
శ్రీనగర్ : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో భారత జవాన్లపై పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment