Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు  | Ideal Marriage: Young Man Married Divyanguralu | Sakshi
Sakshi News home page

Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు 

Published Fri, Apr 29 2022 8:29 PM | Last Updated on Sat, Apr 30 2022 11:38 AM

Ideal Marriage: Young Man Married Divyanguralu - Sakshi

నాగలక్ష్మిని ఆశీర్వదిస్తున్న జీవన్‌రాయ్‌ దంపతులు  

మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు.

తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్‌ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్‌ బిషప్‌ కె.జీవన్‌రాయ్‌ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement