
‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్.. ఓ బాధ్యతారాహిత్యమైన దేశమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. పాకిస్థాన్ ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పి కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. తగిన సమయంలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్తారని అన్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు.
సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తగిన రీతిలో జవాబిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు దాడి పాల్పడి రెండు రోజులు గడవకముందే సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.