![Border Police Personnel Unfurled National Flag At 15000 Feet - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/26/Indo-Teb.jpg.webp?itok=PdUM9C8Y)
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్‌లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్ హిమవీర్స్ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment