ceasefire violation
-
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
పాక్ బరితెగింపు.. సరిహద్దులో కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. మనదేశంతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం(సెప్టెంబర్11) తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు గాయపడ్డట్లు సమాచారం. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కాల్పులతో అప్రమత్తమైనట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.కాగా, 2021లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన తర్వాత సరిహద్దు వెంబడి భారత్,పాకిస్తాన్ మధ్య కాల్పులు పెద్దగా లేవు. గతేడాది మాత్రం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడొకరు మృతి చెందారు. ఇదీ చదవండి.. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్ -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది. రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది. దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది! ముప్పేట దాడిలో నగరాలు మరోవైపు ఖర్కీవ్, చెర్నిహివ్తో పాటు కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను కూడా రష్యా సైన్యం పూర్తిగా చుట్టుముట్టి ముప్పేట దాడులు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. కీవ్ పరిసరాల్లో కందకాలు తవ్వి, నానా వస్తువులతో రోడ్లను బ్లాక్ చేసి రష్యా సేనలను నిలువరిస్తున్నారు. అయినా నగరంపైకి రష్యా క్షిపణులు, బాంబులు నిరంతరం వచ్చి పడుతూనే ఉన్నాయి. పరిసర ప్రాంతాలు, గ్రామాలపై కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా భారీ దాడి జరగవచ్చనే భయాల మధ్య జనం భారీగా రాజధాని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే కీవ్ ముట్టడి కోసం కొద్ది రోజుల క్రితం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన రష్యా పటాలం ఇప్పటికీ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉందని సమాచారం. ఆదివారం మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై దాడికి దిగాలని పౌరులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారిపై వీధి పోరాటాలకు దిగాలని సూచించారు. భారీగా సైన్యాలు దూసుకొస్తున్నా ప్రజలు ఉక్రెయిన్ సైనికులతో కలిసి వారిని ఎదుర్కొంటున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నారు. స్టార్‌లింక్ సిస్టమ్ ద్వారా తమ దేశానికి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ రష్యా దుర్మార్గాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు తోడ్పడుతున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ...అప్పటిదాకా పోరే: పుతిన్ ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగి తీరుతుందన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆదివారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ పుతిన్‌తో గంటకు పైగా జరిగిన ఫోన్ చర్చల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలపైనా పుతిన్ మరోసారి మండిపడ్డారు. అవి తమపై యుద్ధం ప్రకటించడమేనన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ ఆకస్మికంగా రష్యా వెళ్లి పుతిన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత జెలెన్స్కీతో కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఫైటర్ జెట్లు? ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలతో పాటు సహాయ సామగ్రి దాకా భారీగా అందుతోంది. తమకు ఫైటర్ జెట్లు అందజేయాలన్న జెలెన్స్కీ విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తోంది. ఈ విషయమై పోలండ్‌తో మాట్లాడుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో మరో అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఆక్రమించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపించారు. వెంటనే ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస బెర్లిన్: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని 15 లక్షల మంది వలస వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వలసల సంక్షోభం ఇదేనని తెలిపింది. మీడియాపై రష్యా ఉక్కుపాదం మాస్కో: ఉక్రెయిన్‌పై దాడితో సొంత దేశంలో వెల్లువెత్తుతున్న నిరసన గళాల్ని రష్యాలో పుతిన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తోంది. ఆదివారం పలు స్వతంత్ర ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్లను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మూత పడేలా చేసింది. అలాంటి సంస్థల్లో అమెరికా నిధులతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్ కూడా ఉంది. బెలారస్ ఉప రక్షణ మంత్రి రాజీనామా కీవ్: బెలారస్ ఉప రక్షణ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణలో పాలుపంచుకోవడం ఇష్టంలేక పదవిని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాను రక్షణమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. రష్యా బలగాలను తమ సరిహద్దుల్లో మోహరించడానికి అనుమతించినవారిలో గులేవిచ్ కూడా ఉన్నారు. ఆయనపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. -
విరామం లేని దాడులు..మాట తప్పిన రష్యా
లెవివ్: ఉక్రెయిన్‌లోని మరియూపోల్, వోల్నోవఖా నగరాల నుంచి సాధారణ పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు వీలుగా శనివారం దాదాపు ఐదున్నర గంటలపాటు పరిమిత స్థాయిలో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడం కీలక పరిణామంగా నిపుణులు భావించారు. రష్యా కొంత దిగి వస్తున్నట్లుగా అంచనా వేశారు. అయితే, కాల్పుల విరమణ హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియూపోల్, వోల్నోవఖా నగరాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించిందని, ఫలితంగా పౌరుల చేరవేత సాధ్యం కాలేదని ఉక్రెయిన్ తెలిపింది. కాల్పుల విరమణకు రష్యా కట్టుబడి ఉండలేదని, మరియూపోల్తోపాటు పరిసర ప్రాంతాలపై దాడులు యథాతథంగా కొనసాగించిందని, బయటకు వెళ్లాల్సిన పౌరులు అండర్‌గ్రౌండ్ స్టేషన్లలోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయ ప్రతినిధి కైరీలో టైమోషెంకో తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ రష్యాతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పౌరుల భద్రత దృష్ట్యా మరియూపోల్, వోల్నోవఖా నగరాల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తూ తొలుత రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరులు వెళ్లే మార్గాల్లో ఎలాంటి దాడులు జరుపబోమని హామీ ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ అధికారుల్లో ఆశలు చిగురించాయి. రెండు నగరాల నుంచి పౌరులను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. రష్యా సైన్యం మాట తప్పడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేయక తప్పలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడులు ఆపాలని రష్యాను కోరుతున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇరీనా వెరెషుక్ చెప్పారు. మరియూపోల్, వోల్నోవఖా సిటీల్లో ఉన్న తమ సేనలకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. అందుకే ప్రతిదాడులు చేశామన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది. కాల్పుల విరమణ అనేది చివరకు వృథా ప్రయాసగానే మిగిలిపోవడం ఉక్రెయిన్ను నిరాశపర్చింది. ఈ ఒప్పందం అమలయ్యేలా తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. జనం ఆకలి కేకలు మరియూపోల్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. గడ్డకట్టించే చలిలో వేలాది మంది ప్రజలు నానా కష్టాలూ పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహారం, మంచినీటి కొరత వేధిస్తోంది. ఫార్మసీల్లో ఔషధాలు దొరకడం లేదు. బయటకు వెళ్లిపోవడానికి వేలాది మంది సిద్ధమయ్యారని, ఇంతలో రష్యా దాడులు ప్రారంభించడంతో వారంతా ఆగిపోయారని మరియూపోల్ మేయర్ చెప్పారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని, అందుకే తరలింపు ఆపేశామని తెలిపారు. మరియూపోల్‌లో 2 లక్షలు, వోల్నోవఖాలో 20 వేల మంది ఉన్నట్లు అంచనా. -
పాక్ దుశ్చర్య, కుటుంబంలో పెను విషాదం
శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల ఎల్వోసీ సమీపంలో ఉండే ప్రాంతాలు, జనావాసాలపై పాకిస్తాన్ ఆర్మీ శుక్రవారం రాత్రి మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఖారీ కర్మారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు భారీగా మోర్టార్ షెల్స్ ప్రయోగించడంతో కర్మారా గ్రామంలోని ఇంటిపై ఒక షెల్ పడింది. ఈ దాడిలో మొహద్ రఫీక్ (58), అతని భార్య రఫియా బీ (50), కుమారుడు ఇర్ఫాన్ (15) అక్కడికక్కడే మరణించారు. (చదవండి: ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్‌కు..) అలాగే కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని, మరికొంత మంది గాయపడ్డారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇక తాజా ఘటనపై భారత్ ఆర్మీ స్పందించిందని వారు వెల్లడించారు. పాక్‌కు సరైన గుణపాఠం చెప్పాలని భారత సైన్యానికి ఆదేశిలిచ్చినట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు .కాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ పర్యటనకు ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. పాకిస్తాన్‌తో ఉన్న ఎల్వోసీ వెంట పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన శనివారం అక్కడ పర్యటించనున్నారు. జూన్ నెలలో పాక్ 411 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు సమాచారం. (నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్) -
కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం మోర్టార్లు విసురుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ము కశ్మీర్‌లోని నౌగాం సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోర్టార్లు విసురుతూ, ఇతర ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ సైనికులకు ధీటుగా బదులిచ్చామని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. కాగా పాక్ ఒక్క మంగళవారం నాడే రెండుసార్లు కాల్పులు విరమణ ఒప్పందాన్ని కాలరాసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. (పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలనుకుంటారు) సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు.. -
పాక్ కాల్పులు: భారత జవాను మృతి
కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో షాపూర్, కిర్ణి సెక్టార్ల పరిధిలో నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి కాల్పులు జరుపుతూ, మోర్టార్లు విసిరింది. ఈ దాడిలో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కాగా సరిహద్దుల వెంబడి పాక్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. గడిచిన ఆరునెలల్లో 2 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. గత ఆరు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. (ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం) -
2 వేల సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘన..
న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆరు నెలల్లో నియంత్రణ రేఖ వెంబడి మొత్తంగా దాదాపు 2 వేల సార్లు దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లో 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. ‘‘2020లో మొదటి ఆరు నెలల్లో 2 వేల సార్లకు పైగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గతేడాది ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడింది. ఆనాటి నుంచి రోజు రోజుకీ ఈ గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో 2020 తొలి అర్ధభాగంలోనే రికార్డు స్థాయిలో కాల్పుల ఉల్లంఘన జరిగింది ’’అని పేర్కొన్నారు.(పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!) కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. ఇక 2018లో ఈ సంఖ్య 1629గా నమోదైంది. ఇదిలా ఉండగా.. గత ఐదు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్‌లోని షాపూర్, కిర్ణి, కస్బా సెక్టార్లలో పాక్ ఆర్మీ పోస్టులను ముందుకు జరిపిందని తెలిపాయి. -
పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు సరైన రీతిలో బదులిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అమరులైన కల్నల్ అశుతోష్ శర్మతో పాటు మరో నలుగురు జవాన్ల పట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తరచుగాకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారత్‌లోకి ఉగ్రవాదులను రవాణా చేస్తోందని ఆరోపించారు. జనం ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై పోరాడాలన్న ఆసక్తి పాకిస్తాన్‌కు లేదని, ప్రస్తుతం దాని దృష్టి మొత్తం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడంపైనే ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్‌కు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. -
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
-
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
శ్రీనగర్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్‌కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. వీరి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ సైన్యం ప్రయత్నించినప్పటికి కుదరలేదు. దాంతో చేసేదేంలేక ఈ నెల 13న కాల్పులకు స్వస్థి పలికి.. తెల్ల జెండాలు చూపుతూ వచ్చి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. తెల్ల జెండాలతో రావడంతో మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం అంగీకరించింది. -
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య : జవాన్ మృతి
శ్రీనగర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ గటి సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఓ సైనిక జవాన్ మరణించారు. భారత సైన్యం దీటుగా ప్రతిస్పందించడంతో పాక్ సైనిక శిబిరాలకు భారీ నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో 36 ఏళ్ల భారత జవాన్ నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ మరణించారు.బిహార్‌లోని రోహ్తాస్కు చెందిన సింగ్‌కు భార్య రీతా దేవి ఉన్నారు. సింగ్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే నిబద్ధతతో కూడిన సైనికుడని, ఆయన సమున్నత త్యాగాన్ని దేశం సదా స్మరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇండో-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇటీవల తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు పెచ్చుమీరాయి. -
సరిహద్దులో పాక్ కాల్పులు
పూంచ్(జమ్మూ కశ్మీర్) : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తుట్లు పొడిచింది. సరిహద్దుల్లో శాంతి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. దాయాది దేశం మాత్రం ఎప్పటిలానే తన బుద్ధిని ప్రదర్శించింది. గురువారం పూంచ్ జిల్లాలోని కృష్ణా ఘాటీ సెక్టార్ నంగి టేక్రీ ప్రాంతంలో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు సరైన రీతిలో బదులు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే ఇలాంటి ఘటనలను భారత్ చూస్తూ ఊరుకోదని పాక్‌ను హెచ్చరించారు. -
కాల్పులకు దిగిన పాక్..జవాను మృతి
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్ పాల్(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది. ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌జీత్ సింగ్ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. -
సరిహద్దుల్లో బంకర్లు..
-
సరిహద్దుల్లో 14వేల బంకర్లు..
శ్రీనగర్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి దాడులు జరిపినప్పుడల్లా సైన్యంతో పాటు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితి తల్తెతకుండా ఉండేందుకు సరిహద్దుల్లో నివసిస్తున్న కుటుంబాల కోసం దాదాపు 14వేలకు పైగా బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. తద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు అక్కడి ప్రజలు బంకర్లలో రక్షణ పొందవచ్చు. కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరుగుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగిన ప్రతిసారి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారని పూంచ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. బంకర్ల నిర్మాణం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడి ప్రజలను బంకర్లకు తరలించనున్నారు. కాగా, 60 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ బంకర్ల నిర్మాణం గతేడాది జూన్‌లో ప్రారంభించినట్టు ప్రభుత్వ ఇంజనీర్లు తెలిపారు. వీటిని చాలా దృఢంగా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పేర్నొన్నారు. సాధారణంగా చేపట్టే ఇళ్ల నిర్మాణం కన్నా ఇవి పది రెట్లు మందంగా ఉంటాయని అన్నారు. వాటితో పోల్చితే 10 రెట్లు ఎక్కువ స్టీలు వీటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. -
3రోజుల్లో 20సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్
-
మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్
శ్రీనగర్ : సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామంటున్న దాయాది దేశం మరోసారి కపట బుద్ధిని బయట పెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్.. చర్చలకు సిద్ధమంటూనే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పూంచ్‌లోని కృష్ణ ఘటీ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ పన్నాగాన్ని పసిగట్టిన భారత జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిపి పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పాక్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలన్నీ మూసివేస్తున్నారు. -
ఈద్ రోజూ హింసే!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రంజాన్ పండుగరోజైన శనివారం కూడా కాల్పుల మోత మోగింది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై పాకిస్తానీ సైనికులు జరిపిన కాల్పుల్లో మణిపూర్‌కు చెందిన వికాస్ గురుంగ్ (21) అనే ఆర్మీ జవాన్ మరణించాడు. నియంత్రణ రేఖకు 700 మీటర్ల దూరంలో నౌషెరా సెక్టార్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులకు దిగింది. అనంతనాగ్ జిల్లాలోని బ్రకపొరా గ్రామంలో నిరసన కారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరుగుతుండగా గ్రెనేడ్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. శ్రీనగర్ శివారు ప్రాంతంలోనూ దుండగులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ దినేశ్ పాశ్వాన్ గాయపడగా సైనిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్ నగరంలోని సఫకదల్ ప్రాంతంలో ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్, కుప్వారా ప్రాంతాల్లోనూ భద్రతా దళాలతో నిరసనకారులు ఘర్షణలకు దిగారనీ, అయితే కశ్మీర్ లోయ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ లేవని ఓ పోలీస్ అధికారి చెప్పారు. మిఠాయిల కార్యక్రమం రద్దు సాధారణంగా పండుగ రోజున భారత సైనికులు, పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే కాల్పుల ఘటనల కారణంగా శనివారం భారత సైనికులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ పండుగరోజున కూడా పాకిస్తానీ సైనికులు కాల్పులు జరపడం నీతిమాలిన చర్యని ఓ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. పాక్ జవాన్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ భారత సైనికులు సంయమనం పాటించి విసిగిపోయిన అనంతరం ఎదురుకాల్పులకు దిగారన్నారు. బయటకొచ్చిన ఔరంగజేబు వీడియో ఆర్మీ జవాను ఔరంగజేబును గురువారం ఉదయం ఉగ్రవాదులు అపహరించి చంపివేయడం తెలిసిందే. ఔరంగజేబును చంపేందుకు కొద్దిసేపటి ముందు తీసినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఔరంగజేబును చంపడానికి ముందు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఔరంగజేబు విధులేంటి?, ఎక్కడెక్కడ పనిచేశాడు? తదితరాల గురించి ఉగ్రవాదులు ప్రశ్నించారు. -
మళ్లీ బరితెగించిన పాకిస్థాన్
జమ్మూ: పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్ సాంబా జిల్లాలోని చామ్‌లియాల్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో మీదుగా పాక్ మంగళవారం రాత్రి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మృతిచెందారు. అమరులైన వారిలో అసిస్టెంట్ కమాండెంట్ జతిందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్ నివాస్, కానిస్టేబుల్ హన్స్ రాజ్‌లుగా గుర్తించారు. మరో జవాను చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. బీఎస్ఎఫ్ బలగాలు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా.. పాక్ రేంజర్లు ఇలా బరితెగించి ఏకపక్షంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని ఇటీవల జరిగిన బీఎస్ఎఫ్-పాక్ రేంజర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే పాక్ కాల్పులకు తెగబడటంతో భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. -
యుద్ధానికి చోటులేదంటూనే..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కుటిలనీతిని మరోసారి బయటపెట్టింది. ఓ వైపు సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతూనే మరోవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి తావు లేదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి చోటు లేదని, అయితే అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలకు భారత్‌తే బాధ్యతని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఆరోపించారు. 2013 కాల్పుల విరమణ ఒప్పందాన్ని కట్టుదిట్టంగా అమలుచేసేందుకు పాక్ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నట్టు పాక్ పత్రిక డాన్ కథనం వెల్లడించింది. భారత దళాలు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని గఫూర్ ఆరోపించారు. సరిహద్దుల వెంబడి కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ కొనసాగిస్తే రంజాన్ కాల్పుల విరమణపై భారత్ పునరాలోచిస్తుందని స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ స్పందించింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. రంజాన్ సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపివేస్తూ కాల్పుల విరమణ పాటిస్తోందని, పాక్ ఇదేతీరున వ్యవహరిస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరాలోచిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ తేల్చిచెప్పారు. -
పాక్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి ఘాతుకానికి తెగబడింది. గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్ వర్షం కురిపించింది. కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. జమ్ముకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ బాల్కోట్ సరిహద్దుపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయని అధికారులు చెప్పారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. -
పాక్‌కు దిమ్మతిరిగేలా బదులిస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి నలుగురు సైనికులను హతమార్చిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సంసిద్ధమైంది. ‘పాక్‌కు భారత్ దీటుగా బదులిస్తుంది..తమ చేతలే దీనిపై పాక్‌కు సమాధానం చెబుతా’యని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ పేర్కొన్నారు. ‘ప్రతీకారం తప్పకుండా ఉంటుంది..దానిపై నేనేమీ చెప్పను..మేము చేపట్టే చర్యలే దీనిపై మాట్లాడతాయి..పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేలా ప్రతీకార చర్యలు కొనసాగుతాయి’ అన్నారు. పాక్ కుయుక్తులపై ఎన్డీఏ భాగస్వామ్యపక్షం శివసేన ప్రభుత్వ వైఖరిని నిలదీసిన క్రమంలో ఆర్మీ వైస్ చీఫ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ మనపై యుద్ధం ప్రకటించిందని..ఆ దేశానికి అదే రీతిలో బుద్ధిచెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మనం మౌనంగా ఉంటే ప్రపంచం ముంగిట భారత్ జవసత్వాలు కోల్పోతుందని రౌత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. -
పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో భారత జవాన్లపై పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
పాకిస్తాన్ బరితెగింపు
జమ్ము: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ సైనిక బలగాలు పదేపదే తూట్లు పొడుస్తున్నాయి. సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపులకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, భింబెర్గలి సెక్టార్లలో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పాక్ రేంజర్లు మోటర్లతో కాల్పులకు పాల్పడుతున్నారు. సైనిక స్థావరాలతో పాటు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పాక్ సైనిక దళాలు జరిపిన దాడిలో 50 ఏళ్ల మహిళ గాయపడిందని చెప్పారు. ఈ నెల 24న పూంచ్ జిల్లాలోని బాలకొటె ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయపడిన విషయం తెలిసిందే. -
పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి..
సాక్షి, జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనను అతిక్రమించింది. దీంతో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. శుక్రవారం జమ్మూ జిల్లాలోని దేశసరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ బిజేందర్ బహుదూర్(32) కు పాక్ సైన్యం షెల్లింగ్ మోర్టార్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని విద్యా భావన్ నారయపుర్ గ్రామానికి చెందని బహుదూర్‌కు భార్య సుశ్మితా సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజుల నుంచి వరుసగా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. భారత బలగాలు సైతం పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయి. గురువారం కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించగా ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
‘పాక్ 268 సార్లు కాల్పులు జరిపింది’
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ నుంచి మార్చి వరకు పాకిస్థాన్ 268సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ బమ్రే సమాధానమిచ్చారు. నవంబర్‌లో అత్యధికంగా 88సార్లు, గత నెలలో 22సార్లు ఉల్లంఘించిందని తెలిపారు. ఇరు దేశాల అధికారుల మధ్య జరిగిన వివిధ చర్చలో ఈ విషయాన్ని లేవనెత్తామని ఆయన వెల్లడించారు. ఆర్మీలో 33,458, నేవీలో 14,041, ఎయిర్‌ఫోర్స్‌లో 13,614 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నీతి అయోగ్ సిఫార్సు మేరకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుమతించిందన్నారు. సు–30 ఎంకేఐ యుద్ధవిమానాల విడిభాగాల తయారీకి రష్యా నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. -
భారత్‌పై పాక్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్..!
శ్రీనగర్: భారత సైన్యం సర్జికల్ దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పాకిస్థాన్.. నిదానంగానైనా క్రూరత్వాన్ని బయటపెట్టుకుంటోంది. సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దు భద్రతా దళాలపై వరుసగా కాల్పులు జరుపుతున్నది. అదే సమయంలో సరిహద్దు గ్రామాలపైనా పాశవిక దాడులకు తెగబడుతున్నది. జమ్ముకశ్మీర్ లోని మెంధార్ సెక్టార్ లో సోమవారం ఉదయం పాక్ రేంజర్లు 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో భీకర కాల్పులకు తెగబడ్డారు. సర్జికల్ దాడులు జరిగిన సెప్టెంబర్ 29 నుంచి సోమవారం(నవంబర్ 7)నాటికి పాకిస్థాన్ 101 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానిన్ని ఉల్లంఘించింది. మొంధార్ ఘటన 101వది కావడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ జరిపిన దాడుల్లో 20 మందికిపైగా పౌరులు, జవాన్లు మరణించారు. మరోదిక్కు పాక్ సైన్యం సహకారంతో కశ్మీర్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదులు కూడా భారత జవాన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీటిని అణిచివేయడంలో చాలా చోట్ల భారత బలగాలు పైచేయి సాధించినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదు. పాక్ నకిలీ సర్జికల్ దాడులు! ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల(దాడులకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడుల) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్ దూకుడును ప్రపంచదేశాలన్నీ సమర్థించాయి కూడా. అయితే ఏడు దశాబ్ధాలుగా దాయాదిని గమనిస్తోన్న భారత్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీచేయించింది. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలు అన్నింటినీ దాదాపు ఖాళీచేయించిన భారత సైన్యం.. కశ్మీర్ లో మాత్రం ఆపని చేయలేదు. దీంతో పాక్ రేంజర్లు, ఉగ్రవాదులకు ఆ గ్రామాలు టార్గెట్ అయ్యాయి. శత్రుమూకలను ఛిద్రం చేయడంలో సైనిక పాటవానికి సంబంధించి గొప్పగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి పాకిస్థాన్.. భారత్ లోని సాధారణ ప్రజానీకంపై సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడులు) చేస్తుండటం గర్హనీయం. ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆమేరకు ఇంకా ఆదేశాలు వెలువడనప్పటికీ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామస్తుల తరలింపుపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఎవరికీ తలవంచేది లేదు: రాజ్‌నాథ్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు పదే పదే కాల్పుల విరమణకు పాల్పుతున్న సందర్భంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా స్పందించారు. భద్రతాదళాలు పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తాయని, మన దేశం ఎవరి ముందూ తలవంచేది లేదని స్పష్టం చేశారు. దేశవాసులంతా దీపావళి పండుగ జరుపుకొంటుంటే.. భద్రతాదళాలు మాత్రం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడటంలో నిమగ్నమయ్యాయని ఆయన అన్నారు. శత్రువుల కుటిల వ్యూహాలను భగ్నం చేస్తున్న సైనికదళాల పట్ల ప్రజలంతా విశ్వాసం ఉంచాలని కోరారు. పాక్ సైన్యం కవర్ ఫైరింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చి భారత ఆర్మీలైని ఒక సైనికుడిని చంపి, అతడి దేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు. దాంతో ఈ ఘటనకు తగిన స్థాయిలో సమాధానం ఇచ్చి తీరుతామని భారత సైన్యం కూడా హెచ్చరించింది. -
పాకిస్థాన్‌కు దీటైన సమాధానం: పారికర్
పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా.. వాళ్లకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పాకిస్థానీ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఒక జవాను మరణించిన నేపథ్యంలో ఆయనిలా చెప్పారు. గత ఐదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయితే.. ఇప్పుడు వాళ్లు ఎన్నిసర్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టి జవాబు ఇస్తున్నామని ఆయన అన్నారు. కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని మనోహర్ పారికర్ తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీన భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత.. ఇప్పటివరకు 25 సార్లు పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్.. ఓ బాధ్యతారాహిత్యమైన దేశమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. పాకిస్థాన్ ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పి కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. తగిన సమయంలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్తారని అన్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తగిన రీతిలో జవాబిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు దాడి పాల్పడి రెండు రోజులు గడవకముందే సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. -
జమ్ముకాశ్మీర్‌లో పాక్ కాల్పులు.. ముగ్గురి మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. పాక్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగింది. శనివారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా సరిహద్దులో పాక్ బలగాలు శనివారం కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాలు మూడుసార్లు కాల్పులకు దిగాయని వెల్లడించింది. ఈ కాల్పుల్లో నలుగురు సామాన్యులు గాయపడినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాకిస్థాన్ కు భారత్ తీవ్ర నిరసన
న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాక్ పదే పదే ఉల్లంఘనకు పాల్పడడంపై పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు కేంద్రం తీవ్ర నిరసన తెలిపిందని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. జమ్మూ జిల్లాలోని అక్నూర్ సెక్టార్ లో పాక్ బలగాలు బుధవారం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ బలగాలు పదే పదే కాల్పులకు దిగుతున్నాయి. నిన్నటి దాడిలో 5 భారత సైనిక స్థావరాలను పాక్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. -
'తగిన గుణపాఠం చెబుతాం'
నాసిక్: సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించిన పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాక్ దాడులకు దీటుగా సమాధానమిస్తామని తెలిపారు. వ్యాపం కుంభకోణంతో విమర్శపాలైన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. తమపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నాసిక్ త్రయంబకేశ్వర్‌లో మంగళవారం కుంభమేళాను ఆయన ప్రారంభించారు. -
పాకిస్థాన్ కవ్వింపు కాల్పులు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ కాల్పులకు దీటుగా స్పందించాలని బీఎస్ఎఫ్ ను రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా, హిరానా నగర్ సెక్టార్లలోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. భారత సైన్యం దీటుగా స్పందిచడంతో భారీగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. -
పాకిస్థాన్ పాఠాలు నేర్వలేదు: పారికర్
బెంగళూరు: సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్థాన్ పదేపదే పాల్పడుతుండడంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. పాకిస్థాన్ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కూడా పాకిస్థాన్ తెంపరితనం ప్రదర్శించిందని మండిపడ్డారు. గురువారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. 'ఇస్లామాబావ్ పాఠాలు నేర్చుకున్నట్టు కనబడలేదు. పాకిస్థాన్ కవ్వింపులకు మనదేశం దీటైన సమాధానం ఇచ్చింది. కొత్త ఏడాది ఆరంభం రోజున కూడా పాక్ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీనిబట్టి చూస్తే పాకిస్థాన్ ఇంకా పాఠాలు నేర్వనట్టే కనబడుతోంది' అని పారికర్ వ్యాఖ్యానించారు. -
పాక్ కాల్పులకు హాకీలో ఓటమే కారణమా?
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ చేతిలో తమ హాకీ జట్టు ఓటమే నియంత్రణ రేఖ పాకిస్థాన్ కాల్పులకు కారణమని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు. ఫైనల్లో భారత జట్టు చేతిలో పాకిస్థాన్ హాకీ టీమ్ ఓడిపోయిన తర్వాతే సరిహద్దు వద్ద పొరుగుదేశం దాడులు పెరిగాయని చెబుతున్నారు. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమైయ్యాయని వెల్లడించారు. ఇటీవల ముగిసిన 7వ ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు స్వర్ణం సాధించింది. అక్టోబర్ 2న జరిగిన తుదిపోరులో 'షూటౌట్'లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
40 భారత చెక్పోస్టులపై పాకిస్థాన్ కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. జమ్ము కాశ్మీర్‌లోని సాంబ జిల్లాలో పాక్ బలగాలు ఏకంగా 40 సరిహద్దు చెక్‌పోస్టుల మీద కాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ దళాలు ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నా, బీఎస్ఎఫ్ బలగాలు కూడా భారీగా వాళ్లమీద విరుచుకుపడటంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు చాలాసేపు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ రేంజర్లు చిన్న, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించి, దాదాపు 35-40 చెక్‌పోస్టులు, పౌరుల నివాసాలపై మోర్టారు బాంబులు కూడా వేశారు. ఈ దాడి ఆదివారం రాత్రి 9.30 నుంచి మొదలై సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. సాంబా జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. ఆర్నియా, ఆర్ పురా, కానాచక్, అఖ్నూర్ సబ్సెక్టార్లను పాక్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా, బాంబు దాడి వల్ల ముగ్గురు పౌరులు మాత్రం గాయపడ్డారు. గడిచిన 15 రోజుల్లోనే 21 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. -
పాక్ కు తగిన గుణపాఠం చెబుతాం: జైట్లీ
జైపూర్: సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతోందని ఆయన చెప్పారు. పాక్ తెంపరితనానికి కళ్లెం వేస్తామని చెప్పారు. సైన్యం, సరిహద్దు బలగాలు సరిహద్దు వద్ద సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. జైపూర్ లో ముర్షిదాబాద్ క్యాంపస్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఎమ్‌డీఐ)ను ఆదివారం జైట్లీ ప్రారంభించారు. -
దైవాధీనరేఖ...!
‘పుట్టుకతో వచ్చిన బుద్ధి’ని ఓ పట్టాన వ దులుకోలేనని పాకిస్థాన్ నిరూపించుకుంటూనే ఉంది. అధీనరేఖ వద్ద గత పక్షం రోజులుగా వరసబెట్టి చోటుచేసుకుంటున్న ఘటనలకు పరాకాష్టగా ఆదివారం భారీయెత్తున ఆయుధాలు, మందుగుండు పట్టుబట్టాయి. అందులో ఏడు ఏకే-47 రైఫిళ్లు, 10 పిస్టల్స్, గ్రెనేడ్లు, రేడియోసెట్లు ఉన్నాయి. గత నెల 24 నుంచి ఆ సెక్టార్లో 30, 40 మంది మిలిటెంట్లు కాశ్మీర్లో చొరబడటానికి ప్రయత్నించారని మన సైన్యం చెబుతున్న వివరాలనుబట్టి తెలుస్తోంది. 1999లో జరిగిన కార్గిల్ చొరబాట్లను గుర్తుకుతెచ్చేలా ఇవి చోటుచేసుకున్నాయన్నది సైన్యం విశ్లేషణ. ఒకపక్క సెప్టెంబర్ 29న ప్రధాని మన్మోహన్సింగ్, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి చాలా ముందే ఆ సమావేశాన్ని భగ్నంచేసే ఉద్దేశంతో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం, మిలిటెంట్ల చొరబాటును ప్రోత్సహించడం ముమ్మరం చేసింది. వారిద్దరి సమావేశంలో ఇవన్నీ చర్చకొచ్చాయి. ఇలాంటి ఘటనలను నివారిస్తే తప్ప ఇరుదేశాలమధ్యా సామరస్యపూర్వక సంబంధాలు నెలకొనే అవకాశం లేదని మన్మోహన్సింగ్ చెప్పారు. ఈ తరహా ఉల్లంఘనలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరళ్ల (డీజీఎంఓ) సమావేశం జరగాలని నిర్ణయించారు కూడా. చర్చలు ముగిశాయి. ఆ సమావేశం ఎప్పుడు జరగాలన్న అంశంపై రెండుదేశాలూ ఇంకా సంప్రదించుకుంటున్నాయి. కానీ, దానికి సమాంతరంగా సరిహద్దుల్లో ఉల్లంఘనలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధీనరేఖలోని పూంఛ్ సెక్టార్లో ఇవి ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి. ఇప్పుడు సాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘన ఉద్దేశం ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టడమేనని మన సైన్యం చెబుతున్నది. సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం ఉంటే ప్రత్యేకించి డీజీఎంఓల సమావేశమే జరగనవసరం లేదు. మన డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ అమీర్ రియాజ్‌లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గత జనవరినుంచి పాకిస్థాన్ కల్పిస్తూనే ఉంది. ఇద్దరు భారత జవాన్ల తలలు నరికినప్పటినుంచి సరిహద్దులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అప్పటినుంచీ ఒక్క పూంఛ్ సెక్టార్లోనే తరచు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క ఆగస్టులోనే అక్కడ 32 ఉల్లంఘనలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. సెక్టార్లవారీగా చూస్తే సెప్టెంబర్ నెలలో పూంఛ్‌లో 20, రాజౌరిలో 11, బాండీపూరాలో 3 ఉల్లంఘనలు జరిగాయి. సరిగ్గా ఇరుదేశాల ప్రధానులూ సమావేశం కావడానికి మూడురోజుల ముందు జమ్మూ సెక్టార్‌లోని రెండు జిల్లాల్లో ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి ఆరుగురు పోలీసులు, నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు. మిగిలిన ఘటనలైతే కట్టుకథలని పాక్ కొట్టిపారేయొచ్చుగానీ జమ్మూ సెక్టార్‌లోనూ, కేరన్లోనూ జరిగినవి చొరబాట్లేనని స్పష్టంగా రుజువవుతున్నది. ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశపెట్టి విధ్వంసాలను ప్రేరేపించడమే వాటి లక్ష్యం. అయితే, ఇలాంటి చొరబాట్లుగానీ, అతిక్రమణలుగానీ లేనేలేవని పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ అంటున్నారు. ఇదంతా మీడియా చేస్తున్న అనవసర రాద్ధాంతంగా ఆయన తేల్చేశారు. రెండు దేశాలూ తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి విస్తృతస్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. న్యూయార్క్‌లో ఇరుదేశాల ప్రధానులు చర్చలకు కూర్చోవడానికి ముందు సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనలు ఎంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయో అందరూ చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు మన్మోహన్ వెళ్లకూడదని ఒత్తిళ్లు వచ్చాయి. అయినా, మన్మోహన్ పాకిస్థాన్‌తో సంబంధాల మెరుగుదలకు ఇవి తప్పనిసరని భావించారు. వీటన్నిటినీ పాకిస్థాన్ పరిగణనలోకి తీసుకుని తనవైపుగా ఉంటున్న లోపాలను సరిదిద్దుకోవాల్సింది. కానీ, అలాంటి ఛాయలెక్కడా కనిపించడంలేదు. ముఖ్యంగా కేరాన్ సెక్టార్లో భారీయెత్తున పట్టుబడిన మారణాయుధాలను చూస్తే భారత్‌తో సత్సంబంధాలు ఏర్పడటం పాకిస్థాన్ సైన్యానికి ఇష్టంలేదనిపిస్తుంది. పాకిస్థాన్ హైకమిషనర్ చెబుతున్న లెక్కలనుబట్టి చూస్తేనే పాకిస్థాన్‌లో గత వంద రోజుల్లో 110 ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఎందరో పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఈ దాడులను ఎందుకు నిరోధించలేకపోతున్నామో పాక్‌లో ఎంతవరకూ ఆత్మపరిశీలన జరుగుతున్నదో అనుమానమే. అక్కడ జరుగుతున్న ఘటనల్లోనూ, సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనల్లోనూ మిలిటెంట్లదే కీలకపాత్ర. తాము దేశంలో నిరోధించలేకపోతున్న మిలిటెంట్లే సరిహద్దుల్లోనూ సంచరించగలుగుతున్నారంటే అర్ధం ఏమిటి? దేశంలో అయితే, వారు ఎక్కడెక్కడ మెరుపుదాడులకు దిగుతారో అంచనా ఉండటంలేదను కోవచ్చు. కానీ, సరిహద్దుల్లో అలా కాదు. అక్కడ గస్తీ తిరుగుతున్న సైన్యం తప్ప మరెవరూ ఉండటానికి ఆస్కారంలేదు. తమ సరిహద్దుల్ని రెప్పవాల్చని నిఘాతో రక్షించే సైన్యానికి అటునుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మిలిటెంట్లు కనబడటంలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఈమధ్య జరిగిన చర్చల్లో తమవైపుగా తప్పులు జరగకుండా చూస్తానని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. కానీ, ఈ ఘటనలు చూస్తుంటే పాక్ సైన్యం ముందు ఆయన నిస్సహాయుడిగా మిగిలారని... తన హామీలను అమలుచేయించగల స్థితి ఆయనకు లేదని అర్ధమవుతోంది. ప్రధానిగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో ఆయన ప్రేక్షకుడిగా మిగిలిపోవడం విచారకరం. సమస్యలకు పరిష్కారం కనుగొనే విషయాన్ని రాజకీయ నాయకత్వానికి వదలాలని ఆయన తమ సైన్యానికి ఇప్పటికైనా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే, సమస్యలు మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించాలి. -
సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడిన పాకిస్థాన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిపోయింది. సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించుతున్నాయి. తాజాగా మరోసారి పాక్ దళాలు సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లా మెన్ధార్ సెక్టార్ వద్ద కాల్పులు జరిపాయి. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో డారి డాబ్సి ప్రాంతంలోని పిలి, నోయల్ పోస్ట్‌లపై ఎలాంటి కవ్వింపు లేకుండానే పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఆటోమాటిక్, తేలికపాటి ఆయుధాలతో ఈ దురాగతానికి తెగబడ్డాయని వెల్లడించారు. పాక్ కాల్పులకు ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా కాల్పులు జరిపింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు సత్రాజ్ ఆజీజ్ ప్రకటించి రెండు రోజులు గడవక ముందే పాక్ దళాలు కాల్పులకు దిగడం గమనార్హం. -
మరోసారి పాకిస్థాన్ కవ్వింపు కాల్పులు
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈనెలలోనే రెండో పర్యాయం కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ సెక్టార్లో ఈ ఉదయం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డాడు. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) సమీపంలో ఆల్ఫా మాకియర్ బోర్డర్ అవుట్ పోస్ట్ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడిందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ కవ్వించినా తమ జవానులు సంయమనం పాటించారని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన జవాను పవన్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 5న అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రామ్నివాస్ మీనా గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్‌కు చెందిన ఐదుగురు సైనికులను పాకిస్థాన్ సైన్యం ఇటీవల కాల్చిచంపింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది.