BSF jawan died
-
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర..నేలకొరిగిన బీఎస్ఎఫ్ జవాన్
కాంకేర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఒక బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు. పర్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సడక్టోలా గ్రామ సమీపంలో కూంబింగ్ జరుపుతుండగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అఖిలేశ్ రాయ్(45) చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. -
గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలి జవాన్ మృత్యువాత
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): బీఎస్ఎఫ్ జవాను ఒకరు గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 70వ బెటాలియన్ జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా కాటేకల్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో మకాం వేశారు. తనిఖీల కోసం బయలుదేరి వెళ్తున్న సమయంలో బల్బీర్ చంద్ అనే జవాను వద్ద పౌచ్‌లో ఉన్న గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలింది. తీవ్రంగా గాయపడిన బల్బీర్‌ను వెంటనే దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బల్బీర్ చంద్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. -
అనారోగ్యంతో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
విజయనగరం: మండలంలోని చినభోగిలి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నగర ప్రసాద్(44) అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారు. ప్రసాద్ మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామం చినభోగిలికి కుటుంబీకులు తీసుకొచ్చారు. బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొని అధికారిక లాంఛనాలతో నిర్వహించి వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శ్మశాన వాటిక వద్ద బీఎస్ఎఫ్కు చెందిన కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, సిబ్బంది పాల్గొని ఆయన భార్యకు జాతీయ పతాకాన్ని అందజేశారు. గార్డు ఆఫ్ హానర్ కార్యక్రమాన్ని నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వీరమణ, ఎస్సై కె.నీలకంఠం, ఆర్ఐ ఎన్.శ్రీనివాసరావు, సర్పంచ్ కురమాన రాధ, గ్రామ వీఆర్ఓ ఎస్ లక్ష్మి, కుటుంబ సభ్యులు,స్నేహితులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. కుటుంబసభ్యుల రోదన ప్రసాద్ గుజరాత్ రాష్ట్రంలోని పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 23ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రసాద్ సెలవుపై జూలై 30న ఇంటికి చేరుకున్నారని భార్య తెలిపారు. మృతి చెందిన ప్రసాద్‌కు తల్లిదండ్రులు గంగయ్య, సీతమ్మతో పాటు భార్య పవిత్ర, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న ప్రసాద్ మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకోపోయిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. -
కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. ఆపరేషన్‌లో భాగంగా ఎల్ఓసీకి సమీపంలోని మాచిల్ సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశాయి. ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
సర్వీస్ రివాల్వర్‌తో జవాను ఆత్మహత్య
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంకన్జోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. ) బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియన్ బృందం శుక్రవారం సంగం గ్రామంలో నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లోనూ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శిబిరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా , దోటమెటా గ్రామాల మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వగ్రామం ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి వచ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్రవారం ఇదే బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వస్తుందేమో అన్న డిప్రెషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. (హిమాచల్ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన ) -
ఇండో–టిబెటిన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
సాక్షి, మచిలీపట్నం: బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన షేక్ హాజీ హుస్సేన్(28) ఇండో–టిబెటిన్ సరిహద్దులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గత ఆరేళ్లుగా బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. సరిహద్దులోని మంబా పర్వతాల వద్ద విధులు నిర్వహిస్తుండగా తీవ్రమైన చలితో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అక్కడి అధికారులనుంచి సమాచారం రావడంతో హుస్సేన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని శనివారం సాయంత్రానికి పంపిస్తామని అధికారులు ఫోన్లో తెలిపారని హుస్సేన్ తండ్రి షేక్ మహబూబ్ చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడైన హుస్సేన్‌కు ఈ ఏడాది వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. జవాన్ మృతిపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య సంతాపం తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదాతోపాటు వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. -
ఎన్నికల వేళ ఛత్తీస్‌లో హింస
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బీఎస్ఎఫ్ ఎస్సైతోపాటు ఓ మావోయిస్టు మృతి చెందారు. కాంకేర్ జిల్లా కట్టకల్– గోమె గ్రామాల మధ్య రహదారిపై బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ) పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ ఎస్సై మహేంద్ర సింగ్‌ను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేంద్ర సింగ్‌ది రాజస్తాన్ రాష్ట్రమని అధికారులు చెప్పారు. ఇది గత 15 రోజుల్లో పేలిన నాలుగో ఐఈడీ కావడం గమనార్హం. బిజాపూర్ జిల్లా బద్రె సమీపంలోని అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికలు జరిగే బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు, బూబీ ట్రాప్లను పోలీసులు గుర్తించి, వెలికితీశారు. దంతెవాడ జిల్లా కోసల్‌నార్ గ్రామంలో డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల జాడలను గుర్తించామని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. నేడే మొదటి విడత పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు గాను 18 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్లు రియల్ ‘న్యూటన్’లు! సుక్మా: పాదరక్షలు లేకుండానే నదులు దాటాలి. అరకొర భద్రతా సిబ్బంది వెంటరాగా దట్టమైన అరణ్యాల గుండా ప్రయాణించాలి. రవాణా మార్గాలు లేనిచోటికి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా చేరివేత..ఇవీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పడుతున్న పాట్లు. పోలింగ్ అధికారిగా వెళ్లిన ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వ్యంగ్యంగా చూపించిన న్యూటన్ చిత్రంలోని అనుభవాల్ని తాము నిజ జీవితంలో చూస్తున్నామని కొందరు అభిప్రాయపడగా, మరికొందరైతే తమని తాము విప్లవ యోధుడు భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న బస్తర్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల అక్కడ వరుసగా మావోయిస్టులు దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అయినా వెరవకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. పోలింగ్ బూత్‌లకు చేరుకోవడానికి మైళ్ల దూరం నడిచినా, ప్రాణాలకు ముప్పున్నా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కొంత భయంగా ఉందని కొందరు చెప్పినా, ఎన్నికల విధులు నిర్వర్తించడం తమకు ఇష్టమేనని తెలిపారు. సుక్మాకు చెందిన 22 ఏళ్ల పంచాయతీ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ తనకు ఇది గర్వకారణమైన క్షణమని, తన గ్రామంలో హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి వ్యక్తిని తానేనని సంతోషం వ్యక్తం చేశారు. బీజాపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, భగత్‌సింగ్ తన స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. -
చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు ముందు మావోయిస్టుల విధ్వంసం
రాయపూర్ : చత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌కు ముందు ఆదివారం కంకేర్ జిల్లాలో జరిగిన మావోయిస్ట్‌ల దాడిలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. కట్టకల్, గోమ్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ బీఎస్ఎఫ్ బృందంపై ఐఈడీని పేల్చి విధ్వంసం సృష్టించారని కంకేర్ ఎస్పీ కేఎల్ ధ్రువ్ పేర్కొన్నారు. నక్సల్ దాడిలో గాయపడిన ఎస్ఐ మహేంద్రసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం ఆరు ఐఈడీలు అమర్చిన మావోలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేల్చినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఎన్కౌంటర్లో శనివారం ఓ మావోయిస్టు మరణించగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా దళ సిబ్బందితో పాటు దూరదర్శన్ కెమెరామెన్ మరణించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌లో చేపట్టిన ఐఈడీ పేలుడు ఇది నాలుగవది కావడం గమనార్హం.90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 12న, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. -
బీఎస్ఎఫ్ జవాన్ గొంతు కోసిన పాక్ సైనికులు
-
భారత జవాన్ గొంతు కోసిన పాక్ సైన్యం
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులు దారుణానికి తెగబడ్డారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన ఓ జవానును తుపాకీతో కాల్చి, గొంతుకోసి చంపేశారు. జమ్మూ ప్రాంతంలోని రామ్‌గఢ్ సెక్టార్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్ఎఫ్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. రామ్‌గఢ్ సెక్టార్‌లోని సరిహద్దు కంచె వద్ద ఎత్తుగా పెరిగిన ఏనుగుల గడ్డిని కోసేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్లారు. సరిహద్దులు స్పష్టంగా కనిపించడం కోసం ఇలాంటి అడ్డుగా ఉన్న గడ్డిని జవాన్లు కోయడం సాధారణమే. జవాన్లు గడ్డి కోస్తుండగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ప్రతికాల్పులు జరిపి చాకచక్యంగా తప్పించుకుని వచ్చారు. అయితే హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర సింగ్ కనిపించడం లేదన్న విషయాన్ని వారు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ముందుగా గడ్డినంతటినీ కోసేసి తప్పిపోయిన నరేంద్ర సింగ్ కోసం వెతకడం ప్రారంభించారు. తమ జవాన్‌ను గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా పాకిస్తానీ సైనికులను కూడా భారత సైన్యం ఫోన్లో కోరింది. కొద్ది దూరం వరకే వచ్చి జవాన్‌ను వెతికిన పాక్ సైనికులు, ఆ తర్వాత నీళ్లు ఉన్నాయంటూ ఆగిపోయారని బీఎస్ఎఫ్ వెల్లడించింది. 9 గంటల గాలింపు తర్వాత బుల్లెట్ గాయాలతో పడిఉన్న నరేంద్ర సింగ్ మృతదేహం కనిపించిందనీ, అతని గొంతు కూడా కోసి ఉందని తెలిపింది. ‘జవాను శరీరంలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతని గొంతు కోశారు. ఇలాంటి ఆటవిక ఘటన అంతర్జాతీయ సరిహద్దులో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. దీని వెనుక పాక్ సైనికులున్నారు. దీనికి బీఎస్ఎఫ్, ఇతర దళాలు తగిన సమాధానం చెబుతాయి’ అని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. -
జమ్మూలో పాక్ బలగాల దుశ్చర్య
జమ్మూ: కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్ఎస్ పుర, బిష్నా, ఆర్నియా సెక్టార్లలోని గ్రామాలు, బోర్డర్ ఔట్‌పోస్టులపై మోర్టార్లు, బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో జార్ఖండ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను సీతారాం ఉపాధ్యాయ, నలుగురు పౌరులు ప్రాణాలుకోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. పాక్ బలగాల చర్యలను మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని బీఎస్ఎఫ్ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ రామ్ అవతార్ చెప్పారు. 2011లో సీతారాం బీఎస్ఎఫ్లో చేరారు. అతనికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారని అధికారులు తెలిపారు. నేడు కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన ప్రధాని మోదీ రెండు రోజులపాటు కశ్మీర్లో పర్యటిస్తారు. లఢఖ్, కశ్మీర్ లోయ మధ్య అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించనున్న ప్రతిష్టాత్మక జోజిల్లా సొరంగం పనులను ఆయన శనివారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్ రింగ్‌రోడ్, జమ్మూ రింగ్‌రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కిషన్‌గంగా పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. -
పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో భారత జవాన్లపై పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
ఆ జవాను అమరుడయ్యారు!
శ్రీనగర్: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నామ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నామ్ ను మెరుగైన వైద్యం కోసం ఏయిమ్స్ కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తూ గుర్నామ్ చనిపోయారని ఓ అధికారి రాజేందర్ థాపా మీడియాకు తెలిపారు. పాక్ దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అమరుడైన జవాను సోదరి గుర్జీత్ కౌర్ శనివారం ఆరోపించారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, గుర్నమ్ ను విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించాలని కుదరని పక్షంలో అక్కడి నుంచి మంచి వైద్యుల బృందాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. (తప్పక చదవండీ: కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!) పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడు మందిని మట్టుపెట్టిన విషయం తెలిసిందే.