player
-
గణపతి పూజ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్.. ఫొటోలు వైరల్
-
కీర్తి ఆజాద్ టూ యూసఫ్: రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన క్రీడాకారులు వీరే
-
సిక్సర్ల కింగ్ శివమ్ దూబే.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (ఫొటోలు)
-
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.. 27 ఏళ్ల ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?
-
క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే..
క్రికెట్ మ్యాచ్‌లో మనం ఎంచుకున్న జట్టే గెలవాలని బలంగా అనుకుంటాం. మైదానంలో క్రీడాకారులు ఆడుతుంటే ఊపిరి బిగబట్టి చూస్తూంటాం. టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ చివరి బంతి ఆడే వరకు ప్రతిక్షణం ఉత్కంఠభరితంగానే సాగుతుంది. అయితే మనం కోరుకునే జట్టు గెలుపోటములు మాత్రం ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ తరుణంలో అందరూ ఆటలోని మజాను ఆస్వాదిస్తుంటారు. అయితే క్రికెట్‌ను చూస్తూ ఆనందించడమే కాకుండా అది మనకు కొన్ని ఆర్థిక పాఠాలూ నేర్పుతుంది. వాటి గురించి ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ విజయమే అంతిమ లక్ష్యం. అందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితమైన అంచనాలతో ఆడాల్సిందే. పెట్టుబడులూ అంతే.. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోతే విజయం సాధించడం కష్టం అవుతుంది. ఆటగాళ్ల ఎంపిక చాలాముఖ్యం.. జట్టులోని ఆటగాళ్ల సెలక్షన్ బాగుంటేనే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందరూ బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లే ఉంటే ఎలా జట్టు గెలుపొందడం కష్టం అవుతుంది. అందుకే వైవిధ్యంగా ఉండాలి. పెట్టుబడుల విషయమూ అంతే. ఒకే తరహా పథకాలు, స్టాక్‌లపై ఆధారపడితే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. షేర్లు, బాండ్లు, ఫండ్లు, బంగారం ఇలా పలు పథకాలు ఎంచుకోవాలి. ఒకే బ్యాట్స్‌మన్‌పై ఎక్కువగా ఆధారపడటమూ మంచిది కాదు. ఈక్విటీల్లో ఏదో ఒక షేరులోనే మొత్తం పెట్టుబడిని కేటాయించడం వల్ల నష్టభయం పెరుగుతుంది. వికెట్‌ను కాపాడుకోవాలి... వికెట్‌ను కాపాడుకోవడం.. క్రికెట్లో కీలకం. మైదానంలో నిలదొక్కుకుంటేనే బాగుంటుంది. కానీ, పరుగులు తీయకుండా అలాగే కొనసాగడం కూడా నష్టం చేస్తుంది. దాంతో విలువైన బంతులు వృథా అవుతాయి. మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావిస్తూ మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో సాధించేదేమీ ఉండదు. ద్రవ్యోల్బణం రాబడులను హరిస్తుంది. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలనే నమ్ముకుంటే ఫలితం ఉండదు. రాబడి ఇచ్చే పథకాలు ఎంచుకోవాలి. లక్ష్యం మర్చిపోకుండా... ప్రత్యర్థిజట్టు ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. భారీగా ఉండే లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లక్ష్యం మరిచిపోయి హిట్టింగ్ ఎంచుకుని వికెట్ పోగుట్టుకుంటారు. చాలామంది మదుపరులు ఇలాంటి పొరపాటే చేస్తారు. ఆర్థిక లక్ష్యం మరిచిపోయి అధిక రాబడులపై ఆశపెంచుకుంటారు. ఫలితంగా ట్రేడింగ్ లేదా ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఆ తొందరపాటులో లాభాలు రాకపోగా పెట్టుబడినీ నష్టపోతారు. లక్ష్యం భారీగా ఉన్నప్పుడు.. క్రమశిక్షణతో ఒక్కో ఓవర్‌కు ఇన్ని పరుగులు అని స్థిరంగా సాధించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. అదే తరహాలో క్రమానుగత పెట్టుబడులను కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తొలి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. సంపాదన ప్రారంభించిన వెంటనే వీలైనంత మదుపు చేసే ప్రయత్నం చేయాలి. ఒక చెత్త ఓవర్ ఆటను మలుపు తిప్పుతుంది. ఇదే తరహాలో మీ పెట్టుబడుల్లో పనితీరు బాగాలేని ఒక పథకం ఉంటే.. మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది. అలాంటి పథకాలను గుర్తించి, తొలగించాలి. మైదానంలో ఎన్నో అంశాలు క్రీడాకారుల దృష్టిని మరలుస్తాయి. కానీ, వారి లక్ష్యం మారదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు వచ్చే అవాంతరాలను పట్టించుకోకుండా లక్ష్యం చేరుకునే వరకూ ఓపిక పట్టాలి. లక్ష్యానికి చేరువైనప్పుడు.. దూకుడుగా కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. ఇదే తీరుగా అనుకున్న మొత్తం సమకూరినప్పుడు నష్టభయం ఉన్న పథకాల నుంచి సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మార్చుకోవాలి. జట్టు సభ్యులందరితో కలిసి కోచ్ ఒకసారి మ్యాచ్‌ను సమీక్షిస్తారు. ఇలాగే పెట్టుబడులనూ సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ -
బ్రెజిల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న మహాత్మాగాంధీ!
రియో డీ జెనెరో : బ్రెజిల్లో కుర్రాళ్లు ఫుడ్‌బాల్ ఆడడంలో వింతేం లేదు. ఆ దేశంలో ఫుట్‌బాల్‌కు ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆట తీరో ఇంకొకటో కాదు.అతని పేరులోని గొప్పతనం. బ్రెజిల్‌లోని ట్రిండేడ్ ఫుట్‌బాల్ క్లబ్లో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్న 31 ఏళ్ల ఆ ఆటగాడి పేరు మహాత్మాగాంధీ హెబెర్పియో మట్టోస్ పిరెస్.దీంతో అందరి దృష్టి అతడిపై పడుతోంది.2011 నుంచి మహాత్మా గాంధీ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. మహాత్మాగాంధీ ఒక్క పేరే కాకుండా బ్రెజిల్‌లోని ఫుట్‌బాల్ క్లబ్బుల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల పేర్లుండడం విశేషం.ఒక ఆటగాడికి బీటిల్స్ సింగర్ జాన్ లెన్నన్ పేరుండగా మరో ఆటగాడు బ్రెజిల్ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటైన పికాచు అనే పేరు పెట్టుకున్నాడు.ఇవే కాకుండా మర్లన్ బ్రాండో,మస్కిటో లాంటివి ఇంకా చాలా అందరి దృష్టిని ఆకర్షించే పేర్లున్న ఆటగాళ్లున్నారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకారం జాతిపిత మహాత్మాగాంధీ 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫఫ్రికాలో ఉన్నపుడు అక్కడ మూడు ఫుట్‌బాల్ టీమ్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జోహెన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ ఫుట్‌బాల్ క్లబ్లును గాంధీ స్వయంగా స్థాపించారు.దీంతో ఫుట్‌బాల్ క్రీడపై గాంధీ చెరగని ముద్ర వేసినట్లయింది. ఇదీ చదవండి.. ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? -
తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ పురస్కారం
ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కడం విశేషం. ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్ జాంగ్ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్ హైయాంగ్ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (2010 గ్వాంగ్జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్ గుర్తింపు పొందారు. -
మొసలి దాడిలో ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్‌లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్‌గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్‌ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
ఆస్ట్రేలియన్ ప్లేయర్, వాయిస్ అఫ్ గేమ్ అలాన్ మెక్గిల్వ్రే (ఫొటోస్)
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రియ మృతిపై విచారణ పూర్తి.. నివేదికలో ఏముందంటే!
సాక్షి, చెన్నై: ఫుట్‌బాల్ క్రీడాకారిణి ప్రియ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఆరోగ్య శాఖకు చేరింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైద్యులు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెన్నై వ్యాసార్పాడికి చెందిన ప్రియ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందం జరిపిన విచారణలో పెరియార్ నగర్ ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెలుగు చూసింది. ఆమెకు సరైన పద్ధతిలో చికిత్స అందించలేదని తేలింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని విచారణలో స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌కు ప్రత్యేక బృందం సమర్పించింది. బెయిల్ నిరాకరణ ప్రియ మరణానికి కారకులైన వైద్యులు సోమ సుందరం, బలరాం శంకర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాము గతంలో అనేక విజయవంతమైన శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అందరూ క్షేమంగానే ఉన్నట్లు అందులో వివరించారు. ప్రియ శస్త్ర చికిత్స, మరణం దురదృష్టకరమని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకారం అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. తాము వైద్య కమిటీ విచారణకు హాజరు కావాల్సి ఉందని, అంతలోపు తమను అరెస్టు చేస్తే వెళ్లలేని పరిస్థితి ఉంటుందని వివరించారు. అయితే, వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో ఈ ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
నిష్క్రమించిన దిగ్గజం
బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్ దిగ్గజ త్రయంలో ఫెదరర్తోపాటున్న రాఫెల్ నాదల్, జోకోవిచ్లిద్దరూ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్ అడ్రస్. ఫుట్‌వర్క్, అటాకింగ్ గేమ్ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్ల సంగతలా ఉంచి హ్యూబర్ట్ హుర్కజ్లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు. ఫెదరర్ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్ మొదట్లో ఫెదరర్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి. -
హాకీ స్టిక్ మాంత్రికుడు: ద్యాన్ చంద్ /1905-1979
1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో జెస్సీ ఒవెన్ సాధించిన ఘనత గురించి ఇప్పటికీ ప్రశంసల వర్ష కురిపిస్తాం. అప్పటి నాజీ ధోరణులపై ఆయన పైచేయి సాధించినట్లు భావిస్తాం. మరి ధ్యాన్ చంద్ గురించి ఏం చెప్పుకోవాలి? ఆయన అంతకు మునుపటి రెండు ఒలింపిక్స్‌లో 20 గోల్స్ సాధించడమే కాక, బెర్లిన్‌లో సైతం తన సత్తా చాటారు. ఫైనల్లో జర్మనీ జట్టుపై మూడు గోల్స్ చేశారు. ధ్యాన్‌చంద్ ప్రపంచంపై చూపిన ప్రభావంపై సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది. ‘‘కేవలం చదవడం, రాయడమే’’ వచ్చిన ఈ సాధారణ భారతీయుడు ప్రపంచ హాకీ భవిష్యత్తునే తిరగరాశారు. హాకీ జట్టు మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పుడు బెర్లిన్ ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ధ్యాన్ చంద్ నియమితులయ్యారు. నిజం చెప్పాలంటే, తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటి కన్నా ఇలా కెప్టెన్‌గా నియమితం కావడమే ధ్యాన్ చంద్ జీవితంలోని అత్యున్నత సంఘటన. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తక రచయితల మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రపంచంలోని అతి పెద్ద విడాకులు’ అయిన భారతదేశ విభజన సందర్భంగా చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ను సైతం లెక్కపెట్టి, భారత పాకిస్థాన్‌ల మధ్య పంచుకున్నారు. అయితే బ్రిటిష్ భారతావని లేదా అవిభక్త భారతదేశంగా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మూడు స్వర్ణాలూ తటస్థమైనవేనని ప్రకటించారు. 1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌నే తీసుకుంటే భారతహాకీ జట్టులోని 18 మందిలో పాకిస్థాన్ నుంచి ఇద్దరు హిందువులు, నలుగురు ముస్లిములు, ఎనిమిది మంది ఆంగ్లో ఇండియన్లు ఉన్నాయి. అయితే «ధ్యాన్ చంద్ ఆట నైపుణ్యంతో పోలిస్తే ఆ 14 మందీ తక్కువే కావడంతో, స్వతంత్ర భారతావనే ఆ మానసిక యుద్ధంలో విజయం సాధించింది. ఆత్మకథ అయిన ‘గోల్’లోమాత్రం ధ్యాన్‌చంద్, ‘‘ఆత్మకథ రాసేంతగా నేను మరీ ముఖ్యమైన వ్యక్తినేమీ కాదు’’ అని సవినయతను కనబరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత జాతి ప్రతిపత్తిని నిరంతం ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు. – కె.ఆర్ముగం, భారత హాకీ అంశాలపై నిపుణులు (చదవండి: మొనగాళ్లకు మొనగాడు ) -
సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం
దారంతా కష్టాలు కనిపించాయి. చెమట్లు చిందించాడు. అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. అంతులేని పట్టుదల ప్రదర్శించాడు. పేదరికం పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రతిభను నమ్ముకుని ముందుకు కదిలాడు. ఆ కష్టాలు ఇప్పుడతనికి అనుభవాలయ్యాయి. అవరోధాలు మైలురాళ్లుగా మారాయి. పేదరికం తన గమ్యాన్ని గుర్తు చేసే సాధనమైంది. సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణమై కనిపిస్తున్న రమణమూర్తి క్రీడా ప్రయాణం ఆసాంతం ఆదర్శ ప్రాయం. ఇప్పటికే జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన ఈ డిగ్రీ కుర్రాడు జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. శ్రీకాకుళం న్యూకాలనీ: కఠోర శ్రమ, సాధన, పట్టుదలకు ప్రతిభ తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాడు అంపోలు రమణమూర్తి. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా కూడా అర్హత సాధించడం విశేషం. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామానికి అంపోలు రమణమూర్తి తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణవేణి. రమణమూర్తికి అక్క రాజేశ్వరి కూడా ఉంది. రమణమూర్తి తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలే. 2010–11లో జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం(ఆమదాలవలస మండలం)లో 6వ తరగతి చదువుతున్న సమయంలో రమణమూర్తిలో ఉన్న ప్రతిభను అక్కడి ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ముఖ్య ప్రతినిధి మొజ్జాడ వెంకటరమణ గుర్తించారు. అలాగే పీడీ ఎంవీ రమణ అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన రమణమూర్తి రాష్ట్రపోటీలకు ఎంపికయ్యాడు. స్లగ్గింగ్తోపాటు ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో మాచర్లలో తాను ప్రాతినిధ్యం వహించిన తొలి రాష్ట్ర పోటీలోనే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. పాల్గొనే ప్రతి మీట్లోను సత్తాచాటుకున్నాడు. త్రోబాల్ లో కూడా ప్రవేశం ఉన్న రమణమూర్తి జాతీయ పోటీల్లో రాణించాడు. అనతి కాలంలోనే జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించాడు. సౌత్‌జోన్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, ఫెడరేషన్ కప్‌లో రజత పతకం సాధించాడు. ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన రమణమూర్తి ప్రస్తుతం డిగ్రీ బీఎస్సీ సీబీజెడ్ ఫైనలియర్ చదువుతున్నాడు. 2020 రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తమ క్రీడాకారుడిగా నాటి కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత.. ఒకవైపు ఆటతోపాటు మరోవైపు కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత సాధించిన రమణమూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2020లో జాతీయ పోటీలకు టెక్నికల్ అఫీషియల్స్‌గా/రిఫరీగా వ్యవహరించే రిఫరీ టెస్టులో అర్హత సాధించాడు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్లేట్ అంపైర్‌గా, టెక్నికల్ అఫీషియల్స్‌గా కూడా వ్యవహరించి మెప్పించాడు. అలాగే 2021–22లో ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి కోచ్‌గా కూడా అర్హత సాధించాడు. రమణమూర్తి సాధించిన విజయాలు.. ► 2016–17లో మహారాష్ట్రలో జరిగిన ఆలిండియా స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ► 2016–17లో వైఎస్సార్ కడపలోని పుల్లంపేటలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలవ డంలో కీలక భూమిక పోషించాడు. ► 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియ ర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు. ఈ పోటీల్లో ఏపీ రన్నరప్ గా నిలిచింది. ► 2020లో ఆలిండి యా సౌత్‌జోన్ సీనియ ర్స్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ పోటీ ల్లో ఏపీ విజేతగా నిలిచింది. ► 2022 మార్చిలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలిండియా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీ ల్లో బీఆర్‌ఏయూ సెమీస్‌లో ఓటమిపాలైంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మనాన్న కూలికి వెళ్తే తప్ప జరగని పరిస్థితి. నేను జాతీయస్థాయి క్రీడాకారునిగా గుర్తింపు పొందాను. ఎన్ఐఎస్ పూర్తి చేసి కోచ్‌గాను, రిఫరీ టెస్టులో క్వాలిఫై అయి టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యాను. నా ప్రతి విజయంలోను నా గురువు ఎంవీ రమణ సర్ ప్రోత్సాహం ఉంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాను. – అంపోలు రమణమూర్తి, సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడాకారుడు నిరంతరం కష్టపడతాడు అంపోలు రమణమూర్తి పాఠశాల స్థాయి నుంచి కష్టపడే మనస్తతత్వాన్ని అలవర్చుకున్నాడు. ఉత్తమ లక్షణాలు, నడవడిక కలిగిన రమణమూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆనాడే గుర్తించాను. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం తరఫున బాసటగా నిలిచాం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు. – ఎంవీ రమణ, ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధి -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్‌గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్‌లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్‌గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
పిట్టకొంచెం కూతఘనం
-
కుర్ర ప్లేయర్.. రూ. ఐదు కోట్లకుపైగా వాల్యూ.. ఏమా కథ?
ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్‌లోనూ క్రిప్టో ప్రాధాన్యం పెరిగిపోతోంది ఇప్పుడు. ఆటగాళ్ల పేరిట ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్)లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువప్లేయర్ ఎన్ఎఫ్టీకి సుమారు 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ పలకడం యావత్ క్రీడా రంగంలో చర్చకు దారితీసింది. విశేషం ఏంటంటే.. ఆ ఆటగాడి దరిదాపుల్లో ఏ దిగ్గజ ప్లేయర్ కూడా లేకపోవడం!. బోరష్యా డోర్ట్‌మండ్.. జర్మనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఈ క్లబ్‌కి చెందిన స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ ‘డిజిటల్ కార్డు’ ఏకంగా 5, 11, 000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 5 కోట్ల 13 లక్షలకు పైనే. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా హయ్యెస్ట్ వాల్యూ దక్కించుకున్న క్రిస్టియానో రొనాల్డ్ యునిక్ ఐటెం ధర 2, 04, 000 పౌండ్లు. మన కరెన్సీలో రూ. 2 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే.. హాల్యాండ్ ఎన్ఎఫ్టీ డిజిటల్ స్పోర్ట్స్ ఐటెమ్స్‌లో ఇప్పటిదాకా అత్యంత విలువైన వస్తువుగా నిలిచిందన్నమాట. గత అక్టోబరులో DFL మరియు Sorareల భాగస్వామ్యంలో డిజిటల్ ప్లేయర్ఐటమ్స్ను ఎన్ఎఫ్టీల రూపంలో.. సోరేర్ ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్ ఆడడానికి అనుమతిస్తున్నారు. అందుకే తర్వాతి జనరేషన్ గేమర్స్.. ఈ ట్రేడింగ్‌పై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎదురులేని ఎర్లింగ్ ఎర్లింగ్ బ్రాట్ హాల్యాండ్.. నార్వేజియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. జర్మన్ బుండెస్లిగా క్లబ్ బోరష్యా డోర్ట్మండ్తో పాటు నార్వే నేషనల్ టీం తరపున ఆడుతున్నాడు. వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా.. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రయికర్గానూ పేరుంది ఇతనికి. లీడ్స్(ఇంగ్లండ్)లో జన్మించిన ఎర్లింగ్.. తండ్రి అల్ఫ్ ఇంగె హాల్యాండ్ నుంచి సాకర్‌ను పుణికిపుచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన ఎర్లింగ్.. ఆ తర్వాత బ్రైన్ క్లబ్ తరపున 2016లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. హ్యాండ్‌బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ మంచి ఆటగాడు. ఐదేళ్ల వయసులో(2006) స్టాండింగ్ లాంగ్ జంప్‌లో 1.63 మీటర్లు దూకి.. ఏకంగా ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు ఎర్లింగ్. సోరారే ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్.. నిజ జీవితంలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్‌డేలో జరిగే పాజిటివ్ (గోల్స్, అసిస్ట్‌లు) లేదా నెగటివ్ (రెడ్ కార్డ్‌లు) ఈవెంట్ల ఆధారంగా ఒక్కో గేమ్‌కు 0 మరియు 100 పాయింట్ల మధ్య ఆటగాళ్లు సంపాదిస్తారు. ఐదుగురు ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి, ఇతర యూజర్లతో పోటీపడతారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా రికార్డు..! -
పల్లె గర్వించేలా .. దేశం తలెత్తుకునేలా..
అది అటవీ సరిహద్దులోని మారుమూల గ్రామం. ఇప్పుడు ఆ పల్లె పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చానీయాంశంగా మారింది. భారత హాకీ జట్టులో గోల్ కీపర్‌గా రాణిస్తున్న రజని స్వస్థలం ఎర్రావారిపాళెం మండలంలోని యనమలవారిపల్లె. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ యువతి ఇప్పుడు దేశం గర్వించేలా ఒలింపిక్ మెడల్ సాధన దిశగా తన బృందం సభ్యులతో కలిసి దూసుకెళ్తోంది. సాక్షి, ఎర్రావారిపాళెం(చిత్తూరు): మండలంలోని కమళ్ల గ్రామం యనమలవారిపల్లె కుగ్రామానికి చెందిన రమణాచారి, తులసి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒక కుమారుడు. రమణాచారి వడ్రంగి పని చేస్తుండగా, తులసి పశువుల కాపరి. సంతానంలో రెండో కుమార్తె రజని 1 నుంచి 5వ తరగతి వరకు పచ్చారువాండ్లపల్లెలో, 6 నుంచి 10 వరకు నెరబైలు పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నత విద్యను అభ్యసించింది. హాకీకి నెరబైలే పునాది నెరబైలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రజని హాకీ క్రీడకు బీజం పడింది. అక్కడ 8వ తరగతి చదువుతుండగా పీఈటీ వెంకటరాజు సహకారంతో ఈ క్రీడ పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజనీ ఆటతీరును గుర్తించిన పీఈటీ ప్రోత్సాహంతో జోనల్ ప్లేయర్‌గా ఉన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో తిరుపతి సాయ్ హాస్టల్లో ఉంటూ హాకీ కోచ్ ప్రసన్నకుమార్ రెడ్డి ప్రోత్సాహంతో తన ఆట తీరును మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత జట్టులో గోల్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2004: 6వ తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్స్‌గా నిలిచింది. 2005: తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2005: పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో పాల్గొని సత్తాచాటింది 2006: ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 2007: కోయంబత్తూరు, ఇబల్పూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా 2008: రూర్కెలాలో జాతీయ పోటీల్లో విజయం. 2009: మొదటి సారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రవేశం 2010: చైనా, న్యూజిల్యాండ్, చైనా, కొరియా, అర్జెంటినాలో ఆడింది. 2011: ఆస్ట్రియా పోటీల్లో ఈమె జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. 2012: జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. 2013: నెదర్లాండ్, జర్మనీ, మలేషియా మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం. 2016: ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2017: జపాన్‌లో జరిగిన ఏషియన్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆసియా చాంపియన్లుగా నిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంస హాకీ క్రీడాకారిణి, గోల్ కీపర్ రజనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులను ఆయన సత్కరించారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గర్వంగా ఉంది కూతుళ్లంటే మాకు ప్రాణం. ఇద్దరికి పెళ్లిళ్లు చేసినా, రజని బాగా చదువుతుండడంతో ఎంత కష్టమైనా ముందుకు తీసుకెళ్దామనుకున్నాం. హాకీ ఇష్టమని చెప్పడంతో ప్రోత్సహించాం. ఆడపిల్లకు ఆటలు ఏమిటని ఊర్లో కొందరు గేలి చేసినా పట్టించుకోలేదు. ముము అనుకున్నట్లుగానే రాణించింది. ఇప్పుడు మా పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. ఊరు తలెత్తుకునేలా చేసింది మా కూతురు. – రజని తల్లిదండ్రులు రమణాచారి, తులసి మాటల్లో చెప్పలేని ఆనందం రజనితో పాటు నలుగురు యువతులు 2005లో సాయ్‌కి ఎంపికయ్యారు. వీరిలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజని ఆట పట్ల ఎంతో ఆసక్తి కనపర్చింది. ఆమె అంకితభావం, క్రమశిక్షణ కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో రాణిస్తోంది. రెండోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం అంత సులువైన విషయం కాదు. గురువుగా ఆమె ఎదుగుదల నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. – ప్రసన్నకుమార్‌రెడ్డి, హాకీ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తిరుపతి -
కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్
వెబ్‌డెస్క్: పైన ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు సంగీతా సోరెన్. ఊరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా బాసమూది. వయసు ఇరవై ఏళ్లు. లాక్డౌన్ ప్రభావంతో ఇలా ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. లేకుంటే ఆపాటికి ఫుట్‌బాల్ స్టార్‌గా వెలిగిపోయేదేమో! అవును.. సంగీత మంచి ఫుట్ బాల్ ప్లేయర్. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్17,అండర్18 పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి పర్ఫార్మెన్స్తో సీనియర్ టీమ్‌కు సెలక్ట్ అయ్యింది. టీంలో చేరుతుందనుకున్న టైంకి కరోనా మహమ్మారి వచ్చిపడింది. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్డౌన్ ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తోంది సంగీత. ప్రాక్టీస్ ఆపలేదు తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది. -
సర్ఫింగ్ క్రీడాకారిణి మృతి.. శిక్షణ సమయంలో ప్రమాదం
శాన్సాల్విడార్: మధ్య ఆమెరికా దేశమైన ఈఐ సాల్వడార్ జాతీయ సర్ఫింగ్ జట్టు క్రీడాకారిణి కేథరీన్ డియాజ్(22) మృతి చెందారు. శిక్షణ పొందుతున్న సయమంలో చోటు చేసున్న ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తెలిపింది. దేశంలోని నైరుతి పసిఫిక్ వైపు గల ఎల్ తుంకో బీచ్ల్ ఆమె మృతదేహం బయటపడినట్లు పేర్కొంది. అంతర్జాతీయ సర్ఫింగ్ టోర్నమెంట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి డియాజ్ సన్నద్ధమవుతోందని సర్ఫింగ్ ఫెడరేషన్ సభ్యుడొకరు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు యామిల్ బుకెల్ మాట్లాడుతూ.. ఆమె కుటంబం సభ్యులు, స్నేహితులకు సంఘీభావం తెలిపారు. డియాజ్ మృతి సర్ఫింగ్ జట్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు. చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ -
నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి..
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో ఆర్కే యువసేన ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి. ( గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన ) కొండపేటకు చెందిన నరేంద్ర ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లాడు. అవుట్ అయిన తర్వాత వెనక్కు తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. దీంతో నరేంద్ర సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారత షాట్‌పుట్ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్ క్రీడాకారుడు నవీన్ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవీన్ విఫలమైనట్లు ఐఏఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్ తన తాజా ప్రకటనలో తెలిపింది. ‘నాడా’ అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ–6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ–6 నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్ 2018 ఫెడరేషన్ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
బిగ్ ఫైట్/శుభారాణి
శుభారాణి దశ్ రోజూ తెల్లవారుజామున 3.20కి నిద్ర లేస్తారు. కాలకృత్యాలు ముగించుకుని ఆ చీకట్లోనే సైకిల్ మీద న్యూస్ పేపర్ల ఏజెంట్లు ఉండే సెంటర్‌కు వెళ్తారు. భువనేశ్వర్‌లో తన నివాసానికి దగ్గరగా ఉండే 200 ఇళ్లకు ఆ పేపర్లను డెలివరీ చేస్తారు. 7.30 కల్లా పేపర్ వెయ్యడం పూర్తవుతుంది. అక్కడి నుంచి స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు అదే సైకిల్ మీద కొన్ని ఇళ్లకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. తర్వాత ఇంట్లోనే సాయంత్రం వరకు కుట్టు మెషీన్ మీద బట్టలు కుడతారు. పాత న్యూస్పేపర్లతో కవర్లు తయారు చేస్తారు. ఆ కవర్లు ఎక్కువ మొత్తంలో జమ అయ్యాక ఒక రోజు వాటిని తీసుకెళ్లి కిరాణా దుకాణాలకు అమ్ముతారు. శుభారాణి దినచర్య ఇది. ఈ పనులన్నిటి మధ్య ఎప్పుడో కాస్త ఎంగిలి పడతారు. ఉదయం పేపర్ల సెంటర్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా ఇప్పిస్తే టీ తాగుతారు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒడిశా ఫుట్‌బాల్ అసోసియేషన్ తనకు ఇచ్చిన ప్రశంసాపత్రాలు, అవార్డులను తీసి చూసుకుంటారు. అవును శుభారాణి ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్లేయర్! ఇప్పుడు న్యూస్ పేపర్ హాకర్. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్లు. 1992లో తొలిసారి ఒడిశా రాష్ట్ర తొలి మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలిగా అస్సామీ కొండ ప్రాంతపు మైదానం హఫ్లాంగ్కు వెళ్లారు శుభారాణి. ఆ ఆటలో శుభారాణి ఒడుపైన ఆట వల్ల ఒడిశా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఆమె కెరీర్ కూడా 1998 వరకు చురుగ్గా ఎదిగింది. అయితే ఆ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత శుభారాణి మళ్లీ ఫుట్‌బాల్ ఆడలేకపోయారు. ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఇక ఉద్యోగంలో చేరబోతుండగా జరిగిన యాక్సిడెంట్ అది. అలా ఉద్యోగం కూడా ఆమెకు చేజారింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు శుభారాణి. స్కూల్లో ఆమె ఖో–ఖో ప్లేయర్. ఫుట్‌బాల్‌కు ముందు చిన్న వయసులోనే ఖో–ఖోలో నేషనల్ గేమ్స్ ఆడారు. శుభారాణికి యాక్సిడెంట్ అయిన రెండేళ్లకు ప్రకాశ్ చంద్ర మిశ్రా అనే బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. ప్రకాశ్ చంద్ర న్యూస్ పేపర్ హాకర్. భువనేశ్వర్ దగ్గరి షాహిద్ నగర్ ఏరియాలో ఇల్లు. చిన్న పెట్టెలాంటి గది అది. అక్కడే జోత్స్నమయి, స్తుతి ఆరాధన పుట్టారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే ఉన్నారు కానీ, పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో దగ్గర్లోనే ఇంకో ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ ఇంటి అద్దె ఏడు వేలు. భార్యాభర్తలతో పాటు, పిల్లలిద్దరూ చదువుకుంటూనే పేపర్లు వేస్తుంటారు. అందరికీ కలిపి నెలకు 12 వేలు వస్తుంది. అద్దె పోగా మిగిలేది ఐదు వేలు. ఆ ఐదు వేలలోనే కుటుంబం గడవాలి. పాత ఇంట్లో (గదిలో) బాత్రూమ్ లేదు. గది బయటే పాలిథిన్ షీట్లతో స్నానాలకు ఒక ‘మాటు’ను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు లేచే సరికే వీళ్ల స్నానాలు ముగించుకునేవారు. తర్వాత పిల్లల కోసం ఇల్లు మారక తప్పలేదు. భువనేశ్వర్‌లో వచ్చే ఏడాది ‘ఫిఫా’ యు–17 ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఒడిశా క్రీడా శాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ అధికారుల దగ్గరే పెన్షన్ కోసం శుభారాణి దరఖాస్తు చేసుకున్న కాగితం కూడా ఉంది. వాళ్లు దాన్ని ఓకే చేస్తే నెల నెలా ఆమెకు 3000 రూపాయలు వస్తాయి. శుభారాణి చెయ్యి చాసి ఎవర్నీ ఏమీ అడగలేదు. అడగలేరు కూడా. స్వాభిమానం. కానీ ఇలా జీవితంతో పోరాడేవారికి వాళ్లు నోరు తెరిచి అడక్కుండానే వాళ్లకు దక్కాల్సింది దక్కాలి. ‘‘అద్దె ఏడువేలు పోను, మిగిలే ఐదు వేలతో మేం నలుగురం ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఆడపిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల కోసం ఈ ఐదు వేలల్లోనే దాచేది దాస్తున్నాం. మా భయం ఒక్కటే. ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం వచ్చేనా దాచిందంతా కొట్టుకు పోతుంది. అప్పుడు జీవితం మళ్లీ మొదటికే వస్తుంది’’ – శుభారాణి, న్యూస్ పేపర్ హాకర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి