మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్‌ఎఫ్‌టీ) వంటి క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌లు బూటకమని కొట్టిపారేశారు. గతంలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులని అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని..ఎవరో నిర్ణయించిన రేటుకు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పారేశారు. అయితే తాజా బిల్ గేట్స్ వ్యాఖ్యలు క్రిప‍్టో మార్కెట్‌లో సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరవ్వగా..గేట్స్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"కాలిఫోర్నియా బర్కిలీ టెక్ క్రంచ్ కార్యక్రమంలో గేట్స్ ఎన్‌ఎఫ్‌టీలపై మాట్లాడుతూ " కోతుల ఖరీదైన డిజిటల్ చిత్రాలు ప్రపంచాన్ని మెరుగుపరుస్తాయి" అని వ్యంగ్యంగా అన్నారు. 2015లో తాను ప్రారంభించిన క్లైమేట్ ఫోకస్డ్ ఫండ్, బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌కు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు అవసరమయ్యే రసాయనాలు, ఉక్కు ఉత్పత్తి వంటి పరిశ్రమలలో పనిచేయడానికి సిలికాన్ వ్యాలీ ఇంజనీర్‌లను నియమించుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు గేట్స్ తెలిపారు.
బిట్ కాయిన్ ఢమాల్
బిట్‌కాయిన్ సోమవారం 15% కంటే ఎక్కువ పడిపోయింది. మంగళవారం సైతం 5.4శాతం నష్టపోయింది. అయితే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోవడానికి అమెరికా ద్రవ్యోల్భణంతో ఇతర అంశాలు అందుకు కారణమని తెలుస్తోంది. క్రిప్టోతో పాటు బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్ (బీఏవైసీ)తో సహా ప్రసిద్ధ ఎన్‌ఎఫ్‌టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment