్‌బ్లాడ్ అనే మహిళ కారణం అయుండొచ్చన్న ఊహా కథనాలు మొదలయ్యాయి. అయితే అవి కేవలం ఊహల ఆధారంగా అల్లుకున్నవి కావు. గేట్స్‌కి మెలిందా పరిచయం అవడానికి ఏడేళ్ల ముందు నుంచే యాన్.. అతడి గర్ల్ ఫ్రెండ్. చివరికి యాన్ అనుమతితోనే గేట్స్ మెలిందాను పెళ్లి చేసుకున్నారు. అదే అనుమతిని పెళ్లికి ముందే మెలిందా దగ్గర్నుంచి కూడా గేట్స్ తీసుకున్నారు... ఏడాదిలో ఒక వారం రోజులు యాన్‌తో కలిసి ఉంటానని!! యాన్ వయసిప్పుడు 70 ఏళ్లు. గేట్స్ కంటే ఐదేళ్లు పెద్ద. యాన్ విన్‌బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ ఇరవై ఏడేళ్లు కలిసున్నాక, ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు గేట్స్ దంపతులు విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకోడానికి కారణంగా యాన్ విన్‌బ్లాడ్ తర్వాత బయటికి వచ్చిన ఇంకో మహిళ పేరు ఝ షెల్లీ వాంగ్! షెల్లీ చైనా యువతి. యాన్ కన్నా 35 ఏళ్లు, గేట్స్ కన్నా 30 ఏళ్లు చిన్న. ‘బిల్, మెలిందా గేట్స్ పౌండేషన్’లో ఆరేళ్లుగా చైనీస్ ‘ఇంటర్ప్రెటర్’గా ఉన్నారు. భాషల తర్జుమాల్లో ప్రవీణురాలు. ‘బిల్ గేట్స్ మిస్ట్రెస్ (ప్రియురాలు) ఈజ్ ఝ షెల్లీ వాంగ్ ఫ్రమ్ చైనా’ అని మే 6న మైఖైల్ డెలాజెన్ అనే యూజర్ నేమ్‌తో అకస్మాత్తుగా నెట్లో ఒక ట్వీట్ తలెత్తగానే.. తలలన్నీ యాన్ మీద నుంచి షెల్లీ వైపు తిరిగాయి! ‘‘సర్ అలాంటి వారు కారు. నమ్మండి. సర్‌తో, మేడమ్‌తో నాకున్న బాంధవ్యం ఉద్యోగానికి అతీతమైనదేమీ కాదు’’ అని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వైబో’లో షెల్లీ పెట్టిన పోస్ట్ గత రెండు రోజులుగా అక్కడ వైరల్ అవుతోంది. ఏమైనా ఇప్పుడు గేట్స్, మెలిందాలు వార్తల్లోంచి వెళ్లిపోయి, యాన్, షెల్లీలు.. వదంతులలోకి వచ్చారు. వాటిని విని యాన్ నవ్వుకుంటుంటే, షెల్లీ కంట తడి పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు వస్తున్న మెజేస్లలో ఇప్పుడు ఆమెను ఓదారుస్తున్నవే ఎక్కువ. ‘షెల్లీ గేట్స్ ప్రియురాలు’ అనే ట్వీట్ ప్రత్యక్షం కాగానే, ఆ మాటను రూఢీ పరిచే రీ ట్వీట్లూ మొదలయ్యాయి.‘‘ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ పన్నిన కుట్రలా అనిపించవచ్చు. కామ్రేడ్ గేట్స్‌కి డబ్బు, మీడియా ప్రచారం అవసరం లేకున్నా.. ఒక స్త్రీని వద్దనుకోగలడా?’’ అనేది ఆ ట్వీట్లలో ఒకటి! అయితే గేట్స్ మరీ అంత అవసరంలో ఉంటాడని అనుకోడానికి ఒక్క కారణమూ లేదు. ఆయన జెంటిల్మన్ అయినట్లే, యాన్, షెల్లీ నైస్ ఉమెన్. యాన్ని మోసం చేసి ఆయన మెలిందాను పెళ్లి చేసుకోలేదు. ఎంతకూ పెళ్లి మాట ఎత్తకపోతుంటే.. ‘అలాగే ఆలోచిస్తూ ఉండు’ అని నవ్వుతూ యాన్ వేరే వ్యక్తిని వివాహమాడారు. గేట్స్ కూడా యాన్‌కు చెప్పకుండా మెలిందాను చేసుకోలేదు. ఆమె సంప్రదించాకే పెళ్లికి చొరవ చేశాడు! పెళ్లయ్యాక ఎప్పుడూ మెలిందా అనుమతి తీసుకోకుండా యాన్ని కలవలేదు గేట్స్. యాన్‌కి, గేట్స్ మధ్య అప్పటికీ ఇప్పటికీ ఉన్న బంధం అభిరుచుల అనుబంధమే తప్ప, హృదయ సంబంధం కాదు. యాన్ ఎలా చూసినా గేట్స్ కన్నా గ్రేట్. మైక్రోసాఫ్ట్ ఆరంభ సంవత్సరాలలో యాన్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఇబ్బడిముబ్బడిగా స్టార్టప్‌లకు డబ్బు పెడుతుంటారు. సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. పాతిక పైగా కంపెనీల ‘బోర్డ్’లలో ఆమె కీలక సలహాదారు. సిలికాన్ వ్యాలీలో తొలి మహిళా ప్రోగ్రామర్. ఇవన్నీ అటుంచితే.. అసలు గేట్స్‌కి, యాన్‌కి మధ్య ఏమున్నట్లు?! వాళ్లను ఎప్పటికీ కలిపి ఉంచేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. గేట్స్ మెలిందాతో ప్రేమలో పడటానికి ముందు యాన్ తో ప్రేమలో ఉన్న మూడేళ్లూ వాళ్ల డేటింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి బయో ఇంజినీరింగ్‌లో చిన్నపాటి అధ్యయనం చేశారు. ఇంకోసారి మరో దేశం వెళ్లారు. అక్కడ రిచర్డ్ ఫేవ్మన్ ప్రసంగాల ఆడియో టేప్‌లలో ఫిజిక్స్‌ను ఆస్వాదించారు. జాంజిబార్ వెళ్లినప్పుడు ప్రాచీన మానవ జీవన శాస్త్రాల పరిశోధకుడు డొనాల్డ్ జొహాన్సన్ పరిణామక్రమ సిద్ధాంతాల గురించి చదివారు! ఇదే వాళ్ల లైఫ్, లవ్! మెలిందాతో పెళ్లయ్యాక కూడా యాన్ని గేట్స్ కలుస్తున్నది ఇందుకోసమే. ఇక ఆమెవల్ల వీళ్లు విడిపోడానికి ఏముంటుంది?! మరి షెల్లీ కారణంగా గేట్స్ దంపతులు విడిపోయి ఉంటారా?! గేట్స్ అంత బలహీనమైన వారు కానీ, షెల్లీ అంత బలం లేని మహిళ కానీ కాదు. షెల్లీ చక్కగా ఉంటారు. చలాకీగా ఉంటారు. ఈ భార్యాభర్తల పౌండేషన్లోనే పని చేస్తున్నారు. క్షణం తీరిక ఉండని ఉద్యోగి ఆమె. నిజానికి మైక్రోసాఫ్ట్‌లో, గేట్స్ అండ్ మెలిందా ఫౌండేషన్‌లో వందల మంది షెల్లీలు ఉంటారు. ఎవరి ప్రపంచాలు వారివి. వాళ్లలో షెల్లీ ప్రపంచం కూడా ఒకటి. ఒకటి కాదు. చాలా! హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా ఆమె ఇంటర్ప్రెటర్గా పని చేస్తున్నారు. టి.ఇ.డి. కాన్ఫరెన్స్‌లకు వెళుతుంటారు. ‘మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో కూడా పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తున్నారు. ఒక్కమాటలో గేట్స్ ఎంత బిజీగా ఉంటారో, గేట్స్ సంస్థలో పని చేస్తున్న షెల్లీ కూడా అంత బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ జనించకూడదా అనే ప్రశ్న రావచ్చు. వృత్తిని ప్రేమించేవారి దగ్గరికి ఒక ‘వ్యక్తిగా’ ప్రేమ ఎన్నటికీ దరి చేరలేదు. ‘‘భార్యాభర్తలుగా విడిపోతున్నా, ప్రొఫెషనల్స్‌గా మాత్రం మేము కలిసే ఉంటాం’’ అని బిల్ గేట్స్, మెలిందా చెప్పింది అందుకేనేమో! -
ప్రతి ఏటా మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో బిల్ గేట్స్ టూర్
వాషింగ్టన్: నాలుగు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. ఏంటంటే బిల్ గేట్స్ ఏటా తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్తారట. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దీని గురించి మిలిందా గేట్స్‌కు కూడా తెలుసట. ఆ వివరాలు.. మిలిందాతో వివాహానికి ముందు బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ అనే మహిళను ప్రేమించారట. కానీ ఆ తర్వాత మిలిందాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్ గేట్స్ వివాహానికి ముందే దీని గురించి మిలిందాతో చెప్పాడట. ప్రతి ఏటా వసంత కాలంలో తాను అన్ విన్‌బ్లాడ్‌తో టూర్ వెళ్తానని తెలిపాడట. అందుకు మిలిందా కూడా అంగీకరించింది అని సమాచారం. ఇక బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ ప్రతి ఏటా వసంత కాలంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని బీచ్ కాటేజ్‌లో ప్రైవేట్ సమయాన్ని గడపడానికి వెళ్తారు. దీనిపై విన్‌బ్లాడ్ స్పందిస్తూ "మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయోటెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం లాంటిది. ఈ టూర్లో మేం మా గురించి, ప్రపంచం గురించి చర్చించుకునేవాళ్లం. ఇక మిలిందా బిల్‌గేట్స్‌కు అన్ని విధాల తగిన భార్య" అన్నారు. ది పోస్ట్ ప్రకారం, ఆన్ విన్‌బ్లాడ్, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ ప్రైవేట్ పరిశోధకుడైన ఎడ్వర్డ్ అలెక్స్ క్లీన్ను వివాహం చేసుకుంది. అతను నేరాలు, మోసం, పౌర హక్కుల కేసులను విచారించే ‘అలెక్స్ క్లైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ సర్వీస్’ యజమాని. విన్‌బ్లాడ్ ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థాపకురాలు. 1997లో టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. "విన్‌బ్లాడ్ నా కన్న ఐదేళ్లు పెద్దది. మిలిందాతో నా వివాహం గురించి ముందుగా విన్బ్లాడ్కే చెప్పాను. తన అంగీకరంతోనే నేను మిలిందాను వివాహం చేసుకున్నాను. విన్‌బ్లాడ్‌ను ప్రతి ఏటా ఒక్కసారి కలుస్తానని వివాహానికి ముందే మిలిందాకు చెప్పాను. తను కూడా అంగీకరించిది" అని బిల్‌గేట్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు! -
గేట్స్ దంపతుల విడాకులు: కుమార్తె భావోద్వేగం
వాషింగ్టన్: ‘‘నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న వార్త మీలో చాలా మంది వినే ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదు. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్ చేయదలచుకోలేదు. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుంది’’ అంటూ గేట్స్ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండబోవడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. కాగా సతీమణి మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన జెన్నిఫర్ ఇన్‌స్టా వేదికగా ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమకు అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా 1994లో బిల్, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) సంతానం. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే! -
అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే!
వాషింగ్టన్: విడాకులు తీసుకోనున్నట్లు బిల్ గేట్స్ దంపతులు ప్రకటించడంతో గతంలో విడిపోయిన ప్రముఖుల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 2019లో విడాకులు తీసుకున్నారు. టెస్లా సంస్థ చీఫ్ ఎలన్ మస్క్ కూడా గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా బెజోస్ తన భార్య మెక్కెంజీకి 38 బిలియన్ డాలర్ల (ప్రస్తుత మారక విలువ ప్రకారం రూ. 2.80 లక్షల కోట్లు) భారీ మొత్తం చెల్లించేందుకు అంగీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల ఓనర్ ఎలన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ నుంచి 2008లో విడాకులు తీసుకున్నారు. జస్టిన్‌కు చెల్లించే మొత్తానికి సంబంధించి, పిల్లల బాధ్యతలకు సంబంధించి కోర్టు వెలుపల వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత బ్రిటిష్ నటి టలులా రిలేను మస్క్ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దాదాపు 20 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. గేట్స్ దంపతుల ఆస్తుల పంపకం ఉమ్మడి ఆస్తులను పంచుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన విడాకుల ఒప్పంద పత్రంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ పేర్కొన్నారు. కాగా వివాహం అనంతరం సంపాదించిన ఆస్తులపై ఇద్దరికీ సమానంగా హక్కు ఉంటుందని వాషింగ్టన్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. పరస్పర అంగీకారంతో ఆ ఆస్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మిలిందాకు భారీగా భరణం లభించే అవకాశం ఉందని, తద్వారా ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన విడాకులు.. భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు తదితర వివరాలు తెలుసుకుందాం. దిమిత్రి రైబోలోలెవ్- ఎలీనా రైబోలోలెవ్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు వివాహ బంధం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో బిలియనీర్ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్లు భరణంగా ఇచ్చారు. ఎలిక్ వైల్డిస్టీన్- జోక్లిన్ వైల్డిస్టీన్ ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్. 1999లో ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ సందర్భంగా 3.8 బిలియన్ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు. రూపెర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్ మన్ అమెరికన్ మీడియా మెఘల్ రూపెర్ట్ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్ డాలర్లు భరణం చెల్లించారు. బెర్నీ ఎలెస్టోన్- స్లావికా ఎలెస్టోన్ ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్ డాలర్లు. స్టీవ్ వీన్- ఎలైన్ వీన్ కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. స్టీవెన్ స్పీల్బర్గ్- ఎమీ ఇర్వింగ్ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు. ఆసియాలో ఆమె మాత్రమే... భర్త నుంచి విడాకులు పొంది.. తద్వారా లభించిన భరణంతో ఆసియాలోని సంపన్న మహిళల్లో ముందు వరుసలో నిలిచారు చైనాకు చెందిన యువాన్ లిపింగ్. షెంజన్ కాంగ్‌టాయ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో. చైర్మన్ డూ వీమిన్ మాజీ భార్య ఆమె. విడిపోతున్న సందర్భంగా, యువాన్‌కు భర్త 163.3 మిలియన్ షేర్లు బదలాయించడంతో వీరి విడాకుల వ్యవహారం ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్‌గా నిలిచింది. జూన్ 2, 2020న మార్కెట్లు ముగిసేనాటికి యువాన్ ఆస్తి 3.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ అప్పట్లో వెల్లడించింది. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
బిల్‌గేట్స్ సంచలన ప్రకటన
-
27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్
బిల్ గేట్స్, మెలిందాలది లవ్ మ్యారేజ్. 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా నిన్న వాళ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు!! కారణాలు చెప్పలేదు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. మైక్రోసాఫ్ట్ చక్కగా నడుస్తోంది. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచానికి అండగా ఉంది. మరి ఈ దంపతుల మధ్య ప్రేమ ఏమైంది? అసలు ఆ ప్రేమ ఎలా మొదలయింది? భార్యభర్తల పేరు మీద ఉన్న బిలియన్ల డాలర్ల మహా దాతృత్వ సంస్థ ‘బిల్ అండ్ మెలిందా గేట్స్’ ఎప్పటిలా పరోపకారార్థం పని చేస్తుంటుంది. అయితే ఆ భార్యాభర్తలు మాత్రం తమ దాంపత్య బంధాన్ని ఇక మీదట కొనసాగించరు. బిల్ గేట్స్, మెలిందా కలిసి సోమవారం చేసిన ట్వీట్‌ని బట్టి అర్థమవుతున్నది ఇదే! ‘‘మా మలిదశ జీవితంలో భార్యాభర్తలుగా మేము కలిసి ఎదగ గలమని మాకు ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. కొత్త జీవితంలోకి మేము ప్రయాణిస్తున్నందున మా కుటుంబానికి అవసరమైన ‘స్పేస్’నీ, ‘ప్రైవసీ’ని ఇవ్వమని అడుగుతున్నాం’’ అని ఆ ట్వీట్లో గేట్స్, మెలిందా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65. మెలిందా వయసు 56. ముగ్గురు పిల్లలు. కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21). పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. యాభై బిలియన్ డాలర్ల ఆస్తులు గల ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’లో కనీసం సగానికి పైగా మానవాళి క్షేమానికి అందివ్వాలని అనుకున్న మాటకు ఇద్దరూ కట్టుబడి ఉన్నారు. వృత్తి, జీవితం, కుటుంబం స్థిరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో గేట్స్, మెలిందాల దాంపత్యంలో ఒక్కసారిగా ఈ కల్లోలం ఏమిటి? గేట్స్, మెలిందా తమ మలి జీవితాన్ని వేరుగా, ఎవరికి వారుగా గడపాలని అనుకోవడం ఏమిటి? వాళ్లది ప్రేమ పెళ్లే కదా! అవును ప్రేమ పెళ్లే. పాల్ ఆలెన్తో కలిసి 1975 లో తన 20 ఏళ్ల వయసులో ‘మైక్రోసాఫ్ట్’ని స్థాపించారు గేట్స్. 2008లో 53 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్ బాధ్యతల్ని భాగస్వాములకు, ప్రతిభ గల వారికి అప్పగించి తన రోజువారీ విధుల నుంచి తప్పుకున్నారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే 2000లో తన 43 ఏళ్ల వయసులో భార్య మెలిందాతో కలిసి.. విద్య, స్త్రీ పురుష సమానత్వం, ఆరోగ్యం అనే మూడు లక్ష్యాల సాధన కోసం ‘ఫౌండేషన్’ని ప్రారంభించారు. ఈ సంవత్సరాలన్నీ మైక్రోసాఫ్ట్ మైలు రాళ్లు అనుకుంటే.. గేట్స్ జీవితంలోని మలుపు రాయి 1987. అప్పుడు గేట్స్ వయసు 32 ఏళ్లు. ఆ ఏడాది న్యూయార్క్ సిటీలో జరిగిన మైక్రోసాఫ్ సిబ్బంది డిన్నర్ పార్టీలో తొలిసారి మెలిందాను దగ్గరగా చూశాడు గేట్స్. ఆ ఏడాదే మెలిందా మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాడక్ట్ విభాగానికి జనరల్ మేనేజర్ గా వచ్చారు. అప్పుడు ఆమె వయసు 23. డిన్నర్ తర్వాత గేట్స్ తన దారిన తను వెళ్లిపోయాడు కానీ, మనసు మెలిందా వెళ్లిన దారిలోకి మళ్లింది. తర్వాత కొన్ని నెలలకు గానీ ఆమెను అతడు బయటికి డిన్నర్‌కి రమ్మని పిలిచే ధైర్యం చేయలేకపోయాడు. 1994 లో హవాయిలో వాళ్ల పెళ్లి జరిగే వరకు మైక్రోసాఫ్ట్‌లో ఎవరికీ వాళ్లద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలియదు! పెళ్లి తర్వాత వాళ్లద్దరి మధ్య ప్రేమ తప్ప ఎవరికీ ఏమీ కనిపించలేదు. 2020 వాలెంటైన్స్ డేకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్ పెట్టిన పోస్ట్, ఆ ఫొటోకు జత చేస్తూ రాసిన చిన్న మాట.. భార్యపై అతడికి ఎంత ప్రేమ ఉందో తెలిపేలా ఉంది. ఫొటోలో ఇద్దరూ అటువైపు తిరిగి ఉంటారు. గేట్స్ ఆమెపై చెయ్యి వేసి ఉంటారు. ‘ఈ ప్రయాణంలో నేను ఇంతకన్న మెరుగైన జీవన సహచరిని కోరబోను’ అని రాశారు గేట్స్. బిల్ గేట్స్, మెలిందా (పెళ్లప్పుడు) మెలిందాపై మనసునైతే పారేసుకున్నాడు కానీ, పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచించాడు గేట్స్. అలాగని ఆమెపై ప్రేమ లేకపోవడం కాదు. తనే ముందు చెప్పాడు ‘ఐ లవ్ యు’ అని. తనే ముందు అడిగాడు ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని. ఓ రోజు మెలిందా వెళ్లేసరికి గేట్ తన బెడ్ రూమ్‌లో ఉన్న వైట్ బోర్డు మీద ఏవో ప్లస్‌లు, మైనస్‌లు నోట్ చేస్తున్నాడు. ‘‘ఏంటవి?’’ అని అడిగింది మెలిందా. ‘‘పెళ్లి చేసుకుంటే లాభాలు, నష్టాలు’’ అని చెప్పాడు. ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఏడేళ్ల ప్రేమ తర్వాత మేము ఒక పాయింట్‌కి వచ్చేశాం. అప్పుడిక బ్రేకప్ అవనన్నా అవాలి. పెళ్లయినా చేసుకోవాలి. నేను పెళ్లినే ఎంచుకున్నాను’’ అని గేట్ చెప్పడం 2019లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ఇన్సైడ్ బిల్స్ బ్రెయిన్’లో కనిపిస్తుంది. అందులోనే ఒకచోట డాక్యుమెంటరీ డైరెక్టర్ డేవిడ్ గూగన్హైమ్, గేట్స్ ప్లేయింగ్ కార్డ్ ఆడుతుంటారు. ఆ ఆటలో గేట్స్ గెలుస్తారు. ‘యు ఆర్ లక్కీ ఇన్ లైఫ్. అండ్ యు ఆర్ లక్కీ ఇన్ వార్’ అంటాడు డేవిడ్. ‘వార్’ అంటే ఆట అని. ‘‘.. అండ్ ఇన్ లవ్ టూ’’ అంటాడు గేట్స్ నవ్వుతూ. ప్రేమలో కూడా అదృష్టవంతుడినేనని. మెలిందా ప్రేమను పొందడం తన అదృష్టం అని చెప్పడం గేట్స్ ఉద్దేశం. అదృష్టమే అనుకోవాలి. ఇరవై మూడేళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లోకి వచ్చే సమయానికే మెలిందాకు చాలామందే బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. గేట్స్‌కి ఉన్నది ఒక్కరే. మైక్రోసాఫ్ట్! అంతమంది పోటీని తట్టుకుని మెలిందా ప్రేమను దక్కించుకోగలిగాడు గేట్స్. అతడి జీవితంలో ఆమెకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రాముఖ్యం కాదు, ఆమే అతడిలో సగ భాగానికి పైగా! 2017లో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘కాన్వర్జేషన్ విత్ గేట్స్’ కార్యక్రమంలో వారెన్ బఫెట్ ఒక మాట అన్నారు. వయసులో పాతికేళ్లు తేడా ఉన్నా గేట్స్, బఫెట్ మంచి స్నేహితులు. ‘‘మనకు దగ్గరగా ఉండేవాళ్లు ఎటు వెళ్తే మనం అటు వెళ్తాం. అందుకని మనకన్నా మెరుగైన వాళ్లకు మనం దగ్గరగా ఉండాలి. ప్రత్యేకంగా చెప్పేదేముంది? జీవిత భాగస్వామే కదా మనకు అందరికన్నా దగ్గరగా ఉంటారు’’ అని ఆ కార్యక్రమంలో బెఫెట్ అన్నారు. గేట్స్ అప్పుడు చిరునవ్వుతో మెలిందాను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది వాలెంటైన్స్ డేకి బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలో గేట్స్, ఆయన భార్య మెలిందా మరి ఇప్పుడేమిటి? అంత ప్రేమ ఉండి, ఒకరికొకరు అంత ప్రత్యేకం అయి ఉండి గేట్స్, మెలిందా విడిపోవడం?! ఫౌండేషన్‌ని కలిసే నడుపుతారు. భార్యాభర్తలుగా మాత్రం ఎవరికి వారుగా ఉంటారు! నిన్నటి నుంచీ ప్రపంచం ఈ దంపతుల విడాకులకు కారణాలు వెతుక్కుంటోంది. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదా ఈ పరిణామం?! కాకపోవచ్చు. కొన్నాళ్లుగా గేట్స్, మెలిందా తీవ్రమైన సామాజిక బాధ్యతల ఒత్తిళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ తరఫున ఏటా ఈ దంపతులు ఒక ఉత్తరం విడుదల చేస్తుంటారు. ‘‘మసకబారిన వీడియో మీటింగుల్లా రోజులు గడుస్తున్నాయి. కలవర పరిచే దిగ్భ్రాంతికర వార్తలు, మైక్రోవేవ్డ్ మీల్స్ ఇవే దైనందిన జీవితం అయిపోతున్నాయి’’ అని ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులు విడుదల చేసిన ఉత్తరంలో ఆవేదన, ఆందోళ వ్యక్తం అయింది. ప్రస్తుత మానవాళి మానసిక స్థితిలో ప్రతిఫలిస్తున్న ఈ ఆవేదన, ఆందోళనల్ని పోగొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ఏదైనా మార్గాన్ని వేర్వేరుగా ఎవరి దారుల్లో వారు అన్వేషించదలచారా?! -
బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు!
వాషింగ్టన్: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. మిలిందా గేట్స్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్‌తో కలిసి ట్విటర్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 27 ఏళ్ల బంధం ఇక ముగిసింది.. ‘‘మా బంధం కొనసాగాలా లేదా అన్న అంశం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయానికివచ్చాం. గత 27 ఏళ్ల బంధంలో ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యవంతులుగా, మెరుగైన జీవనం గడిపేలా మా వంతు కృషి చేశాం. ఈ మిషన్ ఇలాగే కొనసాగిస్తాం. ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తాం. అయితే, మా జీవితంలోని తదుపరి దశలో దంపతులుగా మాత్రం కొనసాగలేం. దయచేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్న మాకు, మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మనవి’’ అని మిలిందా, బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. సంపదలో కుబేరులు.. మానవత్వంలోనూ స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%. బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. అలా మొదలైంది ఇక 1987లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా జాయిన్ అయిన మిలిందా, అదే ఏడాదిలో ఓ డిన్నర్ పార్టీలో బిల్ గేట్స్‌ను కలిశారు. ఈ క్రమంలో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు ఫౌండేషన్ స్థాపించి.. గేట్స్ దంపతులు 2000లో సియాటిల్‌లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో మానవీయ కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లాది డాలర్లను విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించారు. ప్రధానంగా ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి సాయం చేశారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికతకై తమ వంతు కృషి చేశారు. అంతేకాదు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికై ఈ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్ల గ్రాంట్లు విడుదల చేసింది. తద్వారా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. కాగా 2018 వరకు బిల్, మిలిందా గేట్స్ ఈ ఫౌండేషన్‌కు సుమారు 36 బిలియన్ డాలర్లను సమకూర్చారు. 2006 నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ 29 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. pic.twitter.com/padmHSgWGc — Bill Gates (@BillGates) May 3, 2021 -
బిల్‌గేట్స్ అల్లుడు ఇతడే
వాషింగ్టన్ డిసి : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నిశ్చితార్థం పూర్తి అయింది. ఈజిప్టుకు చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) జెన్నిఫర్(23)తో తన నిశ్చితార్థం అయిందని జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ మేరకు మంచుకొండల్లో నయెల్ నాసర్తో దిగిన ఫోటన్ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ తాము ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా నాసర్, జెన్నిఫర్లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Nayel Nassar, you are one of a kind. Absolutely swept me off my feet this past weekend, surprising me in the most meaningful location over one of our many shared passions. I can’t wait to spend the rest of our lives learning, growing, laughing and loving together. Yes a million times over. 💍 AHHH!!! A post shared by Jennifer Gates (@jenniferkgates) on Jan 29, 2020 at 12:29pm PST జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పోస్ట్‌కు ఇప్పటికే 46వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వెలిబుచ్చారు. ‘ నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అభినందనలు’ అని బిల్‌గేట్స్ కామెంట్ చేయగా, ‘నిన్ను, నయెల్ నాసర్‌ను జంటగా చూడడం సంతోషంగా ఉంది’ అని మెలిండా గేట్స్ ట్వీట్ చేశారు. ఇక నయెల్ నాసర్ కూడా తన నిశ్చితార్థానికి సంబందిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘ చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో’ అంటూ జెన్నిఫర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram SHE SAID YES!! 💍 I’m feeling like the luckiest (and happiest) man in the world right about now. Jenn, you are everything I could have possibly imagined..and so much more. I can’t wait to keep growing together through this journey called life, and I simply can’t imagine mine without you anymore. Love you more than you can possibly imagine, and thank you for making every single day feel like a dream to me. Here’s to forever! 😘❤️ A post shared by Nayel Nassar (@nayelnassar) on Jan 29, 2020 at 12:49pm PST నాసర్ తల్లిదండ్రులది ఈజిప్టు కాగా అమెరికాలో స్థిరపడ్డారు. నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా గుర్రపు స్వారీ ఆటలో ఆ దేశం తరఫున 2020 ఒలంపిక్స్‌లో సైతం పాల్గొనబోతున్నాడు.