Young
-
ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్‌లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!యాంటీ ఏజింగ్ టిప్స్‌లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని చెక్ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు. ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం. జంక్ ఫుడ్‌కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి. మసాజ్: శారీరక ఆరోగ్యానికి మసాజ్ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్‌గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు. -
సూపర్‌గా డ్యాన్స్ చేస్తున్న యువతి..ఒక్కసారిగా..
భోపాల్:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. Madhya Pradesh - A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు. -
యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్‌టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్‌టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్‌లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్‌దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
2024: బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూనే అదరగొట్టిన యంగ్ సెన్సేషన్స్ (ఫోటోలు)
-
ఏళ్లు గడుస్తున్నా యంగ్‌గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్‌లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!) -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
వడాపావ్ అమ్ముతూ రోజుకు రూ.40 వేల సంపాదన.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
Jr NTR Unseen Photos: ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేకమైన ఫోటోలు
-
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
Birthday Special: యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు
గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి. అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్ -
‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది
చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత పాత్ర. ‘గో నిషా గో’ గేమ్‌లో ప్రధాన పాత్ర. ‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్ గేమ్ ‘గో నిషా గో’ యువ యూజర్లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్ ఇది. డిజిటల్ గేమ్ ప్లాట్‌ఫామ్ ‘గేమ్ ఆఫ్ చాయిస్ నాట్ చాన్స్’ నుంచి వచ్చిన తొలి గేమ్ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్ నాన్– ప్రాఫిట్ సంస్థ గర్ల్ ఎఫెక్ట్ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్‌లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ కంట్రీ డైరెక్టర్ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్ మెన్స్ట్రూయెల్ హెల్త్ హెల్ప్‌లైన్‌తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్‌లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. అవగాహన పెంచుతోంది... ‘గో నిషా గో’ గేమ్ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఈ ఆట పెంచింది. ఈ గేమ్ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్ డెలాఫీల్డ్ ఇంటర్నేషనల్(హెచ్‌డిఐ) ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది. హెచ్‌డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్‌డిఐ’ కో–ఫౌండర్ సుసాన్ హోవార్డ్. వీడియో గేమ్స్ అంటే పవర్‌పుల్ వెపన్స్, పవర్ఫుల్ ఫైట్స్ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్... మొదలైన వాటి గురించి అవగాహన కలిగిస్తోంది ఫ్రీ మొబైల్ గేమ్ గో నిషా గో. ఈ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సీరియస్ గేమ్’ అవార్డ్ గెలుచుకుంది...! -
మహిళలకు అసభ్య మెసేజ్‌లు.. పోకిరిని చితక్కొట్టిన బంధువులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతులను వేధిస్తోన్న ఓ పోకిరిని బాధితుల బంధువులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో పనిచేసే సికిందర్(26) గంజాయికి బానిసయ్యాడు. డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వచ్చే మహిళలు, యువతుల ఫోన్ నంబర్లు తీసుకుని.. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని కొందరు మహిళలు వారి బంధువులకు తెలపడంతో పోకిరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గాయపడిన సికిందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదీ చదవండి: ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్ -
19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..
చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..? రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది. ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్‌గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్‌గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్‌గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ. ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది. అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది. ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్‌లోని ఏడు గ్రామాలకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ. (చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!) -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్‌లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్‌కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్‌ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్‌గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్‌కి సడెన్‌గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్‌లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్‌కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్‌తో జాన్సన్‌ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్‌ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
హైదరాబాద్‌లో విషాదం.. ఫైనాన్షియర్స్ వేధింపులు తాళలేక..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్ సులేమాన్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తౌఫిక్‌ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్ బెదిరింపులకు గురిచేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన రౌడీషీటర్స్ కొట్టడంతో భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది? -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్‌ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే..
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ మెషీన్లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్‌లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్‌రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్, ఆధార్ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్ యాదవ్ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్.. రాహుల్ యాదవ్ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు?
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది. కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మద్యం మత్తుకు బానిసలైన సోదరులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్‌నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్‌ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కోటీశ్వరుడయ్యాడు
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యులు సైతం కోటీశ్వరులు కావచ్చని నిరూపించి చూపిస్తున్నాడు పదహారేళ్ల యువకుడు దిగ్విజయ్ సింగ్. అతడు సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కరోనా కారణంగా ఇళ్లలోనే జైల్లోలా కష్టంగా గడిపిన రోజులవి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా హఠాత్తుగా దొరికిన బోలెడంత సమయాన్ని ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితులు. ఉదయపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఏమి తోచుబాటుగాని ఆ సమయంలో.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాడు. అనుకున్న వెంటనే యూట్యూబ్‌లో చాక్లెట్స్ తయారీ గురించి చూశాడు. చాక్లెట్స్ తయారీ సులభంగా ఉండడంతో ఇంట్లో తయారు చేశాడు. దిగ్విజయ్ చేసిన చాక్లెట్లు రుచిగా ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో మరిన్ని చాక్లెట్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు మహవీర్ సింగ్‌కు చెప్పడం, అతనికి ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి చాక్లెట్లు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. గిఫ్ట్‌బాక్స్‌ను చూసి... పదహారేళ్ల తన స్నేహితుడితో కలిసి యూట్యూబ్ సాయంతో చాక్లెట్స్, వివిధ రకాల డిజర్ట్లు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచేవాళ్లు. దీపావళికి దిగ్విజయ్ తండ్రి కారు కొన్నాడు. కారు షోరూం వాళ్లు కారుతోపాటు చాక్లెట్ బాక్స్‌ను గిప్ట్గా ఇచ్చారు. షోరూంలో కారు కొనే కస్టమర్లందరికీ చాక్లెట్ బాక్స్‌లు గిప్ట్గా ఇస్తున్నారని దిగ్విజయ్‌కి తెలిసింది. వెంటనే హోటల్, కార్షోరూం యజమానులను కలిసి కాంప్లిమెంటరీగా ఇచ్చేందుకు తాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ ఇస్తానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోవడంతో చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. రెండేళ్లలో రెండుకోట్లు ఒక కార్ షోరూం వాళ్లు వెయ్యి చాక్లెట్స్ కావాలని 2021లో తొలి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే ‘సరామ్’అనే పేరుతో చాక్లెట్ విక్రయాలు ప్రారంభించాడు. చాక్లెట్స్ రుచిగా ఉండడంతో .. విక్రయాలు క్రమంగా పెరిగి ఏడాదిలోనే మంచి ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు టన్నులకు పైగా చాక్లెట్ విక్రయాలు జరిగాయి. దీంతో రెండేళ్లలోనే ‘సరామ్’ రెండు కోట్లను ఆర్జించింది. సరికొత్తగా... సాదా సీదాగా కాకుండా దేశంలో దొరికే రకరకాల పండ్లు, మసాలాలను ఉపయోగించి చాక్లెట్స్‌ను సరికొత్తగా తయారు చేసి విక్రయిస్తున్నాడు దిగ్విజయ్. కేరళ, తమిళనాడునుంచి కోకోపొడి, చాక్లెట్స్‌లో వాడే పండ్లను బాగా పండే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నాణ్యమైన రుచికరమైన చాక్లెట్స్‌ను తయారు చేస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, ఉదయ్‌పూర్, జైపూర్లలో సరామ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఉదయ్‌పూర్, జైపూర్లలో స్టోర్లు, ఆఫ్లైనేగాక, ఆన్లైన్లో చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే కోట్లు సంపాదించవచ్చుననడానికి దిగ్విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే ) -
మణిపూర్ ఘటన: అదే రోజు మరో ఇద్దరు యువతులపై దారుణం..
ఇంఫాల్: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విచారకర ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన రోజే మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్పోక్పి జిల్లాలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో 21,24 ఏళ్ల బాధిత యువతులు కార్ల వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. మహిళల నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కొంత మంది మహిళలతో కూడిన అల్లరి మూకలు వారిపై దాడి చేశారు. బాధిత మహిళలను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయాల్సిందిగా అల్లరి మూకల్లోని మహిళలే ప్రోత్సహించారని ప్రత్యక్ష సాక్షులు టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన ఇంటర్య్వూలో తెలిపారు. గదిలోకి ఈడ్చుకెళ్లిన బాధిత మహిళల ఆర్తనాధాలు తమ చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయని, ఆ భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇదీ చదవండి: Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం.. జనాలకు మణిపూర్ పోలీసుల విజ్ఞప్తి అత్యాచార ఘటనల బాధితులు భయం కారణంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. చివరకు ఓ బాధిత యువతి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారు కూతురుతో సహా మరో యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ బాధిత యువతులు మృతదేహాలు లభ్యం కాలేదు. అల్లరి మూకలు 100 నుంచి 200 మంది వరకు ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మణిపూర్ పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వరిని అరెస్టు చేయలేదు. అయితే.. అల్లర్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. మణిపూర్‌లో మే3న అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 125 మంది మరణించారు. 40,000 కుపైగా మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు. జాతుల మధ్య వైరంతో రెండునెలలుగా మణిపుర్ రాష్ట్రం భగ్గుమంటోంది. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4న ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు క్రూరత్వానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. సరిగ్గా అదే రోజు ప్రస్తుత ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన -
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్‌లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
యువకునిపై చిరుతపులి దాడి
కర్ణాటక: యువకునిపైన చిరుతపులి దాడి చేసి గాయపరిచిన సంఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని రామేనహళ్ళి బెట్ట తప్పలి వద్ద చోటు చేసుకుంది. రామేనహళ్ళికి చెందిన అనిల్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఊరి బయట మండపం వద్ద కూర్చుని ఉండగా, కొండపై నుంచి వచ్చిన చిరుత అతని మీదకు దూకింది. ఈ దాడిలో అతనికి భుజం, కడుపులో గాయాలయ్యాయి. మిగతావారు గట్టిగా కేకలు వేయడంతో చిరుత పరారైంది. వెంటనే గ్రామస్తులు అతన్ని హుణసూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. హంతక చిరుత బందీ బాలికను బలి తీసుకున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులోకి చిక్కింది. చామరాజనగర జిల్లా కొళ్ళెగాల తాలూకా మదువనహళ్లి సమీపంలోని సిద్దేశ్వర బెట్ట వద్ద చిరుత దొరికింది. కగ్గలిగుందిలో గత నెల 26న ఆరేళ్ల బాలికను చిరుత లాక్కుపోవడానికి యతి్నంచింది, ఈ ఘటనలో బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. అలాగే కంచహళ్ళి గ్రామంలో రైతు పైన దాడి చేసింది. గత 19 రోజులుగా ఈ చిరుత కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు జరిపి బోనులు పెట్టడంతో దొరికింది. అటవీ సిబ్బంది దానిని తీసుకెళ్లారు. -
యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్
ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే -
Hyderabad: బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
సాక్షి, హైదరాబాద్: హయాత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓఆర్ఆర్ పరిసరాలకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి చేరుకున్న బాలికను.. రక్షించిన హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: దూసుకొచ్చిన మృత్యువు క్షణాల్లోనే ఘోరం -
యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..
సాక్షి, హైదరాబాద్: యువకుడి బైక్‌పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు. మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్‌ఘాట్ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం -
హాయ్ చెప్పినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్‌కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? -
Viral Video: బాల్కనీ నుండి బోర్లా పడ్డాడు..!
-
వైజాగ్‌లో కిడ్నాప్.. తాడివారిపల్లెలో హత్య
పొదిలిరూరల్: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్‌పోస్ట్ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్‌సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇంటర్ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్‌కుమార్ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్‌సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్‌కుమార్ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్‌సాయి విశాఖపట్టణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్ శివకిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్‌రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్‌పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్ నిర్ణయం
దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె, ప్రవీణ్‌కుమార్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్(24) అప్పుడప్పుడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత.. -
సికింద్రాబాద్: స్నేహితుడు చేతిలో యువకుడి హత్య
-
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
Viral Video: వాగులో పడిన కుక్క.. ప్రాణాలు తెగించి కాపాడిన యువకుడు
-
నడిరోడ్డుపై వేట కొడవలితో మహిళపై దాడి...అంతలో...
కొచ్చి: ఒక వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవలితో ఒక మహిళపై దాడి చేసేందుకు తెగబడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ ఘటన కాలూర్లోని అజాద్ రోడ్డుపై పట్టపగలే బహిరంగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు, ఇద్దరు మహిళల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ యువకుడు వేటకొడవలితో ఒక మహిళ తలపై దాడి చేసేందుకు పలుమార్లు యత్నించగా.. పక్కనే ఉన్న మరో మహిళ గట్టిగా అడ్డుకోవడంతో ఆమె చేతికి త్రీవ గాయలయ్యాయి. ఆ తర్వాత సదరు యువకుడు ఆ కొడవలిని అక్కడే పడేసి మోటార్ బైక్‌పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని, దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. పోలీసులు నిందితుడి ఆచూకి కోసం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. ‘అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి’..) -
కేక్ కట్ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..? -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..
కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్ బర్త్‌డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్‌గోల్డ్ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య -
ఏం జరిగిందో.. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే.. అంతలోనే అదృశ్యం
సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మండల పరిధి కడపాయపల్లె గ్రామ పంచాయతీలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సౌమ్య(20) అదృశ్యమైనట్లు తండ్రి నరసింహులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తులసీనాగప్రాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సౌమ్య కడప నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో లేక పోవడంతో గాలించారు. గ్రామంలో కనిపించక పోవడంతో సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ.. -
Vizag: ఏం జరిగిందో..? ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా..
అల్లిపురం(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటికివెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కనకలవీధికి చెందిన దోని చంద్రకళ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం దోని జగదీశ్వరి (24) తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. ఈ నెల 10వ తేదీ ఉదయం 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె కోసం నగరంలో పలు ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోను వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన జగదీశ్వరి ఎత్తు సుమారు 155 సెంటీమీటర్లు. చామనఛాయతో, గుండ్రని ముఖం కలిగి ఉందని, నీలం రంగు ఫ్యాంటు, బిస్కట్ కలర్ టీషర్టు వేసుకుని ఉందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 6440796010 ఫోన్ నంబర్లలో తెలియజేయాలని కోరారు. -
వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..
కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్‌కుమార్ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్‌కుమార్ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి..
అట్లూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని లింగాలకుంట ఎస్టీ కాలనీకి చెందిన పేరూరు మధుభారతి (21) అనే యువతి అదృశ్యమైంది. ఎస్ఐ నాగ చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధుభారతి గురువారం కడపలోని తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బస్సులో బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకోకపోవడంతో.. బంధువులు, స్నేహితులను కుటుంబ సభ్యులు విచారణ చేశారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో యువతి తల్లి గోపాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ -
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్‌ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్‌ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?
పొదలకూరు(నెల్లూరు జిల్లా): ఏడేళ్లుగా ప్రేమించి, మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చేజర్ల మండలం ఏటూరుకు చెందిన యువతి, పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన హరినారాయణ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిపోయాడు.. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని యువతి కోరగా, ఆ యువకుడు స్పందించలేదు. దీంతో బాధితురాలు ప్రియుడు హరినారాయణ తనను నమ్మించి మోసం చేశాడంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ అరుణ, సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను ఎస్సీ కులం కావడంతో హరినారాయణ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. పోలీసులు వెంటనే హరినారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. హరినారాయణతోనే తన వివాహం జరిపించాలని విజ్ఞప్తి చేసింది. -
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్‌లో ఉండే వడ్డె వినయ్‌కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్‌నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
అమ్మాయితో లవ్.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలోనే అబ్బాయి షాకింగ్ నిర్ణయం
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామానికి చెందిన కంసల మహేంద్ర (19) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మహేంద్ర తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో వారం రోజుల క్రితం ఆ యువతిని తీసుకుని బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కులాంతర వివాహానికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించలేదు. అంతేకాక ఇరు కుటుంబాల పెద్దలు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, గ్రామ పెద్దలు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో మనస్తాపం చెందిన మహేంద్ర శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే మహేంద్రను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..
పెదగంట్యాడ(విశాఖపట్నం): మండలానికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని నడుపూరులో గంపల దాముదమ్మ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. చదవండి: గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు.. ఈమె కుమార్తె గంపల లలితారాణి (19) ఈ నెల 8న పుట్టినరోజు సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లింది. తర్వాత ఇంటికి రాలేదు. దీంతో యువతి తల్లి, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో న్యూపోర్టు పోలీసులను సంప్రదించారు. న్యూపోర్టు హెచ్‌సీ పీవీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హర్షిణి ఎక్కడున్నావమ్మా.. తండ్రి తిట్టాడని..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): తండ్రి తిట్టాడనే మనస్తాపంలో కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... విఠల్‌వాడీలో ఉండే మనీష్నాయుడు తన కుమార్తె హర్షిణి(17)ని శనివారం రాత్రి కుటుంబ గొడవల కారణంగా కోప్పాడ్డాడు. చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ దీంతో ఆదివారం ఉదయం బయటికని చెప్పి వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా హర్షిణి ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్షిణి ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16314లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు. -
మోటార్‌బైక్‌పై దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు యువకుడు
సాక్షి, నెల్లూరు డెస్క్: రోజుకో కొత్త ప్రదేశం.. కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు.. కొత్త రుచులు.. ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలామంది బిజీ లైఫ్‌లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు నగరానికి చెందిన వెంకట కార్తీక్ తూపిలి ఏడాదిపాటు దేశాన్నే తన ఇల్లుగా చేసుకునేందుకు మోటార్‌బైక్‌పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు. చదవండి: గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు? నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో మల్లికార్జునరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తండ్రిది అరటికాయల వ్యాపారం. తల్లి గృహిణి. కొడుకు కార్తీక్ 2013 సంవత్సరంలో బీటెక్ చేశాడు. సంవత్సరంపాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలంపాటు ఆహా, తదితర చోట్ల వెబ్ సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కొత్త ప్రపంచంలోకి.. కార్తీక్‌కు మొదటి నుంచి ప్రకృతి, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లి మనుషులతో మాట్లాడుతుంటాడు. ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా మార్చుకోవడం అలవాటు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఇండియా మొత్తం చుట్టాలని 2021 చివర్లో నిర్ణయించుకున్నాడు. కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మమేకమవడం, మారుమూల పల్లెలకు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?, వారి సంస్కృతి, సంప్రదాయాలేంటో తెలుసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌బైక్‌పై యాత్రకు శ్రీకారం చుట్టాడు. 400 రోజులపాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 1,50,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ పేరుతో గిన్నీస్‌బుక్ రికార్డు సాధించాలని కార్తీక్‌కు ఉన్న మరో లక్ష్యం. అందుకోసం గిన్నీస్ రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు. రోజుకు 350కి పైగా కి.మీ. కార్తీక్ తొలుత మన రాష్ట్రంలో ఐదురోజులపాటు వివిధ ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత తమిళనాడుకి వెళ్లాడు. అలా పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా చుట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. ఈనెల 17వ తేదీ నాటికి 41,200 కిలోమీటర్లు తిరిగాడు. రోజుకు 350 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాడు. తన పర్యటనలో భాగంగా అధికంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. మొదట్లో భయమేసింది కార్తీక్ దేశమంతా బైక్‌పై తిరుగుతానంటే మొదట్లో భయమేసింది. సంవత్సరానికి పైగా దూరంగా ఉండాలి. ఆలోచించుకోమని చెప్పాం. వాడికి పట్టుదల ఎక్కువ. జాగ్రత్తగా వెళ్తానన్నాడు. ప్రోత్సహించాం. రోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంటాం. – మల్లికార్జునరావు, సుజాత, కార్తీక్ పేరెంట్స్ కుటుంబసభ్యుల సహకారం మోటార్‌బైక్ యాత్రకు కార్తీక్ కుటుంబసభ్యులు ఎంతగానో సహరిస్తున్నారు. తండ్రి ఆర్థికంగా అండగా నిలిచారు. అమ్మ, చెల్లి, బావ, స్నేహితులు పెళ్లూరు హరీ‹Ù, సూర్యప్రకాష్, సందీప్ (ఇతను 25,000 కి.మీ సైకిల్ యాత్ర చేశాడు.) ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తీక్ చెబుతున్నాడు. ఏం చేస్తాడంటే.. ఉదయం లేచాక ఆరోజు ఎంత దూరం వెళ్లాలి?, చూడాల్సిన ప్రదేశాలేంటి?, ఎక్కడ ఆగాలి? తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటాడు. దారి మధ్యలో గ్రామాల్లో ఆగుతాడు. స్కూళ్లు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతాడు. కొత్త ప్రదేశాలు చూస్తాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి ప్రయాణాన్ని ముగిస్తాడు. ఎవరైనా గ్రామస్తులు, పట్టణవాసులు ఆశ్రయమిస్తే అక్కడుంటాడు. లేకపోతే స్కూల్స్, గురుద్వారాలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి పక్కరోజు ఉదయం మరో ఊరికి ప్రయాణమవుతాడు. ఇవి అందుబాటులో లేనప్పుడు ట్రావెలర్స్ కోసం ఉన్న కౌచ్ సర్ఫింగ్ యాప్‌ను ఉపయోగించుకుంటాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలో టెంట్ వేసుకున్న సందర్భాలున్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఆరోజు చూసిన విశేషాలు, తీసిన ఫొటోలు తదితరాలను ది ట్రావెలర్ కార్తీక్ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. తిరిగిన రూట్, ఎన్ని కి.మీ ప్రయాణించింది తదితర వివరాలను గిన్నీస్‌బుక్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఘన స్వాగతం చెబుతున్నారు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అనుమానాలున్నాయి. వెళ్తున్న కొద్దీ అవన్నీ నివృత్తి అయిపోయాయి. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా వెళ్లిన ప్రతిచోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రేమని పంచుతున్నారు. తమిళనాడులోని మల్లిపట్టినం హార్బర్లో టెంట్ వేసుకుని ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఊర్లోకి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అక్కడి విశేషాలు చెప్పారు. మహారాష్ట్రలోని అహ్మద్పూర్కి వెళ్లినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నన్ను చూసి హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాను బైక్‌పై ట్రావెలింగ్ చేస్తానన్నాడు. ప్రకృతి, ట్రావెలింగ్ జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి. నా ప్రయాణంలో నేను ఎన్నో చూశాను. మా అమ్మా, నాన్న వల్లే ఈ యాత్ర సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడం ఇవ్వాలి. అప్పుడే వారు తమకు నచ్చిన రంగాల్లో రాణించగలరు. – కార్తీక్ -
నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్‌ను నమ్మించి..
మాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్‌కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్ వరుని కోసం మాట్రిమోని వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్ సియాన్ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్‌ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల లక్ష యూరోలతో వచ్చాడు.. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్ చేయించాడు. ఆమె డాక్టర్‌తో మాట్లాడుతూ.. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్‌ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది. దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్ సియాన్ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్ వారు చెప్పిన అకౌంట్‌కు రూ.19,59,920లను డిపాజిట్ చేశారు. దీని తరువాత వారు ఫోన్లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..
చిల్లకల్లు(జగ్గయ్య పేట):ఎన్టీఆర్ జిల్లా: ఒక్క రోజు ఆగితే.. తాను కోరుకున్న ఉద్యోగంలో చేరిపోయేది. ఏమయ్యిందో ఏమో.. ఈలోపే ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) బీటెక్ పూర్తి చేసి, కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. పలు కంపెనీలకు ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. ఉన్నట్టుండి శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిన శ్వేతా చౌదరి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్ యూ..’ అంటూ తన ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేతా వాయిస్ మెసేజ్ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్ మెసేజ్ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది. ఆన్లైన్ వేధింపులే కారణమా? శ్వేతా చౌదరికి ఇటీవల ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆమె ఖాతాకు రూ.90 వేలు పంపి, ఆ మొత్తాన్ని మరో వ్యక్తికి పంపాలని విజ్ఞప్తి చేయటంతో శ్వేతా అతను చెప్పినట్లుగానే ఆ డబ్బును మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే, ఇదే అదునుగా ఆ వ్యక్తి శ్వేతాను పలు విధాలుగా వేధింపులకు గురి చేశాడు. తన ఖాతాకు రూ.5 లక్షలు పంపాలని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు. అతని వేధింపులు భరించలేకే శ్వేతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సిన తమ కుమార్తె ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులై విలపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): ఒక వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ఎ.సురేష్ అనే యువకుడు ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంటికి వెళ్లి, చేయి పట్టుకుని తన కోర్కె తీర్చమని బలవంతపెట్టాడు. చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గతంలో కూడా సురేష్ ఆమెను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్టు, ఆ విషయాన్ని పెద్దలకు తెలిపినా ఫలితం లేకపోయిందని ఫిర్యాదులో వెల్లడించినట్టు పేర్కొన్నారు. -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..
కంకిపాడు (పెనమలూరు)కృష్ణా జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న యువకుడిపై కంకిపాడు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ వై. దుర్గారావు కథనం మేరకు.. మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన యువతి (23), గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొండేటి అలెగ్జాండర్ బంధువులు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అలెగ్జాండర్ నమ్మించాడు. అయితే మరో యువతితో అతను పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు. చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..? -
పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి..
గన్నవరం(కృష్ణా జిల్లా): వివాహితను వేధింపులకు గురిచేస్తున్న మాజీ ప్రేమికుడిపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని దావాజీగూడేనికి చెందిన యువతికి కళాశాలలో చదువుకునే రోజుల్లో కర్నూలుకు చెందిన సహ విద్యార్థి విక్రమ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే పెద్దలు కుదిర్చిన సంబంధం మేరకు ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమ్ గతంలో ఆమెతో దిగిన సెల్పీలు, ఫొటోలను ఆమె అత్తమామల సెల్‌ఫోన్‌కు పంపించి వేధిస్తున్నాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. చదవండి: ఏడేళ్లగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్‌కు ఫోన్ చేస్తే.. -
Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. -
‘బుల్లెట్’ బండి కోసం ప్రాణాలు తీసుకున్నాడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటు న్నారు. చదవండి👉: సాఫ్ట్వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో.. లక్ష్మి కూలి పనులు, తల్లి వద్ద ఉంటున్న కుమారుడు కార్తీక్ డేకరేషన్ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం కార్తీక్ బుల్లెట్ కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్తాడు అమ్మి రూ.50 వేలు డౌన్ పేమెంట్‌గా కట్టి బుల్లెట్ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో శుక్రవారం కంపెనీ సిబ్బంది వచ్చి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాత్రి అంతా ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెప్పుకొంటూ మానసిక క్షోభ అనుభవించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు -
ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?
గుంటూరు రూరల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్‌కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. -
నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే?
కాకినాడ క్రైం: నచ్చని పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆదివారం సాయంత్రం కాకినాడ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయం పైకి ఎక్కి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుస్తుండగా చూసిన వారు గమనించి ఆమెను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సర్పవరం ఐడియల్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల దోబా దుర్గాదేవికి ఇంట్లో వారు నచ్చని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై కొద్ది రోజులుగా ఆమెకు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. ఈ నేపథ్యంలో బాబాయి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆదివారం జరిగి ఈ ఘటనతో మనస్థాపం చెందిన యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఉన్న ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయంపైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నం చేస్తుండగా అక్కడి వారు గమనించి నిలువరించారు. అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను రక్షించి కిందికి దించారు. అక్కడికి చేరుకున్న త్రీ టౌన్ సీఐ కృష్ణ యువతితో మాట్లాడి కౌన్సెలింగ్ కోసం జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ కేంద్రానికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆడుకుందామని వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై..
పెద్దాపురం(కాకినాడ జిల్లా): ఆడుకుందామని వచ్చిన చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో చోటు చేసుకుంది. దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ బి.అప్పారావు, సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐ రావూరి మురళీమోహన్‌లు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు ఇంటి వద్ద విచారణ చేపట్టారు. చదవండి: చదువుకు దూరమై.. బతకడం భారమై.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు చెక్కిడాల రాజా తమ కుటుంబంలో ఉన్న బాలుడితో ఆడుకునేందుకు వచ్చిన ఐదేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పూర్తిగా విచారించగా ఇతడు ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. ఘటనకు సంబంధించి చిన్నారి మాటలు, అక్కడ ఉదయం జరిగిన సంఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. -
బీటెక్ ఫెయిలవ్వడంతో.. ఉప్పుటేరులో దూకి..
కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురం వంతెన నుంచి సోమవారం రాత్రి ఉప్పుటేరులోకి దూకిన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు లభ్యం కాలేదు. ఘటనపై జానపురెడ్డి వెంకటరమణ తన కుమారుడు 22 ఏళ్ల దుర్గాప్రసాద్ ఏటిలోకి దూకాడని కాకినాడ వన్ టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. చదవండి: కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో.. బీటెక్‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవ్వడంతో మనోవేదనకు గురయ్యాడని, మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా ద్విచక్రవాహనం దిగి జగన్నాథపురం వంతెన నుంచి ఉప్పుటేరులోకి దూకాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటరమణ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డ్రగ్స్‌కు బానిసై హైదరాబాద్ యువకుడు మృతి
-
రాష్ట్రంలో తొలి డ్రగ్స్ మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మితిమీరి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణాలు కోల్పోయాడు. రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి డ్రగ్స్ పెడ్లర్‌గా మారిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి, విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారికంగా పోలీసు రికార్డుల్లో నమోదైన తొలి డ్రగ్స్ సంబంధిత మరణం ఇదేనని వెల్లడించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ వివరాలను వెల్లడించారు. చనిపోవడానికి ముందు సదరు యువకుడి పరిస్థితిని తెలిపే వీడియోను ప్రదర్శించారు. డ్రగ్స్ పెడ్లర్ విచారణలో.. హైదరాబాద్‌లోని డీడీ కాలనీకి చెందిన ప్రేమ్ ఉపాధ్యాయ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. తర్వాత డ్రగ్స్ విక్రయించే పెడ్లర్‌గా మారిపోయాడు. తరచూ గోవాకు వెళ్లి ఎల్ఎస్డీ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ తెచ్చేవాడు. నగరానికే చెందిన లక్ష్మీపతి అనే వ్యక్తి నుంచి గంజాయి సంబంధిత డ్రగ్ హష్ ఆయిల్ కొనేవాడు. సింథటిక్ డ్రగ్ పిల్స్ ఒక్కోటీ రూ.3 వేలకు, ఐదు గ్రాముల హష్ ఆయిల్ రూ.3 వేలకు అమ్ముతున్నాడు. ఇటీవల అలా డ్రగ్స్ విక్రయిస్తుండగా నల్లకుంటలో ‘హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ)’ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర తరచూ డ్రగ్స్ కొనే రామకృష్ణ (సాఫ్ట్వేర్ ఉద్యోగి), నిఖిల్ జోష్వా (గిటార్ టీచర్), జీవన్‌రెడ్డి (బీటెక్ విద్యార్థి)లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేద్దామని వెళితే.. ప్రేమ్ వద్ద మరో యువకుడు కూడా డ్రగ్స్ కొనేవాడని తెలిసి అతడి ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు షాకయ్యారు. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మూడు రోజుల క్రితం చనిపోయాడని వారికి తెలిసింది. దీనిపై వారు ఆరా తీయగా.. సదరు యువకుడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని, ప్రేమ్‌తో కలిసి గోవా పార్టీలకు వెళ్లేవాడని తెలిసింది. రెండు వారాల క్రితం గోవాలో జరిగిన పార్టీలో సదరు యువకుడు వరుసగా ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టసీ పిల్స్, హష్ ఆయిల్ వంటి డ్రగ్స్ తీసుకున్నాడని.. ఓవర్‌డోస్ కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడని బయటపడింది. కుటుంబ సభ్యులు అతను కొద్దిగా కోలుకున్నాక హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. క్లరోసిస్ స్ట్రోక్‌తో నరాల పటుత్వం కోల్పోయాడని, చికిత్స లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిరోజులు మంచంపైనే ఉన్న అతను.. మూడు రోజుల క్రితం కన్నుమూశాడు. ఆ పార్టీలో మరికొందరు కూడా.. సదరు యువకుడితో పాటు గోవాలో పార్టీకి మరో ఏడుగురు కూడా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు కాగా, నలుగురు పబ్స్‌లో పనిచేసే డీజేలని తెలిసింది. వారిలోనూ కొందరు అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. కాగా.. డ్రగ్ పెడ్లర్ ప్రేమ్‌కు హష్ ఆయిల్‌ను సరఫరా చేసిన లక్ష్మీపతిని పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సదరు లక్ష్మీపతి ఇప్పటికే మూడుసార్లు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యాడని.. అయినా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. మరో కేసులో.. మరో నలుగురు.. హైదరాబాద్‌లోని బాపూజీనగర్‌కు చెందిన వి.రమేశ్ (21) కేజీల లెక్కన హష్‌ఆయిల్ కొని, చిన్న బాటిళ్లలో నింపి అమ్ముతుంటాడు. దీనిపై సమాచారం అందిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం డెయిరీఫామ్ రోడ్డులో తిరుమలగిరికి చెందిన సాయికుమార్ (25), బాపూజీనగర్‌కు చెందిన నవీన్‌కుమార్ (29)లకు హష్‌ఆయిల్ విక్రయిస్తుండగా.. ‘హెచ్–న్యూ’, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రమేశ్‌కు సహకరించిన కె.సాయిప్రకాశ్ (19)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 గ్రాముల హష్‌ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద హష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే..
కర్నూలు: ‘మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేసి మోసం చేయడమే కాక నా పైన, నా కుటుంబ సభ్యులపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టారు. భార్య తరఫు బంధువులు అమీన్‌బాషా, మాసూంబీ, షేక్షా, షాషా, మైమూన్, ఆశ వేధించారు. వారి సూటిపోటి మాటలు తాళలేకపోతున్నా. నా చావుకు కారకులు వీరే. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయండి’ అంటూ ముదిరాజ్‌నగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ బాషా (24) సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నబిసాహెబ్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు షేక్ హుస్సేన్‌బాషా ఓ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి కల్లూరు ఎస్టేట్‌కు చెందిన హుస్సేన్‌బీ కుమార్తె షాహీన్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దలు పంచాయితీ చేసి సర్ది చెప్పి కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే షాహీన్ భర్తతో మళ్లీ గొడవపడి మూడు నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇటీవల షాహీన్ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సెలింగ్‌కు పిలిపించడంతో హుస్సేన్‌బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తండ్రి నబిసాహెబ్ తెల్లవారుజామున గుర్తించి ఉరి నుంచి తప్పించి వైద్య చికిత్సల నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య తరఫు బంధువుల వేధింపులు తాళలేకనే తన కుమారుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు నాల్గవ పట్టణ ఎస్ఐ రామయ్య తెలిపారు. సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫేస్బుక్ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): ఆ యువతి ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు సూళ్లూరుపేటకు వచ్చింది. కుమార్తె కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే స్పందించి ఆమెను కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్కిల్ పరిధిలోని పెదవేగికి చెందిన యువతికి (18)కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి.. గడిచిన సంవత్సర కాలంగా ఫేస్బుక్లో పరిచయమైన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన వేములసాయి కోసం సోమవారం ఉదయం తన ఊరి నుంచి బయలుదేరి సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకుంది. ఉద్యోగం ఇప్పించాలని అతడిని కోరింది. ఉద్యోగం తీసిచ్చేవరకు తడ మండలం కొండూరులోని ఓ హాస్టల్లో ఉండమని సాయి యువతిని వదిలిపెట్టి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసి సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నట్టుగా కనుక్కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు ఈ విషయంపై సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై రవిబాబు, నైట్ బీట్‌లో ఉన్న సిబ్బంది జార్జి, ప్రదీప్, కిరణ్ సమయస్ఫూర్తితో యువతి ఫోన్ ఆధారంగా లోకేషన్ గుర్తించి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ వార్డెన్‌ను విచారించారు. పెదవేగి పోలీసులు అందించిన ఆధారాలతో యువతిని గుర్తించి నిర్ధారించుకుని మహిళా కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఆమెను తీసుకొచ్చారు. ఆ యువతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం బాధిత యువతి తల్లిదండ్రులు, పెదవేగి పోలీసులు సమక్షంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వారికి అప్పగించారు. యువతి ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ చూపించిన ఎస్సై రవిబాబుకు, ఇతర సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు ప్రకటించగా వాటిని డీఎస్పీ అందజేశారు. -
అమ్మా నన్ను క్షమించు.. ఈ లోకంలో బతకాలని లేదంటూ..
తోటపల్లిగూడూరు(నెల్లూరు జిల్లా): ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదంటూ’ ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు భీంరావ్‌నగర్‌కు చెందిన గూటం ప్రేమ్‌కుమార్(27) ఏసీలు రిపేరు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమ్‌కుమార్ తండ్రి గూటం పౌల్ ఇంటి పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా కాపురం ఉంటున్నాడు. చదవండి: బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి.. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రేమ్‌కుమార్ ఇంట్లో మంటల వ్యాపించడంతో ప్రేమ్‌కుమార్ సోదరుడు ఆనంద్ స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చి ఇంట్లోకి వెళ్లారు. వంటింట్లో ప్రేమ్‌కుమార్ తీవ్రగాయాలతో కన్పించాడు. చికిత్సనిమిత్తం అతనిని నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ప్రేమ్‌కుమార్ చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రేమ్‌కుమార్ రాసిన ఓ లేఖను వంటగదిలో పోలీసులు గురువారం స్వాధీనం చేసుకొన్నారు. ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదు.. అందుకే చనిపోతున్నానని’ ప్రేమ్‌కుమార్ రాసిన లేఖను చూసి అతని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని చిన్న ఓబినేనిపల్లెలో యువకుడి హత్య జరిగినట్లు మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాసరెడ్డి తన పొలంలోకి కూలి పనులకు వచ్చే ఓ వివాహితతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే మహిళతో ఎనిమిది నెలల నుంచి గోపు శ్రీనాథరెడ్డి అనే వ్యక్తి కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చదవండి: పిల్లలతో పుట్టింటికి వచ్చి.. ఇంతలో ఏమైందో కానీ.. పొలం పనులకు వెళ్లినప్పుడు ఆమెకు ఖర్చులకు నగదు ఇస్తూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ తన వద్దకు రాకుండా శ్రీనాథరెడ్డి అడ్డుకుంటున్నాడని అతడిపై శ్రీనివాసరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం సమయంలో శ్రీనాథరెడ్డి మొక్కజొన్న పొలంలో నీరు పెట్టుకుంటుండగా శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్లాడు. మాటల్లో పెట్టి పొలంలో ముందు వైపున నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనాథరెడ్డి తలపై రంపపు కొడవలితో దాడి చేశాడు. కిందపడిపోయిన వెంటనే గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించినందుకు ఎస్పీ మలికాగర్గ్ అభినందనలు తెలిపారన్నారు. గిద్దలూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్ఐ మాధవరావు పాల్గొన్నారు. -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫీల్డర్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 79 ఓవర్ వేసిన గ్రాండ్‌హామ్ బౌలింగ్‌లో.. జాన్సెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బౌండరీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యంగ్.. పరిగెత్తుకుంటూ వెళ్లి సింగ్ హ్యండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. యంగ్ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన జాన్సెన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కాగా యంగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివాన్ కాన్వే (92),టామ్ బ్లాండల్(44) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకున్నట్లైంది. చదవండి: Nicholas Pooran: 37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం Will Young takes one of the greatest catches in the cricket history 🔥#NZvSA #NZvsSA pic.twitter.com/klszfnjTJQ — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 28, 2022 -
నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు
కల్లూరు(కర్నూలు జిల్లా): ఆయన పొలం యాజమాని. ఆ పొలంలోనే ఓ యువతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఇరువురు ఇష్టపడ్డారు. ఏడాది పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా అంటూ యువతి బంధువుల ఎదుటే ప్రియుడికి బడితపూజ చేసింది. వివరాలు.. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా కుటుంబసభ్యులు వద్దంటున్నారని శేఖర్ బదులిచ్చాడు. చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఎందుకు నాన్న.. సీన్ కట్ చేస్తే.. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరగా శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలింపించుకుని తెలంగాణలోని బంధువుల ఊరికి తీసుకెళింది. ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిరాకరించిన ప్రియుడిని కర్రతో చితక బాదింది. ఈ ఘటన అక్కడున్న వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా సదరు యువతి ప్రేమ విషయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
ప్రేమికుడి కోసం యువతి హల్చల్.. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనే
అనంతపురం సిటీ: తాను ప్రేమించిన ఒంగోలు యువకుడితో పెళ్లి చేయాలంటూ అనంతపురంలో ఓ యువతి ‘సఖి’ సెంటర్లో హల్చల్ చేసింది. తల్లిదండ్రులను చూడగానే రగిలిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వాహకులకు సహకరించకుండా దాడికి యత్నించడం, తాను చెప్పిందే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులపై హుకుం చేస్తూ వీరంగం సృష్టించింది. గుంతకల్లు ప్రాంతంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న ఒంగోలు యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాదిగా వారిద్దరి మధ్య చాటింగ్‌లు కొనసాగాయి. ఇంతలోనే విషయం ఇంట్లో తెలిసి యువతిని పెద్దలు మందలించారు. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనేనని తెగేసి చెప్పి ఒంగోలు వెళ్లింది. అక్కడ ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కు తిరిగొచ్చింది. చదవండి: ‘హాయ్..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు బావ భరతం పట్టిన మరదలు న్యాయం కోసం ‘సఖి’ని ఆశ్రయించి.. ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ యువతి అనంతపురంలోని సఖి సెంటర్ నిర్వాహకులను గురువారం ఆశ్రయించింది. వారు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించలేదు. ప్రేమించినోడితేనే పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ ఆస్పత్రిపై నుంచి దూకేస్తానంటూ పారిపోయేందుకు యత్నించింది. అడ్డుకోబోయిన ఏఎస్ఐ గోవిందమ్మ, సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బందిపై ఎదురు దాడికి దిగింది. రాత్రంతా ఆమెను కాపలా కాయడం వారికి కష్టతరమైంది. చేసేది లేక ఆ అమ్మాయిని ఓ గదిలో పెట్టి గడియ బిగించారు. అంతే ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా తలుపులను గట్టిగా తన్నడంతో గడియతో సహా ఊడొచ్చాయి. ఊహించని ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు గురైన అధికారులు ‘దిశ’ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా కాపలా కాశారు.\ మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం.. ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే ఇక్కడే చస్తానని బెదిరిస్తూ గురువారమంతా నీళ్లు, ఆహారం ఏమీ తీసుకోకుండా నిరసన ప్రకటించింది. శుక్రవారం కూడా ఆహారం తీసుకోలేదు. తనకు సఖి సెంటర్ నిర్వాహకులు న్యాయం చేయడం లేదంటూ మీడియాకు సమాచారం అందించింది. విలేకరులు వచ్చాక రెండు మూడు గంటల తర్వాత నోరు విప్పింది. తనను ఎదురు ప్రశ్నించకూడదని, తను చెప్పింది మాత్రమే రాసుకోవాలని, రికార్డు చేసుకోవాలని విలేకర్లతోనూ వాగ్వాదం చేసింది. తల్లిదండ్రులు కనిపిస్తే కస్సుమంటోంది... తన ప్రేమ భగ్నం కావడానికి తల్లిదండ్రులు, అక్క,బావలే కారణమనే ఆగ్రహంతో ఊగిపోతున్న యువతి.. సఖి సెంటర్ నిర్వాహకుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారిని చూడగానే రగిలిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసింది చాలు. మీరెళ్లండి. నేను మాత్రం మీ వెంట ఇంటికి రానంటూ చీదరించుకుంది. చేతుల నిండా బ్లేడ్ గాయాలే.. ప్రేమించినోడి కోసం ఆ యువతి రెండు చేతులపై కోసుకున్న గాయాలే కనిపిస్తున్నాయి. వాడి కోసం అవసరమైతే చచ్చిపోవడానికైనా సిద్ధమేనంటూ, తన మనస్సు మార్చేందుకు ఎవరూ ప్రయత్నించొద్దంటూ ‘దిశ’ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ ధరణి కిశోర్ సహా మహిళా పోలీసులు, విలేకర్లతో యువతి వాదించింది. దీంతో గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పకు సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీస్ బృందం కూడా బయలుదేరి వచ్చింది. కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు యువతి మంకుపట్టు పడుతోంది. కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు. అబ్బాయితో మాట్లాడి, పిలిపిస్తామని చెప్పినా వినడం లేదు. ఎదురు దాడికి దిగుతోంది. నోటికొచ్చినట్లు తిడుతోంది. నేను, ఏఎస్ఐ, మా సిబ్బంది రెండ్రోజులుగా నిద్రాహారాలు మాని ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. – శాంతామణి, సఖి సెంటర్ నిర్వాహకురాలు చట్టప్రకారమే ముందుకెళ్తాం యువతి మానసిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు పిల్చుకెళ్తాం. వైద్యుడి సర్టిఫికెట్ రాగానే జడ్జి ఎదుట యువతిని హాజరుపరుస్తాం. ఆ తరువాత జడ్జి ఆదేశిస్తే విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రికి తరలిస్తాం. ఏదైనా చట్టం ప్రకారమే ముందుకెళ్తాం. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ, అనంతపురం -
ప్రేమపేరుతో బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు
జూపాడుబంగ్లా(కర్నూలు జిల్లా): ప్రేమ పేరుతో ఓ యువకుడు విద్యార్థినిని కిడ్నాప్ చేశాడు. మండలంలోని తంగెడంచ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంగెడంచ గ్రామానికి చెందిన కుర్వమల్లయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మూడో కుమార్తె వాణి జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. చదవండి: కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి.. అదే గ్రామానికి చెందిన మాబాషా కుమారుడు షేక్ ఫరూక్ గౌండపనిచేస్తుంటాడు. ఈ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించేవాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పటంతో వారు ఆ యువకుడిని మందలించారు. అయితే శనివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన వాణిని..ఫరూక్ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పారిపోయాడు. గ్రామస్తులు గమనించి బాలిక తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు వెంటనే జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మారుతీశంకర్ కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
యువతి ఫోన్ నంబర్ తీసుకుని ప్రేమాయణం.. ఓసారి అబార్షన్ కూడా.. చివరకు
సంతమాగులూరు (అద్దంకి)/ప్రకాశం జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మక్కెనవారిపాలెంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమార్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలి పనులకు కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యువకుడు ఆమెతో మాట కలిపాడు. బైకుపై మీ స్వగ్రామం తీసుకెళ్తానని చెప్పి ఆమె ఇంటి వద్ద దింపాడు. చదవండి: ‘నాన్న, చెల్లి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’ ఈ క్రమంలో యువతి ఫోన్ నంబర్ తీసుకున్న బాజీ ఆ తర్వాత ఫోన్ చేయసాగాడు. మాటమాటా కలిసి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఆమెకు గర్భం రావడంతో దాన్ని తీసి వేయించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బాజీ తిరస్కరించాడు. మనస్తాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువతి వైద్యశాలలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివన్నారాయణ తెలిపారు.