
శివకోటి
నందలూరు(వైఎస్సార్ జిల్లా): దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో నందలూరుకు చెందిన ఆలుసూరి శివకోటికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం బోర్డు ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈనెల 3 నుంచి 8 వరకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఇండియన్ డిసేబుల్ ప్రాబబుల్స్ క్యాంప్‌లో ఎంపిక నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుంచి 35 మంది క్రీడాకారులు జట్టులో స్థానం పొందేందుకు పోటీపడ్డారు.
వీరిలో ఏపీ నుంచి శివకోటి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సీరిస్‌కు ఆడే జట్టులో శివకోటికి స్థానం కల్పించారు. మూడు ఫార్మాట్లలో ఒక టెస్టు మ్యాచ్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడేందుకు శివకోటి ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని శివకోటి ఇక్కడి విలేకర్లతో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment