Ladakh
-
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
భారత్‌లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం
దేశంలోని పలుప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన చలి వాతావరణం నెలకొంది. ఈ చలికి తట్టుకోలేక జనం వణికిపోతున్నారు. మనదేశంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోయే పలు ప్రాంతాలున్నాయి. ఈ అంత్యత శీతల ప్రాంతాల పేరు చెప్పగానే పలువురికి చలితో పాటు వణుకు పుడుతుంది. ఆ ప్రదేశాలపై ఒక లుక్కేద్దాం.సియాచిన్ గ్లేసియర్ (Siachen Glacier)ఇది ఉత్తర కారాకోరం శ్రేణిలో ఉంది. సియాచిన్ భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి మాత్రమే కాదు.. ఇది మొత్తం ధ్రువేతర ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యధిక శ్రేణి హిమపాతం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది దేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో మొట్టమొదటిగా గుర్తింపు పొందింది. వేసవి నెలల్లో కూడా సియాచిన్‌లో ఉష్ణోగ్రత -10 సెంటీగ్రేడ్ డిగ్రీలకు తగ్గుతుంది. విపరీతమైన చలి కారణంగా పలువురు సైనికులు ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు.సెలా పాస్, తవాంగ్(Sela Pass, Tawang)సెలా పాస్.. సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం బౌద్ధ నగరమైన తవాంగ్‌ను తేజ్‌పూర్- గౌహతిలతో కలుపుతుంది. వేసవి కాలంలో ఇక్కడ చలి నుండి కొంత ఉపశమనం దొరుకుతుంది. శీతాకాలంలో చలి అత్యధికస్థాయిలో ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుంటుంది. సెలా పాస్ హిమాలయాల్లో 4,170 మీటర్ల ఎత్తులో ఉంది. అక్టోబర్, నవంబర్, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఈ నెలల్లో ఇక్కడ మంచు ఎక్కువగా ఉండదు. రోడ్లు కూడా సాధారణంగా ఉంటాయి. సెలా పాస్‌లో ఉష్ణోగ్రత -15 డిగ్రీల వరకు పడిపోతుంది.లేహ్, లడఖ్( Leh, Ladakh)లేహ్ మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ఎంతో గొప్పవి. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుంటుంది. శీతాకాలంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఇటువంటి పరిస్థితి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక్కడ అనేక ఆలయాలు, సరస్సులు ఉన్నాయి. ఇవి లేహ్‌ను సందర్శించదగిన ప్రదేశాలలో ఒకటిగా మలచాయి. లేహ్ సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉంది. లడఖ్‌లోని పర్వతాలు సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి.కీలాంగ్(Keylong)కీలాంగ్ ప్రాంతం లేహ్ ప్రధాన రహదారిలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3340 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ విల్లో చెట్లు, నీటి ప్రవాహాలు, మంచుతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత కూడా -2 డిగ్రీలకు పడిపోతుంది. ఈ ప్రదేశం మనాలి, కాజా, లేహ్ తదితర అందమైన పర్యాటక ప్రదేశాలకు అనుసంధానంగా ఉంది.లాచెన్, థంగు వ్యాలీ(Lachen and Thangu Valley)అత్యంత అందమైన మంచుతో కూడిన పర్వత శిఖరాలు ఉత్తర సిక్కింలో కనిపిస్తాయి. ఉత్తర సిక్కింలో లాచెన్, థంగు వ్యాలీలను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. లాచెన్, థంగు వ్యాలీ 2,500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. విపరీతమైన మంచు కూడా కురుస్తుంటుంది.ద్రాస్, కార్గిల్ ( Dras, Kargil)ద్రాస్.. భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశాన్ని "గేట్‌వే టు లడఖ్" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. కార్గిల్ జిల్లాలో ఉన్న ద్రాస్.. అమర్నాథ్, సియాల్కోట్లకు వెళ్లేవారికి ప్రధాని రహదారిగా ఉంది. సముద్ర మట్టానికి 10,761 అడుగుల (3,280 మీ) ఎత్తులో ద్రాస్ ఉంది. ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు, మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇది కూడా చదవండి: కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్‌రాజ్ -
లద్దాఖ్‌లో ‘క్వాంటమ్’ ఎర్త్ స్టేషన్
ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించించింది. సంప్రదాయ శాటిలైల్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సంప్రదాయ విధానాల్లో అయితే మెగాహెర్ట్జ్(ఎంహెచ్‌జెడ్), గిగాహెర్ట్జ్(జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీల్లో సమాచార మార్పిడి జరుగుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్లలో మాత్రం టెరాహెర్ట్జ్(టీహెచ్జెడ్) ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. దీంతో డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. క్వాంటమ్ ప్రసారాల రంగంలో తదుపరి పరిశోధనలకు గాను గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) సైంటిస్టులు అన్వేషణ ప్రారంభించారు. అడ్వాన్స్డ్ అబ్జర్వేటరీ కేంద్రాలైన లద్దాఖ్‌లోని హన్లే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ(ఐఏఓ), రాజస్తాన్‌లోని మౌంట్ అబూ అబ్జర్వేటరీ, నైనిటాల్‌లోని ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్ఐఈఎస్)ను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లోని ఓపెన్–సోర్స్ డేటాను విశ్లేషించారు. క్వాంటమ్ సంకేతాలను అంతరిక్షంలోకి పంపించడానికి హన్లేలోని ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని తేల్చారు. ఇక్కడే ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హన్లే గ్రామం సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నీరు ఆవిరయ్యే రేటు తక్కువ. క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలకు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుందని గుర్తించారు. ప్రభావవంతమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏర్పాటుకు క్వాంటమ్ సంకేతాలను భూవాతావరణం గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతరిక్షంలోకి పంపించడం అత్యంత కీలకం. అందుకు ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. క్వాంటమ్ సిగ్నల్స్‌ను ప్రాథమికంగా క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. ఇందులో అత్యంత సూక్ష్మమైన ఫో టాన్లు, ఎల్రక్టాన్లు, అణువుల ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది కాబట్టి నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. డేటా సెక్యూరిటీ విషయంలో క్వాంటమ్ టెక్నాలజీ పాత్ర నానాటికీ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నా రు. భవిష్యత్తులో అత్యాధునిక క్వాంటమ్ టెక్నా లజీ ప్రాజెక్టులకు ఇండియా కేంద్రస్థానంగా మా రుతుందని, ఇక్కడున్న భౌగోళిక వైవిధ్యమే అందుకు కారణమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
లద్ధాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.కాగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం
-
లడఖ్ బయల్దేరిన పోలీసులు మతమార్పిడిపై కేసు..?
-
లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదు
-
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్‌లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్‌నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ‘‘ లోక్‌సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు: అమిత్ షా
ఢిల్లీ: లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్‌లను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ప్రకారం లఢఖ్‌లో అభివృద్ధి, శ్రేయస్సును కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.In pursuit of PM Shri @narendramodi Ji's vision to build a developed and prosperous Ladakh, the MHA has decided to create five new districts in the union territory. The new districts, namely Zanskar, Drass, Sham, Nubra and Changthang, will take the benefits meant for the people…— Amit Shah (@AmitShah) August 26, 20242019లో పూర్వపు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలితం ప్రాంతంగా లఢఖ్ను సాధారణ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించిన విషయం తెలిసిదే. దీంతో లఢఖ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పరిపాలనా కొనసాగుతోంది. -
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
PM Narendra Modi: పొలిమేరల నుంచే హెచ్చరిస్తున్నా...
ద్రాస్ (లద్దాఖ్): కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధాలతో ఇప్పటికీ కవి్వంపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులరి్పంచారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా. ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’’ అన్నారు. పాతికేళ్ల కింద కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యునిగా సైనికుల మధ్య గడిపే అదృష్టం తనకు దక్కిందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూతల స్వర్గమైన కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు. సైనికులకు ఇవ్వాల్సిన పెన్షన్ నిధులను ఆదా చేసుకునేందుకే అగి్నపథ్ పథకం తెచ్చారన్న విపక్షాల విమర్శలను మోదీ తీవ్రంగా ఖండించారు. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నిత్యం యువ రక్తం ఉండేలా, సదా యుద్ధ సన్నద్ధంగా ఉండేలా చూసేందుకు తెచి్చన పథకమన్నారు. ‘‘వేల కోట్ల కుంభకోణాలతో సైన్యాన్ని బలహీనపరిచిన వాళ్లే ఇప్పుడిలా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై మతిలేని విమర్శలకు దిగడం సిగ్గుచేటు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు వాగ్దానాలు చేసింది కూడా వారే. మేం విజయవంతంగా అమలు చేస్తున్నాం’’ అన్నారు. టన్నెల్లో మోదీ ‘బ్లాస్ట్’ లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.‘విజయ్ దివస్’లో ముర్ము న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా నివాళులరి్పంచారు. మోదీపై విపక్షాల ధ్వజం సైన్యం కోరిన మీదటే అగ్నిపథ్ తెచ్చామంటూ మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. విజయ్ దివస్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పి అమర జవాన్లను అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఏ ప్రధానీ ఇలా దిగజారలేదంటూ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రస్తావనతో ఆశ్చర్యపోయామని నాటి ఆర్మీ చీఫే చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు, యువ రక్తం నింపేందుకు అగి్నపథ్ పథకం తెచ్చామనడం ద్వారా మన సైనికులను మోదీ ఘోరంగా అవమానించారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. -
26న కార్గిల్‌కు ప్రధాని మోదీ.. భారత విజయ రజితోత్సవాలకు హాజరు
పాకిస్తాన్‌తో 1999లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్‌లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. తాజాగా లధాక్ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా ప్రధాని పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాలను పరిశీలించారు.భారత విజయ రజితోత్సవాల సందర్భంగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్‌లో జూలై 24 నుంచి 26 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శిస్తారని, కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ద్రాస్ హెలిప్యాడ్ వద్ద భద్రత, స్వాగతం, మోదీ కాన్వాయ్‌కు అవసరమైన ఏర్పాట్లు, స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించే విధానం తదితర కార్యక్రమాల సన్నాహాలపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్‌లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని, ఆ తర్వాత షహీద్ మార్గ్(వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని ఆయన తెలిపారు. -
క్వీన్ రైడర్స్
‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది.. అబ్బాయితో సాగుతూ చిలిపి మదీ’ అంటూ మార్చేసి పాడేసే టైమ్ వచ్చేసింది. ఒకప్పుడు కింగ్స్‌కి మాత్రమే పరిమితమైన బైకింగ్ ఇప్పుడు క్వీన్స్‌కి కిరీటాలు అలంకరించేస్తోంది. ఈ క్రమంలో నగరానికి చెందిన నలుగురు మహిళల బృందం కూడా ఒక రేర్ రైడ్‌తో సిటీలో టాక్ ఆఫ్ ద బైకింగ్ క్లబ్‌గా మారారు. సొంత బైక్‌లపై పలు ప్రాంతాలను చుట్టేస్తూ..ప్రపంచంలోనే ఎత్తైన రోడ్లపై ప్రయాణంలఢాక్లోని ఉమ్లింగ్లా పాస్‌లో సాహస యాత్ర విభిన్న రంగాలకు చెందిన మహిళల్ని ఒకే బాట పట్టిస్తోంది బైక్ రైడింగ్. అలా వేర్వేరు రంగాలకు చెందిన నలుగురు నగర మహిళలు బైకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాజాగా లఢాక్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఉమ్లింగ్లా పాస్‌ను అధిరోహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించినప్పుడు తమ రైడింగ్ అనుభవాలు పంచుకున్నారు.. ఆ వివరాలు...సొంతంగా కొనుక్కున్న బైక్‌తో.. జూబ్లీíß గత కొంత కాలంగా బైక్ రైడింగ్ అలవాటైంది. మన ఇంట్రెస్ట్ కోసం పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకూడదని గూగుల్‌లో పనిచేసి, ఆన్లైన్ బిజినెస్.. ద్వారా రూ.1.50 లక్షలు సంపాదించి సొంతంగా యమహా ఆర్15 వి2 బైక్ కొన్నాను. గతంలో షార్ట్ రైడ్స్‌కి కొన్నిసార్లు వెళ్లాను. అయితే బైకర్ణీలో చేరాక లాంగ్ రైడ్స్ మీద ఆసక్తి బాగా పెరిగింది. ఉమింగ్లా పాస్ రైడ్ అనుకున్నప్పుడు గతంలో ఎన్నడూ అంత లాంగ్వ్కి వెళ్లకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం ఉండేది. కానీ.. గ్రూప్‌లో వెళ్లాం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఏమీ ఫేస్ చేయలేదు. మైనస్ డిగ్రీస్ చలిలో మా టార్గెట్ రీచ్ అవడం అద్భుతమైన థ్రిల్లింగ్ ఇచ్చింది. – గీతిక పోలిశెట్టి (28), ఫ్యాషన్ డిజైనర్బైక్ రైడింగ్ ఇష్టం.. మేం ఎల్బీనగర్ లో ఉంటాం. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ ఇష్టం. మా తాతయ్యకు లూనా ఉండేది. నేను వెనక ఎక్కేదాన్ని. ఆ తర్వాత మా నాన్నకి హోండా సీడీ 100 ఉండేది. ఆ బైక్ నేను డ్రైవ్ చేశాను. అందుకే నేను వాడిన నా ఫస్ట్ బైక్ జావా 42.. ఇప్పుడు బీఎండబ్ల్యూ జి3 10ఆర్ ఉంది. దీన్ని కేవలం లాంగ్ రైడ్స్‌కి వినియోగిస్తుంటాను. కర్ణాటక, హైదరాబాద్ టూ కన్యాకుమారి.. ఇలా టూర్స్ వెళ్లొచ్చాను. తొలి దశలో ఇంట్లో వాళ్లు కొంచెం భయపడ్డారు కానీ..ఇప్పుడు ఫుల్ కాని్ఫడెంట్గా ఉన్నారు. వీలైనంత వరకూ బైక్ రైడ్ ద్వారా మంచి మంచి ప్రదేశాలు చుట్టిరావాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత నేపాల్, టిబెట్ రైడ్ కి వెళ్లాలనేది ప్లాన్.. –సుష్మితారెడ్డి (27), బిజినెస్ ఎనలిస్ట్డ్రీమ్ రైడ్ అదే..మేం మోకిలాలో నివసిస్తున్నాం. మొదట నేను యమహా ఆర్ఎక్స్ 100 నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంత బైక్ అంటే బెనల్లీ టీఎన్టీ 25, ప్రస్తుతం బీఎండబ్ల్యూ జి310ఆర్ నడిపిస్తున్నాను. ఏడేళ్లలో సిక్కిం, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్లాం. ఎన్ని లాంగ్ రైడ్స్ వేసినా ఉమింగ్లా పాస్‌కు రైడ్ అనేది ఒక మరచిపోలేని అనుభూతిని అందించింది. మైనస్ డిగ్రీల వాతావరణం అలవాటు లేక కొంత ఇబ్బంది పడ్డాం. బైక్ స్కిడ్ అయి పడిపోవడం.. వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే థాంక్ ఫుల్లీ.. ఎవరికీ ఏమీ కాలేదు. టిబెట్, భూటాన్, వియత్నాం.. రూట్ కవర్ చేయాలనేది డ్రీమ్ రైడ్. – సుష్మారెడ్డి (42), బిజినెస్ ఎనలిస్ట్ఫిజికల్లీ ఫిట్.. మేం నేరేడ్ మెట్లో ఉంటాం. డిగ్రీ పూర్తి చేశాక 2017లో రైడింగ్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారి ఓల్డ్ మోడల్ ఎలక్ట్రా 350 (రాయల్ ఎన్ఫీల్డ్) నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంతంగా థండర్‌బోల్ట్ 350ఎస్ కొనుక్కున్నా. తొలిరైడ్ 1700 కి.మీ నడిపించాను. వేల కిమీ లాంగ్ రైడ్స్ చేశాను. ఒక మహిళా రైడర్‌గా నాకున్న పరిధులు, పరిమితుల ప్రకారం.. పూర్తి ప్రణాళికా బద్ధంగా రైడ్స్‌కి వెళ్తుంటాను. ఎక్కడికి వెళ్లినా సాయంత్రం లోపు రైడ్ కంప్లీట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే ఒక ఫిట్నెస్ ఫ్రీక్‌గా బైక్ పడినా సులభంగా లేపగలిగినæ ఫిట్నెస్ ఉండాలి. అందుకే లేహ్ లడక్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ రాలేదంటే...అందుకు కారణం నేను అనుసరించే సీరియస్ ఫిట్నెస్ రొటీన్ అని చెప్పగలను. –అనీషా ఫాతిమా లతీఫ్ (28), వృత్తి జిమ్ యజమాని -
భారత్–చైనా సరిహద్దులో ఏకంగా 108 కిలోల బంగారం స్వాధీనం
లేహ్: భారత్–చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఈ స్థాయిలో భారీగా అక్రమ బంగారం స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తదుపరి విచారణ కోసం బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్–సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవా«దీన రేఖకు ఒక కిలోమీటర్ దూరంలో ఐటీబీపీ 21వ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తారసపడ్డారు. ఐటీబీపీ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. సిబ్బంది కొంతదూరం వెంటాడి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. తనిఖీల్లో 108 కిలోల బంగారం లభించింది. స్మగ్లర్లను లద్దాఖ్ వాసులుగా గుర్తించారు. నిందితులను అధికారులు విచారిస్తున్నారు. -
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్‌లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన హవల్దార్ సుభాన్‌ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్‌శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్‌ఖాన్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్‌ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్‌కు చేరుకుంది. సుభాన్‌ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్‌ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్‌ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్‌ఖాన్‌కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
ఆర్మీ విన్యాసంలో విషాదం..
-
లఢక్: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
లఢక్: దేశ సరిహద్దుల్లోని లఢక్‌లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంక్ ఓ నది దాటుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటీ ప్రవాహం పెరిగింది.Indian Army T-72 Tank with Mine Trawler in Ladakh near LAC.. pic.twitter.com/A0rDfJY2rK— Vivek Singh (@VivekSi85847001) June 2, 2024 దీంతో యుద్ధట్యాంక్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో టీ-72 యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘ ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధట్యాంక్‌లో ఉన్నారు. ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి, నలుగురు జవాన్లు ఉన్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్ మృతదేహం లభించింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని రక్షణ శాఖ తెలిపింది. గతేడాది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్.. లేహ్ జిల్లాలోని కియారీ సమీపంతో లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. -
Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ
ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరించేనో? లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈసారి సిట్టింగ్ ఎంపీ జామ్యంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ బదులు తాషి గ్యాల్సన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్ లద్దాక్ ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్స్టాన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్ రాజాపై నెగ్గారు. చెవాంగ్ 2009 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్ ఎన్సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా సేరింగ్ నామ్గ్యల్ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్ కాంగ్రెస్ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్ నామ్గ్యల్ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్–ఎన్సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్ఏబీ, కేడీఏ డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్లు తక్కువ 1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్ నమోదవుతోంది.స్థానికుల డిమాండ్లులద్దాక్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్‌కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్‌తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్‌లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్‌గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్‌ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్‌ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్‌లోని లద్దాఖ్‌కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
కుదిరిన ఒప్పందం.. చెరో మూడు సీట్లలో కాంగ్రెస్, ఎన్సీ పోటీ
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికలల్లో జమ్ముకశ్మీర్, లడఖ్‌లో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలలైన ఈ రెండు పార్టీల మధ్య తాజాగా సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్‌సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సల్మాన్ ఖుర్షీద్‌తో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సీటు షేరింగ్ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అనంత్‌నాగ్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీ అభ్యర్థితోపాటు గులాం నబీ ఆజాద్‌తో ముఫ్తీ తలపడనున్నారు. చదవండి: టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు -
లద్దాఖ్‌లో ఐఏఎఫ్ అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దీంతో హెలికాప్టర్ దెబ్బతింది. లాద్దాఖ్‌లో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది. -
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరాహార దీక్ష ముగింపుతో తన పోరాటం ఆగిపోదని సోనమ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మార్చి 6 తేదీనా ఈ దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నిరాహార దీక్ష విరమించే కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు. నేను మళ్లీ పోరాటం చేస్తా. నా పోరాటంలో ఈ నిరాహార దీక్ష కేవలం మొదటి అడుగు మాత్రమే. మహాత్మా గాంధీ చేపట్టిన నిరాహారదీక్షల్లో 21 రోజుల దీక్షే ప్రధానమైంది. ఈ రోజు చాలా ముఖ్యమైంది. కేవలం తొలి దశ నిరాహార దీక్ష మాత్రమే నేటి( మంగళవారం)తో ముగిసింది. కానీ పోరాటం ముగిసిపోలేదు. మహిళలు 10 రోజు పాటు మరో నిరాహార దీక్ష చేపట్టనున్నాను. యువత, బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొంటారు. ఇలా నేను, నా తర్వాత మహిళలు నిరాహార దీక్ష చేపడతారు. ఇలా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. నా నిరాహార దీక్షలో ఒకే రోజు సుమారు 6వేల మంది పాల్గొన్నారు’ అని సోనమ్ వాంగ్‌చుక్ ఎక్స్ వేదికగా తెలిపారు. END 21st Day OF MY #CLIMATEFAST I'll be back... 7000 people gathered today. It was the end of the 1st leg of my fast. Btw 21 days was the longest fast Gandhi ji kept. From tomorrow women's groups of Ladakh will take it forward with a 10 Days fast, then the youth, then the… pic.twitter.com/pozNiuPvyS — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 అంతకు ముందు ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతి రాజనీతిజ్ఞులు కావాలని నేను ఆశిస్తున్నా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు మా డిమాండ్లను నెరవేర్చి వారు కూడా రాజనీతిజ్ఞులమని రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నా’అని సోనమ్ వాంగ్‌చుక్ ‘ఎక్స్’లో పోస్ట్చేసిన వీడియోలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఆగస్ట్ 2019 జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్, లడాక్ కేంద్రగా ప్రాంతపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. లేహ్, కార్గిల్ జిల్లాలతో లాడక్.. కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించి ఉంది. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర... వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్ రాజ్ బర్త్‌డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"
లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్‌ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు. వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST 120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C 16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will. I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c — Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024 > సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ క్లైమాట్ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్ కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్ 1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు. -
లఢక్‌లో రాష్ట్ర హోదా రగడ
లఢఖ్: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు. లడఖ్ - లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు -
లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు
లఢక్: లఢక్‌లోని కార్గిల్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. An earthquake of magnitude 5.5 on the Richter Scale hit Kargil, Ladakh at around 3:48 pm today: National Center for Seismology pic.twitter.com/Z5bBYur7y4 — ANI (@ANI) December 18, 2023 రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం -
ఐక్యతకు బలం చేకూర్చిన తీర్పు!
ఆర్టికల్ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప దెబ్బ తీసేది ఎంతమాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆర్టికల్ 370కి స్వాభావిక శాశ్వతత్వం లేదనే వాస్తవాన్ని కూడా కోర్టు గుర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి మరింత బలోపేతమైంది. ఐక్యతా బంధం, సుపరిపాలనపై ఉమ్మడి నిబద్ధతకు నిర్వచనం ఇదేనని గుర్తు చేసిన ఈ తీర్పు ప్రతి భారతీయుడూ గర్వించదగినది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. నిర్మలమైన లోయలు, గంభీర పర్వతాలతో కూడిన ప్రాకృతిక వైభవం అనాదిగా కవులు, కళాకారులను ఉత్తేజితం చేయడమే కాకుండా సాహసికుల హృదయాలను కూడా దోచుకుంది. ఆకాశాన్నంటే హిమాలయ సోయగం నడుమ సౌందర్య–అద్భుతాల సంగమంగా ఈ ప్రదేశం అలరారేది. కానీ, ఈ స్వర్గం ఏడు దశాబ్దాలపాటు అత్యంత దారుణ హింస, అస్థిరతలకు ఆలవాలమై ప్రకృతి ప్రేమికులకు, సౌందర్య ఆరాధకులకు నరకంగా పరిణమించింది. దురదృష్టవశాత్తూ శతాబ్దాల పాటు సాగిన వలసపాలన వల్ల... ముఖ్యంగా మానసిక, ఆర్థిక అణచివేత ఫలితంగా మనం ఒక రకమైన అస్తవ్యస్త సమాజంగా మారిపోయాం. అనేక ప్రాథమిక అంశాలపై సుస్పష్ట వైఖరి కొరవడి, ద్వంద్వత్వాన్ని అనుమతించడంతో అది మనల్ని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఈ దురదృష్టకర పరిణా మాలకు జమ్మూ కశ్మీర్ ప్రధాన బాధితురాలుగా మిగిలింది. స్వాతంత్య్రం సిద్ధించిన వేళ జాతీయ సమైక్యత దిశగా నవ్యారంభాన్ని ఎంచుకునే అవకాశం మనకు దక్కింది. కానీ, మనం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు బదులు అస్తవ్యస్త సమాజ విధానాల కొన సాగింపునకే నిర్ణయించుకున్నాం. నా జీవితంలో చిన్న వయసు నుంచే జమ్మూ–కశ్మీర్ సమస్యతో నేను ఒకవిధంగా ముడిపడి ఉన్నాను. కానీ, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా కాకుండా సామాజిక ఆకాంక్షలు తీర్చే అంశంగా పరిగణించే సైద్ధాంతిక చట్రంలో నేనొకడిని. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో జరిగిందంతా అక్కడి ప్రజానీకానికి, మనదేశానికి ఘోర ద్రోహమని నేను దృఢంగా విశ్వసించాను. అందుకే ప్రజలకు వాటిల్లిన అన్యా యాన్ని సరిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని బలమైన సంకల్పం పూనాను. ఆ మేరకు జమ్మూ–కశ్మీర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు అవిరళంగా శ్రమించాలని నిశ్చయించుకున్నాను. ఆ క్రమంలో ఆర్టికల్ 370, 35(ఎ) ప్రధాన అవరోధాలు అయ్యాయి. అవి దుర్భే ధ్యమైన అడ్గుగోడల్లా తోచాయి. మరోవైపు బాధితులంతా పేదలు, అణగారిన వర్గాలవారు. ఈ పరిస్థితుల నడుమ ఈ రెండు రాజ్యాంగ నిబంధనల వల్ల భారతీయులందరికీ లభించే హక్కులు, ప్రగతి కశ్మీర్ ప్రజలకు దక్కవన్నవి సుస్పష్టం. ఫలితంగా ఒకే దేశంలోని పౌరుల మధ్య అగాధం ఏర్పడింది. పర్యవసానంగా జమ్మూ కశ్మీర్ ప్రజల బాధలు తెలిసి, అక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించిన ఇతర పౌరులు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ సమస్యను కొన్ని దశాబ్దాలుగా నిశితంగా పరిశీలించిన ఓ కార్యకర్తగా దాని లోతుపాతులు, సంక్లిష్టతలపై నాకు క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఏదేమైనా ఒక విషయంలో మాత్రం నాకు తిరుగు లేని స్పష్టత ఉంది. అదేమిటంటే– జమ్మూ–కశ్మీర్ ప్రజలు ప్రగతిని కోరుకుంటున్నారు. తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. తమ భవిష్యత్తరానికి మెరుగైన జీవన నాణ్యతను, హింస–అనిశ్చితి రహిత జీవనాన్ని కూడా ప్రగాఢంగా వాంఛిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన జమ్మూ– కశ్మీర్ ప్రజలకు సేవలందించడంలో మూడు ప్రధానాంశాలకు మేంప్రాధాన్యమిచ్చాం. ఆ మేరకు పౌరుల సమస్యలను అవగతం చేసు కోవడం, చేయూత ద్వారా విశ్వాసం పెంచడం, ముమ్మూర్తులా అభివృద్ధి ప్రాథమ్యం కల్పించడంపై నిశితంగా దృష్టి సారించాం. దేశంలో మేం 2014లో అధికారంలోకి రాగానే... జమ్మూ–కశ్మీర్ ప్రగతి పయనాన్ని మరింత వేగిరపరచేందుకు మా ప్రభుత్వంలోని మంత్రులు తరచూ అక్కడికి వెళ్లి ప్రజలతో నేరుగా సంభాషించాలని మేం నిర్ణయించుకున్నాం. దీంతో అక్కడ సుహృద్భావం పెంపొందించడంలో ఈ పర్యటనలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకు 2014 మే నెల నుంచి 2019 మార్చి వరకు 150 దఫాలకు పైగా మంత్రులు పర్యటించడం మునుపెన్నడూ లేని రికార్డు. ఇక ప్రత్యేక ప్యాకేజీతో జమ్మూ–కశ్మీర్ అభివృద్ధి అవసరాలు తీర్చే దిశగా 2015లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఇందులో మౌలిక సదుపాయాల నిర్మాణం, ఉద్యోగ–ఉపాధికల్పన, పర్యాటకానికి ప్రోత్సాహం, హస్త కళల పరిశ్రమకు మద్దతు వంటి కార్యక్రమాలున్నాయి. జమ్మూ–కశ్మీర్లో యువత కలలను రగిలించగల శక్తి క్రీడలకు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ మేరకు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించాం. వారి ఆకాంక్షలు –భవిష్యత్తుపై ఈ క్రీడల పరివర్తనాత్మక ప్రభావాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. క్రీడా వేదికల మెరుగుతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శిక్షకులను అందుబాటులో ఉంచాం. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్బుల ఏర్పాటును ప్రోత్సహించడం మేం చేపట్టిన అత్యంత ప్రత్యేక చర్యలలో ఒకటి. దీని ఫలితాలు అత్యద్భుతం. వీటిద్వారా ఎందరో యువతీయువకులు పటిష్ఠ శిక్షణతో ప్రతిభావంతులైన క్రీడాకారు లుగా వెలుగులోకి వచ్చారు. వీరిలో అఫ్షాన్ ఆషిఖ్ పేరు నాకింకా గుర్తుంది. ఎందుకంటే– 2014 డిసెంబరు నాటికి శ్రీనగర్‌లో రాళ్లు విసిరే అల్లరిమూకలో ఆమె ఒకరుగా ఉండేది. అయితే, సముచిత చర్యలు, ప్రోత్సాహంతో ఆ యువతి ఫుట్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తర్వాత యువతరంతో సుదృఢ భారతం కార్యక్రమం సందర్భంగా ఓసారి నేను ఆమెతో సంభాషించినట్లు నాకిప్పటికీ గుర్తుంది. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిలో పంచాయితీ ఎన్నికలు ఒక మేలిమలుపు. మరోసారి మేం అధికారంలో కొనసాగడం లేదా మా సిద్ధాంతాలకు కట్టుబాటు... అనే వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవా ల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. మాకు ఇదేమంత కఠినమైనది కాదు. అధికారం వదులుకున్నా, సిద్ధాంతాలను నిలబెట్టుకున్నాం. ఆ మేరకు జమ్మూ ప్రజల ఆకాంక్షలు, కశ్మీర్ ప్రగతికే అత్యంత ప్రాధాన్యమిచ్చాం. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడం అక్కడి ప్రజల ప్రజాస్వామిక స్వభావాన్ని స్పష్టం చేసింది. గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులతో సంభాషించాలని నా మనస్సుకు తోచింది. ఈ సందర్భంగా ఇతరత్రా సమస్యలపై మాట్లాడటంతో పాటు నేను వారికొక అభ్య ర్థన చేశాను. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను తగులబెట్ట రాదని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశాను. ఆ తర్వాత వారు తమ హామీని నిలబెట్టుకోవడం నన్నెంతో ఆనందింప జేసింది. పాఠశాలలు తగుల బడితే అందరి కన్నా ఎక్కువగా బాధపడేది పసివాళ్లే! ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ ఒక చరిత్రాత్మక దినంగా ప్రతి భారతీయుడి హృదయంలో నాటుకు పోయింది. ఆ రోజున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మన పార్లమెంటు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లలో పెనుమార్పులు వచ్చాయి. చివరకు 2023 డిసెంబరులో న్యాయ స్థానం తీర్పు దాన్ని బలపరచింది. ఈ మూడు ప్రదేశాల్లో అభివృద్ధిని చూశాక నాలుగేళ్ల కిందటి పార్లమెంటు నిర్ణయంపై ప్రజాకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రతిధ్వనింపజేసింది. రాజకీయాల స్థాయిలో గత 4 ఏళ్లుగా క్షేత్రస్థాయిన ప్రజా స్వామ్యంపై సరికొత్త విశ్వాసం పునరుద్ధరించబడింది. అంతకు ముందు సమాజంలోని మహిళలు, గిరిజనులు, ఎస్సీ/ఎస్టీ, అణగా రిన వర్గాలకు దక్కా ల్సిన ప్రయోజనాలు అందేవి కావు. అదే సమ యంలో లద్దాఖ్ ఆకాంక్షలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయి. అయితే, 2019 ఆగస్టు 5న ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర చట్టాలన్నీ ఎలాంటి భయపక్షపాతాలూ లేకుండా అమలవుతున్నాయి. ప్రాతి నిధ్యం మరింత పెరిగింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అందరూ విస్మరించిన శరణార్థి సమాజాలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించాయి. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సంతృప్త స్థాయికి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగానికి చేయూతతో కశ్మీర్ అందాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ స్వాగతం పలుకు తున్నాయి. ఈ ఘనత సహజంగానే జమ్మూ–కశ్మీర్ ప్రజల దృఢ సంకల్పానికి దక్కుతుంది. ఈ మేరకు తాము ప్రగతి కాముకులం మాత్రమేనని, ఈ సానుకూల మార్పునకు చోదకులు కావడానికి సిద్ధంగా ఉన్నామని వారు పలుమార్లు నిరూపించుకున్నారు. గతంలో జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ల పరిస్థితి ఒక ప్రశ్నార్థకంలా ఉండేది. కానీ, ఇప్పుడది ‘‘రికార్డు వృద్ధి, రికార్డు ప్రగతి, రికార్డు స్థాయిలో పర్యాటక ప్రవాహం’’తో ఆశ్చర్యార్థకానికి ప్రతీకగా మారింది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లలోప్రతి బిడ్డ నేడు స్వచ్ఛమైన నేపథ్యంతో జన్మిస్తున్నాడు. అక్కడ అతను లేదా ఆమె శక్తిమంతమైన ఆకాంక్షలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ప్రజల స్వప్నాలు నేడు గతానికి బందీలు కావు. భవిష్యత్తుకు బంగారుబాట పరిచే అవకాశాలు. అన్నింటికీ మించి భ్రమలు, నిరాశా నిస్పృహల స్థానంలో ఇప్పుడు అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం పరిఢ విల్లుతున్నాయి! నరేంద్ర మోదీ భారత ప్రధాని -
మన భూభాగాన్ని చైనా కాజేసింది
కార్గిల్/న్యూఢిల్లీ: మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటలు అబద్ధమని ఆయన విమర్శించారు. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు, చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’అని రాహుల్ అన్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. చైనా ఆక్రమణలతోపాటు లద్దాఖ్ ప్రజల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడతానన్నారు. రాహుల్ అంతకుముందు ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1999 ఇండో–పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. లద్దాఖ్‌లో పర్యటన ముగించుకున్న రాహుల్ బైక్‌ను వదిలి, కారులో శ్రీనగర్ చేరుకున్నారని, శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
అంగుళం కూడా చైనా ఆక్రమించలేదనడం అబద్ధం
న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు. ‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది. -
రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..
ఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్‌ను చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతం రహదారులు ఎలా ఉన్నాయో..? బైక్ రైడ్ ద్వారా తెలుపుతూ ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్యు అంటూ కామెంట్ పెట్టారు. 2012కి పూర్వం అక్కడ ఉన్న రోడ్ల దుస్థితిని ప్రస్తుతం ఉన్న రహదారులను పోల్చుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రధాని మోదీ హయాంలో హిమాలయాల్లో ఎలాంటి రోడ్లను నిర్మించారో జాతి మొత్తం చూస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా అన్నారు. రాహుల్ యాత్ర చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో లాల్ చౌక్ వద్ద జాతీయ జెండా నేడు స్వేచ్ఛగా రెపరెపలాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే కశ్మీర్లో సరైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. Thanks to Rahul Gandhi for promoting excellent roads of Ladakh built by the @narendramodi govt. Earlier, he also showcased how Tourism is booming in Kashmir Valley & reminded all that our "National Flag" can be peacefully hoisted at Lal Chowk in Srinagar now! pic.twitter.com/vta6HEUnXM — Kiren Rijiju (@KirenRijiju) August 19, 2023 లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. తాను ఇటీవల కొనుగోలు చేసిన కేటీఎమ్ బైక్‌పై పాంగాంగ్ లేక్ వరకు రైడ్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.' ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రదేశం హిమాలయాల్లో ఉన్నాయని మా నాన్న తెలిపారు' అని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం రాహుల్ యాత్రకు కేంద్ర మంత్రులు స్పందించారు. To witness and spread the word about post-Article 370 developments in Leh and Ladakh, Shri Rahul Gandhi himself has taken a trip to the valley. We are elated and delighted to watch glimpses of his road trip. pic.twitter.com/X0mC18C40j — Pralhad Joshi (@JoshiPralhad) August 19, 2023 ఇదీ చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
నాన్నా.. మీ బాటలోనే నేను: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దివంతగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి(79వ) నేడు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నాయి. లడ్డాఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. పాంగోంగ్ సరస్సు తీరం వద్ద తన తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. మరోవైపు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా నివాళులర్పించారు. అదే సమయంలో ట్విటర్లో రాహుల్ గాంధీ ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ‘‘నాన్నా.. దేశం కోసం మీరు కన్న కలలు.. అమూల్యమైన జ్ఞాపకాలు. ప్రతీ భారతీయుడి కలల్ని, కష్టాల్ని అర్థం చేసుకోవడం, అన్నింటికి మంచి భరత మాత గొంతుక వినాలని మీరు పడ్డ తపన ఇవాళ నన్ను మీ బాటలో నడిచేలా చేస్తోంది’’ అంటూ పేర్కొన్నారు. ఇక లేహ్ వద్ద జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ సభ్యులు సైతం రాజీవ్‌కు నివాళులర్పించారు. पापा, आपकी आंखों में भारत के लिए जो सपने थे, इन अनमोल यादों से छलकते हैं। आपके निशान मेरा रास्ता हैं - हर हिंदुस्तानी के संघर्षों और सपनों को समझ रहा हूं, भारत मां की आवाज़ सुन रहा हूं। pic.twitter.com/VqkbxoPP7l — Rahul Gandhi (@RahulGandhi) August 20, 2023 #WATCH | Congress MP Rahul Gandhi pays tribute to his father and former Prime Minister Rajiv Gandhi on his birth anniversary from the banks of Pangong Tso in Ladakh pic.twitter.com/OMXWIXR3m2 — ANI (@ANI) August 20, 2023 #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi pays floral tribute to former Prime Minister Rajiv Gandhi on his birth anniversary at 'Veer Bhumi' in Delhi. pic.twitter.com/kajhf62T3Y — ANI (@ANI) August 20, 2023 #WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge, Congress general secretary Priyanka Gandhi Vadra and Robert Vadra pay tribute to former Prime Minister Rajiv Gandhi on his birth anniversary today, at Veer Bhumi pic.twitter.com/1NKCAyeDqn — ANI (@ANI) August 20, 2023 1944 ఆగష్టు 20వ తేదీన జన్మించిన రాజీవ్ గాంధీ.. భారత దేశానికి ఏడవ ప్రధానిగా (1984 నుంచి 1989) దాకా సేవలందించారు.ఇదిలా ఉంటే.. ఆర్టికల్ 370 తర్వాత రాహుల్ ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. బైక్ రైడ్‌తో సందడి చేసిన రాహుల్ గాంధీ.. లేహ్ పర్యటనకు వెళ్లి, అక్కడే మరికొన్నిరోజుల ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆగష్టు 25 వరకు అక్కడే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. -
స్టైలిష్ లుక్‌లో రాహుల్.. లద్దాఖ్‌లో బైక్ టూర్..
లేహ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్ చేపట్టారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఆగష్టు 20న అక్కడే నిర్వహించనున్నారు. బైక్ రైడ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. KTM 390 బైక్‌ను కొనుగోలు చేసినట్లు రాహుల్ గాంధీ ఒకప్పుడు సోషల్ మీడియాలో తెలిపారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ బైక్‌పై సెక్యూరిటీ బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఆ బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారు" అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది. రాహుల్ లద్దాఖ్ పర్యటన ఆగష్టు 25న ముగియనుంది. Upwards and onwards - Unstoppable! pic.twitter.com/waZmOhv6dy — Congress (@INCIndia) August 19, 2023 దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇటీవలే తమిళనాడు వెళ్లి ఊటీ సమీపంలో గిరిజన తెగలతో కలిసి ఆడిపాడారు. ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో బైక్‌పై పాంగాంగ్ సరస్సు వరకు పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్.. -
కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు..
లడఖ్: లడఖ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత నజీర్ అహ్మద్(74) కుమారుడు నెలరోజుల క్రితం ఒక బౌద్ధ మహిళను ప్రేమించి ఆమెతో కలిసి ఉడాయించాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ పార్టీ పెద్దలు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అచ్చం 'దేశముదురు' సినిమా కథను తలపిస్తూ లడఖ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తనయుడు మంజూర్ అహ్మద్(39) ఓ బౌద్ధ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లాడాడు. వివాహానికి నజీర్ కుటుంబమంతా వ్యతిరేకమే అయినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఈ మతాంతర వివాహంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు లడఖ్ బీజేపీ పార్టీ చీఫ్ ఫంచోక్ స్టాంచిన్ బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. పార్టీ బహిష్కరణ తర్వాత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నా కుమారుడికి ఆ బౌద్ధ యువతికి 2011లోనే నిఖా జరిగి ఉంటుంది. గతనెల వారు మళ్ళీ కోర్టు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వారి పెళ్లి జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. హాజ్ యాత్రకు వెళ్లాను. తిరిగొచ్చాక విషయం తెలిసినప్పటి నుండి వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ వెతికాను. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. నా కొడుకు పెళ్ళికి నన్నెందుకు నిందిస్తున్నారో నాకైతే అర్ధం కాలేదని వాపోయారు. ఇది కూడా చదవండి: చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత.. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్‌ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్‌యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్‌లో పర్యటకులకు భారీ ట్యాక్స్‌లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం! -
యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్
అనంతపురం డెస్క్ : మనం బైక్‌పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్‌లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్‌పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్‌యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్ బాలు. ఆసక్తే ముందుకు నడిపించింది.. బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్ సర్వీస్ సెంటర్‌తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్‌పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్‌పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు. సెకండ్ హ్యాండ్ బైక్‌పై యాత్ర బాలు లడఖ్ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్ హ్యాండ్ బైక్ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్, నాగపూర్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్, అమృత్సర్, జమ్మూ, చీనాబ్ బ్రిడ్జ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లడఖ్ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ప్రదేశ్ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్‌నాథ్‌కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్‌యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్ చానెల్ (బాలు సన్‌రైజ్ ట్రావెలర్)లో అప్లోడ్ చేశాడు. ఆదుకున్న జవాన్లు ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్ వద్ద (కార్గిల్‌కు సమీపంలో) మైనస్ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్లైన్లో డబ్బు పంపి ఆదుకున్నారు. ఎవరెస్ట్‌కు వెళ్లాలనుంది నాకు బైక్ రైడింగ్‌తో పాటు ట్రెక్కింగ్ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్ వెళ్లేవాడిని. ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్‌యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్ఘర్, కార్గిల్ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్ బార్డర్‌ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్‌లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా-భారత్‌ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమస్య పరిష్కారమైతే గానీ భారత్, చైనా మధ్య సంబంధాలు యధాస్థితికి రాలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలు బలగాలు ఉపసంహరణ విషయంలో కాస్త పురోగతి సాధించాయి. ఘర్షణ ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ లడఖ్‌లోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారత్ చైనాల మద్య పరిస్థితి చాలా పెళుసుగా, ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉందని, ఎందుకంటే మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయని అన్నారు. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది అని అన్నారు. పైగా ఆయా ప్రాంతాల్లో సైనిక బలగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ ప్రాంతాల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించగా, సుమారు 40 మందికి పైగా చైనీస్ సైనికులు మరణించడం లేదా గాయపడటం జరిగింది. అంతేగాదు 2020 మధ్యలో ఈప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడూ దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి సద్ధుమణిగింది. అలాగే డిసెంబర్లో గుర్తింపులేని సరిహద్దులోని తూర్పు సెక్టార్లో హింస చెలరేగింది. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదు. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
ఎన్ని అడ్డంకులు ఎదురైన నీ అవ్వా తగ్గేదేలే.. కొండ మేకను వెంటాడి వేటాడిన చిరుత !
-
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్‌లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్‌పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్‌పింగ్ ఖుంజెరాబ్‌లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్‌పింగ్‌కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్‌పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్‌పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్‌పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
లద్దాఖ్‌లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్
జైపూర్: చైనా మన మీదకి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా నుంచి మనకు ముప్పు ఉందని రెండు, మూడేళ్లుగా నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. కానీ కేంద్రం దాన్ని దాచి పెడుతూ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 20 మంది సైనికుల ప్రాణాలు తీసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మన జవాన్లను కొట్టింది. లద్దాఖ్, తవాంగ్‌లో ఘర్షణలు జరిగాయి. ఇన్ని జరిగినా మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోంది’’ అంటూ ధ్వజమెత్తారు. చైనా ఆయుధ సంపత్తి, వాటిని నియోగిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. బీజేపీని ఓడించేది మేమే కాంగ్రెస్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, ఎప్పటికైనా బీజేపీని ఓడించేది తమ పార్టీయేనని రాహుల్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పనైపోయిందంటున్నారు. కానీ బీజేపీ ఎప్పటికైనా కాంగ్రెస్ చేతిలోనే ఓడుతుంది. కాంగ్రెస్‌కు కోట్లాది మంది కార్యకర్తల బలముంది. వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకుంటే రాజస్థాన్‌లో అఖండ విజయం ఖాయం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి నేతల నిష్క్రమణను మీడియా ప్రస్తావించగా, ‘పోయేవాళ్లందరినీ పోనిస్తాం. కాంగ్రెస్‌పై నమ్మకమున్న వాళ్లే మాతో ఉంటారు’’ అన్నారు. బీజేపీకి బీ టీమ్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ–టీమ్‌గా మారిందని రాహుల్ ఆరోపించారు. ఆప్ లేకుంటే గుజరాత్ ఎన్నికల్లో గెలిచే వాళ్లమన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్ఫథం లేదు. దేశానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. వచ్చే ఎన్నికల్లో ఇతర విపక్షాలతో కలిసి పని చేస్తాం. మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అన్నారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తదితరులు రాహుల్‌తో కలిసి నడిచారు. ‘నెహ్రూ భారత్’ కాదిది: బీజేపీ న్యూఢిల్లీ: చైనా యుద్ధానికి వస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పి కొట్టింన్నిలాంటి మాటలతో సైనికుల స్థైర్యాన్ని రాహుల్ దెబ్బ తీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. ‘‘1962లో మనపై చైనా యుద్ధానికి కాలుదు వ్వినప్పటి నెహ్రూ కాలపు భారత్ కాదిది. మోదీ నేతృత్వంలోని కొత్త నవీన భారత్. కయ్యానికి కాలు దువ్వే వాళ్లకు గట్టిగా జవాబిస్తాం’’ అన్నారు. -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
‘అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేను’.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్న నెట్టింట సమయాన్ని గడుపుతుంటారు. వింతలు, వినోదం, టెక్నాలజీ తదితర అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ నెటిజన్లను పలకరిస్తుంటారు. సోషల్ మీడియాలో అంతగా చురుకుగా ఉంటారు కాబట్టే ఇటీవలే ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా నెట్టింట ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఏముందంటే! అందులో.. అది వాహనాలు ప్రయాణిస్తున్న ఒక రోడ్ ఫోటో. ఆ రోడ్ చూసేందుకు ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉంది. ఎత్తైన ప్రాంతానికి వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మలుపులు ఎక్కువగా ఉంటాయి. చుట్టూ లోయలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా క్షణాల్లో ప్రమాదాన్ని పలకరించాల్సి వస్తుంది. అటువంటి రోడ్డు మీద ప్రయాణం అంటే సాహసం అనే చెప్పాలి. తన ట్వీట్లో ఆనంద్ మహీంద్రా పర్వత ప్రాంతమైన లడఖ్ రోడ్ని షేర్ చేసి ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఇంతటి అద్భుతమైన ఫోటోని షేర్ చేసినందుకు @TravelingBharat ధన్యవాదాలు. మీరు పంపిన జాబితా నా లిస్ట్‌లో ఉంచుతాను. కానీ ఆ రహదారిలో వెళ్లే ప్రసక్తే లేదు. ఒప్పకుంటున్నా, నేనంత ధైర్యం చేయలేనని’ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు పర్వత ప్రాంతంలో వారి వారి ప్రయాణ అనుభవాలను పంచుతూ కామెంట్లు పెడుతున్నారు. Thank you @TravelingBharat for your amazing shares, many of which I RT & put on my bucket list…But there’s no way I’m visiting THIS road…I confess I don’t have the courage! https://t.co/Ujx4AAnK4j — anand mahindra (@anandmahindra) November 11, 2022 చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
లద్దాఖ్ పోదాం... పాలపుంతను చూద్దాం!
లద్దాఖ్: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్ క్యాంప్ నుంచి కనిపించే అద్భుతమిది. దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. -
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు... దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు. ‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు. మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు. ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు. కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు. ‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే. విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది. ఖర్చు లక్షలు అయింది ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్రూమ్, రెండు బెడ్లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు. ‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది. వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల. చదవండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి -
‘హర్ ఘర్ తిరంగ’పై జవాన్ల సందేశం..12వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరీ..
లద్దాఖ్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో.. లద్దాఖ్‌లోని లేహ్‌లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘భారత్ మాతాకి జై. లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది ఐటీబీపీ. भारत माता की जय ! ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7 — ITBP (@ITBP_official) July 27, 2022 భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్‌లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈడీ పోలీస్ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
కెమెరాకు చిక్కిన మంచు చిరుత.. ఎక్కడంటే!
మంచు చిరుత.. వీటి ఫొటోలు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే.. అవి పరిసరాల్లో కలిసిపోయి ఉంటాయి.. వీటిని క్లిక్‌మనిపించడానికి ఫొటోగ్రాఫర్లు నెలలతరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం.. ఇక్కడ కూడా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సషా ఫొన్సెకా అలాగే ఎదురుచూశారు. ఫలితం.. ఇదిగో.. తన ఫొటోను క్లిక్‌మనిపిస్తున్న కెమెరా వైపు కోపంగా లుక్కులిస్తు మరీ చిక్కింది ఈ స్నో లెపర్డ్. దీన్ని లడఖ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఇంటర్నెట్లో షేర్ చేయగానే.. జనమంతా ఎగబడి చూశారు. దీంతో మంచు చిరుత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ( విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sascha Fonseca (@sascha.fonseca) -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్‌లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్‌ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్‌లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్‌షాప్స్ కోసం చేసిన ప్లాన్‌లో భాగంగా లదాఖ్‌కు వెళ్లాను. లైఫ్‌లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్‌షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్‌లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్‌లో కూర్చుని, ఫ్రెండ్స్‌తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్‌లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్‌తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్‌తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్‌కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్‌కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్‌కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్‌కు పంపించాను. టాప్‌టెన్‌లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్‌గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్‌లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: లడఖ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 సైనికులకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య 7 Indian Army soldiers lost their lives so far in a vehicle accident in Turtuk sector (Ladakh), grievous injuries to others too. Efforts on to ensure best medical care for injured, incl requisition of air effort from IAF to shift more serious ones to Western Command: Army Sources — ANI (@ANI) May 27, 2022 -
భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్య!
న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడ్డ విషయం వెలుగు చూసింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ బయటపెట్టింది. లడఖ్ రీజియన్‌లోని పవర్ గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. ఇటీవలి నెలల్లో.. గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం నిజ-సమయ(రియల్ టైం) కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్లను (SLDC) లక్ష్యంగా చైనా నెట్వర్క్ చొరబాట్లను గమనించాము. ముఖ్యంగా, ఈ లక్ష్యం లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న SLDCతో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని గుర్తించాం. ఆ హ్యాకింగ్ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్ సెంటర్ల నుంచి వచ్చినవే’ అంటూ బుధవారం ఒక ప్రకటన చేసింది రికార్డెడ్ ఫ్యూచర్ కంపెనీ. పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు.. జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను సైతం హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు గుర్తించామని రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించింది. ఈ లెక్కన ప్రభుత్వ సహకారంతోనే హ్యాకర్లు ఈ దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక నివేదికను పబ్లిష్ చేసే ముందు.. ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించినట్లు సదరు గ్రూప్ వెల్లడించింది. ఈ అంశంపై కేంద్రం స్పందించాల్సి ఉంది. -
లడఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్.. ఫోటోలు వైరల్
లడఖ్: లడఖ్‌లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళాలు నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్‌లో 100 మంది బార్డర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ మథూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ అభినందించారు. Ladakh: Watch the glimpses of the Ice wall climbing competition in Ladakh organised for the 1st time in the Country by North West Frontier ITBP, Leh. More than 100 climbers are taking part.#Himveers@nwftr_itbp pic.twitter.com/KeOCtkBrfD — ITBP (@ITBP_official) February 27, 2022 ఆయన మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డర్ పోలీసుల ట్రెక్కింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Some glimpses of Ice Wall Climbing Competition in Ladakh organised for the 1st time in the Country by HQrs NW Frontier ITBP, Leh.#Himveers#IceWallClimbing pic.twitter.com/Mp2qLHTtFc — ITBP (@ITBP_official) February 27, 2022 -
గడ్డకట్టే చలిలో 1500 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్‌లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్ హిమవీర్స్ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. -
చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!
న్యూఢిల్లీ: చైనా అక్రమంగా వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో వంతెన నిర్మిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా చూస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా పట్టు కోసం పాంగాంగ్ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బహశా ఆయన మౌనం కారణంగా చైనా ఉత్సాహంగా వంతెనను నిర్శిస్తోంది కాబోలు అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే మోదీ ఈ వంతెనను ప్రారంభించేందుకు రారేమోనని భయం వేస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.పాంగాంగ్ సరస్సు మీదుగా నిర్మిస్తున్న వంతెన గనుక పూర్తైయితే చైనీస్ దళాలు సరస్సు ఒడ్డుకు త్వరగా చేరుకోవడమే గాక మిలటరీ పరంగా పట్టు సాధించగలరని తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం పట్టనట్టు చూస్తుందని విమర్శించారు. పైగా మోదీ ప్రభుత్వం చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉన్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, అందువల్లే భారత్- చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయని అన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదం ఉందని.. పైగా అక్కడ కూడా భారత సైన్యం మోహరించని ప్రదేశాలను ఆక్రమించుకుని ఇలాంటి వంతెనలనే చైనా నిర్మించిందని అన్నారు. చైనా అక్రమ వంతెన నిర్మాణానికి సంబంధించిన వీడియోతోపాటు "మోదీ ఈ వంతెన ప్రారంభిస్తారేమో" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. हमारे देश में चीन एक कूटनीतिक पुल का निर्माण कर रहा है। PM की चुप्पी से PLA के हौसले बढ़ते जा रहे हैं। अब तो ये डर है कहीं PM इस पुल का भी उद्घाटन करने ना पहुँच जायें। pic.twitter.com/OMcCC3wxXD — Rahul Gandhi (@RahulGandhi) January 19, 2022 (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
చైనా అక్రమ వంతెన: గడ్డకట్టే చలిలోనూ 400 మీటర్ల నిర్మాణం..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో పట్టు కోసం పాంగాంగ్ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న డ్రాగన్ దేశం గజగజలాడించే చలిలో కూడా పనులు కొనసాగిస్తోంది. 8 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం 400 మీటర్ల వరకు పూర్తయినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకి దారి తీసిన పాంగాంగ్ సరస్సుకి ఉత్తర తీరంలో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఇది పూర్తయితే ఆ ప్రాంతంలో చైనా మిలటరీ పరంగా పట్టు సాధించడానికి వీలవుతుంది. చదవండి: (ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) జనవరి 16న తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చైనాకు చెందిన నిర్మాణ కార్మికులు భారీ క్రేన్లు, యంత్రాల సాయంతో పిల్లర్లను కలిపేలా సిమెంట్ స్లాబులను అమర్చే దృశ్యాలు రికార్డు అయ్యాయి. భారీగా మంచుకురుస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా చైనా కార్మికులు వంతెన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఈ వంతెన పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ వంతెన పూర్తయితే పాంగాంగ్ సరస్సు నుంచి రూటగ్లో సైనిక శిబిరానికి వెళ్లే దూరం ఏకంగా 150 కి.మీ. తగ్గిపోతుంది. 1958 సంవత్సరం నుంచే ఈ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా తమ చేతుల్లో తీసుకున్న చైనా ఇప్పుడు వంతెన నిర్మాణ పనుల్ని వాయువేగంతో పూర్తి చేస్తోంది. అయితే చట్టవిరుద్ధంగా సాగిస్తున్న ఈ నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది. -
మంచుకొండల్లో అద్భుత నిర్మాణం! ఎంఈఐఎస్ అరుదైన రికార్డు
హైదరాబాద్: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్–లద్దాక్ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది. జొజిలా టన్నెల్స్ పరిధిలో నీల్‌గ్రార్ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్ తెలిపింది. ఇందులో నీల్ గ్రార్ టన్నెల్ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్ గ్రార్ టన్నెల్ 2 లో 3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేయటం విశేషం. -
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
షాకింగ్ వీడియో: సెకను వ్యవధిలో తప్పింది.. చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు!
నిన్నటి వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూట్టిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ఈ ఘటన కొన్ని నెలల కింద జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: Guinness World Record: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
శత్రు ట్యాంకులను ఎలా ధ్వంసం చేస్తామంటే!
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తైవాంగ్ సెక్టార్లో భారత్ ఆర్మీకి చెందిన యాంటీ ట్యాంక్ స్క్వాడ్ బృందం శత్రు ట్యాంకులను ఎలా దాడి చేసి నాశనం చేయాలో పైరింగ్ డెమో చేసి చూపిస్తుంది. అంతేకాకుండా అక్కడ పర్వతాలపై దట్టమైన మంచు వ్యాపించి ఉన్న సమయంలో క్షిపిణి ఫైరింగ్ ఏవిధంగా చేయాలో, పర్వత శిఖరంపై శత్రు లక్ష్యాన్ని ఎలా చేధించాలో చేసి చూపిస్తోంది. ఈ క్రమంలో భారీగా సాయుధ బలగాలు పర్వత శిఖరంపై బంకర్ల స్థానాల్లో మోహరించినట్లు కనిపిస్తారు. (చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!) అంతేకాదు రహదారిపై శత్రువుల కదిలికలను మంచు కారణంగా సరిగా కనిపించడం లేదన్న ఆ విషయాన్ని కమాండర్‌కి తెలియజేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సైనికులు బంకర్ వద్దకు చేరుకుని క్షణాల్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి(ఏటీజీఎం) ఏర్పాటు చేయడం. తదనంతరం కొండపై ఉన్న మిగతా ఆర్మీ సిబ్బంది సహాయంతో సమాచారం తెలుసుకుంటూ కాల్పులు జరుపుతారు. ఈ క్రమంలో ఒక సైనికుడు ఏటీజీఎం సిస్టమ్‌ని అన్ ఇన్స్టాల్ చేసి ఏ విధంగా ఫైరింగ్ పోజిషన్ తీసుకుంటూ శత్రువులపై కాల్పులు జరపాలో కూడా వివరిస్తుంటాడు. ఈ మేరకు అధికారులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తైవాంగ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట పర్వతాలలో అప్‌గ్రేడ్ చేసిన ఎల్70 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్, ఎం-777 హోవిట్జర్లు, స్వీడిష్ బోఫోర్స్ గన్లతో భారత్ సైన్యం మోహరించి ఉదని తెలిపారు. అంతేకాదు తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం తన ఫైర్ పవర్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ డెమో నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భారత సైన్యం క్షిపిణి పైరింగ్ డెమోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించండి.. (చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి) #WATCH Indian Army soldiers demonstrate battle drill to destroy enemy tanks in the Tawang sector near the Line of Actual Control (LAC) #ArunachalPradesh pic.twitter.com/3XYvYjB1hY — ANI (@ANI) October 21, 2021 -
సరికొత్త ఘనత సాధించిన సూపర్ లగ్జరీ కారు లంబోర్ఘిని ఉరుస్
ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్ఘిని సరికొత్త ఘనత సాధించింది. ప్రముఖ లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని ఉమ్లింగ్ లా పాస్ రహదారిపై నడవడం ద్వారా భారతదేశంలో మరో మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 9న రెండుసార్లు సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌లో ఉరుస్ ప్రయాణించడంతో ఇప్పటి వరకు లంబోర్ఘిని ప్రయాణించిన ఎత్తైన ప్రాంతం ఇదేనని లంబోర్ఘిని ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నడపడం కష్టం ఉమ్లింగ్ లా పాస్ అనేది భారతదేశంలోని లడఖ్‌లో ఒక పర్వత మార్గం. ఈ మార్గం సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల అక్కడ వాహనం నడపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ మార్గంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. "లంబోర్ఘిని ప్రపంచంలోని అత్యధిక క్లిష్టమైన రహదారిపై నడుస్తున్నపుడు మాకు నిజంగా గర్వించదగ్గ క్షణం" అని లంబోర్ఘిని ఇండియా అధిపతి శ్రీ శరద్ అగర్వాల్ చెప్పారు. (చదవండి: ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద) ఈ సంధర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ)కు అభినందనలు తెలియజేశారు. లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రపంచంలో అన్ని మార్గాలలో ప్రయాణించే అగ్రశ్రేణి కారు. 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ తో నడిచే ఈ ఉరుస్ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక క్లిష్టమైన రోడ్డులో నడవడంతో తన సామర్థ్యాలను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో లంబోర్ఘినికి ఉరుస్ ప్రారంభ ధర ₹3.16 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రస్తుతం 8-10 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
లద్దాఖ్‌లో భూకంపం.. ఉలిక్కి పడిన స్థానికులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. లద్దాఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12.30 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్టు చెప్పారు. ఇళ్లనుంచి జనం పరుగులు తీశారని, భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. దాయాది దేశం పాకిస్తాన్లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతగా అధికంగా ఉండటంతో వందలాది పలు ఇల్లు, భవనాలు కూలిపోయాయి. (చదవండి: మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై? ) -
లద్దాక్‌లో పర్యటించిన ఎంపీ బాలశౌరి
చిలకలపూడి: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌లో పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సోమవారం పర్యటించారు. ఆ రాష్ట్ర డీఐజీ, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఉన్నతాధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు. లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి -
సరిహద్దులో చైనా దూకుడు!
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనికుల కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో దిష్టవేయని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. భారత్ సైతం చైనాకు ధీటుగా స్పందిస్తోంది. -
శరవేగంగా శ్రీనగర్–లద్దాఖ్ భారీ టన్నెళ్ల నిర్మాణం
శ్రీనగర్ సోనామార్గ్ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్‌సింగ్ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్–మోర్ టన్నెల్ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. తగ్గనున్న రవాణా భారం... సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్–మోర్ టన్నెల్ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది. పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. -
భారత్ మేల్కొనాల్సిన సమయం ఇదే!
చైనా, పాకిస్తాన్ మన సరిహద్దుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలను సైతం ‘మొదటగా ప్రయోగించం’ అనే విధానాన్ని భారత్ ఇప్పటికైనా వదిలేయాలన్న ఆలోచనలకు బలం చేకూరుతోంది. లడ్డాఖ్ అనుభవాల తర్వాత భారత్ యుద్ధంలో నేరుగా చైనాను ఢీకొట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భారత అణు విధానం ఎలా ఉండాలి? సంప్రదాయ రీతుల్లోనూ పీఎల్ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎలా? పీఎల్ఏ తరహాలో భారత మిలటరీలో సంస్కరణలు చేపట్టడం ఎలా? రక్షణ పరంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో ఆలస్యం జరిగేందుకు వీల్లేదు. చైనాతో లడ్డాఖ్ లడాయి ఇంకా ముగియలేదు. అక్కడ సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిన పొరుగు దేశం మన మిలటరీ శక్తి సామర్థ్యాలను పరీక్షకు నిలపడమే కాకుండా... అణ్వస్త్ర నిరోధకతపై భారత విదేశాంగ విధానంలోని డొల్లతనాన్నీ బట్టబయలు చేసింది. ఆ మాటకొస్తే భారత్ అణ్వాయుధాలు తనకో లెక్కే కాదన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. 1998 మే 11, 13 తేదీల్లో భారత్ వరుసగా ఐదు అణు పరీక్షలు నిర్వహించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ఒక లేఖ రాశారు. చైనా, పాకిస్తాన్ కుమ్మక్కై అణు పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగానే భారత్ కూడా అణు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని ప్రస్తావించడమే కాకుండా... భారత్ ముందస్తు అణ్వస్త్ర ప్రయోగం చేయదని హామీ కూడా ఇచ్చారు. ఈ విధానాన్ని ప్రస్తుత పరిణామాలకు అన్వయించుకుంటే... ముందుగా చైనా దాడి చేస్తేనే మనం ప్రతిదాడికి పాల్పడగలం. అయితే ఈ ప్రతిదాడులు జల, వాయు, భూతల మార్గాల్లో ఏదైనా కావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ రెండు వైపుల నుంచి యుద్ధం చేసే పరిస్థితి లేదు. అగ్ని–5 ద్వారా భూతలంపై నుంచి చైనాపై అణుదాడి చేయవచ్చు కానీ.. ఈ క్షిపణి ఇంకా రక్షణ దళాల సేవకు సిద్ధంగా లేదు. సముద్రమార్గం గుండా దాడి చేసేందుకు భారత్ సొంతంగా తయారు చేసుకున్న ఐఎన్ఎస్ అరిహంత్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. దీనికి సాయంగా పనిచేసే ఐఎన్ఎస్ అరిఘాత్‌ను కే–4 జలాంతర్గాములను ఉపయోగించి చైనాకు 3,500 కిలోమీటర్ల దూరం నుంచి ఢీకొట్టాలి. కానీ కే–4ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతిదాడులు చేసే సన్నద్ధత కరువైన నేపథ్యంలో భారత్ తన ‘నో ఫస్ట్ యూజ్ పాలసీ’లో మార్పులు చేసుకోవాలని కొందరు రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కొన్నేళ్ల క్రితం రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. అణ్వాస్త్రాల నిరోధానికి కాకుండా యుద్ధాన్ని గెలిచే ఆయుధాలుగా భారత్ పరిగణించాల్సిన సమయం ఇదేనని, తద్వారా సంప్రదాయ యుద్ధరీతుల్లో చైనా కంటే తక్కువ అన్న నూన్యతాభావాన్ని పూరించుకోవచ్చునన్నది వీరి విశ్లేషణ. అణ్వాయుధ దేశాలు యుద్ధానికి దిగే పరిస్థితి లేదని అనుకుంటే భారత్, చైనా మధ్య యుద్ధం జరగనే జరగదు. ఒకవేళ జరిగితే సరిహద్దుల వద్ద పరిమిత స్థాయిలోనే ఉంటుంది. కానీ ఈ అంచనాపై సరైన విశ్లేషణ జరగలేదు. ఎవరి శక్తి ఎంత? భారత్ విషయాన్ని విశ్లేషించే ముందు ప్రపంచంలోని అణ్వాయుధ దేశాల పరిస్థితి ఒక్కసారి తెలుసుకుందాం. 1950లలో సంప్రదాయ యుద్ధంలో అమెరికా మిలటరీపై సోవియట్ యూనియన్‌దే పైచేయిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కొంచెం వెనుకబడే ఉన్నప్పటికీ వాసి కంటే రాశి మేలన్న అంచనాతో సోవియట్ యూనియన్ ఉండేది. నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్ హోవర్ సోవియట్ యూనియన్‌తో ట్యాంకులు, గన్నుల విషయంలో పోటీపడలేదు. బదులుగా వ్యూహాత్మక అణ్వాయుధాలతో యూరప్‌లో సోవియట్ యూనియన్‌కు చెక్ పెట్టగలిగారు. శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉండటంతో అమెరికా మాట చెల్లుబాటైంది కూడా. సోవియట్ యూనియన్ అణ్వాయుధ ప్రతిదాడికి పాల్పడితే భారీ అణ్వాస్త్రాలతో దానిపై దాడి చేయాలన్న ‘న్యూలుక్’ వ్యూహంతో అమెరికా వ్యవహరించింది. 1970లకు వచ్చేసరికి సోవియట్ యూనియన్ సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యూహాత్మక అణ్వాయుధాల విషయంలో అమెరికాకు సమానంగా ఎదిగింది. దీంతో అమెరికా అణ్వాయుధాలు, సంప్రదాయ క్షిపణుల మేళవింపుతో శత్రువుకు చెక్ పెట్టాలన్న ‘సెకెండ్ ఆఫ్సెట్’ పాలసీని ఆచరణలో పెట్టింది. కానీ ఇటీవలి కాలంలో చైనా కూడా తనదైన రీతిలో అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది. తైవాన్ జలసంధి, దక్షిణ చైనా సముద్రాల్లో ఇరుపక్షాలు నిత్యం మోహరించి ఉండటం ఇందుకు ఉదాహరణ. ఈ రెండు ప్రాంతాల్లోనూ నౌకల సురక్షిత ప్రయాణానికి గస్తీ కాస్తున్న అమెరికా ఏ క్షణంలో చైనా గీసిన గీతను దాటుతామో అన్న ఆందోళనతో పనిచేస్తోంది. సంప్రదాయ యుద్ధంలో చైనాను ఢీకొట్టి గెలవడంపై అమెరికాకూ కొన్ని సందేహాలు ఉన్నాయి. హద్దుల నిర్ణయానికి సంప్రదింపులు... బైడెన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికా చైనాతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీనియర్ వైస్ ఛైర్మన్ జనరల్ షూ కిలియాంగ్ను కలిసి ఎవరి పరిధి ఎంతవరకో నిర్ణయించుకునేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి చైనా ససేమిరా అంటోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రాల్లో ఈ అసందిగ్ధ పరిస్థితులు కొనసాగితే ఆసియన్ దేశాలకూ ముప్పే. అందుకే ఈ దేశాలు కొంచెం వెనక్కు తగ్గాల్సిందిగా అమెరికా మిలటరీకి విజ్ఞప్తి చేశాయి కూడా. అమెరికా పరిస్థితి ఇలా ఉంటే... అమెరికా వద్ద ఉన్న భారీ అణ్వాయుధ సంపత్తి, ముందస్తు వాడకానికి వెనుకాడని అమెరికా వైఖరిపై చైనా ఆందోళన చెందుతోంది. ఈ కారణంగానే అణ్వాయుధాల తగ్గింపునకు అమెరికా, రష్యా చేసుకున్న ఒప్పందం ‘స్టార్ట్’లో భాగస్వామి అయ్యేందుకు చైనా నిరాకరిస్తోంది. తమ అణ్వాయుధాలు తక్కువే కాకుండా చిన్నవని చెబుతూనే చైనా ముందస్తు అణ్వాయుధ ప్రయోగమన్న విధానాన్ని మార్చుకునేందుకూ తటపటాయిస్తోంది. ఫలితంగా మరిన్ని వ్యూహాత్మక ఆయుధాలను సముపార్జించుకోవడంతోపాటు అణ్వాయుధ నిరోధ విధానాన్ని అడ్డుగా పెట్టుకుని అమెరికా దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నియంత్రించాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీని వదిలేయాలన్న ఆలోచనకు బలం చేకూరుతోంది. కానీ మనం ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశమూ ఉండదు. హెచ్చరించడం కోసమైనా చైనా తన ఆయుధసంపత్తిని వాడటం మొదలుపెడితే అది మనకు ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. అలాగని పరిమిత స్థాయిలో సంప్రదాయ యుద్ధంలోనూ మనం చైనాను ఢీకొట్టే పరిస్థితి లేదు. సశేష ప్రశ్నలు బోలెడు... చైనాతో అటు సంప్రదాయ రీతుల్లో, ఇటు అణ్వాయుధాలతో సరితూగని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాన్ని ఎదుర్కొనే విషయంలో ఎన్నో ప్రశ్నలు సశేషంగానే మిగిలి ఉన్నాయి. అణ్వాయుధాలను యుద్ధ నివారణకు పావుగా వాడటం ఎలా? భారత అణు విధానం ఎలా ఉండాలి? అణ్వాయుధ నిరోధ విధానం విఫలమైన నేపథ్యంలో అగ్ని–5, అణ్వాయుధ క్షిపణులతో కూడిన జలాంతర్గాముల పాత్ర ఏమిటి? సంప్రదాయ రీతుల్లోనూ పీఎల్ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎలా? పీఎల్ఏ తరహాలో భారత మిలటరీలో సంస్కరణలు చేపట్టడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో ఆలస్యం జరిగేందుకు వీల్లేదు. లడ్డాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో ఆక్రమించుకున్న భూభాగాలను సుస్థిరం చేసుకునేందుకు చైనా ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు పాకిస్తాన్ మనకంటే ఎక్కువ అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు వస్తున్న సమాచారం ఏమంత మంచిది కాదు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత చైనా, పాక్ మధ్య మిలటరీ పరమైన బం«ధం దృఢమైంది. ఒకవేళ భారత్ చైనాల మధ్య యుద్ధమంటూ వస్తే... పాకిస్తాన్ అనుకోని అతిథిలా రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఉత్తర దిక్కునే కాదు.. పశ్చిమంలోనూ భారత్ పరిస్థితి కష్టతరమవుతోందనేది సత్యం. ఇది భారత్ మేల్కొనాల్సిన సమయం. వ్యాసకర్త: ప్రవీణ్ సాహ్నీ ఫోర్స్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ -
పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో.. ప్రకృతి విన్యాసం!
జమ్ము–కశ్మీర్ అంటేనే ప్రకృతి వైవిధ్యాలకు నిలయం. ఈ ప్రకృతి విచిత్రం కూడా అక్కడిదే. కశ్మీర్, లధాక్ రీజియన్‌లో ఉంది. లేహ్ నుంచి కార్గిల్‌కు వెళ్లే దారిలో కారులో ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఎటు చూసినా మనం ఎత్తులోకి ప్రయాణిస్తున్నట్లే అనిపిస్తుంది. రోడ్డు ఎంతో దూరం కనిపించదు. పైకి వెళ్తుంటే మన ముందు ఉన్న రోడ్డు కూడా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాలి కదా. కానీ ఓ వంద అడుగుల దూరం కంటే కనిపించదు. మన వాహనం ముందుకు వెళ్తుంటే మరో వంద అడుగులు మేర రోడ్డు కనిపిస్తుంటుంది. మనం పైకి వెళ్తున్నామా, కిందకు వెళ్తున్నామా అనే సందేహ నివృత్తి కోసం కారాపి గమనిస్తే కారు దానంతట అదే మెల్లగా ముందుకు సాగిపోతుంటుంది. అంటే మనం ప్రయాణిస్తున్నది కిందకే అన్నమాట. పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రకృతి విన్యాసం ఇది. విశ్వాసం!! ఈ విచిత్రం పర్యాటకులకు మంచి వినోదం. అయితే స్థానికులు మాత్రం ‘ఇది ఒకప్పుడు ఇది స్వర్గానికి వెళ్లే దారి’ అంటూ అందమైన కథనం చెప్తారు. ఇక్కడ మార్కింగ్ పాయింట్‌గా ఒక పసుపు రంగు బాక్స్ ఉంటుంది. వాహనాన్ని అక్కడ ఆపి ఈ ఫీల్‌ని ఆస్వాదించవచ్చు. ఈ విచిత్రం మనదేశానికే పరిమితమా లేక ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? అనే సందేహం రావడం సహజమే. ఆర్మీనియాలోని మౌంట్ అరాగాట్ కూడా ఇలాంటి విచిత్రాన్ని సొంతం చేసుకున్న పర్యాటక ప్రదేశం. సమీపంలో సింధునది మాగ్నటిక్ కొండకు పక్కనే సింధు నది ప్రవహిస్తోంది. ఇక్కడ పర్యటించడానికి జూలై నుంచి అక్టోబర్ వరకు అనువుగా ఉంటుంది. మాగ్నటిక్ హిల్ టూర్‌ను లధాక్ పర్యటనలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ ట్రిప్‌లో లధాక్, నుబ్ర, పాంగాంగ్ వంటి ప్రదేశాలను కూడా కవర్ చేయవచ్చు. బస: లేహ్‌లో హోటళ్లు ఉంటాయి. హోమ్‌స్టేలో కూడా బస చేయవచ్చు. డ్రైవింగ్ ఇష్టపడే వాళ్లు కారు అద్దెకు తీసుకుని మాగ్నటిక్ హిల్‌కు స్వయంగా నడుపుకోవచ్చు. ఆహారం: ఈ రూట్లో రెస్టారెంట్లలో చాయ్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆహారం లేహ్ లోనే ప్యాక్ చేయించుకుని వెళ్లడం మంచిది. -వాకా మంజులారెడ్డి -
‘మాస్ టూరిజం’ను కట్టడిచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాస్ టూరిజం కారణంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, భారీ భవంతులు నిర్మించడంతో లేహ్–లద్ధాఖ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జీవావరణ పరిస్థితులు దెబ్బతింటాయని కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ గంజి కమలవర్ధనరావు అభిప్రాయపడ్డారు. లేహ్, కార్గిల్, నుమ్రా లోయ, లద్ధాఖ్‌లలో మాస్ టూరిజంతో జీవావరణ సమస్యలు తలెత్తకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేలా పరిష్కారాలు కనుగొనాలన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లేహ్‌లో ‘లద్ధాఖ్: నూతన ప్రారంభం, కొత్త లక్ష్యాలు’ పేరిట జరుగుతున్న మెగా టూరిజం ఈవెంట్లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తూనే మాస్ టూరిజంను కట్టడి చేయాలన్నారు. ఆధునిక హోటళ్ల కోసం కాంక్రీట్ భవనాలు నిర్మించే కన్నా స్థానికుల ఇళ్లలో పర్యాటకులు బస చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫైవ్‌స్టార్ హోటల్ స్థాయిలో ఆహారం, ఆతిథ్యం అందించేలా భాషా, తదితరాల్లో స్థానికులకు పర్యాటక శాఖ శిక్షణ ఇస్తోందన్నారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల కంటే ఎక్కువగా హెలిప్యాడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో 10వేలకుపైగా ప్రాంతాల్లో స్కీయింగ్ క్రీడా వేదికలున్నాయని, దాంతో కోట్లాది మంది పర్యాటకుల రద్దీ కారణంగా మంచు కరిగి, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి జీవావరణ మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలన్నారు. కులూ మనాలీ, ఊటీ, మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు చాలా మారాయన్నారు. లేహ్‌లోని వందలాది ట్యాక్సీల్లో చాలావరకు 10ఏళ్ల పాతవని, కర్భన ఉద్గారాల కట్టడిపై పటిష్టమైన విజన్ డాక్యుమెంట్ అవసరమన్నారు. కోలుకుంటున్న పర్యాటక రంగం కోవిడ్ కారణంగా పర్యాటకరంగం కుదేలైందని, అయితే గత రెండు నెలలుగా దేశీయ పర్యాటకం మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమని కమలవర్ధనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 1.2కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చారని, అభయారణ్యాలు, తీరప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో సందడి కనిపిస్తోందని తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యాటకం అభివృద్ధిపై శ్రద్ధవహించాలన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, గ్రామీణ పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్రాలు, పర్యాటకశాఖ దృష్టిసారించాలని కమలవర్ధన రావు సూచించారు. ఈ రంగం వృద్ధి కోసం మీడియాలో ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. సినిమా టూరిజంను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కశ్మీర్, లేహ్–లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోందని పేర్కొన్నారు. స్థానిక భాగస్వామ్యం ఎంతో కీలకం: కిషన్‌రెడ్డి గత 40 ఏళ్లలో లద్దాఖ్‌లో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి లద్ధాఖ్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ మెగా టూరిజం ఈవెంట్లో కిషన్‌రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ‘లద్దాఖ్ అభివృద్ధికి దేశంలోని వేరే రాష్ట్రాల టూర్ ఆపరేటర్లు, స్థానికులతో చర్చలు జరిపేందుకు ఈవెంట్ మంచి వేదిక’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లద్దాఖ్ పర్యాటక అభివృద్ధిపై చర్చించేందుకు ‘లద్దాఖ్ విజన్ డాక్యుమెంట్’ను కేంద్ర పర్యాటక శాఖ సిద్ధం చేసిందన్నారు. టూరిస్ట్ వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ మల్టీమీడియా షోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23.21 కోట్లను లద్దాఖ్‌కు అందించిందన్నారు. ఈవెంట్లో లద్దాఖ్ టూరిజం సౌకర్యాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, చర్చా గోష్టిలు జరుగుతున్నాయి. ఈ రంగంలోని నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమాన్యాలు, దౌత్యవేత్తలు, ‘హోం స్టే’ యజమానులు సహా 150 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. సోలార్‌లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్‌లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
బైక్, లద్ధాక్.. ఓ జంట
నిత్యం బైక్‌లపైనే తిరిగే ఉద్యోగం కావడమేమో గానీ.. ఆ యువకుడు బైక్ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.. అందుకు సంబంధించి వీడియోలను యూట్యూబ్‌లో చూడటం మొదలెట్టాడు. అలా రాష్ట్రం నుంచి బైక్ రైడింగ్ చేసే సుమారు 20 మంది వ్లాగ్‌లను యూట్యూబ్‌లో గమనిస్తూ వచ్చాడు. అయితే వారంతా ఒంటరిగానే బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 12 మంది లద్ధాక్ ఒంటరిగానే వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో తను భార్యతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది.. వెంటనే భార్యకు ఆ విషయం చెప్పాడు. మొదట ఒకింత భయపడ్డా.. భర్త ఉత్సాహానికి ముచ్చట పడుతూ ఓకే చెప్పేసింది.. లద్ధాక్ వెళ్లొచ్చింది. పలమనేరు: మండలంలోని అప్పినపల్లెకు చెందిన రంపాల రమేష్ అదే మండలంలోని ఓ ప్రైవేట్ డె యిరీలో ఐటీ సలహాదారు. అతని భార్య తులసీకుమారి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు గత నెల రెండో తేదీన తమ యమహా ఎఫ్‌జీఎస్ వీ3 బైక్ పై తమ సాహస యాత్రను ప్రారంభించారు. పలమనేరు నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ, పానిపట్, అంబాలా, పతన్‌కోట్, జమ్మూ, పత్నిటాప్, సింథన్‌టాప్, అనంత్‌నాగ్, శ్రీనగర్, దాల్ సరస్సు, కార్గిల్, లేహ్, వారిల్లాపాస్, చెంగాలాటాప్, లద్ధాక్ దాకా ప్రయాణం సాగించారు. మార్గం మధ్యలోని పుణ్య స్థలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సందర్శిస్తూ వెళ్లారు. అక్కడి నుంచే కష్టాలు జమ్మూ బోర్డర్ వరకూ వీరి ప్రయాణం సాఫీగానే సాగినా.. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. విపరీతమైన చలి వాతావరణం, కొండ మార్గాలు, లోయలు, సముద్ర మట్టానికి 982 అడుగుల ఎత్తు లో ప్రయాణం.. అయినా పట్టువదలకుండా తమ ప్రయాణాన్ని సాగించి ఎట్టకేలకు లద్ధాక్ చేరారు. అక్కడి ప్రజలు వీరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అక్కడ లాడ్జిలు, హోటళ్ల వంటివి ఉండ వు. స్థానికులే ప్రయాణికులకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ జంటకు కూడా ఆశ్రయం ఇచ్చి తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని రమేష్ దంపతులు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తమ యాత్రలోని రోజువారి విశేషాలను ‘రమేష్ రంపాల ఫస్ట్ కపుల్ రైడర్ ఫ్రం చిత్తూరు’ అనే వ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు. తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని ఆదివారం వీరు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వీరికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. లడక్ వెళ్లి రావడానికి వీరికి 37 రోజుల సమయం పట్టింది. మొత్తం 11,500 కి.మీ ప్రయాణించారు. గ్రామస్తుల సత్కారం ఈ జంట లద్ధాక్‌కు బైక్‌పై వెళ్లి వస్తున్నారని తెలిసి అప్పినపల్లె్ల గ్రామస్తులు ఆలయంలో వీరి పేరున ప్ర త్యేక పూజలు చేయించారు. అనంతరం రమేష్, తులసీకుమారి జంటను సన్మానించారు. పలమనేరు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ వీరికి అభినందనలు తెలిపా రు. ఇండియా–పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒకింత ఆందోళన చెందామని, అక్క డి ప్రజలు ప్రేమానురాగాలు చూపినట్టు తెలిపారు. ఈ యాత్ర ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసిన ట్టు రమేష్, తులసీకుమారి దంపతులు చెప్పారు. -
సాహసయాత్ర: ఒంటి కాలితో సైకిల్ మీద 3,700 కిమీ
తిరువనంతపురం: మన మీద మనకు నమ్మకం.. గట్టి సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి పోరాడవచ్చు. సాధించాలనే తపన నీకుంటే.. విధి సైతం నీ ముందు తలవంచి తప్పుకుంటుంది అంటారు కార్య సాధకులు. ఈ మాటలను నిజం చేసి చూపాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పక్షవాతం వచ్చి కుడి కాలు చచ్చు బడింది. దాంతో ఉద్యోగం కోల్పోయాడు. అయినా అతడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంగ వైకల్యాన్ని పక్కకు పెట్టి.. ఒంటి కాలితో సైకిల్ తొక్కుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లా చేరాలని భావించాడు. లద్ధాఖ్ నుంచి మొదలు పెట్టి 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంగ వైకల్యం అతడికి అడ్డంకిగా మారలేదు. అతడి ప్రయాణం.. పయనం ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. కేరళ, త్రిసూర్‌కు చెందిన మహ్మద్ అశ్రఫ్ కొన్నేళ్లుగా దుబాయ్‌లో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తూండేవాడు. సాపీగా సాగిపోతున్న అతడి జీవితంలో 2017లో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. పెద్ద ప్రమాదానికి గురయ్యాడు మహ్మద్.. ఫలితంగా పక్షవాతం వచ్చి అతడి కుడి కాలు పడిపోయింది. దాంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘2017లో బైక్ యాక్సిడెంట్ అయ్యింది. 9 ఆపరేషన్లు చేశారు. ఏళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీటన్నింటిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం గతేడాది, ఏప్రిల్‌లో పర్వతాలు ఎక్కడం ప్రారంభించాను. దాంతో నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. పర్వతారోహణతో ప్రేమలో పడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ ప్రయాణంలో నా లోపమే నా సామర్థ్యం అని తెలిసి వచ్చింది. దాంతో మనిషి తల్చుకుంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాలనుకున్నాను. నేను కుంగిపోయి ఉంటే.. మంచానికే పరిమితం అయి ఉండేవాడిని. కానీ నేను అలా ఉండాలని కోరుకోలేదు. సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలనుకున్నాను. అందుకే ఈ సాహసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు. ‘‘17,582 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లాను సైకిల్ మీద చేరుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి 11 రాష్ట్రాలు దాటాను. రోజుకు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు ఓ మడతపెట్టగలిగే ఓ టెంట్, నిద్ర పోవడానికి ఉపయోగించే ఓ బ్యాగ్ తీసుకుని జర్నీ ప్రారంభించాను. రాత్రి పూట పెట్రోల్ బంకుల్లో నిద్రపోయేవాడిని’’ అని తెలిపారు. ‘‘ఈ ప్రయాణంలో నాకు ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. 1000 కిలోమీటర్లు ప్రయాణించి త్రిసూర్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాను. నా ప్రయాణం గురించి తెలిసి నాకు ఆహారం, బస ఏర్పాటు చేశారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటాను’’ అన్నాడు. కృత్రిమ కాలు అమర్చుకోవచ్చు కదా అంటే.. ‘‘మూడేళ్లు ఆస్పత్రిలో ఉండే సరికి నా కుటుంబం పొదుపు చేసిన మొత్తం ఖర్చయ్యింది. ఈ టూర్ పూర్తయ్యాక డబ్బులు పోగేసి.. సర్జరీ చేయించుకుని.. కృత్రిమ కాలు పెట్టించుకుంటాను’’ అని తెలిపాడు మహ్మద్.