

భారత మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.గా కొనసాగుతున్నారు.

భారత దిగ్గజ క్రికెటర్ చేతన్ చౌహాన్ 1991, 1998లో లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.

భారత లెజండరీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ 2004 నుండి 2014 వరకు బీజేపీ తరపున లోక్‌సభ ఎంపీగా పనిచేశాడు.

భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభలో అడుగుపెట్టాడు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.

ఒలింపిక్ పతక విజేత, దిగ్గజ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ 2014లో బీజేపీ లోక్‌సభకు ఎంపికయ్యారు.

టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ 2019లో ఢిల్లీ నుంచి బీజేపీ తరపున లోక్‌సభ సభ్యునిగా ఎంపికయ్యాడు.

భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. 2022 నుంచి రాజ్యసభ ఎంపీగా భజ్జీ కొనసాగుతున్నాడు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ టీఎమ్‌సీ తరపున 2024 ఎన్నికలలో లోకసభ ఎంపీగా ఎంపికయ్యాడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన బాక్సర్ విజేందర్ సింగ్ 2019లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీ తరపున హర్యానా ఆసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరో రెజ్లర్ బజ్‌రంగ్ పునియా సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.