
హైదరాబాద్: 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక దేశంగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. మోదీ మరోసారి రావాలి అనే అంశంపై హైదరాదాబాద్ మారీగోల్డ్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లుగా టెర్రరిస్టు ఫ్రీ దేశంగా మార్చారని అన్నారు. 2022కి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండాలా అని ప్రశ్నించారు. మోదీ ఇండియాని నయా ఇండియాగా మార్చుతున్నారని వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. మోదీయే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించబోతున్నారని అన్నారు. ఏపీకి సంబంధించి 80 శాతం విభజన హామీలు నెరవేర్చామని వెల్లడించారు. మీడియాని మీడియంగానే చూస్తున్నామని చెప్పారు. మోదీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని అన్నారు. మనకు కూడా త్వరలోనే సొంత మీడియా వస్తుందని వెల్లడించారు. అప్పటి వరకూ నమో యాప్ వాడాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, సుమారు 338 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment