Indo-Tibetan Border Police
-
భారత్–చైనా సరిహద్దులో ఏకంగా 108 కిలోల బంగారం స్వాధీనం
లేహ్: భారత్–చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఈ స్థాయిలో భారీగా అక్రమ బంగారం స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తదుపరి విచారణ కోసం బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్–సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవా«దీన రేఖకు ఒక కిలోమీటర్ దూరంలో ఐటీబీపీ 21వ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తారసపడ్డారు. ఐటీబీపీ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. సిబ్బంది కొంతదూరం వెంటాడి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. తనిఖీల్లో 108 కిలోల బంగారం లభించింది. స్మగ్లర్లను లద్దాఖ్ వాసులుగా గుర్తించారు. నిందితులను అధికారులు విచారిస్తున్నారు. -
22,850 అడుగుల ఎత్తులో యోగా
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్దు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు, వణికించే చలి.. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాల్‌కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్వతం భారత్–టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం. బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు. -
గడ్డకట్టే చలిలో 1500 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్‌లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్ హిమవీర్స్ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. -
సాయుధ బలగాల కుదింపు
న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్ఎస్జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలున్నాయి. -
ఐటీబీపీకి పెళ్లిళ్ల వెబ్సైట్
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ)లో పనిచేస్తున్న బ్రహ్మచారుల కోసం ఐటీబీపీ ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐటీబీపీలో పనిచేసే సిబ్బందికి సరిపడే జీవిత భాగస్వామిని వెతికిపెట్టేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి. ఐటీబీపీలో ప్రస్తుతం 25 వేల మంది అవివాహిత పురుష, వేయి మంది అవివాహిత మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించాయి. వీరు సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తుండటం వల్ల జీవిత భాగస్వామిని వెతకడం వారి కుటుంబాలకు కష్టంగా మారుతోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. దళంలో ప్రస్తుతం 333 జంటలు (భార్యాభర్తలు) పనిచేస్తున్నాయి. ఐటీబీపీలో పనిచేసే చాలా మంది సంస్థలోనే పనిచేసే భాగస్వామి కావాలని కోరుకుంటున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో వారు పనిచేస్తున్న రీత్యా భాగస్వామితో కలసి పనిచేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఈ వెబ్సైట్లో అవివాహిత లేదా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న, విడాకులు తీసుకున్న సైనికులు నమోదు చేసుకోవచ్చనితెలిపారు. ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో 150 మంది నమోదు చేసుకున్నారు. సాయుధ బలగాల్లోని మొత్తం 10 లక్షల మందిలో 2.5 లక్షల మంది అవివాహితులు. -
ఇండో–టిబెటిన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
సాక్షి, మచిలీపట్నం: బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన షేక్ హాజీ హుస్సేన్(28) ఇండో–టిబెటిన్ సరిహద్దులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గత ఆరేళ్లుగా బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. సరిహద్దులోని మంబా పర్వతాల వద్ద విధులు నిర్వహిస్తుండగా తీవ్రమైన చలితో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అక్కడి అధికారులనుంచి సమాచారం రావడంతో హుస్సేన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని శనివారం సాయంత్రానికి పంపిస్తామని అధికారులు ఫోన్లో తెలిపారని హుస్సేన్ తండ్రి షేక్ మహబూబ్ చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడైన హుస్సేన్‌కు ఈ ఏడాది వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. జవాన్ మృతిపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య సంతాపం తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదాతోపాటు వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. -
ఉద్యోగాలు
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్- 2015 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్-2015 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. విభాగం: మెకానికల్ అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ప్రథమ/ద్వితీయ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత లేదా బీఎస్సీ(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉండాలి. వయసు: 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 7 రాత పరీక్ష తేది: జనవరి 18 వెబ్సైట్: http://www.upsc.gov.in/ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్.. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ అర్హతలు: మెకానికల్/కెమికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: http://www.lpsc.gov.in/ ఇండియన్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. స్టెనోగ్రాఫర్/జూనియర్ స్టెనోగ్రాఫర్: ఖాళీలు: హిందీ: 376 ఇంగ్లిష్: 599 అర్హతలు: పదో తరగతితో పాటు ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జూనియర్ ట్రాన్స్‌లేటర్: 82 అర్హతలు: ఇంగ్లిష్/హిందీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఏదైనా పీజీతో పాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీలో హిందీ /ఇంగ్లిష్లను ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 56 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లేబర్ వెల్ఫేర్/సోషల్ వెల్ఫేర్‌లో డిప్లొమా లేదా ఎల్ఎల్బీ ఉండాలి. వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ద్వారా మరిన్ని పోస్టుల వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in/ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్: 76 విభాగం: యానిమల్ ట్రాన్స్పోర్ట్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21 వెబ్సైట్: http://itbpolice.nic.in/