ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్‌లోనూ క్రిప్టో ప్రాధాన్యం పెరిగిపోతోంది ఇప్పుడు. ఆటగాళ్ల పేరిట ఎన్‌ఎఫ్‌టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్)లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువప్లేయర్ ఎన్‌ఎఫ్‌టీకి సుమారు 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ పలకడం యావత్ క్రీడా రంగంలో చర్చకు దారితీసింది. విశేషం ఏంటంటే.. ఆ ఆటగాడి దరిదాపుల్లో ఏ దిగ్గజ ప్లేయర్ కూడా లేకపోవడం!.
బోరష్యా డోర్ట్‌మండ్.. జర్మనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఈ క్లబ్‌కి చెందిన స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ ‘డిజిటల్ కార్డు’ ఏకంగా 5, 11, 000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 5 కోట్ల 13 లక్షలకు పైనే. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా హయ్యెస్ట్ వాల్యూ దక్కించుకున్న క్రిస్టియానో రొనాల్డ్ యునిక్ ఐటెం ధర 2, 04, 000 పౌండ్లు. మన కరెన్సీలో రూ. 2 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే.. హాల్యాండ్ ఎన్‌ఎఫ్‌టీ డిజిటల్ స్పోర్ట్స్ ఐటెమ్స్‌లో ఇప్పటిదాకా అత్యంత విలువైన వస్తువుగా నిలిచిందన్నమాట.
గత అక్టోబరులో DFL మరియు Sorareల భాగస్వామ్యంలో డిజిటల్ ప్లేయర్‌ఐటమ్స్‌ను ఎన్‌ఎఫ్‌టీల రూపంలో.. సోరేర్ ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్ ఆడడానికి అనుమతిస్తున్నారు. అందుకే తర్వాతి జనరేషన్ గేమర్స్.. ఈ ట్రేడింగ్‌పై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఎదురులేని ఎర్లింగ్
ఎర్లింగ్ బ్రాట్ హాల్యాండ్.. నార్వేజియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. జర్మన్ బుండెస్లిగా క్లబ్ బోరష్యా డోర్ట్‌మండ్‌తో పాటు నార్వే నేషనల్ టీం తరపున ఆడుతున్నాడు. వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా.. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రయికర్‌గానూ పేరుంది ఇతనికి. లీడ్స్(ఇంగ్లండ్)లో జన్మించిన ఎర్లింగ్.. తండ్రి అల్ఫ్ ఇంగె హాల్యాండ్ నుంచి సాకర్‌ను పుణికిపుచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన ఎర్లింగ్.. ఆ తర్వాత బ్రైన్ క్లబ్ తరపున 2016లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. హ్యాండ్‌బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ మంచి ఆటగాడు. ఐదేళ్ల వయసులో(2006) స్టాండింగ్ లాంగ్ జంప్‌లో 1.63 మీటర్లు దూకి.. ఏకంగా ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు ఎర్లింగ్.
సోరారే ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్.. నిజ జీవితంలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్‌డేలో జరిగే పాజిటివ్ (గోల్స్, అసిస్ట్‌లు) లేదా నెగటివ్ (రెడ్ కార్డ్‌లు) ఈవెంట్‌ల ఆధారంగా ఒక్కో గేమ్‌కు 0 మరియు 100 పాయింట్ల మధ్య ఆటగాళ్లు సంపాదిస్తారు. ఐదుగురు ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి, ఇతర యూజర్లతో పోటీపడతారు.
చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా రికార్డు..!
Comments
Please login to add a commentAdd a comment