( ఫైల్ ఫోటో )
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు.
వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment