Ram Madhav
-
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్‌లో ప్రవాసభారతీయులతో డా. రామ్ మాధవ్ రచించిన నూతనగ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా రామ్ మాధవ్ ఇటీవల రచించిన *ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం,విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో మే 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా రామ్ మాధవ్ భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు, సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. అనంతరం రామ్ మాధవ్ , వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అతిధులకు, ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధుల విందు భోజనంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
సింగపూర్‌లో రామ్ మాధవ్ పుస్తక సభ విజయవంతం
డాక్టర్ రామ్ మాధవ్ రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో మే 8న జరిగిన ఈ కార్యక్రమంలో పదికి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు. పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ... నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది అని తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ప్రత్యేకంగా అందజేశారు. చదవండి: ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు -
ఈ యుద్ధం వెనుక ఏముంది?
రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటిపేరు ‘వ్లాదిమిర్’... ఉక్రెయిన్లోనూ కనిపిస్తుంది. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరి పేర్లలోనూ వ్లాదిమిర్ ఉండటం గమనార్హం. ఇరు దేశాలకూ అంత దగ్గరితనం ఉంది. అంత ఉమ్మడి చరిత్ర ఉంది. కానీ ఉక్రెయినియన్ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను పుతిన్ అంగీకరించరు. దాన్ని తమ నుండి వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయనేది ఆయన వాదన. కానీ శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉందని ఉక్రెయినియన్ల విశ్వాసం. సోవియట్ యూనియన్ పతనాన్ని ఒక ‘విపత్తు’గా పరిగణించే పుతిన్... రష్యా అన్ని కష్టాలకూ పాశ్చాత్య శక్తులే కారణమని నమ్ముతారు. అందుకే ఈ యుద్ధం వెనుక సంక్లిష్ట చరిత్ర, భావజాలాలు ఉన్నాయి. ఇది ఇద్దరు వ్లాదిమిర్ల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకరు రష్యాకు తిరుగులేని అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్. వ్యూహాలు పన్నడంలో, రాజనీతిజ్ఞతలో దశా బ్దాల అనుభవం ఉన్న బలమైన నాయకుడు. ఇంకొకరు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఉక్రెయిన్ అనే చిన్న దేశానికి అధ్యక్షుడు. జన్మతః యూదుడు. రాజకీయవేత్తగా మారిన నటుడు. ఒక శక్తిమంతమైన సైనిక శక్తిగల దేశం, తన కన్నా సగానికి తక్కువ సైన్యం గల ప్రత్యర్థితో జరుపుతున్న యుద్ధం. రెండు అసమాన శక్తుల పోరాటం. ఉక్రెయిన్‌లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) దుందుడుకు చర్యల నుండి ఉత్పన్నమవుతున్న భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన చర్యలు ఉన్నాయని పుతిన్ వేదన. అయితే ఉక్రెయిన్ ‘డీనాజిఫికేషన్’పై ఆయన వ్యాఖ్యలు ఇది కేవలం సైనిక యుద్ధం గురించి మాత్రమే కాదని సూచిస్తోంది. దీని వెనక చారిత్రక, సైద్ధాం తిక భావజాలాలు ఉన్నాయి. అందుకే రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటి పేరు ‘వ్లాదిమిర్’తో దీనికి సంబంధం ఉంది. సహస్రా బ్దాల చరిత్ర గల కీవ్ రస్ సామ్రాజ్యపు 10వ శతాబ్దపు యువరాజు ‘వ్లాదిమీర్ ద గ్రేట్’ను ఆధునిక రష్యా పితామహడిగా పరిగణిస్తారు. కానీ ఉక్రెయినియన్లు కూడా క్రీ.శ. 980–1015లో కీవ్ రాజుగా ఉన్న ఆయన్నే ఉక్రెయిన్ పితామహడిగా భావిస్తారు. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ వేరువేరు దేశాలకు పితామహడు కాలేడనేది పుతిన్ వాదన. ‘‘చరిత్ర నా పట్ల అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే నేనే చరిత్ర రాయాలనుకుంటున్నాను’’ అని విన్స్టన్ చర్చిల్ ఓ సంద ర్భంలో చమత్కరించారు. ‘చరిత్ర’ ఎవరు, ఎలా చూపెడుతారు అన్న దానిపై ఆధారపడుతుంది. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సేనలు ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పుతిన్ చరిత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఉక్రెయినియన్ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను కొట్టిపారేశారు. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ నిర్మించిన సామ్రాజ్యం ‘రస్’లో నివసించిన ప్రజలందరూ రష్యన్లే ననీ, ఉక్రెయినియన్లను వేరు చేసేందుకు ఆస్ట్రో–హంగేరియన్లు, జర్మన్లు, పోల్స్, లిథువేనియన్లు వివిధ చారిత్రక సందర్భాలలో ప్రయత్నించారనీ ముక్తాయించారు. కానీ ఉక్రెనియిన్లకు తమ సొంత చరిత్ర ఉంది. శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉందని వారి విశ్వాసం. ‘వ్లాదిమిర్ ద గ్రేట్’ సామ్రాజ్యం కీవ్, ప్రస్తుత ఉక్రెయిన్ రాజధాని, రెండవ సహస్రాబ్దిలో ఒక శక్తిమంతమైన సామ్రాజ్యం అనీ, రష్యన్ జార్స్ నియంత్రణలో ఎప్పుడూ లేదనీ వారి వాదన. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూని యన్(యూఎస్ఎస్ఆర్)లో 1922లో మాత్రమే ఉక్రెయిన్ భాగ మైంది. అప్పుడు కూడా ఉక్రెనియిన్ కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎస్‌యూ) నుండి ప్రత్యేక గుర్తింపును కొనసాగించారు. యూఎస్ఎస్ఆర్ పతనం సమయంలో, ఆ తరువాతి సంవత్స రాలలో రష్యా అధ్యక్షుడిగా ఉన్న బోరిస్ యెల్త్సిన్కు పుతిన్ అత్యంత విశ్వసనీయుడు. ఆ కృతజ్ఞతతో యెల్త్సిన్ 1999లో పదవి వీడుతూ పుతిన్‌ను తన వారసుడిగా ప్రకటించారు. పుతిన్ ఒక రష్యన్ జాతీయ వాది. సోవియట్ యూనియన్ పతనం ఒక ‘విపత్తు’ అనేది ఆయన అభిప్రాయం. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో సహా రష్యా కష్టాలకు పాశ్చాత్య శక్తులే కారణమని ఆయన నమ్మకం. ‘టేమ్ రష్యా’ (రష్యాను అదుపుచెయ్) అనేది గత సహస్రాబ్దిలో అనేక యూరోపియన్ శక్తుల ప్రాజెక్ట్. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం లోనూ కొనసాగింది. సోవియట్ యూనియన్ను నిలువరించేందుకే 1957 నాటి ‘ఐజెన్‌హోవర్ సిద్ధాంతం’! స్టాలిన్‌కూ, అతని వారసు లకూ పశ్చిమ దేశాలపై ఎన్నో అనుమానాలున్నాయి. సోవియట్ యూనియన్ పతనానంతరం తొలుత పుతిన్ యూరోపియన్ యూని యన్‌లో చేరేందుకు ప్రతిపాదించాడు. పశ్చిమ దేశాలతో ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నించి భంగపడ్డాడు. ఈ అవమానానికి యూరోపి యన్లకు తగిన గుణపాఠం చెప్పాలని పుతిన్ గట్టిగా తీర్మానించు కున్నాడు. దీని వెనుక చరిత్రతో పాటు సైద్ధాంతిక కోణమూ ఉంది. పాశ్చాత్య దేశాలు రష్యన్లను అనాగరికులుగా, వారి మత విశ్వాసాలు, రాజకీయాలు హీనమైనవిగా పరిగణించాయి. ప్రతీకారంగా పాశ్చాత్య దేశాల ఉదారవాద రాజకీయాలను పుతిన్ తిరస్కరించాడు. డిజిటల్ వేదికపై వాటిని అణగదొక్కేందుకు చేయగలిగిందంతా చేశాడు. పుతిన్ జాతీయత–సాంస్కృతిక గుర్తింపు... పశ్చిమ దేశాల ఆధునిక భౌగోళిక రాజకీయ జాతీయతకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఉక్రెయిన్ ఉదార వాద ప్రజాస్వామ్యం ఆయన రాజకీయ సిద్ధాంత ఓటమికి సంకేతం. ‘రష్యా భాగస్వామ్యంతో మాత్రమే ఉక్రెయిన్ నిజమైన సార్వభౌమాధి కారం సాధ్యమవుతుంది’ అనేది పుతిన్ ఉద్ఘాటన. కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకించారు. హిట్లర్‌ను నిలువరించ డానికి పోప్ మద్దతును సమీకరించాలని 1943 తెహ్రాన్ కాన్ఫరెన్స్‌లో చర్చిల్ సూచించినప్పుడు, ‘పోప్‌కి ఎన్ని సైనిక విభాగాలు ఉన్నాయి?’ అని స్టాలిన్ ప్రముఖంగా అడిగారు. పుతిన్ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఉక్రేనియన్లను తమ నుండి దూరం చేసి రష్యన్ ఆర్థొడాక్స్ మత గుర్తింపును బలహీన పరిచేందుకు క్యాథలిక్ శక్తులు ప్రయత్నిస్తున్నా యని ఆయన అనుమానం. యాదృచ్ఛికంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక యూదుడు కావడం పుతిన్ అనుమానానికి బలం చేకూర్చింది. ఈ యుద్ధం వెనుక ఉన్న సంక్లిష్ట చరిత్ర, భావజాలమే భారతదేశ సంకట స్థితికి కారణం. ఒకపక్క టిబెట్, తైవాన్ సహా పలు ప్రాంతా లను తమవిగా చెప్పుకుంటోన్న చైనా వైఖరిని తిరస్కరించే భారత్, ఉక్రెయిన్ ప్రత్యేక దేశం కాదన్న పుతిన్ వాదనను సమర్థించలేదు. అదే సమయంలో నాటో దేశాల రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో రష్యా భద్రతాపర ఆందోళనలనూ పూర్తిగా తిరస్కరించనూలేదు. నేడు ప్రపంచం పుతిన్ చర్యలను వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకించడంలో భారతదేశం ఒక దృఢ సైద్ధాంతిక వైఖరిని తీసుకుంది. కానీ, ఐక్యరాజ్యసమితిలో చైనా, మనం ఇంచు మించు ఒకే వైఖరి తీసుకోవడం ప్రపంచ దేశాలను కలవరపరు స్తోంది. ఎంతో విశిష్టమైన మన గొప్ప ప్రజాస్వామ్య దేశం ఎంత కాలం ఈ తటస్థ వైఖరిని కొనసాగించగలదు? వ్యాసకర్త: రామ్‌మాధవ్ ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు -
కమ్యూనిస్ట్‌లు ఐడియాలజిస్ట్‌లు.. హిందువులు తత్వవేత్తలు: రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత రాంమాధవ్ రచించిన ‘ది హిందుత్వ పరాదిమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫోరమ్ ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ రఘురాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాంమాధవ్ హిందుత్వం గురించి మంచి పుస్తకాలు రాస్తారన్నారు. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటాయని రఘురాం అన్నారు. ఈ పుస్తకంలో అనేక అంశాలు తానను ఆకట్టుకున్నాయన్నారు. రాంమాధవ్ మాట్లాడుతూ కార్ల్‌మార్క్స్' కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. హిందుయిజం శంకరాచార్యులు, గాంధీ లాంటి వ్యక్తులను తయారు చేసిందన్నారు. ‘‘సావర్కర్ పితృభూమి అన్నారు. నేను మాతృభూమి అంటున్నాను. కమ్యూనిస్ట్‌లు ఐడియాలజిస్ట్‌లు.. హిందువులు తత్వవేత్తలు. హిందుత్వం, హిందుయిజం, ఇండియా అన్నీ ఒక్కటేనని’’ రాంమాధవ్ అన్నారు. -
సోషల్ మీడియా నియంత్రణకు చట్టం!
కోల్‌కతా: సామాజిక మాధ్యమాలు ప్రభుత్వాలను కూలదోయగలవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చగలవని అందుకే వాటిలోని పోస్టులపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ చట్టాన్ని తయారు చేస్తోందని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కోల్‌కతాలో తాను రాసిన ‘బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయేతర, విదేశీ శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోని ఇలాంటి పోస్టులను ఎదుర్కునేలా ప్రస్తుత చట్టాలు రూపొందలేదని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త చట్టం కావాలని, దానిపై ఇప్పటికే ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దేశంలో ట్విట్టర్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను రాసిన కొత్త పుస్తకం మోదీ ప్రభుత్వంలోని పలు నిర్ణయాలపై చర్చ చేస్తుందని తెలిపారు. -
మోదీ హయాంలోనే 'ఇండియస్ ఫస్ట్' సాధ్యం
హైదరాబాద్: తాను రచించిన "బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్" అనే పుస్తకంపై జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత రాం మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అమెరికా ఫస్ట్' స్పూర్తితో 'ఇండియా కమ్స్ ఫస్ట్' పుస్తకానికి నామకరణం చేయడం జరిగిందని అన్నారు. మోదీ హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలకు చేరుకుందని, మోదీ వల్లే 'ఇండియస్ ఫస్ట్' సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల నేతలతో సత్సంబంధాలు కలిగివుంటారని, అది భారత్‌కు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. గతంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడులు జరిగేవని, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు మోదీ అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాల్ని ఇచ్చాయని రాం మాధవ్ పేర్కొన్నారు. అయోధ్య పేరులోనే శాంతి ఉందని, రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలతో సహా అన్ని మతాలు స్వాగతించాయని ఆయన గుర్తు చేశారు. భారత్, అమెరికా మధ్య సత్సంబందాలు మోదీ హయాంలో నిరాటంకంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భారత్ జాతీయవాదాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని.. జాతీయం, జాతీయవాదం రెండు భిన్నమైనవని ఆయన అభిప్రాయడ్డారు. 1962 భారత్, చైనా యుద్ధం ప్రస్తావన రాగా.. గతంలో భారత్, చైనా కంటే బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, అందుకు మోదీ విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా హవాను ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. 2017 డోక్లాం ఘటన తరువాత సరిహద్దు వివాదాల్లో భారత్ తీరు మారిందని ఆయన గుర్తు చేశారు. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చైనా ఎదుగుదలకు భారత్ వ్యతిరేకం కాదని, అలాగని కయ్యానికి కాలు దువ్వితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
అలా చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది
సాక్షి, విశాఖపట్నం : భారతదేశంలో రాజ్యాంగం పటిష్టంగా ఉందని, రాజ్యాంగ వ్యవస్థ దేశ ప్రజల్ని ప్రపంచంలో ముందుండే విధంగా నడిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ వ్యాఖ్యానించారు. శనివారం ‘బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా కొంత మంది రైతులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై రైతులు ప్రభుత్వంతో చర్చించాలి. కొద్దిమంది నియంత్రణలో నుంచి రైతులను బయటకు తీసుకు వచ్చేందుకే వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చాం. ఏం జరిగినా రాజ్యాంగపరమైన వ్యవస్థల ద్వారా జరగాలి. రాష్ట్రాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశం మా దృష్టికి వచ్చింది. దేవాలయాలపై దాడులు అంశాన్ని ఓ పార్టీపై మరొక పార్టీ నెట్టుకోవడం సరికాదు. దేవాలయాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. -
‘ఎల్ఏసీ’ని తేలుస్తాం : రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) తరహాలో చైనాతో సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను తేల్చేందుకు ప్రధాని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ వి.రాంమాధవ్ తెలిపారు. భారత భూభాగంలో 60 ఏళ్లుగా జరిగిన చైనా ఆక్రమణలను అప్పటి ప్రభుత్వాలు నిలువరించకపోయాయని ఆయన విమర్శించారు. అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో ‘ఇండో–చైనా స్టాండ్ ఆఫ్: ది రోడ్ అహెడ్’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన చర్చా కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి రాంమాధవ్ హాజరై మాట్లాడారు. ‘‘60 ఏళ్లుగా ఎల్ఏసీని నిర్వచించలేకపోయాం. కానీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఎల్ఏసీని నిర్వచిస్తుంది. ఏ భూభాగం ఎవరికి చెందుతుందో చైనాతో చర్చిస్తుంది’’అని రాంమాధవ్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రధాని శ్రమిస్తున్నారని, ఏళ్లుగా మూసధోరణితో ఉన్న అంశాలను సంస్కరిస్తున్నారని రాంమాధవ్ ఉద్ఘాటించారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మయాంక్ సింగ్, అవేర్నెస్ ఇన్ యాక్షన్ ప్రతినిధులు బీజీ రాజేశ్వర్, బుచ్చిబాబు, మాధవి, రామకృష్ణ పాల్గొన్నారు. -
'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై హోటల్ క్షత్రియాలో అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత రామ్ మాధవ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. 'చైనా మనకు రెండు విధాలుగా సవాల్ విసురుతోంది. ఒకటి ఆర్థికంగా ఎదిగిన చైనా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందుకే మన దేశంలాంటి దేశాలు అన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలి. అందుకే ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. 'చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది. పాకిస్తాన్‌తో ఏకమై పనిచేస్తూ ఆ దేశాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో లాబీయింగ్ చేస్తోంది. శ్రీలంకలో చైనా అనేక నిర్మాణాలు చేస్తోంది. ఇది భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగించేదే. నేపాల్‌లో చైనా మధ్యవర్తిత్వంలో అక్కడి రాజకీయాల్లో మార్పు వస్తోంది. చైనా వల్ల ఇండియన్ ఓసియన్‌లో ఉన్న అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. చదవండి: (ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్) దేశ విస్తరణ కాంక్షతో చైనా ఇలా వ్యవహరిస్తోంది. భారతదేశం ఏనాడు టెరిటరీ బార్డర్‌ను పెంచుకోవాలని కోరుకోలేదు. చైనా యాప్‌ల బ్యాన్ ద్వారా మన దేశ యువకులకు మంచి అవకాశం వచ్చింది. చైనాను కమ్యూనిస్టు దేశం అనేందుకు ఏ దేశం ఇష్టపడటం లేదు. భారత్ ఎప్పుడూ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ చైనా మన దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ స్నేహ హస్తం ఇస్తుంది. కవ్వింపులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. దేశ వ్యవహారాల్లో ఎవరి ప్రమేయం ఒప్పుకోం. నేపాల్ లాంటి దేశాలు చైనా వలలో పడకూడదు' అని కోరుకుంటున్నట్లు వివరించారు. -
రామ్ మాధవ్, మురళీధర్‌రావుకు ప్రమోషన్?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గత ఆదివారం జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు చోటు కల్పించింది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. అయితే, ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర్‌రావును పక్కన పెట్టేయడంపై ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందు నుంచీ పార్టీకీ విధేయులుగా సేవలు చేస్తున్నవారిని ఎందుకు దూరం పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: ఆపరేషన్ 2023) మరోవైపు రామ్ మాధవ్, మురళీధర్‌రావుకు ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకనే జాతీయ కార్యదర్శులుగా తప్పించానేది ఆ వార్తల సారాంశం. అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్న రామ్ మాధవ్‌కు విదేశాంగ శాఖ, వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్ రావుకు వాణిజ్య శాఖలు కేటాయిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్న ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. (చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ) -
రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీ
సాక్షి, అమరావతి: ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చెబుతున్నది మాటవరసకి కాదు. రాజకీయ పార్టీ చారిటీ కోసం కాదు. రాష్ట్ర ప్రజల సేవ కోసం అధికారం సంపాదించేలా మన రాజకీయాలు ఉండాలి. రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. దానిని బీజేపీ భర్తీ చేయాలి’’ అని పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం అధికారికంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. దీనికి రామ్‌మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. – సోము వీర్రాజు నాయకత్వంలో నేతలందరూ సమష్టి కృషితో 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయాలి. – ఐదేళ్లో, పదేళ్లో హైదరాబాద్‌లో ఉండి రాజధాని నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వానికి సలహా ఇస్తే.. విజయవాడకు పరిగెత్తుకొని వచ్చారు. – అమరావతిలో రాజధాని కట్టుకుంటామంటే కేంద్రం వద్దన్నదా? ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకుంటే దాంట్లో కేంద్రం పాత్ర నామమాత్రంగా ఉంటుంది. – అయితే మూడు రాజధానులను ఎవరూ ప్రశ్నించకూడదని కాదు. – మూడు రాజధానులన్నది అవినీతికి ఆలవాలంగా మారకూడదు. – రాజధాని ప్రాంతం రైతులందరికీ న్యాయం జరగాలన్న పోరాటంలో బీజేపీ ముందుండాలి. అన్నివర్గాలను కలుపుకొని వెళ్తా.. రాబోయే ఎన్నికల్లో మిత్రపక్ష పార్టీతో కలిసి రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించే దిశగా ప్రయత్నం చేస్తానని సోము వీర్రాజు అన్నారు. కులాలకు అతీతంగా జాతీయ వాదంతో పనిచేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తానన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు తమకు సమదూరమేనని, వారిరువురు శత్రువులు కాదు, మిత్రులు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నేతలు సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హయాంలో అవినీతి: రామ్‌మాధవ్
-
‘హైదరాబాద్ వదిలి ఎందుకు వచ్చారో తెలుసు’
సాక్షి, అమరావతి: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని.. రాష్ట్ర బీజేపీని సోము వీర్రాజు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. ‘‘రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని’’ రామ్‌మాధవ్ పేర్కొన్నారు. (జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు) రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలన్నారు. ‘‘మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్‌మాధవ్ విమర్శించారు. రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ వేర్వేరు అని తెలిపారు. రాజధాని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాంగ్రెస్, సీపీఐ రామకృష్ణ ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారో అందరికి తెలిసిందేనన్నారు. అధ్యక్షుడిగా తన మీద మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ వ్యవహారిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన సోమువీర్రాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత మొదటసారి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, రాంమాధవ్‌లను కలిసి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోమువీర్రాజు వివరించారు. (సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ) -
సింగపూర్‌లో సాహిత్య సమ్మేళన వేడుకలు
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళా సారథి సంస్థ ఆవిర్భావ సందర్భంగా సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సమ్మేళన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆసాంతం రమ్యంగా సాగిన తెలుగు సాహిత్యారాధనలో వక్తలు తమ వ్యాసాలను, కవితలను, పద్యాలను, పాటలను శ్రోతలకు వినిపించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాభినందనలతో కూడిన లేఖను పంపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావు వారి సందేశాలను పంపారు. కార్యక్రమ విశిష్ట అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ‘జూమ్’ద్వారా పాల్గొని ప్రసంగించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు రాజా గౌరవ అతిథులుగా పాల్గొని తెలుగు సాహిత్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కంభంపాటి సోదరులు, రెలారే రెలా జానకీరావు, రాంబాబు పద్యాలతో అలరించారు. ‘అలా సింగపురంలో..’పేరుతో తెలుగు సంస్కృతి గొప్పదనంపై తీసిన లఘు చిత్రం ట్రైలర్, సంస్థ వెబ్సైట్, ఆస్ట్రేలియాకు చెందిన ఉమా మహేశ్ రాసిన ‘అక్షరోద్యమం’ అనే పుస్తకాన్ని రామ్‌మాధవ్ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి భాస్కర్, అరుణ్, రాధాకృష్ణ,శిల్ప, ప్రావీణ్య, స్వాతి, శ్రీనివాస్ జాలిగామ, లక్ష్మి ప్రసాద్ రెడ్డి, రాధా శ్రీనిధి, వేణు మాధవ్, పాటూరి రాంబాబు, ఆస్ట్రేలియా నుండి కొంచాడ రావు, న్యూజిలాండ్ నుండి జగదీశ్వరరెడ్డి దంపతులు, హాంకాంగ్ నుండి జయ, యూకే నుండి జొన్నలగడ్డ మూర్తి, మలేసియా నుండి అచ్చయ్య కుమార్ రావు, కువైట్ నుండి వీర నరసింహరాజు, భరతభూమి నుండి లావణ్య, సూర్యప్రకాశరావు, రవీంద్ర బాబు, శివ శంకర్, ఖతార్, దక్షిణాఫ్రికా, ఒమన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు. కార్యక్రమ ముఖ్యనిర్వాహకుడిగా కవుటూరు రత్నకుమార్, సాంకేతిక నిర్వహణ బాధ్యతలను భాస్కర్, రాధాకృష్ణ నిర్వర్తించగా, వ్యాఖ్యాతగా రాధిక, సహ వ్యాఖ్యాతగా రామాంజనేయులు, నిర్వాహక వర్గ సభ్యులుగా శ్రీధర్, రాంబాబు, సుధాకర్ సేవలందించారు.‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ద్వారా భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి వర్ధమాన కళాకారులను, రచయితలను ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. దాదాపు 14 దేశాల నుంచి సాహితీవేత్తలు హాజరైన సభగా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమానికి చోటు దక్కిందని సంస్థ అధ్యక్షుడు వెంటాచారి వెల్లడించారు. -
మోదీ రేటింగ్ 90 శాతానికి పైగానే..
(వెంకటేష్ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): అఖండ మెజారిటీతో రెండోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ.. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ విపత్కర సమయంలో అన్ని రాష్ట్రాలను ఏకతాటిపై నడిపించారన్నారు. ప్రజలు సైతం ఆయనకు సబ్ కా విశ్వాస్ అంటూ అండదండలందించారని చెప్పారు. ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజమని.. కానీ, దీనికి భిన్నంగా మోదీ రేటింగ్ 90శాతానికి పైగా ఉందని రామ్‌మాధవ్ వివరించారు. అలాగే.. ఈ ఏడాది కాలంలో ప్రధాని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రామ్‌మాధవ్ ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక రంగంపై.. ► 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీసాధించే దిశగా వెళ్తున్నాం. ► బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. కొత్త ప్యాకేజీలను ప్రకటించాం. ► పలు పథకాలను రాష్ట్రాలతో కలిసి అమలుచేస్తాం. కరోనా కట్టడిపై.. ► దేశ ఆర్థిక వ్యవస్థను పట్టా లెక్కించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విపత్తు వచ్చింది. ► కరోనా కాలంలో రాష్ట్రాలన్నిటినీ ప్రధాని ఏకతాటిపై నడిపించారు. ► ఈ విషయంలో 130కోట్ల మంది ప్రధానికి అండగా నిలబడ్డారు. ► పేదలను ఆదుకునేందుకు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేశాం, గ్యాస్ సిలిండర్లు అందజేశాం. ► రైల్వే శాఖ 30లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపించింది. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉచితంగా డబ్బులిచ్చే ప్యాకేజీ కాదు. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్యాకేజీ ఇది. ► రాష్ట్రాల అవసరం మేరకు కేంద్రం సహకారం అందిస్తుంది. అంతేతప్ప నేరుగా వారికి డబ్బులు ఇవ్వం. చైనాతో సంబంధాలపై.. ► చైనాతో భారత్ ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించలేదు. ► ఒక్క అంగుళం భూముని కూడా వదిలిపెట్టే ప్రసక్తిలేదు. ► మన సకారాత్మక దౌత్యనీతి ద్వారానే చైనా వెనక్కి తగ్గింది. ► ఎప్పటికీ భారత్ తన ఎల్ఏసి (వాస్తవాధీన రేఖ) వద్ద తన మౌలిక సదుపాయాలను పెంచుకుంటుంది. ► ఇక నేపాల్‌తో సమస్యలు దౌత్యపరంగా పరిష్కరిస్తాం. నేపాల్, భారత్‌లను ఎవరూ వేరు చేయలేరు. కశ్మీర్ అంశంపై.. ► ఆర్టికల్ 370 రద్దుచేశాం. ఇది జరిగి తొమ్మిది నెలలు గడిచినా ప్రజలు రోడ్లపైకి రాలేదు. ► దీని తర్వాత కశ్మీర్లో స్థానికంగా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ లేదు. ► ఈ సంవత్సరాంతానికి కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. ► కరోనా కాలంలోనూ పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ఈ సమయంలోనూ ఉగ్రవాదులను పంపుతోంది. ► అయినా మన భద్రతా బలగాలు వారిని కఠినంగా అణిచివేస్తున్నారు. ఇవేకాక.. ► రామమందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటుచేశాం. ► ముస్లిం మహిళల చిరకాల వాంఛ ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేశాం. -
మాధవ్ మన్‌కీ బాత్
-
ఏడాది పూర్తిచేసుకున్న సీఎంకు అభినందనలు
-
జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు
(వెంకటేష్ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్‌కు మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. అక్కడి రాష్ట్ర ప్రజల కోసమే ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభిస్తోందని.. దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, అఖండ మెజారిటీతో తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్.. ఇద్దరూ ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో రామ్‌మాధవ్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► దేవదాయ ఆస్తుల విషయంలో సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ఇది చాలా మంచి నిర్ణయం. అక్కడక్కడ కొన్ని వివాదాలు వస్తున్నా అవి పెద్దవి కావు. వాటిపై కొంచెం జాగ్రత్త వహించాలి. ► అన్నింటికీ ముఖ్యమంత్రిని తప్పుపట్టడం సరికాదు. ► విశాలమైన లక్ష్యాలను సాధించే క్రమంలో వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ► ఏపీ ప్రజల అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కలిసి పనిచేస్తున్నారు. ఏపీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం పూర్తి మద్దతుగా నిలిచి అండదండలు అందిస్తుంది. ► రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటు దానికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని చెప్పారు. ► 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు వీలైనంత ఎక్కువ సాయం చేయాలని ఆలోచించింది. ► మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించవద్దు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ► ఆంధ్ర రాష్ట్రం తక్కువ వనరులతో అవతరించింది. ఈ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరి. ► ఆంధ్ర వాడిగా నా వంతుగా నేను ఏపీ అభివృద్ధి కోసం కృషిచేస్తా. ► రెండోసారి ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోదీ.. అచ్ఛేదిన్ నినాదం నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ► కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారు. ► ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజం.. కానీ, దీనికి భిన్నంగా ప్రధాని మోదీ రేటింగ్ 90శాతానికి పైగా ఉంది. -
ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరి
-
మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్‌మాధవ్
సాక్షి,న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదని విమర్శకులకు హితవు పలికారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం సంతోషకరమని రామ్‌మాధవ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్) మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు.. వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రామ్‌మాధవ్ అన్నారు. పార్లమెంట్లో నిర్ణయాలకు వైఎస్ఆర్సీపీ నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు, ఇతర అంశాలపై ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీయే చెప్పారని రామ్‌మాధవ్ గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఏపీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని ఆర్థిక సంఘం ఆలోచన చేసిందని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ తక్కువ వనరులతో అవతరించింది రామ్‌మాధవ్ గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఏపీకి చెందినవాడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని రామ్‌మాధవ్ వెల్లడించారు. (చదవండి: ఏపీలో కొత్తగా 33 పాజిటివ్ కేసులు) -
భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం
ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడానికి కష్టపడుతోంటే, ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారతదేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదారవాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని మోదీ నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. శతాబ్ద కాలం క్రితం అమెరికా, ఐరోపా దేశాలు, ఆ దేశాల కాలనీలలో పర్యటించా లంటే ప్రజలెవరికీ వీసాలు, పాస్ పోర్టుల అవసరం ఉండేది కాదు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. దేశాల సరిహద్దులు కఠినతరంగా మారాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించటం, ఆర్థికమాంద్యం పెరిగి పోవటం జరిగింది. జాతీయవాదం హద్దు మీరిన జాతీయవాదంగా పరిణమించటంతో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత దేశాలన్నీ కలిసి ఒకరితో ఒకరికి సంబంధం ఉండేలా ఓ వ్యవస్థీకృత ప్రపంచ వ్యవస్థని రూపొందించుకొన్నాయి. అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ గత 65 సంవత్సరాలలో ప్రపంచ క్రమం అదే రీతిలో కొనసాగింది. ఆ ప్రపంచ క్రమాన్ని కరోనా విశ్వ మహమ్మారి ఆస్థిరపరచేలా ఉంది. దేశాలు అంతర్ముఖంగా, కొన్నైతే నిరంకుశంగా మారుతు న్నాయి. కొద్ది మంది రాజకీయ శాస్త్రజ్ఞులు తలుపులు మూసుకొని ఉండే సంకుచిత జాతీయవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుందని చెబుతున్నారు. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యాలకు కాలం చెల్లిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నిరాశావాదం ఎక్కడ నుండి పుడు తోంది? దీనికంతటికీ కేవలం కరోనా వైరస్ కారణం కాకపోవచ్చు. అత్యంత శక్తివంతమైన దేశాలుగా భావించబడే రెండు దేశాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. హూవర్ సంస్థకు చెందిన అమెరికా చరిత్రకారుడు నియాల్ ఫెర్గుసన్ వాటిని ‘చిమేరా’గా వర్ణించాడు. చిమేరా అంటే గ్రీకు పురాణాల్లో సింహం తలతో, మేక శరీరంతో, పాము తోకతో, నోటి నుండి మంటలను ఊదుతూ ఉండే ఓ భయం కర సంకర జీవి. గత దశాబ్దం పైగా అమెరికా, చైనాలు సృష్టించిన ఆర్థిక సంబంధ నమూనాను ఫెర్గుసన్ 20వ శతాబ్దం చివర వరకు అమెరికా, జపాన్ దేశాల మధ్య ఉన్న ‘నిచిబెయి’ ఆర్థిక బంధాన్ని పోలి ఉన్నదని పేర్కొన్నాడు. కరోనా వైరస్ చిమెరికా (చైనా, అమెరికా) అంటే కేవలం చిమేరా మాత్రమేనని తెలియజేస్తుంది. నిజాలను ప్రపంచం నుండి దాచిపెట్టి, వైరస్ చైనా సరిహద్దులను దాటి విశ్వ మహమ్మారిలా పరిణమించేలా చేసిందనే ఆరోపణలను చైనా ఎదు ర్కొంటున్నది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్స్టిట్యూట్ అనే మేధో సంస్థకు చెందిన డెరెక్ సిసోర్స్ చైనాలో వైరస్ సంక్రమణ కేసులు అది అధికారికంగా చెపుతున్న దానికంటే అనేక రేట్లు అధికంగా ఉన్నాయని వాదిస్తున్నాడు. ఆచారబద్ధమైన పద్ధతులను అనుసరించని దేశాలలో చైనా ఒకటి. ‘చారిత్రక అనుభవం’ అనే మార్గాన్ని అనుసరిస్తున్నామని చైనా భావి స్తూంటుంది. దీర్ఘకాల పోరాటం లేదా విప్లవం తరువాత 1949లో మావో అధికారం హస్తగతం చేసుకోవటం కారణంగానే తాము నేడు ఈ స్థాయిలో ఉన్నామని చైనా భావిస్తుంది. చైనా వాళ్ళ ప్రపంచ వీక్షణ మూడు ముఖ్య సూత్రాల ఆధారంగా ఉంటుంది. అవి జీడీపీ వాదం– స్థూల జాతీయ ఉత్పత్తి వాదం, చైనా మధ్యస్థ వాదం–అన్నిటికీ చైనానే కేంద్రం అనే వాదం, చైనీయులు అసాధారణులనే వాదం– చైనీయులు మిగతా వారందరి కంటే భిన్నమైన, ఉన్నతమైన వారు అనే వాదం. అన్నిటికంటే ముఖ్యమైన తర్కం ఆర్థికాభివృద్ధి అని డెంగ్ జియా వోపింగ్ 1980లో పేర్కొన్నాడు. చైనా ఆర్థిక వేత్తలు దీనిని జీడీపీ వాదంగా వర్ణిస్తుంటారు. స్వతంత్రం, స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి ఉండాలని మావో నొక్కి చెప్పేవాడు. మాతృభూమిపై వాంగ్ షేన్ రచించిన భావగీతం చైనాలో ప్రఖ్యాత దేశభక్తి గీతం. పర్వతాలు, మైదానాలు, యాంగ్సీ, హుయాంగ్ నదులతో కూడిన ప్రియమైన మన మాతృభూమి అందమైనది, వైభవోపేత మైనది అని ఆ పాటలో ఉన్న వర్ణన చైనీయుల మనస్సులలో గాఢంగా నాటుకుపోయింది. చైనా కేంద్రక వాదం చైనాలో ప్రబలంగా ఉంటుంది. మూడవది, చైనీయులు అసాధారణమనే వాదం. ఇతరుల నుంచి నేర్చుకోవటాన్ని చైనా విశ్వసించదు. సమస్యల పరిష్కారం కోసం సొంత జ్ఞానాన్నే వాడాలని చైనా నాయకులు పదేపదే చెపుతుం టారు. చైనీయుల జాతీయవాద ప్రపంచ దృక్కోణం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో జర్మనీ దృక్పథాన్ని పోలిఉంది. 1930 లలో జర్మన్ జాతి పరమైన ఆధిపత్యం, చరిత్రాత్మక హక్కులను ప్రస్తా వించటం, జాతిపరంగా తాము సర్వోత్తమమనే భావం తెలిసిందే. అంతకుముందు చెకోస్లోవేకియాకి చెందిన సుదేటెన్లాండ్ అనే జర్మన్ భాష మాట్లాడే ప్రాంతాన్ని హిట్లర్ ఆక్రమించినపుడు ఐరోపా అతడిని ఎదుర్కోవటానికి బదులుగా సంతృప్తిపర్చడానికి ప్రయ త్నించింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి ఐరోపా దేశాలు హిట్లర్‌తో మ్యూనిచ్ ఒప్పందం కుదరటంతో సంబరపడుతుండగా, నాటి అమె రికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, మీ ఈ చర్య యావత్ మానవాళికి మీరు చేసిన అసాధారణ చారిత్రాత్మక సేవగా కోటానుకోట్ల ప్రజలు గుర్తిస్తా రని హిట్లర్‌ను పొగిడాడు. ఇక మీదట ఆక్రమణలకు పాల్పడనని చేసిన వాగ్దానాన్ని దురదృష్టవశాత్తు ఒప్పందం కుదిరిన సంవత్సరం లోపే హిట్లర్ ఉల్లంఘించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939–40 కాలంలో బ్రిటన్ ఏ పరిస్థితిలో ఉందో ప్రస్తుతం అమెరికా అదే పరిస్థితిలో ఉంది. అమెరికాలోని రాష్ట్రాలను కరోనా వైరస్ బీభత్సానికి గురిచేసిన తరువాతగానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేల్కొనలేదు. కరోనా వైరస్ అమెరికాలో విజృంభిం చనున్నదనే హెచ్చరికలు చేసే వారిని పట్టించుకోవద్దంటూ ఫిబ్రవరి 28నాడు దక్షిణ కరోలినాలోని తన మద్దతుదారులను ట్రంప్ కోరారు. మీడియా హిస్టీరియాతో ప్రవర్తిస్తున్నదని చెబుతూ, కరోనా వైరస్ ప్రబ లబోతున్నదంటూ మీడియా పేర్కొనటాన్ని గాలివార్తలుగా ట్రంప్ కొట్టిపారేశాడు. చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రణా ళికలోని లాభాల కోసం చైనాను కౌగలించుకొన్న ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయటానికి కష్టపడుతున్నాయి. ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థ వంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. సగటున ఒక రోజులో అమె రికా కంటే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన దక్షిణ కొరియా అందరికంటే ముందు నిలబడింది. సింగపూర్ విస్తృతంగా పరీక్షలు జరుపుతూ వైరస్ లక్షణాలను కనుగొనే భారీ ప్రయత్నం చేసింది. గతంలో సార్స్ వైరస్ కారణంగా మరణాలను చవిచూసిన అను భవంతో హాంకాంగ్æ, తైవాన్లు కరోనా వైరస్‌ని సమర్థవంతంగా కట్టడి చేయటానికి సమయోచిత చర్యలు తీసుకున్నాయి. కోవిడ్– 19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారత దేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. పూర్తి స్థాయి ప్రజా మద్దతుతో లాక్ డౌన్ అమలు పరచటం, భౌతిక దూరం పాటించే నిరోధక చర్యలు తీసుకోవటం ద్వారా ప్రధాన మంత్రి సహచరులతో పాటుగా ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారు. నూట ముప్పై కోట్ల ప్రజలున్న దేశంలో మే ఒకటి నాటికి 35,365 యాక్టివ్ కేసులు నమోదై ఉన్నాయి. ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలు, ఇస్లామోఫోబియా అనే తప్పుడు ప్రచారాలను ఎదుర్కొన్నప్పటికీ మోదీ ఎటువంటి ఏకపక్ష, నిరంకుశ చర్యలకు ఉపక్రమించలేదు. కవ్వింపు చర్యలు ఎదురుగా కనపడుతున్నప్పటికీ మోదీ నిబ్బరంగా, శాంతంగా, ఆశావాద దృక్పథం కనపరచారు. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదార వాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక విజ్ఞానం, ప్రజా స్వామ్య ఉదారవాదం ఆధార స్తంభాలుగా కొత్త ప్రపంచ వ్యవస్థ సంస్థాగత నియమావళి ప్రకటించే సమయం ఆసన్నమౌతోంది. అంతర్గతంగా అశాంతిని, అంతర్జాతీయంగా నిందలు ఎదుర్కొంటు న్నప్పటికీ చైనాకు ఒక అవకాశం ఉన్నది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాడు కలో ‘లూక్సియాన్ డౌజ్హేంగ్’ అనే పదబంధం ఉంది. దాని అర్థం ఆకృతి, విధానం నిర్ధారించే పోరాటం. అధికారం కోసం పోరాటం అని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, పార్టీ కొత్త విధానాన్ని నిర్ణయించే పోరాటం అనే అర్థం సైతం ఉన్నది. అటువంటి పోరాటాలు గతంలో ఎన్నో జరిగాయి. నేటి ప్రపంచం అటువంటి మెరుగైన పోరాటం కోసం ఆశించవచ్చా? రాం మాధవ్ వ్యాసకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
జన విశ్వాసమే మోదీ ఆయుధం
కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. మోదీ ప్రజల్లో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశారు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్–19)పై తన పోరాటానికి పార్లమెంట్ ఆటంకపరుస్తున్నదని భావించారు. పార్లమెంటులో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకుని అత్యవసర అధికారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశం లేని ఉత్తర్వుల ద్వారా హంగేరిని పాలిం చవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్థనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అనువుగా తీసుకుని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కిం చుకుని నియంతలుగా మారుతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయిక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్‌లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవడం తప్పలేదు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణ నుండి స్వయంగా తప్పించుకోవడానికే ఈ చర్య తీసుకున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్‌లో లాక్డౌన్ ఉల్లం ఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు. స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగి ఉన్న యునైటెడ్ కింగ్డమ్లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింప చేసుకోవడం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ సాధారణంగా బ్రిటన్ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు. ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచ్‌లు విశేష అధికారాలు కల్పించుకున్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు వేలాది ప్రజ లను వేరువేరుగా ఉంచడానికి, క్వారంటైన్ చేయడానికి సైన్యంపై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబనాన్, మలేసియా, పెరూ మొదలైన దేశాలు ఆంక్షలను అమలు చేయడం కోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకురావలసి వచ్చింది. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఇరవై వేలమంది సైనికులతో ‘కరోనా స్పందన సమూహాన్ని’ ఏర్పర్చింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బంధించే విశేషాధికారం కల్పించుకోవడానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నం చేసినా, అమెరికన్ కాంగ్రెస్ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుగారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్డౌన్ విషయంలో సర్వాధికారాలు ఉండ టంవల్ల దేశాధ్యక్షుడు ట్రంప్ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి. అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారతదేశంలో జరుగుతున్న దానితో పోల్చి చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారాల కోసమో అడుగలేదు. సెన్సార్షిప్ విధించడమో లేక విచారణ లేకుండా నిర్బంధించే చర్యలకో దిగలేదు. ప్రచార మాధ్యమాల గొంతు నొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది. మోదీ సైన్యం సాయం తీసుకోవాలని అనుకోలేదు. ప్రజల ప్రాథమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్డౌన్ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీకి ఎవరో సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితిగా వర్ణించిన పరిస్థితుల్లో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడగలిగారు. కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం) ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు) జనతా జనార్దన్ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కరోనాపై తన పోరాట సమూహమని పేర్కొన్నారు. దేశంలో సగం రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతనూ ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వసనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ సుయేమోల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. ‘ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజలచే’ ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుం టాం కానీ చాలా దేశాల్లో ప్రజలచేత విషయాలు నిర్వహించడం అనేది అరుదు. కానీ మోదీ దాన్ని మార్చివేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశాడు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. స్వచ్ఛ భారత్ పేరున పారిశుధ్యం కోసం చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుంచి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువగా క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనబరిచారు. ఫ్రాన్సిన్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచేత పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పర్చిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధపాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు. మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్టంగా కనబరిచారు. తబ్లిగీ జమాత్ మర్కజ్ అనే మతవర్గం లాక్డౌన్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు తమతమ ప్రాంతాలకు తరలిపోవడం వంటి రెచ్చగొట్టడానికి ఆస్కారం ఉన్న సంఘటనలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్డౌన్ నియమాలను ఉల్లం ఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్యపద్ధతి నమూనాను మార్చుకోలేదు. మోదీ ప్రజల్లో సహజ సిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ విశ్వ మహమ్మారి కరోనాపై పోరును మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్లమంది ప్రజలను పాత్రధారులను చేశారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్ధతిని అవలంబిస్తూ ‘మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం’ అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు. (వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం) రాం మాధవ్ వ్యాసకర్త బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
అధ్యక్ష తరహా ఎన్నికపై చర్చ జరగాలి
సాక్షి, రాయదుర్గం: స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, అధ్యక్ష తరహాలో ప్రధానిని ప్ర త్యక్షంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా తాము సానుకూలమేనని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరగాలన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కూడా అన్ని రాజకీయపార్టీలు చర్చించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లోని అధ్యక్షతరహా, దామాషా ఎన్నికల వంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూనే, ఇప్పటికే ఉన్న వ్యవస్థను సరిదిద్దే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని, పార్లమెంటులో 1,000 స్థానాలు ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. చట్టవిరుద్ధం కాకూడదు రాజకీయాల్లో డబ్బు అవసరమేరనని, అయితే అది చట్టవిరుద్ధం కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషనర్ అ««శోక్ లావాసా పేర్కొన్నారు. సెలబ్రిటీల ప్రచారం, పార్టీలకు సొంత మీడియా దగ్గుర్నుంచి అనేక కోణాల్లో ఎన్నికల్లో వ్యయంపై చర్చ జరగాలన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి సీఎంలు ఎన్నడూ మాట్లాడినట్లు తాను చూడలేదన్నారు. ఎన్నికల్లో నమోదైన కేసుల గురించి హోంమంత్రులు పట్టించుకోవటం లేదన్నారు. ఒక పరిధి దాటి ఎన్నికల్లో డబ్బు వ్యయాన్ని కట్టడి చేసే శక్తి ఈసీకి లేదన్నారు జమిలి ఎన్నికలతో మార్పు రాదు స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒకేసారి(జమిలి) ఎన్నికలు నిర్వహించటం వల్ల పెద్ద మార్పురాదని ఎఫ్డిఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌నారాయణ్ అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను సవరించాలన్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రదీప్చిబ్బర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎస్బీ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్వినిచాత్ర, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.సి.సూరి, అంతకుముందు సమావేశంలో శివసేన ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది,స్వరాజ్య ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్ జగన్నాథన్ తదితరులు ప్రసంగించారు. 4 అంశాలతో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పేరిట రెండ్రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు వేడుకల్లో జయప్రకాశ్ నారాయణ నాలుగు అం«శాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో... రాజకీయాల్లో డబ్బు వల్ల కలిగే పరిణామాలపై పౌరుల్లో అవగాహన పెంచాలి. పౌరులు, పౌరసమాజ సంఘాలు, ఎన్నికల సంఘం సమిష్టిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీల ప్రజాస్వామ్య పనితీరును నిర్ధారించడానికి, రాజకీయరంగంలోకి డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. పార్టీలు తమ వార్షిక ఆదాయ,వ్యయాలను సకాలంలో ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస ఆర్థిక సహాయం ఉండాలి. రాజకీయాల్లో చట్టవిరుద్ధమైన డబ్బు శక్తి, బహుమతులు ఇవ్వడాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు అవసరం. దేశంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీ, ప్రచార వ్యయానికి మించి జరుగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. -
రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన లేకుండానే ప్రతిపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారని, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విభేధిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చాలామంది నేతలకు సరిగ్గా తెలియదని విమర్శించారు. ప్రజ్ఞాభారతి, సోషల్ కాజ్ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో భారత్‌కు సీఏఏ ఎందుకు అవసరమన్న అంశంపై సదస్సు జరిగింది. ఇందులో రాంమాధవ్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్ష నాయకులది నాలెడ్జ్ ప్రూఫ్ విధానమని, గడియారాల్లోకి వాటర్ పోకుండా ఎలా వాటర్ ప్రూఫ్ ఉంటుందో.. ప్రతిపక్ష నేతలు తమ మెదళ్లలోకి సమాచారం వెళ్లనీయకుండా నాలెడ్జ్ ప్రూఫ్‌గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మతపరంగా రెచ్చగొట్టి, విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ముస్లింలు వారి మాటలను నమ్మొద్దని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం ముస్లింలను బలి పశువులను చేస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలోనే 72 రకాల తెగలకు చెందిన ముస్లింలు ఉన్నారని, మన దేశంలో ఉన్న ఇన్ని రకాల ముస్లింలు మరెక్కడా లేరని చెప్పారు. ఈ చట్టం దేశంలో ఉన్న వారి కోసం కాదని వివరించారు. శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాల్సిన బాధ్యత దేశంపై ఉందని, కేంద్రం అదే పని చేస్తోందని స్పష్టం చేశారు. కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే ఎవరైనా దేశ పౌరసత్వం పొందొచ్చని, మతపరమైన కారణాలతో పౌరసత్వాన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అందుకే సోనియాగాంధీ, అద్నాన్ సమీకి పౌరసత్వం లభించిందని గుర్తుచేశారు. భయపడాల్సిన పనిలేదు.. ఈ దేశ పౌరులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ చట్టానికి భయపడాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారిని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని రాంమాధవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు కేంద్రం సీఏఏ తీసుకొచ్చిందని తెలిపారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అసోం ప్రజల ఆందోళనలో అర్థం ఉందని, కేంద్ర ప్రభుత్వం దాన్ని గౌరవిస్తోందని చెప్పారు. ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. దేశంలోని మేధావులు అనేకమంది సీఏఏకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ చేస్తే, కమ్యూనిస్టులు సమర్థించారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే వేర్పాటువాదులని విమర్శించారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాను చేసిందని చెప్పారు. అలాంటి వారివల్లే దేశం ఇస్లామీకరణ వైపు పోతోందని దుయ్యబట్టారు. సదస్సులో మాజీ డీజీపీ అరవిందరావు, నలంద యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సునయనసింగ్, మాజీ ఎంపీ వివేక్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఏఏపై వివరణ ఇచ్చిన రాం మాధవ్
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి దీని గురించి పూర్తిగా తెలియాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధమ్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నాని వ్యాఖ్యానించారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారని వెల్లడించారు. మిగిలిన పది శాతం మందికి కూడా దీనిని స్వాగతించేలా అర్థం చేయాలనేదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. భారత దేశంలో నివసిస్తున్న.. ఇక్కడే పౌరులుగా ఉన్న వారికి సంబంధించిన బిల్లు కాదని వివరించారు. పౌరసత్వ చట్టంలో అనేక క్లాజులు ఉన్నాయని, శరనార్థులు పక్క దేశం నుంచి వచ్చి దశాబ్దాల కాలంగా ఇక్కడే సెటిల్ అయ్యేవారి కోసమే ఈ చట్టమని స్పష్టం చేశారు. ఎన్నార్సీలో రిలీజియన్ అంశమే ఉండదని, సెక్యులర్ స్పిరిట్‌కు బీజేపీ కుట్టుబడి ఉందన్నారు. మానవత్వం అదరికీ సమానంగా ఉంటుందని, కాంగ్రెస్ నేతలు వారి చరిత్రనే చదవలేరు కానీ ఎన్నార్సీని ఏం చదువుతారని ఎద్దేవా చేశారు. శరనార్థులకు పౌరసత్వం ఇవ్వాలని మొదటి ప్రధాని నెహ్రూనే చెప్పారని రాం మాధవ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించామని, అప్పట్లో బ్రిటిష్ పాస్ పోర్టు ఉన్న వారు ఉగాండా నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నారు. భారతదేశం నుంచి బ్రిటన్ పాస్ పోర్టుతో ఉగాండా వెళ్ళిన వారికి ఇందిరా గాంధీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా ముస్లింలు స్వేచ్ఛగా లేరని, భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా ఉంటున్నారని పేర్కొన్నారు. బిల్లును రాష్ట్రాలు కాదు నేతలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. క్రిస్టియన్లు శరనార్థులుగా కేరళకు రాగా వారిని ఆదరించామని, ఎవరు వచ్చిన స్వాగతించడం మన రక్తంలోనే ఉందని ప్రస్తావించారు. 2014 డిసెంబర్ 31 ముందు వచ్చిన శరనార్థులకు ఈ చట్టం వర్తిస్తుందని, అవాస్తవాలతోనే ప్రజలు ఆస్థులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం చిన్న రాష్ట్రం అవ్వడం వలన అక్రమ వలసలు కొనసాగాయన్నారు. ఉప ఎన్నికల్లో లక్ష కొత్త ఓటర్లు వచ్చారని, 1971 కటాఫ్ ఇయర్‌గా పెట్టామని తెలిపారు. అస్సామీలకు భాష, సంస్కృతిలో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భారత్ రక్షణ కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. -
విపక్షాలపై రాంమాధవ్ మండిపాటు
-
సోనియా గాంధీకి పౌరసత్వం ఇవ్వలేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నాయకులు మిడిమిడి జ్ఞానంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల బుర్రలోకి సరైన సమాచారం పోలేదని విమర్శించారు. పౌరసత్వ చట్టం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్లకే తెలియట్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 130 కోట్ల భారతీయ ప్రజలకు దీనితో సంబంధం లేదని పేర్కొన్నారు. మతపరమైన కారణాలతో పౌరసత్వం రద్దు చేయరని స్పష్టం చేశారు. పొరుగు దేశం నుంచి భారత్‌కు వచ్చేవారి కోసమే ఈ చట్టాన్ని రూపొందించారని రాంమాధవ్ తెలిపారు. ఈ లెక్కన సోనియా గాంధీకి భారత పౌరసత్వం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లకు వాస్తవాలు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మన దేశ బాధ్యతగా అభివర్ణించారు. దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తుచేశారు. కానీ నేడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. -
టీడీపీ మునిగిపోతున్న నావలాంటిది
-
తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...
సాక్షి, గుంటూరు : గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ బుధవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. వలసలను ఆపటానికి బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని రాంమాధవ్ తెలిపారు. -
ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. నగరంలో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. ‘సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందేలా చేస్తాం. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. తన పార్టీ నుంచి వలసలను ఆపేందుకు బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పరిస్థితి ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఉంది. మాకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీకి జూనియర్ పార్టీగా వ్యవహరించం.’ అని స్పష్టం చేశారు. -
కశ్మీర్ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జమ్మూ,కశ్మీర్ అభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.త్వరలోనే కశ్మీర్ ప్రజలకు అన్ని రాజకీయహక్కులు కల్పిస్తామని, అక్కడి అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు. అలాగే ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘ఆర్టికల్ 370 రద్దు’పై ఏర్పాటు చేసిన జనజాగరణసభకు రాంమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చర్చలు జరిపే అవకాశమే లేదని, చర్చించాల్సి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దృష్టంతా పీఓకేను ఎలా సంపాదించాలన్నదానిమీదే ఉందన్నారు. ఉగ్రవాదులకు మద్దతుపలుకుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370 రద్దు చేశాక 200 మందివరకు మాత్రమే ముందస్తుగా అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 370 రద్దు ధైర్యంతో తీసుకున్న నిర్ణయమని, ఈ ఆర్టికల్ ద్వారానే వేర్పాటువాదానికి ఊతం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అన్నారు. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేయడాన్ని తప్పుబట్టారు. జమ్మూ, కశ్మీర్లో ఆర్మీ కోర్ కమాండర్‌గా, ఆ తర్వాత అక్కడి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నపుడు తన అనుభవాలను లెఫ్టినెంట్ మహ్మద్‌జకీ పంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు సాహసోపేతమైన చర్యఅని సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ఎంవీ కృష్ణారావు అన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు
-
జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. I am deeply shocked to learn about the demise of Shri Arun Jaitley,a long time dear friend and one of my closest associates. His death is an irreparable loss to the nation and a personal loss to me. I have no words to express my grief. — VicePresidentOfIndia (@VPSecretariat) August 24, 2019 మరోవైపు జైట్లీ మరణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
బీజేపీలోకి 10 మంది ఎమ్మెల్యేలు
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని లేదా అధికార సంకీర్ణంలో లేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఆ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈశాన్య రాష్ట్రాల పార్టీ ఇన్చార్జి రాంమాధవ్‌ల సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. ప్రస్తుతం సిక్కింలో ఎస్కేఎం అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గానూ 17 సీట్లను ఎస్కేఎం గెలుచుకుంది. పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 10 మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీకి ఇప్పుడు సిక్కిం లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ చెప్పారు. -
బీజేపీ తదుపరి ఆపరేషన్ ఆకర్ష్.. సిక్కిం?
గ్యాంగ్‌టక్ : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ(సీడీఎఫ్) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో బీజేపీకి ఒక్క సీటుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో సిక్కింలో ప్రతిపక్షపార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీని తాజా చేరికలతో బీజేపీ విలీనం చేసుకోవడంతో ఆ పార్టీ అక్కడ రెండోస్థానంలో నిలిచింది. 25 సంవత్సారలకుపైగా సిక్కిం డెమోక్రటిక్‌పార్టీ అధ్యక్షుడు పవన్‌కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పాలన అందించారు. ఆయన దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పుడీ తాజా చేరికలతో ఆ పార్టీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. 2019లో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 17 స్థానాలు గెలుచుకొని ప్రేమ్‌సింగ్ తమంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ పోటీచేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ కూడా బీజేపీ పార్టీ బలపడినట్లయింది. పార్టీమారిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీ లుక్ ఈస్ట్ విధానం నచ్చిందని, మేం సిక్కింలో కమల వికాసం కోరుకుంటున్నామని’ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ సిక్కింలో ఇక నుంచి మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యేలు చేరితే ఫిరాయింపులను ప్రోత్సహించిందనే నిందను మోయకుండా మూడింట రెండు వంతుల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగబద్దంగానే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. సిక్కింలో కూడా పాగా వేస్తే సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పది సంవత్సరాల క్రితం ఉనికిలో కూడా లేని బీజేపీ నేడు సిక్కిం మినహా మిగతా అన్ని ఈశాన్యరాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారంలో ఉంది. ఇక సిక్కింలో తాజా చేరికలతో ఆ పార్టీ అధికారానికి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, అలాగే అధికార పార్టీకి మెజార్టీ తక్కువ ఉండటం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో బీజేపీ కేసు వేయడం చూస్తుంటే అతి దగ్గరలోనే మరో కర్ణాటక, గోవా రాజకీయాలను సిక్కింలో చూస్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులో ఉండటంతో వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన రాష్ట్రంగా ఉంది. -
ఆర్టికల్ 370 రద్దు.. మోదీ అరుదైన ఫొటో!
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్రమోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోనుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్విటర్లో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశారు. ఎప్పటిదో తెలియని ఈ పాత ఫొటోలో యవ్వనంలోని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆయన వెనుక ఉన్న బ్యానర్లో రాసి ఉంది. ఈ ఫొటోను పోస్టు చేసి.. ‘హామీ నెరవేరింది’ అని రాం మాధవ్ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా యవ్వనంలో ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆందోళన నిర్వహించినప్పటి ఫొటో ఇది అయి ఉంటుందని, నేడు ఆర్టికల్ 370 రద్దు అయిన నేపథ్యంలో ఈ అరుదైన ఫొటోను ఆయన షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. Promise fulfilled pic.twitter.com/iiHQtFxopd — Ram Madhav (@rammadhavbjp) August 5, 2019 -
‘చారిత్రక తప్పిదాన్ని సవరించారు’
న్యూఢిల్లీ: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. చారిత్రక తప్పిదాన్ని నేడు సవరించారన్నారు. జమ్మూకశ్మీర్ విభజనపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చారిత్రక తప్పిదాన్ని సవరించిన ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాను అభినందిస్తున్నాను అన్నారు. ఇక మీదట మహోన్నత భారత్ దిశగా పయనించబోతున్నాం అంటూ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన రోజు. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంలో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా’ అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్మూకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’
సాక్షి, గుంటూరు : టీడీపీ కేవలం తానా సభల్లో మాత్రమే మిగులుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పనైపోయిందని అన్నారు. గుంటూరులో ఆదివారం బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంమాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ అంటే ఒక రాజకీయ సంస్కృతి అని తెలిపారు. భిన్నమైన రాజకీయ సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యుడని పేర్కొన్నారు. అన్ని పార్టీల వారు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో బలపడేందుకు చాలెంజింగ్‌గా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అనే నమ్మకం ప్రజల్లో కలిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు కూడా ఆ నమ్మకం కలిగించాలని అన్నారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ నిలయంగా మారిందని మండిపడ్డారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ అధికార పార్టీ దిశగా ఎదగాలని ఆకాక్షించారు. 25 మందిని కూడా స్వయంగా సభ్యత్వం చేయించని వారికి ఏ పదవి ఆశించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. -
అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు. -
హాయ్‌ల్యాండ్‌లో రెండోరోజు బీజేపీ నేతల భేటీ
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
తెలుగుదేశం పార్టీకి షాక్, వరదాపురం సూరి రిజైన్
సాక్షి, అనంతపురం : ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా అంతకు ముందు వరదాపురం సూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. అనివార్య కారణాల వల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీ అధిష్టాన ప్రతినిధులతో సంప్రతింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. -
‘యోగాతో రాహుల్ పిల్ల చేష్టలకు చెక్’
తిరువనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలకూ వేదికైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ ఫోన్ చూస్తూ గడపడాన్ని రాం మాధవ్ పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంట్లో కొంతమంది పిల్లలు ఉన్నారని, యోగా అభ్యసించడం ద్వారా వారు తమ పిల్ల చేష్టలను అధిగమించవచ్చని రాహుల్‌ను ఆయన ఎద్దేవా చేశారు. క్లాస్ రూంలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై దృష్టి కేంద్రీకరించడం కొందరికి కష్టం కావచ్చు..పరీక్షల సమయంలో పాఠ్యపుస్తకాలపై మనం దృష్టి సారించలేకపోవచ్చు.. అంటూ అయితే వీటికోసం చింతించాల్సిన అవసరం లేదని, స్కూళ్లలో చిన్నారులు ఉన్నట్టే మన పార్లమెంట్‌లోనూ పిల్లలు ఉన్నారని రాహుల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో పిల్లలు మన రాష్ట్రపతి ప్రసంగాన్నే ఆలకించరని, వారు తమ మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు చెక్ చేసుకంటూ వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారని చురకలు అంటించారు. వారి చిన్నపిల్లల మనస్తత్వాన్ని యోగాతో నియంత్రించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. -
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత
సాక్షి, న్యూఢిల్లీ : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె మంగళవారం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్ఎస్ఎస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అధిష్టానం అప్పగించింది. ఇందులో భాగంగా రాంమాధవ్ హైదరాబాద్ వచ్చి పార్క్ హయత్‌లో మకాం వేశారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాంమాధవ్‌తో భేటీ అయిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మోహన్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాంమాధవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. 2023నే లక్ష్యంగా... కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా 4 లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకున్న తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాంమాధవ్‌కు అప్పగించారు. దీనిలో భాగంగానే రాంమాధవ్ ప్రాథమికంగా కొందరు నేతలను ఆకర్శించే వ్యూహంతో బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనతో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమావేశం అయ్యేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత రాంమాధవ్ పలు పార్టీల నేతలను కలిశారు. వీరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, టీజేఎస్ నేతలు ఉన్నట్లు తెలిసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో 2023 కల్లా రాష్ట్రంలో కనీసం సగం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో రాంమాధవ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బుధవారం పలువురి నేతలను కలసిన ఆయన గురువారం కూడా హైదరాబాద్‌లోనే ఉండి మరికొందరిని కలువనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాంమాధవ్‌ను కలసిన నేతలంతా దాదాపు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీలో పలువురు నేతల చేరిక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాంమాధవ్‌తో టచ్‌లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబతున్నారు. -
బీజేపీలోకి ఇద్దరు టీ కాంగ్రెస్ ఎంపీలు?
న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్, కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. -
పార్టీ మారుతున్న జేసీ బ్రదర్స్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన.. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గెలుపొందారు. 2 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగురవేసింది. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలు కూడా.. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరితో కూడా రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ చేరిక తర్వాత వీరు పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ముందు వరుసలో జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరనున్న నేతల్లో జేసీ బ్రదర్స్ మొదటి వరుసలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారూ ఓటమి పాలయ్యారు. తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అనే నిర్ధారణకు వచ్చారు. దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న అమిత్‌షా ఎదుట వీరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకుంటే త్వరలోనే మరో తేదీ ఖరారు చేసుకుని బీజేపీలో చేరే అవకాశం ఉంది. పరిటాల కుటుంబంతో చర్చలు సఫలం పరిటాల కుటుంబం రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కేడర్ తమతో వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ను ఒప్పించి బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, పల్లె, సూరి చేరికల తర్వాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎగ్జిట్ పోల్స్ అలా అయితే ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చిన విపక్షాలపై బీజేపీ మండిపడింది. ఇవే ఎగ్జిట్ పోల్స్ విపక్షాలకు అనుకూలంగా వస్తే వాటిని సమర్ధించేవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తాము చెప్పిన స్ధానాలకు అనుగణంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే తమకు ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను మమతా బెనర్జీ, కుమార స్వామి, చంద్రబాబునాయుడు వంటి విపక్ష నేతలు ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ వారి అంచనాలకు తగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తే అవి సరైనవేనని, లేకుంటే వాటిని తప్పుపడతారని వ్యాఖ్యానించారు. వారంతా ఈవీఎంల ద్వారానే గతంలో గెలిచినా ఇప్పుడు వాటి పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించారు. విపక్ష నేతలకు ఈనెల 23న భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. తమ పార్టీకి 300 స్ధానాల వరకూ దక్కుతాయని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. -
ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే సాధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మాదవ్ స్పందిస్తూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విపక్షాలకు అనుకూలంగా వస్తే అవి సరైనవి. వారికి వ్యతిరేకంగా వస్తే సరైనవి కావు అనే విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ఎవరినీ ప్రశ్నించరు. వారికి వ్యతిరేకంగా వస్తే వ్యవస్థనే తప్పుపడతారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయడు, కూమరస్వామి వీరంతా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు కూడా ఇవే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని మర్చిపోయారు. గతంలో కంటే ఈసారి తమకు మెరగైన ఫలితాలు వస్తాయి. మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మే 23న వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 300లకు పైగా స్థానాలకు గెలుచుకుంటాం’’ అని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. -
‘బీజేపీ కంటే మోదీకే పాపులారిటీ’
ఢిల్లీ: ప్రజలందరూ పదే పదే మోదీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలుగు వారి ఓటర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాం మాధవ్ మాట్లాడుతూ..కాశ్మీర్లో ఆజాద్ హిందూస్తాన్... నరేంద్ర మోదీ జిందాబాద్ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రాబల్యం లేని చోట కూడా నరేంద్ర మోదీకి ప్రజాదరణ ఉందన్నారు. వాస్తవంగా బీజేపీ కంటే నరేంద్ర మోదీకే ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పారు. ‘దేవెగౌడ ప్రధాని అయినప్పుడు తామెందుకు ప్రధాని కాలేరని చిన్న పార్టీల నేతలు కలలు కంటున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కింగ్మేకర్లు కావాలని కలలు కంటున్నారు. మావద్ద కింగే ఉన్నప్పుడు కింగ్ మేకర్ అవసరం లేదు. మే 23న ఫలితం ఏమిటనేది ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు. 2014లో బీజేపీకి 225 కంటే ఎక్కువ రావని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ సారి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి మెజారీటీతో గెలవడం ఖాయమ’ని వ్యాఖ్యానించారు. ‘తాము అధికారంలోకి వస్తే రూ.72 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశారు. నరేంద్ర మోదీ ఉచితంగా ఏదీ ఇవ్వలేదు. డబ్బున్న వ్యక్తికి, లేని వ్యక్తికీ సమానమైన చికిత్స అందించాలని ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకంతో టైర్-2 సిటీల్లో కూడా మంచి ఆసుపత్రులు వస్తున్నాయి. ప్రజలు బిచ్చగాళ్లు కాదు..వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలనేదే మోదీ ప్రభుత్వ ఉద్దేశమ’ని చెప్పారు. ‘దేశంలో 9 కోట్ల మరుగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు గ్యారంటీ లేకుండా రూ.15 లక్షల అప్పు ఇచ్చే ముద్ర యోజన పథకాన్ని తీసుకువచ్చాం. ఉద్యోగాల కోసం వెతికిన వాళ్లు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు తలెత్తుకుని బతికేలా గౌరవాన్ని పెంచారు. ప్రతి రంగంలోనూ నరేంద్ర మోదీ తనదైన ముద్రవేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌లకు ఆధారాలు కావాలంటే మిగ్ విమానాలకు కట్టేసి తీసుకెళ్లాలా..? భారత్ సమర్పించిన ఆధారాల కారణంగానే ఐక్యరాజ్య సమితి, మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. దొంగే దొంగ అన్నట్లుగా.. చౌకీదార్ చోర్ అంటున్నారు. నరేంద్ర మోదీ అవినీతిరహిత వ్యక్తి. అవినీతిపరులు దేశం వదిలిపారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరి హృదయాల్లో నరేంద్ర ఉన్నార’ని కొనియాడారు. -
‘హమారే పాస్ మోదీ హై’
జమ్మూ: విపక్ష నాయకులపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సినిమాటిక్ స్టైల్లో విమర్శలు గుప్పించారు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం దీవార్ డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా ఆయన పంచ్‌లు పేల్చారు. ప్రతిపక్షాల కూటమిలో నరేంద్ర మోదీ వంటి శక్తి సామర్థ్యాలు కలిగిన నేత ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అందుకే వారు కూటమిగా ఏర్పరడ్డారని విమర్శించారు. కానీ.. హమారే పాస్ మోదీ హై( మా దగ్గర మోదీ ఉన్నారు) అని వ్యాఖ్యానించారు. మోదీ భారత్‌ను అవినీతి రహిత, తీవ్రవాద రహిత దేశంగా మార్చారని పునరుద్ఘాటించారు. విపక్షాల కూటమిలో ఎక్కువ మందికి ప్రధాని సీటు పైనే దృష్టి ఉందని.. వారు విజయం సాధించలేరని అన్నారు. మరోవైపు జుమ్మూ కశ్మీర్‌లోని కథువాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబాలు ఇక్కడి ప్రజల జీవితాలను నాశనం చేశాయని ఆరోపించారు. తొలి దశలో ఓటు వినియోగించుకున్న బారాముల్లా, జమ్మూ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.ఇక్కడి ఓటర్లు పోలింగ్‌ను పెంచడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చాటిచెప్పారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఓటుతో ఉగ్రవాద నాయకులకు, అవకాశవాదులకు ధీటైన జవాబు చెప్పారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలో బారాముల్లా, జమ్మూలో ఎన్నికల జరిగాయి. రెండో దశలో ఉద్దంపూర్, శ్రీనగర్‌లో పోలింగ్ జరగనుంది. అనంత్‌నాగ్‌లో మాత్రం మూడు, నాలుడు, ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లడఖ్‌లో ఐదో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
‘బాబుకు ఓటమి తప్పదు’
సాక్షి, నెల్లూరు : రాష్ట్రంలో అధికారం కోల్పోతున్న చంద్రబాబు.. ఢిల్లీలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పాదంగా ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో మరోసారి నరేంద్ర మోదీనే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం
ఆర్మూర్: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చొరవ వల్లే సమస్య తీవ్రత కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు గిట్టుబాటు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వానికి పసుపు పంటకు ధర ఇవ్వడం పెద్ద సమస్య కాదని చెప్పారు. సుమారు 150 రకాల పసుపు, ఎర్రజొన్న లాంటి పంటలు పండించే రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్న తరుణంలో రైతు పంటను అమ్ముకున్న ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని రాంమాధవ్ హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వంపై ఉన్న వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. ఇది ఎంపీ కవిత వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో నిరంకుశ పాలన సాగుతోందని రాంమాధవ్ విమర్శించారు. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరు.. పాలమూరు: బీజేపీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని రాంమాధవ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ. తానే కింగ్ మేకర్ అంటున్న కేసీఆర్, మోదీ పాలనను అడ్డుకుంటామన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్న చంద్రబాబు మొదట ఆంధ్రలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దేశంలో రాహుల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. రాహుల్ ఎక్కడ పర్యటించినా మోదీ..మోదీ అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారని గుర్తు చేశారు. 300 స్థానాల్లో ఒంటరి పోరు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 300 స్థానాల్లో పోరాడుతుందని, అన్ని స్థానాల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని, ఎక్కువ మెజార్టీతో గెలిచాడని అల్లుడు హరీశ్‌రావును పక్కన పెట్టారని, మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న జితేందర్‌రెడ్డికి సైతం టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్సభలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి మాట్లాడుతూ.. ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచంలో మోదీకి మించిన నాయకుడు లేడని కొనియాడారు. -
ఎంపీగా పోటీ చేయకుండా ప్రధాని ఎలా అవుతారు?
సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణలో భయోత్పాద వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఎవ్వరు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వెళ్లడంలేదని, భయపెట్టి లాక్కుంటున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ జన్మభూమి తమ ఎన్నికల నినాదం కాదని, కోట్లాది మంది ప్రజల మనోభావాల అంశంగానే రామజన్మభూమిని పరిగణిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులాలను రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అవుతామని అంటున్న నేతలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీలుగా పోటీ చేయకుండా ప్రధానమంత్రి ఎలా అవుతారో చెప్పాలన్నారు. కేసీఆర్ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలేదని మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్తి డీకే అరుణ విమర్శించారు. టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 16 సీట్లు గెలిస్తే తాను ప్రధానిని అవుతానంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రధానమంత్రి ఎలా అవుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహమూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్‌కు రాంమాధవ్ సూటిప్రశ్న..!
సాక్షి, మహబూబ్‌నగర్ : ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో కింగ్ మేకర్ అవుతానంటూ పదేపదే చెప్తున్న సీఎం కేసీఆర్ లోక్‌సభకు ఎందుకు పోటీచేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సూటిగా ప్రశ్నించారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రాజకీయాలతో ప్రంట్లు ఏర్పడవని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు గెలవడం అసాధ్యమని, ఆయన అతి తెలివితేటలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను తలదన్నేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రతిపక్షాల మనుగడను దెబ్బతీస్తున్నారని, అవినీతి అహంకార పాలన సాగుతోందని మండిపడ్డారు. సొంత బంధువుకు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చిందనే అక్కసుతో ఆయన ఉనికిని దెబ్బ తీస్తున్నారని, ఎంపీ జితేందర్‌రెడ్డి ఎదుగుదలను కట్టడి చేయడానికి టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అవుతారని మాధవ్ జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ అమిత్ షా కన్నా ఆయనే ముఖ్యం
న్యూఢిల్లీ : బీజేపీలో ప్రస్తుతం అమిత్ షా శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల పార్టీ బలోపేతానికి అమిత్ షా కృషి చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రల్లో మాత్రం అమిత్ షా ప్రభావం అంతగా లేదట. అక్కడ అమిత్ షా కన్నా అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ రాం మాధవ్. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పార్టీ హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించలేదు. ఈ విషయంపై స్పందించిన రాం మాధవ్.. ‘దీన్ని బట్టి పార్టీ అమిత్ షా కన్నా ఎక్కువ బాధ్యతలు హిమంతకే అప్పగించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈశాన్య భారతంపై హిమంత బిశ్వాకు చాలా పట్టుంది. ఇప్పటి వరకూ 5, 6 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోశించారు. అందుకే పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచార భారాన్నంత ఆయన మీదనే మోపింది. ఇందుకు చాలా శక్తి, సమయం కావాలి. ఈ బాధ్యతలు చూడ్డానికే టైం సరిపోదు. ఇక ఆయన కూడా పోటీలో ఉంటే.. పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు ఆయన గెలుపు కోసం కూడా కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల హిమంత బిశ్వాపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేద’ని తెలిపారు. హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈశాన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యతలను ఆయనకు అప్పగించాం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన హిమంత బిశ్వా.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో కమలం వికసించేలా కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందారు. -
కాంగ్రెస్ పాక్‌లో పోటీ చేయాలి
గువాహతి: కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిందని, ఒకవేళ వారు పాకిస్తాన్లో పోటీచేస్తే అక్కడ ఆ పార్టీ గెలిచేందుకు అవకాశముంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆదివారం గువాహతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా విషయాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై భారత్‌లోకంటే పాకిస్తాన్‌లోనే స్పందన ఎక్కువగా వస్తున్నదని, పొరుగుదేశంలోనే వారి వ్యాఖ్యలకు విపరీతంగా ప్రచారం లభిస్తోందని ఆయన అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పాకిస్తాన్లో ప్రతిపక్షంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో ప్రధాన ప్రతిపక్షం తీరు ఇలా ఉందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వంపైనా, ప్రధానిపైనా విమర్శించడానికి ఏమీ లేక వారు పాకిస్తాన్ విషయంలో అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారు’అని రాంమాధవ్ విమర్శించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1,800 కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా రాంమాధవ్ తీవ్రంగా ఖండించారు. ‘అది పూర్తిగా సత్యదూరం, ప్రతిపక్షానికి ఆరోపించడానికి ఏమీ లేక ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అయినా ఇది 2011లో జరిగిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది, వారు ఆ సమయంలో నిద్ర పోతున్నారా’అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణల్లో ఏమాత్రం పస లేదు, దేశమంతా మోదీ గాలి వీస్తోంది, గతంలో కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలవబోతోంది అని అన్నారు. బీజేపీ ఒంటరిగా 2014కన్నా ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయే పక్షాలు సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటారు. పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కచ్చితంగా సాధిస్తాం’అని పునరుద్ఘాటించారు. -
‘వారు పాక్‌లో పోటీ చేస్తే గెలుపు ఖాయం’
గువహటి : రానున్న లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్లో పోటీ చేస్తే గెలుపొందడం ఖాయమని బీజేపీ నేత రాంమాధవ్ ఎద్దేవా చేశారు. విపక్ష నేతలు చేస్తున్న ట్వీట్లు భారత్‌లో కంటే అధికంగా పాకిస్తాన్‌లోనే రీట్వీట్ అవుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ట్వీట్లు మనదేశంలో కంటే పొరుగు దేశంలోని ప్రజలే ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారని, వారు అక్కడికి (పాకిస్తాన్) వెళ్లి ఎన్నికల్లో పోటీ చేస్తే వారు గెలుపొందే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో విపక్ష తీరు ఇలా ఉందని రాంమాధవ్ ఎండగట్టారు. విపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు భారత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారా లేక పాక్‌కు వత్తాసుపలుకుతున్నారా అనేది ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. భారత సైన్యంపై విపక్ష నేతలు అమర్యాదకరమైన భాషను ప్రయోగిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ ప్రభంజనం ఉందని, బీజేపీ దాని మిత్రపక్షాలు గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ స్ధానాలను ఈసారి కైవసం చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. -
కాంగ్రెస్‌కు డీకే ఆరుణ గుడ్ బై?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను వీడగా.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. తాజాగా మహబూబ్‌నగర్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. రామ్ మాధవ్‌తో దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్‌పై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా హామీతో ఆమె ఢిల్లీ పయనమయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు సమక్షంలో అరుణ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమె మహబూబ్ నగర్ లోక్ సభ నుంచి ఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీకే ఆరుణతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇప్పటికే చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. -
మోదీతోనే అందరికీ న్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పేర్కొన్నారు. దేశ ప్రజలు మళ్లీ మోదీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లలో దేశాన్ని ‘ఉగ్రవాదరహిత దేశం’గా మార్చారన్నారు. ‘ఫోరం ఫర్ న్యూథింకర్స్’ ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్‌లో ‘మరోసారి మోదీ రావాలి’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ కాకుండా మరో ప్రభుత్వం వస్తే పేదలకు మళ్లీ ఇబ్బందులు తప్పవన్నారు. 2022 నాటికి 75ఏళ్లు పూర్తి చేసుకోనున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండకూడదనుకుంటే మళ్లీ మోదీయే ప్రధాని కావాలన్నారు. ఆయనే దేశాన్ని ‘నవభారతం’గా మారుస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో 2020కి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 338 సీట్లు వస్తాయని, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. తాము మీడియాను మీడియాలాగే చూస్తున్నామన్నారు. తమ పార్టీకి సొంత మీడియా వస్తుందని అప్పటివరకు నమో యాప్‌ను వాడాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి 80% హామీలను నెరవేర్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. పంటలకు మద్దతు ధర పెంచడమే కాకుండా ఫసల్ బీమా యోజన వంటి పథకాలతో వ్యవసాయరంగానికి లబ్ధిచేకూర్చారన్నారు. ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు జీఎస్టీ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఆర్థికంగా వెను కబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీయేతరులకు 10% రిజర్వేషన్లు కల్పించిన ఘనతా మోదీదేనన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావు తదితరులు మాట్లాడారు. -
‘మనకూ సొంత మీడియా వస్తుంది’
హైదరాబాద్: 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక దేశంగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. మోదీ మరోసారి రావాలి అనే అంశంపై హైదరాదాబాద్ మారీగోల్డ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లుగా టెర్రరిస్టు ఫ్రీ దేశంగా మార్చారని అన్నారు. 2022కి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండాలా అని ప్రశ్నించారు. మోదీ ఇండియాని నయా ఇండియాగా మార్చుతున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. మోదీయే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించబోతున్నారని అన్నారు. ఏపీకి సంబంధించి 80 శాతం విభజన హామీలు నెరవేర్చామని వెల్లడించారు. మీడియాని మీడియంగానే చూస్తున్నామని చెప్పారు. మోదీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని అన్నారు. మనకు కూడా త్వరలోనే సొంత మీడియా వస్తుందని వెల్లడించారు. అప్పటి వరకూ నమో యాప్ వాడాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, సుమారు 338 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. -
‘ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’
న్యూఢిల్లీ : భారత పైలట్ అభినందన్‌ను క్షేమంగా అప్పగించిన కారణంగా తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్లో #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్ ట్యాగ్‌తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు చైనా కూడా అభినందన్ విడుదల ద్వారా ఇమ్రాన్ శాంతికి ఆహ్వానం పలికారని ప్రశంసలు కురిపించింది. కాగా ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ స్పందించారు.(ఇమ్రాన్ ఖాన్‌పై చైనా ప్రశంసలు) శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ... ‘ ప్రస్తుతం పాకిస్తాన్లో కొంత మంది ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్లు తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. అయితే అది నిజంగా పాకిస్తాన్ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా? ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్ నిజంగా భావిస్తే పాక్, భారత్‌లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. కానీ వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి విధానంలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవడమూ లేదు’ అని రామ్ మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేఫథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్ అభినందన్ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శాంతి చర్చలకు ఆరంభంగానే అభినందన్‌ను విడిచిపెట్టామని పాక్ చెబుతుండగా.. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అతడిని స్వదేశానికి అప్పగించారని భారత సైన్యం పేర్కొంది.(పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) Alhamdolilah #PakistanLeadsWithPeace @ImranKhanPTI @OfficialDGISPR Nobel Peace Prize is waiting for you @ImranKhanPTI — Ayaz Shoukat (@AyazACMA) March 1, 2019 Nobel peace prize winner for 2019 is Mr. Imran Khan, Prime minister of Islamic state of Pakistan . Salute to Pak Army https://t.co/adgndxM9e7 — hasan (@hasanchand) March 1, 2019 -
శాంతి కాముకత భారత్ బలహీనత కాదు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతి, శ్రేయస్సును కాంక్షించే భారతదేశం బలమైనదని, శాంతికి విఘాతం కలిగిస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలకు సమాధానం ఇస్తూ భారత వైమానిక దళం తీసుకున్న నిర్ణయం గర్వించదగినదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘‘కౌటిల్య ఫెలోషిప్ ప్రోగ్రామ్’’ను అభ్యసిస్తున్న 32 దేశాలకు చెందిన 80 మంది దౌత్యవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన సభల సభ్యులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ సంచాలకులు రామ్ మాధవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పే ‘‘వసుదైక కుటుంబం’’అనే భావన భారత్ తత్త్వమని, అందుకే ప్రతి దేశంతో స్నేహాన్ని, శాంతిని కాంక్షిస్తుందని, దీన్ని బలహీనత అనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా జరిగిన వైమానిక దాడుల నేపథ్యంలో, భారత్ ప్రతి చోటా శాంతిని ప్రోత్సహించాలని కోరుకుంటుందని, అయితే శాంతికి విఘాతం కలిగించి, దేశ భద్రతకు సవాలు విసిరితే మాత్రం ఉపేక్షించమని, భారతీయుల శాంతి కాముకత్వాన్ని బలహీనతగా చూడొద్దని హితవు పలికారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా తీసుకున్న భారత్ నిర్ణయానికి ప్రపంచం మద్దతు అందించడం సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. -
ఉగ్రవాద అంతమే మా లక్ష్యం
విజయవాడ: దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయటమే మా అంతిమ లక్ష్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడ నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో బీజేపీ ఆధ్వర్యంలో భారత్ కే మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాంమాధవ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వ్యాపారవర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం రాంమాధవ్ విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వీర జవానుల కుటుంబాలను మా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మన్‌కీ బాత్.. మోదీ కే సాత్ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని వెల్లడించారు. మోదీ జగన్నాధ రథాన్ని ఎన్ని ప్రతిపక్షాలు కలిసినా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అవినీతి, అసమర్థపాలన ఏపీలో కొనసాగిందని, మార్చిలో బీజేపీ విజన్ డాక్యుమెంట్(మ్యానిఫెస్టో) విడుదల చేస్తామని చెప్పారు. 85 శాతం హామీలు ఏపీలో అమలు చేశామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడానికి ఏపీ ప్రభుత్వ జాప్యమే కారణమని వివరించారు. ఐదేళ్లలో చరిత్రాత్మక నిర్ణయాలు: కన్నా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఐదేళ్లలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు మోదీ తీసుకున్నారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి ఏమి చెయ్యాలో చర్చించామని, అలాగే వివిధ రంగాల వారి సలహాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. -
నిజామాబాద్‌లో అమిత్‌షా పర్యటన
సాక్షి, హైదరాబాద్ : రానున్ను లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటన చేయనున్నారు. ఫిబ్రవరి 13న నిజామాబాద్‌లో అమిత్ షా పర్యటిస్తారని ప్రకటించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడం కోసం నాయకులు పర్యటిస్తారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయ పతాకం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ధమాకా బడ్జెట్ వస్తుందని, మోదీకి ధీటైన నాయకుడు ఏ పార్టీలోనూ లేడని, మహాకూటమిలు మోదీని ఏంచేయలేవంటూ ధీమా వ్యక్తం చేశారు. -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
కూటమి పేరిట డ్రామాలు
భైంసా/భైంసాటౌన్(ముథోల్): కాంగ్రెస్, టీడీపీలు కూటమి పేరిట డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. భైంసాలో బీజేపీ అభ్యర్థి రమాదేవి నామినేషన్ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ప్రస్తుతం తామే ప్రత్యామ్నాయం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహాకూటమి పేరిట వచ్చి ప్రజల బతుకులతో ఆడుకునేందుకు మరోసారి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు ఎన్టీఆర్ కంకణం కట్టుకుంటే.. చంద్రబాబు ఆ పార్టీ చంకనెక్కి కూర్చున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తన సీటును కాపాడుకోలేని చంద్రబాబు.. దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జేబులో టీడీపీ ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ చంకలో ఉందని ఎద్దేవా చేశారు. పక్కనే గోదావరి నది ఉన్నా తాగు, సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తీరాలంటే బీజేపీ గెలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గళమెత్తింది బీజేపీయే తెలంగాణ గళమెత్తింది మొదట బీజేపీయేనని రాంమాధవ్ అన్నారు. 1997 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం తామే తెచ్చామని భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల గద్దె దిగిందని విమర్శించారు. ఐదేళ్లు పాలన చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కరుడు గట్టిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో దోస్తీ పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని దిగజారుస్తున్నారని ఆరోపించారు. -
టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘నిన్నటి వరకు కాంగ్రెస్‌ను అనరాని మాటలతో దూషిం చిన తెలుగుదేశం పార్టీ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించింది. కాంగ్రెస్‌కు మిత్ర పక్షమై.. నేను తెలుగుదేశం పార్టీ కాదు.. నేను తెలుగు ద్రోహుల పార్టీ అని ఆ పార్టీ తన పేరు మార్చుకుంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో నియోజకవర్గ స్థాయి ప్రముఖుల శిక్షణ శిబిరం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పొంతన లేని పార్టీలు రాష్ట్రంలో మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో మునుగుతుందని, ఎవరెవరు వెంట వస్తే వారిని కూడా ముంచే కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకతను చూసి ప్రజలు తమకే పట్టం కడతారన్న భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. జెండా ఎజెండా లేనిది మహాకూటమని, ఈ కూటమి విజయం సాధించడం అసాధ్యమన్నారు. ప్రజలకు బీజేపీ ఆశాకిరణంలా కనిపిస్తోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థితిలో ఉంటుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కి 30 సీట్లు కూడా రావన్నారు. ఈ శిబిరంలో బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టండి
-
కాంగ్రెస్ జేబులో కూర్చొని రాజకీయాలా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ.. చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రాంమాధవ్ విమర్శించారు. కాంగ్రెస్ జేబులో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ లో పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీని కోసం టీడీపీ ఆక్సిజన్ అందిస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానం అవినీతి, కుటుంబ పాలనకు ట్రేడ్ మార్క్‌గా అయిన కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే టీఆర్ఎస్ సర్కారు తయారైందని రాంమాధవ్ ఆరోపించారు. అవినీతి లో టీఆర్ఎస్ సర్కారు రెండో స్థానంలో నిలవగా, ఏపీలో చంద్రబాబు సర్కారు నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. నిరుపేద ప్రజలు, రైతుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అవినీతిపరులు.. కాంట్రాక్టర్ల రాజ్యంగా మారిందని నిప్పులు చెరిగారు. రూ.పది వేల కోట్లతో ఇంటింటికీ తాగు నీరిచ్చేందుకు వీలున్నప్పటికీ.. మిషన్ భగీరథ ద్వారా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండివడ్డారు. ఇంటింటికీ తాగునీరు రాలేదు కానీ, నిధులు మాత్రం ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇస్తే.. నాలుగేళ్లలో కేసీఆర్ దోచుకోవాల్సింది అంతా దోచుకుని మళ్లీ అధికారం ఇవ్వాలని ప్రజల వద్దకు వెళ్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు తెలుగు ద్రోహిగా మిగిలాడు’
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగేళ్లకే ప్రభుత్వం రద్దు చేసి 420గా మిగిలిపోయాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. బుధవారం ఆయన జగిత్యాలలో మాట్లాడుతూ.. మార్పు కోసం నందమూరి తారకరామరావు టీడీపీని స్థాపిస్తే వెన్నుపోటుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ద్రోహిగా మిగిలిపోయాడని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అవినితీ కేరాఫ్ అడ్రస్‌గా మారాయని వ్యాఖ్యానించారు. పేదవారి కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకం తీసుకువస్తే.. తెలంగాణ ప్రభుత్వం అవసరం లేదని తిరస్కరించిందని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడటానికి అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్ కారణమని మండిపడ్డారు. వారిద్దరి అసమర్ధత వల్లే వేలాది మంది రైతులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చక్కెర ఫ్యాక్టరీని తెరపిస్తామని హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో గరుడ పురాణం నడుస్తోంది..!
సాక్షి, గుంటూరు /గన్నవరం: దేవాలయాల్లో నడవాల్సిన గరుడ పురాణం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపార్టీల్లో నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. కాల్‌షీట్‌లులేని కమిడియన్ చెప్పే గరుడ పురాణం కథను చదువుతూ సీఎం చంద్రబాబు రాజకీయం చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగిన మహిళా సాధికారిత– మహిళా సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు ఆయన గన్నవరం విమానాశ్రయంలోనూ మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళల అభిమానంతోనే మోదీ ప్రధాని అయ్యారని, వారి కష్టాలు తీర్చేందుకు స్వచ్ఛభారత్ అభియాన్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఏపీలో మరుగుదొడ్లను లెక్కల్లోనే చూపుతున్నారని ఆరోపించారు. గతంలో పశువుల గడ్డిని తిన్న సీఎంను చూశామని, ఆంధ్రా సీఎం మరుగుదొడ్లలో సైతం దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. కేంద్రం పేదల కోసం ఇచ్చే నిధుల్లో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోదని, విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటన సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కాదని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతుండడంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబును రంగంలోకి దింపినట్లు ఆరోపించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలనే ఆలోచనతో పార్టీ పెడితే, చంద్రబాబు మాత్రం మాయావతి వద్దకు వెళ్లి సాగిలపడి కాంగ్రెస్‌కు మద్దతివ్వమని బతిమాలుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ హోషిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రహత్కర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మహిళా మోర్చా జాతీయ ఇన్చార్జి పురంధరేశ్వరి పాల్గొన్నారు. -
‘అంత్యోదయ’మే మోదీ నినాదం
సాక్షి, హైదరాబాద్: దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఏకైక లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అంత్యోదయ నినాదంతో పనిచేస్తున్నందున.. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి తీసుకురావాలని బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేవైఎం ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహాధివేశన్’లో ఆదివారం ప్రసంగించారు. పేదరికాన్ని అనుభవించిన మోదీకి ప్రజలకు ఎదురయ్యే కష్టాలేంటో తెలుసన్నారు. అందుకే బడుగు, బలహీన, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమల్లోకి తెచ్చారన్నారు. ఆర్థిక స్వావలంబనతో విశ్వశిఖరంపై భారత జెండా ఎగురవేసిన ఘనత మోదీదేనన్నారు. యువమోర్చా ప్రతినిధులలే.. రేపటి భావి నేతలని, సేవే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ‘బూత్ స్థాయిలో గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. బూత్ స్థాయినుంచే పార్టీని బలోపేతం చేయాలి. అమిత్ షా, పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో యువమోర్చా ప్రతినిధులంతా కొత్త ఉత్సాహంతో పనిచేయాలి’అని గోయల్ కోరారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక తెలంగాణ వంతు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ 20 రాష్ట్రాల్లో గెలిచిందని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలవాలన్నారు. అందుకు యువమోర్చా రెట్టించిన ఉత్సాంతో పని చేయాలన్నారు. ప్రధాని మోదీకి సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానికి అద్భుతమైన మర్యాద, స్వాగతం లభిస్తున్నాయన్నారు. భారత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత గొప్పగా చేసిన ఘనత ప్రధానిదేనని రాంమాధవ్ ప్రశంసించారు. వివిధ దేశాధి నేతలు కలిస్తే.. ప్రపంచం దృష్టంతా మోదీపైనే ఉంటుందన్నారు. యెమెన్ అంతర్యుద్ధం సమయంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించామని ఆయన గుర్తుచేశారు. ఇదే సమయంలో అక్కడున్న చిక్కున్న తమవారినీ కాపాడాలంటూ 30 దేశాలు భారత్ సాయాన్ని అర్థించాయన్నారు. దేశవ్యాప్తగా బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు పన్నినా పెద్ద ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో బీజేపీ విజయానికి.. ఈ సదస్సు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ‘19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 20వ రాష్ట్రంగా తెలంగాణ కూడా బీజేపీ ఖాతాలోకి రాబోతోంది’ఇందులో సందేహమేమీ లేదు. అని రాంమాదవ్ పేర్కొన్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కమలోదయం... డిసెంబర్ 11న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయలక్ష్యం 2019 యువ మహాధివేశన్’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమన్నారు. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డనని, ఆంధ్రా కోడలినని తెలిపారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. 2019లో విజయమే మన సంకల్పమని, మోదీ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె అమిత్ షాను సత్కరించి, వివేకానంద పుస్తకం బహూకరించారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ: లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో పాటు పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్షా 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీఇచ్చి కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే కేసీఆర్ భర్తీ చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. డీఎస్సీ కోసం యువత ఎదురు చూసి విసిగిపోయారన్నారు. అమిత్ షా నేతృత్వంలో మరొకసారి మోదీ ప్రధాని కావడం తథ్యమన్నారు. తెలంగాణ యువకులు కమల వికాసానికి కంకణబద్ధులై ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. -
‘ఏపీలో కమెడియన్లు చాలా మంది ఉన్నారు’
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలక్షేపం కోసం పనిచేసే కమెడియన్లు చాలా మంది ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరులో జరుగనున్న మహిళా మోర్చా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికే ఢిల్లీకి వెళ్లారని, ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం కాదని అన్నారు. ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్నాము.. కేజ్రీవాల్, మాయావతిలను కూడా చేయమని చెప్పడం కోసమే వెళ్ళాడు అంటూ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో గరుడ పురాణం నడుస్తూందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రామ్ మాధవ్ వర్సెస్ వినోద్ కుమార్
-
రూ.4 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, అమరావతి: ‘‘గత నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం బయటినుంచి రూ.లక్షన్నర కోట్లు అప్పు తెచ్చింది. ఇదిగాక 14వ ఆర్థిక సంఘం ఐదేళ్లలో రాష్ట్రానికి రెండున్నర లక్షలకోట్ల కేంద్ర సాయాన్ని సిఫార్సు చేస్తే అందులో రూ.2 లక్షలకోట్ల నిధులు ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికందాయి. ఇవిగాక ఇతరత్రా నిధులతో కలపి మొత్తం రూ.4 లక్షల కోట్ల డబ్బులు రాగా అవన్నీ ఎక్కడికి పోయాయి? హైదరాబాద్‌ను నేనే కట్టేశానని చెప్పుకుంటారే.. రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు వచ్చినా రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి?’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సీఎం చంద్రబాబును నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్రప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్‌తో ‘రాష్ట్రప్రభుత్వ అవినీతి దాహానికి బలైన బాధితుల తరఫున ధర్మపోరాట దీక్ష’ పేరుతో బీజేపీ సోమవారం నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలో జరిగిన ధర్నాలో రాంమాధవ్ మాట్లాడారు. ఆయా పథకాలకు ‘చంద్రన్న’ అని పేరు పెట్టుకున్నా, వాటికీ నిధులిస్తోంది కేంద్రమేనన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ.. కేంద్రంపైనే విమర్శలు చేస్తూ.. ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే, మేం చెప్పబోమనే నియంతృత్వ పోకడలతో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.‘మమ్మల్ని ప్రశ్నిస్తే ఏపీని ప్రశ్నించినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ అంటే టీడీపీ ఒక్కటే కాదు, ఏపీ అంటే ఈ రాష్ట్రంలోని కోటానుకోట్ల ప్రజలు. అనేక పార్టీలు, సంస్థలు కలిపే ఏపీ అవుతుంది. మనందరికీ ఏపీ అభివృద్ధి పట్ల నిబద్ధత ఉంది’ అని అన్నారు. బాధితుల పొట్టకొట్టి ప్రభుత్వమే కుంభకోణానికి యత్నం ‘అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి రూ.6,500 కోట్లు బాధితులకు దక్కేలా చేయడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకూడదు. కానీ భూకబ్జాదారులకు అండగా నిలబడే ప్రభుత్వమిది. అందుకే అగ్రిగోల్డ్ భూములపై కన్నేసి, లక్షలాది కుటుంబాల పొట్టలు కొట్టి, ఆ భూములు కబ్జా చేసే కుతంత్రానికి, కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోంది’ అని రాంమాధవ్ ధ్వజమెత్తారు. ఇంతకుమించిన ప్రజాద్రోహం మరొకటి ఉండబోదన్నారు. తెలుగు దోపిడీ పార్టీ బాధితులైన లక్షలాది కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తొందరలోనే మారబోతోందని, అప్పుడు మొదటగా అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిర్ణయం జరుగుతుందని చెప్పారు. అగ్రిగోల్డ్ వ్యవహారం పైకి కనబడుతున్న చిన్న కుంభకోణమని.. ఈ రాష్ట్రప్రభుత్వం నిలువెల్లా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తామేమి చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదన్న తీరున రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.ఇది హిట్లర్ తరహా పాలనే’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రప్రజల ఆశలను ఇక్కడి ప్రభుత్వం వమ్ము చేసిందని, అవినీతి, కుటుంబ పాలన, హిట్లర్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎక్కువ రోజులు కొనసాగే అధికారం లేదన్నారు. కక్షసాధింపు చర్యలైతే రమేష్ కంటే పెద్ద నాయకులే ఉన్నారుగా.. కేంద్రంపై అపనిందలు వేయడం, అర్థరహితమైన డిమాండ్లు.. ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వ అవినీతి రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత మూడేళ్లలో దేశంలోకెల్లా ఏపీకే కేంద్రం నుంచి అత్యధిక నిధులొచ్చాయని స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు గోబెల్స్లని, ఇలాంటి ఎందరో గోబెల్స్‌కు బాస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇలాంటి ఆంబోతులతో కేంద్రంపైనా, మోదీపైనా, బీజేపీపైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ‘‘కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే సీఎం రమేష్‌పై దాడులు ఎందుకు? ఆయనకన్నా పెద్ద నాయకులే ఉన్నారు. వారిపై అవినీతి ఆరోపణలున్నాయి. కక్షసాధింపు బీజేపీ పద్ధతి కాదు.. చట్టప్రకారం అవినీతిపరులను జైలుకు పంపేవరకు కేంద్ర ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఇప్పుడున్నవారు దాన్ని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని, తెలంగాణలో కాంగ్రెస్ చంకలో కూర్చొని, ఏపీలో దాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయాలు చేస్తున్నారని రాంమాధవ్ విమర్శించారు. ప్రజల ముందుకెళ్లి టీడీపీ నిజస్వరూపాన్ని తెలియజెప్పి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకుని బీజేపీ పనిచేస్తుందన్నారు. మోదీని నేను ఆపేస్తానంటూ ఈ రాష్ట్ర నాయకులు పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, మోదీని ఆపే శక్తి వారికి లేదని.. ఆరునెలల తర్వాత వారే ఆగిపోబోతున్నారని రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో ‘లాలూ’చీ పాలన: జీవీఎల్ అమరావతి నిర్మాణం పేరుతో పేదల భూములు కబ్జా చేసినట్టే.. అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ పేదల డబ్బులనూ తినేద్దామని టీడీపీ పెద్దలు చూస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలకు పాలనకంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువని, మాయచేసి కాంట్రాక్టులు కొట్టేస్తున్నారన్నారు. ఏపీలో ‘లాలూ’చీ పాలన నడుస్తోందని, లాలూప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మళ్లీ ఎలాగూ గెలవమనే ఆఖరి ఆరునెలల్లో మరింత సర్దుకుందామని లూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ బినామీదారులే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్టు నటిస్తూ, మరో చేత్తో లూటీ చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు కొట్టేసి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, దీనిపై కేంద్రం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా, మంత్రాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ రాజు సోమవారం ఆత్మహత్య చేసుకోవడంతో అతని మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు, పలువురు రాష్ట్ర పార్టీ నేతలు పాల్గొన్నారు. హాయ్‌ల్యాండ్‌ను లోకేష్ కొట్టేయాలనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం: కన్నా సీఎం తనయుడు లోకేష్ హాయ్‌ల్యాండ్‌ను అతి తక్కువ ధరకు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే తొలుత అగ్రిగోల్డ్ సంస్థపై అభాండాలేసి.. దాన్ని నిర్వీర్యంచేసి, 35 లక్షల బాధితుల కుటుంబాలను రోడ్డున పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసినప్పటి నుంచి ఏటా వాటి విలువను తగ్గించి చూపుతోందన్నారు. ‘2015లో ఈ ఆస్తుల విలువ రూ.25 వేల కోట్లని చెప్పారు. 2016లో రూ.16 వేల కోట్లన్నారు.. 2017లో రూ.10 వేల కోట్లన్నారు. 2018లో రూ.2,200 కోట్లు అంటున్నారు. బయట వీరి ఆస్తుల విలువలు పెరుగుతుంటే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తగ్గించి చూపిస్తూ వస్తున్నారు. అగ్రిగోల్డ్ పేరిట రూ.570 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించి, ఆస్తుల ఆటాచ్మెంట్ సమయానికి కేవలం రూ.ఆరు లక్షలే ఉన్నాయని చూపించారు’ అని దుయ్యబట్టారు. రూ.3వేల కోట్ల విలువుండే హాయ్‌ల్యాండ్‌ను రూ.275 కోట్లకే కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, అగ్రిగోల్డ్ యజమాన్యం బాధితులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. వారికి న్యాయం జరిగేదాకా బీజేపీ అండగా ఉంటుందన్నారు. -
24 గంటలు పనిచేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాజకీయ అవినీతి తగ్గిందని కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. వినోద్‌కుమార్ తెలంగాణ భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు.‘కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. దేశంలో ఎక్కువ అవినీతి రాష్ట్రం తెలంగాణ అని విమర్శించడం సరికాదు. 73 శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదన్న ఆయన వ్యాఖ్యలు శోచనీయమని చెప్పారు. గతంలో ఇండియా షైనింగ్ అంటూ వాజ్‌పేయి, నరేంద్రమోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? ప్రధానమంత్రి మోదీ కూడా రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలోనే అందరినీ కలుస్తారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం 24 గంటలు పనిచేస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ అవినీతి చాలావరకు తగ్గింది. కాంగ్రెస్, బీజేపీ దేశంలోని ప్రాంతీయ పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, హర్షవర్ధన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చౌదరి బీరేంద్రసింగ్ తెలంగాణ ప్రగతిని అభినందించారు. రాంమాధవ్ విమర్శలు పునరావృతం కావద్దు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది. దేశంలో అవినీతికి తావులేకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరి ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రాంతీయ పార్టీల కాలం. రానున్న రోజుల్లో జాతీయ పార్టీలకు కష్టాలు తప్పవు. కాంగ్రెస్, బీజేపీ డ్రామాలను, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ బోఫోర్స్ అయితే బీజేపీ రాఫెల్స్ అంటూ లవ్ ఈచ్ అదర్‌లా తయారయ్యాయి’అని వినోద్ విమర్శించారు. -
‘గోబెల్స్‌కు గురువులాంటోడు చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే ‘తెలుగు దోపిడి పార్టీ’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అభివర్ణించారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నేటి నుంచి ఐదు రోజులపాటు రిలే నిరహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో లక్షలాది కుటుంబాలు రోడ్డన పడ్డయని, అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి వచ్చిన ఎన్ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆరోపించారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలకపాత్ర పోషిస్తుందని.. గతంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గోబెల్స్‌కు గురువు లాంటి వాడని, గత ఎన్నికల్లో బీజేపీ లేకుంటే టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నాలుగో స్థానంలో ఉందని, టీడీపీ-కాంగ్రెస్ నాణానికి చెరోకోణం వంటివని వర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపురా ఫార్మాలాను అనుసరిస్తామని రాం మాధవ్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వెల్లడించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ దీక్ష
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం దీక్షలను ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దీక్షలు పాల్గోన్నారు. ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని బీజేపీ విమర్శించింది. చంద్రబాబు అత్యాశ కారణంగా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన 32 లక్షల కుంటుబాలు రోడ్డున పడ్డాయని. అగ్రిగోల్డ్ కుంభకోణంపై తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోవడంతో బాధితులు అత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని నేతలు మండిపడ్డారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కన్నేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు రోజురోజుకు ఎందుకు కరిగిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో పేదల భుములు కబ్జా చేసినట్లు, పేదల డబ్బులు కూడా తినేయాలని వారు చూస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలకు పాలన కంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువ. ఏపీలో లాలూచీ పాలన నడుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. న్యాయం జరగక 35 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారు. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి రారని తెలిసి దోచుకుంటున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన నిధులపై లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తుపాను బాధితులకు ఎంత ఖర్చు చేశారు?’’ అని వ్యాఖ్యానించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ దీక్ష
-
తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపించారు. ఆదివారం మల్కాజిగిరిలో బీజేపీ మల్కాజిగిరి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని మండిపడ్డారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. తన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజల కష్టాల గురించి ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కేసీఆర్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. అది తెలుగుదేశం పార్టీ కాదని తెలుగు ద్రోహుల పార్టీ అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు 50 సీట్లు రావడం కష్టమేనని, రాష్ట్రంలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్న ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావును గెలిపించాలని కోరారు. అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మల్కాజిగిరిలో తక్కువ ఓట్లతో ఓడినప్పటికీ తాను ఇక్కడి ప్రజలకు అండగా ఉన్నానన్నారు. అనంతరం కార్యకర్తలు భారీ గజమాలతో రాంమాధవ్, రాంచందర్‌రావులను సన్మానించి ఖడ్గాన్ని బహూకరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకు ల విజయ, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘అయిదు రాష్ట్రాల్లో మూడు చోట్ల విజయం మాదే’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాడనీ, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు భవిష్యత్తుని ఇచ్చేలా పాలన సాగిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్‌లో నియోజకవర్గ నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. గత నాలుగేళ్ల పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుబడిందనీ, అక్షరాస్యతలో రాష్ట్రం వెనకబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడిగినంత ఆర్థిక సహాయం చేస్తున్నా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా తెలంగాణలో మాత్రం కొనసాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రసేనారెడ్డిని గెలిపించని చరిత్ర ఉంది.. ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి పేరాల శేఖర్‌రావుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. శేఖర్‌కు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో మంచి పేరుందని అన్నారు. టీడీపీ అంటే తెలుగు దేశం పార్టీ కాదని తెలుగు ద్రోహం పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్ వాసులతో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్న కారణంగానే శేఖర్ని ఇక్కడ నుంచి పోటీకి దింపుతున్నామని అన్నారు. గతంలో మలక్‌పేట నియోజకవర్గంలో భాగమైన ఎల్బీనగర్ నుంచి బీజేపీ అభ్యర్ధి ఇంద్రసేనారెడ్డి ఘాన విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ పాలనపట్ల ప్రజలు అసహనంతో ఉన్నారనీ, ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. తెలంగాణలో అవినీతిమయమైన, నియంతృత్వ వంశ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అవినీతి పార్టీ అని దేశ వ్యాప్తంగా తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర నాయకత్వం బలంగా ఉందనీ, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని ప్రధాన మంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఓటమి భయంతోనే అసెంబ్లీ రద్దు: రాంమాధవ్
హైదరాబాద్: పార్లమెం ట్తోపాటే శాసన సభకు ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ ధాటిని తట్టుకోలేక ఓటమిపాలవుతామన్న భయంతోనే ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీని రద్దుచేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ హవా నడుస్తోందని, రెండు ఎన్నికలు ఒకేమారు జరిగితే టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్న సర్వే నివేదికలకు భయపడే శాసన సభను కేసీఆర్ రద్దు చేశారన్నారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి రాం మాధవ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రజా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్‌కు ప్రజాదరణ లేదని చెప్పారు. కాంగ్రెస్ అందుకోసమే టీడీపీ సహా ఇతర పార్టీలతో అపవిత్ర కూటమిగా జట్టుకట్టిందన్నారు. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీశ్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం
-
‘ఇప్పుడు ఐదుగురే.. రేపు 65 మంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతతత్వ, అవినీతి, రాచరిక, రాక్షస పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ప్రజలను కోరారు. అవినీతి రహిత, కుంటుంబ పాలన లేని సుపరిపాలన కోరే వారందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమ్మేళననానికి హాజరైన ఆయన ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీగా ఉన్న తమకు అధికారం అప్పగించండి అని అనడానికి సంకోచంగా ఉండొచ్చని.. కానీ కురుక్షేత్ర మహా సంగ్రామంలో పంచ పాండవులే గెలిచారని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అస్సాంలో కూడా అధికారంలోకి రాకముందు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని అయినా ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ గత నాలుగున్నరేళ్లలో 15 రాష్ట్రాల్లో గెలిచిందని గుర్తు చేశారు. ‘టీఆర్ఎస్ దివాలా తీసిన పార్టీ’ కాంగ్రెస్ కూటమిలో తెలుగు ద్రోహుల పార్టీ కూడా ఉందని ఎద్దేవ చేశారు. దివంగత ఎన్టీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే.. ప్రస్తుత నాయకులు వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారిందన్నారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చురకలు అంటించారు. తెలంగాణకు బీజేపీ మాత్రమే సహజమైన పార్టీ అని అభిప్రాయపడ్డారు. ఈ రోజు అయిదుగురు ఎమ్మెల్యేలే కావచ్చు.. కానీ రేపు 65 మంది ఎమ్మెల్యేలు అవుతారని జోస్యం చెప్పారు. మోదీ కేబినెట్లో దేశ గౌరవమైన పోస్టుల్లో ఇద్దరు మహిళా మంత్రులున్నారని.. కానీ తెలంగాణలో మహిళల స్థానం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని.. తెలంగాణలో బీజేపీలేని ప్రభుత్వం ఉండకూడదని కోరుకున్నారు. ఐదేళ్లు పరిపాలన చెయ్యలేక దివాళ తీసిన టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పరిపాలించే హక్కు ఉందా అంటూ రాంమాధవ్ ప్రశ్నించారు. -
అమిత్ షాతో స్వామి పరిపూర్ణానంద భేటీ
-
అమిత్ షాతో భేటీ.. రంగంలోకి పరిపూర్ణానంద!
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద క్రమంగా రాజకీయాల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన పరిపూర్ణానంద.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని భేటీ అనంతరం వెల్లడించారు. ‘నా భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నా ఆసక్తి ప్రధానం కాదు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తాం. ఆధ్యాత్మికం, రాజకీయం వేరు కాదు’ అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ పరిపూర్ణానందన భేటీ అయి చర్చించారు. సెంటిమెంట్ కలిసి వస్తుందా? శ్రీరాముడి విషయంలో కత్తి మహేశ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. ఈ వ్యవహారంలో హిందూ సెంటిమెంట్‌కు అనుకూలంగా పరిపూర్ణానంద వ్యవహరించారని, బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద సోమవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పరిపూర్ణానంద స్వామి బీజేపీలోకి వస్తే స్వాగతమిస్తామని బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ముందుగా తెచ్చిన టీఆర్ఎస్, బతుకమ్మ చీరలను ముందుగా ఎందుకు పంచ లేదని అరవింద్ ప్రశ్నించారు. చీరలన్నీ ముందుగానే రెడీ అయినా.. వాటిని ఎందుకు పంచలేదన్నారు. గత ఏడాది బతుకమ్మ చీరల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. డీ ఫ్యాక్టో సీఎం అయిన కవిత బతుకమ్మ జరుపుకోకుంటే మిగతావారూ జరుపుకోవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు దిగజారి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. -
టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ
భానుగుడి(కాకినాడ సిటీ): ‘రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచింది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.8.50 లక్షల కోట్ల విలువైన వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు అందజేస్తోందని రాంమాధవ్ చెప్పారు. అయినా కేంద్రం నిధులివ్వడం లేదంటూ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు రాష్ట్ర వనరులను కట్టబెడితే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు అన్ని రకాలుగా దోచుకుతింటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. 2014లో తుప్పు పట్టిన టీడీపీకి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోబట్టే మహర్దశ వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ జైన్, రాష్ట్ర ఇన్చార్జి వి.మురళీధర్, కోఇన్చార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహరావు, ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నాడు కీర్తించిన పత్రికలే నేడు విషం చిమ్మాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు థ్యాంక్యూ మోదీజీ అంటూ శీర్షికలు పెట్టి కీర్తించిన కొన్ని తెలుగు పత్రికలే, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై విషం కక్కాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 20 16 సెప్టెంబర్‌లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో అప్పటి ఆంధ్రజ్యోతి దినప్రతికలో వచ్చిన కథనాలను తన పోస్టుకు జతపరిచారు. చంద్రబాబు తీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. -
కశ్మీర్లో గవర్నర్ పాలనకే బీజేపీ మొగ్గు
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. రాష్ట్రాభివృద్ధి, సుపరిపాలన, శాంతి కోసం తమ పార్టీ గవర్నర్ పాలనకే మొగ్గు చూపుతోందన్నారు. ‘రాం మాధవ్ ప్రకటనతో పనిలేకుండా అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే వారి అభిమతంగా ఉంది’ అంటూ ఒమర్ అబ్దుల్లా మరో ట్వీట్ చేశారు. దీనికి రాం మాధవ్ స్పందిస్తూ..‘అది నిజం కాదు. పార్టీ రాష్ట్ర శాఖతో ఈ విషయమై మాట్లాడతాం. ఇతర పార్టీల్లో ఎలాంటి పరిణామాలు సంభవించినా మేం జోక్యం చేసుకోం’ అని తెలిపారు. -
రాం మాధవ్ క్షమాపణ చెప్పాలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదంటూ మాట్లాడిన బీజేపీ జాతీయనేత రాం మాధవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కనీస సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడుతున్నారన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమలాపురానికి చెందిన రాం మాధవ్ తెలంగాణ నుంచి వెళ్లకుండానే క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ భారతీయ సంస్కృతిని పరిరక్షించే పార్టీయా, కించపరిచే పార్టీనో చెప్పాలన్నారు. కమలం పువ్వు తెలంగాణలో వాడిపోయిందని, అది ఎప్పటికీ వికసించదన్నారు. జాతీయస్థాయిలోనూ బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. -
కశ్మీర్ వినాశనంలో బీజేపీ పాత్ర లేదా!
సాక్షి, హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో జరుగుతోన్న వినాశనంలో తన పాత్రేమీ లేనట్లు బీజేపీ బొంకడం విడ్డూరంగా ఉందని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీమాంతర ఉగ్రవాదం పేట్రేగిపోవడం, ఆర్మీ క్యాంపులపై వరుసగా దాడులు, షుజీత్ బుఖారీ లాంటివాళ్ల హత్యలు, స్కూళ్లు, కాలేజీల మూసివేత... తదితర పరిణామాలకు సంబంధించి పీడీపీ కంటే బీజేపీనే ప్రధాన ముద్దాయి అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంపై మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: బీజేపీ బ్రేకప్.. సీఎం రాజీనామా!) ముఫ్తీని నిందిస్తే బీజేపీ తప్పులు మాసిపోతాయా?: ‘‘పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని వ్యవహారాలకు మంత్రివర్గానిదే బాధ్యత అన్న కనీస సూత్రాన్ని బీజేపీ మర్చిపోయినట్లుంది. మెహబూబా కేబినెట్లో బీజేపీ డిప్యూటీ సీఎం సహా, మంత్రులు కూడా ఉన్నారుగా! గత మూడేళ్లుగా కశ్మీర్లో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీ బాధ్యురాలే. ఇప్పుడు సడన్‌గా పీడీపీతో పొత్తుతెంచుకుని, ముఫ్తీని నిందించినంత మాత్రాన బీజేపీ గొప్పదైపోదు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం ప్రారంభమైంది కాబట్టే, కాషాయనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. (చూడండి: ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!) కశ్మీర్ నడిచేది కేంద్రం ఆదేశాలతో కాదా?: పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలిగినందుకు బీజేపీ చెబుతున్న కారణాలేవీ సహేతుకంగాలేవు. కాల్పుల విరమణ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం నియంత్రణ కేంద్రం చేతుల్లోనే కదా ఉన్నది! మరి వీళ్లు(బీజేపీ) ముఫ్తీని మాత్రమే నిందించడంలో అర్థం ఉందా? బీజేపీ ఘోర తప్పిదాలు చేసి, ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది. ముఫ్తీకి చెంపపెట్టు: బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగింది. ఇవాళ్టి పరిణామం ఖచ్చితంగా ఆమెకు చెంపపెట్టులాంటింది. ఇక కశ్మీర్ లోయలో పీడీపీకి భవిష్యత్తులేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే ఎవరికైనా ఇది గుణపాఠం అవుంది. కొద్ది మంది అనుకుంటున్నట్లు 2019 ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లైతే నాదొక సవాల్.. రాంమాధవ్‌కు దమ్ముంటే శ్రీనగర్ నుంచి పోటీకి దిగాలి. జమ్ముకశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్నవన్నీ తప్పుడు నిర్ణయాలే’’ అని అసదుద్దీన్ అన్నారు. -
బీజేపీ బ్రేకప్.. సీఎం రాజీనామా!
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. కాషాయదళం వైదొలగడంతో ప్రస్తుతం కశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడినట్లయింది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కశ్మీర్ ఇన్ఛార్జ్ రాం మాధవ్ ఇక పీడీపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగలేమని, తమ మంత్రులను ఉప సంహరించుకుంటున్నామని చెప్పారు. ‘కాశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుతోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి. ఇంకా చెప్పాలంటే పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి ప్రమాదం వాటిల్లింది. పట్టపగలే జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదులను నియంత్రించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేసింది. జాతీయ ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి వైదొలిగాం. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గవర్నర్ పాలనతో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నాం. రంజాన్ కాల్పుల విరమణకు ఉగ్రవాదులు, వేర్పాటువాదుల నుంచి సానుకూల స్పందన రాలేదు. మూడేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాం. కేంద్రం సాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అయితే పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగలేం. 600మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు నిర్మూలించాయి. గవర్నర్ పాలనలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కొనసాగుతాయని’ బీజేపీ నేత రాం మాధవ్ వివరించారు. సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించిన కొంత సమయానికే సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో చేసేదేం లేక మెహబూబా ముఫ్తీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రపక్షాలు బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు కీలక పరిణామాలకు దారితీసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని పీడీపీ పట్టుపట్టగా, బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. -
అడ్డంగా బుక్కైన టీడీపీ
-
ఏపీలో ఏదో జరుగుతోంది
-
బుగ్గన నన్ను కలవలేదు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనను కలవలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ‘సాక్షి టీవీ’ ఢిల్లీ ప్రతినిధికి తెలిపారు. గురువారం టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాంమాధవ్‌ను కలిసిన అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ‘ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు నన్ను కలిసిన మాట నిజమే. అయితే వారు మా మాతృమూర్తి నెల మాసికం కార్యక్రమానికి వచ్చారు. నన్ను పరామర్శించారు..’ అని వెల్లడించారు. ఎమ్మెల్యే బుగ్గన కలిసినట్టు వచ్చిన వార్తలను ప్రస్తావించగా ‘అందులో నిజం లేదు..’ అని పేర్కొన్నారు. -
కులరాజకీయాలు పెచ్చుమీరాయి
సాక్షి, గుంటూరు/గన్నవరం/మంగళగిరి రూరల్: రాష్ట్రంలో కుల రాజకీయాలు పెచ్చుమీరిపోయాయని.. వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని ఆపాదించి వెంకన్నచౌదరిగా పిలుస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. గుంటూరు నగరంలోని సిద్దార్థ గార్డెన్స్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఐదేళ్లు సీనియర్ అని చెప్పారు. కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం చేస్తే.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి కన్నాకు ఆశీర్వచనం అందించారు. -
చంద్రబాబులా కన్నాకు మామలేరు
-
కదులుతున్న రైల్లో నుంచి టీడీపీ దూకేసింది
సాక్షి అమరావతి : తెలుగుదేశంపార్టీ (టీడీపీ) నాయకత్వం పాత స్నేహాన్ని మర్చిపోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. శనివారం గుంటూరు సిద్దార్థ గార్డెన్లో ఎన్డీఏ నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ మాధవ్ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ట చరిత్ర ఉన్న కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడించారని విమర్శించారు. అధర్మ రాజకీయాలు చేస్తూ ధర్మపోరాటం చేయడం ఏంటని నిలదీశారు. ఎవరిది ధర్మపోరాటమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచి పైకి రావడానికి కన్నా లక్ష్మీనారాయణకు మామ లేరని ఎద్దేవా చేశారు. చివరకు దేవుడిపై కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని, వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగట్టారని రామ్ మాధవ్ మండిపడ్డారు. కేవలం తమతో పొత్తు కారణంగానే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ.. కదులుతున్న రైలు నుంచి దూకేసి, గాయం తగిలిందంటూ మొసలి కన్నీరు కారుస్తోందని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణకే అనుభవం ఎక్కువని పేర్కొన్నారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇస్తామని, ఏపీ విభజన చట్టంలోని హామీలు అన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. ఒకరు థర్డ్ ఫ్రంట్ అంటే మరొకరు ఫోర్త్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ప్రస్తావించారు. ఎన్ని ఫ్రంట్లు వచ్చినా బీజేపీని ఏం చేయలేవంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ప్రతిపక్షం లేదని, నాలుగేళ్లలో మచ్చలేని పాలన అందించారన్నారు. అవినీతి చేసి దొరకనప్పుడు అందరూ ప్రజాసేవ, అవినీతి రహితం అంటూ మాట్లాడుతారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా నాలుగేళ్లపాటు స్వచ్ఛమైన పరిపాలన అందించామని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టిస్తామన్నారు. 2022 నాటికి దేశంలో పేదరికం లేని కొత్త భారతదేశం నిర్మాణానికి మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సిద్ధార్థ్నాథ్ సింగ్, జీవీఎల్ నరసింహా రావు, సోము వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఓఎఫ్ ఆధ్వర్యంలో ఉజ్వల్ భారత్
వాషింగ్టన్ డీసీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ(ఓఎఫ్) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్ డీసీలో ఉజ్వల్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి. ఎల్ నరసింహ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, వాటి ఫలితాలను జి.వి. ఎల్ నరసింహ రావు వివరించారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు అందరు కలిసి మెలిసి ఉంటూ, దేశ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. భారత దేశ ఏకీకరణ, సగటు భారతీయునికి సమాజంలో గౌరవం, దేశ భద్రతా, సమతుల్య ఆర్థిక అభివృద్ధి, మోదీ ప్రభుత్వ అభివృద్ధి విధానానికి మూలా స్తంభాలుగా రామ్ మాధవ్ పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకులు తీసుకొన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఓఎఫ్ బీజేపీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఏనుగుల అన్నారు. అలాంటి శక్తివంతమైన నాయకుల్లో మోదీ ఒకరు అని కొనియాడారు. ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్, ఓఎఫ్ బీజెపీ వాషింగ్టన్ డీసీ కోఆర్డినేటర్ లక్ష్మి నారాయణ, ఓఎఫ్ బీజేపీ ఒహియో కోఆర్డినేటర్ శ్రీనివాస్ కొంపల్లి, ఓఎఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ సమీర్ చంద్ర, ఓఎఫ్ బీజేపీ జాతీయ యువ సహా-కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, దిగంబర్ ఇస్లాంపురే, ఇతర ఓఎఫ్ బీజేపీ నేతలు, వంశీ యంజాలతో పాటూ అనేక సంఘాలనేతలు, అనేక మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన వివిధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. -
కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే... కక్షపూరిత వాతావరణం నెలకొంది. కూటమిలో ఉంటూనే టీడీపీ...బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రధాని 24 గంటల పాటు నిరంతరం పని చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతామని తెలిపారు. -
చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు
-
కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కలిసిపోయింది..
సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయడం శుభపరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో జరిగే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు రాంమాధవ్, యూపీ మంత్రి సిద్ధార్థ సింగ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు శనివారం గన్నవరం చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ...‘ రాష్ట్రంలో చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఫ్లెక్సీల మీద కూడా తమ కుటుంబానికి చెందినవారి ఫోటోలను మాత్రమే వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో విడిపోవడం మాకు నష్టం లేదు. మాతో విడిపోయిన తర్వాత టీడీపీ విషప్రచారం చేస్తోంది. ఎవరిది ధర్మ పోరాటమో ప్రజలే నిర్ణయిస్తారు. నరేంద్ర మోదీ ఇమేజ్ వలనే దేశంలో బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో పుట్టిన టీడీపీ చివరకు కాంగ్రెస్‌లోనే కలిసిపోయింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు చేతులు కలపడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. అభివృద్ధి ప్రధాన అంశంగా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కూడా అదే ఉత్సాహంతో ముందకు వెళ్తాం. ఏపీకి హోదా విషయాన్ని పక్కనపెడితే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం.ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి టీడీపీ స్వార్థ ప్రయోజనం కోసం దుష్ప్రచారం చేస్తోంది.’ అని ధ్వజమెత్తారు. -
దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ
-
ఆ పొత్తే.. కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం!
వాషింగ్టన్‌డీసీ: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్-బీజేపీ మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. బీజేపీకి బలం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించి భంగపడిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ప్రజాతీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ అవినీతికి ఇది తాజా నిదర్శనమని ఆయన అన్నారు. వాషింగ్టన్‌డీసీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మొదలుకొని, రాజీవ్‌గాంధీ, గత యూపీఏ ప్రభుత్వాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తోందని చెప్పారు. -
‘ఆ కుటుంబాలకు బీజేపీ న్యాయం చేస్తుంది’
వాషింగ్టన్: సిక్కు వ్యతిరేక అల్లర్లలో నష్టపోయిన సిక్కు కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సిక్కు అమెరికన్లు నిర్వహించిన సిక్కుల సాంప్రదాయ పండుగ వైశాఖిలో రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో నివాసముంటున్న సిక్కులు భారీ సంఖ్యలో హాజరైయారు. కార్యక్రమంలో రాంమాధవ్ మాట్లాడుతూ...1984లో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన సిక్కుల ఉచకోతలో చాలా మంది సిక్కులు మరణించారని, వారి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీయిచ్చారు. సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారందరికి శిక్ష పడుతుందన్నారు. సిక్కు అల్లర్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ధింగ్రా కమిటీ అనేక అభియోగాలు నమోదు చేసిందని, సిక్కులపై 186కు పైగా దాడులు జరిగాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశము ద్వారా వైశాఖి పండుగను నిర్వహిస్తున్న వారందరికి అభినందనలు తెలిపారు. వైశాఖి సిక్కు సాంప్రదాయం, సిక్కు సమాజపు సంస్కృతి, విలువలను పెంచుతుందని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్లు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించారు. -
ముగిసిన బీజేపీ నేత రాంమాధవ్ తల్లి అంత్యక్రియలు
-
జానకీదేవికి బీజేపీ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీదేవి భౌతికకాయానికి పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు...జానకీదేవి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కాగా జానకీదేవి బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా బీజేపీ నేత రాంమాధవ్ ..పెద్ద కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్వస్థలం కాగా, మూడేళ్లుగా జానకీదేవి ఢిల్లీలో కుమారుడు రాంమాధవ్ వద్దే ఉంటున్నారు. రెండో కుమారుడు కిషోర్ అమెరికాలో ఇంజినీరు, కుమార్తె భారతి హైదరాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జానకీదేవి 20ఏళ్లుగా బీజేపీలో చురుకైన పాత్ర పోషించారు. మహిళా మోర్చా రాష్ట్ర విభాగంలో పలు పదవులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
బీజేపీ నేత రాంమాధవ్‌కు మాతృ వియోగం
-
బీజేపీ నేత రాంమాధవ్ నివాసంలో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంమాధవ్‌కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరకాటంలో పీడీపీ,బీజేపీ సంకీర్ణ సర్కార్!
-
సీఎంతో ఎలాంటి సమస్యల్లేవు : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచార ఘటన.. బీజేపీ మంత్రుల రాజీనామాలు.. తదితర పరిణామాల నేపథ్యంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)తో పొత్తు సంగ్ధిగ్ధంలో పడ్డట్లు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ స్పందించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఎలాంటి సమస్యల్లేవని ఆయన ప్రకటించారు. (నోరువిప్పిన మోదీ) శుక్రవారం రాత్రి ఢిల్లీలో రామ్ మాధవ్ ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘కూటమి విషయంలో ఎలాంటి సమస్యల్లేవు. మంత్రుల రాజీనామా పూర్తిగా బీజేపీ నిర్ణయమే. సీఎం మెహబూబా ముఫ్తీ మాపై ఒత్తిడి తెచ్చినట్లు వస్తున్న కథనాలు నిజం కాదు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా ఆమెకు సూచించారు. పీడీపీతో పొత్తు కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బాలికను కొందరు అహరించి.. బంధించి.. డ్రగ్స్ ఇచ్చి.. ఆపై అత్యాచారం.. కిరాతకంగా హింసించి చంపిన ఘటన తెలిసిందే. జనవరిలో జరిగిన ఈ దాష్టీకంలో విస్మయకర విషయాలు ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులకు మద్ధతుగా నిర్వహించిన ఓ ర్యాలీలో బీజేపీకి చెందిన మంత్రులు చంద్ర ప్రకాశ్ గంగా, లాల్ సింగ్‌లు పాల్గొనటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో చివరకు శుక్రవారం సాయంత్రం వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించి బీజేపీ అధిష్ఠానం వారి భవితవ్యం నిర్ణయించనుంది. కథువా కేసులో వరుస పరిణామాల కోసం క్లిక్ చేయండి -
ఏపీ బీజేపీకి కొత్త సారధి?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పై, ప్రధాని నరేంద్ర మోదీఫై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నతరుణంలో వారిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీకి సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడిని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి కంభంపాటి హరిబాబు తొలగించి.. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్త అధ్యక్ష ఎంపిక బాధ్యతని అమిత్‌షా పూర్తిగా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రాం మాధవ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసులో ఒకే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు పేర్లు వినిపించినా రాంమాధవ్ మాణిక్యాలరావు వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు నేతలకు కీలక బాధ్యతల్లో చోటు కల్పించాలని భావిస్తున్నారట. కానీ, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యనేతల భేటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో రాంమాధవ్ బీజేపీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీని ఎలా కట్టడి చేయాలి, అధ్యక్ష పదవిని ఎవరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే అంశాలపై సీనియర్ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధ్యక్షుడిగా హరిబాబు ఫెయిల్? ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన టీడీపీపై అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు తగినరీతిలో స్పందించలేకపోవడం, పలు సందర్భాల్లో ఆయన మెతక వైఖరి ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన నేతలు ఎప్పటికప్పడు టీడీపీపై దాడికి దిగుతున్నా, హరిబాబు మాత్రం దూకుడుగా వ్యవహరించలేదనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన స్ధానంలో మాణిక్యాల రావును నియమించేందుకు నిర్ణయం తీన్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
అక్రమాలపై ఆధారాలున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర సాయం విషయంలో బీజేపీని దోషిగా చూపేందుకు చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టించింది, ఏ విధంగా అక్రమాలు చేసింది.. అన్న దానిపై పూర్తి ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీడీపీపై ఎదురుదాడి చేయాలని, ఏ మాత్రం వెనక్కు తగ్గొద్దని ఆయన సూచించినట్టు సమాచారం. త్వరలో బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌లతో భేటీ అయ్యారు. ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ఏపీలో పర్యటించేందుకు అమిత్ షా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత జరిగే కార్యవర్గ సమావేశాలకు రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీకి కేంద్ర సాయం విషయంలో సీఎం చంద్రబాబుకు అమిత్ షా లేఖ రాసిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు మాణిక్యాలరావు వివరించినట్టు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాణిక్యాలరావు అమిత్‌షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ క్యాడర్లో సర్వీస్‌లో ఉన్న ఒక అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి చేరుతారని, అలాగే అసోం క్యాడర్‌కు చెందిన మరో ఐఏఎస్ అధికారి బీజేపీలో చేరనున్నారని కొందరు నేతలు వెల్లడిస్తున్నారు. -
బాబువి రాజకీయ నాటకాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాటకాల్లో ఏపీ సీఎం చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఇన్నేళ్లుగా రాజకీయ గిమ్మిక్కులు చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లపై తామెప్పుడూ సానుకూలంగా ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ రాజకీయ నాటకాలు ఆడుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తామున్నామని రాంమాధవ్ పేర్కొన్నారు. ‘అవిశ్వాస తీర్మానానికి మేం భయపడడం లేదు. మాకు పార్లమెంటులో సరిపడా బలం ఉంది. ఏ చర్చకైనా మేం సిద్ధం. టీడీపీ నిర్ణయం కేవలం రాజకీయపరమైనది. మాతో చాలా ఏళ్లుగా కలిసి ఉన్నారు. మా భాగస్వాములుగా ఉన్నారు. కలిసి పనిచేశాం. అకస్మాత్తుగా వాళ్లు కొన్ని సెంటిమెంట్ అంశాలను లేవనెత్తుతూ అవిశ్వాస తీర్మానం తెచ్చారు. దీనికి వాళ్లే ఏపీ ప్రజలకు, దేశానికి వివరణ ఇవ్వాలి’ అని రాంమాధవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు. ‘హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాం. కానీ టీడీపీ సెంటిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతోంది’ అని పేర్కొన్నారు. -
మాణిక్తో కలిసి పనిచేస్తాం: బీజేపీ నేత
ఆగర్తల: వామపక్షాలకు, బీజేపీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్ప ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధి కోసం మాణిక్ సర్కార్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తామని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ అన్నారు. ఇరవైయేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్రతిహాతంగా ఏలిన మాణిక్ ప్రభుత్వంపై బీజేపీ సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 43 కైవసం చేసుకుని వామపక్ష కంచుకోటపై కాషాయ జెండా ఎగరవేసింది. నూతన ముఖ్యంమంత్రి విప్లవ్‌దేవ్ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం మాణిక్‌సర్కార్ ను స్వయంగా రాం మాధవ్ వెళ్లి ఆహ్వానించారు. రాష్ట అభివృద్ధికి ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల అనుభవం కలిగిన మాణిక్ లాంటి నిరాడంబరమైన వ్యక్తితో కలిసి పనిచేస్తామని మాధవ్ తెలిపారు. ఈ ఏడాది దేశంలో జరుగనున్న ఎన్నికలకు త్రిపుర విజయం ఎంతో స్పూర్తిని కలిగించిందన్నారు. త్రిపుర విజయంతో ఈశాన్యంలోని 6 రాష్ట్రాల్లో కాషాయ దళం ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరో ఏడాదిలో మిజోరంలో జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజునే బీజేపీ మద్దతుదారులు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయండంతో పాటు సీపిఎం పార్టీ కార్యాలయాలపై దాడి చేయటంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. -
విజయంలో ఆ నలుగురు
న్యూఢిల్లీ: 2014కు ముందు ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు. 10–15 ఏళ్ల ముందునుంచి ఆరెస్సెస్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ రాజకీయంగా బీజేపీకి వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఆరెస్సెస్ క్షేత్రస్థాయి పనికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు తోడవటంతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగింది. అస్సాంలో అధికారంతో మొదలైన బీజేపీ ‘ఈశాన్య’ పయనం త్రిపుర విజయంతో మరింత విశ్వాసంగా ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడం, నాగాలాండ్‌లోనూ బీజేపీకి విజయాన్ని అందించటంలో నలుగురు నేతలు అన్నీ తామై వ్యవహరించారు. వారే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అస్సాం మంత్రి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడు హిమంత బిస్వా, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్, ఆరెస్సెస్ వ్యూహకర్త సునీల్ దేవధర్. హిమంత బిస్వా శర్మ 2015లో బీజేపీలో చేరకముందు ఈయన కాంగ్రెస్ నేత. దశాబ్దానికి పైగా అస్సాం కాంగ్రెస్‌కు సేవలందించారు. అప్పటి సీఎం తరుణ్ గొగోయ్‌తో భేదాభిప్రాయా లతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఈయన సామర్థ్యాన్ని గుర్తించిన బీజేపీ.. పార్టీలోకి వస్తూనే 2015 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా అవకాశాన్నిచ్చింది. పలువురు బీజేపీ కేంద్ర నాయకులతో కలిసి బిస్వా రూపొందించిన వ్యూహాలు.. గొగోయ్ కోటను బద్దలు కొట్టి బీజేపీకి పట్టంగట్టాయి. ఈశాన్య రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న హిమంతకు ఆ తర్వాత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర పగ్గాలను పార్టీ అప్పగించింది. అవతలి పార్టీల నేతలను చేరుకుని కూటములు ఏర్పాటు చేయటం, బీజేపీలోకి ఆహ్వానించటంలో శర్మ రూటే సెపరేటు. వనరులను సృష్టించటంలోనూ ఈయన అందెవేసిన చేయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో, నాగాలాండ్‌లో ఎన్డీపీపీతో పొత్తుల విషయంలో హిమంత కీలకంగా వ్యవహరించారు. సునీల్ దేవధర్ ఆరెస్సెస్ ముఖ్య నేత. పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో సంఘ్ ప్రభావం పెంచటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే దేవధర్‌ను.. అమిత్ షా త్రిపుర ప్రధాన వ్యూహకర్తగా నియమించారు. అదీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే. బీజేపీ ఇంటింటి ప్రచారం విజయవంతం కావటంలో ఈయన పాత్ర అత్యంత కీలకం. విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందువరసలో ఉన్నారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఆరెస్సెస్ ప్రచారక్ కూడా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ.. బీజేపీ ఈయన్నే ముందుండి ప్రచారాన్ని నడిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్ బర్మన్ సహా పలువురు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు. రామ్‌మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ కూటములు ఏర్పాటుచేయటంలో రామ్ మాధవ్ అసలైన వ్యూహకర్త. చాలా ఓపికగా వ్యవహరించటం. వ్యూహాలు రచించటంలో దిట్ట. ఎన్డీపీపీతో బీజేపీ పొత్తులోనూ హిమంతతో కలిసి పనిచేశారు. -
ఫిరాయింపులు కూడా మోదీ ఘనతేనా?
సాక్షి, న్యూఢిల్లీ : వరుసగా ఒక్కో రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ అధికారం కైవసం చేసుకుంటున్న బీజేపీ మిగతావాటిపై కూడా దృష్టిసారించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మేఘాలయాలో ఎన్నికల ముందుగానే ఒక్కసారిగా రాజకీయంగా అలజడి చెలరేగింది. అసంతృప్త అధికారపక్ష నేతలు ఒక్కోక్కరిగా ఎన్టీఏ మిత్ర పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరిపోతున్నారు. అయితే ఈ ఫిరాయింపులను కూడా మోదీ పుణ్యమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటుండటం విశేషం. బీజేపీ జాతీయ ప్రతినిధి రామ్ మాధవ్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. మేఘాలయ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం. ఆయన పిలుపు మేరకే అభివృద్ధి కోసం వారంతా పార్టీ మారుతున్నారు అంటూ మాధవ్ పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామిక వ్యతిరేక ఫిరాయింపులను కూడా గర్వంగా ప్రధాని కట్టబెడుతున్న మాధవ్ మేధస్సుకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కాగా, మేఘాలయాలో ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండటం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రొవెల్ల్ లింగ్దోతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఎన్పీపీలో చేరిపోయారు. మరో ముగ్గురు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎన్పీపీలో చేరిపోగా.. ఇప్పుడు మరో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో.. ప్రస్తుతం సీఎం ముకుల్ సంగ్మా తరపున 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. In Meghalaya today, 4 MLAs from Congress n other parties will join BJP together with other elected members n hundreds of supporters. 'Meghalaya for Change - Meghalaya for BJP' is PM's call — Ram Madhav (@rammadhavbjp) 2 January 2018 -
ద్రౌపదిని తూలనాడటం తగునా?
అభిప్రాయం కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపదే కారణం అనడం నిరాధారం. దుర్మదాంధుడు దుర్యోధనుడే సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని యుద్ధానికి తెరతీశాడు. ద్రౌపదిని నన్నయ ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా వర్ణించాడు. ఆమె ధర్మాచరణం, కర్తవ్యనిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమన్నాడు. ఆమె పతుల మాటను అతిక్రమించి నట్టు ఎక్కడా లేదు. వ్యాసునికి ఆమె ‘బ్రహ్మవాదిని’, నన్నయ్యకు ‘తపస్విని’. ఆమెను అవమానించటం అంటే వ్యాçసుడిని, శ్రీకృష్ణుడిని, కవిత్రయ భారతాన్ని అవమానించినట్టే. తరతరాలుగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలో స్త్రీలకు పెద్దపీట వేస్తు న్నామని చెబుతున్నా ఆచరణలో అది అంతగా కనిపించడం లేదు. మొత్తం సంస్కృతి అంతా స్త్రీ శీలం చుట్టే తిరుగుతూ ఒక రకమైన అణచివేతకు గురి చేశారు. ఎన్నో సంస్కరణల తర్వాత ఇప్పుడిప్పుడే స్త్రీలు కొంత ఊపిరి పీల్చుకుని అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా, ఇప్పటికీ ఆమె పట్ల మగవారికున్న చులకన భావం తగ్గలేదు. తాజాగా గోవాలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రసంగిస్తూ ద్రౌపది పాత్ర మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయ డమే అందుకు ఉదాహరణ. ద్రౌపది మొదటి స్త్రీవాది అని, ఆమె పంచభర్తృక అని అన్నారు. ఇంతవరకు పెద్ద ఇబ్బందేమీ లేదు. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో ద్రౌపది పట్ల ఆయనకు ఎంత వ్యతిరేక భావముందో అర్థమౌ తుంది. ఆమె అస్సలు భర్తల మాట వినేది కాదని, ఆమే యుద్ధాన్ని ప్రోత్స హించి 18 లక్షల మంది చనిపోవటానికి కారణమైందని, లేకపోతే పాండవులు ఐదు ఊళ్లతోనే సరిపెట్టుకునేవారంటూ... కేవలం ఆమె వల్లనే సర్వనా శనం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆయన కూడా పాపం అందరి మొగాళ్లలా గానే ఆలోచించారు. ఏ తప్పయినా స్త్రీలే చేస్తారు తప్ప పురుషులు కాదని ఆయన భావం. చూడబోతే రాంమాధవ్ మహా భారతం సరిగ్గా చదవలేదనిపిస్తోంది. 18 అక్షౌహిణులు అంటే ఆయన దృష్టిలో 18 లక్షలని. పండితులను అడిగి ఆయన ఆ లెక్కను తెలుసుకుంటే బావుంటుంది. ఒక అక్షౌహిణి అంటేనే 20 లక్షలపైగా ఉంటుంది. ద్రౌపది తప్పేమిటి? ఇక ద్రౌపది యుద్ధాన్ని ప్రోత్సహించి లక్షలాది మందిని చంపించిందనే మాట... కేవలం స్త్రీలపట్ల తేలిక భావంతో అన్నదే. ఈ దేశానికి కావలసింది సీతాదమయంతులు కారు, ద్రౌపదిలా నిలదీసేవారు’ అన్నారు రామ్‌మనో హర్ లోహియా. ‘పైకి చూడటానికి మన దేశంలో స్త్రీల స్థానం గొప్పదిగానే కనిపించవచ్చు. కానీ సమాజంలో ఆమె స్థానం ఏమంత పెరిగినట్లు కనిపిం చదు. ఆమె వ్యక్తిత్వాన్ని పురుష సమాజం గౌరవించదు. ఇప్పటికీ ఆమె బందీ గానే ఉన్నది. స్త్రీపురుషులు భుజం భుజం కలిపి సాగినప్పుడే మానవ సంస్కృతి వికసిస్తుంది. దానికి భారత మహిళ చాలా దూరంలో ఉంది’ అన్నారాయన. ఉత్తర భారతంలోని కొన్ని దేవాలయాల్లో రాముడి పక్కన సీతామాత విగ్రహం పెట్టరు. వాళ్ల దృష్టిలో ఆమె దూషిత అట, రాముడి పక్కన ఆమెకు స్థానం లేదట! ఈ విపరీత భావజాలంలోనే హైందవ సంస్కృతి ఇంకా కొట్టుమిట్టాడుతుండటం దురదృష్టకరం. రాంమాధవ్ ద్రౌపది మీద చేసిన విమర్శలో అది చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ఆ విమర్శలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ఒక్కసారి వ్యాస భారతం, కవిత్రయ భారతం ద్రౌపది పాత్రను ఎలా చిత్రించాయో చూడటం అవసరం. పెద్దల ఆదేశం మీద ఐదుగురిని పెండ్లాడి కూడా తన వ్యక్తిత్వాన్ని, స్త్రీ విలు వలను కాపాడుకున్న మహిళ ద్రౌపది. కురుక్షేత్ర యుద్ధం ప్రధానంగా భారతంలోని రాజవంశాలు, వారి సంబంధాలు, వ్యక్తిపరమైన సంఘర్షణల మధ్య నడచిన కథే. బాల్యం నుండి దాయాద ద్వేషంతో రగిలిపోయిన దుర్యోధనుని అహంకారానికి, నీచ వెన్ను పోటు రాజకీయానికి నిదర్శనమే ఈ యుద్ధం. ఏదో విధంగా దాన్ని ఆడవాళ్ల మీదకు తోసేయడం మాని వాస్తవాలు చదవండి– ద్రౌపదేమిటో అర్థమౌ తుంది. ఒక రకంగా చూస్తే ద్రౌపదిని పెండ్లాడే వరకు పాండవులు నిర్భా గ్యులు. చక్రవాకపురంలో బిచ్చమెత్తి బతుకుతున్నవాళ్లు. బలవంతులయినా నిస్సహాయులు, అనాథలు. దాయాదుల కుట్ర నుండి ఎలాగో బయటపడి మారువేషాలతో జీవిస్తున్న వాళ్లు. ద్రౌపదిని వివాహం చేసుకున్నాకే వాళ్ల వీరత్వమేమిటో లోకానికి తెల్సింది. ద్రౌపది పాంచాల దేశపు యువరాణి. తండ్రికి ప్రీతిపాత్రురాలు. అన్ని విద్యలు నేర్చుకున్న ధీశాలి. ఆనాటి బలమైన రాజ్యాల్లో ఒకటయిన పాంచాల దేశం ఆమె కనుసన్నల్లో నడిచింది. వ్యాసుడు, కవిత్రయం ఏం చెప్పారు? తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు, కృష్ణుడు చెప్పిన మీదటే పాండవులు ఐదుగురిని పెళ్లాడవలసి వచ్చింది. చేసిన వాళ్లను, చేసుకున్నవాళ్లను వదిలేసి ఆమెనొక్క దాన్నే నిందించడం ఏం ధర్మం? ఆమెతో పాటు పాండవులకు అంతులేని ఐశ్వర్యం, అండ, పలుకుబడి పెరిగాయి. నిర్భయంగా మారు వేషాల నుండి బయటపడటమే కాకుండా హస్తిన రాజ్యంలో భాగం ఇమ్మని అడిగే ధైర్యం కూడా వచ్చింది. పాంచాలను చూసి భయపడిన దృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వక తప్పలేదు. ఆ తదుపరి చేసిన రాజసూయ యాగంతో పాండవులకు అనంతమైన సంపదలు సమకూరటంతో పాటూ అప్రతిహతమైన కీర్తిప్రతిష్టలు పెరిగాయి. చెప్పాలంటే అప్రతిష్టపాలై, అనా మకులై అగాధ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పాండవులను ఒడ్డుకు చేర్చిన దేవత ద్రౌపది. తన సహనంతో అన్నదమ్ముల మధ్య కలతలు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన ధర్మశీల. ధర్మరాజు వ్యసనానికి కౌరవ సభలో అవమానం పాలై కూడా ఆమె తన భర్తల దాస్యం పోగొట్టమని కోరుకుని వాళ్ల రాజ్యాన్ని తిరిగి ఇప్పించిన పతివ్రత. పురస్కాత్కరణీయం మేనకృతం కార్యముత్తరం / విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్ / అభివాదం కరోమ్యేషాం కురూణాం కురుసంపది / నమేస్యాద పరాధో యం యదిదం న కృతం మయా ‘‘ అంటూ వ్యాసుడు మూల మహాభారతంలో ద్రౌపది సంస్కారాన్ని ప్రశం సించాడు. దుశ్శాసనుడు తనను బలవంతంగా సభకు లాక్కురాగా భయ విహ్వలంతో ఆమె సభకు నమస్కారం చెయ్యటం మర్చిపోయి, తప్పు తెల్సు కుని కురువృద్ధులందరిని క్షమాపణ అడిగి అభివాదం చేసిందట. దుర్భరమైన వేదనలో కూడా సభావందనం చేసిన గొప్ప సంస్కారవతి అని దీని అర్థం. ఇంతమంది కురువృద్ధులు, గురువృద్ధులున్న సభలో ఒక స్త్రీకి అవమానమా అని ప్రశ్నించి వారిని తలదించుకునేటట్లు చేసింది. ఆమె ప్రశ్న అన్ని తరాల దురహంకారులకు వర్తిస్తుంది. చట్టాలు–ప్రభుత్వాలు, సంస్కరణలు, పోలీసు వ్యవస్థ ఎన్నివున్నా అహంకారంతో మహిళా అధికారులను వేధిస్తున్న తీరు చూస్తేనే ఉన్నాం. భూకబ్జాలకు పాల్పడిన వారిని ప్రశ్నించినందుకు దళిత యువతి బట్టలూడదీసి కొట్టిన పాలకాహంకారాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఐదు వేల సంవత్సరాల క్రితమే ద్రౌపది ఇటువంటి అవమానాలు ఎదు ర్కొని కూడా చివరి వరకు ధర్మవిజిత లాగానే నిలబడింది తప్ప తన తండ్రిని దుర్యోధనుని మీదకు ఉసిగొల్పలేదు. భర్తలతోపాటు అడవులకు వెళ్లిందే కాని పుట్టింటికి వెళ్లలేదు. పాండవుల మిగతా భార్యలెవ్వరూ ఈ ధర్మాన్ని పాటిం చలేదేం? అరణ్యవాసంలో భర్తలను ఎంతో భక్తిగా సేవించింది. వచ్చిన అతి థులకు తనే స్వయంగా వండి వడ్డించింది. కంద మూలాలు తిన్నది. యజ్ఞాలు చేసింది. చివరకు అజ్ఞాతవాసంలో విరాట్ రాజ్యంలో అతని భార్యకు దాసిగా కూడా పనిచేసింది పాంచాల రాకుమారి. ధర్మరాజు అసమ ర్థతను కప్పిపుచ్చి అతని ధర్మనిరతిని పొగిడి పొగిడి చెప్పింది. ఇక 18 లక్షల సైన్యం ఆమె వల్లనే చనిపోయారనేది ఎంత అవాస్తవమో భారతం చదివితే అర్థమౌతుంది. సంధి ప్రయత్నంలో భాగంగా చివరకు ఐదుగురికి ఐదు ఊళ్లు ఇచ్చిన చాలని యుద్ధం వద్దని ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పిన సందర్భంలో ఆమె అక్కడే ఉంది. మరి ఎందుకు వద్దని వారించలేదు. ఆమె వద్దంటే శ్రీకృష్ణుడు సంధి కోసం కౌరవసభలో రాయబారాన్ని సాగించే వాడా? అయినా దుర్మదాంధుడు, దురభిమాని అయిన దుర్యోధనుడు ఐదు ఊళ్లు కాదు కదా సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని చెప్పి యుద్ధా నికి తెర తీశాడు కదా. ఇందులో ద్రౌపది తప్పేమిటి? భారతంలో ఆమె పాత్రను ఎంతో హుందాగా, గొప్ప స్త్రీగా వర్ణించారు. ఆమె పుత్రులైన ఉపపాండువులను అశ్వత్థామ అన్యాయంగా చంపినప్పుడు, అంత దుఃఖంలో కూడా అతనికి ప్రాణభిక్ష పెట్టిన క్షమామూర్తి ద్రౌపది. అలాగే కౌరవుల సోదరి దుస్సల భర్తౖయెన సైంధవుడు తనను చెరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతని ప్రాణాలు కాపాడి బంధుత్వ విలువలను రక్షించింది ద్రౌపది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతమంతటా ఆమె గొప్పత నాన్ని కీర్తించడమే కనిపిస్తుంది. ఈ విమర్శలకు అర్థం వ్యాసుడిని అవమానించడమే! నన్నయ రచనలో ఆమె ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా, స్వీయ నాయ కిగా, ముగ్ధ వధువుగా దర్శనమిస్తుంది. ఆమెకున్న ధర్మాచరణం, కర్తవ్య నిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమని నన్నయ వర్ణి స్తాడు. ఆయన రచనలో ఆమె ఎన్నడూ పతుల మాటను అతిక్రమించడం కానీ, నిరసన వాక్యాలతో నిందించటం కానీ కనిపించదు. వ్యాసుని దృష్టిలో ‘బ్రహ్మవాదిని’. నన్నయ ఆమెను తపస్వినిగా చూపించాడు. ధీర గంభీర ఉదాత్తత కలిగిన ఆమె ధర్మాచరణం ఇతర స్త్రీలకు ఆదర్శం అని నన్నయ చెప్పిన ద్రౌపదిని ఏ ఆధారంతో ఈ బీజేపీ నాయకులు విమర్శించారో సమాధానం చెప్పాల్సి ఉంది. ఆమెను అవమానించటం అంటే వ్యాసుల వారిని, శ్రీకృష్ణుడిని, కవి త్రయ భారతాన్ని అవమానం చేసినట్టే అవుతుంది. దయచేసి అరకొర జ్ఞానంతో మహిళల త్యాగాల్ని అవమానించకండి. ఆమె లేకపోతే లోకమే లేదు, సమాజ అభివృద్ధి లేదు. వేదం కూడా హరీయో దేవీ – యుషసహం – యోచమానాసురీయః/ సీయోప్రానాభ్యేతు పశ్చాత్ అని చెబుతున్నది. లోకాన్నే వెలిగించే సూర్యుడు ఛాయాదేవిని అనుసరించి నడచినట్లు ఈ ప్రపంచం కూడా స్త్రీలను అనుసరించే నడుస్తున్నది అని అర్థం. తరుణి ద్రౌపది యిట్లు పాండవ దార్తరాష్ట్రులదైన భీ / కర పరస్పర కోపవేగముగ్రన్న బాచి విపత్తి సా / గర నిమగ్నుల నుద్ధరించె బ్రకాశకీర్తుల ధీరులం / బురుష సింహులనున్ నిజేశుల బూనితద్దయు బ్రీతితోన్ (భారతం : సభాపర్వం) అన్నీ కోల్పోయి అవమానంతో బాధపడుతున్న పాండవులను ద్రౌపది ఉద్ధరించిన తీరును చెప్పి, ఆ మహాదేవికి నీరాజనమిచ్చాడు నన్నయ. స్త్రీలను గురించి తెల్సుకోండి, స్త్రీ జాతిని అవమానించకండి. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
‘అవి బుద్ధిలేని వ్యాఖ్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆక్రమిత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు అనుకూలగా వ్యాఖ్యలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మండిపడ్డారు. పీఓకే విషయంలో ఫరూఖ్ అబ్దుల్లా తన అభిప్రాయాలు మార్చుకోవడం.. చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లాపై బీహార్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌కు చెందినదేని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఫరూఖ్ అబ్దుల్లాకు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని రామ్‌మాధవ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. ఈ ప్రాంతాన్ని వెంటనే పాకిస్తాన్ ఖళీ చేయాలని భారత పార్లమెంట్ 1994 ఫిబ్రవరి 22న ఏకగ్రీవ తీర్మానం చేసిందని రామ్‌మాధవ్ గుర్తు చేశారు. భారతీయ జనతాపార్టీ, భారత్ ఈ తీర్మానికే కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, ఆక్రమిత కశ్మీర్లు భారత్‌లో అంతర్భాగమని రామ్‌మాధవ్ ప్రకటించారు. -
కేసీఆర్‌పై కేంద్ర సంస్థలు దృష్టి పెడతాయి
అవినీతికి పాల్పడితే విచారణ తప్పదు: రాంమాధవ్ ► చీరల పంపిణీ వెనుక కూడా అవినీతి జరిగి ఉండొచ్చు సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం అని ప్రచారం చేసుకుంటూ అవినీతికి పాల్పడితే సీఎం కేసీఆర్‌పై కేంద్ర విచారణ సంస్థలు దృష్టి పెడతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానిం చారు. సోమవారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ముఖ్య నేతలతో కలసి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘మిషన్ భగీరథ స్వరూపం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మంచి పథకమని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు అభిప్రాయపడి ఉండొ చ్చు. కానీ క్షేత్రస్థాయిలో అమలు తీరు, అవినీతి వంటివాటిపై విచారణ చేయాల్సిం దే. రాష్ట్రంలో జరుగుతున్న చీరల పంపిణీ సందర్భంగా చాలా ప్రాంతాల్లో నాణ్యత లేవని మహిళలు బహిరంగంగానే అసం తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కూడా అవినీతి జరిగినట్టుగా అనుమానం వస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభా స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుస్తాం. రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, పెద్ద నాయ కులు అటు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో, నాతో మాట్లాడుతున్నారు. సరైన సమయం, సందర్భంలో వారంతా బీజేపీలోకి వస్తారు. నాయకులు అంటే సాధారణ నాయకులు కాదు. అత్యంత ప్రముఖులు..’’ అని రాంమాధవ్ చెప్పారు. వారు ఏ పార్టీకి చెందినవారు, ఎవరనేది కొంతకాలం ఆగితే తెలుస్తుందన్నారు. అన్ని పార్టీల్లో సమర్థమైన, మంచి చరిత్ర ఉన్నవారందరికీ బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. ఇది నిజాం పాలన.. నిజాం పాలనకు ఏమాత్రం తీసి పోని విధంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోం దని రాంమాధవ్ దుయ్యబట్టారు. నియం తృత్వ, నిరంకుశ, రజాకార్లను గుర్తుకు తెస్తున్న టీఆర్ఎస్ పాలనపై బీజేపీ రాజకీ యంగా పోరాడుతుందన్నారు.‘‘అసెంబ్లీలో మెజారిటీ ఉందనే అహంకారంతో పాలన చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజల కు ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడెం దుకు నోరుమెదపరు? టీఆర్ఎస్ నోరు పడిపోయిందా? ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పక్షాలను టీఆర్ఎస్ అణచేస్తోంది. ఆ పార్టీ దురహంకారాన్ని ఎదిరిస్తాం. అధికారం కోసమే మాయమాటలు, అబద్ధాలు చెప్పారనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తు న్నారు’’ అని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరుతుందా అని విలేకరులు అడగ్గా.. ‘ఎన్డీఏలో ఆ పార్టీ లేదు. అలాంటప్పుడు కేబినెట్లో చేరుతుం దని ఎలా అంటారు..’ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుం దనే ప్రస్తావనకు కూడా అవకాశం లేదన్నారు. కేబినెట్లో ఎవరుండాలనే అంశం పూర్తిగా ప్రధాని విచక్షణాధికార మన్నారు. ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నట్లు వివరించారు. 2019లో బీజేపీ గెలుపు కోసం మోదీ, అమిత్‌షాతో పాటు రాహుల్‌గాంధీ కూడా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సొంతం గానే పోటీ చేసి గెలుస్తామని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు. కంచ ఐలయ్య వైశ్యులను కించపరుస్తూ సమా జంలోని కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. -
నిజాంలాగే కేసీఆర్ నిరంకుశ పాలన: రాంమాధవ్
హైదరాబాద్ : నాటి నిజాం నిరంకుశ ధోరణిలోనే నేడు తెలంగాణలో నియంతృత్వ పోకడలో పరిపాలన కొనసాగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసమే టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఉత్తిమాటలు చెప్పిందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో కె.లక్ష్మణ్ చేసిన యాత్రను విఫలం చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో టీఆర్ఎస్కు దీటైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. 2019లో 350 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు గానూ అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయం. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ పై పూర్తి దృష్టి పెట్టింది’’ అని రాంమాధవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది: లక్ష్మణ్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎందుకు విమోచన దినోత్సవం జరపడం లేదనే స్పష్టమైన వివరణ ఇవ్వకుండా సీఎం తప్పించుకున్నాడని.. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులు..తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేశారని చెప్పారు. కంచె ఐలయ్య గారి వ్యాఖ్యలు.. సామాజిక వర్గాలను కులం పేరుతో దూషించినట్లు ఉందని, అశాంతి రేపడం మంచిది కాదన్నారు. అట్టడుగు వర్గాల కోసం మాట్లాడే వ్యక్తి అయితే.. సామాన్య కులం నుండి వచ్చిన మోదీ ప్రధాని అయితే గర్వ పడాల్సిన ఐలయ్య.. దూషించడం తగదన్నారు. పనిగట్టుకొని కొన్ని సామాజిక వర్గాలను దూషించడం కోసం కొందరు సాయం చెయ్యడం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం స్పందించాలని కోరారు. -
నిజాంలాగే కేసీఆర్ నిరంకుశ పాలన
-
బీజేపీ నేతలను కలిసిన డీఎస్ తనయుడు
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ శనివారం బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్‌తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. కాగా అరవింద్ బీజేపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలను అరవింద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు డీఎస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని ఖండించారు. తాను టీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేదని డీఎస్ అన్నారు. -
దృఢ వైఖరి, పరిణత దౌత్య చర్చల వల్లే..
డోక్లాం వివాదాన్ని భారత్ హుందాగా ఎదుర్కొంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం ప్రశాంతంగా ముగియడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వివాదం వల్ల భారత్-చైనా సంబంధాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయన్న విషయాన్ని గుర్తించి.. ఇరుదేశాలూ వెనుకకు తగ్గడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఇది గొప్ప పరిణతితో కూడిన పరిణామామని, దీనిని అందరూ స్వాగతించాలని తెలిపారు. డోక్లాం వివాదాన్ని దౌత్యపరంగా ఎదుర్కోవడంలో భారత్ ఎంతో పరిణతిని, హుందాతనాన్ని, విజ్ఞతను పాటించిందన్నారు. మనల్ని రెచ్చగొట్టే పరిస్థితి రాకుండా.. పరిణతితో కూడిన దౌత్యమార్గంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో దృఢంగా వ్యవహరించామని, దృఢ వైఖరి, పరిణతితో కూడిన దౌత్య ప్రయత్నాల కలయిక వల్లే ఈ వివాదం శాంతియుతంగా సమసిపోయిందని తెలిపారు. డోక్లాం విషయంలో భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని, చాలాకాలం కిందట ఉమ్మడిగా నిర్ణయించిన ప్రకారమే నడుచుకుంటుందని చెప్పారు. పొరుగుదేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే శాంతి తప్పనిసరి అని తెలిపారు. భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు సోమవారం తెరపడిన సంగతి తెలిసిందే. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సరికొత్త వ్యూహం: రక్షణ మంత్రిగా షా!
-
కాబూల్ పేలుడు చెప్పిన నిజం
అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత (9/11) జరిగిన ఒక దశాబ్దానికి, అంటే సెప్టెంబర్ 11, 2011న అఫ్ఘానిస్తాన్‌లో మరో ఘటన జరిగి, అందరి దృష్టిని ఆకర్షించింది. తూర్పు అఫ్ఘానిస్తాన్‌లోని వార్దాక్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరం దగ్గరకి ఒక ట్రక్కును తీసుకువచ్చారు. మరుక్షణంలోనే భీకరమైన విస్ఫోటనం సంభవించింది. ఆ ట్రక్కు ఒక అగ్నిగోళంలా మారిపోయింది. పేలుడు పదార్థాలను నింపిన ఆ ట్రక్కు తునాతునకలైంది. అమెరికా సైనిక స్థావరం గోడ మొత్తం పగుళ్లు వారింది. ఒక డజను మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సంయుక్త రక్షణ దళ విభాగాల అధిపతులకు అధ్యక్షులుగా నాడు అడ్మిరల్ మైఖేల్ ‘మైక్’ములెన్ పనిచేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా అమెరికా రక్షణ బలగాలలో వివిధ హోదాలలో పనిచేసిన ములెన్ ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఆయనే వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ సభ్యుల బృందం ముందు కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడే ఆయన చాలా నిష్కర్షగా ఈ విషయం చెప్పారు. ‘పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలి జెన్స్ (ఐఎస్ఐ) చేతిలో హఖానీ నెట్వర్క్ సంస్థ పలు రకాలుగా ఉపయోగపడే ఆయుధంగా మారిపోయింది’ అని ఆయన వెల్లడించారు. దాడితో చెప్పదలుచుకున్న సంగతి ఇటీవల కాబూల్‌లో అదే తరహాలో ట్రక్కు బాంబు పేలిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు ఉండే కూడలిలో ఈ ఘోర విస్ఫోటనం జరిగింది. ఈ పేలుడులో దాదాపు 90 మంది చనిపోయారు. కొన్ని వందలమంది గాయపడ్డారు. దీని వెనుక హఖానీ నెట్వర్క్ ఉందని సహజంగానే అంతా అనుమానించారు. నిజానికి ఈ పేలుడుకు బాధ్యత హఖానీ నెట్వర్క్దేనని అఫ్ఘానిస్తాన్ నిఘా సంస్థ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్డీఎస్) బాహాటంగానే ఆరోపించింది. పవిత్ర రంజాన్ మాసం మొదలుకావడానికి కొద్ది ముందే ఈ దుర్ఘటన జరిగింది. రంజాన్ మాసం సంగతితో పాటు, విస్ఫోటనం చేయడానికి బాధ్యులు ఎంచుకున్న సమయం, ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనవి. కాబూల్‌లో విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి కొన్ని గజాల దూరంలోనే జర్మనీ వారి దౌత్య కార్యాలయం ఉంది. ఆ దాడిలో ఈ దౌత్య కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులు కూడా గాయపడ్డారు. కార్యాలయం గేటు దగ్గర ఉండే కాపలాదారు మరణించాడు. అక్కడ పనిచేసే ఏకైక కాబూల్ వాసి అతడొక్కడే. ఇక విస్ఫోటనం జరిగిన సమయం గురించి–మన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెల్ మెర్కెల్‌తో కలసి తీవ్ర పదజాలంతో సంయుక్త ప్రకటన చేస్తున్న సమయంలో ఆ దుర్ఘటన జరిగింది. ‘‘ఆర్థిక ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారి పట్ల, ప్రోత్సహిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’’ అని ప్రతిన తీసుకుంటున్న సమయంలో ఆ పేలుడు సంభవించింది. భవిష్యత్ తరాలు ఎదుర్కొనే ఏకైక తీవ్ర సమస్య ఉగ్రవాదమని మోదీ పేర్కొన్నారు. ‘ఈ సమస్యను మన రెండు దేశాలు కలసికట్టుగా ఎదుర్కొంటాయి, అందుకు సైబర్ రక్షణ, నిఘా వ్యవహారాలలో పరస్పర సహకారం అవసరమ’ని మోదీ స్పష్టం చేశారు. పేలుడు యాదృచ్ఛికం కాదు గడచిన కొన్నేళ్ల కాలంలో పారిస్ నుంచి మాంచెస్టర్ వరకు, ఐరోపా అంతటా ఉగ్రవాదులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అల్‌కాయిదా, తాలి బన్ల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ‘నాటో’సైన్యాలతో కలసి ఐరోపా దేశాలు కూడా పనిచేస్తున్నాయి. జర్మనీకి చెందిన 1,000 మంది సైనికులు కూడా అక్కడ వివిధ స్థాయిలలో రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబూల్‌లో జర్మనీ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన తాజా విస్ఫోటనం కేవలం యాదృచ్ఛిక ఘటనగా చెప్పే వీలులేదు. గత కొన్నేళ్లుగా జరిగిన విస్ఫోటనాలలో కాబూల్ తాజా పేలుడు ఘటన తీవ్రమైనది. అలాగే ఈ పేలుడు ఆఖరిదని చెప్పలేం. తాజా పేలుడు సంభవించిన తరువాత యథావి«ధిగా పాకిస్తాన్ ఈ చర్యను ఖండించింది. అధ్యక్షుడు మామ్నూన్ హస్సేన్ పార్లమెంట్లో ఘాటు పదజాలంతో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌లో శాంతిని నెలకొలపడానికి తీసుకునే అన్ని చర్యలకు పాక్ ప్రజలు, ప్రభుత్వ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని పేలుడు జరిగిన రోజునే ఆయన అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్న హఖానీ నెట్వర్క్ రాజ పోషకురాలు పాకిస్తాన్ అన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. హఖానీ నెట్వర్క్ ప్రస్థానం చూస్తే అసలు ఆ సంస్థ ఎవరి సార థ్యంలో నడుస్తున్నదో కూడా అర్థంకానంత గోప్యత ఉంటుంది. ఆ సంస్థ నాయకుడు ఎవరో వాస్తవంగా ఎవరికీ తెలియదు. పేరు ఎవరిదైనా నడిపేది పాక్ హఖానీ నెట్వర్క్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? దీనిని పుష్తూన్ యుద్ధ ప్రభువు జలాలుద్దీన్ హఖానీ స్థాపించాడు. అఫ్ఘానిస్తాన్ మీద సోవియెట్ రష్యా దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సంస్థ ఎదుగుదల, ఇంకా చెప్పాలంటే పుట్టుకలో కూడా సీఐఏ హస్తం ఉందని చెబుతారు. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ రష్యా సేనలు వైదొలగిన తరువాత హఖానీ ఒక వైపు తాలిబన్లకు, మరోవైపు ఐఎస్ఐకు నాయకునిగా అవతరించాడు. ఉత్తర వజీరిస్తాన్ చేరుకుని, అటు పాక్, ఇటు అఫ్ఘాన్ సరిహద్దులలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడే మీరాన్షా దగ్గర తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పాడు. అయితే 2015లో బీబీసీ ప్రసారం చేసిన ఒక నివేదికలో హఖానీ సంవత్సరం క్రితమే (2014) మరణించాడని వెల్లడించింది. కొన్ని ఆధారాలను బట్టే బీబీసీ ఈ వార్తను వెల్లడించింది. ఇప్పుడు సిరాజుద్దీన్ హఖానీ ఆ సంస్థను నడుపుతున్నాడని చెబుతారు. ఇతడు కరుడుగట్టిన తాలిబన్ కమాండర్ స్థాయి కార్యకర్త. పేరుకు ఇతడు నాయకుడైనా వెనక ఉండి హఖానీ నెట్‌వర్క్‌ను ముందుకు నడిపిస్తున్నది మాత్రం ఐఎస్ఐ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. హఖానీ నెట్వర్క్ ముగుసులో ఐఎస్ఐ అలాగే, హఖానీ నెట్వర్క్ వెనుక ఉన్నది పాకిస్తానేనంటూ మైక్ ములెన్ ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటన ఇచ్చారంటే అందుకు ఆయన వద్ద ఉన్న కొన్ని ఆధారాలే కారణం. అందుకు ఉపయోగపడిన ఆధారాలలో అఫ్ఘానిస్తాన్‌లో పనిచేస్తున్న మరో అమెరికా సైనిక కమాండర్ జనరల్ జాన్ అలెన్ ఇచ్చిన ఆధారం కూడా ఒకటి. పాకిస్తాన్–అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో అనుమానాస్పదంగా ట్రక్కు లు సంచరిస్తున్న విషయాన్ని పసిగట్టిన అమెరికా సైన్యం ఆ విషయాన్ని అప్పటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ దృష్టికి తీసుకుని వెళ్లింది. ఎలాంటి ఉత్పాతం జరగకుండా నివారించడానికి ఫోన్ చేసి చెబుతాను అని కయానీ హామీ ఇవ్వడంతో అలెన్ నిర్ఘాంతపోయారు. అంటే పాకిస్తాన్ సైన్యానికి ఫోన్లో కూడా అందుబాటులో ఉన్న సంస్థ హఖానీ నెట్వర్క్. ఈ విషయం అలెన్‌కు అర్థమైంది. అమెరికా గూఢచార సంస్థలు 2008 ప్రాంతంలో ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా విన్నాయి. అందులోనే హఖానీ నెట్వర్క్ ఒక ‘వ్యూహాత్మక సంపద’ అని సాక్షాత్తు కయానీ చెప్పడం అమెరికా గూఢచారులు విన్నారు. నిజం చెప్పాలంటే అఫ్ఘానిస్తాన్‌లో అడ్డూ ఆపూ లేకుండా జరుగుతున్న రక్తపాతానికి మూలం, ఒకే ఒక్క కారణం ఐఎస్ఐ. ఇది తన కార్యకలాపాలను హఖానీ నెట్వర్క్ వంటి సంస్థలతో పరోక్షంగా నిర్వహిస్తున్నది. దీనికి అంతం లేదా? దీనికి అంతం ఎప్పుడు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అదే ప్రాంతానికి చెందిన మరో యుద్ధ ప్రభువు గురించి ముందు తెలుసుకోవాలి. ‘అతడు నిజమైన పుష్తూ జాతీయునిగా జీవించాడు, మరణించాడు’ అన్న అక్షరాలు ఒక మట్టి సమాధి మీద కనిపిస్తాయి. ఆ మసీదు దక్షిణ వజిరిస్తాన్‌లోని షాకెయ్లో కనిపిస్తుంది. ఆ మట్టి సమాధి కింద శాశ్వతంగా నిద్రపోతున్న వ్యక్తి పేరు నేక్ మహ్మద్. ఇతడు కూడా అఫ్ఘాన్‌లో తాలిబన్ల నాయకుడే. పాకిస్తాన్‌లోని వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో తాలిబన్ కార్యకలాపాలకు తిరుగులేని నాయకుడుగా ఎదిగినవాడు. ఇతడు ఎంతగా ఎదిగాడంటే, ఎంత రక్తపాతం సృష్టించాడంటే పర్వేష్ ముషార్రఫ్ కూడా ఇతడితో సంధి చేసుకోవలసి వచ్చింది. అయితే ఆ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. తరువాత ఒక దశలో ఐఎస్ఐ, సీఐఏ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రిడేటర్ డ్రోన్లకు కొంత సమాచారాన్ని అందించడానికి ఐఎస్ఐ ఆమోదించింది. చివరికి 2004 జూన్ మధ్యలో నేక్ మహ్మద్ ఉంటున్న నివాసం మీద గురి తప్పకుండా ఒక ప్రిడేటర్ దాడి జరిపింది. అక్కడికక్కడే అతడు మరణించాడు కూడా. హఖానీ నెట్వర్క్ విషయంలో కూడా పాకిస్తాన్ అదే విధంగా వ్యవహరిస్తుందా? లేకుంటే ఆ సంస్థను వ్యూహాత్మక సంపదగానే భావిస్తుందా? ఇదే ఇప్పుడు అందరి మది లోను కదులుతున్న ప్రశ్న. వ్యాసకర్త బీజేపీ జాతీయ కార్యదర్శి ఇండియా ఫౌండేషన్ సంచాలకులు : రామ్‌మాధవ్ -
చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు!
గోవా, మణిపూర్లలో ఫలించిన బీజేపీ వ్యూహం ⇒ రెండో స్థానంలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం ⇒ గోవాలో గడ్కారీ, పరీకర్.. మణిపూర్‌లో రాం మాధవ్, హిమంత ⇒ బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందని విపక్షాల ధ్వజం సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్ప మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడింది. మణిపూర్, గోవాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో దారుణంగా విఫలమైంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినుపయోగించి రాత్రికి రాత్రే చక్రం తిప్పేసింది. ఢిల్లీలోని పార్టీ పెద్దల సూచన ప్రకారం మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇందుకు గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్, ఆప్ విమర్శించినా.. పరిస్థితి అందిపుచ్చుకోవటంలో బీజేపీ పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది సుస్పష్టం. ఎన్నికల ఫలితాలు విడుదలవటమే ఆలస్యం.. ఢిల్లీ నుంచి కమలం పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో వాలిపోయి పరిస్థితులు ‘చేతి’కందకుండా పరిస్థితులు చక్కబెట్టారు. దీంతో నేడు గోవాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మణిపూర్‌లో బీజేపీ తన మద్దతుదారుల జాబితాను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు సమర్పించింది. శనివారం రాత్రి ఏం జరిగింది? శనివారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నా.. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామనే ధీమాతోనే ఫలితాలు రాగానే అమిత్ షా ‘గోవా, మణిపూర్‌లలోనూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని బహిరంగంగా ప్రకటించగలిగారు. గోవా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అమిత్‌షా రంగంలోకి దించారు. శనివారం రాత్రి గోవా చేరుకున్న నితిన్ గడ్కారీ.. వస్తూనే ‘మిషన్ గోవా సర్కారు’ను ప్రారంభించారు. పణజీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 1 గంటనుంచి 4 గంటలవరకు మూడు గంటలపాటు వీరితో చర్చించి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించారు. దీంతో 13 సీట్లున్న బీజేపీకి ఏడుగురు చేరటంతో బలం 20కి పెరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఎమ్మెల్యే కావాలి. దీంతో గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్తో పణజీ సమీపంలోని ఓ రిసార్టులో చర్చలు ప్రారంభించారు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జీఎఫ్తో ఉదయం ఎనిమిది గంటలవరకు జరిగినా సానుకూలంగా జరగలేదు. దీంతో మధ్యాహ్నం మరోసారి ఓ దూతను విజయ్ దగ్గరకు పంపిన గడ్కారీ.. డీల్ ఓకే (ముగ్గురికీ మంత్రి పదవులిచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం) అయినట్లుగా జీఎఫ్తో మద్దతు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ బలం 23కు చేరింది. ఈ చర్చలన్నీ పరీకర్, గడ్కారీ సమక్షంలో జరిగాయి. అయితే పరీకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే విజయ్ సర్దేశాయ్.. సీఎంగా పరీకర్ ఉంటానంటేనే మద్దతిస్తాను అని ప్రకటించటం గమనార్హం. తెల్లారేసరికి మారిన ‘హంగ్’ మణిపూర్‌లోనూ అదే పరిస్థితి అధిష్టానం దూతలుగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన రామ్ మాధవ్, అస్సాం మంత్రి హిమంత్ బిస్వా శర్మలు శనివారం రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్పీపీ, ఎల్జేపీలతోపాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒప్పించారు. హంగ్‌పై చర్చ జరుగుతుండగానే.. ఆదివారం తెల్లారేసరికి 32 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా బీరేన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార దుర్వినియోగమే: విపక్షాలు మణిపూర్, గోవాల్లో తమ చేతుల్లోంచి బీజేపీ అధికారాన్ని లాగేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విరుచుకుపడింది. ‘ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఎక్కడిది?’ అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గోవాలో ప్రజాబలం కన్నా ధనబలమే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గోవాలో ధన, మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటుకు గురైన ఆప్ కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించింది. గోవాలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే బదులు.. ఎన్నికల సంఘం ఆ సీట్లను వేలం వేస్తే పార్టీలు కొనుక్కునేవని ఎద్దేవా చేసింది. నిమ్మకు నీరెత్తని కాంగ్రెస్ గోవాలో గడ్కారీ, పరీకర్ తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే పనిలో పడింది. పార్టీ పరిశీలకుడిగా గోవాలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్యేలు నేనంటే నేను సీఎం అని పోటీ పడ్డారు. మెజారిటీకి తగ్గిన 4 సీట్ల గురించి ఆలోచించకుండానే.. ఆదివారమంతా హోటల్లో తమ బలాబలాల ప్రదర్శనలో పడ్డారు. సీఎల్పీ పదవికోసం రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ అభ్యర్థి.. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేసినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చినా.. కాంగ్రెస్‌నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో ఉండగానే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌తో భేటీకి వెళ్తున్న సమాచారం అందింది. -
ఎన్నికలు–నోట్ల రద్దు వేరువేరు!
ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే! ► రామమందిరం జాతీయ స్వాభిమానాంశం ► అభివృద్ధే ఎజెండా ► సాక్షి ఇంటర్వ్యూ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షి ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎంత? అభివృద్ధి నినాదం పనిచేస్తుందా? లేక రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? మణిపూర్‌లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? అనే అంశాలపై మణిపూర్‌లో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూవిశేషాలు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై... ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవటం మాకు చాలా కీలకం. ఐదుచోట్లా గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ ఏకమై బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు మోదీ పాలనపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారు. మా ప్రచారం కూడా అభివృద్ధి ఎజెండాగానే సాగుతోంది. యూపీలో కచ్చితంగా కనీస మెజారిటీని సంపాదిస్తాం. పంజాబ్‌లో గట్టిపోటీ ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమే. అయినా మాకే విజయావకాశాలున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లోనూ గెలుస్తాం. ఓట్లకోసమే ‘రామమందిరం’ మళ్లీ తెరపైకి తెచ్చారన్న విమర్శలపై ఈ ఆరోపణలు అర్థరహితం. 1989 నుంచీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ స్వాభిమానాంశంగా గుర్తించి మేనిఫెస్టోలో పెడుతూ వస్తోంది. దీన్ని మతపరమైన అంశంగా మేమెప్పుడూ గుర్తించలేదు. రామమందిర నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు. ట్రిపుల్ తలాక్‌పై..: ట్రిపుల్ తలాక్ అంశం మేం లెవనెత్తింది కాదు. ముస్లిం మహిళలే తమ స్వాభిమానం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది. మణిపూర్‌లో పరిస్థితేంటి? మణిపూర్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దీనికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే. తన పీఠాన్ని కాపాడుకునేందు కు నాగాలు, మైతీల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ వచ్చింది. అదే నేటి పరిస్థితి (బంద్‌లు హింసాత్మకంగా మారాయి)కి కారణమైంది. చాలా సమస్యలు మణిపూర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేం కూడా ‘చేంజ్, ప్రొగ్రెస్, డెవలప్మెంట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. నోట్లరద్దు... బీజేపీకి వరమా? శాపమా? నోట్లరద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం. అయినా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే విశ్లేషణ చేయాలి. ఒకటి మాత్రం స్పష్టం. దేశంలో 70–80 శాతం ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. 2019 ఎన్నికలే మోదీ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం. -
‘తీవ్రవాదుల తరపున ప్రధాని బహిరంగ ప్రచారం’
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు. -
‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్.. ఓ బాధ్యతారాహిత్యమైన దేశమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. పాకిస్థాన్ ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పి కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. తగిన సమయంలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్తారని అన్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తగిన రీతిలో జవాబిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు దాడి పాల్పడి రెండు రోజులు గడవకముందే సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. -
పీవోకే సాధనే ప్రధాని ఎజెండా
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రధాని మోదీ మౌన స్వామి కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను దేశంలోకి తీసుకురావడమే ఆయన ఏకైక ఎజెండా. అక్కడున్న ప్రజలూ మన దేశ పౌరులే’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు. ‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్ట్స్’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా రామ్‌మాధవ్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి, భారతీయులకు గౌరవం లభించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. ‘‘తూర్పు దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు, విదేశాంగ విధానం మారుతూ ఉంటుంది. దౌత్య విధానం అంటే శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఉండదు. కేవలం శాశ్వత ఆసక్తి మాత్రమే ఉంటుంది. వ్యూహాత్మక విధానం మనది. మాజీ ప్రధాని నెహ్రూ హయాంలో చైనాకు దగ్గరవ్వాలనే ఆలోచనతో ఆసియన్ దేశాల సమావేశంలో టిబెట్ జెండా తీసేయడం వల్ల చాలా నష్టపోయాం. హిందీ-చీనీ భాయి, భాయి అన్నది నినాదమే కానీ వ్యూహం కాలేకపోయింది. 1962లో చైనాతో యుద్ధంలో మనం ఎవరితోనూ స్నేహపూర్వక సంబంధాలు నెరపకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ద్వీప దేశాలతోనూ స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. తూర్పు దేశాలతో స్నేహబంధం అంటే అమెరికాతో వైరం కాదు’’ అని రామ్‌మాధవ్ పేర్కొన్నారు. విదేశీ విధానంపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కశ్మీర్‌పై అప్పుడే పట్టుబట్టి ఉంటే... ‘‘1972లో ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టోల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం ప్రకారం 94 వేల పాక్ ఖైదీలను బేషరతుగా విడిచిపెట్టాం. అప్పుడే కశ్మీర్ అంశాన్ని పట్టుబట్టి పొందగలిగి ఉంటే కశ్మీర్ పాక్ అంతర్భాగమం టూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించే ధైర్యం చేసే వారు కాదు’’ అని రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు. దేశంలో మీడియాలోని ఓ వర్గం ముష్కరులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌లోని శాంతి కాముకుల గురించి పట్టించుకోకుండా సైన్యం ఎన్కౌంటర్లో హతమైన బుర్హాన్ వనీ వంటి దేహద్రోహులపట్ల సానుభూతి వ్యక్తం చేయడం సరికాదన్నారు. ‘అవేర్నెస్ ఇన్ యాక్షన్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇఫ్లూ వైస్ చాన్స్‌లర్ సునైనాసింగ్, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్‌రావు, రఘునందన్‌రావు పాల్గొన్నారు. -
ఏపీలో బీజేపీని విస్తరిస్తాం : రాంమాధవ్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల మన్ననలు పొంది పార్టీని విస్తరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరింస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని రాంమాధవ్ చెప్పారు. మోదీ పరిపాలనకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీజేపీపై విశ్వాసంతోనే అసోంలో ప్రజలు పట్టం కట్టారన్నారు. అసోంలో 44 శాతం ఓట్లు సాధించగలిగమని...వారి ఆత్మగౌరవం, అభివృద్ధే తమ ఏజెండా అని ఆయన చెప్పారు. బీజేపీ అధికారం చేపట్టి రెండేళ్లు అయినా సందర్భంగా 200 నగరాల్లో పాలనపై రిపోర్టు ప్రకటిస్తామన్నారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ పార్టీ అసత్యప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అహంకారాన్ని, వారసత్వాన్ని ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ చెప్పారు. -
'మార్పు కోసమే మాకు ఓటేశారు'
గువాహటి: ఈశాన్య భారతంలో తొలిసారిగా కమలం వికసించింది. అసోంలో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అస్సాం ప్రజలు ముగింపు పలికారు. హస్తం పార్టీ ఘోర పరాజయం దిశగా కదులుతోంది. మార్పు కోసమే ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని బీజేపీ నేత రాంమాధవ్ తెలిపారు. అస్సాంలో తమకు 49 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అస్సాంలో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన హిమంత బిశ్వ శర్మ విజయం సాధించారు. అస్సాం బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
'ఒక్క అడుగు ముందుకు పడలేదు'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ, పీడీపీ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిచడం లేదు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ మరణం తర్వాత ఆ పదవికి ఆయన కుమార్తెను ఎన్నుకున్నారని, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. కశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి తాము కారణంగా కాదని స్పష్టం చేశారు. పీడీపీ కొత్త షరతులకు ఒప్పుకోమని అన్నారు. కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సివుందని, అంతవరకు సందిగ్ధం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు. -
శ్రీనగర్‌లో దిగిన టాప్ సీక్రెట్ విమానం!
శ్రీనగర్: ఊహించనివిధంగా, ఉన్నపళాన ఓ టాప్ సీక్రెట్ విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. ఒక్కసారిగా దిగిన ఈ విమానాన్ని ట్రాక్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇంతకు ఆయన వ్యక్తం చేసిన అనుమానం రాజకీయమైనది. బీజేపీ-పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై రహస్యంగా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నదంటూ ఒమర్ ఈ మేరకు ట్విట్టర్లో అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేత రాంమాధవ్ బుధవారం సాయంత్రం శ్రీనగర్ వచ్చి.. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్స్ చేశారు. నిజానికి బీజేపీ నేత రాంమాధవ్ కనీసం జర్నలిస్టులకు కూడా చెప్పాపెట్టకుండా శ్రీనగర్‌లో దిగారు. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే భారత రాజకీయ నేతల్లో ఒకరైన ఒమర్.. తన మొబైల్ లోని ట్రాకర్ యాప్‌తో వేళ కాని వేళ అనూహ్యంగా శ్రీనగర్‌లో దిగిన చార్టర్ విమానాన్ని పట్టేశారు. దీని గురించి వెంటనే ఆయన ట్వీట్ చేశారు. 'మామూలు ఆపరేషన్స్ సమయంలో కాకుండా ఓ అన్‌షెడ్యూల్ విమానం శ్రీనగర్‌లో దిగింది. పీడీపీ-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో గూడుపుఠాణి జరుగుతున్నది' అని ఆయన పేర్కొన్నారు. మెహబూబా-రాం మాధవ్ రహస్య భేటీ గురించే ఈ అనూహ్య విమానం దిగిందని ఓ నెటిజన్ బదులివ్వగా.. ఫ్లయిట్ ట్రాకర్ యాప్ ఇచ్చిన అమేజింగ్ అలర్ట్‌తో దీనిని పట్టేశానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
వచ్చేవారం కశ్మీర్‌కు రామ్ మాధవ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ అనిశ్చితి తెరదించేందుకు బీజేపీ అధిష్టానం ఓ అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో చర్చించేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వచ్చేవారం జమ్మూ వెళ్లనున్నారు. కశ్మీర్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదర్చటంలో మాధవ్ కీలకంగా వ్యవహరించారు. -
'అనుమానాలు అవసరం లేదు'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు అవసరం లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. పీడీపీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని, ఇందుకు పీడీపీ ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. 8 నెలల క్రితం రెండు పార్టీల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, బీజేపీకి పీడీపీ ఎలాంటి షరతులు పెట్టలేదని కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
'ముందు వాళ్లే నిర్ణయించుకోవాలి.. ఆ తర్వాతే మేం'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పీడీపీ ముందు తమ పార్టీకి కొత్త అధినేతను ఎన్నుకోవాలని బీజేపీ ఎంపీ రామ్ మాధవ్ అన్నారు. ఆ తర్వాతే తామంతా ఓ చోట కూర్చుని మాట్లాడుకొని కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. మఫ్తీ కూతురు మెహబూబా మఫ్తీ సీఎం బాధ్యతలు చేపడతారని భావించినా అలా జరగలేదు. పీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీడీపీతో భేటీ కాలేదు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రామ్ మాధవ్ ఇలా స్పందించారు. -
పాక్‌తో దోస్తీనే కోరుకుంటున్నాం
♦ అలాగని ఉగ్రవాదాన్ని ఉపేక్షించం ♦ బిహార్ ఫలితం నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాం ♦ 2016లో కొత్త వ్యూహాలు.. అస్సాంలో మాదే సర్కారు ♦ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది ♦ ప్రత్యేక హోదాపై యోగ్యమైన నిర్ణయం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షి, న్యూఢిల్లీ: పొరుగుదేశాలతో సత్సంబంధాల కోసం బీజేపీ మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉందని.. అలాగని ఉగ్రవాదం విషయంలో వెనక్కి తగ్గేది లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. బిహార్ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నామన్న ఆయన.. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ఆమోదించుకోవటంలో వైఫల్యం, పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రశ్న: మోదీ ‘స్టాప్ ఓవర్’దౌత్యం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయనుకుంటున్నారా? రాం మాధవ్: ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలుండటం చాలా అవసరం. అందుకే పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం బీజేపీ అవకాశం ఉన్న ప్రతిసారీ తనవంతు ప్రయత్నం చేస్తోంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్ర చేపడితే.. మోదీ హఠాత్తుగా పర్యటించారు. పాక్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటున్నాం.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. అయితే.. ఉగ్రవాదం విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రశ్న: పఠాన్‌కోట్ ఘటనతో భారత్-పాక్ చర్చల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రాం మాధవ్: రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేను. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించే విషయంలో మా ప్రభుత్వం అడుగు కూడా వెనక్కువేయదు. ప్రశ్న: బిహార్‌లో ఓటమి తర్వాత పార్టీ ముందున్న కొత్త సవాళ్లేంటి? రాం మాధవ్: గతేడాది మిశ్రమ ఫలితాలు సాధించాం. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. ఢిల్లీ, బిహార్లలో ఓటమిపాలయ్యాం. వీటినుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాం. 2016లో ఎన్నికలు జరిగే అస్సాం, బెంగాల్, తమిళనాడు..తదితర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళతాం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ వేదికలపై ఎవరైనా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చు. ప్రశ్న: ప్రతిపక్షంతో ఘర్షణాత్మక వైఖరితో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందలేదు. దీనిపై మీరేంటారు? రాం మాధవ్: ప్రజాస్వామ్యంలో అధికార, విపక్షాల మధ్య భేదాభిప్రాయాలు సహజం. కానీ దేశహితం కోరే విషయాల్లో ఇద్దరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. జీఎస్టీని సీఎంలు సమర్థించినా.. రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలి. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై విపక్షాల మద్దతు పొందే ప్రయత్నం చేస్తాం. ప్రశ్న: మీరు చేసిన అఖండ భారత్ వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఇది సాధ్యమేనంటారా? రాం మాధవ్: అఖండ భారత్ ఓ సాంస్కృతిక కల్పనగా చెప్పాను. దీన్ని రాజకీయంగా అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. సరిహద్దులను తుడిచేస్తామని, యుద్ధం చేసి ఇతర దేశాలను ఆక్రమిస్తామనే అర్థంలో కాదు. ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ నుంచి సానుకూల ఫలితాన్ని ఊహించవచ్చా? రాం మాధవ్: ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ నివేదిక కేంద్రానికి అందింది. యోగ్యమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుంది. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. -
అవి ఆయన అభిప్రాయాలు
రాం మాధవ్ వ్యాఖ్యలపై బీజేపీ న్యూఢిల్లీ: భారత్, పాక్ బంగ్లాదేశ్‌లు ఏదో ఒక రోజు కలసిపోయి, అఖండ భారత్‌గా అవతరిస్తాయని ఆరెస్సెస్ విశ్వసిస్తోందన్న తమ పార్టీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యల అంశాన్ని తక్కువ చేసి చూపేందుకు బీజేపీ ప్రయత్నించింది. ‘ఆయనకు తన అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు ఉంది’ అని పార్టీ ప్రతినిధి ఎంజే అక్బర్ ఆదివారం అన్నారు. భారత్, పాక్‌లు సార్వభౌమత్వ దేశాలని తమ పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఇవి స్వార్వభౌమదేశాలుగా చర్చలు జరుపుతాయని 1999లో నాటి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ లో ఇచ్చిన ప్రసంగంలో చెప్పారన్నారు. కాగా, మాధవ్ పేర్కొన్న అఖండ భారత్ సాకారం కావాలంటే బీజేపీకి విశాల హృదయం కావాలని, గుండె మార్పిడి చేయాల్సి కూడా ఉంటుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. -
భారత్, పాక్, బంగ్లా.. మళ్లీ ఒకటవుతాయి!
భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలూ మళ్లీ కలిసి ఒకటైపోతాయని, అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. కేవలం 60 ఏళ్ల క్రితం మాత్రమే చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు తప్పనిసరిగా కలుస్తాయని, అఖండ భారతం ఏర్పడుతుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకు ఆ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళ్తామనో.. లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని, విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇది అవుతుందని అన్నారు. ఇంతకుముందు భారతదేశాన్ని 'హిందూ దేశం'గా అభివర్ణించిన అంశంపై స్పందిస్తూ.. అది ఒక సంస్కృతి మాత్రమేనని, భారతదేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని ఆయన స్పష్టంచేశారు. అయితే అఖండ భారతావని వ్యాఖ్యలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇదంతా కేవలం ప్రచారమేనని, తమ వైఫల్యాల నుంచి తప్పించుకోడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలా చెబుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ విమర్శించారు. వాళ్లు ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
'ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలుసు'
జైపూర్: ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రధానమంత్రిని నియంత్రించాలని చూడొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితబోధ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని రద్దు చేయాలని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి బుధవారం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రాంమాధవ్ స్పందించారు. ప్రధాని ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం విపక్షాలకు లేదని అన్నారు. ప్రతిపక్షాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. జైపూర్ లో ఇండియన్ యూత్ పార్లమెంట్ నిర్వహించిన 'యువ మోర్చా' కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని కాంగ్రెస్
ప్రజాసంస్థలతో మంత్రులకు సంబంధాలు తప్పుకాదు బీజేపీ-ఆరెస్సెస్ సమన్వయభేటీలో అన్ని అంశాలపై చర్చించాం రాజ్యాంగేతర శక్తిగా పనిచేసిన సోనియా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలిగాం ఏపీ ప్రత్యేక హోదాపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ న్యూఢిల్లీ: ప్రజాసంస్థలతో కేంద్ర మంత్రులు నిరంతరం సంబంధాలను కలిగి ఉండడంలో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. ఆరెస్సెస్-బీజేపీ సమన్వయ భేటీకి హాజరైన కేంద్ర మంత్రులను విపక్ష ం విమర్శించడంపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఎన్నడూ విశ్వాసం లేని కాంగ్రెస్.. ఈ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఆరెస్సెస్-బీజేపీ భేటీపై విమర్శలు, ఏపీ, తెలంగాణ అంశాలపై మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంమాధవ్ చెప్పిన సమాధానాలు. ప్రశ్న: పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాల్సిన కేంద్రం ఆరెస్సెస్ ముందు మోకరిల్లిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది? ప్రజా తిరస్కరణకు గురైన కాంగ్రెస్ అది సహించలేక ప్రభుత్వం, పార్టీ, ఆరెస్సెస్‌పై అభాండాలు వేయడం హాస్యాస్పదం. కుటుంబపాలనతో గడుపుతూ వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలతో పార్టీ, ప్రభుత్వంలో ఉండే మంత్రులు మాట్లాడ్డం అపరాధమనడం హాస్యాస్పదం. మంత్రులు ప్రజా సంస్థలతో ప్రజలతో నిరంతరం సంబంధాలను కలిగి ఉండడంలో తప్పులేదు. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చాలా చూశాం. పీవీ ప్రధానిగా ఉన్న రోజుల్లో సోనియా అదనపు రాజ్యాంగ అథారిటీగా మారి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రభుత్వ పైళ్లను తన ఇంటికి తెప్పించుకున్న చరిత్ర దేశ ప్రజలకు తెలుసు. సీఐఐ, ఫిక్కీ, మీడియా వాళ్లు పిలిచినా ప్రభుత్వం వెళుతుంది. మంత్రులు ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లరా? దేశం ముందున్న ప్రధాన సమస్యలపై ఒకే ఆలోచనవిధానంతో ఉన్న సంస్థల సభ్యులం అంతా కలిసి కూర్చొని అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాం. ప్రభుత్వ, మంత్రుల పనితీరుపై సమీక్ష జరగలేదు. ప్రశ్న: సామాన్యుల ఇబ్బందులపై సమన్వయభేటీలో ఏమైనా చర్చ జరిగిందా? దేశ ప్రజల సమస్యలపై చర్చ జరిగింది. ద్రవ్యోల్బణం కాంగ్రెస్ హయాంలో 10 శాతానికి పైగా ఉండగా, ఎన్డీఏ పాలనలో 4 శాతం లోపే ఉంది. ధరల నియంత్రణలో చేపట్టిన చర్యల వల్ల కుదేలైన ఆర్ధిక వ్యవస్థను బయటపడేయటంలో సఫలీకృతులయ్యాం. ప్రశ్న: ప్రభుత్వ, మంత్రుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చిన ఆరెస్సెస్ దిద్దుకోడానికి ఏమైనా దిశానిర్ధేశం చేసిందా? సమావేశంలో సంస్థల ప్రతినిధులు ఎప్పుడు వంద శాతం సంతృప్తి అవడం సాధ్యం కాదు. ప్రభుత్వం సరైన దిశలో సాగుతోంది. ఇంకా బాగా పనిచేయాలి, త్వరగా పనిచేయాలని కోరుకోవడం సహజం. ప్రశ్న: రామమందిరం విషయంలో వీహెచ్‌పీ అసంతృప్తి వ్యక్తం చేయడంపై? ప్రజాస్వామ్యంలో అలాంటి అభిప్రాయాలు కలిగి ఉండడం, వ్యక్తీకరించడంలో ఎలాంటి తప్పులేదు. ప్రశ్న: ప్రభుత్వం విపక్షాలతో ఘర్షణపూరిత దోరణితో ఉందని విమర్శలున్నాయి? అధికార పార్టీ నిర్మాణాత్మకంగా అందరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సమావేశాలకు సహకరించాలని ప్రధాని మోదీ అనేక మార్పులకు పిలుపునిచ్చారు. లలిత్‌గేట్ స్కాం కాదు. విపక్షాలు రాజకీయ దురుద్దేశంతో లేని విషయాలపై ఘర్షణ చేస్తూ పార్లమెంటు నడవనీయడంలేదు. వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసే హక్కు విపక్షాలకు ఉంది. కానీ ఇతర అంశాలపై సభలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. జీఎస్టీ సహా ఇతర బిల్లులు దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడానికి చాలా అవసరం. ప్రత్యేక సమావేశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రశ్న: ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలుగువారిగా పార్టీలో జాతీయ స్థాయిలో ఉన్న మీ స్పందన? రాష్ట్రానికి అవసరమైన నిధులు, ఆర్ధిక సహకారం కోసం ఏపీ సీఎం కేంద్రంతో మాట్లాడుతున్నారు. బాధ్యులుగా మేం కూడా మాట్లాడుతున్నాం. ఏ విధంగా ముందుకు వెళ్లడమనేది చూద్దాం. ప్రత్యేక హోదాను భావోద్వేగ అంశంగా తీసుకుని ప్రాణాలకు హానీ చేసుకునే చర్యలకు పాల్పడవద్దు. ఏపీ, తెలంగాణలకు మంచి జరగాలి. -
'ఆర్ఎస్ఎస్తో మంత్రుల చర్చలు తప్పుకాదు'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్తో చర్చలు జరపడటంలో తప్పులేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రజా సంస్థలతో సంబంధాలు కలిగిఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు. తమది సైద్ధాంతిక కుటుంబమని, దేశ శ్రేయస్సు కోసం చర్చలు జరిపామని రాంమాధవ్ చెప్పారు. ప్రభుత్వం సరైన దిశలో వెళ్తోందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టినా.. కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందనే నమ్మకంలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ముఖ్యమంత్రితో మాట్లాడుతోందని, ఎవరూ భావోద్వేగాలకు లోనుకావద్దని రాంమాధవ్ చెప్పారు. -
'కాశ్మీరీలను దేశభక్తి నిరూపించుకోమనడం సరికాదు'
హైదరాబాద్/ జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని ప్రొగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమర్థించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ సమాన భాగస్వామి కావడం దేశభద్రతకు మంచిదని, ఈ ప్రయోగం సఫలమైతే జాతీయవాదానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పీడీపీతో పొత్తు చర్చల్లో కీలక పాత్ర వహించిన రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ సంస్థ నిర్వహించిన సదస్సులో జాతీయ భద్రత - జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకూ అన్న అంశంపై ప్రసంగించారు. ఇరు పార్టీల మధ్య రాజకీయ అంశాల్లో వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమేనని, ఇది రాజకీయ పొత్తు కాదని, పీడీపీ- బీజేపీలది పరిపాలనాపరమైన పొత్తు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చినతీర్పును గౌరవించి తాము పీడీపీతో అధికారంలో పాలుపంచుకుంటున్నామని అన్నారు. దేశ భద్రతకు, దేశ సమైక్యతకు ఏ మాత్రం భంగం కలిగితే బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నంత వరకూ వేర్పాటు వాద శక్తులకు అంగుళం కూడా తావివ్వబోమని ఆయన ప్రకటించారు. సైన్య బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో ఎలాంటి రాజీకీ తావుండబోదని కూడా ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 67 శాతం మంది ప్రజలు కాశ్మీర్ లోయలో ఓటు వేసి, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయ ప్రజలను తమ దేశభక్తిని నిరూపించుకొమ్మని పదేపదే అడగడం సరైనది కాదని కూడా ఆయన అన్నారు. కాశ్మీరీ ప్రజలను కలుపుకుపోవాలే తప్ప వేరు చేయడం సరికాదని ఆయన అన్నారు. కాశ్మీరీ పండితులను తిరిగి కాశ్మీర్ కి సగౌరవంగా తీసుకువచ్చే విషయంలో, వారికి భద్రత, రక్షణ కల్పించే విషయంలో తొలి దఫా చర్చలు పూర్తయ్యాయని, కాశ్మీర్ లోని శరణార్థులకు పునరావాసం కల్పించే విషయంలో చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రస్తావిస్తూ దేశం సురక్షితమైన నాయకత్వం చేతుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేనంత మంచి పాలనను మోదీ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరాశ నుంచి ఆశ వైపు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని సూట్ బూట్ ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇచ్చింది లూట్ ఝూట్ (దోపిడీ, అబద్దాల పాలన) పాలన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి సంస్థ అధ్యక్షులు టీ హనుమాన్ చౌదరి, జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అధ్యక్షులు ప్రొ. తిరుపతి రావులు కూడా ప్రసంగించారు. -
'బీజేపీ ప్రజారంజక పాలన అందిస్తోంది'
-
వాళ్ల ఫ్యామిలీ మొత్తం సూటుబూట్ల ఫ్యామిలీయే!
న్యూఢిల్లీ: 'సూట్ బూట్ కీ సర్కార్'... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు రెండు నెలల పాటు కనిపించకుండా పోయి తిరిగొచ్చిన తర్వాత తొలి రోజు పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్న మాటలివి. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ ఈ విమర్శ చేస్తూనే ఉన్నారు. ఈ మాటలపై బీజేపీ నేత రామ్ మాధవ్ స్పందించారు. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వాన్ని సూట్ బూట్ కీ సర్కార్ అన్నారని అయితే రాహుల్ కుటుంబమంతా కూడా సూట్ బూట్లు వేసుకొనే ఉంటారుగా అని ఆయన అన్నారు. రాహుల్ అలా అనడం ద్వారా ప్రజలకు తమ గురించి ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదని చెప్పారు. రాహుల్ బావ రాబర్ట్ వాద్రాను కూడా రామ్ మాధవ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సూట్ బూట్ వేసుకొని హర్యానాలో రాబర్ట్ వాద్రా అక్రమంగా భూలావాదేవీలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పెద్దతప్పులు చేసే నాయకుడని, ఆయన మాటలు అనుభవలేమితో వచ్చినవని విమర్శించారు. 'చాలాకాలం పాటు ఏం మాట్లాడలేని ఓ పిల్లాడు.. ఆ తర్వాత మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఇంకా మాట్లాడాలని ప్రోత్సహిస్తారు' అని రాహుల్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ పాలనకు ఏడాది గడుస్తున్న నేపధ్యంలో ఆయన రాహుల్‌పై విమర్శలు సంధించారు. -
కశ్మీర్లో అభివృద్ధి ఎజెండాతో ప్రభుత్వం
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీల కొత్త ప్రభుత్వం అభివృద్ధి, శాంతి, పునరావాసం ఎజెండాతో ముందుకెళ్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం, విభిన్న వర్గాల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడం, వరద బాధితులకు పునరావాసం కల్పించడమే ప్రాథమ్యాలుగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటును పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కొన్ని అంశాల్లో రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలున్నప్పటికీ, చర్చల ద్వారా ఏకాభిప్రాయంతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ను అధికారం కోసం పక్కన పెట్టారనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.