సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత రాంమాధవ్ రచించిన ‘ది హిందుత్వ పరాదిమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫోరమ్ ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ రఘురాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాంమాధవ్ హిందుత్వం గురించి మంచి పుస్తకాలు రాస్తారన్నారు. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటాయని రఘురాం అన్నారు. ఈ పుస్తకంలో అనేక అంశాలు తానను ఆకట్టుకున్నాయన్నారు.
రాంమాధవ్ మాట్లాడుతూ కార్ల్‌మార్క్స్' కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. హిందుయిజం శంకరాచార్యులు, గాంధీ లాంటి వ్యక్తులను తయారు చేసిందన్నారు. ‘‘సావర్కర్ పితృభూమి అన్నారు. నేను మాతృభూమి అంటున్నాను. కమ్యూనిస్ట్‌లు ఐడియాలజిస్ట్‌లు.. హిందువులు తత్వవేత్తలు. హిందుత్వం, హిందుయిజం, ఇండియా అన్నీ ఒక్కటేనని’’ రాంమాధవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment