Cricketer
-
హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ మ్యాచ్ కోసం కాదు!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ రాబిన్‌హుడ్. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌తో అదరగొట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల్లో ఈవెంట్స్ నిర్వహించారు.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరు కానున్నారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా వార్నర్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వార్నర్‌కు ఘనస్వాగతం లభించింది. డైరెక్టర్ వెంకీ కుడుముల స్వయంగా పూల బొకే అందించి డేవిడ్‌కు వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే గతంలోనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నారని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రివీల్ చేశారు. ఈ మూవీ ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పుష్ప మేనరిజంతో అభిమానులను అలరించిన క్రికెటర్.. ఇప్పుడు ఏకంగా సినిమాతోనే ఫ్యాన్స్ ముందుకు రానున్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్.. తీవ్ర విషాదం
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్‌కు చెందిన క్లబ్ లెవల్ క్రికెటర్ జునైల్ జఫార్ ఖాన్ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది.ఆలస్యంగా వెలుగులోకికాగా నలభై ఏళ్ల జఫార్ ఖాన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్ అల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన జఫార్ ఖాన్.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ డే లైట్ టైమ్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయాంఈ విషాదకర ఘటనపై ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ‘‘మా క్లబ్‌కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.అడిలైడ్‌లో ఉద్యోగం?కాగా 2013లో వరకు పాకిస్తాన్‌లోనే ఉన్న జఫార్ ఖాన్.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్ క్రికెట్ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్‌లు రద్దు చేస్తామని పేర్కొంది.చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్ -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కొత్త క్రికెటర్
-
వీడియో: మాజీ కెప్టెన్ గంగూలీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
కోల్కత్తా: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంగూలీ పది నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి చూశారు.వివరాల ప్రకారం.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్లారు. ఈవెంట్‌కు వెళ్తున్న సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో ఆయన కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది.దీంతో, ఆయన కారు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ సౌరవ్ గంగూలీ, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, గంగూలీ అక్కడే కాసేపు వేచి చూశారు. అనంతరం, ఆయన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. Sourav Ganguly News:सौरव गांगुली की कार का एक्सीडेंट, बाल-बाल बचे दादा#SauravGanguly #Accident #LatestNews @khanduri_pooja pic.twitter.com/7ZnuBdhDYi— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) February 21, 2025 -
క్రికెట్ యువ తార గొంగడి త్రిషకు సర్కారు నజరానా (ఫోటోలు)
-
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి(Nitish Kumar Reddy)కి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెల్బోర్న్(Melbourne)లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్‌కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశారు. నితీష్ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తి దాయకం. నితీష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరొ వైపు, వాషింగ్టన్ సుందర్ తో కలిసి రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదీ చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
నితీశ్ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్
-
క్రికెటర్‌గా స్టార్ హీరోయిన్ భర్త.. బౌలింగ్‌లో అదుర్స్.. ఎవరో గుర్తుపట్టారా?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే హీరోయిన్ భర్త కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. క్రికెట్లో మంచి బౌలర్ కూడా. తాజాగా ఆయన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా.. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ వర్సెస్ రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మాల్దీవుస్‌లో వెడ్డింగ్ డే..గతంలోనే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
మహారాష్ట్రలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
-
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్‌కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
పుష్ప డైలాగ్ అదరగొట్టిన రషీద్..
-
గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్.. నాలుగేళ్లకే కెరీర్ ఖతం
పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఖరిసారిగా ఆడాడు.ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్‌కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్‌కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్‌లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్!
శ్రీలంక మాజీ క్రికెటర్ దులిప్ సమరవీరకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్‌గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు. ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్‌తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది. 2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్ బృందంలో చేరాడు. మొదట క్రికెట్ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు. అదే విధంగా.. మహిళల బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్ మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్‌తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్‌లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు. చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్ -
కీర్తి ఆజాద్ టూ యూసఫ్: రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన క్రీడాకారులు వీరే
-
పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..?
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో మరణించాడు. గైక్వాడ్ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. వాటిలో 2 సెంచరీలతో కలిపి మొత్తం 2,254 పరుగులు చేశాడు. అతను 1983లో పాకిస్తాన్‌పై 201 పరుగులు చేశాడు. అయితే గైక్వాడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అసలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఏంటీ..? ఎందువల్ల వస్తుంది..? అంటే..ఇది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. ఇక్కడ మాజీ గైక్వాడ్ తన అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు ధైర్యంగా పోరాడుతూ లండన్‌లో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. బ్లడ్ కేన్సర్ అంటే..కేన్సర్ అంటే కణాల నియంత్రణ లేని పెరుగుదల. అదే విధంగా, బ్లడ్ కేన్సర్ అంటే రక్త కణాల అనియంత్రిత పెరుగుదల. రక్త కేన్సర్ హెమటోలాజిక్ కేన్సర్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ, రక్త కణాల వంటి రక్తం-ఏర్పడే కణజాలాలలో (ప్రాధమిక, ద్వితీయ లింఫోయిడ్ అవయవాలు) ప్రారంభమవుతుంది.ఎలా ప్రభావితం చేస్తుందంటే..రక్త కణాల విధులు,ఉత్పత్తిలు బ్లడ్ కేన్సర్ ద్వారా ప్రభావితమవుతాయి. చాలా వరకు కేన్సర్లు రక్తం ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి అంటే ఎముక మజ్జ నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియ అసాధారణ రకం కణాల పెరుగుదల ద్వారా చెదిరిపోతుంది. ఈ కేన్సర్ రక్త కణాలు రక్త నష్టాన్ని నివారించడం, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడం మొదలైన ప్రాథమిక విధులను నిర్వహించకుండా రక్తాన్ని ఆపుతాయి.లుకేమియా సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది.లింఫోమా సాధారణంగా 16 నుంచి 24 ఏళ్ల వయసు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారితో పోలిస్తే 31% మంది పురుషులు లుకేమియాతో బాధపడుతున్నారు.ఈ కేన్సర్‌లో రకాలు..మైలోమా: ఎముక మజ్జలో మొదలై ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే కేన్సర్లింఫోమా: ఇది ఎముక మజ్జను కలిగి ఉన్న శోషరస వ్యవస్థకు సంబంధించిన కేన్సర్లుకేమియా:ఇది పిల్లలు,యుక్తవయస్కులలో వచ్చే అత్యంత సాధారణ రక్త కేన్సర్ఎందువల్ల అంటే..దీనికి డీఎన్ఏ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీఎన్ఏ రక్తకణాలు ఎప్పుడూ విభజించాలి, లేదా గుణించాలి లేదా ఎప్పుడు చనిపోవాలనేది చెబుతుంది. ఇక్కడ డీఎన్ఏ సూచనలు ఆధారంగా శరీరం అసాధారణమైన రక్త కణాలను అబివృద్ధి చేస్తుంది. ఇవి సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి,గుణించబడతాయి. అలాగే ఒక్కోసారి సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. దీంతో సాధారణ కణాలు గుమిగూడి ఎముక మజ్జలో స్థలాన్ని గుత్తాధిపత్యం చేసే అసాధారణ కణాల సముహంలోకి సాధారణ రక్త కణాలు పోతాయి. అందువల్ల ఎముక మజ్జ సాధారణ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జన్యుమార్పిడి మూడు రకాలు కేన్సర్లకు కారణమవుతుంది. సంకేతాలు, లక్షణాలుబ్లడ్ కేన్సర్‌ని బట్టి లక్షణాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు రకాల బ్లడ్ కేన్సర్‌లో కామన్‌గా కనిపించే సంకేతాలు ఏంటంటే..అలసట తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా నిరంతర అధిక జ్వరంరాత్రి చెమటలతో తడిచిపోవడంఅసాధారణ రక్తస్రావం లేదా గాయాలుఊహించని విధంగా బరువు తగ్గడంరోగనిరోధక వ్యవస్థపై ప్రభావం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లువాపు శోషరస కణుపులు లేదా విస్తరించిన కాలేయం లేదా ప్లీహముఎముక నొప్పిఈ లక్షణాలన్నీ కొన్ని వారాలకు మించి శరీరంలో ఉంటే తక్షణమే వైద్యుడుని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: రియల్ లైఫ్ వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే 14 కిలోలు..!) -
Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్ పెళ్లి(ఫొటోలు)
-
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకున్న స్టార్ క్రికెటర్ స్మృతి మందాన (ఫొటోలు)
-
భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్... వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న నితీశ్.. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్లో నితీశ్ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. కెరీర్లో మరింత ఎదగాలని తెలిపారు.కాగా, ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్‌కుమార్‌రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు. -
విడాకులంటూ ప్రచారం: మనీష్ పాండే- ఆశ్రిత శెట్టి ఫొటోలు వైరల్
-
సూపర్ కపుల్: కనులు కనులను దోచాయంటే అంటున్న తుషార్- నభా.. ఫొటోలు
-
ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ వీడియో.. బన్నీ రిప్లై ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పుష్ప-2లోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి.పుష్ప సినిమా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బన్నీకి ఫ్యాన్‌గా మారిపోయాడు. పుష్ప మేనరిజాన్ని బన్నీ స్టైల్లో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వార్నర్ గతంలోనే వెల్లడించారు.అయితే తాజాగా వార్నర్ ఓ కంపెనీ యాడ్‌లో మెరిశారు. ఈ ప్రకటనలో పుష్ప సినిమాలోని ఫైర్ అనే డైలాగ్‌తో మెప్పించారు వార్నర్. ఈ ప్రకటన చూసిన బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్ సింబల్ ఇచ్చాడు. కాగా.. ఇటీవల విడుదలైన 'పుష్ప: ది రూల్'లోని 'పుష్ప పుష్ప' సాంగ్‌కు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. షూ డ్రాప్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వార్నర్ కనిపించారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
-
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్మ్యాన్గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్. ప్రతి ఐపీఎస్ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్ కప్ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్లో ఉందంటే..విరాట్‌ని డిఫెరెంట్ డిఫెరెంట్ స్టయిల్ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్ నైపుణ్యంతో విరాట్ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యి స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్ని ఎంచుకున్నట్లు హకీమ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్ హెయిర్లెస్గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్ స్టయిల్ని సెట్ చేశాడు హకీమ్. ఇక హకీమ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్ చేస్తాడు.కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్ స్టయిల్ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్‌కి విరాట్ కొత్త హెయిర్ స్టైల్ అని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.New hairstyle for T20 WC🙂👍🏻#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 16, 2024 (చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?) -
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
HBD Rohit Sharma: హిట్‌మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే!
-
టీమిండియా క్రికెటర్ భార్య.. మోడల్ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)
-
క్రికెటర్‌పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు
కోల్‌కతా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామీణ మహిళలు చందాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, 1999 నుండి బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిర్ రంజన్ చౌదరికి ఎన్నికల ప్రచారం కోసం రూ.11,000 విరాళంగా అందించారు. అభ్యర్థికి మహిళలు చందాలు ఇస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రణగ్రామ్ గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ కూలి పనులు, మేకల పెంపకం, రోజువారీ కూలి పనుల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పోగు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థికి విరాళంగా అందించారు. దీంతో ఆ మహిళలకు అధిర్ రంజన్ చౌదరి భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. బెర్హంపూర్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను పోటీకి దించింది. డాక్టర్ నిర్మల్ సాహా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరితో అధిర్ రంజన్ చౌదరి తలపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. బెర్హంపూర్, మల్దహా దక్షిణ్‌తో సహా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనునన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. మొత్తం 543 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 42 పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ బెంగాల్లో అన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది. #WATCH | Murshidabad, West Bengal: 11 women of Kandi town's Ranagram village handed over a total of Rs 11,000 to Congress' Behrampore Lok Sabha candidate Adhir Ranjan Chowdhury to help him in the Lok Sabha elections. The women collected the money from their household expenses,… pic.twitter.com/5QRnjldaUG — ANI (@ANI) April 7, 2024 -
Suresh Raina Marriage Anniversary: "మిస్టర్ ఐపీఎల్"కు పెళ్లి రోజు శుభాకాంక్షలు
-
Navdeep Saini : శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
David Miller Marriage Photos: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ (ఫొటో గ్యాలరీ)
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్: టీమిండియా మాజీ క్రికెటర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల గుండెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తన అభిమాన హీరోలని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో క్రికెటర్ చేరిపోయారు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీశాంత్ జూనియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారని.. మీ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెళ్తూ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. 'ఆయనకు గుర్తు ఉందో లేదో తెలియదు కానీ.. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను కలిశా. అక్కడే ప్రియమణి, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లా. మీరు డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని చెప్పా. థ్యాంక్యూ శ్రీశాంత్ అన్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆయనను చూస్తే చాలా మోటివ్‌గా అనిపించింది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాలో చిన్న అవకాశమొచ్చిన నటిస్తా' అని అన్నారు. -
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్?!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి సుమారు 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే వార్త హల్చల్ చేస్తోంది. యువరాజ్ తల్లి, షబ్నమ్ సింగ్ ఇప్పటికే పోలీసులలో కేసు నమోదు చేశారు. హౌస్ కీపింగ్ సిబ్బంది, సాకేత్డికి చెందిన లలితా దేవి,బీహార్‌కు చెందిన వంట మనిషి సిల్దార్ పాల్‌పై అనుమానాలు లేవనెత్తారు.దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ ఘటన మళ్లీ వైరల్ అవుతోంది. ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ ఈ చోరీ జరిగింది. తమ సిబ్బందిలోఇద్దరు ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగిందని ఆమె పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితులు తమ ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు. కాగా యువరాజ్ సింగ్ మాజీ నటి , మోడల్ అయిన హాజెల్ కీచ్‌ను 2016, నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు ఓరియన్, కుమార్తె ఆరా ఉన్నారు. -
భారత్ క్రికెట్ లో సచిన్ దాస్ పేరు ట్రెండింగ్
-
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
-
David Warner: ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్‌కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
పోయినవాళ్లు మిగిల్చేవి జ్ఞాపకాలే!
ఇటీవల మరణించిన క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు పారదర్శకంగా ఉండేవి. మంచి సంభాషణను ఇష్టపడతారు. మాట్లాడినదంతా ఓపిగ్గా వింటారు. ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మరో క్రికెటర్ స్నేహితుడు టైగర్ పటౌడీలో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి ఉంటుంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి,సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. మరో క్రికెట్ దిగ్గజం అబ్బాస్ అలీ బేగ్ లోతైన రాజకీయ అవగాహనను కలిగి ఉండేవారు. టైగర్, బిషన్ ఇప్పుడు మనతో లేరు. స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే. నేను క్రికెట్ అభిమానిని కాదన్న సంగతి రహస్యమేమీ కాదు. నిజానికి ఆ ఆట నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో గాని చూడను కూడా. ఫలితంగా చాలా మంది క్రికెటర్లు నాకు తెలియదు. కానీ గొప్ప జ్ఞాన గాంభీర్యంతో నేను క్రికెట్ చర్చలకు తెగించినప్పుడు, తెలిసీ తెలియని విషయ సమా చారంతో బుద్ధిహీనమైన ప్రశ్నలు సంధించినప్పుడు పదే పదే నన్ను గట్టున పడేసిన వారిలో నేను స్నేహితులుగా పరిగణించే క్రికెటర్లు ముగ్గురున్నారు. వారు – టైగర్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, అబ్బాస్ అలీ బేగ్. బాధాకరం... టైగర్(2011లో మరణించారు), బిషన్ ఇప్పుడు మనతో లేరు. బగ్గీ (అబ్బాస్ అలీ బేగ్) ఈ మధ్యే తన భార్య వినూ (వినూ మీర్చందానీ)ను కోల్పోయారు. గత సోమవారం (23 అక్టోబర్) నాటి బిషన్ సింగ్ మరణం ఈ ముగ్గురు స్నేహితుల జ్ఞాప కాలను తిరిగి తెచ్చిపెట్టింది. వారి గౌరవార్థం, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. టైగర్‌కు నా క్రీడా పరిజ్ఞానం అంతంత మాత్రమేనని తెలుసు. ఒక్క టీవీ స్టూడియోలో తప్ప, ఆయన నా ముఖంపై కోడిగుడ్లు పగిలే అవకాశం ఉన్న పరిస్థితికి నన్ను వదిలేయకుండా మా సంభాషణను సున్నితంగా, నేర్పుగా నాకు నచ్చిన విషయాల వైపు మళ్లించేవారు. తరచు ఆ మళ్లింపు నేను ధరించిన టై గురించిన పొగడ్త అయివుండేది. వివేచనను అభిరుచిగా కలిగిన వ్యక్తి ఆయన. కనుక ఆయన మెచ్చు కోలు నన్ను అదే టైని మళ్లీ మళ్లీ ధరించేలా చేసేది. ఒక సందర్భంలో తొలిసారిగా ఆయన తన కనుబొమ నొకదాన్ని ఎగరేస్తూ, నెమ్మదైన స్వరంతో... ‘‘మీరు ఆ టై ధరించడం ఇది మూడోసారి!’’ అని అనేంతవరకు ఆ టైని నేను వదిలిపెట్టలేదు. టైగర్‌లో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి కూడా ఉంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి, సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. బిషన్ చాలా భిన్నమైనవారు. ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు, అంతర్గత భావాలు తరచు పారదర్శకంగా, పైకి కని పించేలా ఉండేవి. మంచి సంభాషణను ఆయన ఇష్టపడతారు. మాట్లా డినదంతా ఓపికగా వింటారు. అలాగే ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మేము తరచు బగ్గీ, వినూ వాళ్లింట్లో కలుసుకునేవాళ్లం. మేడపైన మాటల్లో మునిగిపోయేవాళ్లం. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏమిటి’ అని బగ్గీ నన్ను అడిగేవారు. అయితే రాజకీ యాలను ఆయన నాకంటే బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమ యేందుకు ఎక్కువ సమయం పట్టేది కాదు. నేను చెప్పేది వినేవారు. నా గ్రహింపులో లేని లోతైన గమనింపుల గురించి చెప్పి నన్ను ఉల్లాస పరిచేవారు. ముగ్గురిలోకి బగ్గీ ఎక్కువగా తటపటాయింపుతో ఉండేవారు. వినూ అప్పుడు ఆ సంకోచాల నుంచి ఆయన్ని కాపాడేందుకు ముందు కొచ్చేవారు. ఆమె చురుకైనవారు. సంభాషణ ప్రియత్వం కలిగి నవారు. విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించే స్నేహశీలి. అతిథు లను ఆదరించే అద్భుతమైన మహిళ. రుచిగా వండినంత మాత్రానే కాదు, అతిథుల సన్నిధి ఆమెను ఉల్లాసపరచడం వలన కూడా వారింట్లో భోజనం ఆరగించడం అన్నది ఒక సంతుష్టికరమైన భావ నను కలిగించేది. తన స్నేహితుల సమక్షంలో ఆమె అపరిమితమైన సంతోషంతో ఉండేవారు. నేనిది రాస్తున్న సమయానికి, స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే నన్న మెలకువను కూడా మొత్తంగా నేను కలిగి ఉన్నాను. మీరు నెలలు లేదా ఏళ్లపాటు కలుసుకుని ఉండకపోవచ్చు. మిమ్మల్ని సముద్రాలు, తరచు రాసుకోని ఉత్తరాలు వేరు చేస్తుండొచ్చు. అయితే ఆ దూరమే మిమ్మల్ని కలిపి ఉంచే జ్ఞాప కాలను శక్తిమంతం చేస్తుంది. కాల క్రమేణా ఆ జ్ఞాపకాలు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పచుకుంటాయి. ఇప్పుడు టైగర్, బిషన్, వినూ గురించి నాకు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే! ఆ ముగ్గురూ నాకు దూరమయ్యాక తమవైన స్థానాలను నాలో ఏర్ప చుకున్నారు. ఒక అర్థంలో నేను స్పష్టమైన దానిని చెబుతున్నాను. అలాగే, మరొక విషయం కూడా చెబుతాను. మనుషులు చనిపోయినప్పుడు మాత్రమే మళ్లీ ఇక వారిని కలవలేం అన్న భావనలో మనం మునిగి పోతాం. అప్పుడు వారి జ్ఞాపకాలు వేరే భిన్నమైన స్థాయిని పొందు తాయి. బతికున్నవాళ్లను – రేపో, తర్వాతి వారమో, ఫోన్ కాల్లోనో, ఈమెయిల్ ద్వారానో – జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది ఇకపై ఉండదు. ఇప్పుడిక మీకున్నవన్నీ కేవలం జ్ఞాపకాలే! ఒక సమావేశం, ఒక సంభా షణ, ఒక ఈమెయిల్ అన్నది ఇక ఎప్పటికీ సంభవించవివే! అనేకమైన ఈ ఆలోచనలు నిస్సందేహంగా వయసు నిర్దేశించి నవే. అది అనివార్యం. నిజాయతీగా చెప్పాలంటే 34 ఏళ్ల క్రితం నా భార్య నిషా చనిపోయినప్పుడు కూడా పూర్తి భిన్నంగా ఏమీ లేదు. 2015లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా! లేదా నేను సన్నిహితంగా ఉన్న మరెవరి విషయంలోనైనా! నా చిన్నతనంలో నేను జ్ఞాప కాలు ఎలా జనిస్తాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనే ఆలోచ నను కలిగిలేను. ఇటీవల కొద్ది వారాల తేడాతో సంభవించిన విను, బిషన్ మరణాలు నాలో ఆ స్పృహను కలిగించాయి. ప్రియ మిత్రమా! నా ఉద్దేశం మనో దౌర్బల్యం లోనికో, తాత్విక చింతన లోనికో జారుకోవడం కాదు. ఆనందకరమైన జ్ఞాపకాలతోనే నేను మొదలయ్యాను. కానీ నేను చెప్పాలని భావించిన దానికంటే విచారంగా ముగించినట్లున్నాను. అంటుంటారు కదా: ఇదే జీవితం! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
క్రికెటర్ విహారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్
-
క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్న బుట్ట బొమ్మ..!!
అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాజ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్... కిసీ కీ జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. మహేశ్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినా.. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!) ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని బీటౌన్ టాక్. త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్‌తో ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇంతకీ బుట్టబొమ్మను చేసుకోబోయే ఆ స్టార్ క్రికెటర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంపై పూజా హేగ్డే ఇంతవరకు స్పందించలేదు. ఇటీవలే ముంబయిలోని సేవా మండల్‌ను సందర్శించిన ఆమె గణేశున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి గణపతికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం బుట్టబొమ్మ స్పందించాల్సిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు రజినీకాంత్ వార్నింగ్.. ఆమె కోసమేనా?) -
పాకిస్థాన్‌పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇషాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్: రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు. ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు. కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్‌గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు క్రికెటర్ రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వాస్తవంగా క్రికెటర్‌గానే తన కెరీర్‌ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న కంగా లీగ్‌లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. (Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..) ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు. -
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ రెడీ
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక క్రికెటర్) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ముత్తయ్య మురళీధరన్గారు బాల్యం నుంచి పడిన ఇబ్బందులు, ఆయన జర్నీ మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ దంపతులు (ఫొటోలు)
-
టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో యశస్వి జైస్వాల్..!
టీమిండియా యువ సంచలనం ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతనే టీమిండియా యువకెరటం యశస్వి జైశ్వాల్. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఓ సీన్లో అచ్చం యశస్వి జైస్వాల్ లాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు. అది కూడా క్రికెట్ ఆడుతున్న సీన్ కావడంతో అందరూ చిన్నప్పుడు ఆ సీన్లో ఉన్నది యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విక్రమార్కుడు చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్‌కు, అతనికి పోలికలు ఉండటంతో నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. 'ఏ సత్తి బాల్ లోపలికి వచ్చిందా?' అనే డైలాగ్ చెప్పిన పిల్లాడు ఇప్పుడు టీమిండియా ఒపెనర్కు దగ్గర పోలికలు ఉండడంతోనే అలా పోలుస్తున్నారు. అంతేకానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్ టాలీవుడ్లోనే ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అతను టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా?.. అనసూయ ట్వీట్ వైరల్) Vikramarkudu lo vunnadhi @ybj_19 e antara #IPL2023 #IPL pic.twitter.com/nqJ8OiCHD4 — Prasad (@PrasadAGVR) May 13, 2023 -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్
సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిక్రికెటర్గా తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాగే తన గ్యారేజీలో ఖర్జీదైన కార్ల విషయం, స్పోర్ట్స్ కార్లంటే కోహ్లికి ఉన్న పిచ్చి ప్రేమ కూడా తెలిసిన సంగతే. విదేశీ కార్లు, స్వదేశీ కార్లతో ఈ విషయంలో చాలా స్పెషల్‌గా ఉంటాడు. కింగ్ కోహ్లీగా పాపులర్ అయిన కోహ్లీ తనకిష్టమైన, ఫస్ట్ కారు గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చర్చించుకుంటున్నారు. రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో టాప్‌లో ఉన్న కోహ్లీ తొలి కారేంటో తెలుసా? మెర్సిడెస్ బెంజో , బీఎండబ్ల్యూనో, ఆడి కాఓ కాదు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన టాటా సఫారీ. అవును ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఈ కారును తన సొంత డబ్బుతో కొనుగోలు చేశాడట. సఫారీని ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ వెల్లడించాడు. కేవలం ఫీచర్లే కాదు, దీని గుర్తింపు ఆధారంగా ఈ కారుపై మనసు పడినట్టు విరాట్ తెలిపాడు. ఒక సందర్భంలో ఈ కారులో డీజిల్‌కి బదులుగా పెట్రోల్ నింపడం, ఆతరువాత విషయం తెలిసి ట్యాంకుని ఖాళీ చేసిన సంగతులను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) జర్మన్ ఆటోమేకర్ ఆడికి బ్రాండ్ అంబాసిడర్‌గా అన్నవిరాట్ కోహ్లీ ఎక్కువ స్పేస్ ఉన్న కార్లంటే ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ చేతిలో ఆధునాతన కార్లులిస్ట్ ఒకసారి చూద్దాం. భారతదేశపు అత్యంత సంపన్న క్రీడాకారుడు, ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకరైన విరాట్ కోహ్లీ 22 కోట్లకుపై విలువైన ఆడి A8 L W12, బెంట్లీ కాంటినెంటల్ GT , ల్యాండ్ రోవర్ వోగ్‌తో సహా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నాడు. (ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) కోహ్లి గ్యారేజీలోని అత్యంత ఖరీదైన కార్లు బెంట్లీ కాంటినెంటల్ GT, రూ. 4.04 కోట్లు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్, రూ. 2.97 కోట్లు ఆడి ఆర్8 వి10 రూ. 2.97 కోట్లు అత్యంత వేగవంతమైన కారు ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు -
ఇమ్రాన్‌ను ప్రధాని చేస్తే.. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు: పాక్ లెజండరీ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ జావేద్ మియాందాద్ ఫైర్ అయ్యారు. గతంలో తాను ఇమ్రాన్ ప్రధానమంత్రి కావడానికి సహకరించి చాలా పెద్ద తప్పు చేశానని ఈ లెజండరీ క్రికెటర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మియాందాద్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడానికి నేను సహకరించా. అతని ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యాను. అయితే ఆ తర్వాత కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అది నాకు చాలా నిరాశ కలిగించిందని వెల్లడించారు. కృతజ్ఞతలు చెప్పడం ఇమ్రాన్ కనీస బాధ్యతని.. అలాంటప్పుడు రాత్రి రెండు గంటలకు తన తలుపు ఎందుకు తట్టాడని మండిపడ్డారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మా నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.. నేనూ, మా సోదరులందరూ వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్లం. జట్టు జాతీయ జట్టుకు ఆడినప్పుడల్లా, ఓడిపోతే కనీస మార్జిన్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించామని, ఆటగాళ్లెవరూ నా నాయకత్వాన్ని వ్యతిరేకించలేదని జావేద్ మియాందాద్ అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2018లో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. 3 సంవత్సరాలకు పైగా ప్రధానిగా కొనసాగి.. 4వ సంవత్సరం పూర్తి కాకముందే, ఏప్రిల్ 2022లో, విపక్షాల అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి కోల్పోయాడు. కాగా ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్ 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌కు గెలిపించడంలో కీలకమైన ఆటగాళ్ళు. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మియాందాద్ నిలిచాడు. చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు
క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్ వంటకాలు కూడా తన ప్రతిభతో క్రికెటర్‌గా పాపులర్ అయిన సురేష్ రైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు. ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు బహుళ ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేనా, భారత్‌పే, బుకింగ్స్ డాట్కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే. దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా, వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) 1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. బీటెక్ చదివిన అతని భార్య ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్ బేబీ కేర్ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) -
హార్దిక్ పాండ్యాకు అరుదైన గౌరవం - అదేంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రానున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్ ప్రచారకర్తగా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. టాటా మోటార్స్ పంచ్, సిట్రియోన్ సీ3 మోడళ్లకు ఎక్స్టర్ పోటీ ఇవ్వనుంది. బ్రాండ్ ప్రచారాన్ని పాండ్యా విస్తృతం చేస్తారని, హ్యుందాయ్ ఎక్స్టర్ను మిల్లేనియల్స్, జనరేషన్ జడ్‌కు అనుసంధానం చేయడంలో సహాయపడతారని విశ్వసిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
బాలయ్యకు టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ముందువరుసలో ఉంటారు. ఇవాళ ఆయన 63వ జన్మదినం జరుపుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు బాలయ్యకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా బాలయ్యకు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్త్ డే విషెష్ తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకుంటూ యువరాజ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?) యువరాజ్ సింగ్ ట్వీట్లో రాస్తూ..' నందమూరి బాలకృష్ణ సార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ డెడికేషన్ సోసైటీపై ఎంతో ప్రభావం చూపుతుంది. అనేక ఇతర కార్యక్రమాలతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజ సేవలో మీరు చూపే అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక ముందు మరిన్నీ పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. యూవీ చేసిన ట్వీట్‌పై అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Warmest birthday greetings #NandamuriBalakrishna sir. Your dedication to making a positive impact in society through your Cancer Hospital & Research Centre among many other initiatives is an inspiration for all. Have a great year ahead! #HappyBirthdayNBK @basavatarakam pic.twitter.com/DcWxAtYR0x — Yuvraj Singh (@YUVSTRONG12) June 10, 2023 -
రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జ్యువెలరీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో పెయింట్స్, B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్ తనిష్క్, ఇటు రిలయన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడనుంది. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్. 25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో, ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు. అత్యంత సంపన్న క్రికెటర్, కానీ భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది అతని డ్రీమ్. ఆల్ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హెడ్ కూడా. అలాగే D2C ప్లాట్‌ఫారమ్ TMRW బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు,ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
Shubman Gill : శుబ్‌మన్ గిల్ అరుదైన ఫొటోలు చూశారా?
-
రవీంద్ర జడేజాను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి
-
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్‌వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్‌లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్‌పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్‌లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్‌లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై
స్కాట్లాండ్ సీనియర్ క్రికెటర్.. మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. 2018లో అప్పటి ప్రపంచనెంబర్ వన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్ ఆ తర్వాత కూడా అతని కెప్టెన్సీలో విజయాలు సాధించింది. గతేడాది మేలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న కోయెట్జర్ టి20లకు కూడా గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు కోయెట్జర్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోయెట్జర్ స్కాట్లాండ్ తరపున 89 వన్డేల్లో 3192 పరుగులు, 70 టి20ల్లో 1495 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఐదు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 156 పరుగులు వన్డేల్లో కోయెట్జర్కు అత్యధిక స్కోరు. ఇక 2015 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై కోయెట్జర్ ఆడిన 156 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకుంటారు. ఇక 2021 టి20 వరల్డ్‌కప్ సందర్భంగా క్వాలిఫయర్ రౌండ్లో అతని కెప్టెన్సీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి గ్రూప్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించడం కోయెట్జర్ కెరీర్లో పెద్ద ఘనత. ఇక తన రిటైర్మెంట్పై స్పందించిన కోయెట్జర్..''ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. స్కాట్లాండ్ క్రికెటర్‌గా.. కెప్టెన్‌గా నాకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పగా అనిపించింది. ఇన్నాళ్లు నాకు సహకరించిన స్కాట్కాండ్ క్రికెట్ సహా ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు'' అంటూ చెప్పుకొచ్చాడు. THANK YOU KYLE ❤️👏🏏🏴https://t.co/qv6WHdkibU pic.twitter.com/XrZkebdlqo — Cricket Scotland (@CricketScotland) March 22, 2023 చదవండి: అభిమానులను పిచ్చోళ్లను చేశారు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి.. టీమిండియాకు మరో బిగ్ షాక్ -
మాజీ రంజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అరెస్ట్
చీటింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నాగరాజు బుడుమూరు అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేసి వర్ధమాన క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్‌కు రూ.12 లక్షల స్పాన్సర్షిప్ కావాలని కోరిన కేసులో నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ వ్యాపారిని బురిడీ కొట్టించిన నాగరాజు.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రికీ భుయ్ల పేర్లు వాడుకుని సొమ్మును కాజేశాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు.. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల నాగరాజు.. 2021లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పలు కార్పొరేట్ కంపెనీలను రూ. 40 లక్షలు వరకు మోసగించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు 2018 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్షిప్ పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60కిపైగా కంపెనీలను రూ.3 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో), 2016-2018 మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. నాగరాజు.. 2016లో క్రికెట్‌కు సంబంధించి గిన్నిస్ రికార్డుకు కూడా ప్రయత్నించాడు. సుదీర్ఘ సమయం నెట్ సెషన్లో పాల్గొన్న బ్యాటర్ విభాగంలో నాగరాజు గిన్నిస్ రికార్డుల్లోకెక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. -
శ్రీలంక క్రికెటర్ హసరంగా పెళ్లి ఫోటోలు
-
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
నేపాల్ స్టార్ క్రికెటర్‌కు ఊరట.. కానీ ఓ కండిషన్!
Sandeep Lamichhane: అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు కాస్త ఊరట లభించింది. 22 ఏళ్ల లమిచానేకు నేపాల్ పఠాన్ కోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత అతడికి విముక్తి లభించింది. అయితే, ఈ కేసులో అంతిమ తీర్పు వెలువడేంత వరకు దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. కాగా అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 8న నేపాల్ కోర్టు.. లమిచానేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లమిచానే చెప్పుకొచ్చాడు. కానీ, విచారణ పూర్తయ్యేంతవరకు అతడిని సస్పెండ్ చేస్తూ నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా అరెస్టయ్యే సమయానికి అతడు నేపాల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఆడుతున్న సమయంలో ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో వెస్టిండీస్ నుంచి నేపాల్‌కు వచ్చాడు. చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు -
నిలకడగా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం
-
హార్థిక్ పాండ్యకి అంత సీన్ లేదు... పాక్ క్రికెటర్ కామెంట్స్
-
రోహిత్ పై వేటు తప్పదా ..?
-
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
PCA కు హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
టీ 20 వరల్డ్ కప్ గెలిచేది ఆ మూడు జట్లే...
-
టీ20 మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కరేబియన్ ఆటగాడు
-
టీమిండియా యంగ్ క్రికెటర్‌కు బాలీవుడ్ నటి బర్త్‌డే విషెస్.. వీడియో వైరల్!
గతంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె అతనికి సారీ కూడా చెప్పింది. అయితే తాజాగా పంత్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో షేర్ చేసింది. తన ఇన్‌స్టాలో 'హ్యాపీ బర్త్‌డే' అంటూ ఎవరీ పేరు చెప్పకుండానే పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్తా వైరలవడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ పంత్ బర్త్‌డే కావడంతో అతనికే విషెస్ చెప్పారంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: Rishabh Pant: లైట్ తీసుకున్న పంత్.. సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్!) ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్‌లో ఆమె నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందులోనే పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఆమె ఎవరికీ చెప్పిందో పేరును ప్రస్తావించనప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో రిషభ్ పంత్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ టీమిండియా క్రికెటర్ పంత్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా సీనియర్ గుడ్‌బై
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ గురువారం అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 2009లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రేచల్ హేన్స్ దశాబ్దానికి పైగా ఆసీస్ క్రికెట్లో ప్రధాన బ్యాటర్‌గా సేవలందించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలిచిన ఆరు మేజర్ టోర్నీల్లో రేచల్ హేన్స్ ఉండడం విశేషం. ఇక ఆస్ట్రేలియా తరపున రేచల్ హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. హేన్స్ కెరీర్‌ను రెండు భాగాలుగా విడదీయొచ్చు. 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన హేన్స్ 2017 నుంచి 2022 వరకు ఆటలో కొనసాగింది. ఇక హేన్స్ చివరగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టును నడిపించింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టి20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఒక రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్లో సేవలందించిన రేచల్ హేన్స్ ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో పాలు పంచుకుంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. మలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్లీ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేచల్ హేన్స్ ఈ సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం -
హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్. చదువులో దిట్ట.. భవానీ ప్రసాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు. ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్‌పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు. బౌలర్‌గా రాణింపు.. చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్‌కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్అశ్వద్నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్‌లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్‌ను దేశ జట్టులోకి తీసుకుంది. 2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట. కుటుంబ నేపథ్యం.. భవానీ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్‌లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది. హంగేరీకి అండగా... క్రికెట్‌ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్అశ్వద్నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. – అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
వికెట్ తీసిన ఆనందం.. ఎవరు ఊహించని సెలబ్రేషన్
క్రికెట్లో ఒక్కో ఆటగాడికి యూనిక్ సెలబ్రేషన్స్ ఉండడం సహజం. బౌలర్ వికెట్ తీసినప్పుడో.. బ్యాటర్ సెంచరీ కొట్టినప్పుడో వింత ఎక్స్ప్రెషన్స్ సహా తమ చర్యలతో ఆకట్టుకుంటారు. తాజాగా సెర్బియాకు చెందిన అయో మేనే-ఎజెగి అనే క్రికెటర్ కూడా వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్‌కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ గ్రూఫ్-ఏలో సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అయో మేనే-ఎజెగి నాలుగు వికెట్లతో మెరిశాడు. ఒక వికెట్ తీసిన సందర్భంలో గ్రౌండ్‌పై రెండుసార్లు ఫ్లిప్(గెంతులు) చేసి ఆ తర్వాత నేలపై తన చేతులను చాచి పడుకున్నాడు. ఈ వింత సెలబ్రేషన్ అక్కడున్న వారి చేత నవ్వులు పూయించింది. ఈ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్ చేసిన ఐసీసీ.. ''వందో వికెట్ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్న సెర్బియా క్రికెటర్ అయో మేనే-ఎగిజి'' అని క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోకు దాదాపు 1,85,000 లైక్స్ రావడం విశేషం. ఇక మ్యాచ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్ 68 పరుగుల తేడాతో సెర్బియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సెర్బియా పూర్తి ఓవర్లు ఆడినప్పటికి ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఆతిథ్య హోదాలో ఆస్ట్రేలియా సహా భారత్, న్యూజిలాండ్ లాంటి టాప్-8 దేశాలు అర్హత సాధించాయి. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆసీస్ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టి20 ప్రపంచకప్ సూపర్ 12 స్టేజీ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా? -
పాపం బట్లర్ కి ఎంత కష్టం వచ్చింది ?
-
ఛాయ్, బన్లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్
Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా. ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు. అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్ 1990కి కాల్ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్ రోషన్ మహానామా తాను ప్రజలకు సర్వ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha. The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI — Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022 (చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’) -
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి
-
భారత్ మాకు పెద్దన్న: సనత్ జయసూర్య
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం కొనసాగుతోంది. నిత్యవసర ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా వందల్లో, వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై లంకేయులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం, డిజిల్, మందులను శ్రీలంకకు భారత్ సరఫరా చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తమ దేశానికి చేస్తున్న ఈ సాయంపై శ్రీలంక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు సాయం చేసిందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. భారత్ ఎల్లప్పుడూ తమ దేశానికి సహాయం చేస్తూనే ఉందని ప్రశంసించారు. మా పెద్దన్న ఇండియానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల సాయంతోనే సమస్యల నుంచి శ్రీలంక బయటపడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించకుంటే రానున్న రోజుల్లో పెను విపత్తును ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో బతకడం అంత ఈజీ కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆహార కొరత, పెట్రోల్, డీజిల్ కొరత వల్ల లంకేయులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. ఇది చదవండి: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..? -
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
-
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!
మన దేశంలో క్రిప్టోకరెన్సీకి అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తోన్న వారిలో భారత్ సుమారు 10 కోట్ల మందితో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)కు కూడా భారత్‌లో భారీ ఆదరణ లభిస్తోంది. మన దేశంలో ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, స్మృతి మంధాన, సునీల్ గవాస్కర్, భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్స్ ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఎన్ఎఫ్టీ తెచ్చేందుకు తాను కూడా సిద్దం అంటున్నారు. ఆరోన్ ఫించ్ తన ఎన్ఎఫ్టీలను విడుదల చేయడానికి అధికారికంగా లైసెన్స్ పొందిన మొదటి క్రికెట్ డిజిటల్ కలెక్టిబుల్స్ ప్లాట్ ఫామ్ రారియోతో జతకట్టాడు. ఈ ఎన్ఎఫ్టీలు రారియోలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రపంచంలోనే అధికారికంగా లైసెన్స్ పొందిన తొలి క్రికెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్ రారియోలో చాలా మంది ఇతర క్రికెటర్లకు చెందిన అనేక ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉన్నాయి. 2018లో జింబాబ్వేపై 172 పరుగులు చేసిన అత్యధిక స్కోరుతో 2013లో ఇంగ్లాండ్ పై సాధించిన తన 156 పరుగుల రికార్డును అధిగమించాడు. 2013లో ఒక ఇన్నింగ్స్‌లో ఫించ్ బాధిన 14 సిక్సర్లు ఉన్నాయి. అతను ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్, సర్రేలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియన్ వైట్-బాల్ కెప్టెన్ బీబీఎల్ ప్రారంభం నుంచి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. వీటికి సంబంధించిన వీడియోల రూపంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. "రారియో క్రికెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌తో నా ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది, ఇక్కడ మీరు నా ఎన్ఎఫ్టీలను స్వంతం చేసుకోవచ్చు" అని అన్నారు. (చదవండి: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!) -
బంగారం లాంటి అవకాశం వదిలేశాడు..
క్రికెట్లో క్రీడాస్పూర్తి చాలా తక్కువగా కనిపిస్తుంది. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనది తప్పు అని తేలితే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకుంటే దానిని క్రీడాస్పూర్తి అనొచ్చు. తాజాగా నేపాల్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేపాల్ బౌలర్ కమల్ సింగ్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మార్క్ అడైర్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. చదవండి: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి బంతి ఎక్కువ దూరం పోనప్పటికి సింగిల్ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో మార్క్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌కు కాల్ ఇచ్చాడు. అయితే బంతి కోసం పరిగెడుతూ ఆండీ మెక్‌బ్రైన్‌ను కింద పడేసుకుంటూ వెళ్లాడు. బంతిని అందుకున్న కమల్.. కీపర్ ఆసిఫ్ షేక్‌కు త్రో విసిరాడు. ఔట్ చేసే అవకాశం వచ్చినప్పటికి ఆసిఫ్ బెయిల్స్‌ను పడగొట్టకుండా క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఈలోగా ఆండీ మెక్‌బ్రైన్ సురక్షితంగా క్రీజులోకి చేరాడు. దీంతో ఆసిఫ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు నేపాల్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: ‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’ 🏏 Spirit of cricket 🤝 Drop a ‘♥️’ below to show your appreciation for this golden gesture! 📺 Tune in to #FanCode and never miss moments like this again 👉 https://t.co/ccITeVbFiv@cricketireland @CricketNep pic.twitter.com/b4vzDyyyNU — FanCode (@FanCode) February 14, 2022 -
చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ చేసింది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్ క్రికెటర్ గ్రౌండ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 4న గిస్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ తిమోటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది. ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ ఐసాక్ హ్యూగ్స్ వివరణ ఇచ్చారు. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
రానున్న మరొక క్రికెటర్ బయోపిక్.. లీడ్ రోల్లో అనుష్క ?
Anushka Sharma Not Doing Cricketer Jhulan Goswami Biopic: బాలీవుడ్లో పాపులర్ క్రికెటర్స్‌పై బయోపిక్ చిత్రాలు చాలా వచ్చాయి. ఎంఎస్ ధోని నుంచి ప్రస్తుతం రాబోతున్న 'శభాష్ మిథూ', '83' వరకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా మరో క్రికెటర్ బయోపిక్ రానుంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ 'జులన్ నిషిత్ గోస్వామి'పై సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నటి అనుష్క ప్రొడక్షన్ హౌజ్ 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' నిర్మిస్తుంది. ముందుగా ఈ చిత్రంలో జులన్ గోస్వామిగా అనుష్క శర్మ నటించాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల అనుష్క తప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనుష్క శర్మ నటించిన 'పరి' చిత్రం డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లోని క్రికెట్ గ్రౌండ్లో అనుష్క, జులన్ షూటింగ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు అనుష్క అభిమానుల సోషల్ మీడియా పేజీలలో తెగ వైరల్ అయ్యాయి. అవి అలా వైరల్ కావడంతో అనుష్క శర్మ జులన్ గోస్వామి బయోపిక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు ప్రోసిత్ రాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జులన్ గోస్వామిగా కొత్త నటిని తీసుకోనున్నారని సమాచారం. ఈ జులన్ గోస్వామి బయోపిక్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌లో జులన్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని చక్దాహ నుంచి లార్డ్స్ వరకు ఆమె ప్రయాణంతోపాటు మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఓటమిని చూపించనున్నారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహిత, మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జులన్ నిషిత్ గోస్వామిపై తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2007లో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా జులన్ ఎంపికైంది. జులన్ గోస్వామి 2008-20011 మధ్య భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. -
బాలికతో క్రికెట్ కోచ్ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ..
పుదుచ్చెరి: శిక్షణ కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు తన వద్ద శిక్షణ తీసుకుంటున్న టీనేజర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోయేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన తమరైకన్నన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న తనని అసభ్యంగా తాకి వేధించినట్టు మెట్టుపాళయంలోని పోలీసులకు చైల్డ్ లైన్ ద్వారా ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కోచ్ తమరైకన్నన్ ప్రేమిస్తున్నట్టు మెసేజ్ చేశాడని, అంగీకరించకపోతే కోచింగ్ ఇవ్వనని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. చివరకు కోచ్ ఆగడాలను భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే బాలిక తన మీద ఫిర్యాదు ఇవ్వబోతోందన్న విషయాన్ని తెలుసుకున్న కోచ్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆమెను బతిమలాడినట్లు తెలిపింది. అయినప్పటికీ అతనికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో చైల్డ్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో తమరైకన్నన్ సహా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డులోని ఐదుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత -
తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి
Young Saurashtra Cricketer Avi Barot Dies: క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ మరణించాడు. 29 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అని బాధాతప్త హృదయంతో మీడియాకు ప్రకటన విడుదల చేసింది. కాగా కుడిచేతి వాటం గల అవి బరోట్... అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్(2011)గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. బరోట్ 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన బరోట్... ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా అవీ బరోట్ ఆకస్మిక మరణం పట్ల ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బరోట్ ఎంతో మంచి వాడని, అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. చదవండి: Team India Coach: రాహుల్ ద్రవిడ్ ఒప్పేసుకున్నారు.. ఇకపై హెడ్ కోచ్‌గా?! -
1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..
క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్లు అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లలు వరకు ఇష్టపడని వారు ఉండరు. అలాగే ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్మెంట్ ఎంతగా ప్రజల దృష్టిని ఆకర్షించిందో అందరికి తెలిసిందే. 1990లలో తీసిన అడ్వర్టైస్మెంట్ ఇప్పుడు వస్తున్న అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ట్విట్టర్లో ప్రశంసిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే.... (చదవండి: వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’) క్రికెట్ తమ ఆరాధ్య క్రీడగా భావించే మన దేశంలో 1990లో వచ్చిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్ మెంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సమయంలో కేవలం పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. ఈ క్రమంలో కాలనుగుణంగా క్యాడ్బరీ ప్రకటన రూపకర్త ఓగిల్వి మంచి అడ్వర్టైస్మెంట్ రూపొందించారు. ఇందులో ఒక అమ్మాయి పూల డ్రస్ వేసుకుని క్యాడ్బరీ చాకొలెట్ తింటూ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో నృత్యం చేసుకుంటూ సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలోకి వచ్చేస్తుంది. పైగా దీనికి "అస్లీ స్వాద్ జిందగీ కా" (జీవితంతో నిజమైన రుచి) ట్యాగ్‌లైన్ జోడించడంతో ప్రజల దృష్టి క్రికెట్ నుంచి మరల్చకుండా చాలా బాగా ప్రజలకు చేరువైంది. అప్పటి వరకు పిల్లలకు మాత్రమే చాకొలెట్లు అనే దానిని చెరిపేసినట్లుగా చాలా బాగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ప్రకటనను రూపొందించారు. తదనంతరం ప్రస్తుతం మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో చిన్న చిన్న మార్పులతో అదే అడ్వర్టైస్మెంట్ రూపొందించింది. అప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌కోసం నృత్యం చేస్తే ఇప్పుడు అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ నృత్యం చేసినట్లు రూపొందించారు. ఇది కూడా ప్రేక్షకులకు చేరువైంది గానీ కొత్తదనం కోరుకుంటున్నామంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరికొంతమంది లింగఅసమానతకు తావు లేకుండా కాలానుగుణంగా రూపొందిస్తున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. Oh wow!! Take a bow, Cadbury Dairy Milk and Ogilvy :) A simple, obvious twist that was long overdue, and staring right at all of us all this while! pic.twitter.com/Urq8NXtg7W — Karthik 🇮🇳 (@beastoftraal) September 17, 2021 (చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు) -
వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్
ఢాకా: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ కరోనా బారిన పడ్డాడు. ఇది సాధారణ విషయమే!.. విచిత్రమేమింటంటే ఫిన్ అలెన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఢాకా వచ్చిన అతనికి జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కరోన పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతన్ని బస చేసిన హోటల్లోనే క్వారంటైన్ చేసినట్లు కివీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిన్ అలెన్ న్యూజిలాండ్ తరపున 3 టీ20 మ్యాచ్‌లాడి 88 పరుగులు చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్ ఆఫ్రిది; పాకిస్తాన్ ఘన విజయం -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన వైఎస్సార్ జిల్లా కుర్రాడు
నందలూరు(వైఎస్సార్ జిల్లా): దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో నందలూరుకు చెందిన ఆలుసూరి శివకోటికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం బోర్డు ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈనెల 3 నుంచి 8 వరకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఇండియన్ డిసేబుల్ ప్రాబబుల్స్ క్యాంప్‌లో ఎంపిక నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుంచి 35 మంది క్రీడాకారులు జట్టులో స్థానం పొందేందుకు పోటీపడ్డారు. వీరిలో ఏపీ నుంచి శివకోటి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సీరిస్‌కు ఆడే జట్టులో శివకోటికి స్థానం కల్పించారు. మూడు ఫార్మాట్లలో ఒక టెస్టు మ్యాచ్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడేందుకు శివకోటి ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని శివకోటి ఇక్కడి విలేకర్లతో తెలిపారు. -
దీనస్థితిలో క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్... రోజుకూలీగా పనులకు
గుజరాత్: దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్‌పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్) కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి) -
ఆటకు గుడ్‌బై ప్రకటించిన లంక స్టార్ క్రికెటర్
కొలంబో: శ్రీలంక స్టార్ క్రికెటర్ ఇసురు ఉదాన అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న లంక బోర్డుకు ఉదాన నిర్ణయం షాక్ అనే చెప్పాలి. కాగా ఉదాన ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతకముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన ఉదానా రెండు ఓవర్లు బౌల్ చేసి 27 పరుగులిచ్చుకున్నాడు. 2009 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 33 ఏళ్ల ఉదానా 21 వన్డేల్లో 237 పరుగులు.. 18 వికెట్లు, 34 టీ20ల్లో 256 పరుగులతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. 33 ఏళ్ల ఇసురు ఉదాన 2021 టీ20 వరల్డ్‌కప్ జట్టులో కీలకంగా మారతాడని లంక బోర్డు భావించింది. సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది. గ్రూప్ మ్యాచుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఇక గత సీజన్లో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఇసురు ఉదాన 2020 సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన ఒకే ఒక్క లంక క్రికెటర్‌గా నిలిచాడు. 2021 మెగా వేలానికి ముందు ఉదానను ఆర్సీబీ రిలీజ్ చేయడం, వేలంలో ఉదానను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. -
పాక్ లో పుట్టి భారత్ లో ఆల్ రౌండర్ గా
-
Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది. 2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
లంక జట్టును వదలని కరోనా భూతం.. తాజాగా క్రికెటర్‌కు పాజిటివ్
కొలంబో: ఇంగ్లండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టును కరోనా భూతం వదలట్లేదు. తొలుత బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు వైరస్ నిర్ధారణ కాగా, ఆ తరువాత డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు కరోనా సోకిందని తేలింది. తాజాగా, సందున్ వీరక్కోడి అనే క్రికెటర్ మహమ్మారి బారిన పడ్డాడని తేలడంతో సహచర క్రికెటర్లతో పాటు భారత శిబిరంలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరక్కోడిని లంక క్రికెట్ బోర్డు ఐసోలేషన్‌కు తరలించింది. అతడితో కలిసున్న వారినీ కూడా ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్‌కు పంపింది. కాగా, అంతకుముందు వీరక్కోడి.. మరో 15 మంది సీనియర్ క్రికెటర్లతో కలిసి సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను లంక క్రికెట్ బోర్డు శుక్రవారం రాత్రి దంబుల్లాకు పంపింది. అందులో వీరక్కోడి సహా 26 మంది క్రికెటర్లు ఉన్నారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన లంక జట్టులో వీరక్కోడి సభ్యుడు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, కరోనా దెబ్బకు శ్రీలంకతో వన్డే సిరీస్ ఐదు రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13న ప్రారంభంకావాల్సిన వన్డే సిరీస్.. జులై 18 నుంచి మొదలవుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. లంక క్రికెట్ జట్టులో వరుసగా కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు 18, 20, 23 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం జులై 25 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతోందని సూచన ప్రాయంగా ప్రకటించారు. -
క్రికెటర్ నట్టూకు ఆ కమెడియన్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా?
చెన్నై: యువ క్రికెటర్ నటరాజన్‌ను హాస్యనటుడు యోగిబాబు సోమవారం కలిశారు. ఫిజియోథెరపీ కోసం బెంగళూరులో ఉన్న నటరాజన్‌ను కలిసిన యోగిబాబు ఆయనకు కుమారస్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను నటరాజన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన మిత్రుడు యోగిబాబును కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో గుర్తిండిపోయే రోజని పేర్కొన్నాడు. -
Hanuma vihari: ఫౌండేషన్ లోగో చూశారా!
సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్ లోగోను ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్ రీగన్ మాటలను కోట్ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా తన ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్ టైం లైన్ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం. Hi All- "We can't help everyone, but everyone can help someone" by Ronald Reagan.🙂 On this note happy to introduce our logo. Let us unite together and reach our help and efforts to needy people. Team Hv 🤝🏻@Hanumavihari pic.twitter.com/cblAvHLFAy — Hanuma Vihari Foundation (@HanumaVihariFdn) June 11, 2021 చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా(66) కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం ఉదయం ఆయన మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ధృవీకరించింది. క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పాతతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు గాంచిన జడేజా.. 1974-1987 మధ్యకాలంలో 50 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1640 పరుగులతో పాటు 145 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కొంతకాలం పాటు సౌరాష్ట్ర కోచ్‌గా, మేనేజర్‌గా, సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జడేజా.. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా వ్యవహరించాడు. 53 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 34 టీ20 మ్యాచ్‌లకు అతను మ్యాచ్ రిఫరీగా పని చేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా, ప్రస్తుత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్ షా సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..? -
యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా?
టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తుంటుంది. ఇటీవల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసుతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా గురిచేశాడని ఆరోపించింది. తాజాగా ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందిస్తూ.. తనపై తప్పుడు కేసు పెట్టారని, త్వరలో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శ్యామల.. ‘అవునా.. ఈ విషయం నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ సెటైర్ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటూ వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. చదవండి : చీటింగ్ కేసు : వీడియో రిలీజ్ చేసిన యాంకర్ శ్యామల భర్త మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ -
కరోనా: పాట్ కమిన్స్ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలన్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు. అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీల్ కొనసాగించడం సరియైనదా కాదా అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీల్ మ్యాచ్‌లు కాస్త సంతోషానిస్తాయన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు. ఈ మేరకు కమిన్స్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా, 2021 ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేసి కొత్త చరిత్రను రాశాడు. ఇలా ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవాడుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం -
ఆయన క్యాచ్ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి
క్రికెటర్లు పెళ్లి చేసుకుని భార్యలతో టోర్నమెంట్లకు వస్తే, వచ్చాక సరిగా ఆడకపోతే ఆ భార్యలను ట్రోల్ చేసే అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లి విఫలమైనప్పుడల్లా అనుష్క శర్మ ఈ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు. అయితే అనుష్కా మాత్రమే కాదని... తాను కూడా పటౌడి సరిగ్గా ఆడకపోతే తిట్లు తిన్నానని షర్మిలా టాగోర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పటౌడి గారు మా పెళ్లి సమయానికి ఇంకా ఆడుతున్నారు. ఆయన బరిలో దిగితే బాగా ఆడతారని పేరు. కాని మా పెళ్లయ్యాక ఆయన క్యాచ్ జార విడిచినా, సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా నాకు తిట్లు పడేవి. అయితే అభిమానుల నుంచి కాదు. మా నాన్న నుంచే. ఆయన కామెంటరీ వింటూ ‘‘అరె... నువ్వతన్ని రాత్రి సరిగ్గా నిద్ర పోనిచ్చావా లేదా’ అని నా మీద కయ్యిమనేవారు’ అని తిట్టేవారు’’ అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. షర్మిలా టాగోర్, పటౌడీలకు సైఫ్ అలీ కాకుండా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోహా అలీ ఖాన్, సాబా అలీ ఖాన్. అయితే వీరెవరికీ ఆమె ఇతర హీరోలతో కలిసి నటించిన సినిమాలు చూడటం ఇష్టం లేదు. చూడరు కూడా. సాబా అలీ ఖాన్ మాత్రం ‘నువ్వు నటించిన చుప్కే చుప్కే మాత్రం నాకు చాలా ఇష్టం’ అంటూ ఉంటుంది. పిల్లలు ముంబైలో ఉంటున్నా షర్మిలా ఢిల్లీలో నివసిస్తుంటారు. చదవండి: ఇక నుంచి మా అమ్మ సలహా తర్వతే సైన్ -
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా కారుపై ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండా లక్ష్యంగా మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు సమాచారం. ఈ దాడిలో దిండా తీవ్ర గాయలపాలైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి, తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థుల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చదవండి: డక్‌వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా -
అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా!
ముంబై: భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే ఏం ఆలోచించకుండా వెంటనే విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అనే పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వీరెవరూ కాదంటే మీరు నమ్మగలరా. వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ప్రస్తుతం దేశవాలి క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 2018లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 31 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా ఆస్తుల విలువ 70 వేల కోట్లు. త్వరలోనే బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ అధిపతి కానున్నాడు. ఈ లెక్క ప్రకారం భారత దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు సంపాదించనున్నాడు. 23 ఏళ్ల ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అంతర్జాతీయ క్రికెటర్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని కలలు కనేవాడు. అందుకోసం ఈ జూనియర్ బిర్లా ప్రతిరోజూ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబతాలో తన పేరుని చూసుకోవడానికి కఠినమైన శిక్షణ పొందుతున్నాడు. ఆర్యమన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్, లెఫ్ట్ ఆర్మ్ఆర్థోడాక్స్ బౌలర్. మీ ఇంటి పేరు కారణంగా ఏమైనా ఒత్తిడి ఉందా అని ఆర్యమన్‌ను ఎవరైనా అడిగితే.. అతను చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. 'నేను నా సొంతంగా ఎదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా అని చెప్పుకొచ్చేవాడు. 2017న ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్యమన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒడిశాపై కేవలం 22 పరుగులు చేశాడు. తరువాత సీ.కే.నాయుడు ట్రోఫీలో అతను 11 ఇన్నింగ్స్‌లలో ఆరు మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. ఇక జూనియర్ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు ఆడిన ఆర్యమన్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలు సాధించాడు. ( చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ ) -
బంతిని పట్టుకోబోయాడు.. తిరిగి లేవలేదు
సాక్షి, ఘట్కేసర్ : క్రికెట్ ఆడుతూ మైదానంలో కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ తెలిపిన మేరకు.. చెంగిచెర్ల, బోడుప్పల్ వెంకటసాయినగర్‌లో నివాసముండే హర్యానాకు చెందిన లలిత్‌కుమార్(27) యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి. అవుషాపూర్ ఏఎన్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా బంతిని పట్టుకునే క్రమంలో కింద పడిపోయి తిరిగి లేవలేదు. ఇతర క్రీడాకారులు ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హృదయ విదారకం: పిచ్‌పైనే కుప్పకూలిన క్రికెటర్
పుణె: ఆరోగ్యంతోనే ఉంటే క్రీడల్లో ఆడాలి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ వంటి ఆటల్లో జాగ్రత్తగా పాల్గొనాలి. లేకపోతే దారుణ పరిస్థితులు వస్తాయి. తాజాగా ఓ క్రికెటర్ క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీంతో తోటి ఆటగాళ్లంతా విషాదంలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఫీల్డర్ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన ఎంపైర్ ఆటగాళ్లను పిలిచారు. వారు వచ్చి చూసేసరికి నల్వాడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో హృదయాలను పిండేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అయితే గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. फलंदाजी करताना मैदानावरच आला हार्ट अटॅक... पुणे जिल्ह्यातील स्थानिक क्रिकेटपटूचा उपचारापुर्वीच मृत्यू... अंगावर काटा आणणारा व्हायरल व्हिडिओ... pic.twitter.com/fHuvTSygrb — Pranali Kodre (@Pranali_k18) February 17, 2021 గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ -
నటితో క్రికెటర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
క్రికెట్ స్టేడియంలో ఆ బాట్స్మన్ బ్యాటింగ్ తీరుకి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.. గ్యాలరీలో ఉన్న స్వదేశీయులు జేజేలు పలుకుతున్నారు. వాళ్లల్లో ఒక హీరోయిన్ అయితే ఆనందంతో కేరింతలు కొడ్తోంది. ఆ ఆనందం ఆ బ్యాట్స్‌మన్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడల్లా ఆమె వంక చూస్తున్నాడు. అభినందనలను చప్పట్లతో మారుమోగిస్తోంది ఆమె. అతను.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. బ్యాట్‌తో మెరుపుదాడి చేసి స్టేడియంలో బంతులను పరిగెత్తించే టైగర్.. ఆ హీరోయిన్.. షర్మిలా టాగోర్ .. కాదు. నాజూకు మేని.. అంతే నాజూకైన స్వరం... బ్రిటిష్ యాక్సెంట్ ఇంగ్లిష్ ప్రత్యేకతల సిమీ గరేవాల్. అవును.. షర్మిలాను జీవిత భాగస్వామిగా చేసుకునే కంటే ముందు పటౌడీ శ్వాస, ధ్యాస సిమీనే. ఆ ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే ఈ వారం ‘మొహబ్బతే’. టైగర్ పటౌడీ పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. సిమీ అంతే పేమస్ బాలీవుడ్ ప్రేక్షకులకు. ‘సిద్ధార్థ’ సినిమాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించింది. ‘మేరా నామ్ జోకర్’, ‘చల్తే చల్తే’ వంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రెటీలను కూర్చోబెట్టి మాటల్లో పెట్టి వాళ్ల జీవిత కథను (‘రెండవూ విత్ సిమీ గరేవాల్’ అనే టాక్ షోలో) వినిపిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనీ నిరూపించుకుంది. పుట్టింది లుధియానా (పంజాబ్)లో, పెరిగింది ఇంగ్లాండ్‌లో. సిమీ సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నిరాహార దీక్ష చేసి పెద్దవాళ్ల చేత ‘ఎస్’ చెప్పించుకుంది. సిమీకి శ్వేత వర్ణం అంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులనే వేసుకుంటుంది తన టాక్ షో అయినా.. సినిమా వేడుక అయినా. అందుకే ఆమెను ‘ది లేడీ ఇన్ వైట్’ అని పిలుస్తారు సినిమా రంగంలోని వాళ్లు. (చదవండి: ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!) ఫస్ట్ లవ్.. తన పదిహేడేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లో వాళ్లింటి పక్కనే ఉంటూండే జమ్నాగర్ మహారాజుతో ప్రేమలో పడింది. అతని వల్లే బయటి ప్రపంచం తెలిసింది అనీ చెప్పింది సిమి ఒక ఇంటర్వ్యూలో. మూడేళ్లు సాగిన ఆ బంధం బ్రేక్ అయింది. సినిమాలతో సివీమ బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీలో పటౌడీ పరిచయం అయ్యాడు. ఆటలు, ఇంగ్లిష్ కల్చర్ అంటే ఆ ఇద్దరికీ ఉన్న ఆసక్తి వాళ్లిద్దర్నీ స్నేహితులుగా మార్చింది. సిమీ ధైర్యం, నొప్పించకుండా ఉండే మాట తీరుకు ఆకర్షితుడై.. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు పటౌడీ. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండే అతని తీరునూ సిమీ ఇష్టపడింది. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా.. ఏ సినిమా వేడుకకైనా జంటగా వచ్చేవాళ్లిద్దరూ. క్రికెట్, సినిమా పరివారానికంతటికీ తెలిసిపోయింది వీళ్లిద్దరూ ప్రేమ పక్షులని. గ్యాలరీలో సిమీ కేరింతల కోసం పిచ్ మీద నుంచి ఆశగా చూసేవాడు పటౌడీ. ఆలంబనగా చేతులు చాచేది సిమీ. అంతే ఆమెను చూస్తూనే వచ్చే బంతిని బౌండరీ దాటించేవాడని చెప్తారు ఈ ఇద్దరి సన్నిహితులు. అందుకే ఆ రెండు రంగాల వాళ్లు వీళ్ల పెళ్లి పత్రిక కోసం ఎదురు చూడసాగారు. పటౌడీ కూడా వాళ్లింట్లో వాళ్లకు సిమీ గురించి చెప్పేసి ఆమెతో పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే శుభ ఘడియ కోసం ఆగాడు. ఈలోపు.. ఏదో సందర్భంలో షర్మిలా కలిసింది పటౌడీని. తొలి చూపులోనే ఆమె రూపం అతని మనసులో ముద్ర పడిపోయింది. ఈసారి తాను సందర్భం కల్పించుకొని షర్మిలాను కలిశాడు. పటౌడీని ఇష్టపడింది ఆమె. అతనికీ ఇష్టం ఉంది. కాని ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు. జీవితభాగస్వామిగా షర్మిలా చేయే పట్టుకోవాలనే నిశ్చయించుకున్నాడు కాని సిమీతో ఉన్న బంధం అతణ్ణి కన్ఫ్యూజన్లో పెట్టింది. అయినా ఏ కొంచెం సమయం చిక్కినా షర్మిలాతోనే సమయం వెచ్చించసాగాడు. ఆ స్నేహ సంభాషణలతో కన్ఫ్యూజన్ పోయి స్పష్టత వచ్చేసింది. ఒకరోజు సాయంకాలం.. సిమీ వాళ్లింటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది సిమీ. ఎదురుగా పటౌడీ. ఎప్పటిలా నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె. ఇబ్బందిగానే హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘లెమనేడ్ ఇష్టం కదా మీకు? తీసుకొస్తా’ అంటూ కిచెన్‌లోకి వెళ్లబోతుంటే ‘ఇప్పుడేం వద్దు. నీతో మాట్లాడాలి అంతే’ అన్నాడు పటౌడీ. ‘లెమనేడ్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు కదా’ అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి లెమనేడ్ తెచ్చి పటౌడీ చేతికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది సిమి. ‘ఇప్పుడు చెప్పండి’ అన్నట్టుగా. చేతిలో ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ అన్నాడు పటౌడీ ‘సిమీ.. ఇట్స్ ఓవర్’ అని. కనుబొమలు పైకి స్ట్రెచ్ చేస్తూ చూసింది ఆమె ‘ఏంటీ?’ అన్నట్టుగా. ‘యెస్.. నేను షర్మిలాను ఇష్టపడ్తున్నాను. తననే పెళ్లిచేసుకుంటున్నాను. ఇంక మనమధ్య.. ’ అని ఆగాడు. నవ్వుతూనే నిట్టూర్చుంది సిమీ. ‘ఐయామ్ సారీ సిమీ’ అన్నాడు పటౌడీ ఆమె కళ్లలోకి చూస్తూ. అదే నవ్వు ఆమె పెదవుల మీద. కాని ఆ కళ్లల్లో కనిపించిన నీటి పొర పటౌడీ దృష్టిని తప్పించుకోలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ‘బై’ అంటూ లేచాడు. తనూ లేచింది ఎప్పటిలాగే లిఫ్ట్ దాకా పటౌడీని సాగనంపడానికి. వద్దంటూ ఒక్కతీరుగా వారించాడు. అయినా వినకుండా అతని వెంటే వెళ్లింది. లిఫ్ట్ దగ్గర.. పటౌడీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ షర్మిలా కనిపించింది సిమీకి. ఊహించని దృశ్యానికి షర్మిలా ఇబ్బంది పడింది. ఈ లోపు లిఫ్ట్ వచ్చింది. షర్మిలా, వెనకాలే పటౌడీ.. లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఒంటరి అయిపోయింది సిమీ. తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీకి చెందిన రవి మోహన్ అనే వ్యాపారవేత్తను సిమీ పెళ్లి చేసుకుంది. కాని ఆ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. ఒంటరిగానే జీవనయానం సాగిస్తోంది సిమీ. - ఎస్సార్ -
వందో వసంతంలోకి క్రికెట్ కురువృద్దుడు
ముంబై: మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్ రఘునాథ్ చందార్కోర్ తన వందో వసంతాన్ని జరుపుకోనున్నారు. రేపు(నవంబర్ 21వ తేదీ) ఆయన వందో ఒడిలోకి అడుగుపెట్టనున్నారు. దాంతో వందేళ్ల పూర్తి చేసుకోబోతున్న మూడో రంజీ క్రికెటర్‌గా రఘునాథ్ చందార్కోర్ నిలవనున్నారు. ఈ ఏడాది జూన్‌లో కురువృద్ధ క్రికెటర్ రాయ్‌జీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాయ్‌జీ కూడా వంద పుట్టినరోజులు చూసిన రంజీ క్రికెటర్లలో ఒకరు. ఇక రఘునాథ్ చందార్కోర్ 1943-44 సీజన్ నుంచి 1946-1947 సీజన్ వరుకూ మహారాష్ట్రకు ప్రాతినిథ్య వహించారు. అనంతరం 1950-51 సీజన్లో ముంబై తరఫున ఆడారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని దాంబివ్లిలో నివసిస్తున్నారు. కాగా, ఆయన గత ఆరేళ్లగా మంచం మీదే కాలం వెల్లదీస్తున్నారని ఆయన కోడలు వినితా తెలిపారు. ఆయన జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని, అయినప్పటికీ టీవీల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఉంటారన్నారు. ఇది మమ్మల్ని అప్పడప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుందని వినితా తెలిపారు. -
దుబాయ్ బంగారం: కృనాల్ పాండ్యాకు షాక్
సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. Cricketer Krunal Pandya stopped by Directorate of Revenue Intelligence (DRI) at the Mumbai International Airport over suspicion of being in possession of undisclosed gold and other valuables, while returning from UAE: DRI sources pic.twitter.com/9Yk82coBgz — ANI (@ANI) November 12, 2020 -
యార్కర్ కింగ్..
ఒక పెద్దాయన చాలా హుందాగా అన్నాడు... ‘నాకు యార్కర్ అంటే తెలియకపోవడం ఏమిటయ్యా! వింత కాకపోతేనూ... యార్కర్ అంటే నువ్వు వేసే బంతులే కదా. అవును... వీటిని యార్కర్ అని ఎందుకు పిలుస్తారు? కాస్త చెబుతావా?’ అప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్ అమాయకంగా ఇలా బదులిచ్చాడు... ‘అమ్మతోడు సార్... నేను వేసే వాటిని యార్కర్ అంటారని మీరు చెప్పేవరకు నిజంగా నాకు తెలియదు’ వన్స్ అపాన్ ఏ టైమ్‌లోని ‘పంచ్’ మ్యాగజైన్లలో ఇలాంటి సరదా మాటలు బోలెడు దొరుకుతాయి. అయితే యార్కర్ అంటే సరదా కాదు. ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసి ఇరుకున పెట్టడం...జట్టు విజయానికి దారి పరచడం. ఆ విద్యలో తన టాలెంట్ చూపుతూ ‘కింగ్’ అనిపించుకుంటున్నాడు తంగరసు నటరాజన్. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా మరోసారి తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నాడు. సేలం జిల్లాలోని చిన్న ఊరు చిన్నప్పంపట్టి. చెన్నైకి 340 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఊరు వాడే తంగరసు నటరాజన్. తండ్రి దినసరి కూలి. తల్లి రోడ్డు పక్కన చికెన్ అమ్ముతుంది. ‘జీరో సౌకర్యాలు’ తప్ప ఆ ఊళ్లో చెప్పుకోదగ్గవి పెద్దగా ఏమీలేవు. అలాంటి ఊళ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు నటరాజన్. ‘ఆట కూడెడుతుందా? కూలీ పనిచెయ్...చికెన్ కొట్టు’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆర్డర్ వేయలేదు. కొడుకు ఆడుతుంటే మురిసిపోవడం తప్ప ఎప్పుడూ అడ్డుకున్నది లేదు. క్రికెట్ సీజన్ వస్తే నటరాజన్‌కు ఒకేసారి వందపండగలు వచ్చినట్లు. పొద్దుట ఎనిమిది గంటలకల్లా ఇంట్లో నుంచి బయటపడి ఊరూరు తిరుగుతూ ఆటలు ఆడేవాడు. ‘ఇంకేముంది వాళ్లే కచ్చితంగా గెలుస్తారు’ అంటూ డీలా పడిపోయి ప్రత్యర్థి జట్టుకు గెలుపు కిరీటం తొడగడానికి రెడీ అవుతున్న అనేకానేక సందర్భాలలో సొంత జట్టును గెలిపించాడు నటరాజన్. అయిదుగురు సంతానంలో పెద్దవాడు నటరాజన్. కుటుంబమంతా కలిసి ఒక చిన్నగదిలో నివసించేది. ‘తిండి, నీళ్లు, ఆరోగ్యం అన్నీ సమస్యలే. స్కూల్లో ఉచితంగా పెట్టే భోజనంతో కడుపు నింపుకునేవాడిని’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నటరాజన్. ‘మావాడు టైమ్‌పాస్ కోసం ఆడడం లేదు. వాడికంటూ ఒక టైమ్ వస్తుంది’ అని తల్లిదండ్రులు అనుకున్నారో లేదోగానీ....అతడికంటూ ఒక ‘టైమ్’ వచ్చింది! రంజీల్లో రాణించి, టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో తడాఖా చూపిన నటరాజన్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మూడు కోట్లకు ఎంపిక చేసుకుంది. ఆ డబ్బుతో తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. ఊళ్లో ‘క్రికెట్ అకాడమీ’ మొదలు పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. నటరాజన్‌తో కలిసి 2009 నుంచి క్రికెట్ ఆడిన జయప్రకాష్ ‘ఆరు బంతులకు ఆరు యార్కర్లు పడేవి’ అని గతాన్ని తలుచుకుంటు మురిసిపోతుంటాడు. ‘నీకు క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’ అని గట్టిగా చెప్పింది, ప్రోత్సహించిందే ఇతడే. వీరి అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాష్‌ను మార్గ నిర్దేశకుడిగా చూస్తాడు నటరాజన్. లోకల్ విలేజ్ టోర్నమెంట్స్‌లో నటరాజన్ గెలుచుకున్న 150కి పైగా ట్రోఫీలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆట మైకంలో అర్ధాకలితో గడిపిన రోజల నుంచి మొదలు ఓటమిని పసిగట్టి గెలుపు వ్యూహం రచించడం వరకు ఎన్నెన్నో వాటిలో ఉన్నాయి. ‘ఈ కుర్రాడికి ఎప్పుడు చూసిన ఆటలే’ అని విసుక్కున్న వారు కూడా ఇప్పుడు... ‘మన ఊరు అబ్బాయి ఎంత ఎదిగిపోయాడో చూశావా. అలా ఉండాలి పట్టుదల అంటే’ అంటుంటారు. అయితే నటరాజన్ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనంతగా ఏమీ దూసుకుపోలేదు. మొదట్లో ‘ఇంప్రాపర్ బౌలింగ్ యాక్షన్’ అని వెనక్కి పిలిచినప్పుడు ‘ఇక నా పని అయిపోయినట్లే’ అనుకున్నాడు. అంతమాత్రానా ఆటకు టాటా చెప్పలేదు. తనను తాను మరింత పదును పెట్టుకున్నాడు. ఆ తరువాత ‘బౌలింగ్ యాక్షన్’కు క్లీన్‌చీట్ వచ్చింది. ప్రయాణం మొదలైంది. మధ్యలో కాస్త తడబడ్డాడు. మరో ఛాన్స్ కోసం ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వచ్చింది. ఎక్కడ నిరాశ పడలేదు. మళ్లీ లేచాడు. ముత్తయ్య మురళీధరన్లాంటి దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. తన యార్కర్కతో మెరుపులు మెరిపించినప్పుడల్లా ‘ఎవరీ నటరాజన్?’ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. జవాబులో ఎంత స్ఫూర్తి ఉంటుందో కదా! అది మాత్రమే చాలదు తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ చూడడం, ఆడడం గొప్ప విషయమేగానీ దాన్ని కెరీర్ ఆప్షన్‌గా మలుచుకోవాలనే ఆలోచన తక్కువ. దీన్ని టైమ్‌పాస్ ఆటగానే చూస్తున్నారు. ప్రతిభ ఉండాలేగానీ మన కుటుంబ ఆర్థికనేపథ్యం అనేది ముఖ్యం కాదు. ఆటతీరు మాత్రమే ముఖ్యమవుతుంది. – తంగరసు నటరాజన్, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ -
ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా
ఇస్లామాబాద్ : క్రికెట్ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుంచి మొదలుకొని సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటతీరును చూశాం.. చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆటలో తమ నైపుణ్యతను అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇలా ఏదో ఒక దాంట్లో తమ మెళుకువలను చూపెడుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, ఇయాన్ బోథమ్ సహా ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఇదే కోవలోకి వస్తారు. కానీ కొంతమంది మాత్రం ప్రదర్శనతో కాకుండా తమ రూపురేఖలతో ఆకట్టుకుంటారు. క్రికెట్లో అత్యంత పొడవైన క్రికెటర్‌గా పాక్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇర్ఫాన్ పొడవు .. 7 అడుగుల 1అంగుళం. (చదవండి : ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా) 2010లో పాక్ వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఇర్ఫాన్ తన బౌన్సర్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ రికార్డును పాక్‌కే చెందిన ముదస్సార్ గుజ్జర్ అనే కుర్రాడు బద్దలు కొట్టాడు. గుజ్జర్ పొడవు 7 అడుగుల 6 అంగుళాలు. ముదస్సార్ గుజ్జర్ గతేడాది నవంబర్‌లో లాహోర్ క్వాలాండర్స్ డెవలప్మెంట్ లో చేరి కోచ్, ట్రైనర్ల సహాయంతో బౌలర్‌గా శిక్షణ పొందుతున్నాడు. గుజ్జార్ ఎక్కువ పొడవు కావడంతో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కఠోర సాధన చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పాక్ తరపున దేశవాలి క్రికెట్లో ఆడి పేరు సంపాదించి ఆపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్నాడు. తాజాగా ముదస్సార్ గుజ్జార్‌ను కలిసిన ఒక జర్నలిస్ట్ అతనితో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ' ముదస్సార్ గుజ్జార్ పొడవు.. 7 అడుగుల 6 అంగుళాలు, షూ సైజ్ 23.6.. ఇంత పొడవు క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా.. మీట్ విత్ ముదస్సార్ గుజ్జార్' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(చదవండి : ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) సాధారణంగా విండీస్ నుంచి వచ్చే క్రికెటర్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆరు అడుగులకు పైగానే ఉంటారు. మన టీమిండియాలో కూడా అత్యంత పొడగరి ఎవరంటే ఇషాంత్ శర్మ పేరు టక్కున చెబుతారు. ఇషాంత్ శర్మ పొడవు 6 అడుగుల 5అంగుళాలు. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత పొడవైన క్రికెటర్లుగా మహ్మద్ ఇర్ఫాన్(పాకిస్తాన్), జోయల్ గార్నర్(వెస్టిండీస్), బ్రూస్ రీడ్(ఆస్ట్రేలియా), కర్ట్లీ ఆంబ్రోస్(వెస్టిండీస్), టామ్ మూడీ( ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), క్రిస్ ట్రెమ్లెట్( ఇంగ్లండ్), పీటర్ ఫుల్టన్(న్యూజిలాండ్), షాహిన్ ఆఫ్రది(పాకిస్తాన్), ఇషాంత్ శర్మ( ఇండియా) తొలి పది స్థానాల్లో ఉంటారు. -
రోడ్డు ప్రమాదం: క్రికెటర్ దుర్మరణం
కాబూల్: ఆఫ్గనిస్తాన్ యువ క్రికెటర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తరకాయ్(29) దుర్మరణం చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. వారం రోజుల కిందట తూర్పు నంగన్హర్లో రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ కారు నజీబ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.(చదవండి: హీల్స్ ధరించి క్రికెట్ ఫీల్డ్‌లో తిరుగుతారా?) కాగా నజీబ్ మరణవార్తను అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది. యువ క్రికెటర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బోర్టు.. దేశమంతా విషాదంలో మునిగిపోయిందని ట్వీట్ చేసింది. నజీబ్ మరణం తమకు తీరని లోటు అని, దూకుడుగా ఇన్నింగ్ ఆరంభించే ఓపెనర్, మంచి మనిషిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో అతడు దుర్మరణం పాలయ్యాడని, నజీబ్ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ సంతాపం తెలిపింది. ఆరు సెంచరీలు చేశాడు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున 12 వన్డేలు ఆడిన నజీబ్.. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 90 పరుగులతో రాణించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 47.20 సగటు కలిగి ఉన్న ఈ బ్యాట్స్‌మెన్.. కెరీర్ మొత్తంలో ఆరు సెంచరీలు చేశాడు. గతేడాది జరిగిన ష్పగిజా క్రికెట్ లీగ్‌లో స్పీన్ ఘర్ టైగర్స్ తరఫున మైదానంలో దిగిన నజీబ్.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సెప్టెంబరులో మిస్ ఐనాక్ నైట్స్ స్క్యాడ్లో అతడు భాగస్వామిగా ఉన్నాడు. ACB and Afghanistan Cricket Loving Nation mourns the heart breaking & grievous loss of its aggressive opening batsman & a very fine human being Najeeb Tarakai (29) who lost his life to tragic traffic accident leaving us all shocked! May Allah Shower His Mercy on him pic.twitter.com/Ne1EWtymnO — Afghanistan Cricket Board (@ACBofficials) October 6, 2020 -
టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం..
టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కాబోయే బార్య వైశాలి వీశ్వేశ్వరన్తో కలిసి దిగిన రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంగరం ఎమోజీని జత చేశారు. ఈ సందర్బంగా విజయ్‌కు అతని సహచరులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇటీవల మరో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ సైతం ధనశ్రీ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా') విజయ్ పోస్టుపై స్పందించిన కేఎల్ రాహుల్, చాహల్ ‘అభినందలు సోదరా’.అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా విజయ్ శంకర్ 2018లో కొలంబోలో జరిగిన శ్రీలంక- భారత్ టీ 20 మ్యాచ్‌తో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి వన్డేలో అరంగేట్రం చేశాడు. శంకర్ భారత్ తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడాడు. త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. (రాహుల్ ఆ పదానికి అర్థం ఏంటి..) View this post on Instagram 💍 PC - @ne_pictures_wedding A post shared by Vijay Shankar (@vijay_41) on Aug 20, 2020 at 8:41am PDT -
హర్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా..
ముంబై : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కొడుక్కి ‘అగస్త్య’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన ముద్దుల కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్ కారును బహుహతిగా పంపిన ఆ కార్ డిలర్ షిప్ కంపెనీకి కూడా ఇన్స్టాగ్రామ్ పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. కాగా చాలా రోజుల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ ఐపీఎల్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. (హార్దిక్ స్పెషల్ ఇన్నింగ్స్‌కు ముంబై విషెస్) ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియన్ నటి నటాషాతో హార్థిక్ పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కాక ముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత గత నెలలో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను పాండ్య తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోటు నెట్టింటా వైరలవుతున్నాయి. అంతేగాక పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయిన ఈ జంట సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. (కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసిన హార్దిక్) View this post on Instagram We are blessed with our baby boy ❤️🙏🏾 A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 30, 2020 at 3:03am PDT View this post on Instagram The blessing from God 🙏🏾❤️ @natasastankovic__ A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 31, 2020 at 9:34pm PDT View this post on Instagram My family ❤️ my 🌍 @hardikpandya93 #blessed #grateful #myboys 🙏🏼❤️ A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Aug 2, 2020 at 9:33am PDT View this post on Instagram When I hold you, life makes sense. ❤️❤️❤️🤱🏻 #mamasboy #blessings A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Aug 12, 2020 at 2:46am PDT -
ఉరి వేసుకొని క్రికెటర్ ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఆత్మహత్మ చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కరణ్ తివాతీ(27) అనే క్రికెట్ ప్లేయర్ సోమవారం ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరణ్ ముంబై ప్రొఫెషనల్ జట్టుకు నెట్ ప్రాక్టిస్ బౌలర్. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి పలు టోర్నీలు, మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో కరణ్ తన క్రికెట్ కెరీర్ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కురార్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. (అభిమానితో సెల్ఫీ అతనికి శాపంగా మారింది ) ముంబై మలాద్ ప్రాంతంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కరణ్ కెరీర్లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు. ముంబై సీనియర్ జట్టులో చోటు కోసం కరణ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అతని మృతి పట్ల నటుడు జితు వర్మ విచారం వ్యక్తం చేశారు. కరణ్ చాలా ఏళ్లుగా క్రికెట్లో ఎదగడానికి కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. -
జై శ్రీరామ్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ మందిర భూమి పూజ గురించి ట్విటర్ ద్వారా కనేరియా స్పందించాడు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో డిస్ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి ‘జై శ్రీరామ్’ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు. Today is the Historical Day for Hindus across the world. Lord Ram is our ideal. https://t.co/6rgyfR8y3N — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్ కనేరియా, అంతకు ముందు అనిల్ దల్పత్ అనే హిందూ బౌలర్ 1980 ప్రాంతంలో పాక్ జట్టు తరుపున ఆడిన హిందూ క్రికెటర్. అనిల్ దల్పత్, కనేరియాకు బంధువు. ఇక రామ మందిరం గురించి కనేరియా వ్యాఖ్యలపై ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరానని, తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. ఓ పాకిస్తాన్ ఆటగాడిపై మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందని, తన విషయంలో మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని డానిష్ కనేరియా వాపోయాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్) We are safe and no one should have any problem with our religious beliefs. Life of Prabhu Shri Ram teaches us unity and brotherhood. https://t.co/De7VaZ5QhS — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 చదవండి: అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 -
సుశాంత్.. మాట నిలబెట్టుకోలేదు క్షమించు
హైదరాబాద్: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన తొలి చిత్రం ‘కైపోచే’ అందరికీ గుర్తుండే ఉంటుంది. నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న ఈ చిత్రంలో ఇషాన్ పాత్రలో సుశాంత్ కనిపించగా.. అలీ అనే ప్రొఫెషనల్ క్రికెటర్ పాత్రలో మహారాష్ట్రకు చెందిన దిగ్విజయ్ దేశ్‌ముఖ్ నటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దిగ్విజయ్ సుశాంత్‌కు ఓ మాటిచ్చాడంట. ఓ స్థాయి క్రికెటర్‌గా ఎదిగేవరకు మళ్లీ కలవనని శపథం చేశాడంట. ఈ విషయాన్ని దిగ్విజయ్ స్వయంగా వెల్లడించాడు. అయితే ఇప్పుడు ఓ స్థాయి క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ అతడిని కలిసే అవకాశం లేకపోవడం చాలా బాధాగా ఉందన్నాడు. (సుశాంత్ సోదరి భావోద్వేగ లేఖ) ‘సుశాంత్ క్రికెట్‌పై ఎంతో ఆసక్తి కనబర్చేవాడు. షూటింగ్ సమయంలో నా వయసు 15 ఏళ్లు. అయినా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ తర్వాత అనేక విషయాల గురించి చర్చించేవాళ్లం. ఇక ఆరు నెలల పాటు మా సినిమా ప్రయాణం సాగింది. కైపోచే సినిమా షూటింగ్ చివరి రోజు అతడికి ఓ మాటిచ్చాను. నేను మళ్లీ నిన్ను కలిసేది ఓ స్థాయి అటగాడిగా ఎదిగాకనే అని శపథం చేసి చెప్పాను. అయితే గత డిసెంబర్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ నన్ను తీసుకుంది. అప్పుడే అతడిని కలవాలనుకున్నా కుదరలేదు. తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా అతడికి కలిసేందుకు అస్సలు వీలుపడలేదు. ఇప్పడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది. మాట నిలబెట్టుకోలేదు, కలవలేకపోయాననే బాధ నన్ను తీవ్రంగా వేధిస్తోంది’ అని దిగ్విజయ్ బాధపడ్డాడు. (సుశాంత్‌కి తొలి అవకాశం ఇచ్చింది నేనే) ఇక ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంటూ.. త్వరలో అలీ(దిగ్విజయ్) మైదానంలో ఆడుతుంటే అతడి గురువు ఇషాన్ (సుశాంత్) పై నుంచి చూసి అనందిస్తాడాని హార్ట్ టచింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను, సుశాంత్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సుశాంత్ ఆదివారం ముంబై నగరం బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ☹️💔 Whenever Kai Po Che’s ‘Ali’ takes field next, his master ‘Ishaan’ will smile from the heavens 🤗 📸: @utvfilms#OneFamily pic.twitter.com/yLuJiE6QMD — Mumbai Indians (@mipaltan) June 18, 2020 -
క్రికెట్ కురువృద్ధుడు కన్నుమూత
సాక్షి, ముంబై: ప్రముఖ భారత మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ (100) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్ లోని తన నివాసంలో నిద్రలో ఈ తెల్లవారుజామున 2.20 గంటలకు రాయ్‌జీ కన్నుమూశారని ఆయన అల్లుడు సుదర్శన్ నానావతి తెలిపారు. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన రాయ్‌జీ 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరపున అరంగేట్రం చేశారు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన ఆయన 1949-50 వరకు బరోడా, ముంబై జట్టుకు సేవలందించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆయన విశేష సేవలందించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం క్రికెట్‌పై అనేక రచనలు చేసి క్రికెట్ చర్రితకారుడుగా పేరు గడించారు. భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరుగా అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ ఇటీవల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా కేక్ కట్ చేయించి వేడుక చేసిన సంగతి తెలిసిందే. (‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’) -
కరోనా నుంచి కోలుకున్న పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్ శుక్రవారం తెలిపాడు. కోవిడ్–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఉమర్.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు యువ పేస్ బౌలర్ షెహాన్ మధుశంక హెరాయిన్‌తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. లంకలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి ప్రయాణిస్తోన్న 25 ఏళ్ల మధుశంకను పన్నాల పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది. పోలీసులు మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టగా... రెండు వారాలపాటు రిమాండ్‌కు తరలించింది. బంగ్లాదేశ్‌తో 2018లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన మధుశంక, ఆ తర్వాత రెండు టి20ల్లోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. -
పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్‌కు కరోనా
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. శనివారం రాత్రి కాస్త అస్వస్థతగా ఉండటంతో ఉమర్ కోవిడ్–19 పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిందని... అయితే తనలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని... ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వివరించాడు. 38 ఏళ్ల ఉమర్ పాకిస్తాన్ తరఫున 44 టెస్టులు ఆడి 2,963 పరుగులు... 12 వన్డేలు ఆడి 504 పరుగులు సాధించాడు. కోవిడ్–19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఉమర్. గతంలో మాజిద్ హక్ (స్కాట్లాండ్), జఫర్ సర్ఫరాజ్ (పాకిస్తాన్), సోలో ఎన్క్వెని (దక్షిణాఫ్రికా)లకు కరోనా సోకింది. -
నరేంద్రజాలం
