
సాక్షి, మచిలీపట్నం: బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన షేక్ హాజీ హుస్సేన్(28) ఇండో–టిబెటిన్ సరిహద్దులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గత ఆరేళ్లుగా బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారు. సరిహద్దులోని మంబా పర్వతాల వద్ద విధులు నిర్వహిస్తుండగా తీవ్రమైన చలితో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అక్కడి అధికారులనుంచి సమాచారం రావడంతో హుస్సేన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాన్ని శనివారం సాయంత్రానికి పంపిస్తామని అధికారులు ఫోన్‌లో తెలిపారని హుస్సేన్ తండ్రి షేక్ మహబూబ్ చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడైన హుస్సేన్‌కు ఈ ఏడాది వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. జవాన్ మృతిపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య సంతాపం తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదాతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment