Bill Gates Spotted With Paula Hurd In Jeff Bezos And Lauren Sanchez Engagement Party - Sakshi
Sakshi News home page

చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రేమ పక్షులు..త్వరలోనే బిల్‌గేట్స్‌,పౌలా హర్డ్‌ల పెళ్లి

Published Fri, Aug 4 2023 2:49 PM | Last Updated on Fri, Aug 4 2023 4:32 PM

Bill Gates Spotted With Paula Hurd In Jeff Bezos Lauren Sanchez Engagement Party - Sakshi

మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్‌ శాంచెజ్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. ఇటలీలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు బిలియనీర్ బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్‌ సిక్స్‌ ( Page Six) నివేదించింది. 

ప్రస్తుతం, జెఫ్ బెజోస్‌కు చెందిన లక్షల కోట్ల షిప్ (సూపర్‌ యాచ్‌ )ఇటలీలో ఉంది. ఈ నౌకలో బెజోస్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్ ఇతర స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

ఆ ఫోటోలే బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్‌లో ఉన్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తూ వార్తల్లో నిలించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఇదే విషయంపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా మాట దాట వేస్తూ వచ్చారు. ఇప్పుడు పబ్లిక్‌గా తిరగడంతో త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి తర్వలోనే జరగనుందంటూ పుకార్లు జోరందుకున్నాయి.

2021లో బిల్‌గేట్స్‌..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్న‌ట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. 1994లో వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ ఆధారంగా డైవ‌ర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్‌ నుంచి విడిపోయిన బిల్‌ గేట్స్‌ పౌలా హార్డ్‌తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement