billgates
-
ఇలా ‘భాషించారు’!
మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్‌గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్‌గేట్స్‌కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్‌ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట. భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
భవిష్యత్తు అంతా ఏఐ మయం.. పీఎంతో బిల్‌గేట్స్ ఆసక్తికర చర్చ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్లిష్టమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతలో మార్పులు, సుస్థిరత, సామాజిక సాధికారత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా ఏఐ ఆవిష్కరణలో దేశం అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరువురు మాట్లాడుకున్నారు. ఇండియాఏఐ మిషన్‌ను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌ను కేటాయించడంపట్ల మోదీ దూరదృష్టిని గేట్స్ ప్రశంసించారు. ఈ మిషన్‌లో భాగంగా కొత్త ఆవిష్కరణలతోపాటు, సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పీఎం మోదీ చెప్పారు. డ్రోన్ పైలటింగ్ నైపుణ్యాలతో మహిళలను సన్నద్ధం చేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు, గ్రామీణాభివృద్ధిని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అందులో భాగంగానే ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అందులో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. 2021లో జరిగిన కాప్26 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన ‘పంచామృతం’ ప్రతిజ్ఞకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వాతావరణ పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రతీకగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన జాకెట్‌ను మోదీ ధరించినట్లు చెప్పారు. చర్చలోని ముఖ్యాంశాలు.. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు విస్తృతమైన చర్చలు చేశామని, అందులోని లక్ష్యాలను చేరే దిశగా చాలా మార్పలు తీసుకురాబోతున్నట్లు మోదీ చెప్పారు. ప్రపంచ ప్రతిష్టాత్మక జీ20 సమావేశాన్ని భారతదేశం నిర్వహించడం అద్భుతంగా ఉందని గేట్స్ చెప్పారు. డిజిటల్ ఆవిష్కరణలతో ఇక్కడి అభివృద్ధిని ఇతర దేశాలకు చేరవేయడంలో కృషిచేస్తామని గేట్స్ అన్నారు. 2023 జీ20 సమ్మిట్ సమయంలో ఏఐ ఎలా ఉపయోగపడిందో చర్చించారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ఏఐ సాయంతో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువదించబడిందో మోదీ గుర్తు చేసుకున్నారు. నమో యాప్‌లో ఏఐని ఉపయోగిస్తున్నట్లు పీఎం గేట్స్‌తో చెప్పారు. చారిత్రాత్మకంగా మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ వలసరాజ్యంగా ఉందని పీఎం అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా డిజిటలీకరణ ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందులో ప్రపంచంలోనే భారత్ ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మను ‘ఆయ్’ అంటారు. బిడ్డ పుట్టగానే శిశువు ముందుగా నేర్చుకునే పదం 'ఆయ్' అని మోదీ అన్నారు. ఆయ్ అనే పదానికి AIకు దగ్గరిపోలిక ఉందని, భవిష్యత్తులో ఆయ్‌తోపాటు ఏఐ చాలాముఖ్యమని మోదీ సరదాగా చెప్పుకొచ్చారు. దేశంలో 2 లక్షల ఆరోగ్య మందిర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు పీఎం చెప్పారు. వాటిని ఆధునిక సాంకేతికత సహాయంతో స్థానికంగా ఉన్న ఉత్తమ ఆసుపత్రులతో అనుసంధానించాలని గేట్స్‌ను మోదీ కోరారు. నమో డ్రోన్ దీదీ పథకం గురించి మాట్లాడారు. ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాలని కోరుకున్నట్లు పీఎం చెప్పారు. అందులో భాగంగానే భారత్‌లో చదువురాని మహిళలకు సైతం సాంకేతికతను పరిచయం చేశామన్నారు. చాలా మంది మహిళలకు సైకిల్ తొక్కడం తెలియదన్నారు. కానీ వారు పైలట్లుగా మారి డ్రోన్లను నడుపుతున్నారని వివరించారు. An insightful interaction with @BillGates. Do watch! https://t.co/wEhi5Ki24t — Narendra Modi (@narendramodi) March 29, 2024 -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్ చెట్టాపట్టాల్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మార్చి1న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తన ప్రియురాలు పౌలా హర్డ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంబానీ, వరుడు అనంత్ అంబానీతో కలిసి పోజులిచ్చారు. దీంతో బిల్‌గేట్స్- పౌలా హార్డ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఒరాకిల్ సంస్థ మాజీ సీఈఓ భార్య పౌలా హార్డ్‌ను బిల్‌గేట్స్ గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడాది అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ ఎంగేజ్మెంట్లో ప్రత్యేక్షమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో బిల్ గేట్స్‌తో ఆమె సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరూ మార్చి 2022లో ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డబ్ల్యూటీఏ సెమీఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తూ మీడియా కంట కనబడ్డారు. బిల్‌గేట్స్-పౌలాహర్డ్ స్నేహబంధం గురించి అడినప్పుడల్లా దాటవేస్తూ వచ్చారు. గత ఏడాది జూలైలో పౌలా హర్డ్ ధరించిన డైమండ్ రింగ్ ధరించి కనిపించడంపై వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ప్రతినిధి హర్డ్ దశాబ్దాలుగా ఆ ఉంగరాన్ని ధరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 25 ఏళ్ల తర్వాత ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల అభివృద్ధి వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీని ఆయన విదేశాల్లో చాలాసార్తు కలిశారని తెలిపారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ అవసరాల గురించి మాట్లాడామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించామని బిల్ గేట్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో చెప్పారు. గేట్స్ పోస్టుకు మోదీ స్పందించారు. నిజంగా అదో అద్భుత సమావేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గతిని మార్చే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. It is always inspiring to meet with @narendramodi and there was a lot to discuss. We talked about AI for public good; DPI; women-led development; innovation in agriculture, health, and climate adaptation; and how we can take lessons from India to the world. @PMOIndia pic.twitter.com/Y3REO67gxP — Bill Gates (@BillGates) February 29, 2024 ఇదీ చదవండి: ఇకపై యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ ఇటీవల సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. -
25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్
సాక్షి,హైదరాబాద్: సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఐడీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని చెప్పారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్‌గేట్స్ చేసిన ప్రసంగం గొప్పదన్నారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పారు. ఇదీ చదవండి.. ఎనిమిది వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ -
వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్
వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు వారాంతపు సెలవులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదని, పని చేయకుండా ఖాళీగా ఉండడం తనకు నచ్చేది కాదని ఆయన తెలిపారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. పని కంటే జీవితం గొప్పదని, ఎంతో విలువైందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన పిల్లల వయసులో ఉన్నప్పుడు తనకు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందని బిల్‌గేట్స్ చెప్పారు. గోల్‌కీపర్స్ ఈవెంట్లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదీ చదవండి: అప్పు ప్రమాదఘంటికలివే.. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే. -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రేమ పక్షులు..త్వరలోనే పెళ్లి
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇటలీలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు బిలియనీర్ బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్ సిక్స్ ( Page Six) నివేదించింది. ప్రస్తుతం, జెఫ్ బెజోస్‌కు చెందిన లక్షల కోట్ల షిప్ (సూపర్ యాచ్ )ఇటలీలో ఉంది. ఈ నౌకలో బెజోస్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్ ఇతర స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలే బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్లో ఉన్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తూ వార్తల్లో నిలించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఇదే విషయంపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా మాట దాట వేస్తూ వచ్చారు. ఇప్పుడు పబ్లిక్‌గా తిరగడంతో త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి తర్వలోనే జరగనుందంటూ పుకార్లు జోరందుకున్నాయి. 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్‌గా చేయలేనంతగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు. కంప్యూటర్‌కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్లకు కోడ్‌లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, అతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ మొదటి మనవడి ఫోటోలను తమ వేరువేరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. జెన్నిఫర్ ఆమె భర్త నేయెల్ నాసర్ 2023 మార్చి 5న ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ మొదటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. జెన్నిఫర్ & నేయెల్ నాసర్ చిన్న పాదాలు ఉన్న ఫోటో షేర్ చేస్తూ మా చిన్న హెల్తీ ఫ్యామిలీ ప్రేమను పంచుతోంది, అంటూ రాసుకొచ్చారు. ఇక బిల్ గేట్స్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మనవడిని చేతుల్లో పట్టుకుని 'ప్రపంచాన్ని కనుగొనడం కోసం నేను వేచి ఉండలేను' అంటూ క్యాప్సన్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) అదే సమయంలో మెలిండా గేట్స్ మనవడిని చేతుల్లో పట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నాకు మొదటి మనవడిని పట్టుకోవడంలా అనిపించడం లేదు, నేను జెన్ని పట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు జెన్, నాయెల్ తల్లిదండ్రులుగా కొత్త పాత్రలో అడుగు పెట్టడం చూసి గర్వపడుతున్నానంటూ రాసింది. వీరి పోస్టులు చూసిన వారిలో చాలామంది వారికి అభినందనలు తెలిపారు. ఇందులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదలైన వారు ఉన్నారు. View this post on Instagram A post shared by Melinda French Gates (@melindafrenchgates) -
బిల్‌గేట్స్‌కు తాతగా ప్రమోషన్
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తాతయ్యారు. అవును.. ఆయన కూతురు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, నయెల్ నాసర్ దంపతులు పండంటి మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బేబి ఫేస్‌ను కవర్ చేస్తూ తీసిన పాదాల ఫొటోల్ని జెన్నిఫర్ గేట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది జెన్నిఫర్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jennifer Gates (@jenniferkgates) ‘సెండింగ్ లవ్ ఫ్రమ్ అవర్ హెల్తీ లిటిల్ ఫ్యామిలీ’ అనే క్యాప్షన్ జోడిస్తూ..పోస్ట్చేసిన ఫోటోలపై బిల్ గేట్స్ స్పందించారు. జెన్నీఫర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమ జంట 2021 అక్టోబర్‌లో నయెల్ నాజర్‌ను జెన్నిఫర్ గేట్స్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం ప్రేమించుకున్న వీరిద్దరి వివాహానికి బిల్‌గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక బిల్ గేట్స్ అల్లుడు నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్ లో స్థిరపడగా, నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉంది. హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరఫున 2020 ఒలింపిక్స్‌లో కూడా ఆడారు. చదవండి👉 ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది -
టాప్ గేర్‌లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్‌గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్‌గేర్‌లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్‌పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్‌లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్‌లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్‌గేట్స్ ట్వీట్‌చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్‌కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర కిచిడీకి పోపు (తడ్కా) ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్లో షేర్ చేశారు. అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్‌గేట్స్ పోపు(తడ్కా) పెట్టారు అంటూ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ వీడియోలో కిచిడీకి పోపు(తడ్కా) ఎలా పెట్టాలో బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ నేర్పించారు. బిల్ గేట్స్ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక రోజులో దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు. దాదాపు 10 వేల లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ కిచిడీని మైక్రోసాఫ్ట్ కిచిడీ అని పిలుస్తామంటూ పలువులు యూజర్లు చమత్కరించారు. -
బిల్‌గేట్స్, రిషితో చాట్‌జీపీటీ ఆసక్తికర ఇంటర్వ్యూ
లండన్: చాట్‌జీపీటీ. ప్రపంచమంతటా విశేషంగా ఆదరణ పొందుతున్న కృత్రిమ మేధ ఏఐ) ఆధారిత చాట్‌బాట్. టెక్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికింది చాట్‌జీపీటీ. సందేహాలు తీర్చుకోవాలన్నా, సంగీత స్వరాలు కూర్చాలన్నా, కవిత్వం రాయాలన్నా, వ్యాసాలు సిద్ధం చేసుకోవాలన్నా, కొత్త ఐడియాలు సృష్టించుకోవాలన్నా, చివరికి ప్రేమలేఖ రాయాలన్నా చలో చాట్‌జీపీటీ అనే పరిస్థితి! మరి చాట్‌జీపీటీయే యాంకర్ అవతారమెత్తితే? ఇద్దరు అత్యంత ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తే? అదే జరిగింది! బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌లకు చాట్‌జీపీటీ పలు ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టింది. చాట్‌జీపీటీతో తమ ఇంటర్వ్యూను బిల్ గేట్స్ లింక్డ్ఇన్లో షేర్ చేశారు. తమ సంభాషణ అద్భుతంగా సాగిందన్నారు. రిషి మాటలతో వీడియో మొదలైంది. బిల్ గేట్స్, తాను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నామని, యూకేలో క్లీన్ టెక్నాలజీ రంగంలోని అగ్రశ్రేణి ఆవిష్కర్తలను కలిశామని ఆయన చెప్పారు. తర్వాత గేట్స్ తెరపైకి వచ్చి సంభాషణలో పాలుపంచుకున్నారు. తమను చాట్‌జీపీటీ ఇంటర్వ్యూ చేయబోతోందని అన్నారు. ఇలా సాగింది... రాబోయే పదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్‌పై టెక్నాలజీ ప్రభావం ఏ మేరకు ఉండబోతోందని చాట్‌జీపీటీ ప్రశ్నించింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, మరింత సమర్థులు అవసరమని గేట్స్ బదులిచ్చారు. ఈ విషయంలో కృత్రిమ మేధ వంటి టెక్నాలజీ సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో నైపుణ్యాలున్న మానవ వనరులను తయారు చేసుకోవచ్చన్నారు. అనంతరం, ‘‘కాలచక్రంలో మీరు యువకులుగా ఉన్న రోజుల్లోకి, అంటే మీ కెరీర్ ప్రారంభంలో ఉన్న నాటికి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు?’’ అంటూ చాట్‌జీపీటీ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. అతిగా ఆలోచించడం మాని వర్తమానంలో జీవించేందుకు మరింతగా ప్రయత్నిస్తామంటూ వారిద్దరూ అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు! ‘‘కెరీర్ ఆరంభంలో చాలా ఏళ్ల పాటు వీకెండ్స్, సెలవులంటే నాకు పెద్దగా ఇష్టముండేది కాదు. ఎక్కువగా ఆలోచించేవాన్ని. కష్టపడి పని చేసేవాన్ని. కానీ, అంత అతిగా శ్రమించడం అవసరం లేదని ఇప్పుడు భావిస్తున్నా’’ అని గేట్స్ చెప్పారు. దానితో రిషి కూడా ఏకీభవించారు. ‘‘మాది బ్రిటన్‌కు వలస వచి్చన కుటుంబం. కనుక బాగా పనిచేసి అన్నింటా ముందంజలో ఉండాలని అప్పట్లో ఎంతో ప్రయతి్నంచేవాడిని. కానీ గతంలోనూ, భవిష్యత్తులోనూ కాకుండా వర్తమానంలోనే జీవించాలని క్రమంగా తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. -
క్రిప్టోకరెన్సీపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వంటి క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌లు బూటకమని కొట్టిపారేశారు. గతంలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులని అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని..ఎవరో నిర్ణయించిన రేటుకు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పారేశారు. అయితే తాజా బిల్ గేట్స్ వ్యాఖ్యలు క్రిప్టో మార్కెట్లో సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరవ్వగా..గేట్స్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కాలిఫోర్నియా బర్కిలీ టెక్ క్రంచ్ కార్యక్రమంలో గేట్స్ ఎన్ఎఫ్టీలపై మాట్లాడుతూ " కోతుల ఖరీదైన డిజిటల్ చిత్రాలు ప్రపంచాన్ని మెరుగుపరుస్తాయి" అని వ్యంగ్యంగా అన్నారు. 2015లో తాను ప్రారంభించిన క్లైమేట్ ఫోకస్డ్ ఫండ్, బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌కు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు అవసరమయ్యే రసాయనాలు, ఉక్కు ఉత్పత్తి వంటి పరిశ్రమలలో పనిచేయడానికి సిలికాన్ వ్యాలీ ఇంజనీర్లను నియమించుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు గేట్స్ తెలిపారు. బిట్ కాయిన్ ఢమాల్ బిట్‌కాయిన్ సోమవారం 15% కంటే ఎక్కువ పడిపోయింది. మంగళవారం సైతం 5.4శాతం నష్టపోయింది. అయితే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోవడానికి అమెరికా ద్రవ్యోల్భణంతో ఇతర అంశాలు అందుకు కారణమని తెలుస్తోంది. క్రిప్టోతో పాటు బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్ (బీఏవైసీ)తో సహా ప్రసిద్ధ ఎన్ఎఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
ప్రపంచానికే పాఠాలు!
భారతదేశ శక్తి సామర్థ్యాలు, అది సాధించిన ఘనత నన్ను ఎంత గానో ఆకట్టుకున్నాయి. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఉప ఖండం అత్యంత క్లిష్టమైన సమ యంలో ఆరోగ్య సవాళ్లను అధిగ మించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్-19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. ఇప్పటివరకూ దేశంలో 75 శాతా నికి మించి పెద్ద వాళ్లకు సింగిల్ డోస్, 31 శాతం మందికి పైగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇందులో 48 శాతానికి మించి మహిళలున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్మూలించడంలో భారత్ టీకా కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది. భారత్ సాధించిన విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి. మొదటిది-పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పనిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం డిసెంబరు 2021 నాటికి అర్హులైన పెద్దవాళ్లందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి నాయకత్వాల వరకూ ప్రధాని ఇచ్చిన లక్ష్యానికి స్పందించి పని చేస్తున్నారు. 2020 లోనే హై పవర్ కమిటీలు వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. రెండోది– దేశానికి ఉన్న సుదీర్ఘ అను భవం, అవగాహన, మౌలిక వసతులను ఉప యోగించుకుని కోవిడ్‌పై పోరాటానికి ప్రచారం చేసింది. భారతదేశపు రోగనిరోధక కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య కార్య క్రమాల్లో ఒకటి. ఏటా 2 కోట్ల 70 లక్షలమంది నవజాత శిశువులకు, 1 నుంచి 5 ఏళ్ల మధ్య ఉండే 10 కోట్ల మంది చిన్నారులకు బూస్టర్ టీకా డోసులు ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 వేల కోల్డ్ చెయిన్ సదుపాయాలు న్నాయి. మహమ్మారి సమయంలో, ఈ మౌలిక సదుపాయాలే కీలకంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,48,000 ప్రభుత్వ, 28,000 ప్రైవేటు సెంటర్లు కోవిడ్ టీకాలు వేస్తున్నాయి. దీంతోపాటు 23 లక్షల మంది ఆశా, అంగన్వాడీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు అందరికీ చేరేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడోది– వాస్తవానికి మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతోంది. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందిస్తోంది. భారతదేశంలోని టీకా ఉత్పత్తిదారులైన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో–ఈ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నందుకు మా ఫౌండేషన్ కూడా ఎంతో గర్వపడుతోంది. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాగ్జిన్ ద్వారా భారతీయులను కోవిడ్ నుంచి కాపాడుకుంటున్నాం. మేం కూడా ‘జీఏవీఐ’తో కలిసి సీరమ్‌లో కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచేందుకు సహకరించాం. ఇంకా కొన్ని అను మతులు రావాల్సి ఉంది. వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద, మధ్య తరగతి దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాలుగోది– భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో మానిటర్ చేయడం కూడా విజయవంతం కావ డానికి మరో కారణం. కోవిన్ ఓపెన్ సోర్స్ ఫ్లాట్‌ఫాం ద్వారా ట్రాక్ చేయడంతో పాటు, షెడ్యూలింగ్ చేయగలిగారు. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు కూడా ఆన్లైన్ ద్వారా అందించారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ ధోరణులను విశ్లేషించగలిగారు. ఈ ప్రక్రియను దేశంలోని ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు కూడా విస్తరించడానికి అవకాశాలున్నాయి. ఐదవది-ఏ ప్రజారోగ్య కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకం. గతంలో పోలియో నిర్మూలనా కార్య క్రమం విజయవంతం చేసిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని సమీకరించడంపై దృష్టి పెట్టాయి. స్థానికంగా ప్రభావితం చేయ గలిగే వ్యక్తులు, సంస్థలను భాగస్వామ్యం చేశాయి. డిజిటల్ స్ట్రాటజీ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలను ఉత్సాహపరిచి డిమాండ్ సృష్టించారు. వ్యాక్సిన్ ఉత్పవాలు, మహోత్సవాల పేరుతో ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది ప్రజలకు టీకాలు అందేవరకూ మహమ్మారి మన వెనకే ఉందన్న విషయం మరిచిపోరాదు. నిరుపేద దేశాల్లో 3 శాతం లోపు ప్రజలకే ఇప్పటికి టీకా చేరువైంది. అదీ సింగిల్ డోస్ మాత్రమే. ఇంకా భారీ సంఖ్యలో వేగంగా టీకాలు ఉత్పత్తి చేయా ల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ విషయంలో ముందుంది. వ్యాక్సిన్ మైత్రి, కొవాక్స్ రూపంలో పేద దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇండియా ఒక ఆశ కల్పించింది. సంక్షోభ సమయాల్లో దేశాలు ఏం చేయగలవో చేసిచూపింది. బలమైన నాయకత్వం, ఆరోగ్య రంగంలో నిలకడగా పెట్టుబడి పెట్టడం, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, తమ ప్రజలను అనారోగ్యం నుంచి కాపాడుకోవాలన్న ఆశయం కనిపించాయి. గడిచిన 18 నెలల్లో జరిగిన విషాదాలను, కష్టాలను తలుచుకుని బాధపడి ఏమీ చేయలేము. కానీ రానున్న 18 నెలలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండగలమని నిరూపించాలి. బిల్ గేట్స్ కో–చైర్పర్సన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ -
పర్లేదు.. కాస్త బద్దకం అలవరుచుకోండి.. ‘లేజీ డే’ ముచ్చట్లు!
అందరివీ బిజీబిజీ గజిబిజి జీవితాలు.. ఉన్న 24 గంటలూ సరిపోనంతగా ఉరుకులు పరుగులు పెడుతుంటాం.. మరి కొందరేమో సోఫాలోనో, బెడ్ మీదనో గంటలు గంటలు అలా గడిపేస్తారు. అయితే పని తప్పించుకోవడం, లేకుంటే ఎలాగోలా త్వరగా పూర్తిచేసి మళ్లీ ‘రెస్ట్ మోడ్’లోకి వెళ్లిపోవడమే వారి పని. బద్ధకం, సోమరితనం, మందకొడితనం.. ఇలా ఎలా పిలిచినా సరే.. లేజీనెస్ ఎంతో కొంత మంచిదేనట. దాని ప్రయోజనాలు దానికీ ఉన్నాయట. మరి ఈ మంగళవారం (ఆగస్టు 10) ‘లేజీ డే’ నేపథ్యంలో.. ఈ లేజీ క్రేజీ ముచ్చట్లేంటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉరుకులు.. పరుగుల నుంచి.. ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్న.. ‘టు–డు’ లిస్టుల బతుకులు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్’ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్ ‘రిపేర్’ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్’ అలవర్చుకోవాలని చెప్తున్నారు. 8 విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేస్తుంటారని.. అక్కడ నిజంగా విశ్రాంతి ఎక్కడుంటుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ‘లేజీనెస్’ అంటే.. ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి.. మీకు నచి్చన ఫుడ్ తిని, మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్ మీదో బద్ధకంగా పడిపోవడం అని చెప్తున్నారు. ‘సోమరితనం’ కూడా చికిత్సనే.. బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని.. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కానీ లేజీగా గడపడం కోసం.. సమయం వృధా చేస్తున్నామనే ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు మీ గురించి మీరు తీసుకునే శ్రద్ద.. రేపటి మీ జీవితంపై శ్రద్ధకు తోడ్పడుతుందని అంటున్నారు. పరిమితి దాటితే ప్రమాదం.. లేజీగా ఉండాలన్నారు కదా అని.. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. ఇది ఒకస్థాయి దాటితే జీవితంలో మనకు అవసరమైన వాటిపైనా నిర్లక్ష్యం చేసే దశకు చేరుతామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల దురలవాట్లకు కారణాల్లో సోమరితనం ఒకటి. ఏదైనా సులువుగా చేయలనుకోవడం ‘లేజీనెస్’ ప్రధాన లక్షణమైతే.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డాదారిలో వెళ్లడమూ అందులో భాగమే. కేవలం ‘రీఫ్రెష్’ కావడానికి మాత్రమే లేజీనెస్‌ను పరిమితం చేయాలి మరి. లేజీ లేజీగా.. ఏం చేద్దాం? మీకు నచ్చిన ఏదో ఒక రోజును పూర్తిగా మీకు కేటాయించుకోండి. ముఖ్యంగా డబ్బు, ఇతర సమస్యలను పూర్తిగా పక్కనపెట్టండి. ఆందోళనలను పూర్తిగా వదిలేయండి. పొద్దున్నే లేవడం, అలారం పెట్టుకోవడాన్ని పక్కనపెట్టి.. మీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవండి. హాయిగా వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. సోఫాలో, బెడ్‌పై ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా సుఖంగా ఉండేలా చూసుకోండి. టీవీలోనో, ఫోన్లోనో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపండి. ఎట్లాంటి ఆలోచనలూ పెట్టుకోకండి. అలా బద్ధకంగా కూలబడి.. నచి్చన సంగీతం, పాటలు వినండి. ఫోన్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేసేయండి. వీలైతే ఆ రోజు ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టేయండి. వంట పని వంటివి కూడా పెట్టుకోవద్దు. అలాగైతే తిండి ఎలా అనే డౌట్ వద్దు. ఆ ఒక్కరోజు బయటి నుంచి నచ్చిన ఫుడ్ తెప్పించుకుని.. నచ్చినట్టుగా తినండి. ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు. లేజీ.. ముచ్చట్లు ఎన్నో.. లేజీనెస్పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న అంశాలతో రిపోర్టులు విడుదల చేశారు. మనం చురుగ్గా ఉండటానికి డోపమైన్ అనే ప్రొటీన్ కీలకం. అది మెదడును ఉత్తేజపరుస్తుంది. కానీ కొందరిలో మెదడులోని డోపమైన్ గ్రాహకాల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో వారు ఎంతగా ప్రయత్నించినా యాక్టివ్‌గా ఉండలేకపోతారు. స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు దీనికి మందు రూపొందించే పనిలో ఉన్నారు. ఎవరైనా లేజీగా ఉండిపోతే.. మెదడు రెగ్యులర్ యాక్టివిటీని ఆపేసి, పగటికలలు, సృజనాత్మక అంశాలపై దృష్టిపెడుతుందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. చిత్రమేమిటంటే ఆ సమయంలో మెదడులో యాక్టివ్‌గా ఉండే భాగమే.. మనం మన భవిష్యత్తుపై ఆలోచనలు కూడా చేస్తుందని వెల్లడించారు. లేజీగా ఉండేవారు సమస్యలను పరిష్కరించడానికి సులువైన మార్గాలను వెతుకుతారని పరిశోధకులు నిరూపించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘పెర్ల్’ను రూపొందించిన లారీ వాల్ కూడా ఇదే చెప్పారు. ప్రోగ్రామ్‌ల కోసం వేల లైన్ల కోడ్ రాయాల్సి ఉంటుందని.. అదే లేజీగా ఉండేవారు తక్కువ లైన్లలో ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇది అనారోగ్య సమస్య కాదు సోమరితనం అనారోగ్య సమస్య అని చాలా మంది అనుకుంటారని.. ఆ ఆలోచనే తప్పు అని ‘కాంటెంపరరీ సైకోఅనలైసిస్ గ్రూప్’కు చెందిన సైకాలజిస్టు లారా మిల్లర్ తెలిపారు. ఇతరుల్ని తప్పుపట్టడానికి దీన్ని వాడతారన్నారు. కొందరు లేజీగా కనిపించడానికి చదువు, పని, ఏదైనాగానీ తమ వల్ల కాదేమోనన్న భయం అందుకు కారణమవుతుందని వివరించారు. ఏదైనా కోల్పోవడం, కోల్పోతామన్న భయం, ఓటమి, డిప్రెషన్ వంటివి లేజీనెస్‌కు దారితీస్తాయని.. మనసులో గట్టిగా కోరుకుంటే సులువుగా బయటపడొచ్చన్నారు. నేనైతే లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటా! ‘ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను అలాంటివారే గుర్తించగలరు..’ – మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చదవండి: గిన్నిస్ రికార్డు పసికందు.. శ్రమించి ఊపిరి నిలిపిన డాక్టర్లు -
ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్టీ–ఇన్ నోటీసు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్టీ–ఇన్ స్పందించింది. -
27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ మూడో వీడియో కాన్ఫరెన్స్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో ప్రధాని ఈ నెల 24వ తేదీన వీడియో లింక్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామిత్వ పథకాన్ని ప్రారంభించడంతోపాటు ఈ–గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నారని అధికార వర్గాలు వెల్ల డించాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని గ్రామీణ ప్రాంతాల్లోని నివాస ప్రాంతా న్ని గుర్తించడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ ప్రశంసలు దేశంలో కరోనాæ వ్యాప్తిని అడ్డుకు నేందుకు లాక్డౌన్ విధించడంతో పాటు పరీక్షలు విస్తృతంగా చేపట్టడం వంటి చర్యలను అమలు చేస్తున్న మోదీపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్తూ ఆయన ప్రధానికి లేఖ రాశారని అధికార వర్గాలు తెలిపాయి. -
బిల్‌గేట్స్ సంపద@ 100 బిలియన్ డాలర్లు
న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. ఈ మార్కుకు చేరుకున్నవారు ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరే. వారిలో ఒకరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కాగా.. రెండో వ్యక్తి బిల్‌గేట్స్ మాత్రమే. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. అయితే బిల్‌గేట్స్ 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి కాదు. 1999లో గేట్స్ ఆస్తి 100 బిలియన్ డాలర్లను దాటింది. అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో కొంతమేర తగ్గింది. గేట్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మరో వ్యక్తి బెజోస్. ఆయన ప్రస్తుత సంపద 145.6 బిలియన్ డాలర్లు. అయితే ఈ ఘనత వీరికి ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. గేట్స్ ఫౌండేషన్ కోసం ఇప్పటికే బిల్‌గేట్స్ 35 బిలియన్ డాలర్లకుపైగా విరాళమిచ్చారు. తన సంపదలో సగాన్ని గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఆస్తులు తగ్గే అవకాశముంది. ఇక బెజోస్ తన భార్యకు భరణం కింద ఆయన ఆస్తుల్లో కొంత ఇవ్వనున్నారు. -
బిల్‌గేట్స్ వింత పని!
బీజింగ్: పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బిల్‌గేట్స్ వింత పని చేశారు. మానవ వ్యర్థాన్ని ఓ గాజు సీసాలో సదస్సు వేదికపైకి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ బీజింగ్‌లో ‘రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్పో’ పేరుతో పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మానవ వ్యర్థాల జాడీతో వేదికపైకి చేరుకుని మాట్లాడుతూ.. ‘ఆరోగ్యం, తినడానికి కావాల్సినంత ఆహారం.. ఒక మనిషికి కావాల్సింది ఇది మాత్రమే కాదు. ఈ జాబితాలో పరిశుభ్రమైన మరుగుదొడ్లను కూడా చేర్చాలి. ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవు. చైనా అధినేత షీ జిన్‌పింగ్ ప్రారంభించిన ‘టాయిలెట్ విప్లవం’తో దేశంలో పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగైంది. ఈ పథకం అద్భుతం’ అని తెలిపారు. -
మరోసారి ఆర్థిక సంక్షోభంలో అమెరికా
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందట. 2008లో ఎదుర్కొన్న సంక్షోభం మాదిరే మళ్లీ తలెత్తే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తెలిపారు. ఇటీవల జరిగిన ''ఆస్క్ మి ఏనీథింగ్(నన్నేమైనా అడగండి)'' అనే కార్యక్రమంలో బిల్‌గేట్స్ ఈ విషయాన్ని తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిది సమీప భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నదా? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బిల్‌గేట్స్.. అవును అని చెప్పడం కష్టమే అయినప్పటికీ అలాంటి సంక్షోభం తలెత్తడం తథ్యమని హెచ్చరికలు జారీచేశారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలు అమెరికన్ ప్రజలు కోల్పోయారు. అమెరికా ప్రజల నికర సంపద కూడా 19 ట్రిలియన్ డాలర్లకు పైగా(19 లక్షల కోట్ల డాలర్లు) హరించుకుపోయింది. గృహాలు లేనివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని గేట్స్ చెప్పినప్పటికీ, ఇన్నోవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్ని నుంచి బయటపడటం సాధ్యమవుతుందని గేట్స్ చెప్పారు. -
గేట్స్ ఫ్యూచర్ సిటీ
-
ఏపీతో కలసి పనిచేస్తాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రకటించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. అందుకే ఆ రంగం అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహకారాన్ని అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖలో మూడురోజులు జరిగిన అగ్రిటెక్ సదస్సు ముగింపు సమావేశానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా సాగు విధానాలు, పంటలు మార్పు చెందాలని ఆకాంక్షిం చారు.భూమికి చెందిన పూర్తి సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం చిన్న కమతాల రైతుల వద్ద ఉంటే అతి తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చని, వ్యాపారులతో నేరుగా సంప్రదించి ఆదాయాన్ని సమకూర్చుకోగలరని, ప్రపంచ బ్యాంక్ సహకారంతో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇటువంటి కార్య క్రమాలను పలు దేశాల్లో చేపట్టిందని వివరించారు. భారత్‌లో విత్తన కంపెనీలు రాజీపడుతున్నాయి అమెరికా యూరప్‌లలో వెయ్యి రకాల విత్తనాలు అభివృద్ధి చేస్తే అన్ని పరీక్షలూ చేసి రైతులకు అత్యుత్తమైన వాటినే అందిస్తారని బిల్‌గేట్స్ చెప్పారు. కానీ భారత్ వంటి దేశాల్లో విత్తన కంపెనీలు లాభాల కోసం నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు మంచి విత్తనాలు అందేలా పాలకులు చూడాలన్నారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని బిల్‌గేట్స్ చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు. లాభసాటి వ్యవసాయానికి సహకరించండి: సీఎం సమావేశంలో తొలుత మాట్లాడిన సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సహకారం అందించాలని బిల్‌గేట్స్‌ను కోరారు.ఏపీని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, దీనిపై వేస్తున్న కమిటీకి తానే చైర్మన్‌గా ఉంటానని, గౌరవాధ్యక్షులుగా ఆ కమిటీకి గేట్స్ వ్యవహరించాలని కోరారు. అగ్రిటెక్ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 259 కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ లూ వచ్చాయని చంద్రబాబు వివరించారు. -
మళ్లీ బిల్‌గేట్స్‌ను దాటేశారు, కుబేరుడిగా నిలిచారు
న్యూయార్క్ : ప్రపంచపు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మరోసారి మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను దాటేశారు. బిల్‌గేట్స్‌ను దాటేసి జెఫ్ బెజోస్ ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు. అమెజాన్ అంచనాలకు మించి మూడో క్వార్టర్లో ఫలితాలను ప్రకటించడంతో, ఈ కంపెనీ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 11.9 శాతం పైకి ఎగిశాయి. దీంతో ఆయన నికర సంపదకు మరో 900 మిలియన్ డాలర్లు అదనంగా చేకూరి, మొత్తంగా 90.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బిల్‌గేట్స్ సంపద 90.1 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం బిల్‌గేట్స్‌ను బెజోస్ అధిగమించడం ఇదేమీ తొలిసారి కాదు. జూలైలో కూడా అమెజాన్ షేర్ ధర భారీగా ఎగియడంతో, బిల్‌గేట్స్ సంపదను ఆయన దాటేసి ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు. ఆరు నెలల క్రితం వారెన్ బఫెట్‌ను దాటేసి బెజోస్ ప్రపంచపు రెండో అతిపెద్ద ధనికవంతుడిగా చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది బెజోస్ తన సంపదను 10.2 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు. 1998లో ఫోర్బ్స్ 400లో తొలిసారి బెజోస్ చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాదిలో అమెజాన్ ఫౌండర్ నికర సంపద 1.6 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఈ క్వార్టర్లో ప్రైమ్ డే ప్రమోషన్, హోల్ ఫుడ్ మార్కెట్ స్టోర్స్ కొనుగోళ్లతో అమెజాన్ తన లాభాలను భారీగా పెంచుకుంది. -
బిల్‌గేట్స్‌ను బీట్‌చేసిన అమెజాన్ ఫౌండర్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టేశారు. ప్రపంచపు అత్యధిక ధనవంతుడిగా జెఫ్ బెజోస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ స్టాక్ ధరలు గురువారం మార్కెట్ ప్రారంభంలో 1.6 శాతం మేర పైకి జంప్ చేయడంతో జెఫ్ బెజోస్‌కు అదనంగా 1.4 బిలియన్ డాలర్ల అదృష్టం కలిసి వచ్చింది. దీంతో ఆయన సంపద 90 బిలియన్ డాలర్లను మించిపోయిందని బ్లూమ్‌బర్గ్, ఫోర్బ్స్ రిపోర్టు చేశాయి. 2013 మే నుంచి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ల ఇండెక్స్‌లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్సే అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ తొలిసారి జెఫ్ బెజోస్ ఆయన్ను అధిగమించారు. బుధవారం మార్కెట్ ముగింపుకు బిల్‌గేట్స్ సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. బెజోస్ ఆయనకు దగ్గరగా 89 బిలియన్ డాలర్లకు వెళ్లారు. గురువారం మార్కెట్ ప్రారంభంలోనే అమెజాన్ షేర్లు శరవేగంగా దూసుకెళ్లడంతో, బిల్‌గేట్స్ సంపదకు మించి, బెజోస్ సంపద 90 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అమెజాన్.కామ్‌లో బెజోస్‌కు 80 మిలయన్ షేర్లున్నాయి. ఇటీవలే తమ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ను ఆవిష్కరించారు. 2017 జూన్‌లో గ్రోసరీ చైన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ రిటైలర్ను కూడా అమెజాన్ దక్కించుకుంది. దీంతో అమెజాన్ మార్కెట్లో దూసుకెళ్తోంది. గత 30 ఏళ్లుగా కూడా బెజోస్ ప్రపంచపు ధనికవంతుల్లో ఆరోవ్యక్తిగా నిలిచేవారు.