NFT
-
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్‌లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్‌సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్‌ప్లేస్‌లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్‌కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్‌కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023 -
క్రిప్టోకరెన్సీపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వంటి క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌లు బూటకమని కొట్టిపారేశారు. గతంలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులని అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని..ఎవరో నిర్ణయించిన రేటుకు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పారేశారు. అయితే తాజా బిల్ గేట్స్ వ్యాఖ్యలు క్రిప్టో మార్కెట్లో సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరవ్వగా..గేట్స్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కాలిఫోర్నియా బర్కిలీ టెక్ క్రంచ్ కార్యక్రమంలో గేట్స్ ఎన్ఎఫ్టీలపై మాట్లాడుతూ " కోతుల ఖరీదైన డిజిటల్ చిత్రాలు ప్రపంచాన్ని మెరుగుపరుస్తాయి" అని వ్యంగ్యంగా అన్నారు. 2015లో తాను ప్రారంభించిన క్లైమేట్ ఫోకస్డ్ ఫండ్, బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌కు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు అవసరమయ్యే రసాయనాలు, ఉక్కు ఉత్పత్తి వంటి పరిశ్రమలలో పనిచేయడానికి సిలికాన్ వ్యాలీ ఇంజనీర్లను నియమించుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు గేట్స్ తెలిపారు. బిట్ కాయిన్ ఢమాల్ బిట్‌కాయిన్ సోమవారం 15% కంటే ఎక్కువ పడిపోయింది. మంగళవారం సైతం 5.4శాతం నష్టపోయింది. అయితే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోవడానికి అమెరికా ద్రవ్యోల్భణంతో ఇతర అంశాలు అందుకు కారణమని తెలుస్తోంది. క్రిప్టోతో పాటు బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్ (బీఏవైసీ)తో సహా ప్రసిద్ధ ఎన్ఎఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
మెటావర్స్ వెర్షన్లో 'విక్రమ్'.. తొలి మూవీగా రికార్డ్
Kamal Haasan Launch Metaverse Experience Of Vikram Movie: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నలుగురు సూపర్ టాలెంటెడ్ హీరోలు కలిసి నటించిన ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు. అయితే నటనతో ఆకట్టుకోవడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు కమల్ హాసన్. ఈ సినిమాను మెటావర్స్ వెర్షన్లో రిలీజ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్ఎఫ్టీలు, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మెటావర్స్ ద్వారా ఆడియెన్స్ ముందుకు వస్తున్న తొలి చిత్రంగా 'విక్రమ్' నిలవనుంది. దీనికి సంబంధించిన వివరాలను 'విస్టావర్స్' వెబ్సైట్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ వెబ్సైట్లో పోస్టర్లు, ఇంటర్వ్యూలు, లేటేస్ట్ అప్డేట్స్ తదితర అన్ని విషయాలు ఉంటాయి. చదవండి: 👇 రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ? బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ -
ఎన్టీఎఫ్లలో కేజీఎఫ్ 2 హవా
కేజీఎఫ్ సినిమాతో హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు అందులో పాత్రలకు ప్రత్యేకంగా ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో కేజీఎఫ్ 2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా నాన్ ఫంజిబుల్ టోకెన్లు, కేజీఎఫ్వెర్స్ను నిర్మాతలు అందుబాటులోకి తెచ్చారు. కేజీఎఫ్ సినిమాలో కీలకమైన ఎల్డోరాడో క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని పది వేలకు పైగా నాన్ ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) మార్కెట్లో రిలీజ్ చేయగా కేవలం గంట వ్యవధిలోనే ఐదు వందల ఎన్ఎఫ్టీ టోకెన్లు అమ్ముడయ్యాయి.ఇప్పటి వరకు రెండు వేలకు పైగా టోకెన్లు అమ్ముడైపోయాయి. వివిధ రకాలైన కళలకు డిజిటల్ రూపమే నాన్ ఫంజిబుల్ టోకెన్లు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఎన్ఎఫ్టీ లావాదేవీలు జరుగుతుంటాయి. మిగిలిన టెక్నికల్ రూపాలకంటే కూడా ఎన్ఎఫ్టీలలో భద్రత అధికం. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్లను భవిష్యత్తుల అమ్ముకోవచ్చు కూడా. కేజీఎఫ్ ఎన్ఎఫ్టీ టోకెన్లు సొంతం చేసుకున్న వారు వాటి సాయంతో కేజీఎఫ్వర్స్లోకి (మెటావర్స్)లోకి వెళ్లి వర్చువల్ 3డీ వరల్డ్‌లో కేజీఎఫ్‌లోని అద్భుతాలను చూసే అవకాశం ఉంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ విస్త్రృతమైన తర్వాత సినిమాల ప్రమోషన్లలో ఎన్ఎఫ్టీలు కూడా ఓ భాగమయ్యాయి. అమితాబ్ బచ్చన్, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు ఇప్పటికే ఈ రంగంలో అడుగు పెట్టారు. రాధేశ్యామ్ ట్రైలర్‌ని మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. ఈ పరంపరలో కేజీఎఫ్ నిర్మాతలు సైతం ఎన్ఎఫ్టీల రూపంలో ఈ కొత్త ప్రచారానికి ముందుకు రాగా మంచి స్పందన వచ్చింది. చదవండి: సింగర్ కార్తీక్ తొలి అడుగు.. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మెటావర్స్ కాన్సెర్ట్ -
యూజీసీ అకౌంట్‌కి చిక్కులు, ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ చొరబడిన హ్యాకర్లు
ప్రతిష్టాత్మక సంస్థ యూనిర్సిటీ గ్రాంట్ కమిషన్ ఖాతా హ్యాక్ అయ్యింది. ట్విట్టర్లో యూజీసీకి చెందిన అధికారిక ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూజీసీ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి డీపీ, కవర్ ఫోటోలను మార్చివేశారు. అజూకీ క్యారెక్టర్లతో డీపీ, కవర్ ఫోటోలను కొత్తగా లోడ్ చేశారు. యూజీసీ ట్విట్టర్ అకౌంట్‌కి 2,96,000ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022 ఏప్రిల్ 10న యూజీసీ ఖాతాలో వచ్చిన మార్పులు డీపీ చేంజ్ కావడం చూసిన వారు వెంటనే అప్రమత్తమయ్యారు, హ్యాకింగ్ గురించి రిపోర్టు చేశారు. సాయంత్రానికి ట్విటర్ ఖాతాను యూజీసీ రిస్టోర్ చేసుకోగలింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లుగా అజూకీ క్యారెక్టర్లు ఉన్నాయి. యూజీసీ ట్విట్టర్ ఖాతాను వశం చుసుకున్న హ్యాకర్లు ఈ ఖాతా ద్వారా అజూకీ ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ ప్రకటించారు. UGC India's official Twitter account hacked. pic.twitter.com/t37ui8KNuC — ANI (@ANI) April 9, 2022 చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..! -
సింగర్ కార్తీక్ సాహసం.. లైవ్ కాన్సెర్ట్లను కాదని..
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలెగా.... అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సెర్ట్లలో కొత్త ఒరవడికి తెర లేపారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు ఈ కాన్సెర్ట్‌లో ఆలపించిన గీతాలను నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా (ఎన్ఎఫ్టీ) మార్చి తన అభిమానులకు అందివ్వనున్నాడు. ఏప్రిల్ 14న సింగర్ కార్తీక్ నిర్వహించే మెటావర్స్ కాన్సెర్ట్ 2022 ఏప్రిల్ 14న జరగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాల్గొనాలంటే ప్రత్యేకంటా టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ. 29,000లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో క్రిప్టో చెల్లింపులతో పాటు డెబిట్, క్రెడిట్, యూపీఏ పేమెంట్స్ ద్వారా ఈ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న జూపిటర్మెటా సంస్థ ఈ కాన్సెర్ట్‌కి సంబంధించి డిజిటల్ వర్క్స్ అన్నింటీని పర్యవేక్షిస్తోంది. 45 నిమిషాలు మెటావర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై దేశంలోనే తొలిసారిగా జరగబోతున్న ఈ కాన్సెర్ట్‌లో సింగర్ కార్తీక్ తాను స్వయంగా బాణీకట్టి ఆలపించిన గీతాలను పాడబోతున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ కాన్సెర్ట్ కొనసాగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాడిన గీతాలలో రెండు పాటలను వీక్షకులకు ఎన్ఎఫ్టీలుగా అందివ్వనున్నారు. ఇక ఈ మెటావర్స్ కాన్సెర్ట్‌లో పాల్గొనే వారికి చేతులు ఊపడం, చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం వంటి అన్ని పనులు చేస్తూ ప్రత్యక్ష అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మెటావర్స్ ? ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ మేథ నుంచి పుట్టిన మరో అద్భుతం మెటావర్స్. ఎక్కడెక్కడో ఉన్న జనాలు తమ ముందున్న ఫోన్ల ద్వారానే ఒకే చోట ఉన్నట్టుగా అనూభూతి కలిగించడమే సింపుల్‌గా మెటావర్స్‌గా పేర్కొనవచ్చు. అంటే మీరు మీ ఇంట్లో ఉంటూనే లైవ్ కాన్సెర్ట్‌లో ప్రత్యక్షంగా భాగం అయ్యే ఛాన్స్ మెటావర్స్ కలిగించనుంది. అందరికీ సాధ్యమేనా? మెటావర్స్, ఎన్ఎఫ్టీ కాన్సెప్టులు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రాధేశ్యామ్ ట్రైలర్ సైతం మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. అంతకు ముందు సింగర్ దలేర్ మెహందీ 2022 జనవరి 26న ఇండియాలోనే ఫస్ట్మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించారు. అయితే మెటావర్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మెటావర్స్ అనుభూతి పొందేందుకు అవసరమైన స్పీడ్ ఇంటర్నెట్, వివిధ రకాలైన సెన్సార్లు కలిగిన ఫోన్లు, వీఆర్ హెడ్ సెట్ తదితర విషయాలు మరింత మెరుగు కావాల్సి ఉంది. చదవండి: డేటాకు ‘మెటావర్స్’ దన్ను.. -
ఇదేం టెక్నాలజీరా బాబు.. ఆత్మనే అమ్మేస్తున్నావ్ !
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే మార్కెట్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఐస్‌క్రీం మొదలు కారు వరకు అన్ని ఈ కామర్స్ వేదికగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇప్పుడే మార్కెట్లో మరింత అడ్వాన్స్మెంట్ చోటు చేసుకుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంతో ఏకంగా ఆత్మలనే అమ్మకానికి పెడుతున్నారు. నెదర్లాండ్స్‌కి చెందిన హాగ్ ఆర్ట్ అకాడమీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థి స్టిన్ వాన్ షైక్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)గా తన సోల్ (ఆత్మ)ని అమ్మకానికి పెట్టాడు. ఓపెన్ సీ మార్కెట్ ప్లేస్‌లో సోల్ ఆఫ్ స్టైనస్ పేరుతో అమ్మకానికి సంబంధించిన వివరాలు అతడు పోస్ట్ చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆత్మనే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా నెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు ఆరా తీయగా తన ఆత్మను అమ్మేందుకు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఎన్ఎఫ్టీ రూపంలో ఉన్న తన ఆత్మను బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో క్రిప్టో చెల్లింపుల ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించాడు. ఒక్కసారి ఒప్పందం పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు ఉండవని ముందే స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని ఆత్మను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపించగా అత్యధికంగా 0.1 ఇథేరియం ( 347 డాలర్లు) వరకు ధర పలుకుతోంది. బిడ్ ముగిసే లోపు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఆత్మను కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేయవచ్చనే సందేహాన్ని కూడా అతడే నివృత్తి చేశాడు. తన ఎన్ఎఫ్టీ రూపంలో తన ఆత్మను సొంతం చేసుకున్నవారు... వారి వారి మత విశ్వాసాలకు తగ్గట్టుఉగా తన ఆత్మను పార్టులు పార్టులుగా లేదా ఏకమొత్తంగా మొక్కుగా చెల్లించుకోవచ్చని సూచిస్తున్నాడు,. అవసరమైతే ఆత్మబలిదానం(త్యాగం) చేసుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. గత రెండేళ్లుగా ఎన్ఎఫ్టీ మార్కెట్ పుంజుకుంటోంది. అమితాబ్ బచ్చన్, మహేంద్ర సింగ్ధోని వంటి వారు తమ ప్రతిభకు సంబంధించిన అంశాలను ఎన్ఎఫ్టీలుగా అమ్మకానికి పెట్టారు. రామ్ గోపాల్ వర్మ్ సైతం డేంజరస్ సినిమాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అందుబాటులో ఉంచారు. అయితే వీటన్నింటీని బీట్ చేస్తూ నెదర్లాండ్ స్టూడెంట్ ఏకంగా ఆత్మనే అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు. చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..! -
భారీ ధరకు అమ్ముడైన నెల్సన్ మండేలా అరెస్టు వారెంట్ ఎన్ఎఫ్టీ..!
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత & మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు మండే. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. అరెస్టు వారెంట్‌కు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను ఎన్ఎఫ్టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది. ఈ నెల్సన్ మండేలా ఎన్ఎఫ్టీని ఒక వ్యక్తి 1,30,000(రూ.99 లక్షలు) డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్టీ విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విశేషాలను సంరక్షించే లిల్లీస్ లీఫ్ మ్యూజియం హెరిటేజ్'కు అందజేయనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినందుకు 1962లో అతన్ని అరెస్టు చేశారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఇతను ఒకరు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు. 2004లో మండేలా ఒరిజినల్ అరెస్టు వారెంట్ డాక్యుమెంట్‌ను దాతలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం డాక్యుమెంట్ ఎన్ఎఫ్టీని సొంతం చేసుకున్న వ్యక్తి దీని ఒరిజినల్ డాక్యుమెంట్‌ను చూసేందుకు అనుమతి ఉంటుంది. గత సంవత్సరం తోటి స్వాతంత్ర్య సమరయోధుడు ఒలివర్ టాంబోకు చెందిన ఓ 'పెన్ గన్' ఎన్ఎఫ్టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేయడం వల్ల మ్యూజియంకు సుమారు 50,000 డాలర్లు వచ్చాయి. కోవిడ్ కారణంగా పర్యాటకం పరిశ్రమ వల్ల భారీగా ఆదాయం పడిపోయింది. దీంతో గొప్ప కట్టడాలు, మ్యూజియం నిర్వహణ కష్టసాద్యం అవుతుంది. అయితే, ఎన్ఎఫ్టీ వేలం ద్వారా వచ్చిన డబ్బు వల్ల వీటి నిర్వహణ భారం కొద్దిగా తగ్గుతుంది. (చదవండి: నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!) -
క్రిప్టోల్లో ట్రేడ్ చేస్తే.. ఐటీకి సమాచారం
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్టీలు)లో లాభాలు సంపాదించి.. రిటర్నుల్లో ఆ విషయాన్ని వెల్లడించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఎందుకంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీలను 30 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ 2022–23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేర్చడం తెలిసిందే. దీని ప్రకారం క్రిప్టో లావాదేవీల్లో వచ్చిన లాభంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఈ లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులే స్వయంగా తమ రిటర్నుల్లో వెల్లడించేవారు. స్వయంగా కోరి తీసుకుంటే తప్ప ఆదాయపన్ను శాఖకు ఆ లావాదేవీల వివరాలు ఇప్పటి వరకు తెలిసేవి కావు. కానీ, ఇక మీదట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల మాదిరే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు కూడా ఆటోమేటిగ్గా ఆదాయపన్ను శాఖకు వెళ్లనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం అన్ని బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లను వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలను నివేదించాలని కోరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లకు ఈ ఆదేశాలు వెళితే.. అనంతరం క్రిప్టోలు, ఎన్ఎఫ్టీ లావాదేవీల వివరాలు ఇన్వెస్టర్ల పాన్ నంబర్ ఆధారంగా ఆదాయపన్ను శాఖకు చేరతాయి. అవి వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ప్రతిఫలిస్తాయి. ఏఐఎస్ అన్నది 46 ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన రిపోర్ట్. ప్రతీ పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి దీన్ని పొందొచ్చు. రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఏఐఎస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. లీకేజీలకు చెక్..: వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు సైతం ఏఐఎస్‌లో చేరితే.. వాటిని ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు, పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖకు వెసులుబాటు ఉంటుంది. ‘‘ఒక్కసారి పన్ను నిబంధనలు అమల్లోకి వస్తే.. డిజిటల్ అస్తుల లావాదేవీల వివరాలను సైతం నిర్ధేశిత ఆర్థిక లావాదేవీల (ఎస్ఎఫ్టీలు) మాదిరే నివేదించాలని కోరొచ్చు’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ఎస్‌ఎఫ్‌టీలన్నవి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి చేసిన లావాదేవీలు, పెట్టుబడుల వివరాలకు సంబంధించినది. క్రిప్టోకరెన్సీ కఠిన పన్ను నిబంధనలు క్రిప్టోకరెన్సీలపై పన్ను నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం గురువారం ప్రతిపాదించింది. ఈ దిశలో ఫైనాన్స్ బిల్లుకు సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. లోక్‌సభ సభ్యులకు ఈ మేరకు ఫైనాన్స్ బిల్లు, 2022కి సవరణ బిల్లు సర్క్యులేట్ అయ్యింది. వర్చువల్ డిజిటల్ ఆస్తుల నష్టాలపై పన్ను ప్రయోజనాలు పొందడాన్ని సవరణలు నిరోధిస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ మేనియా...అప్పుడెమో థియేటర్ల పేరు..ఇప్పుడు సరికొత్తగా..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో మార్చి 25న రిలీజ్‌కానున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భారత్‌లోని అతిపెద్ద థియేట్రికల్ ఎగ్జిబిటర్ పీవీఆర్ తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్‌చైయిన్ టెక్నాలజీను అందిపుచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ ఎన్ఎఫ్టీ..! తొలిసారిగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్) కలెక్షన్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ ప్రకటించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్, పీవీఆర్ సంయుక్తంగా ఈ డిజిటల్ ఎన్ఎఫ్టీలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనుంది. ఎస్ఎస్ రాజమాళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్ సంతకం చేసిన పోస్టర్లు, సినిమాలో వాడిన పలు వస్తువులతో సహా దాదాపు 300పైగా ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిజిటల్ కలెక్షన్లను పీవీఆర్ నిర్వహించే పోటిలో వీటిని ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చునని పీవీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా పాత చిత్రాలను కూడా ఎన్ఎఫ్టీ కలెక్షన్ల రూపంలో అందించేందుకు సిద్దమని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ చెప్పారు. పీవీ‘ఆర్ఆర్ఆర్’..! గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టమ్ పీవీఆర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలయ్యే వరకు PVR సినిమాస్ PVRRR గా కనిపిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి డీల్ ను సెట్ చేయలేదు. చదవండి: టిక్కెట్ రేట్ల పెంపే కాదు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి మరో శుభవార్త! -
ఘోస్ట్ సినిమా షూటింగ్లో నాగార్జున
-
అమితాబ్, సచిన్, ధోని బాటలో నాగార్జున ! ఈ చర్చలు అందుకేనా?
ఒకప్పుడు సినిమా తెరపై సైకిల్ చెయిన్ తెంపి నాగార్జున సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ సైకిల్ చెయిన్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఇప్పుడు నాగార్జున కొత్తగా బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త ఇంట్రెస్ట్ ఫ్యూచర్లో ఏ సంచలనాలకు కేంద్రం కానుందో.... వెండితెర హీరోగానే కాదు సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో పేరుంది. కొత్త టాలెంట్‌ని పట్టుకోవడంలో భవిష్యత్తుని సరిగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడంలో ‘కింగ్’ని దిట్టగా చెప్పుకుంటారు. మరోసారి నాగార్జున తన ఇమేజ్‌కి తగ్గట్టుగా కొత్త స్టెప్ వేయబోతున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ! స్పెషల్ మీటింగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా షూటింగ్లో భాగంగా నాగార్జున ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. నాగార్జునతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, విదేశీయులు పోటీ పడ్డారు. అయితే దీనికి భిన్నంగా నాగార్జునానే ఓ వ్యక్తితో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు ఆ వ్యక్తి ప్రత్యేకతలను చెబుతూ ఏకంగా ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది. ఫ్యూచర్ టెక్నాలజీ దుబాయ్‌లో షూట్లో ఉన్న నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఫుల్‌క్రేజ్ ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సర్వీస్ అందిస్తున్న ఓఎక్స్ పాలిగాన్ సంస్థ కో ఫౌండర్ సందీప్ నైల్వాల్ని కలిశారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇతర ఫ్యూచర్ టెక్నాలజీలపై చర్చించామని నాగార్జున స్వయంగా తెలిపారు. It was nice to meet and chat with @sandeepnailwal Co-founder @0xPolygon !!the man who put india on the world map of blockchain and talk about future tech!! Godbless🙏 pic.twitter.com/kRbSpczyeM — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2022 ఎవరీ సందీప్ ముంబైకి చెందిన సందీప్ నైల్వాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకి వచ్చాక ఏంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత డెలాయిట్, వెల్స్పన్ సంస్థల్లో పని చేశారు. 2017లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేసే మాటిక్ సంస్థను స్థాపించాడు. అనంతరం 2019లో దాన్ని ఓఎక్స్పాలిగాన్గా మార్చాడు. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ఇండియా క్రిప్టో కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశీ క్రిప్టో అడ్డా ఇండియాకు సంబంధించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, ఈథేరియం లావాదేవీలు, బినాన్స్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవహరాలకు ఈ సంస్థ పెట్టింది పేరు. ఈ సంస్థ యూజర్ బేస్‌లో మూడు లక్షల మంది క్రిప్టో ట్రేడర్లు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో 27 బిలియన్ డాలర్ల విలువైన ఈథేరియమ్, బినాన్స్, స్మార్ట్చైయిన్ లావాదేవీలను నిర్వహించింది. బ్లాక్‌చెయిన్ బాట పట్టిన సెలబ్రిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్మేన్లు, సినిమా పర్సనాలిటీస్, స్పోర్ట్స్ ఐకాన్స్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వ్యక్తులు ఇప్పటికే క్రిప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేయగా సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోని వంటి మూవీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లను రిలీజ్ చేస్తున్నారు. కింగ్ మదిలో ఏముందో ? ఈ నేపథ్యంలో నాగార్జున సందీప్ నైల్వాల్ని కలుసుకోవడం బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున త్వరలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టవచ్చంటూ కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు ఎన్ఎఫ్టీలు తీసుకు రావచ్చని అనుకుంటున్నారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుకి సంబంధించిన సినిమా విశేషాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన బ్లాక్‌చెయిన్ గురించి నాగార్జున తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: ఎన్ఎఫ్టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు! -
'దగ్గుబాటి రానాకి జాక్ పాట్'!!
ప్రముఖ హీరో దగ్గుబాటి రానా జాక్ పాట్ కొట్టేశారు. రానా కో- ఫౌండర్‌గా ఉన్న ఐకాన్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మార్క్ జుకర్ బెర్గ్, బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌లు క్యూ కట్టారు. ఇదే విషయంపై రానా సంతోషం వ్యక్తం చేశారు. 2021 ఆగస్ట్‌లో రానా అతని స్నేహితులు ఐకాన్జ్ అనే సంస్థను ప్రారంభించారు. డిజిటల్ ఆస్తుల నిర్వహణ, డిజిటల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ), ఎన్ఎఫ్టీలను మెటావర్స్లలో మానిటైజ్ చేయడంలో సహాయపడే ఒక ప్లాట్‌ఫారమ్. ఇప్పుడు ఈ సంస్థలో మార్క్ జుకర్ బెర్గ్, బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌లు నిర్వహిస్తున్న వెంచర్ క్యాపిటల్ సంస్థ 'విలేజ్ గ్లోబల్' ఐకాన్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) ఓనర్‌గా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అద్భుతమైన అవకాశాల్ని అందిస్తుంది. వాటిపై దృష్టి పెట్టడానికి అద్భుతమైన అవకాశాలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇక ఐకాన్జ్‌లో కో - ఫౌండర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే 'అమర్ చిత్ర కథ', టింకిల్, సురేష్ ప్రొడక్షన్స్ లు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ భాగస్వామిగా ఉన్నాయని దగ్గుబాటి రాణా అన్నారు. చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ! -
దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు
14 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, కమ్ బ్యాక్ అలైవ్ అనే స్వచ్చంద సంస్థలు విరాళాల సేకరణ చేపట్టాయి. కమ్ బ్యాక్ అలైవ్ అనేది ఉక్రేనియన్ ప్రభుత్వేతర ఎన్జిఓ సంస్థ. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నగదును రుస్సో-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్ మిలిటరీ, వాలంటీర్లు & వారి కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఉక్రెయిన్ పోలీసులు కూడా ఇతర దేశాల నుంచి క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. మార్చి 6న ట్విటర్ వేదికగా చేసిన పోస్టులో ఉక్రేనియన్ సైబర్ పోలీసులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి క్రిప్టోకరెన్సీలను విరాళం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు. వివిధ క్రిప్టోకరెన్సీలు అయిన బిట్ కాయిన్(బీటీసీ), ఈథర్ (ఇటిహెచ్), యుఎస్ డిటి టెటర్(యుఎస్ డిటి), ట్రాన్ (టిఆర్ఎక్స్), పాలిగాన్ (మాటిక్), బినాన్స్ ఎక్స్ఛేంజ్ టోకెన్(బిఎన్ బి)లను విరాళ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపింది. సేకరించిన క్రిప్టోకరెన్సీలను నేషనల్ పోలీస్, నేషనల్ గార్డ్, స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వినియోగిస్తామని ఉక్రెయిన్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, ఈ నిధులను ఔషధం & ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం, ఇంకా రష్యా దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తామని తెలిపింది. రష్యన్ ఆక్రమణ నుంచి బయటపడటానికి కైవ్ అధికారులు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరించడంలో విజయవంతమైంది. ఇప్పటికే బిట్ కాయిన్, ఈథర్, యుఎస్ డీటీ టీథర్, పోల్కాడాట్, డాగీకాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీల రూపంలో $60.5 మిలియన్లను సేకరించింది. ఇంకా ఉక్రెయిన్ జెండాను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేయడం ద్వారా కూడా $6.5 మిలియన్లను సేకరించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!) -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ ఓపెన్‌సీ హ్యాక్‌కు గురి అయ్యింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్టీలను కోల్పోయారని ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ $200 మిలియన్ డాలర్లు అనేది అబద్ధమని అన్నారు. దాడి చేసిన వ్యక్తి దొంగిలించిన ఎన్ఎఫ్టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. కొత్త అప్‌గ్రేడ్ వల్ల.. ఓపెన్‌సీలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఎన్ఎఫ్టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్‌కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ హ్యాకింగ్ కి సంబంధించిన వార్తలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రూ.29 వేల శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!) -
వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!
మన దేశంలో క్రిప్టోకరెన్సీకి అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తోన్న వారిలో భారత్ సుమారు 10 కోట్ల మందితో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)కు కూడా భారత్‌లో భారీ ఆదరణ లభిస్తోంది. మన దేశంలో ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, స్మృతి మంధాన, సునీల్ గవాస్కర్, భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్స్ ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఎన్ఎఫ్టీ తెచ్చేందుకు తాను కూడా సిద్దం అంటున్నారు. ఆరోన్ ఫించ్ తన ఎన్ఎఫ్టీలను విడుదల చేయడానికి అధికారికంగా లైసెన్స్ పొందిన మొదటి క్రికెట్ డిజిటల్ కలెక్టిబుల్స్ ప్లాట్ ఫామ్ రారియోతో జతకట్టాడు. ఈ ఎన్ఎఫ్టీలు రారియోలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రపంచంలోనే అధికారికంగా లైసెన్స్ పొందిన తొలి క్రికెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్ రారియోలో చాలా మంది ఇతర క్రికెటర్లకు చెందిన అనేక ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉన్నాయి. 2018లో జింబాబ్వేపై 172 పరుగులు చేసిన అత్యధిక స్కోరుతో 2013లో ఇంగ్లాండ్ పై సాధించిన తన 156 పరుగుల రికార్డును అధిగమించాడు. 2013లో ఒక ఇన్నింగ్స్‌లో ఫించ్ బాధిన 14 సిక్సర్లు ఉన్నాయి. అతను ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్, సర్రేలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియన్ వైట్-బాల్ కెప్టెన్ బీబీఎల్ ప్రారంభం నుంచి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. వీటికి సంబంధించిన వీడియోల రూపంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. "రారియో క్రికెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌తో నా ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది, ఇక్కడ మీరు నా ఎన్ఎఫ్టీలను స్వంతం చేసుకోవచ్చు" అని అన్నారు. (చదవండి: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!) -
Laya Mathikshara: ఈమెకు లక్షల్లో డబ్బు... అతడు ఏకంగా 7 కోట్లు సంపాదించాడు!
Laya Mathikshara- Non Fungible Tokens: ‘తన సెల్ఫీలు అమ్మకానికి పెట్టి కోట్లు గడించాడు’ అని ఎవరైనా అంటే– ‘అయ్యా! తమరికి నేనే దొరికానా’ అని అనుమానంగా చూసేవాళ్లే ఎక్కువ. కానీ ‘సెల్ఫీ’ కోట్లు గడించింది అనేది అబద్ధం కాదు... అతిశయోక్తి అంతకన్నా కాదు.. అద్భుతమైన నిజం.. లాక్డౌన్ సమయంలో చెన్నైకి చెందిన లయ మతిక్షర తన సోదరి దగ్గర సరదాగా పైథాన్ లాంటి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేర్చుకుంది. అలా రకరకాల సైట్లు చూస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ తన ఆర్ట్‌ను మెరుగు పరుచుకునే క్రమంలో ‘ఎన్ఎఫ్టీ’ గురించి విన్నది. ఒక ప్రయత్నం చేసి చూద్దామని రంగంలోకి దిగింది. తన ఫస్ట్ ఎన్ఎఫ్టీ ‘వాట్ ఇఫ్, మూన్ హ్యాడ్ లైఫ్?’ యానిమేటెడ్ ఆర్ట్‌వర్క్ మంచి ధరకు అమ్ముడు పోయింది. ‘మా పేరెంట్స్‌కు ఎన్‌ఎఫ్‌టీపై పెద్దగా నమ్మకం లేదు. మొదట్లో నాకు కూడా అంతే. మొదటి ఎన్ఎఫ్టీకీ మంచి ఆదరణ లభించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటుంది లయ. అంతరిక్షం, భౌతికశాస్త్రం తదితర రంగాలకు చెందిన ఆర్ట్‌లతో లక్షల్లో ఆర్జిస్తోంది. వీళ్లు కూడా సక్సెస్ కొట్టారు.. సౌత్‌లో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు కదా. ఈ క్రేజ్‌ను ‘ఎన్ఎఫ్టీ’లోకి మళ్లించి సక్సెస్ కొట్టారు చెన్నై టీన్స్ షామిల్ కరీమ్, యశ్ రాథోడ్‌లు. రజనీకాంత్ డైలాగ్స్, కబాలీ సినిమాలో ఆయన సూట్, ఏఆర్ రెహమాన్ పాటలను ‘ఎన్ఎఫ్టీ’లోకి తీసుకువచ్చి హిట్ కొట్టారు. అంతేకాదు...‘డిజినూర్’ అనే ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టి ఏవీయం ప్రొడక్షన్, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి అగ్రగామి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగారు. చండీగఢ్‌లో ఆమె సైతం.. ఇప్పుడు చెన్నై నుంచి చండీగఢ్‌కు వద్దాం... అడపాదడపా పెయింటింగ్స్ వేసే స్వర్ణాళిసింగ్కు ఎన్‌ఎఫ్‌టీపై ఆసక్తి పెరిగిన తరువాత క్రిస్టో–కమ్యూనిటీల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. తన మార్క్ ప్రతిబింబించేలా సగటు భారతీయ గృహిణి చిత్రాలను ఎన్ఎఫ్టీలోకి తీసుకువచ్చింది. పెద్దగా ప్రమోట్ చేయకపోయినా సింగ్ ‘దుర్గాదేవి’ ఎన్ఎఫ్టీకి బాగా గుర్తింపు వచ్చింది, నిజంగానే కాసులు కురిపిస్తాయా? చిత్రాలు సరే, సెల్ఫీలు సైతం ఎన్ఎఫ్టీలుగా మారి లక్షలు కురిపిస్తాయా? ఇండోనేసియాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల గుస్తాఫ్ అల్ ఘోజాలి దగ్గరకు వెళితే ‘అవును. నిజమే’ అనక తప్పదు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయిన ఘోజాలికి రోజుకు ఒక సెల్ఫీ తీసుకోవడం అలవాటు. ఒక ఎన్ఎఫ్టీ వెబ్సైట్లో ‘ఘోజాలి ఎవ్రీడే’ పేరుతో 933 సెల్ఫీలను అమ్మకానికి పెట్టాడు. ‘ఘోజాలి సెల్ఫీని ఎన్ఎఫ్టీగా కొన్నాను’ అని ఒక ప్రముఖుడు ట్విట్ చేశాడో లేదో అతడి సెల్ఫీలకు మహర్దశ పట్టుకుంది. అలా ఒకటి కాదు... రెండు కాదు ఎథెర్ (బిట్‌కాయిన్ లాంటిది)ల రూపంలో ఏడు కోట్లు సంపాదించాడు. ‘తమదైన సిగ్నేచర్ స్టైల్‌ను ఏర్పాటు చేసుకుంటే ఎన్ఎఫ్టీలో విజయం సులభం అవుతుంది’ అంటోంది యాక్టర్, డిజైనర్, ఆర్టిస్ట్ లేఖ వాషింగ్టన్. ఇంతకీ ఎన్ఎఫ్టీ అంటే? నాన్ ఫంజిబుల్ టోకెన్స్. వాస్తవిక ప్రపంచానికి చెందిన ఆర్ట్, మ్యూజిక్, వీడియో... మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్ ఆస్తి. వీటి అమ్మకాలు, కొనుగోళ్ల కోసం వజీర్ ఎక్స్, కళమింట్, ఓపెన్ సీలాంటి మార్కెట్‌ప్లేస్‌లు ఉన్నాయి. చదవండి: తొడలు, నడము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వు సులభంగా తగ్గించుకోవచ్చు.. ఈ డివైజ్ ధర 9 వేలు View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) -
రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో ఆసక్తికర పోస్టుపై మహీంద్రా స్పందించారు. రష్యాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక కొన్ని కోట్లు విలువైన పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. అయితే, ఈ వార్తాపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా.." ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త కళాఖండాన్ని ఎన్ఎఫ్టిగా మార్చండి" అని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH — anand mahindra (@anandmahindra) February 10, 2022 ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ.7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న 10 నగరాల్లో 2 మనవే..!) -
కుర్ర ప్లేయర్.. రూ. ఐదు కోట్లకుపైగా వాల్యూ.. ఏమా కథ?
ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్‌లోనూ క్రిప్టో ప్రాధాన్యం పెరిగిపోతోంది ఇప్పుడు. ఆటగాళ్ల పేరిట ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్)లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువప్లేయర్ ఎన్ఎఫ్టీకి సుమారు 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ పలకడం యావత్ క్రీడా రంగంలో చర్చకు దారితీసింది. విశేషం ఏంటంటే.. ఆ ఆటగాడి దరిదాపుల్లో ఏ దిగ్గజ ప్లేయర్ కూడా లేకపోవడం!. బోరష్యా డోర్ట్‌మండ్.. జర్మనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఈ క్లబ్‌కి చెందిన స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ ‘డిజిటల్ కార్డు’ ఏకంగా 5, 11, 000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 5 కోట్ల 13 లక్షలకు పైనే. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా హయ్యెస్ట్ వాల్యూ దక్కించుకున్న క్రిస్టియానో రొనాల్డ్ యునిక్ ఐటెం ధర 2, 04, 000 పౌండ్లు. మన కరెన్సీలో రూ. 2 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే.. హాల్యాండ్ ఎన్ఎఫ్టీ డిజిటల్ స్పోర్ట్స్ ఐటెమ్స్‌లో ఇప్పటిదాకా అత్యంత విలువైన వస్తువుగా నిలిచిందన్నమాట. గత అక్టోబరులో DFL మరియు Sorareల భాగస్వామ్యంలో డిజిటల్ ప్లేయర్ఐటమ్స్ను ఎన్ఎఫ్టీల రూపంలో.. సోరేర్ ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్ ఆడడానికి అనుమతిస్తున్నారు. అందుకే తర్వాతి జనరేషన్ గేమర్స్.. ఈ ట్రేడింగ్‌పై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎదురులేని ఎర్లింగ్ ఎర్లింగ్ బ్రాట్ హాల్యాండ్.. నార్వేజియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. జర్మన్ బుండెస్లిగా క్లబ్ బోరష్యా డోర్ట్మండ్తో పాటు నార్వే నేషనల్ టీం తరపున ఆడుతున్నాడు. వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా.. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రయికర్గానూ పేరుంది ఇతనికి. లీడ్స్(ఇంగ్లండ్)లో జన్మించిన ఎర్లింగ్.. తండ్రి అల్ఫ్ ఇంగె హాల్యాండ్ నుంచి సాకర్‌ను పుణికిపుచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన ఎర్లింగ్.. ఆ తర్వాత బ్రైన్ క్లబ్ తరపున 2016లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. హ్యాండ్‌బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ మంచి ఆటగాడు. ఐదేళ్ల వయసులో(2006) స్టాండింగ్ లాంగ్ జంప్‌లో 1.63 మీటర్లు దూకి.. ఏకంగా ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు ఎర్లింగ్. సోరారే ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్.. నిజ జీవితంలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్‌డేలో జరిగే పాజిటివ్ (గోల్స్, అసిస్ట్‌లు) లేదా నెగటివ్ (రెడ్ కార్డ్‌లు) ఈవెంట్ల ఆధారంగా ఒక్కో గేమ్‌కు 0 మరియు 100 పాయింట్ల మధ్య ఆటగాళ్లు సంపాదిస్తారు. ఐదుగురు ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి, ఇతర యూజర్లతో పోటీపడతారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా రికార్డు..! -
ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా?
Surgeon Attempts To Sell Terrorist Victim's X-ray: ఇంతవరకు డాక్టర్లు పేషంట్లను మోసం చేసిన ఘటనలను చూశాం. అంతెందుకు ఎక్కువ మెడికల్ చార్జీలు మోపి రోగుల నడ్డి విరిచేసిన కథనాలను గురించి విన్నాం. కానీ ఇక్కడొక డాక్టర్ అత్యంత అమానుషంగా దాడిలో గాయపడిన బాధితుడి ఎక్స్ రేని అమ్ముకోవడానికి యత్నించాడు. అసలు విషయంలోకెళ్తే...పారిస్‌లోని బాటాక్లాన్ మ్యూజిక్ హాల్‌పై 2015లో జరిగిన ఉగ్రదాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అయితే పారిస్‌లోని జార్జెస్ పాంపిడౌ పబ్లిక్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇమ్మాన్యుయేల్ మాస్మేజీన్ ఆ వ్యక్తి ఎక్స్‌రేని డిజిటల్ ఆర్ట్వర్క్గా అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిత్రం కలాష్నికోవ్ బుల్లెట్‌ను కలిగి ఉన్న ముంజేయిని చూపిస్తుంది. అంతేందుకు ఎన్ఫ్టీ డిజిటల్ ఇమేజ్‌గా పిలవబడే ఆ ఎక్స్‌రే ఓపెన్ వెబ్సైట్ సూమరు రూ 2 లక్షలు పలుకుతుంది. అయితే ఆ సర్జన్ మాస్మేజీన్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకున్నామని పారిస్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతి మార్టిన్ హిర్ష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు ఇది సర్జన్ వృత్తికి విరుద్ధమైన పని మాత్రమే కాదు, వైద్య గోప్యతకు భంగం కలిగించే నేరానికి మాస్మేజీన్ పాల్పడ్డాని అన్నారు. అయితే మాస్మేజీన్ తన నేరాన్ని అంగీకరించడమే కాక పేషంట్ అనుమతి లేకుండా చేసిన ఇలాంటి పని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పాడు. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి అదృష్టం, మరోసారి దురదృష్టం వెంటాడడం సహజమే!. పదేళ్ల వయసున్న సహదేవ్ దిర్డో విషయంలో ఇలాంటిదే జరుగుతోంది. ఒక వైరల్ వీడియోతో సెన్సేషన్ అయిన ఈ గిరిజన కుర్రాడికి.. బాలీవుడ్లో పాప్ సాంగ్స్ చేసే అదృష్టం దక్కింది. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం చావు అంచుల దాకా తీసుకెళ్లింది. మరి ఇప్పుడో..? ‘జానే మేరీ జానేమన్ బచ్పన్ కా ప్యార్ మేరా భూల్ నహీ జానా రే’ అంటూ స్కూల్ యూనిఫామ్‌లో తరగతి గదిలో హుషారుగా పాట పాడిన సహదేవ్ దిర్డో.. ఏడాది తర్వాత(2021లో) కరోనా టైంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఆ రాష్ట్ర సీఎం, సెలబ్రిటీలంతా ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. లగ్జరీ కారుతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా అందింది ఆ కుర్రాడికి. సుక్మాలో అతని చిన్న ఇంటికి నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి ఏకంగా తన వైరల్ సాంగ్‌కు ర్యాప్ కట్టాడు సహదేవ్. ఆ దెబ్బతో అతని జీవితం మారిపోయిందని అంతా భావించారు. కానీ.. కిందటి నెలలో తన తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న క్రమంలో జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో బతకడం కష్టమని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు భావించారు. కానీ, ఆ పిలగాడి నసీబ్ మంచిగుంది. బతికి బట్టకట్టాడు. సహదేవ్‌కు బాద్షా వెన్నంటే ఉన్నాడు. ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆపై కోలుకున్న అతన్ని రాయ్‌పూర్‌లోని మంచి న్యూరోసర్జన్ దగ్గరికి తీసుకెళ్లి కోలుకునేలా చేశాడు ఈ బాలీవుడ్ ర్యాపర్. View this post on Instagram A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev) ఆ రూపంలో లక్ తన ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వయంగా ఓ వీడియో సందేశం పోస్ట్ చేశాడు సహదేవ్. అంతేకాదు తన క్షేమసమాచారాల కోసం ఆరా తీసిన వాళ్లకు, తాను కోలుకోవాలని ఆకాంక్షినవాళ్లకు కృతజ్ఞతలు సైతం తెలియజేశాడు. అంతేకాదు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీల ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అయిన ఎన్వోఎఫ్టీఈఎన్(nOFTEN) వెంచర్లో భాగం కానున్నట్లు ప్రకటించాడు. ఇది మన దేశంలో సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన మెటావర్స్ మార్కెట్‌ప్లేస్. ఈ ఎన్ఎఫ్టీలో ఒరిజనల్ సాంగ్‌కు చెందినదంతా ఉంటుంది. తద్వారా సహదేవ్‌కు కాసుల వర్షం కురవడంతో పాటు అమితాబ్లాంటి ప్రముఖుల సరసన నిలిచే అదృష్టం కలిగింది(ఎన్ఎఫ్టీ ద్వారా). ర్యాప్ సాంగ్ ఒరిజినల్ సాంగ్‌తోపాటు బిహైండ్ సీన్స్, షార్ట్ మూవీస్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి.. ఎన్వోఎఫ్టీఈఎన్లో మంచి ధర ఆఫర్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. మొదటి మార్గంగా ప్రాధాన్యత ప్రకారం వారి కళాకృతులను చేర్చుకోవడం, వారి డిజిటల్ భాగాన్ని వేలం వేయడానికి సులభమైన బిడ్డింగ్ విధానం ద్వారా వారి భాగానికి సరైన ధరను పొందడం. రెండో మార్గం క్రియేటర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్థిరమైన ధర పాయింట్‌ను జోడించడం ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసి డబ్బు సంపాదించవచ్చు, View this post on Instagram A post shared by nOFTEN NFT Marketplace (@noften_nft) ఇదిలా ఉంటే హెల్మెట్ ధరించనందువల్లే తాను గాయపడ్డానని, దయచేసి అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ స్థానిక మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వ్యాఖ్యానించాడు సహదేవ్. मेरी जिंदगी बदल दी 🙏🙏 नमस्कार दोस्तों अपने मुझे बहुत सारा प्यार दिया मैं इसके लिए आपका सदैव आभारी हूं। @Its_Badshah @Bollyhungama@bollywood_life@BollywoodBoyz@arrahman@bhupeshbaghel@Devendra_1925 धन्यवाद pic.twitter.com/3hIADmh18N — Sahdev Dirdo (@Sahdev_Dirdo) August 2, 2021 -
ఫోటో, వీడియో అమ్మకాలతో సుమారు రూ. 1.8 లక్షల కోట్ల బిజినెస్..! ఎందుకంత క్రేజ్..?
ఫోటోలను, వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) రూపంలో జరిపిన అమ్మకాలు 2021లో భారీ ఎత్తున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణ లభిస్తోంది. తమ అభిమాన వ్యక్తుల వాయిస్‌ను, వీడియోలను ,ఫోటోలను దక్కించుకునేందుకు ఎన్ఎఫ్టీ ప్రేమికులు కోట్ల రూపాయలను వెచ్చించారు. 25 బిలియన్ డాలర్లకు...! కార్టూన్ ఏప్స్ నుంచి వీడియో క్లిప్‌ల వరకు అన్నింటీని ఆయా ఎన్ఎఫ్టీ ఔత్సాహికులు 2021లో భారీ ఎత్తున అమ్మకాలను జరిపారు. గత ఏడాదిలో ఎన్ఎఫ్టీ అమ్మకాలు దాదాపు 25 బిలియన్ల (సుమారు రూ. 1,84,690 కోట్లు) డాలర్లకు చేరుకుంది. ఈ ఊహాజనిత క్రిప్టో ఆస్తులపై భారీ ఎత్తున ఆదరణను పొందాయి. ఎన్ఎఫ్టీ మార్కెట్ ట్రాకర్ DappRadar(డాప్రాడర్) డేటా ప్రకారం...2021లో ఎన్ఎఫ్టీల అమ్మకాలు మందగించాయని సూచించింది. గత ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తరువాతి నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో క్షీణించాయి. డిసెంబరులో మళ్లీ పుంజుకుంది. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో బిట్‌కాయిన్, ఈథర్ విలువ పెరిగినందున ఎన్ఎఫ్టీ అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. 2021లో దాదాపు 28.6 మిలియన్ వాలెట్లు ఎన్ఎఫ్టీలను సేల్ చేయగా, అది 2020లో దాదాపు 5,45,000గా ఉంది పుట్టగొడుగుల్లా ఎన్ఎఫ్టీ కంపెనీలు..! ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీలను నిర్వహించే కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిచాయి. అనేక కళాకారులు తమ చిత్రాలను అమ్ముతూ భారీ ఎత్తున సంపాదించారు. 2021 మార్చిలో ఒక ఎన్ఎఫ్టీ ఏకంగా రూ. 510 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ఆటోమొబైల్, దిగ్గజ మల్టీనేషన్ కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను అమ్మేందుకు సిద్దమయ్యాయి. కొకాకోలా, గుచి లాంటి కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను విక్రయించాయి. భారత్‌లో బూమ్..! భారత్‌లో క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్‌ఎఫ్‌టీపై భారీ ఆదరణే వచ్చింది. అమితాబ్ బచ్చన్, సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, దినేశ్ కార్తీక్, యూవీ, రిషబ్ పంత్ లాంటివారు కూడా తమ ఆడియో, వీడియో, ఫోటోలను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేసేందుకు సిద్దమయ్యారు. ఇక భారత్‌కు చెందిన మెటాకోవన్ అని పిలువబడే విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్ఎఫ్టీను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే.. -
అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..!
Yuvraj Singh Bat Flies To Space Becomes First Minted NFT Ever To Be Sent In Orbit: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిగత నాన్-ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) డిజిటల్ కలెక్టబుల్స్ వెబ్సైట్ కొలెక్షన్ భాగస్వామ్యంతో ప్రారంభించాడు.ఈ ఎన్ఎఫ్టీ టోకెన్ల ద్వారా తన కెరీర్లో కొన్ని అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకోనున్నాడు యువీ. అంతరిక్షంలోకి యువీ బ్యాట్..! తొలి వ్యక్తిగా.. 2003 ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన ఐకానిక్ బ్యాట్‌ను హాట్ ఎయిర్ బెలూన్ సహయంతో అంతరిక్షంలోకి పంపారు.అందుకు సంబంధించిన వీడియో అభిమానులకు ఎన్ఎఫ్టీ రూపంలో అందుబాటులో ఉండనుంది. అయితే అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్గా యువీ బ్యాట్ నిలవనుంది. ఈ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. కొలెక్షన్ అధికారిక అధికారిక వెబ్సైట్లో ఎన్ఎఫ్టీ వీడియో రూపంలో అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ...“నా మొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్లను కొలెక్షన్ భాగస్వామ్యంతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నా అభిమానులతో మరింత దగ్గరగా ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో అమూల్యమైన కొన్ని క్షణాలను ఎన్ఎఫ్టీ రూపంలో తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. కొలెక్షన్ వ్యవస్థాపకుడు అభయ్ మాట్లాడుతూ... యువరాజ్ 3డీ స్టాచ్యూతో పాటు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను విడుదల చేయనున్నాము. అతని ఎన్ఎఫ్టీ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు అభిమానులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించనున్నామని అన్నారు. భారత్‌లో ఊపందుకున్న ఎన్ఎఫ్టీలు..! భారత్‌లో ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణను పొందుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్ఎఫ్టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తో పాటుగా ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌లోకి యువీ కూడా జాయిన్ అయ్యారు. చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్.. ధర తెలిస్తే షాకే!
Bat Signed by 2011 World Cup winning team fetches 25,000 USD.. క్రికెట్లో టీమిండియాకు '2011' ఒక గోల్డెన్ ఇయర్. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ధోని నాయకత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 1983 కపిల్ డెవిల్స్ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న ఘనత ధోని సేనకే సాధ్యమైంది. ఇక శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో ధోని తన స్టైల్లో సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించి కప్‌ను చేతిలో పెట్టాడు. ఇక విజయం సాధించిన అనంతరం టీమిండియా చేసిన రచ్చ అంత తొందరగా మరిచిపోలేం. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను తమ భుజాలపై మోస్తూ అతనికి ధోని సేన కప్‌ను గిఫ్ట్‌గా అందివ్వడం ఒక చరిత్ర. ఆరోజు ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్లంతా ఒక బ్యాట్‌పై తమ సంతకాలను చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాట్ అని పేరు పెట్టారు. తాజాగా ఆ బ్యాట్‌కు నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) రూపంలో భారీ ధర దక్కింది. చదవండి: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్' ఇక క్రిక్ఫ్లిక్స్, రెవ్‌స్పోర్ట్స్, ఫనాటిక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కలిసి సంయుక్తంగా ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. మొత్తంగా డిజిటల్ ఆర్టిక్రాప్ట్కు (335,950 అమెరికన్ డాలర్లు) ఎన్ఎఫ్టీ టోకెన్ రూపంలో బిడ్ వేశారు. ఇందులో టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్ ..వేలంలో 25వేల అమెరికన్ డాలర్లు పలికింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.18 లక్షలకు పైనే ఉంటుంది. అయితే ఇంతకముందు 2016లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతకం చేసిన ఎస్ఆర్హెచ్ జెర్సీకి ఎన్ఎఫ్టీ రూపంలో 30వేల అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.22 లక్షలుపైన) పలకింది. దుబాయ్ వేదికగా ఈ ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించారు. ఇక సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ క్రికెట్ కలెక్షన్ పేరుతో డిజిటర్ రైట్స్ రూపంలో వేలం నిర్వహించారు. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్‌ను టెండూల్కర్ వీరాభిమాని.. ముంబైకి చెందిన అమల్ ఖాన్ 40వేల అమెరికన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీలో రూ .30,01,410) దక్కించుకోవడం విశేషం. చదవండి: Dinesh Karthik: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: NFT: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. -
"మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)కు భారీ ఆదరణ లభిస్తోంది. సినీ తారల నుంచి మొదలుకొని అగ్ర కంపెనీల వరకు ప్రత్యేకంగా ఎన్ఎఫ్టీ కలెక్షన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ నెట్ వర్క్ దిగ్గజం వొడాఫోన్ ఎన్ఎఫ్టీ తీసుకొని వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా 1992 డిసెంబరు 3న పంపిన "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వొడాఫోన్ వేలానికి ఉంచింది. పారిస్ ఆక్షన్ హౌస్‌లో 'నాన్ ఫంజిబుల్ టోకెన్స్'గా ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలోని మొట్టమొదటి టెక్స్ట్ సందేశాన్ని 121,000 డాలర్ల(సుమారు రూ.90 లక్షలు)కు వొడాఫోన్ విక్రయించింది. 30 ఏళ్ల క్రితం(డిసెంబర్ 3, 1992న) వొడాఫోన్ కంపెనీలో ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌పై పనిచేసిన ఇంజినీర్ నీల్ పాప్‌వర్త్ తన మొదటి టెస్టింగ్ ఎస్ఎంఎస్ 'మెర్రీ క్రిస్మస్' సందేశాన్ని రిచార్డ్ జార్విస్(బిజినెస్‌మ్యాన్)కు పంపించారు. అతను తన 2 కిలోల ఆర్బిటెల్ పరికరంలో ఈ సందేశాన్ని అందుకున్నాడు. ఈ ఆర్బిటెల్ పరికరం డెస్క్ ఫోన్ తరహాలోనే ఉంటుంది. ఈ "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ- యుఎన్‌హెచ్‌సిఆర్‌కు యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజికి విరాళంగా అందిస్తారు. ఈ వేలం తర్వాత ప్రపంచంలోని మొదటి ఎస్ఎంఎస్కు సంబంధించి ఎటువంటి ఎన్ఎఫ్టీని లేదా కాయిన్‌ను ఇష్యూ చేయబోమని వొడాఫోన్ ప్రకటించింది. (చదవండి: భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక) -
ఎంజీ మోటార్స్ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)పై భారీ ఆదరణ లభిస్తోంది. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌ను ఆదరించే వాటిలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు కూడా చేరాయి. ఇప్పటికే పెప్సీ, టాకో బెల్, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ ప్రత్యేక ఎన్ఎఫ్టీ కలెక్షన్లను తీసుకువచ్చాయి. తాజాగా వీటి సరసన బ్రిటన్ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ కూడా చేరింది. మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్..! ఎంజీ మోటార్స్ భారత్‌లో నాన్-ఫంజిబుల్ టోకెన్ల సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత ఆటోమొబైల్ సెక్టార్లో ఎన్ఎఫ్టీలను పరిచయం చేసిన మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్ నిలవనుంది. సుమారు 1,111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్ఎఫ్టీలను ఎంజీ మోటార్స్ విడుదల చేయనుంది. డిసెంబర్ 28 నుంచి ఎంజీ మోటార్స్ ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎన్ఎఫ్టీ అమ్మకాల కోసం KoineArthకు చెందిన NgageN ప్లాట్‌ఫారమ్ ఎంజీమోటార్స్ కలిసి పనిచేయనుంది. ఈ ఎన్ఎఫ్టీలు ఫోటోస్, గిఫ్, స్టాటిక్ ఇమేజ్స్ రూపంలో ఉండనున్నాయి. చదవండి: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. నాలుగు రకాలైన ఎన్ఎఫ్టీలు..! 1111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్ఎఫ్టీలను ఎంజీ మోటార్స్ 4 "C" విభాగాలుగా విభజించింది. కలెక్టబుల్స్, కమ్యూనిటీ అండ్ డైవర్సిటీ, కోల్బరేటివ్ ఆర్ట్, కార్ యాజ్ ఏ ప్లాట్ ఫాం ఎన్ఎఫ్టీలుగా విభజించిన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. విరాళంగా బాలికల కోసం..! ఈ ఎన్ఎఫ్టీలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలికల విద్య కోసం ఖర్చు చేస్తామని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా రేషన్, వైద్య సహాయాన్ని అందించనుంది. గత త్రైమాసికంతో పోలిస్తే 8 రెట్లు అధికం..! ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీ మార్కెట్స్ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. 2021 మూడో త్రైమాసికంలో ఎన్ఎఫ్టీల అమ్మకాల పరిమాణం గత త్రైమాసికంతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగింది. సుమారు 10.7 బిలియన్ డాలర్లకు(రూ. 79,820 కోట్లు) చేరిందని ఎన్ఎఫ్టీ మార్కెట్ ట్రాకర్ DappRadar ఒక నివేదికలో వెల్లడించింది. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే.. -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్‌నేమ్) 75 ఎథర్‌లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్‌ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్‌కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే..
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్ భారీగా కొనసాగుతోంది. క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) హవా కూడా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్టిస్టులు వారి ఫోటోలను, ఆడియోలను, వీడియోలను ఎన్ఎఫ్టీ రూపంతో అమ్ముతున్నారు. ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! మెటాకోవన్ అని కూడా పిలువబడే భారత్‌కు చెందిన విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్ఎఫ్టీను సొంతం చేసుకున్నారు. ఈ ఎన్ఎఫ్టీ అందరికీ అందుబాటులో ఉంచేందుకుగాను కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇంతపెద్దమొత్తాన్ని చెల్లించి ఎన్ఎఫ్టీను సొంతం చేసుకోవడంతో ఎన్ఎఫ్టీ మార్కెట్‌పై ఇతరులు ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపడినట్లు తెలుస్తోంది. ‘Every Day: The First 5000 Days’ ఎన్ఎఫ్టీను మైక్ వింకెల్మాన్ రూపొందించిన డిజిటల్ కళ. దీనిని వృత్తిపరంగా బీపుల్ అని పిలుస్తారు. ఈ ఎన్ఎఫ్టీలో 5000 చిత్రాలను ఒకే ఫోటోగా సృష్టించాడు. చదవండి: అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..! అసలు ఏవరి విగ్నేష్ సుందరేషన్..! విఘ్నేష్ సుందరేశన్ అలియాస్ మెటాకోవన్. బ్లాక్ చైయిన్ టెకీ. వై-కాంబినేటర్ పూర్వ విద్యార్థి . విఘ్నేష్ బిట్యాక్సెస్ను సహ-స్థాపన చేసి ఆరు నెలల్లో 18 దేశాల్లో 100 బిట్‌కాయిన్ ఎటీఎంలను ఏర్పాటు చేసిన ఘనత విఘ్నేష్ది. అతను బ్లాక్‌చెయిన్‌లో ఆర్థిక సేవలకు శక్తినిచ్చే క్రెడిట్ ఇంజిన్ ఐనా లెండ్రాయిడ్ ఫౌండేషన్ కోసం విజయవంతమైన టోకెన్ విక్రయాన్ని స్థాపించారు. పోర్ట్కీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా స్థాపించాడు. మే 2013లో సుందరేశన్ ఒక వార్తాపత్రికలో డెవలపర్‌గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కాయిన్స్-E అనే ఆన్లైన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ను ప్రారంభించారు. దీంతో ఆసక్తి కల్గిన కస్టమర్లు క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడానికి ,విక్రయించడానికి వీలు కల్పింస్తోంది. Every Day: The First 5000 Days ఎన్ఎఫ్టీ ఎన్ఎఫ్టీ అంటే..! ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. చదవండి: స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..! -
బంపరాఫర్: స్పైడర్‌మ్యాన్ టికెట్లపై ఎన్ఎఫ్టీ టోకెన్లు
మార్వెల్ సినిమాల్లో ఇప్పటిదాకా ఏమూవీకి రానంత హైప్ ‘స్పైడర్ మ్యాన్ నో వే హోం’కి క్రియేట్ అయ్యింది. కథలో భాగంగా నలుగురు సూపర్ విలన్లతో.. ముగ్గురు స్పైడర్మ్యాన్లు పోరాడనున్నారనే ప్రచారంతో ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ఆన్లైన్ బుకింగ్ హడావిడి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఒకానొక దశలో బుకింగ్ ప్రభావంతో సర్వర్లు సైతం క్రాష్ అయినట్లు ప్రచారం వినిపించింది. తాజాగా టికెట్ బుకింగ్‌పై బంపరాఫర్ ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. ఉత్తర అమెరికాలో Spider-Man: No Way Home డిసెంబర్ 16నే రిలీజ్‌కాబోతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఎన్ఎఫ్టీలు ఇస్తామని ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. సోనీ-మార్వెల్ తరపున రాబోతున్న సందర్భంగా సుమారు 86 వేల ఎన్ఎఫ్టీలను పంచుతామని, అదీ ముందు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకేనని తెలిపింది. క్లబ్ స్టూడియోస్ డిజైన్ చేసిన ఈ ఎన్ఎఫ్టీలు.. వేటికవే ప్రత్యేకమైన విలువను(భారీ) కలిగి ఉంటాయి. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికన్లకు మాత్రమే! అంతేకాదు బయటి దేశాలకు వాళ్లకు వీటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదనే కండిషన్లు విధించారు. టామ్ హోలాండ్ స్పైడర్‌మ్యాన్‌గా లీడ్ రోల్లో కనిపించనున్న ఈ చిత్రంలో.. గతంలో స్పైడర్మ్యాన్లుగా అలరించిన టోబీ మాగుయిర్, ఆండ్రూ గార్ఫీల్డ్ సైతం కనిపించనున్నారనే ప్రచారంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన స్పైడర్ మ్యాన్ నో వే హోంకి జోన్ వాట్స్ డైరెక్టర్. ఎన్ఎఫ్టీ అంటే.. సినిమాలు, సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: Spider-Man: No Way Home.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే.. -
ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
ఈ మధ్య ఎన్ఎఫ్టీ (NFT) పదాన్ని తరచుగా వింటున్నాం. పలు సెలబ్రిటీలు ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో భారతదేశంలో ఎన్ఎఫ్టీకి క్రేజ్ పెరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సన్ని లియోన్ ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టడంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది. ఎన్ఎఫ్టీ అంటే నాన్ పంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒక రకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్షిప్ ఇస్తారు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్ఎఫ్టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. అయితే ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. 1. అమితాబ్ బచ్చన్ బియాండ్‌లైఫ్.క్లబ్‌తో పెరుతో తన సొంత ఎన్ఎఫ్టీలను ప్రారంభించిన మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రితీ ఎంటర్టైన్మెంట్ వారి బియాండ్‌లైఫ్.క్లబ్, గార్డియన్లింగ్.ఐవోతో భాగస్వామ్యమైంది. గ్లోబల్ సెలబ్రిటీలు, ఆర్టిస్తులు, అథ్లెట్లకు వారి వారి చిత్రాలను ఎన్ఎఫ్టీలుగా (NFTs.Movie) మార్చడానికి ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీ వేలంతో మూడు సెట్ల కలెక్షన్లతో లైవ్‌లోకి వెళ్లారు. 2. సన్నీ లియోన్ సన్నీ లియోన్ నాన్-ఫంగిబుల్ టోకెన్ల (NFT) మార్కెట్ ప్లేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటిగా అవతరించింది. ఈమె మిస్ఫిజీ పేరుతో ఎన్ఎఫ్టీ తీసుకుంది. 3. దుల్కర్ సల్మాన్ మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన చిత్రం కురుప్ కోసం గత నెలలో ఎన్ఎఫ్టీ సేల్‌ను నిర్వహించడానికి అబుదాబికి చెందిన టెక్నాలజీ కంపెనీ అంబర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4. రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. 5. విశాల్ మల్హోత్ర టీవీ హోస్ట్, నటుడు విశాల్ మల్హోత్ర నాన్ ఫంగిబుల్ టోకెన్ (NFT)ను ఆర్టిస్ట్ ఇషితా బెనర్జీతో కలిసి విడుదల చేశారు. అలా ఒక ఆర్టిస్ట్‌తో కలిసి విడుదల చేసిన మొదటి భారతీయ నటుడు విశాల్ మల్హోత్ర. ఈయన తన 25 ఏళ్ల బాలీవుడ్ కెరీర్లో ఎన్నో ప్రజాధరణ పొందిన పాత్రలు చేశారు. వీరితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రాపర్ రాఫ్తర్, సింగర్ మికా సింగ్, యూట్యూబర్ అమిత్ బదాన ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి దిగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు, ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. -
తొలి భారతీయుడిగా కమల్ హాసన్ మరో సంచలనం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ (67) కూడా ఆ వైపుగా దూసుకొస్తున్నారు. తన 67వ పుట్టినరోజును పురస్కరించుకుని డిజిటల్ అవతార్ కోసం ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫారమ్ ఫాంటికోతో జత కలిసారు. తన సూపర్ కలెక్షన్లతో నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లాంచ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో తన సొంత డిజిటల్ అవతార్‌తో మెటావర్స్‌లోకి అడుగిడుతున్న తొలి భారతీయ సెలబ్రిటీగా కమల్ అవతరించ నున్నారు. ఇటీవల బాలీవుడ్ బిగ్‌బీ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన నేపథ్యంలో కమల్ కూడా సరికొత్త ట్రెండ్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఎన్ఎఫ్టీల వేలంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పాపులర్ మెటావర్స్‌గా డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్ వెల్లడించారు. కమల్ హాసన్ వంటి లెజెండ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో చేరడం ద్వారా తామొక ట్రెండ్ సెట్ చేయనున్నామని ఫాంటికో అభయానంద్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. లోటస్ మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా కమల్ ఎన్ఎఫ్టీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఫాంటికో గేమ్ ఆధారిత మెటావర్స్ ద్వారా అభిమానులు డిజిటల్ కమల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. అలాగే ఇలాంటి భాగస్వామ్యాల కోసం నటులు, క్రీడాకారులు ఇతర ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఫాంటికో సింగ్ చెప్పారు. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన అలనాటి పోస్టర్లు, ఆటోగ్రాఫ్‌లు బియాండ్‌లైఫ్.క్లబ్ నిర్వహించిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడై కోట్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
ఎన్ఎఫ్టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో డిజిటల్ టోకెన్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సమానంగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)పై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎన్ఎఫ్టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్లు) బిజినెస్ లోకి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు చేరుతున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కొద్ది రోజుల క్రితమే వారి నాన్ ఫంగిబుల్ టోకెన్‌ను కూడా ప్రారంభించారు. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రారంభించిన బియాండ్ లైఫ్ ఎన్ఎఫ్టీ రికార్డులు సృష్టించింది. అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ అమ్మకాల ద్వారా దాదాపు మిలియన్ డాలర్లు సంపాదించారు. దీని విలువ సుమారు రూ.7.17 కోట్లు. సూపర్ స్టార్ స్వంత స్వరంలో రికార్డ్ చేసిన అమితాబ్ బచ్చన్ తండ్రి ప్రసిద్ధ కవిత $756,000(రూ.5.5 కోట్లు)కు విక్రయించారు. షోలే చిత్రాల గల పోస్టర్లు $94,000కు అమ్ముడయ్యాయి. దేశంలో ఎన్ఎఫ్టీ అమ్మకాల ద్వారా ఈ స్థాయిలో సంపాదించి బచ్చన్ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బచ్చన్ మాట్లాడుతూ.. "డిజిటైజేషన్ ప్రపంచంలో ఎన్ఎఫ్టీలు నా అభిమానులతో ఇంతకు ముందు కంటే ఎక్కువ దగ్గర కావడానికి కొత్త అవకాశాలను తెరిచాయి. ఇది నిజంగా నాకు చాలా గర్వించదగ్గ క్షణం" అని అన్నారు. ఎన్ఎఫ్టీ అంటే.. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. -
సన్నీ లియోన్ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!
అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, మలయాళ నటుడు రిమా కల్లింగల్ వంటి నటులు సరికొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. ఆ బిజినెస్ పేరు ఏంటో తెలుసా? ఎన్ఎఫ్టీ. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీ జాబితాలోకి బాలీవుడ్ తార సన్నీ లియోన్ అడుగు పెట్టింది. ఈ జాబితాలోకి ప్రవేశించి ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది. "మిస్ ఫిట్జ్" పేరుతో ఈ ఎన్ఎఫ్టీ తీసుకొని వచ్చింది. ఇందులో 9,600 ఎన్ఎఫ్టీ.లు ఉన్నాయి. (చదవండి: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?) MEET the MISFTIZ ! This is misfitz HONEY! She loves the color pink…boys with tattoos…and then eats them for lunch 😈 What the world has been waiting for!!! #SUNNYLEONENFT collectibles 😍 Check them all out on 👉 https://t.co/RAN8aK83uB Join : https://t.co/9xjrNoQVTx #NFT pic.twitter.com/cOsWb3P9SA — sunnyleone (@SunnyLeone) October 30, 2021 ఎన్ఎఫ్టీకి సంబంధించి వివరాలను సన్నీ లియోన్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. అందులో ఇలా పేర్కొంది.. 'మిస్ ఫిజ్‌ను కలవండి! ఇది మిస్ ఫిజ్ హనీ! ఆమెకు గులాబీ రంగంటే ఇష్టం. టాటూలు వేయించుకున్న కుర్రాళ్లన్నా ఇష్టమే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? సన్నీలియోన్ ఎన్ఎఫ్టీలు సిద్ధంగా ఉన్నాయి' అని సన్నీ ట్వీట్ చేసింది. 'ఇదో ప్రైవేట్ సేల్. వెంటనే విక్రయిస్తాం. నా కలెక్షన్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేనెలాగూ మిస్‌ఫిట్‌నే' అని ఆమె మీడియాకు తెలిపింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ వేలం మొదటి రోజున $5,20,000 (సుమారు రూ.3.8 కోట్లు) విలువైన అమ్మకాలు జరిగాయి. (చదవండి: ‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది) -
ప్రపంచంలో ఎవరు చేయలేని ప్రయోగానికి సిద్దమైన ఆర్జీవీ..! ఇక డేంజరసే..
ఆర్జీవీ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. మనోడు ఏదీ చేసిన ఒక కొత్తే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో సినిమాలను డైరక్ట్ చేస్తుంటాడు ఆర్జీవీ. రాజ్ పాల్ యాదవ్, ఆప్సరా రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన లెస్బియన్ చిత్రం డేంజరస్ త్వరలోనే సరికొత్త రికార్డును సృష్టించనుంది. ఎన్ఎఫ్టీ రూపంలో డేంజరస్...! భారత్‌లో క్రిప్టోకరెన్సీతో సమానంగా పలు సెలబ్రిటీలు నాన్‌ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)పై ఆదరణను చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్, దినేష్ కార్తీక్, రిషబ్‌పంత్ లాంటి వారు తమ వీడియోలను, ఆడియోలను ఎన్ఎఫ్టీ రూపంలో బ్లాక్ చెయిన్‌లో విక్రయించే ఏర్పాట్లలో ఉన్నారు. కాగా ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ చేయలేని ప్రయోగానికి ఆర్జీవీ సిద్దమయ్యాడు. చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌తో వేలం రామ్ గోపాల్ వర్మ డైరక్ట్‌చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేస్తున్నారు. డేంజరస్ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో, పే పర్ వ్యూ ద్వారా ప్రేక్షకులు చూడవచ్చును. ఈ సినిమాను డేంజరస్ టోకెన్స్ లేదా క్రిప్టోకరెన్సీతో మన ఇండియన్ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చును. అందుకోసం సపరేట్గా rgvdangertoken.com వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఆర్జీవీ ప్రకటన ప్రకారం..డేంజరస్ సినిమాను ప్రేక్షకులు డేంజర్ టోకెన్లతో కొనుగోలు లేదా ఇన్వెస్ట్ కూడా చేయవచ్చును. డేంజరస్ సినిమాను సుమారు 6 లక్షల యూనిట్లుగా విలువగట్టారు. ఒకో యూనిట్ విలువ రూ. 100 సమానం. ఇన్వెస్టర్లు 5 లక్షలకు పైగా యూనిట్లను సొంతం చేసుకోవచ్చును. ఒకే ఇన్వెస్టర్ ఈ మొత్తాన్ని కూడా దక్కించుకోవచ్చును. మిగిలిన లక్ష యూనిట్లను ఆర్జీవీ, చిత్ర బృందం దగ్గర ఉండనున్నాయి. దీంతో సినిమా నుంచి వచ్చే లాభాలను ఇన్వెస్టర్లు కూడా పొందుతారు. పే పర్ వ్యూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వ్యూస్ మేరకు ఇన్వెస్టర్లకు డబ్బులు కేటాయించడం జరుగుతుంది. ఎన్ఎఫ్టీ అంటే..! ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. DANGEROUS India’s 1st LESBIAN crime/action/love film Trailer https://t.co/5dutBpWuko DANGEROUS India’s 1st LESBIAN DUET SONG https://t.co/BE2zmMYkdS 1st time in WORLD, a 90 minute film for sale as an NFT on BLOCKCHAIN ..For details visit https://t.co/YPS9lEftBN — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2021 చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! -
మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తోన్న వారిలో భారత్ సుమారు 10 కోట్ల మందితో నిలిచిన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీ తో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)కు కూడా భారత్‌లో ఆదరణ లభిస్తోంది. రిషబ్‌పంత్ కూడా ఎన్ఎఫ్టీలోకి...! భారత్‌లో అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్ఎఫ్టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. కొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ 2018లో నిదాహస్ ట్రోఫిలో కొట్టిన చివరి ఫ్లాట్ సిక్స్‌ను వీడియో రూపంలో ఎన్ఎఫ్టీగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్ఎఫ్టీను ఆవిష్కరించిన తొలి భారత క్రీడాకారుడిగా దినేష్ కార్తీక్ నిలవడం గమనార్హం. ఇప్పుడు దినేష్ కార్తీక్ సరసన మరో టీమిండియా క్రికెటర్ రిషబ్‌పంత్ కూడా చేరనున్నాడు. చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! ప్రపంచంలోనే అధికారికంగా లైసెన్స్ పొందిన తొలి క్రికెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్ రారియోతో భారత వికెట్ కీపర్ రిషబ్‌పంత్ జత కట్టనున్నాడు. రారియో ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్ ద్వారా పలు రిషబ్‌పంత్ ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో రిషబ్ ఆడిన విరోచిత ఇన్నింగ్స్, ఇంగ్లాండ్‌తో అహ్మాదాబాద్‌లో ఆడిన ఇన్నింగ్స్, అంతేకాకుండా ఐపీఎల్లో ఢిల్లీ కెప్టెన్‌గా పనిచేసిన తీరు ఆడియో, వీడియో ఎన్ఎఫ్టీ రూపంలో రానున్నట్లు తెలుస్తోంది. రారియో ప్లాట్ఫామ్నుపయోగించి క్రికెట్ అభిమానులు ఆయా క్రికెటర్లకు సంబంధించిన ఎన్ఎఫ్టీలను వేలంలో గెలుచుకోవచ్చునని కంపెనీ సీఈవో అంకిత్ వాద్వా పేర్కొన్నారు. ఎన్ఎఫ్టీ అంటే..! ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! -
సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో డిజిటల్ టోకెన్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సమానంగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)పై కూడా ఆసక్తి పెరుగుతుంది. చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! బిగ్ బీ.. ఇప్పుడెమో సల్మాన్ ఖాన్....! భారత్ లాంటి దేశాల్లో కూడా ఎన్ఎఫ్టీ టెక్నాలజీ దూసుకుపోతుంది. ఎన్ఎఫ్టీలపై ఇండియన్స్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. భారత్‌లో ఎన్ఎఫ్టీను పరిచయం తొలి వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ నిలిచాడు. తరువాతి స్థానంలో బేబి డాల్ సన్ని లియోన్ నిలిచింది. తాజాగా ఎన్ఎఫ్టీ లోకి సల్మాన్ ఖాన్ కూడా వస్తోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ తన ఎన్ఎఫ్టీ కలెక్షన్లను బాలీకాఇయిన్. కామ్ అందుబాటులో ఉంటాయని ట్విటర్ ద్వారా తెలిపారు. సల్మాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో... “ఆ రహా హూన్ మెయిన్, ఎన్ఎఫ్టీ లేకే.... సల్మాన్ ఖాన్ స్టాటిక్ NFT కమింగ్ అన్ bollycoin.com స్టే ట్యూన్ బాయ్ లోగ్ అంటూ..ట్విట్ చేశాడు. బాలీకాయిన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ వెబ్‌సైట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్మకుడు అతుల్ అగ్నిహోత్రి ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో ప్రముఖ చలనచిత్రాల ఐకానిక్ డైలాగ్‌లు, పోస్టర్లు, రేర్ ఫుటేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్, సెలబ్రిటీల వస్తువులు, వారి స్టిల్స్ ఎన్ఎఫ్టీ రూపంలో అభిమానులను లభించనున్నాయి. ప్రముఖుల ఎన్ఎఫ్టీ సేకరణలు ఈథిరియం బ్లాక్‌చెయిన్‌లో విక్రయించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ అభిమానులు తమ ఇష్టపడే బాలీవుడ్ చిత్రాల ఎన్ఎఫ్టీలను సొంతం చేసుకునేందుకు ఒక వేదికను బాలీకాయిన్. కామ్ అందించనుంది. ఎన్ఎఫ్టీ అంటే.. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. Aa raha hoon main, NFTs leke. Salman Khan Static NFTs coming on @bollycoin. Stay tuned, bhai log! https://t.co/auNNbccZJX 🌟#BollyCoin #NFTs #ComingSoon pic.twitter.com/u8ZWUSwuq0 — Salman Khan (@BeingSalmanKhan) October 13, 2021 చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌తో వేలం -
తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...!
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆడిన తీరు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 8 బంతుల్లో 29 పరుగులతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి కార్తీక్ కొట్టిన ఫ్లాట్ సిక్స్ ఇప్పటికీ మన కళ్లలో మెదులుతూనే ఉంటుంది. దినేష్ కార్తీక్ చివరి సిక్స్ ఇప్పడు ఎన్ఎఫ్టీ రూపంలో...! దినేష్ కార్తీక్ కొట్టిన చివరి సిక్స్ మూమెంట్ అంతమనేది లేకుండా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో త్వరలోనే లభించనుంది. భారత్‌ను గెలిపించాక దినేష్ కార్తీక్ సెలబ్రెట్ చేసుకున్న విన్నింగ్ మూమెంట్‌ను యానిమేషన్ రూపంలో ఎన్ఎఫ్టీగా రానుంది. విన్నింగ్ పరుగులను సాధించినప్పుడు కార్తీక్‌లోని ఆలోచనలు, భావోద్వేగాలను ఈ ఎన్ఎఫ్టీ యానిమేషన్ రూపంలో పొందుపర్చనున్నారు. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ...‘నిదాహస్ ట్రోఫి ఫైనాల్ నా జీవితంలో అత్యుత్తమ క్షణాల్లో అది ఒకటి. ఆ క్షణాలు ఇప్పుడు గ్రాఫికల్ ఎన్ఎఫ్టీ రూపంలో రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంద’ని అన్నారు. ఈ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్‌ను కార్తీక్ సమీప బంధువు, అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సహకారంతో చేపట్టారు. దినేష్ కార్తీక్ ఎన్ఎఫ్టీ అక్టోబర్ 12 నుంచి వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! -
Sunny Leone: మెగాస్టార్ తర్వాత సన్నీ లియోన్
అడల్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఆపై హిందీ బిగ్‌బాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్(కరణ్‌జిత్ కౌర్ వోహ్రా). మిగతా భాషల్లోనూ నటిగా, ఐటెం సాంగ్‌లతో అవకాశాలు అందిపుచ్చుకుంటోందామె. తాజాగా సన్నీ మరో ఫీట్ సాధించింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో నాన్-ఫంగిబుల్ టోకెన్స్(NFTs) వైపు అడుగులేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫిమేల్ ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఈ మధ్యే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఈ ఘనత అందుకున్న తొలి సెలబ్రిటీగా నిలిచారాయన. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆస్తుల్ని వెనకేసుకునే పనిలో ఇప్పుడు సన్నీ లియోన్(40) కూడా తలమునకలైంది. ఇందుకోసం సన్నీ లియోన్.. సిలికాన్ వ్యాలీకి చెందిన మింట్డ్రోప్జ్తో చేతులు కలపింది. ప్రత్యేక వెబ్సైట్ తన ఆర్ట్ వర్క్‌కు చెందిన ఎన్ఎఫ్టీ కలెక్షన్లను(ఈథేరియం బ్లాక్ చెయిన్) వేలం వేయనుంది. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. అలా వీటిని నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. భారత్‌లో 2021 జూన్‌లో వాజిర్ ఎక్స్.. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లో అడుగుపెట్టిన మొదటి ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ టైంలో కాన్వాస్ ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు వాళ్ల టోకెన్లను అమ్ముకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే దేశంలో అమితాబ్ బచ్చన్ కంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్ఎఫ్టీ ఘనత దక్కించుకున్నారు. కానీ, అది వ్యక్తిగతంగా కాదు. శివాజీ ది బాస్ సినిమా 14 ఏళ్ల రిలీజ్ పూర్తైన సందర్భంగా మొన్న జులైలో ఇద్దరు టీనేజర్లు.. సినిమా పేరిట ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను ప్రారంభించారు. చదవండి: ఫ్రస్టేట్ జర్నలిస్ట్ వీడియో.. జాక్‌పాట్ -
ఆ ‘కోపధారి మనిషి’.. జాక్‌పాట్ కొట్టేశాడు
Chand Nawab Karachi Se: కోపధారి మనిషి.. ఈ వీడియో గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలాకాలం క్రితమే ఈ తరహా యాటిట్యూడ్‌తో పాకిస్తాన్‌లోనూ ఓ రిప్టోరర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ‘చాంద్ నవాబ్.. కరాచీ సే..’ అంటూ వార్తల కవరేజ్‌కి విఫలయత్నం చేసిన పాక్ జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా!. ఆ జర్నలిస్ట్ సాబ్.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు. ఈ వైరల్ వీడియోను నాన్ ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) కింద వేలం వేయబోతున్నారు. జర్నలిస్ట్ చాంద్ నవాబ్.. పాక్‌లోనే కాదు ఇండియాలో.. ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయీజాన్(2015)లో ఈయన క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ స్ఫూఫ్ వీడియో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ అద్భుతంగా పోషించాడు కూడా. సుమారు 12 ఏళ్ల క్రితం వైరల్ అయిన ఆ వీడియోను.. ఇప్పుడు ఎన్ఎఫ్టీ నుంచి ఫౌండేషన్ యాప్ ద్వారా వేలం వేయబోతున్నారు. ఇంతకీ ప్రారంభ బిడ్ ఎంతో తెలుసా? ఒత్తిడిలోనే అలా చేశా డిజిటల్ ఆక్షన్ ప్లాట్‌ఫామ్ మీద స్వయంగా చాంద్ నవాబ్.. ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ‘‘నేను చాంద్ నవాబ్‌ని. వృత్తిరీత్యా జర్నలిస్ట్/రిపోర్టర్ని. 2008లో నా వీడియో ఒకటి యూట్యూబ్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పండుగ పూట రైల్వే స్టేషన్లో కవరేజ్ చేస్తుండగా.. ప్రయాణికులు అడ్డురావడంతో నాకు విసుగొచ్చింది. జర్నలిజంలో ఉన్న ఒత్తిడి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫ్రస్టేషన్లోనే అలా ప్రవర్తించా. అయితే ఆ వీడియో నన్ను మీకు పరిచయం చేసింది. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్ స్ఫూర్తితోనే కబీర్‌ఖాన్ డైరెక్షన్లో వచ్చిన భజరంగీ భాయీజాన్ సినిమాలో నవాజుద్దీన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ద్వారా నన్ను మరోసారి వైరల్ చేశారు. నాపై అభిమానం చూపిన వాళ్లందరికీ థ్యాంక్స్’ అంటూ పేర్కొన్నాడు కరాచీకి చెందిన చాంద్ నవాబ్. ఇక ఈ వీడియోను ప్రారంభ బిడ్ ధర అక్షరాల 46 లక్షల రూపాయలు(63వేల డాలర్లు)గా నిర్ణయించింది ఎన్ఎఫ్టీ ఫౌండేషన్. మరి ఇది ఎంతకు అమ్ముడు పోతుందో, చాంద్ నవాబ్కు ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి మరి. ఎన్ఎఫ్టీ అంటే బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. క్లిక్ చేయండి: ఎన్ఎఫ్టీ.. తొలి హీరో ఎవరో తెలుసా? -
Big B Amitabh: మరో ప్రయోగం.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయనిది!
బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ మరో కొత్త అధ్యాయానికి తెర లేపారు. వెండితెర రారాజుగా వెలిగి బుల్లితెర మీద కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఒకప్పటి ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ ఎవరికీ అంతు చిక్కని రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రయోగాలకు వెరవసి సాహసి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి సిద్ధమయ్యారు. Amitabh Bachchan NFT Collection : అతి త్వరలోనే అమితాబ్‌బచ్చన్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) కలెక్షన్ ప్రారంభించబోతున్నారు. తన ఆర్ట్ వర్క్, పర్సనల్స్కి సంబంధించిన కలెక్షన్స్‌ని ఎన్ఎఫ్టీలోకి తీసుకు వస్తున్న మొదటి ఇండియన్‌గా అమితాబ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు రితీ ఎంటర్టైన్మెంట్, ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్న నో కోడ్ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. నవంబర్‌లో అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు వాటిని వేలంలో దక్కించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్కార్లును ఉపయోగించి ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు BeyondLife.Club ద్వారా వేలంలో పాల్గొనవచ్చని రితీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఎన్ఎఫ్టీ అంటే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులు, వ్యక్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. ట్రెండ్ మారుతోంది మనకు గాంధీజి ఉపయోగించిన కళ్లజోడు, స్వామి వివేకనంద రాసిన ఉత్తరం, పికాసో వేసిన పెయింటింగ్, టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, సచిన్ వందో సెంచరీ చేసిన బ్యాట్, షారూక్ఖార్ వాడిన బైక్ ఇలా ప్రముఖులకు సంబంధించిన ఆర్ట్‌వర్క్ లేదా వారు ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వీటి కోసం వేలం పాటలు అక్కడక్కడా జరిగేవి. కొన్ని సార్లు ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం సెలబ్రిటీలే ముందుకు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు వేలంలో ఉంచేవారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ట్రెండ్ మారింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత తమ ఆర్ట్‌వర్క్‌లను సెలబ్రిటీలే నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)గా వేలంలో ఉంచుతున్నారు. అమితాబ్‌తో మొదలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పాలిగజ్ వంటి డీఫై యాప్‌లు స్టార్టప్‌లుగా ఉండగా ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం ఇండియాలో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్న అమితాబ్‌ను ఎంచుకున్నాయి. బిగ్‌బి బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటూ క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్టీ అస్సెట్స్కి ఇండియాలో మార్కెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమితాబ్‌కి సంబంధించిన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మీకెం కావాలో అడగండి గతంలో వేలం పాటలో సాధారణంగా గతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆర్ట్‌వర్క్‌ను వేలంలో ఉంచేవారు. ఈ ఎన్ఎఫ్టీలో మీకేం కావాలో అడగండి సెలబ్రిటీలు ఆ పని చేసి మీకు డిజిటల్ ఫార్మాట్లో మీకు మాత్రమే స్వంతం అయ్యేలా అందిస్తారంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారను. దీనిపై రితి ఎంటర్టైన్మెంట్ ఎండీ ఆరుణ్ పాండే మాట్లాడుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా సెలబ్రిటీలు, సినితారలు వేగంగా మారిపోతున్నారు. ఈ ఎన్ఎఫ్టీల ద్వారా సెలబ్రిటీలకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు వారి అభిమానులకు విలువైన ఆస్తులు అందివ్వడమే మా లక్ష్యం అని చెప్పారు. అభిమానులు ఆలస్యం చేయకుండా బిగ్ బి నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి అంటూ కోరుతున్నారు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
చిన్న ఫోటో ఖరీదు రూ.1.3 కోట్లు!
ఆండీ ముర్రే 2013లో వింబుల్డన్ గెలిచిన క్షణానికి సంబంధించిన ఫోటోను నాన్-ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)గా సోమవారం వేలంలో $177,777(సుమారు రూ. 1.3 కోట్లు)కు విక్రయించారు. స్కాటిష్ టెన్నిస్ స్టార్ గత నెలలో తన వింబుల్డన్ విజయానికి గుర్తుగా దిగిన ఈ ఫోటోను బ్లాక్ చైన్ ఆధారిత ఎన్ఎఫ్టీ రూపంలో వీన్యూ అనే వేదికపై అమ్మకానికి ఉంచినట్లు ప్రకటించారు. ఎన్ఎఫ్ టి అనేది క్రిప్టోకరెన్సీ లాగా ఒక రకమైన డిజిటల్ ఆస్తి. కొనుగోలుదారుడు మాత్రమే ఆ ఎన్‌ఎఫ్‌టీపై యాజమాన్య హక్కును పొందగలడు. ఆండీ ముర్రే 2013లో గెలిచిన వింబుల్డన్ "క్షణాన్ని" కొనుగోలుదారుడు వీడియో కాపీరైట్ ను కలిగి ఉండడు. కానీ దానిని చూపించడానికి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ను పొందుతారు. అమెరికన్ డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ మార్చిలో ఒక కళాఖండాన్ని ఎన్ఎఫ్టీ రూపంలో 69.3 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 514 కోట్లు) విక్రయించినప్పుడు తాను మొదటి సారి ఎన్ఎఫ్టీ గురించి తెలుసకున్నట్లు ముర్రే చెప్పారు. బీపుల్ అనే వ్యక్తి వెన్యూ వ్యవస్థాపకుల్లో ఒకరు. "నేను ఇంకా ఎన్ఎఫ్టీల గురించి నేర్చుకుంటున్నాను, కానీ ఇది ఒక ఉత్తేజకరమైన ప్రాంతంగా అనిపిస్తుంది. మరింత మంది అథ్లెట్లు, కంటెంట్ సృష్టికర్తలు దీనిలో పాల్గొంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ముర్రే ఈ-మెయిల్ ద్వారా రాయిటర్స్ కు చెప్పారు. -
ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు
ఇల్లు కాలిపోతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ దిగిన ఫోటోను ఇటీవల ఇంటర్నెట్ లో ఎన్ఎఫ్టీ ద్వారా విక్రయించడం వల్ల 5,00,000(సుమారు రూ. 3.7 కోట్లు) డాలర్లకు అమ్ముడు పోయింది. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది? దాన్ని ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారో తెలుసుకుందాం. జో రోత్ అనే అమ్మాయి 2005లో తనకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కాలిపోతున్న భవనం ముందు నిల్చొని ఫోటో దిగింది. ఈ ఫోటోలో చూడటానికి నవ్వుతూ దెయ్యంగా ఉన్న ఫోటోను తన తండ్రి డేవ్ రోత్ తీశాడు. అప్పుడు ఆ ఫోటోను తీసిన తన తండ్రికి గానీ, తనకు గానీ తెలియదు భవిష్యత్తులో కోట్లు తెచ్చిపెడుతుందని. జేపీజీ మ్యాగజైన్ నిర్వహించిన ‘ఎమోషన్ క్యాప్చర్’ అనే కంటెస్ట్ వీరి జీవితాన్ని మార్చేసింది. జో రోత్ తండ్రి ఈ పోటీకి తన కూతురు దిగిన ఫోటోను పంపించాడు. ఈ ఫోటో 2005 నుంచి అందరికీ ఫేవరెట్‌గా నిలిచింది. అప్పటి నుంచి జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’గా ఫేమస్ అయ్యింది. అమెరికాకు చెందిన జో రోత్ కి ప్రస్తుతం 21 సంవత్సరాలు. తను యూనివర్సిటీ ఆఫ్ కరోలినాలో చదువుతుంది. గతంలో ‘ఓవర్లీ ఎటాచ్డ్ గర్ల్ ఫ్రెండ్’, ‘బ్యాడ్ లక్ బ్రియన్’ వంటి ఫేమస్ మీమ్స్ లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయి. అది చూసిన తనకు కూడా పాత ఫోటోను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. తర్వాత తన తండ్రికి ఈ విషయం చెప్పింది. వారు ఒక లాయర్, మేనేజర్‌ను కలిసి తమ ఆలోచనను పంచుకున్నారు. వారి సలహా మేరకు తన మీమ్ ఒరిజినల్ డిజిటల్ కాపీని వేలం వేశారు. ఏప్రిల్ 16న ఈ ‘డిజాస్టర్ గర్ల్ మీమ్’ ఫోటోను 24 గంటలు వేలంలో పెట్టారు. అది ఏకంగా 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ ఫోటోను దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘3 ఎఫ్ మ్యూజిక్’ అనే మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ సీఈఓ ఫర్జిన్ ఫర్దిన్ ఫార్డ్ వేలంలో దక్కించుకున్నాడు. ఇందులో కొంత మొత్తం చారిటీకి, మిగతాది తన చదువులకు ఖర్చు చేయనున్నట్లు జో రోత్ పేర్కొంది. చదవండి: భారీ ధర పలికిన జాక్ తొలి ట్వీట్.. ఎంతో తెలుసా? -
భారీ ధర పలికిన జాక్ తొలి ట్వీట్.. ఎంతో తెలుసా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్. మరి ఈ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’’ అని జాక్ డోర్సీ పోస్టు చేశాడు. ఈ పోస్టు పెట్టి 2021 మార్చి 21నాటికి సరిగ్గా పదిహేను ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ట్విట్ ప్రత్యేకత ఏంటో తెలుసా?. మీరు ఊహించని ధరకు అమ్ముడుపోవడమే. ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్ డోర్సీ ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. జాక్ డోర్సీ 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు పెట్టిన అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 29,15,835.47 డాలర్లు(సుమారు రూ.21 కోట్లు). ఇంత ధర పెట్టి బ్రిడ్జ్ ఒరాకిల్ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్‌కాయిన్ రూపంలోకి మార్చి ‘గివ్ డైరెక్ట్లీస్ ఆఫ్రికా రెస్పాన్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని డోర్సీ ప్రకటించారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా భాదపడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! -
మానవ బాంబు ఆడియోలు అమ్మేస్తున్నాడు..
న్యూయార్క్ : మానవ బాంబు(అపాన వాయువు) శబ్ధాలను అమ్మకానికి పెట్టి, సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఒక్కో అపాన వాయువు శబ్ధాన్ని వేల రూపాయలకు అమ్ముతున్నాడు. వివరాలు.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ రెమిరెజ్ అనే వ్యక్తి మార్చి 2020లో క్వారెంటైన్లో ఉండగా అపానవాయువు శబ్ధాలను రికార్డు చేయటం మొదలుపెట్టాడు. అతడి మిత్రులు కూడా అపాన వాయువు శబ్ధాలను రికార్డు చేసి తమ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకోసాగారు. ఈ మార్చి 2021కి వారు అపాన వాయువులను రికార్డు చేయబట్టి సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో రికార్డు చేసిన ఆడియోలను కలిపి ఓ పెద్ద ఫైల్‌గా తయారు చేశారు. అది 52 నిమిషాల నిడివి కలిగిన ఆడియో ఫైల్‌గా తయారయింది. అనంతరం ఈ ఫైల్స్‌ను విడివిడిగా అమ్మటం మొదలుపెట్టాడు అలెక్స్. ఒక్కో ఆడియో ఫైల్ రూ.6,600కు అమ్ముతున్నాడు. కొన్ని సార్లు ఈ ధర రూ.13,257 చేరుతోంది. దీనిపై అలెక్స్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ డిజిటల్ ఆర్ట్స్‌ను, జిప్స్‌ను అమ్ముతున్నారు. అపాన వాయువులను ఎందుకు అమ్మకూడదు. ఒక వేళ అపాన వాయువుల ధర పెరిగితే మన చేతుల్లో చాలా విలువైన అపాన వాయువులు ఉన్నట్టే. మేము దీన్ని ఓ ఆదాయం మార్గంగా భావించటం లేదు. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌కు క్రేజ్ పెరుగుతున్న తరుణంలో మా ఆడియో రికార్డింగ్స్‌కు ప్రాచూర్యం అభిస్తుంది. ఈ ఎన్ఎఫ్టీ ఆడియోలు ప్రజల్ని నవ్విస్తాయి.. మమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి’’ అని పేర్కొన్నాడు. చదవండి : హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది! వెంటాడిన జనం: చావు భయంతో ఏనుగు పరుగులు -
బీఎస్ఎన్ఎల్లో ఎన్నికల కోలాహలం
కర్నూలు: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాలకు ఎన్నికల తేదీ ప్రకటించడంతో కర్నూలులో కోలాహలం ప్రారంభమైంది. నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగులు మెజారిటీ యూనియన్ను నిర్ణయించేందుకు మే నెల 10న ఏడో వెరిఫికేషన్ (ఎన్నికలు) నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 19 యూనియన్లుండగా ఈయూ, ఎన్‌ఎఫ్‌టీఈ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. 2002లో జరిగిన మొదటి ఎన్నికల్లో మాత్రమే ఎన్‌ఎఫ్‌టీఈ గెలిచింది. తర్వాత ఐదుసార్లు ఈయూ గెలుస్తూ వచ్చింది. 2013 ఏప్రిల్ 6 ఎన్నికల్లో ఈయూ 48.6 శాతం ఓట్లతో ప్రధాన గుర్తింపు యూనియన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ రెండు సంఘాలకు వరుసగా అభిమన్యు, కామేశ్వరసింగ్ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. వారం రోజులుగా ఇరు సంఘాల నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 716 మంది ఓటర్లుండగా కర్నూలు పాత బస్టాండులోని టీఆర్ఏ కార్యాలయం, శ్రీనివాసనగర్‌లోని ఈ10బీ ఎక్సేంజీ, నంద్యాల, ఆదోని, డోన్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డీఈ రమేశ్ ఎన్నికల సహాయ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రధాన యూనియన్ల నాయకులు సమావేశాలతో తలమునకలై ఉన్నారు. జాతీయ నాయకులు కర్నూలు, ఆదోని కేంద్రాల్లో సుడిగాలి పర్యటన జరిపి బుధవారం రాత్రి పొద్దుపోయే దాకా ప్రచార సభలు నిర్వహించారు.