1988... మద్రాసు నగరం ‘పొంగల్’ వేడుకలకు సిద్ధమవుతోంది. మరో వైపు చెపాక్ మైదానంలో వెస్టిండీస్‌తో భారత జట్టు టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది. గత తొమ్మిదేళ్లలో భారత గడ్డపై ఆడిన 16 టెస్టుల్లో 6 గెలిచి 10 డ్రా చేసుకొని ఓటమన్నదే ఎరుగని విండీస్ అప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. దాంతో భారత్ గెలుపు గురించి కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అరుదైన మ్యాచ్‌కు తాము సాక్షులం కాబోతున్నామనే విషయం చెన్నపట్నం అభిమానులకు అప్పుడు తెలీదు. ఒకే ఒక ఆటగాడు తన సంచలన ప్రదర్శనతో దీనిని చేసి చూపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 16 వికెట్లు తీసి 19 ఏళ్ల నరేంద్ర దీప్‌చంద్ హిర్వాణి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. సిరీస్‌లో అప్పటికే వెనుకబడింది భారత్. దీంతో కచ్చితంగా నాలుగో టెస్టు గెలవాలి. ఇలాంటి విపత్కర సమయంలోనే నరేంద్ర హిర్వాణితో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు డబ్ల్యూవీ రామన్, అజయ్ శర్మ కూడా అరంగేట్రం చేశారు. కళ్ల జోడు, హెడ్ బ్యాండ్, రిస్ట్ బ్యాండ్, మీసాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన హిర్వాణి అందరికీ కొత్తగా కనిపించాడు. టెస్టుల్లో లెగ్‌స్పిన్ బౌలింగ్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కొన్నేళ్ల క్రితం లక్ష్మణ్ శివరామకృష్ణన్ వన్డేల్లో ప్రభావం చూపించినా... టెస్టుల్లో పేలవంగా బౌలింగ్ చేయడంతో మణికట్టు స్పిన్నర్‌పై అన్నీ సందేహాలే. ఇలాంటి స్థితిలో హిర్వాణికి ‘టెస్టు’ మొదలైంది. రవిశాస్త్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఏకైక టెస్టును నరేంద్ర తన పేరిట లిఖించుకున్నాడు. టపటపా... షేన్‌వార్న్, అనిల్ కుంబ్లేలు లెగ్‌స్పిన్‌కు ప్రాచుర్యం కల్పించక ముందు మణికట్టు మాయాజాలం ఏమిటో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లోనే చూశారు. లెగ్‌బ్రేక్‌లు, గూగ్లీలు, ఫ్లిప్పర్లు... ఇలా అన్ని ఆయుధాలతో హిర్వాణి వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లు కపిల్, రవిశాస్త్రి తీయగా...తర్వాతి 8 హిర్వాణి ఖాతాలో చేరాయి. రెండో ఇన్నింగ్స్‌లో వ్యూహం మార్చిన కరీబియన్లు ముందుకొచ్చి షాట్లు ఆడుతూ హిర్వాణి లయ దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. కానీ అద్భుతమైన టర్న్‌తో అతను ప్రత్యర్థి పని పట్టాడు. ఫలితం మరో 8 వికెట్లు. ఇందులో నాలుగు స్టంపౌట్లు ఉన్నాయి. అర్షద్ అయూబ్, రామన్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 136 పరుగులిచ్చి 16 వికెట్లు తీసిన హిర్వాణి అప్పటి వరకు బాబ్ మాసీ (ఆసీస్) పేరిట ఉన్న 16/137 రికార్డును బద్దలు కొట్టాడు. 32 ఏళ్లు దాటినా హిర్వాణి తొలి టెస్టు ఘనత మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. అతని జోరుతో భారత్ ఈ మ్యాచ్‌ను 255 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. చెప్పి మరీ...చేజిక్కించుకున్నాడు ఎందరినీ అవుట్ చేసినా కింగ్ వివియన్ రిచర్డ్స్ వికెట్ ఇచ్చే కిక్కే వేరు. ఈ విషయం హిర్వాణికి కూడా తెలుసు. రెండో రోజు ఆట ముగిసే సరికి రిచర్డ్స్ 62 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అప్పటి నిబంధనల ప్రకారం మూడో రోజు విశ్రాంతి దినం. రిచర్డ్స్‌ను తాను ఎలాగైనా అవుట్ చేస్తానంటూ హిర్వాణి రోజంతా సహచరులతో చెబుతూనే వచ్చాడు. నాలుగో రోజు ఆరంభంలోనే అతను వేసిన అద్భుతమైన ఫ్లిప్పర్ రిచర్డ్స్ స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అలా ముగిసిపోయింది... మెరుపులా దూసుకొచ్చిన హిర్వాణి కెరీర్ అంతే వేగంగా ముగిసిపోయింది. 16 వికెట్ల టెస్టు తర్వాత అతను మరో 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. మద్రాసు టెస్టు తర్వాత స్వదేశంలోనే జరిగిన తర్వాతి 3 టెస్టుల్లో కలిపి అతను 20 వికెట్లతో చెలరేగాడు. అయితే ఆ తర్వాత విదేశాల్లో అతని బౌలింగ్ మ్యాజిక్ పని చేయలేదు. 1989లో విండీస్ గడ్డపై జరిగిన సిరీస్‌లో వారు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఆడటంతో 3 టెస్టుల్లో 6 వికెట్లే దక్కాయి. 1990లో ఇంగ్లండ్ సిరీస్‌తో కుంబ్లే అడుగు పెట్టిన తర్వాత హిర్వాణికి దాదాపుగా దారులు మూసుకుపోయాయి. ఐదేళ్ల విరామం తర్వాత అనూహ్యంగా మళ్లీ టెస్టు అవకాశం దక్కినా లాభం లేకపోయింది. చివరకు 17 టెస్టుల్లో 30.10 సగటు, 66 వికెట్లతో హిర్వాణి కెరీర్ ముగిసింది. అతని కుమారుడు మిహిర్ హిర్వాణి కూడా తండ్రి బాటలోనే లెగ్‌స్పిన్నర్‌గా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇంకా ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయిన మిహిర్ 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 34.37 సగటుతో 70 వికెట్లు తీశాడు. తనయుడు మిహిర్‌తో -
స్కాట్లాండ్ క్రికెటర్ మాజిద్‌కు కోవిడ్–19 పాజిటివ్
లండన్: పాకిస్తాన్ సంతతికి చెందిన స్కాట్లాండ్ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ మాజిద్ హక్కు కోవిడ్–19 వైరస్ సోకింది. 37 ఏళ్ల మాజిద్ స్వయంగా ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం తాను స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని... త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. మాజిద్ 2006 నుంచి 2015 వరకు స్కాట్లాండ్ తరఫున 54 వన్డేలు, 21 టి20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 60 వికెట్లు... టి20ల్లో 28 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే ప్రపంచ కప్‌లో చివరిసారి స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించిన మాజిద్ ప్రస్తుతం స్కాట్లాండ్ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు. -
అతనికి ఉద్యోగమివ్వండి
కడప స్పోర్ట్స్: కడప నగరానికి చెందిన పి. దేవరాజ్ దీనస్థితిపై ‘జాలి వద్దు.. జాబు కావాలి’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వికలాంగ క్రీడాకారుడి వివరాలను సేకరించి.. ఆయన డేటాను ఏపీ ఔవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో అప్లోడ్ చేసి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఉపాధికల్పనాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తో జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం. దీప్తి ‘సాక్షి’ నెట్వర్క్ ద్వారా దేవరాజ్ వివరాలను తెప్పించుకోవడంతో పాటు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆయన అనంతపురంలో నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఉన్న నేపథ్యంలో బుధ లేదా గురువారాల్లో వచ్చి కార్యాలయంలో కలవాలని దేవరాజ్‌ను కోరారు. ఆయన మ్యాచ్ అనంతరం కడపకు బయలుదేరి రానున్నట్లు ఆయన ‘సాక్షి’ తెలిపారు. తన దీనగాథ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం పట్ల సాక్షికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
బ్యాట్ పట్టిన చేతితో దోశలు వేస్తున్నాడు
తిరుపాపులి దేవరాజ్... దివ్యాంగుల క్రికెట్లో ఈయన పేరు తెలియని వారుండరు.. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూరాణిస్తున్నాడు.. జీవనపోరాటంలో విజయం సాధించలేక.. నమ్ముకున్న కుటుంబాన్ని పోషించుకునేందుకు బ్యాట్ పట్టిన చేతితో దోశలు.. బౌలింగ్ వేసిన చేత్తో వడలు వేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు.. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎందరో అధికారుల చుట్టూ తిరిగానని.. నన్ను చూసి జాలిపడి..డబ్బులిచ్చి పంపేయత్నం చేస్తున్నారే తప్ప.. కుటుంబపోషణకు అవసరమైన ఉద్యోగమిచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదంటున్నాడు.. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు. కడప స్పోర్ట్స్ : కడప నగరం రామాంజనేయపురానికి చెందిన తిరుపాపులి దేవరాజ్‌కు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. 2–3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పాము కాటేసింది.. ఆ సమయంలో నాటు వైద్యం చేశారు. ఇది వికటించడంతో ఎడమకాలు చచ్చుబడింది. ఫలితంగా అవిటిగా మారాడు... తోటి వారందరూ ఆడుకోవడం చూసిన తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కొందరు నువ్వు కుంటివాడివి.. క్రికెట్‌కు పనికిరావని అన్నారు.. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆడటం ప్రారంభించాడు. 1993–94 సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నప్పుడు వికలాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాడు. ఎంపికలకు వెళ్లాడు. ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఏపీ జట్టుకు ఎంపికయ్యాడు. రాజస్తాన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి వికలాంగుల క్రికెట్‌లోరాణించడంతో పాటు బెస్ట్ బౌలర్‌గా అవార్డు పొందాడు. అప్పటి నుంచి ప్రారంభమైన దేవరాజ్ ప్రస్థానం ఎందరో వికలాంగ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచింది. శివకోటి లాంటి వారు జిల్లా నుంచి జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించడానికి స్ఫూర్తయింది.ఈయనతో పాటు మరికొందరు కలిసి దివ్యాంగుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపుకోసం శ్రమించారు. ఇప్పటి వరకు దీనికి బీసీసీఐ గుర్తింపు లభించనప్పటికీ దివ్యాంగుల క్రికెట్‌ను రానున్న రోజుల్లో బీసీసీఐలో విలీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా వీరి సంఘానికి చేయూతనిచ్చే దిశగా చర్యలు చేపట్టింది. 40 సంవత్సరాలు వయసు కలిగిన ఈయన ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో నిర్వహించనున్న నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈయన ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆయన అనంతపురం పయనమయ్యాడు. పొట్టకూటి కోసం.. బీసీసీఐ గుర్తింపు వికలాంగుల క్రికెట్‌కు లేకపోవడంతో ఈయనకు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ అవేవీ స్పోర్ట్స్‌కోటా పరిధిలోకి రావు. అదే ఇతనికి శాపంగా మారింది. పదో తరగతి వరకు చదివిన ఏదైనా చిరుద్యోగమైనా కల్పించాలని గతంలో ఎందరో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాడు. వారు ఈయన పరిస్థితిని చూసి జాలి పడి తాత్కాలికంగా ఎంతో సాయం చేసి తర్వాత చూద్దామని పంపించారే తప్ప కుటుంబపోషణకు శాశ్వత ఆధారమయ్యే ఉద్యోగ అవకాశం కల్పించలేదు. దీంతో పాటు ఇతని తల్లికి కూడా వైకల్యం ఉంది. కుటుంబపోషణ కూడా దేవరాజ్‌పైనే పడింది. భార్య, ఇద్దరు పిల్లలు తోడయ్యారు. పోషణ మరింత భారమైంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఓ వైపు సంసారాన్ని మరోవైపు నెట్టుకొచ్చేందుకు దోశల కొట్టును నడపుతున్నాడు. దోశలు, వడలు వేసుకుంటూ వచ్చిన దాంట్లో పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సారూ.. నేను పదోతరగతి పాసయ్యను. వైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ప్రతిభ కనబరిచా. అర్హతకు తగిన చిన్న ఉద్యోగమైనా ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగాను. జాలి చూపించి.. ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. బతుకు తెరువు కోసం దోశలు వేసుకుంటున్నాను. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరుద్యోగమైనా ఇప్పించి న్యాయం చేయాలి. – పి. దేవరాజ్, క్రికెటర్, కడప -
బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి..
అతడు జట్టులోకి రావడంతో భారత పేస్ పదును పెరిగిందన్నారు.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంతో స్వింగ్ సుల్తాన్ అన్నారు.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియాను గజగజ వణికించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.. పాకిస్తాన్‌ను వారి గడ్డపై గడగడలాడించడంతో ఔరా అన్నారు.. అరవీర భయంకర బ్యాట్‌మెన్ సైతం భయపడే అక్తర్ బౌలింగ్‌లో వీర బాదుడు బాదడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.. కష్టకాలంలో, అవసరమైన సమయంలో ఓపెనర్‌గా వచ్చి ఆదుకోవడంతో సలాం చేశారు.. కపిల్ దేవ్ తర్వాత టీమిండియాకు దొరికిన ఆల్‌రౌండర్ అన్నారు. బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి టీమిండియాలో కనుమరుగయ్యాడు. అతడే టీమిండియా వెటరన్ క్రికెటర్, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్.. ‘చరిత్రలో నిలిచిపోవాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా వందేళ్లు బతకాల్సిన అవసరం లేదు ఒక్క రోజు బతికినా చాలు’ అన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ సాగింది. అతడు క్రికెట్ ఆడింది కొన్నేళ్లే అయినా ప్రతి నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ప్రతి మ్యాచ్‌లో అటు బంతితో.. లేకపోతే బ్యాట్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్, శ్రీలంక దిగ్గజ బౌలర్ చమింద వాస్ల శైలి పోలి ఉండే అతడి బౌలింగ్ అందరినీ ఆకట్టుకునేది. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు తమ గల్లీకొకడు ఉన్నాడన్న పాక్ క్రికెటర్ల వెకిలి చేష్టలకు తన ఆటతో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఏకంగా టెస్టుల్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్(సల్మాన్ భట్, యునిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్) వికెట్ సాధించిన ఏకైక బౌలర్‌గా పఠాన్ నిలిచాడు. ఇప్పటికీ ఆ ఘనత చెక్కుచెదరకుండా ఉంది. (చదవండి: క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై ) Cricket Fan Never Forget This! 🔥👌 Hat trick Vs Pakistan, 2004 ❤ Happy Retirement @IrfanPathan ❤#irfanpathan pic.twitter.com/8rBECjGmd8 — S O B U J ❤ (@VKSobuj18) January 4, 2020 2004లో లైమ్‌లైట్‌లోకి .. 2003 చివర్లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈలెఫ్టార్మ్ పేసర్ ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్‌ల పాలిట విలన్‌గా మారాడు. ముఖ్యంగా రికీ పాంటింగ్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ సాగిన అతడి బౌలింగ్ క్రికెట్ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇక ఆతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మోస్తారుగా రాణించాడు. అయితే అనంతరం 2004లో పాకిస్తాన్ పర్యటనతో ఇర్ఫాన్ పఠాన్ పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ పర్యటనలో పాక్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సిరీస్ ఆసాంతం ఇర్ఫాన్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీల పేర్లు క్రికెట్ ప్రపంచంలో మారుమోగాయి. అటు బంతితో.. ఇట్టు జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్యాట్‌తో రాణించి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇదే జోరును పఠాన్ కొన్నేళ్లపాటు కొనసాగించాడు. అయితే బాలాజీ మాత్రం గాయం కారణంగా జట్టుకు దూరమై తిరిగి పూర్వపు లయను అందుకోవడంలో విఫలమై టీమిండియాలో పూర్తిగా చోటు కోల్పోయాడు. చోటు కోల్పోయిన ప్రతీసారి.. టీమిండియాలో చోటు కోల్పోయిన ప్రతీ సారి గోడకు కొట్టిన బంతి వలే ఘనంగా పునరాగమనం చేసేవాడు. అతడు తిరిగొచ్చిన ప్రతీ మ్యాచ్‌లో అత్యద్భుతంగా రాణించేవాడు. 2005 తర్వాత పఠాన్ గడ్డుకాలాన్ని అనుభవించాడు. వన్డే, టెస్టుల్లో చోటు కోల్పోయాడు. అయితే తిరిగి ఫామ్‌ను అందుకుని జట్టులోకి వెంటనే తిరిగొచ్చేవాడు. ఇక కెరీర్ మొదట్లోనే అడపదడపా బ్యాటింగ్‌లో రాణించడం అలవాటు చేసుకున్న ఈ స్వింగ్ సుల్తాన్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2007లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక బంతితో పాటు బ్యాట్‌తో కూడా పఠాన్ ఆకట్టుకోవడంతో అతడిని కొన్ని సిరీస్‌లలో ఓపెనర్‌గా కూడా ప్రయోగించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్‌లో సచిన్‌కు గాయం, ఓపెనర్ల సమస్యతో టీమిండియా సతమతమవుతున్న సమయంలో ఇర్ఫాన్ కొన్ని మ్యాచ్‌లు ఓపెనర్‌గా దిగాడు. చాపెల్ ఎంట్రీ.. పఠాన్ భవిత్యం అయోమయం గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో విపత్కరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. క్రికెటర్లకు మిలటరీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రచ్చరచ్చ చేశాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన చాపెల్ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్ సూచనలతో ఇర్ఫాన్ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై పఠాన్ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్. దీంతో ఓ సమయంలో పఠాన్ బౌలర్ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. అయితే అడపదడపా రాణిస్తూ జట్టులో కొనసాగినప్పటికీ ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో కపిల్ దేవ్లా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా, చరిత్రలో నిలిచిపోయే ప్రపంచస్థాయి దిగ్గజ బౌలర్‌గా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు. కానీ యువ క్రికెటర్లతో పోటీ పడలేక, మునపటి ఫామ్‌ను అందుకోక జట్టులో చోటు కోల్పోయి, కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా అవకాశం లేక సింపుల్‌గా రిటైర్మైంట్ ప్రకటించాడు. ఏది ఏమైన కొందరి సూచనలతో తన సహజసిద్దమైన ఆటను కోల్పోయి ప్రపంచం మర్చిపోయిన ఓ సాదాసీదా బౌలర్‌గా క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. -
‘అతడొక క్రికెట్ సూపర్‌స్టార్’
డిసెంబర్ 12 వచ్చిందంటే అటు సినీ అభిమానులకు.. ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే డిసెంబర్ 12న ఇద్దరు సూపర్స్టార్ల బర్త్‌డే. సినిమా రంగంలో సరికొత్త స్టైల్‌ను ప్రజెంట్ చేసి విదేశాల్లో సైతం అభిమానులను సొంతం చేసుకుని భారత సినిమా ఖ్యాతిని ఖండాంతరాల దాటించిన రీల్ సూపర్ స్టార్ ఒకరు కాగా.. మైదానంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టించి దేశం గర్వించే విజయాలను అందించిన రియల్ సూపర్ స్టార్ మరొకరు. రీల్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా, రియల్ సూపర్ స్టార్ యువరాజ్ సింగ్. ఈ రోజు ఎవరి వాట్సప్ స్టేటస్ చూసినా, ఫేస్బుక్, ఇన్‌స్టా స్టోరీలు ఓపెన్ చేసినా ఈ ఇద్దరి సూపర్ స్టార్లే కనిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలా బర్త్‌డే సందర్బంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తలైవాకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అదేవిధంగా దేశ, విదేశ క్రికెటర్లతో పాటు ఐసీసీ, బీసీసీఐలు యువరాజ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపాయి. టీమిండియా టీ20, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆనాటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేక కథనం. (చదవండి: మూడేళ్లు కాదు.. 30 ఏళ్లు) పంజాబ్‌కు చెందిన యోగ్రాజ్- షబ్నమ్ సింగ్ దంపతులకు 1981, డిసెంబర్ 12న యువరాజ్ సింగ్ జన్మించాడు. చిన్నప్పట్నుంచి యువీకి క్రికెట్‌పై ఉన్న మక్కువను గమనించిన యోగ్రాజ్ అతడికి క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. 1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007,2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్ సృష్టించాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే కెరీర్లో 304 మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు నమోదు చేశాడు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల కింగ్.. చివరి వన్డేను 2017 వెస్టిండీస్‌తో ఆడాడు. 2003లో టెస్టుల్లో న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసిన యువీ 2012లో ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్‌ను ఆడగా, ఇక చివరి అంతర్జాతీయ టీ20 ఇంగ్లండ్‌పై 2017లో ఆడాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో బంతితో మెరిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్ అనంతరం అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. ఈ చికిత్స అనంతరం యువీ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా, ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. (‘అతడ్ని వదిలిపెట్టాం.. నిన్ను తీసుకుంటాం’) టీమిండియాలో స్టైలీష్ ప్లేయర్‌గా యువీకి మంచి గుర్తింపు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో యువీ ప్రత్యేక మ్యానరిజం, స్టైల్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కవర్‌డ్రైవ్ షాట్లకు యువరాజ్ పెట్టింది పేరు. యువీ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడంటే దానిని రిప్లైలో పది సార్లు చూసినా మనసుతీరదు. అదేవిధంగా కూర్చొని సిక్సర్ కొట్టే విధానం, వికెట్ తీసినప్పుడు ఎగిరి గంతేసే విధానం అన్ని యువీకే సొంతం. అందుకే అతడిని స్టైలీష్ క్రికెటర్‌గా అభిమానులు పేర్కొంటారు. అంతేకాకుండా అతడిని క్రికెట్ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ సంబోధిస్తుంటారు. (మరొక యువరాజ్ దొరికాడోచ్..!) యువీ తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. అన్నింటికి మించి ఎంతో మంది టీమిండియా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ టీమిండియాలో లెఫ్టాండ్ బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మన్‌ను చూస్తే అందరి మెదళ్లలో యూవీనే మెదులుతాడంటే అతిశయోక్తికాదు. ఇక 2012లో భారత ప్రభుత్వం క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుతో, 2014లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్‌డే సందర్భంగా పలువురు చేసిన ట్వీట్లు.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో యువీ కొట్టిన ఆరు సిక్సర్లకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘6 6 6 6 6 6 హ్యాపీ బర్త్‌డే యువరాజ్ సింగ్’అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ‘A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z.. ఇలా ఎన్నో ఉన్నా UV ఎంతో ప్రత్యేకం, చాలా అరుదు. కఠిన పరిస్థితుల్లో పోరాటానికి ఎల్లప్పుడూ ముందుంటావు. హ్యాపీ బర్త్‌డే యువరజా సింగ్’అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘యువీ నువ్వు అసలైన చాంపియన్‌వి. ఎంతో మంది యువతకు స్పూర్థివి. హ్యపీ బర్త్‌డే యువరాజ్’- బీసీసీఐ. ‘హ్యపీ బర్త్‌డే సూపర్ స్టార్. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’- సచిన్ టెండూల్కర్. ‘సిక్సర్ల వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - ముంబై ఇండియన్స్ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ Happy birthday @YUVSTRONG12! 🎂 pic.twitter.com/0ZFS3EBHnw — ICC (@ICC) December 12, 2019 Wishing the ‘SUPERSTAR’, a very happy birthday! May God always keep you healthy and happy in life Yuvi. pic.twitter.com/9IqfweGEvg — Sachin Tendulkar (@sachin_rt) December 12, 2019 -
స్మిత్ ఎందుకలా చేశాడు?
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ తనను తాను శిక్షించుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో విఫలమైనందుకు మూడు కిలోమీటర్లు పరుగెత్తి తనకు తాను శిక్ష వేసుకున్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత బస్సు మిస్సైన స్మిత్.. స్టేడియం నుంచి 3 కిలోమీటర్లు పరుగెత్తి హోటల్‌కు చేరుకున్నాడు. ‘పరుగులు చేయనప్పుడు నన్ను నేను శిక్షించుకుంటాను. సెంచరీ చేస్తే చాక్లెట్ తీసుకుని నన్ను నేను అభినందించుకుంటాను. మ్యాచ్‌లో ఎప్పుడు విఫలమైనా పరుగెత్తడం లేదా జిమ్‌కు వెళ్లడం చేస్తాను. నన్ను నేను శిక్షించుకోవడానికి ఏదోటి చేస్తుంటాన’ని స్మిత్ చెప్పాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ 4 పరుగులు మాత్రమే చేసి యాసిర్ షా బౌలింగ్‌లో అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్(154), లబ్‌షేన్(185) సెంచరీలతో చెలరేగారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు 29 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అతడికి చేరువగా వచ్చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టులో స్మిత్ విఫలం కావడంతో ఇద్దరి మధ్య అంతరం 25 నుంచి 3 పాయింట్లకు తగ్గిపోయింది. (చదవండి: కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్..) -
మైదానంలో క్రికెట్ ఆడుతూ.. కుప్పకూలాడు!
సికింద్రాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ ప్లేయర్ హఠాన్మారణం చెందాడు. హెచ్ఎస్బీసీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వీరేంద్ర నాయక్.. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి చెన్నై గ్రౌండ్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన వీరేంద్ర నాయక్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్ నుండి విశ్రాంతి గది వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరేంద్ర నాయక్ రెండు నెలలుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. అప్పటివరకు తమతో కలిసి క్రికెట్ ఆడిన తమ స్నేహితుడు హఠాన్మరణం చెందడంతో వీరేంద్ర నాయక్ స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతిభను మించిన అందం ఉందా!
ఒక మహిళ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారు. ఆమె అందంగా ఉందా అని చూస్తాం! ఒక మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అందంగా ఉందా అని చూస్తాం!! మహిళ అంటేనే అందం అనీ, అందంగా ఉంటేనే మహిళ అనీ.. ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది మనలో. క్రికెటర్ స్మృతి మంధాన తన ఆటలో ఎన్నో విజయాలు సాధించారు. అత్యుత్తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. బి.సి.సి.ఐ. ఆమెను ‘బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్’గా గుర్తించింది. కీర్తించింది. అంతటి ప్లేయర్‌లోనూ మనం అందమే చూస్తున్నట్లున్నాం! నెట్లో అజ్ఞాత వ్యక్తులెవరో స్మృతి మంధాన నీలిరంగు క్రికెట్ షర్ట్, క్రికెట్ క్యాప్‌తో ఉన్న ఫొటోను ‘అందంగా’ మలిచి ఆన్లైన్లో విడుదల చేశారు. ఫొటోషాప్‌లో మంధాన పెదవులకు లిప్‌స్టిక్ అద్ది, కళ్లకు కాటుక రాసిన ఆ ఫేక్ ఫొటోపై ఇప్పుడు ఆమె ఆటను అభిమానించే వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతన అనే ట్విట్టర్ యూజర్ ఆన్లైన్లో స్మృతి ఫొటోలు వెదుకుతుండగా ఈ లిప్‌స్టిక్, కాటుక ఉన్న ఫొటో బయటపడింది. ఈ నకిలీ ఫొటోను, ఆ అసలు ఫొటోను ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ‘క్రికెటర్‌ను క్రికెటర్లా చూడండి.. అందమైన క్రికెటర్‌గా కాదు’ అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టారు. ‘‘ఇదే పని విరాట్ కొహ్లీకి, ఎం.ఎస్.ధోనీకి చెయ్యగలరా?’’ అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. నిజమే కదా! -
మహిళా క్రికెటర్ పరుగుల తుఫాను
అది 2013 అక్టోబర్. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో చివరి రంజీ ట్రోఫీ ఆడేందుకు హరియాణా వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అతని ఆఖరి ఇన్నింగ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధ సెంచరీ (79 నాటౌట్) సాధించి ముంబై రంజీ జట్టును గెలిపించాడు. అదే వేదికపై తండ్రి భుజాలపై కూర్చొని ఒక తొమ్మిదేళ్ల చిన్నారి కూడా సచిన్ ఆటను తిలకించింది. క్లిష్ట పరిస్థితుల్లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌కు అక్కడి ప్రేక్షక జనసందోహం నుంచి వచ్చిన స్పందనకు ఫిదా అయిపోయింది. తనూlబ్యాట్ పట్టాలని... సచిన్‌లా ఆడాలని... అందరిచేతా అభినందనలు అందుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. కల నిజమైంది... 2019 నవంబర్ 9. వేదిక గ్రాస్ ఐలెట్... ప్రత్యర్థి ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్... 30 ఏళ్లుగా తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టి వార్తల్లో నిలిచిందో అమ్మాయి. నాడు సచిన్ స్ఫూర్తితో బ్యాట్ పట్టి... ఆరేళ్లు తిరిగేలోపు నేడు సచిన్ రికార్డునే సవరించిన ఆ చిచ్చర పిడుగే షఫాలీ వర్మ. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో షఫాలీ వర్మ వీరవిహారం చేసింది. 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 1989లో పాకిస్తాన్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 214 రోజులు) అర్ధ సెంచరీ సాధించగా... అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ రికార్డు అలాగే ఉంది. అయితే శనివారం షఫాలీ వర్మ (15 ఏళ్ల 285 రోజులు) బ్యాటింగ్‌తో ఈ రికార్డు తెరమరుగైంది. ఇంతకీ ఎవరీ షఫాలీ వర్మ? 2004 జనవరి 28న హరియాణాలోని రోహతక్‌లో జన్మించింది షఫాలీ వర్మ. క్రికెట్ ఆ కుటుంబానికి ప్రాణం. సచిన్ చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్ళినప్పుడే ఆ చిన్నారి మదిలో క్రికెట్ బలంగా నిలిచిపోయింది. షఫాలీకి చెల్లి, అన్న ఉన్నారు. నిజానికి ఆమె తండ్రి క్రికెట్ కావాలని కలగన్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించక కాలేకపోయారు. అందుకే భారత దేశం తరఫున తన కూతురు క్రికెట్ ఆడాలని ఆయన స్వప్నించాడు. మొదట్లో షఫాలీ అన్నయ్యతో పాటు షఫాలీని కూడా క్రికెట్ శిక్షణ కోసం క్రికెట్ మైదానంలోకి తీసుకెళ్ళేవారు ఆమె తండ్రి. అతి త్వరలోనే షఫాలీ ఆసక్తీ, కష్టపడే తత్వం, సాధన, మెళకువలు గ్రహించే శక్తి ఆ చిన్నారి ఆకాంక్షకు ప్రాధాన్యత తెచ్చిపెట్టాయి. తండ్రి తొలి గురువు తొలి మూడేళ్ళు తండ్రి దగ్గరే శిక్షణ తీసుకున్న షఫాలీ అండర్–16 రాష్ట్ర జట్టులోకి 13 ఏళ్ళ వయస్సులో ఎంపికైంది. తన స్కూల్ తరఫున నేషనల్స్‌కి ఆడే సందర్భంలో తనకీ అవకాశం ఎదురొచ్చింది. అయితే రెండేళ్ళు రాం నాయక్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత అండర్–19, అండర్–23, సీనియర్ జట్టులోకి కూడా షఫాలీ అడుగు పెట్టింది. ఈ ఏడాది మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటం గొప్ప అనుభవం ఇచ్చిందని షఫాలీ అంటోంది. భారత మహిళల క్రికెట్ స్టార్స్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఇదే సందర్భంగా తనకు స్ఫూర్తిదాయకమైన డేనియల్ వ్యాట్ చెప్పిన ‘ఎప్పటికీ నీ ఆటని మార్చుకోవద్దు ఎప్పుడూ నా చెవిలో మార్మోగుతుంటాయని చెప్పే షఫాలీ ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నానని అంటోంది. మహిళల ఐపీఎల్లో షఫాలీ క్రికెట్ బంతిని కొట్టే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయిన క్రికెట్దిగ్గజాలు ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే.... నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య అని చెబుతుంది. బంతి తనవైపు దూసుకొస్తున్నప్పుడు నిర్భీతితో బలంగా కొట్టడమే తెలుసని ఈ భవిష్యత్ తార విశ్వాసంతో చెబుతుంది. ఎక్కువగా అబ్బాయిలతో క్రికెట్ ఆడిన షఫాలీ క్రికెట్ కోసం తన పదో తరగతి పరీక్షలను కూడా వదులు కోవాల్సి వచ్చింది. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నీకిష్టమైన ప్లేయర్ ఎవరని అడిగితే... ‘అందరూ అద్భుతమైన ఆటగాళ్లే. వాళ్ళందరూ నాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళే. కాకపోతే సచిన్ ఆటంటే నాకు ప్రాణం’ అని సమాధానం వచ్చింది. ఏ రోజుకైనా నేను సచిన్‌లా ఆడగలిగితే నాక్కూడా ఈ ప్రపంచమంతా చప్పట్లతో జేజేలు పలుకుతుందా? అని నాన్ననడిగితే.... ‘నువ్వు కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు’ అని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ‘అవకాశం వచ్చినప్పుడల్లా మైదానంలో విజృంభిస్తా. నా ఆటతో జాతి గర్వపడేలా చేస్తా’ అని చెప్పే షఫాలీ వర్మ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ నేతృత్వంలో తానెంతో నేర్చుకున్నానని చెబుతోంది. అంతులేని ఆత్మవిశ్వాసం, ఆమెపై ఆమెకున్న ఆకాశమంత విశ్వాసం షఫాలీ భవిష్యత్ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. – అరుణ అత్తలూరి -
కర్ణాటక లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్!
సాక్షి, బెంగళూరు: గత కొంత కాలంగా ఫిక్సింగ్‌కు కేంద్రంగా మారిందని భావిస్తున్న కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మరో కొత్త వివాదం బయటకు వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు చిదంబరం మురళీధరన్ (సీఎం) గౌతమ్ కాగా, మరొకరు అబ్రార్ కాజీగా వెల్లడైంది. ఈ ఏడాది జరిగిన కేపీఎల్ ఫైనల్లోనే వీరిద్దరు స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హుబ్లీ టైగర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బెళ్లారి టస్కర్స్‌కు గౌతమ్ కెప్టెన్ కాగా... కాజీ సభ్యుడు. చివరకు ఈ మ్యాచ్‌లో టస్కర్స్ 8 పరుగులతో ఓడింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేసేందుకు వీరిద్దరు రూ. 20 లక్షలు తీసుకున్నారు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా గౌతమ్, కాజీ ఫిక్సింగ్ పాల్పడినట్లు తేలింది. గౌతమ్ ఘనమైన రికార్డు ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్టయిన క్రికెటర్లలో సీఎం గౌతమ్‌కు ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ 11 ఏళ్ల కెరీర్లో 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 41.36 సగటుతో అతను 4716 పరుగులు చేశాడు. 9 సీజన్ల పాటు కర్ణాటకకు ఆడిన అతను ఆ జట్టు 2013–15 మధ్య వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్న గౌతమ్... వినయ్ కుమార్ గైర్హాజరులో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతను నాయకత్వం వహించిన టీమ్‌లో ఉతప్ప, కేఎల్ రాహుల్, మయాంక్, మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడిన గౌతమ్... ఐపీఎల్లో ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది గోవా జట్టుకు మారగా, ఇప్పుడు అతని కాంట్రాక్ట్ రద్దయింది. కర్ణాటక తరఫున 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అబ్రార్‌కు గౌతమ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. -
ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?
హెన్రీ ఒలోంగా.. క్రికెట్ అభిమానులకు చిరపరిచితమైన పేరు. ముఖ్యంగా టీమిండియా ప్రేమికులకు అతడు కచ్చితంగా గుర్తుంటాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు అతడే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమికి కారకుడయ్యాడు. అయితే 2003 వరల్డ్‌కప్‌లో అతడు చేసిన పని ఒలోంగా క్రీడాజీవితానికే కాదు స్వదేశానికి దూరమయ్యేలా చేసింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నేతృత్వంలో జింబాబ్వేలోని అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేతికి నల్ల రిబ్బను కట్టుకుని బరిలోకి దిగినందుకు అతడు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మాతృభూమికి శాశ్వతంగా దూరమయ్యాడు. రాబర్ట్ ముగాబే మరణించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి స్కైప్‌లో అతడు మీడియాతో మాట్లాడాడు. తన క్రీడాజీవితాన్ని తలక్రిందులు చేసిన ముగాబే మరణం పట్ల తనకేమి సంతోషం లేదని పేర్కొన్నాడు. ‘ఆఫ్రికాలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా ముగాబే పరిగణించబడడం చాలా బాధాకరం. ఇంగ్లీషు భాషపై మంచి పట్టువుండడంతో ఆయన తన చరిత్రను అనుకూలంగా రాయించుకున్నారు. దయార్ధ్ర హృదయుడిగా, సౌమ్యుడిగా, సంపదను అందరికీ సమానంగా పంచిన మంచి మనిషిగా కీర్తించుకున్నారు. నిజంగా ఇవన్నీ చేసుంటే నెల్సన్ మండేలా మాదిరిగా జనం హృదయాల్లో నిలిచేవార’ని ఒలోంగా వ్యాఖ్యానించాడు. శ్వేత జాతీయల భూములను లాక్కుకోవడం, మానవ హక్కుల ఉల్లంఘన కేసులను ప్రభుత్వం నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ 2003 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్రికెట్ జట్టు కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌తో కలిసి నల్లరిబ్బన్ ధరించి ఒలంగా మైదానంలోకి దిగాడు. ఫలితంగా అతడు ఎన్నో కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జింబాబ్వే నాయకులు అతడి నిరసనను ఖండించారు. ఒలోంగాను కుట్రదారుడిగా వర్ణించారు. వివాదాలు చుట్టుముట్టడంతో ప్రియురాలు అతడిని వదిలేసింది. దుండగుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో జింబాబ్వే గూఢచారి విభాగానికి చెందిన అధికారి సహాయంతో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు ఒలోంగా వెల్లడించాడు. ఓ క్రికెట్ క్లబ్ యజమాని తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడని తెలిపాడు. ఆపద సమయంలో ముగాబే అనుచరుల నుంచి తనను కాపాడిన వారందరికీ ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ ధన్యవాదాలు తెలిపాడు. జింబాబ్వేతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని.. స్వదేశానికి తిరిగివచ్చే ఆలోచన లేదని, అడిలైడ్‌లో అంతా బాగుందని స్పష్టం చేశాడు. అది ఆండీ ఆలోచన హరారేలో జరిగిన మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బను కట్టుకుని మైదానంలోకి దిగాలన్న ఆలోచన ఆండీ ఫ్లవర్‌కు వచ్చిందని ఒలోంగా తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు ‘గ్లాడియేటర్’ ఇంగ్లీషు సినిమా పలుమార్లు చూసినట్టు వెల్లడించాడు. ముగాబే ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రపంచం ముందుంచడానికే నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపామన్నాడు. ఆండీ ఫ్లవర్ సూచన పాటించకపోయివుంటే తన జీవితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే తన నిర్ణయం పట్ల ఎటువంటి విచారం లేదన్నాడు. 16 ఏళ్ల తర్వాత కూడా జింబాబ్వేలో ప్రజాస్వామ్యం ఖూనీ గురించి మిగతా దేశాలు గళం విప్పకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. జింబాబ్వే క్రికెట్ జట్టును నిషేధిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మిగతా ప్రపంచం మౌనం వహించడం దిగ్భ్రంతికి గురిచేసిందని ఒలంగా వాపోయాడు. జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన తొలి నల్లజాతీయుడిగా గుర్తింపు పొందిన ఒలోంగా ఉత్తుంగ కెరటంలా ఎగిసి టెస్టు, వన్డేలు కలిసి 126 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఒలోంగా ఇప్పుడు గాయకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ రియాలిటీ షోలో కనిపించి అందరినీ అలరించాడు. (చదవండి: ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!) -
తాతలా...
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల తనయుడు తైముర్ అలీఖాన్ చాలా పాపులర్. తైముర్ కూడా వాళ్ల తల్లీదండ్రుల్లా సినిమా ఫీల్డ్‌లోనే ఉంటాడు అనుకుంటారు ఎవరైనా. కానీ కరీనా మాత్రం తైముర్ వాళ్ల తాతలా క్రికెటర్ కావాలనుకుంటున్నారు. తైముర్ తాతయ్య సైఫ్ అలీ ఖాన్ నాన్న మన్సూర్ అలీఖా¯Œ పటౌడి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్. ఇంతకీ తైముర్ వాళ్ల అమ్మనాన్నల్లా ఇండస్ట్రీలో హీరోగా బాక్సాఫీస్ బద్దలు కొడతాడా? అమ్మ కోరినట్టు క్రికెటర్‌గా బౌండరీలు బాదుతాడా? అనేది తెలియాలంటే ఇంకా కనీసం పదీ పదిహేనేళ్లయినా ఆగాల్సిందే. -
ఆమ్లా అల్విదా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ క్రికెటర్ సేవలు కోల్పోయింది. సోమవారం స్టెయిన్ టెస్టుల రిటైర్మెంట్ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. దశాబ్దన్నర కాలం పాటు సఫారీ బ్యాటింగ్ మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచిన హషీమ్ మొహమ్మద్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. జొహన్నెస్‌బర్గ్: రుషిలాంటి ఏకాగ్రత...వీరుడిలాంటి పోరాటపటిమ... హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ సందర్భంగా సహచర క్రికెటర్ ఒకరు చేసిన ప్రశంస ఇది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం, చూడముచ్చటైన స్ట్రోక్‌లు, వివాదాలు లేని, బ్యాట్‌తోనే తప్ప ఏనాడూ నోటితో సమాధానం చెప్పని తనదైన ప్రత్యేక వ్యక్తిగత జీవన శైలి...ఇవన్నీ హషీం ఆమ్లాను విశేష క్రికెటర్‌గా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆమ్లా కెరీర్లో చివరిది. లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ సఫారీ స్టార్ చివరకు ఆట ముగించాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు ల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన అతను... వన్డే ప్రపంచ కప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 203 పరుగులే చేయగలిగాడు. అద్భుతమైన ప్రదర్శనలతో... 2002 అండర్–19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది. మరుసటి ఏడాది లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ సెంచరీతో తన జట్టును రక్షించడంతో ఆమ్లా పోరాటపటిమ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2012 సిరీస్‌లో చేసిన రెండు సెంచరీలు, అంతకు ముందు ఏడాది స్వదేశంలో అదే జట్టుపై సాధించిన రెండు వరుస శతకాలు ఆమ్లా కెరీర్లో చెప్పుకోదగ్గవి. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజ్‌లో నిలిచి అజేయంగా సాధించిన 311 పరుగులు అతని కెరీర్లో హైలైట్. 2006నుంచి 2015 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా జట్టు విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదంటే అందులో ఆమ్లా పోషించిన పాత్ర అద్భుతం. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌లో సూపర్... ఆమ్లా భారత్‌లో 3 సార్లు పర్యటించాడు. 2004లో విఫలమైన అతను 2008 సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2010 సిరీస్‌లోనైతే ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 253 నాటౌట్, 114, 123 నాటౌట్ పరుగులతో మన బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 2015లో కెప్టెన్‌గా వచ్చి 0–3తో సిరీస్ చేజార్చుకున్నా...ఢిల్లీ టెస్టులో మ్యాచ్‌ను కాపాడేందుకు 244 బంతుల్లో 25 పరుగులు చేసిన అతని పట్టుదలను ఎవరూ మరచిపోలేరు. వన్డేల్లోనూ దూకుడు... శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా అనిపించినా...వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. ఇదే ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 75 సగటు, 104 స్ట్రైక్‌రేట్‌లో 1058 పరుగులు చేయడం విశేషం. ఒక దశలో అతను వేగంలో కోహ్లితో పోటీ పడ్డాడు. కెరీర్లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరుకోవడం మరో ఘనత. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్ ఆమ్లా -
‘శారీ ట్విటర్’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం ట్విటర్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్(#SareeTwitter) కింద ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చీరతో ఉన్న తమ ఫొటోలను ట్విట్ చేస్తూ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. దీంతో శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. కాగా, ఈ హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చీర ధరించన ఓ యువతి క్రికెట్ మైదానంలో పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. ఈ సంఘటన 1975లో జరగ్గా.. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ పుణ్యమా అని ఇప్పుడు వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే..1975లో వెస్టిండీస్, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రికెటర్ బ్రిజేష్ పటేల్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. దీంతో ఓ భారత అభిమాని మైదానంలోకి పరిగెత్తి అతడికి ముద్దు పెట్టారు. నల్లటి చీర(బ్లాక్ అండ్ వైట్ వీడియోలో కనిపించిన రంగు)లో ఉన్న యువతి పోలీసులు, గ్రౌండ్ సిబ్బందికి చిక్కకుండా పటేల్ వద్దకెళ్లి అతడి బుగ్గ మీద కిస్ చేశారు. చీరలో ఉన్నా కూడా పోలీసులకు చిక్కకుండా స్పీడ్‌గా పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. ఆ వీడియో వైరల్ కాలేదు. అయితే శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ పుణ్యమా అని ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. ఇక నెటిజన్లు ఈ ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్‌తో పోస్టుచేసిన ఫొటోలు, వీడియోల్లో ఇదే అత్యుత్తమైన ట్వీట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ‘నాకు చీరలోనడవడమే కష్టం కానీ ఆమె ఏకంగా పరుగెత్తారు. ఇది బెస్ట్ పోస్ట్.’, ‘చీరలో ఓ మహిళ పెరుగెత్తి అథ్లెటిజంలో కొత్త ఒరవడి సృష్టించారు. ‘వావ్.. చీరలో ఇంత స్పీడ్‌గా ఎవరు పరుగెత్తలేరు’ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
క్రికెటర్ దారుణ హత్య..!
ముంబై : మహారాష్ట్రకు చెందిన ఓ క్రికెటర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి (జూన్ 6) బందప్ ప్రాతంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు క్రికెటర్ రాకేష్ పవార్‌ను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని అన్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఫ్యుయల్ స్టేషన్‌కు రాకేష్ పెట్రోల్ కోసం వచ్చిన క్రమంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమిక సమాచారం. మహారాష్ర కికెట్ టీమ్‌లో కొనసాగుతున్న రాకేష్ రంజీ జట్టులో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఘటనపై రాకేష్ చిన్ననాటి మిత్రుడు గోవింద్ రాథోర్ మాట్లాడుతూ.. ‘హత్యకు గురైన సమయంలో రాకేష్‌తో పాటు అతని గాళ్‌ఫ్రెండ్ ఉంది. స్థానికంగా ఉండే ఖాన్ ఫ్యామిలీతో అతనికి పాత గొడవలున్నాయి. రాకేష్ కొంతమందికి క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు’ అని వెల్లడించాడు. -
క్రికెటర్ ఇంట విషాదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీ ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచింది. ఈ విషాదకర వార్తను అసిఫ్ అలీ పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్లో తెలిపింది.‘అసిఫ్ అలీ కూతురు నూర్ ఫాతిమా మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. అసిఫ్కు అతడి కుటుంబసభ్యులకు ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్యామిలీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ క్రికెటర్ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యాడు. గత కొద్ది రోజుల క్రితమే తన కూతరు క్యాన్సర్‌తో పోరాడుతుందని ట్విటర్లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్తున్నామని తెలిపాడు. ఈ సందర్భంగా అమెరికా వెళ్లడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలపుతూ మరో ట్వీట్ చేశాడు. ‘నా కుమార్తెకు క్యాన్సర్. ప్రస్తుతం ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. ట్రీట్మెంట్ కోసం అమెరికాకి తీసుకొచ్చాం. కేవలం ఒక్క గంటలోనే తన కుమార్తెకి వీసా మంజూరు చేసిన ఇస్లామాబాద్ యుఎస్ ఎంబసీ, లాహోర్‌లోని యుఎస్ ఎంబసీకి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మైక్, ఎలిజిబెత్, తన్వీర్ భాయ్’ అంటూ ట్వీట్ చేశాడు. -
ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి మోసం
-
కటకటాల పాలైన క్రికెటర్
గుణదల (విజయవాడ తూర్పు): అతను ఉన్నత విద్యావంతుడు. దానికితోడు మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభ చూపి రంజీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే స్థాయికి ఎదిగాడు. 82 గంటలపాటు క్రికెట్ ఆడటం ద్వారా గిన్నిస్ బుక్‌లో కూడా స్థానం సంపాదించాడు. అయితే, బుద్ధి వక్రించడంతో కటకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ ఏసీపీ వైబీసీసీఏ ప్రసాద్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరి నాగరాజు (24) పేద కుటుంబానికి చెందిన యువకుడు. ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడ గాయత్రీనగర్‌లో ఉంటున్న నాగరాజు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని గేమ్‌లో చక్కని ప్రతిభ కనబరిచేవాడు. 2006లో విశాఖ అండర్–14 కు ఎంపికయ్యాడు. ఆపై వరుసగా 7 సంవత్సరాలపాటు వివిధ జోన్ల తరఫున ఆడుతూ చక్కని ప్రతిభ కనబరిచాడు. 2014 లో ఆంధ్రా తరఫున రంజిలో కూడా ఆడాడు. 2016లో 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. నాగరాజు ఆటను చూసి అతనిని ప్రోత్సహించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వచ్చిన సంపాదనతో జల్సాలకు అలవాటు పడ్డాడు. మరింత డబ్బు సంపాదించి విలాసవంతంగా గడపాలనే దురుద్దేశంతో ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ఓ సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో గత యేడాది నందం వేణుగోపాల్ అనే వ్యక్తిని మోసం చేసి రూ.22,300 నగదు తీసుకున్నాడు. ఈ ఘటనపై సదరు వేణుగోపాల్.. నాగరాజుపై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే అలవాటుగా మారిన నాగరాజు ఈ యేడాది ఫిబ్రవరిలో టి–20 టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మనోజ్ అనే వ్యక్తిని మోసం చేసి అతని వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేశాడు. ఇటీవల తాను ఎమ్మెస్కే ప్రసాద్‌నని నమ్మబలికి హైదరాబాద్‌కు చెందిన మురళీ అనే వ్యక్తి నుంచి రూ.2,88,000 వసూలు చేసి మోసం చేశాడు. ఇదే పంథాలో విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నిర్వాహకులకు ఫోన్ చేసి రూ.3,88,000 నగదు వసూలు చేశాడు. ఈ విధంగా ఎమ్మెస్కే ప్రసాద్ పేరును వాడుకుని డబ్బు వసూలు చేస్తూ జల్సాలకు అలవడిన నాగరాజుపై మాచవరం పోలీస్ స్టేషన్లో గత నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజును గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1,80,500 నగదు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మాచవరం సీఐ జి శ్రీనివాస్, ఎస్ఐ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీమ్మేట్ రూమ్‌లో రేప్.. క్రికెటర్‌కు జైలుశిక్ష
లండన్: టీమ్మేట్ బెడ్రూమ్లో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడి చేసిన క్రికెటర్‌కు బ్రిటిష్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంగ్లండ్ కౌంటీ జట్టు వర్సెస్టర్ మాజీ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా సంతతికి చెందిన 23 ఏళ్ల అలెక్స్ హెప్‌బర్న్‌కు ఈ మేరకు శిక్ష విధించింది. ఎక్కువ మంది మగువలతో శృంగారం చేయాలంటూ ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టి.. పోటీని సృష్టించిన హెప్బర్న్ 2017 ఏప్రిల్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టినందుకు వర్సెస్టర్ జట్టు నుంచి అతన్ని తొలగించారు. 2017లో వాట్సాప్ గ్రూప్ పెట్టిన తొలిరాత్రే వర్సెస్టర్‌లోని హెప్బర్న్ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది. హెప్బర్న్ జట్టు సహచరుడైన జోయి క్లార్క్ ఓ నైట్‌క్లబ్‌లో తనకు పరిచయం అయ్యాడని, అతనితో పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున అతను బెడ్రూమ్ నుంచి వెళ్లిపోయిన అనంతరం హెప్బర్న్ రహస్యంగా గదిలోకి చొరబడ్డాడని, ఇంకా నిద్రిస్తున్న తనపై అతను లైంగిక చర్యకు ఒడిగట్టాడని, క్లార్క్‌గా భావించి అతనితో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు పేర్కొంది. కానీ, అతను హెప్బర్న్ అని తెలియడంతో షాక్ తిన్నానని, అత్యంత క్రూరమైన నేరానికి హెప్బర్న్ ఒడిగట్టాడని ఆమె కోర్టుకు తెలిపింది. ఈ కోర్టు విచారణ సందర్భంగా హెప్బర్న్ అహంకారపూరితమైన ధోరణిపై జడ్జి జిమ్ టిండల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత మూర్ఖంగా హెప్బర్న్, అతని జట్టు సహచరుడు శృంగార సంబంధిత గేమ్‌లో పాల్గొనడానికి అంగీకరించారని, ఇది కుర్రచేష్టగా మీరు భావించి ఉంటారని, కానీ, ఇది దారుణమైన సెక్సిజమేనని జడ్జి స్పష్టం చేశారు. ‘ఇది మహిళలను కించపరిచి.. లైంగిక దాడిని తక్కువ చేసి చూపడమే. దీనిని నువ్వు చాలా లైట్‌గా తీసుకున్నావు. రేప్ అంటే ఎంత తీవ్రమైనదో ఇప్పుడు నీకు తెలిసివస్తుంది’ అని హెప్‌బర్న్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘నీకు నువ్వు మహిళలకు దేవుడిచ్చిన కానుకగా భావించావు. బాధితురాలిని మాంసం ముద్దగానే నువ్వు చూశావు కానీ, గౌరవించదగ్గ సాటి మనిషిగా నువ్వు పరిగణించలేదు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి.. జరిగిన క్రూరమైన నేరం గురించి కోర్టుకు తెలిపిందని జడ్జి ప్రశంసించారు. హెప్బర్న్పై ఓరల్ రేప్ నేరాన్ని ధ్రువీకరించిన కోర్టు.. ఇతర రేప్ అభియోగాలను తొలగించింది. హెప్బర్న్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. తన తప్పును గుర్తించి పశ్చాత్తాపాన్ని ప్రకటించారని తెలిపారు. -
తండ్రి కాంగ్రెస్‌లో.. భార్య బీజేపీలో.. అతడేమో..
జామ్‌నగర్(గుజరాత్): భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్‌సిన్హ్, సోదరి నైనాబా తాజాగా పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల క్రితమే జడేజా భార్య రివాబా కాషాయ పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. కుటుంబంలో తలా ఒకరు ఒక్కొక్క పార్టీలో చేరడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. జామ్‌నగర్ జిల్లాలోని కలవాడ్ నగరంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడేజా సొంతూరు జామ్‌నగర్ కాగా.. ఆ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున ములు కండోరియా పోటీ చేస్తున్నారు. గత నెల 3న జడేజా భార్య రివాబా, జామ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ పూనమ్‌బెన్ మాడమ్ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జామ్‌నగర్ స్థానం నుంచి పూనమ్‌బెన్‌కే బీజేపీ టిక్కెట్ కేటాయించింది. నిజానికి జామ్‌నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్డిక్ పటేల్ పోటీ చేయాల్సింది. కానీ గతంలో ఆయనకు ఓ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ కూడా నిరాశే ఎదురైంది. 26 లోక్‌సభ స్థానాలున్న గుజరాత్లో మూడో దశ ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
వార్మప్ చేస్తూ యువ క్రికెటర్ మృతి
కోల్‌కతా : క్రీడా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటు రావడంతో ఓ యువ క్రికెటర్ ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. స్థానిక పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ క్రికెటర్ అనికెత్ శర్మ (21) మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా అనికెత్ శర్మ ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. దీంతో సహచర క్రికెటర్లు దగ్గర్లోని సిటీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. గతేడాదే క్లబ్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అనికేత్ మంచి బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అని కోచ్ తెలిపారు. ఇక అనికేత్ మృతిపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) విచారం వ్యక్తం చేసింది. క్యాబ్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమన్నారు. అంకిత్ మృతితో రేపు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధకరమన్నారు. కష్టపడేతత్వం గల క్రికెటరని, భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్ అవుతాడని అందరం భావించామన్నారు. అనికేత్ మరణ వార్త విని ఒక్కసారి షాక్‌కు గురయ్యాయని పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ సారథి సంబ్రాన్ బెనర్జీ అన్నారు. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: మీ పూర్వపు భర్త ఇమ్రాన్‌ఖాన్ లైంగిక అవలక్షణాలపై మీరు పుస్తకం రాశారు. కానీ అదేమీ పాకిస్తాన్ ఓటర్లపై ప్రభావం చూపినట్లు లేదు. ఆయనిప్పుడు పాక్ ప్రధాని కాబోతున్నారు. మీరు ఆశించినట్లు జరగనందుకు నిరాశకు లోనయ్యారా? రెహమ్ ఖాన్ : నా పుస్తకం అతడి గెలుపును అడ్డుకుంటుందన్న భ్రమ నాకు లేదు. ఇప్పుడైనా అది అతడి గెలుపు కాదు. మిలటరీ డైరెక్షన్లో అతడిదొక పాత్ర. అంతే. యూత్‌కి అతడు ఒక రాంగ్ రోల్ మోడల్. అతడి ప్లేబాయ్ ఇమేజ్ అతడిని ఓడించకపోవడానికి కారణం.. సమాజంలో పురుషుడంటే ఉన్న ఎక్కువ భావనే, స్త్రీ అంటే ఉన్న తక్కువ భావన తప్ప ఇంకొటి కాదు. -
హోటల్‌కు రాలేదని.. క్రికెటర్‌పై నిషేధం
కొలంబో: నిబంధనలు ఉల్లంఘించిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ జేఫ్రీ వాండెర్సేపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. ఏడాది నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా సెయింట్ లూసియాలో జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రీలంక జట్టు ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్లారు. కానీ ఈ యువ ఆటగాడు మాత్రం రాత్రంతా హోటల్‌కు రాకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఆగ్రహించి మూడో టెస్టు నుంచి తప్పించి ఇంటికి పంపించింది. ఈ ఘటనపై ఆగ్రహించిన శ్రీలంక క్రికెట్ బోర్డు వాండెర్సేపై కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యలను ఎవరు పాటించకున్నా ఇలాంటి శిక్షలే ఉంటాయని ఆటగాళ్లకు బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో కూడా క్రమశిక్షణ పాటించని ఆటగాళ్లపై వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడంతో పాటు ఎక్కువ సమయం పార్టీలో గడిపాడని ధనుష్క గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 2015లో వన్డేల్లో అరంగేట్రం చేసిన జేఫ్రీ వాండెర్సే.. శ్రీలంక తరుపున 11 వన్డేలు, ఏడు టీ20లల్లో ప్రాతినిథ్యం వహించాడు.