వారసత్వపు వెలుగు
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్‌తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్‌లలో భాగమైంది.
‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.
లోతైన పరిశోధన
‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్‌లో చేరగానే యువత దృష్టి డాక్టర్‌లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.
సవాల్‌గా నిలిచే రంగం
లేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ డిసెర్టేషన్‌పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం.
సంరక్షణ దిశగా పనులు
మా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్‌కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.
కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్.
Comments
Please login to add a commentAdd a comment