Divyangulu
-
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది. తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పు తాలుకు ఫలితం వైకల్యం నయమవ్వడం లేదా శాశ్వత వికలాంగుడిగా మారడంలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శాశ్వత నిర్ధారణ సర్టిఫికెట్లే పరిగణించాలని.. ► శాశ్వత వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణించాలని, ఇతరత్రా సర్టిఫికెట్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వికలాంగుల సాధికారత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా జీఓ 41 జారీ చేసింది. 40శాతం దాటితేనే... వికలాంగ రిజర్వేషన్ల అమలులో వికలత్వ శాతమే కీలకం. కనీసం 40శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రిజర్వేషన్ల వర్తింపును ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి వికలాంగుడు తప్పకుండా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అందులో శాశ్వత ప్రాతిపదిక వైకల్యం ఉన్నట్లయితేనే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈమేరకు జీఓ 41లో స్పష్టత ఇచ్చింది. తాత్కాలిక వైకల్యం(టెంపరరీ డిజబులిటీ) ధ్రువీకరణ పత్రాన్ని ఇదివరకు అంధ విభాగంలోనే జారీ చేస్తుండగా... ప్రస్తుతం అన్ని కేటగిరీల్లోనూ ఈ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. మొదటిసారి ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించే ప్రతి వికలాంగుడికి టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అతి త్వరలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోగా... వెనువెంటనే ఫలితాలను ప్రకటించి నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. ఈ సమయంలో వికలాంగ రిజర్వేషన్ల అమలులో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వికలాంగ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీఓ 41 ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక సంస్థలకు ప్రత్యేకంగా పంపింది. జీఓ 41లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది వికలాంగులపై కక్షసాధింపు చర్యః ముత్తినేని వీరయ్య తాత్కాలిక ధ్రువీకరణను రిజర్వేషన్ల అమలులో పరిగణించమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయం. ప్రస్తుతం సదరమ్ ద్వారా జారీ చేస్తున్న సర్టిఫికెట్లన్నీ టెంపరరీ సర్టిఫికెట్లే. కొందరికి రెండు, మూడేళ్లుగా ఇవే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో ఈ అంశాన్ని తీసుకురావడంతో అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశాలున్నాయి. జీఓ 41 జారీ ప్రక్రియ వికలాంగులపై కక్షసాధింపు చర్యగా భావిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. -
స్నేహానికి సిసలైన చిరునామా.. సలాం చేయాల్సిందే మనమంతా!
కల్మషం లేనిది.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేది.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెన్నంటే ఉండేది.. ఆనందంలోనూ ఆత్మీయత పంచేది.. జీవిత చరమాంకందాకా తోడుగా నిలిచేది.. స్నేహం ఒక్కటే..! ఒక్కసారి చిగురిస్తే ఆజన్మాంతం గుర్తుండిపోతుంది. పరిస్థితులు ఏవైనా నేనున్నాననే ధైర్యం ఇస్తుంది. తప్పుచేస్తే దండిస్తుంది.. కష్టమొస్తే కుంగిపోతుంది.. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో వెలుగుచూసింది. విధి ఆడిన వింతనాటకంలో రెండుకాళ్లు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్న తోటి విద్యార్థినికి స్నేహితులే అండగా ఉంటూ అక్షరాల వైపు నడిపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని బడికి నిత్యం వీల్ చైర్‌పై తీసుకెళ్తూ.. పాఠశాలలో సపర్యలు చేస్తూ.. వైకల్యాన్ని జయించేలా చేస్తున్నారు. చదువుల తల్లికి తోడుగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వారి ఆదర్శానికి అధికారులు సైతం సలాం చేస్తున్నారు. అసలు ఆ కథేంటో.. ఆ స్నేహితుల విలువేంటో మీరే చదవండి.. కేవీబీపురం(తిరుపతి జిల్లా): విధి విసిరిన బాణానికి రెండుకాళ్లు చచ్చుబడినా కుంగిపోలేదు. మనోధైర్యంతో గుండె నిబ్బరం చేసుకుంది. ఒంట్లో సత్తువ లేకపోయినా తోటి స్నేహితుల సాయంతో బడిబాట పట్టింది. చదువుల్లో రాణిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోతోంది.. కేవీబీపురం మండలానికి చెందిన జూయిస్. నాలుగేళ్ల పాటు బడికి దూరమైనా స్నేహితురాళ్ల సాయంతో మళ్లీ పెన్ను, పుస్తకం పట్టింది. ప్రభుత్వ సాయంతోపాటు స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన వెట్టి. ఇజ్రాయిల్, కన్నెమ్మ దంపతులకు దావిద్, జూయిస్ సంతానం. ఇజ్రాయిల్ నగిరి పోస్ట్ ఆఫీస్‌లో చిరు ఉద్యోగి. కన్నెమ్మ రోజువారి కూలీ. కుమార్తె జాయిస్ (14) 2012లో బంధువుల ఇంట్లో ఆడుకుంటూ టైల్స్‌పై జారిపడింది. అప్పట్లో కాలు విరిగినట్లు ధ్రువీకరించి వైద్యులు కట్టుకట్టి పంపించేశారు. క్రమేణా చిన్నారి కాళ్లు చచ్చు బడుతూ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉన్న రెండెకరాల పొలంతో పాటు సొంత్త ఇంటినీ తెగనమ్మి బిడ్డకు మూడు ఆపరేషన్లు చేయించారు. కానీ ఫలితం లేదు. చిన్నారి రెండు కాళ్ల చచ్చుబడ్డాయి. నడవలేని స్థితికి చేరింది. 3వ తరగతి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. పాఠశాలకు వెళ్లివచ్చే స్నేహితులకు టాటా చెబుతూ సంబరపడేది. రెండేళ్ల క్రితం వారితోపాటు బడికి వెళ్లాలని నిశ్చయించుకుంది. వీల్‌చైర్ కొనిస్తే అన్నతో కలిసి బడికి పోతానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వీల్ చైర్ కొనిచ్చారు. దీనికితోడు అమ్మఒడి, పింఛన్ పథకాలు మంజూరు కావడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని రాగిగుంట ఉన్నత పాఠశాలకు తోటి స్నేహితులతో పంపడానికి సమ్మతించారు. ఉపాధ్యాయుల ఉదారత జాయిస్ మూడో తరగతిలోనే బడికి దూరమైంది. కాళ్లు రెండూ చచ్చుబడడంతో ఇక బడికి వెళ్లలేనని భావించింది. కానీ చదువుపై ఆ విద్యార్థినికి ఉన్న మక్కువను చూసి ఉపాధ్యాయులే హాజరు వేసి.. హోంవర్క్‌లు ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేశారు. అలా మూడేళ్లు అంటే ఆరో తరగతి వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బాలికే స్వయంగా బడికిరావడంతో సంబరపడ్డారు. చిట్టి నేస్తాలు.. పెద్ద సాయం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన స్నేహితురాళ్లు శ్రుతి, మానస, మౌనిక, లావణ్య, భూమిక ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు, పక్క గ్రామంలో ఉన్న ట్యూషన్‌కు నిత్యం తీసుకెళ్లడం.. తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టడం బాధ్యతగా తీసుకున్నారు. గ్రామస్తులు, తోటి విద్యార్థినీ, విద్యార్థులు కూడా పాఠశాలలో సపర్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎలాంటి బిడియం లేకుండా కాలకృత్యాలకు తీసుకెళ్లడం.. మళ్లీ తీసుకొచ్చి క్లాసురూమ్‌లో కూర్చోబెట్టడం లాంటివి చేస్తుండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. డాక్టర్ అవుతా మా అమ్మానాన్నా, అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను కాపాడారు. కంటికిరెప్పలా పెంచారు. ఇప్పటికే మా పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వలేక.. సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నాకు కృత్రిమ కాళ్లతో పాటు, ప్రభుత్వం, దాతలు మరింత సాయం అందిస్తే బాగా చదువుకుంటా. డాక్టర్ని అయ్యి ప్రతి ఒక్కరికీ నా వంతు సహకారం అందిస్తా. – జాయిస్ , విద్యార్థిని తనకోసం తరగతి గదినే కిందకు మార్చాం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకుని తొమ్మిదో తరగతి గదిని మిద్దెమీద లేకుండా కిందకు మార్చాం. చదువులో చురుగ్గా ఉంటోంది. కేవీబీపురం దివ్యాంగుల పాఠశాల నుంచి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరాం. జాయిస్ పరిస్థితి తెలుసుకుని తోటి విద్యార్థులే బాధ్యత తీసుకుని అన్నీ చేస్తుండడం గొప్ప విషయం. – నారాయణమ్మ, రాగిగుంఠ ఉన్నత పాఠశాల, హెచ్ఎం స్నేహితులే అక్కున చేర్చుకున్నారు జాయిస్ మూడో తరగతి చదువుతున్నపుడు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి మూడేళ్లు బడికి దూరమైంది. తిరిగి రెండేళ్లుగా తన స్నేహితుల సాయంతో బడికి వెళ్తోంది. స్నేహితురాళ్లే బడికి తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకొస్తున్నారు. తన అవసరాలు కూడా వాళ్లే తీరుస్తున్నారు. వారి పెద్ద మనసుకు దండం పెట్టాలనిపిస్తుంది. – కన్నెమ్మ, (జాయిస్) తల్లి ఏమాత్రం కష్టం అనిపించదు జాయిస్ పరిస్థితి మాకు తెలుసు. అందుకే తనని మా కాళ్లతో నడిపిస్తున్నాం. బడికి, ట్యూషన్‌కి మేమే తీసుకెళ్తాం. అందరం కలిసే భోంచేస్తాం. మా స్నేహితురాలిని మేమే చూసుకుంటాం. తనకి సేవ చేస్తుంటే ఏమాత్రం కష్టం అనిపించదు. జాయిస్ బాగా చదువుతుంది. చదువుల్లో రాణిస్తుంది. మాకు మంచి సలహాలు ఇస్తుంది. – చందు, (జాయిస్) స్నేహితురాలు మనోధైర్యానికి సలాం ఆ వయసు చిన్నారులు పరిస్థితులను అంత సులువుగా అర్థం చేసుకోలేరు. అయితే జాయిస్ మాత్రం తనంతటతానే మనోధైర్యాన్ని నింపుకుని మళ్లీ అక్షరాలకు చేరువైంది. చదువుపై ఎంతో మమకారం ఉన్న జాయిస్‌ను మరింత ప్రోత్సహిస్తాం. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపడుతాం. – లక్ష్మీపతి, ఎంఈఓ కేవీబీపురం -
దివ్యాంగులకు ఎలక్ట్రిక్ పరికరాల పంపిణీ
సికింద్రాబాద్: దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి అన్నారు. శనివారం సీతాఫల్‌మండిలోని మధురానగర్ కాలనీలోని రాఘవ గార్డెన్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.కోటి 70లక్షల విలువ గల బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్, హెల్మెట్లు, వివిధ పరికరాలను 200మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంతో మంది వికలాంగులను గుర్తించి వారికి కావాల్సిన పరికరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, నేతలు మేకల కీర్తి, బండపెల్లి సతీష్, కనకట్ల హరి, ప్రభుగుప్త, నాగేశ్వర్‌రెడ్డి, గణేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. -
దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. మీ ఇంటికే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినే శరణ్యం కావడంతో మరింత మందికి టీకా డోసులు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు, ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి టీకాలు ఇస్తామని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాక్సిన్ వేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఇంకా రెండో వేవ్ మధ్యలోనే ఉన్నామని∙ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ నుంచే అత్యధికంగా కేసులు వస్తున్నాయని గత వారం 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని చెప్పారు. లక్షకు పైగా యాక్టివ్ కోవిడ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళయేనని వెల్లడించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అర్హుల్లో 66 శాతం మందికి కరోనా టీకా దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 66 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక్క డోసైనా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. 23 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 63.7 శాతం డోసులను గ్రామీణ ప్రాంతాల్లో, 35.4 శాతం డోసులను పట్టణ ప్రాంతాల్లో ఇచ్చినట్లు తెలిపారు. 68.2 లక్షల డోసులను (దాదాపు 0.95 శాతం) కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇచ్చామని, వీటిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేటగిరీలో కలుపలేమని వివరించారు. దేశంలో పండుగల సీజన్ మొదలయ్యిందని, కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని రాజేశ్ భూషణ్ సూచించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన వైఎస్సార్ జిల్లా కుర్రాడు
నందలూరు(వైఎస్సార్ జిల్లా): దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో నందలూరుకు చెందిన ఆలుసూరి శివకోటికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం బోర్డు ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈనెల 3 నుంచి 8 వరకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఇండియన్ డిసేబుల్ ప్రాబబుల్స్ క్యాంప్‌లో ఎంపిక నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుంచి 35 మంది క్రీడాకారులు జట్టులో స్థానం పొందేందుకు పోటీపడ్డారు. వీరిలో ఏపీ నుంచి శివకోటి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సీరిస్‌కు ఆడే జట్టులో శివకోటికి స్థానం కల్పించారు. మూడు ఫార్మాట్లలో ఒక టెస్టు మ్యాచ్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడేందుకు శివకోటి ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని శివకోటి ఇక్కడి విలేకర్లతో తెలిపారు. -
దివ్యాంగులకు ‘ప్రత్యేకం’
సాక్షి, అమరావతి: సమాజంలో దివ్యాంగులకు మిగతా వారితో సమానావకాశాలు కల్పించడంలో భాగంగా వారికి ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య, ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ అర్హతలు ► వార్షికాదాయం మూడు లక్షల్లోపు కలిగి, 18 – 45 మధ్య వయసు ఉండాలి. 70 శాతం, ఆ పైగా వైకల్యం ఉండాలి. గ్రాడ్యుయేషన్, ఆ పై చదువులు చదివే విద్యార్థులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా స్వయం ఉపాధి లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో కనీసం ఏడాది నుంచి పని చేస్తున్న దివ్యాంగులకు వీటి ని ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లేదా ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ► జిల్లా యూనిట్‌గా అర్హులైన వికలాంగులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తొలుత వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. -
వైకల్యం ఓడిపోయింది.. స్ఫూర్తి గాథలు
ప్రొద్దూటూరు/రాజంపేట టౌన్/ రూరల్/ జమ్మలమడుగు/సంబేపల్లె/అట్లూరు/ చాపాడు: వారంతా దివ్యాంగులే... పుట్టుకతో విధి వంచితులే.. అయినా బెదరలేదు.. కన్నీరు కార్చలేదు.. పట్టుదల, ఆత్మస్థైర్యంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఒకరిపై ఆధారపడకుండా, వ్యాపారం చేసుకుంటూ తమదైన నైపుణ్యంతో రాణిస్తూ, ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా ఒకరి సాయం కోసం ఎదురుచూడకుండా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది దివ్యాంగులపై ప్రత్యేక కథనం. చిరు వ్యాపారమే ఆసరా ఇక్కడ కన్పిస్తున్న దివ్యాంగుడి పేరు ప్రొద్దుటూరు రెహామాన్. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు కాల్వకట్ట వద్ద నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. గతంలో సంచులు కుట్టేవాడు. ‘‘కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డానని, లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా జరుగుతోందని, పెట్టుబడి పోయి మిగిలిన ఆదాయంతో పాటు, ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని’’ చెబుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. ఇతని పేరు అహమ్మద్‌బాషా. పుట్టుకతోనే దివ్యాంగుడు. రాజంపేట పట్టణం రైల్వేస్టేషన్ సమీపంలో టైలరింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనాతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. లాక్డౌన్ కారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో షాపు మూసివేశాడు. ప్రస్తుతం చౌకదుకాణంలో నెలకు రెండుమార్లు ఇచ్చే రేషన్ బియ్యం, సరుకులతో భార్య, డిగ్రీ చదివే ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాపులో కూర్చుంటే కనీసం రూ. 100 వస్తుందన్న ఆశ ఇతనిది. కరోనా ఇబ్బందులు తాత్కాలికమే అంటూ, ధైర్యంతో మొండిగా బతుకుబండిని లాగుతున్నట్లు చెబుతున్నాడు రెక్కల రిక్షా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ దివ్యాంగుని పేరు కరీముల్లా. చిన్నప్పుడే ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకున్న ఈయన ఎంతో ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా రిక్షాను తయారు చేయించుకుని సీజన్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం రోజూ హోల్‌సేల్ మార్కెట్లో వేరుశనగ కాయలు కొని ఊరంతా తిరిగి విక్రయిస్తాడు. సీజన్‌ను బట్టి రేగిపండ్లు, జామకాయలు, మామిడికాయలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈయన సతీమణి ఖాదర్‌బీ దివ్యాంగురాలే. చిన్నప్పుడే పోలియోతో కాలు చచ్చుబడిపోయింది. సతీమణి ఇంటిలో అన్నం వండిపెట్టడం మినహా ఏ పని కావాలన్నా తాను ఒంటిచేత్తోనే చేస్తానని ఎంతో ధైర్యంతో కరీముల్లా ఈ సందర్భంగా చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెరీ ‘గుడ్డు’రఫి జమ్మలమడుగుకు చెందిన మహమ్మద్‌రఫి పుట్టుకతోనే పోలియో సోకడంతో దివ్యాంగుడిగా మారాడు. ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా కోడి గుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో దుకాణాలు మూతపడి వ్యాపారం కుంటుపడింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారిని జయించడంలో గుడ్డు ఎక్కువగా సహకరిస్తుందన్న డాక్టర్ల సూచనతో వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. దీంతో రఫీ రోజంతా బిజీబిజీగా ఉంటున్నాడు. సేవకుడయ్యాడు.. రాజంపేటకు చెందిన ఎన్. శ్రీనివాసులు డిగ్రీ వరకు చదివాడు. తండ్రి అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఇతనికి తల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ శ్రీనివాసులుపైనే పడింది. పెద్దతమ్ముడికి సెలూన్‌షాపు ఏర్పాటు చేయించాడు. మరో సోదరుడిని చదివిస్తున్నాడు. జననేత ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థతో 19వ వార్డులో ప్రస్తుతం వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్నాడు. బతుకు ‘చిత్రం’ ఇదే.. ఏపీ దివ్యాంగుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న షాకీర్‌హుసేన్ పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఆల్బమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ స్టూడియోకు వెళ్లి కంప్యూటర్లో ఫొటోలు డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో ఫొటోకు రూ.3 చొప్పున తనకు కమీషన్ ఇస్తారని, రోజూ 200 ఫొటోలుపైగా డిజైన్ చేస్తానని ఈ సందర్భంగా షాకీర్ తెలిపాడు. కుట్టుకుంటూ.. నెట్టుకుంటూ సంబేపల్లె మండలం పీఎన్‌కాలనీ పంచాయతీ రేగడగుంటపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు రెండు కాళ్లు లేవు. అయినా కష్టపడి టైలరింగ్ చేస్తూ అమ్మానాన్నకు ఆసరాగా ఉంటూ వచ్చాడు. దురదృష్టవశా>త్తూ కన్నవారు కూడా కాలం చేశారు. ఆత్మస్థైర్యంతో తను నేర్చుకున్న చేతి వృత్తితో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవనం సాగిస్తున్నాడు. తల్లి కోసం రాజంపేట మండలం ఎర్రబల్లికి చెందిన ఖమ్మం నాగేంద్రరెడ్డి బీఎస్సీ, బీఈడీ చదివాడు. తండ్రి మరణించడంతో తల్లిని పోషించేందుకు చిన్న పాటి కిరాణా షాపును ఏర్పాటు చేసుకున్నాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా నిరాశ చెందకుండా జీవనం సాగిస్తున్నాడు. షాపులో వచ్చిన ఆదాయంతో తల్లిని బాగా చూసుకుంటున్నాడు. కష్టాలకు బెదరలేదు.. ఈ ఫొటోలేని వ్యక్తి పేరు మద్దూరు నరసింహులు. అట్లూరు మండలం కొండూరు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడు. అవయవాలు ఎదగలేదు. అయితే టైలర్ పని నేర్చుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయ్యాడు. కరోనా కష్టాల్లోనూ బెదరకుండా టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అందరికీ అండగా .. రాజంపేట మండలం మన్నూరు గ్రానికి చెందిన షేక్ జైనులు దివ్యాంగుడు. డిగ్రీ చదివాడు. తల్లి, భార్య, కుమార్తె, తమ్ముడు ఉన్నారు. అందరినీ పోషించాల్సిన బాధ్యత జైనులుపై పడింది. ఇంటిలోనే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇతని పట్టుదల కింద వైకల్యం ఓడిపోయింది. -
ప్రత్యేక రైళ్లు : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లు ఈ రోజు (మంగళవారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది. కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ) అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
కామారెడ్డి జిల్లాలో దారుణం
-
‘సదరం’శిబిరం జాడేదీ
చింతలమానెపల్లి(సిర్పూర్): దివ్యాంగులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరిని చూస్తే సామాన్యులకు సైతం ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ దివ్యాంగుల పట్ల అధికారులకు మాత్రం కనికరం కలగడం లేదు. ఫలితంగా ధ్రువీకరణ పత్రాలు లేక దివ్యాంగులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఓటరుగా కూడా తమ హక్కులు కోల్పోతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో సుమారు 14వేల మందిపైగా దివ్యాంగులు ఉన్నారు. కానీ ఇందులో 7,070 మంది మాత్రమే దివ్యాంగులుగా ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 5 ఏళ్లలో మంచిర్యాలలో శిబిరాలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో ఒకసారి శిబిరం నిర్వహించి గుర్తింపు పత్రాలు అందజేశారు. కొత్తగా కుమురంభీం జిల్లా ఏర్పడ్డ తొలుతలో ఒకసారి జిల్లా కేంద్రంలో సదరమ్ శిబిరం నిర్వహించగా సుమారు 3వేల మంది హాజరయ్యారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఒక్కరికీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దివ్యాంగుల సంఖ్య అధికంగా ఉన్నా సదరమ్ శిబిరాలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరం దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సదరమ్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ లేక దివ్యాంగులు పథకాలకు అర్హత కోల్పోతున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, ఆర్థిక పథకాలు వీరికి అందడం లేదు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పింఛన్, ఆర్టీసీ, రైల్వే ప్రయాణాల్లో రాయితీ, సబ్సిడీ రుణాల మంజూరు, ట్రై సైకిళ్ల మంజూరు, చేతికర్రలు సహా మరికొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ధ్రువీకరణ పత్రాలు లేక ఈ పథకాలకు దివ్యాంగులు దూరం కావాల్సి వస్తోంది. మండల కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించాలి జిల్లాలో దివ్యాంగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో చాలా మందికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల్లో అర్హత కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లోనే సదరమ్ శిబిరాలను నిర్వహించాలని దివ్యాంగులు కోరుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాలంటే బెజ్జూర్, కౌటాల, దహెగాం, చింతలమానెపల్లి మండలాలలోని మారుమూల గ్రామాల నుంచి సుమారు 100నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇంత దూర ప్రాంతాలకు దివ్యాంగులు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి సమస్యలపై గతంలో జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఆందోళనలు కూడా నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రాలూ అందించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో దివ్యాంగులు మానసికంగా వేదనకు గురవుతున్నారు. ఎన్నికల పోలింగ్‌లో ధ్రువీకరణ పత్రం ఉంటేనే గుర్తింపు.. ఎన్నికల పోలింగ్‌లో భాగంగా దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రం ఉంటేనే దివ్యాంగులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ఓటు వేసే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దివ్యాంగులు పోలింగ్ గదిలోకి వెళ్లేందుకు వీలుగా మెట్లు ఉన్న ప్రాంతంలో ర్యాంప్ నిర్మించాలి. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చిలు ఏర్పాటు చేసి తరలించాలి. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే కుర్చిలు కొనుగోలు చేసింది. ఆయా పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగుల సంఖ్య అధికంగా ఉంటే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.దివ్యాంగులు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేంత వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాల్సి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు రాలేని దివ్యాంగులను ప్రభుత్వ అధికారులు గుర్తించి పోలింగ్ కేంద్రం వరకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారు. కొంతవరకు దివ్యాంగులకు మానవతా దృక్పథంతో సహకరిస్తున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం అందించే సౌకర్యాలకు మాత్రం దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. -
దివ్యాంగ ఓటర్లను ఆటోలో తరలిస్తాం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ రోజున దివ్యాంగులను వారి ఇళ్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఆటోల్లో ఉచితంగా తరలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ ప్రకటించారు. ఇందు కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ ఓటర్లను గుర్తిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఓటర్ల జాబితాలో 4,12,098 మంది దివ్యాంగులుగా నమోదు చేయించుకున్నారని, అయితే వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సడరం రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వికలాంగులు 7 లక్షల మందికి పైనే ఉన్నారన్నారు. సడరం రికార్డులతో ఓటర్ల జాబితాలో దివ్యాంగులం దరినీ గుర్తిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. మరో 4 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వారిని గుర్తించి రవాణా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీకి బూత్ లెవల్ అధికారులు వెళ్లినప్పు డే దివ్యాంగులు ఏ సమయానికి ఓటేసేందుకు వస్తా రో తెలుసుకుని ఏర్పాట్లు చేస్తారన్నారు. వికలాం గులు వీల్చైర్ల ద్వారా సులువుగా వెళ్లేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శాశ్వత ర్యాంపులు నిర్మిస్తున్న ట్లు చెప్పారు. 10 వేల నుంచి 15 వేల వీల్ చైర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రెండు పోలింగ్ కేంద్రాలకు ఒక వీల్ చైర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. అంధులు ఓటేయాల్సిన పార్టీ గుర్తును, అభ్యర్థిని గుర్తు పట్టేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో బ్యాలెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బధిరులకు సంజ్ఞల భాషలో మాట్లాడేలా పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల సదుపాయాల కల్పనకు జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాదా యాప్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగ ఓటింగ్‌ను ప్రోత్సహించేందుకు సినీనటి అభినయశ్రీ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆంజనేయ, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర, జాతీయస్థాయి సింగర్ శ్రావ్య, టీవీ యాంకర్ సుజాత, శాస్త్రవేత్త బాబూనాయక్‌ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించామన్నారు. వీరంతా వైకల్యాన్ని అధిగమించి ఆయా రంగాల్లో అద్భుతంగా రాణించారన్నారు. పరిశీలనలో ఆన్లైన్ పోలింగ్ తీవ్ర వైకల్యమున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరడం న్యాయబద్ధమైన డిమాం డేనని రజత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం కావడానికి అవకాశముం దనే కారణంతో ఈ మేరకు చట్ట సవరణకు పార్లమెంట్ అంగీకరించలేదన్నారు. దీనిపై ఎన్నికల సం ఘం అంతర్గత సదస్సుల్లో చర్చిస్తామన్నారు. ఆన్లైన్ పోలింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనలు సైతం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రవేశపెట్టిన సీ–విజిల్ యాప్‌నకు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 1,457 ఫిర్యాదులొచ్చాయన్నారు. అభ్యర్థుల నేర చరిత్రపై వార్తా పత్రికలలో ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చి న ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నేత హత్యపై రజత్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఈ హత్యపై పోలీస్ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఘటనకు రాజకీయ రంగు పులమడం సాధారణమేనన్నారు. -
దివ్యాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7 శాతానికి పెంచాలి. రాజ్యాంగంలో ఉన్న రాజకీయ రిజర్వేషన్‌ను 5 శాతం అమలు చేయాలి. దివ్యాంగులకు పూర్తి రాయితీతో రూ.5 లక్షల వరకు రుణాలు అందించాలి. ఇతర పనులు చేసుకోలేనివారికి నెలవారీ పెన్షన్ రూ.5 వేలు అమలు చేయాలి. దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందించాం. – కోరాడ అప్పలస్వామి నాయుడు, కొత్తలంక దేవుడు, వికలాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు -
దివ్యాంగులకు బియ్యం ఇవ్వడం లేదు
‘అన్నా...వైఎస్సార్ హయాంలో దివ్యాంగులకు ప్రతి నెలా 35 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బియ్యం ఇవ్వడం లేదు. పైగా అన్ని అర్హతలున్నా పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదు’. అని గుడివాడకు చెందిన అహ్మద్, శ్రీకాంత్, సత్యనారాయణ, ఎం.రాజేష్, బాషా, అజీమ్, కె. తులసీరామ్ జననేత జగన్‌మెహన్‌రెడ్డిని కలసి విన్నవించుకున్నారు. దివ్యాంగులు మెరుగైన జీవనాన్ని సాగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి రుణాలను ఇవ్వాలని కోరారు. భూమి కూడా లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దివ్యాంగులకు అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు చేయడం లేదని జననేత దృష్టికి తీసుకువచ్చారు. -
వారికోసం ఉపాసన 'స్పెషల్ షో'లు
సాక్షి, హైదరాబాద్ : రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమాజ సేవకురాలిగా ఎంతో మంది చిన్నారులను ఆదరిస్తున్నారు. అంతేకాదు ఉపాసన జంతు ప్రేమికురాలు కూడా. ఇందులో భాగంగానే అక్కినేని అమల నిర్వహించే బ్లూక్రాస్ సంస్థ నుంచి జంతువులను దత్తత తీసుకొని వాటి సంక్షేమ బాధ్యతలును నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు పండుగలకు, ప్రత్యేకమైన రోజుల్లో భర్త రామ్‌చరణ్‌తో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు అనాథ శరణాలయాలను సందర్శిస్తుంటారు. వారితో పాటు కలిసి ఆడుతూ పాడుతుంటారు. వారికోసం పలుసార్లు చరణ్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ఉచిత షోలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే ఉపాసన మరోసారి తన మంచితనం చాటుకున్నారు. హైదారాబాద్‌కు చెందిన ఆశ్రయ ఆకృతి అనే స్వచ్చంద సంస్థకు చెందిన వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే విడుదైల బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న రంగస్థలం సినిమాను ప్రత్యేక షోలను ఉపాసన ఏర్పాటుచేశారు. దగ్గరుండీ మరీ వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నారు. వారితో పాటు సినిమా చూసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇక రంగస్థలం విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే 2.5 మిలియన్ల మార్క్‌ను సైతం దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిట్టిబాబు హవా కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం కూడా సుమారు రూ.10 కోట్లపైనే వసూలు చేసిందని టాలీవుడ్ టాక్. -
కంప్యూటర్‌తో పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి. సమాధానాలు టైప్ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్ చేసిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్ టీచర్ ఆ కంప్యూటర్ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్ఈ అంగీకరించింది. -
నేడు దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా కాలిబాట భక్తులకు 2 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాగా, సోమవారం వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం చంటి పిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం ఉంటుంది. -
వికలాంగులు కాదు.. దివ్యాంగులు
న్యూఢిల్లీ: వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది చేసిన సూచనను రెండేళ్ల తర్వాత రైల్వే శాఖ ఆచరణలో పెట్టింది. రైల్వే రాయితీ ఫారాలలో వికలాంగ్ అని ఉన్నచోట దివ్యాంగ్గా నామావళిని మార్పు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అందజేసే రాయితీ(కన్సెషన్) దరఖాస్తులో ‘బ్లైండ్’ అని ఉన్నచోట దృష్టి బలహీనులుగా, చెవిటి మూగ అని ఉన్నచోట వినలేని, మాట్లాడలేని బలహీనులుగా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉన్నచోట దివ్యాంగ్జన్ అని మార్పు చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వస్తాయి. ఈ రాయితీ ధ్రువపత్రాల ప్రొఫార్మలో ఈ విధంగా మార్పులు చేయాలని ఆయా విభాగాలకు రైల్వే శాఖ సూచించింది. కాగా, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రక్షణ సిబ్బంది తదితరులకు భారతీయ రైల్వే శాఖ రూ.1,600 కోట్ల విలువ చేసే 53 రకాల రాయితీలు ఇస్తోంది. మాట్లాడలేని, వినలేని దివ్యాంగులకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం, దృష్టి బలహీనులకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్‌కార్, ఏసీ త్రీ ట్రైర్లో 75 శాతం, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. -
8, 29లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల: వయో వృద్ధులు, దివ్యాంగులు, అయిదేళ్ల లోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎక్కువమందికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సామాన్య రోజులను కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో 65 సంవత్సరాలు పైబడినవారు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు రోజూ ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు మరింతమందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టీటీడీ అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. అయిదేళ్ల లోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10,30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సంవత్సరం లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. -
3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటాయని, వారికి 3 శాతం రిజ ర్వేషన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందే నని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను తొలుత ఆ పేరుతో పిలిచింది ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి.. వారి ప్రాథమిక హక్కని వాటికోసం కేంద్రం కృషి చేస్తుందన్నారు. వీరి కోసం 21 ఓకేషనల్ రిహబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చెవిటి వారికోసం కేంద్రం ఆరు ప్రత్యేక కాలేజీలను తీసుకువస్తోందని తెలిపారు. అందులో ఒకటి సౌత్జోన్లో ఏర్పాటు చేస్తారన్నారు. దాన్ని తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్ని స్తానన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 10 లక్షల మంది దివ్యాంగులకు సాయం అందించేందుకు దత్తాత్రేయ సహకారం తీసుకుంటామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాటా ్లడుతూ... రాష్ట్రంలో పింఛన్ రాని దివ్యాంగు లుంటే.. వెంటనే ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వికలాంగుల పిలుపు మాస పత్రికను ఆవిష్క రించారు. ఆటల పోటీల విజేతలకు బహు మతులు, పలువురికి ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ శైలజ, వంశీ రామరాజు, దివ్యాంగుల ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.