Book Launch
-
భారత్‌లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు -
సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..!
గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహానగరంలో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు. సిడ్నీ తెలుగింటి ఆడపడుచుగా ఆస్ట్రేలియా లోనే మొదటి రచయిత్రి కథా సంపుటి 'నీ జీవితం నీ చేతిలో' 21 కథల సమాహారం. పాఠకులకు సందేశాన్ని, వినోదాన్ని, కనువిప్పును, స్ఫూర్తి ని నింపే కథలు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చేతిలోకి తీసుకోవలసినదే 'నీ జీవితం నీ చేతిలో'.రెండో పుస్తకం 'రంగానందలహరి' శ్రీ పెయ్యేటి రంగారావు గారు అందిస్తున్న94 భక్తిగీతాలు, భావ గీతాలు ప్రతి ఇంటిలో ఉండవలసిన భాషా కుసుమాలు. లండన్ డర్రీ నైబర్ హుడ్ కమ్యూనిటీ సెంటర్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు సకల కళా దర్శిని సిడ్నీ, ఆస్ట్రేలియా వారు నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన పాటలు, పద్యాలు, భావగీతాలు కళాకారులు శ్రీ వద్దిపర్తి శ్రీనివాస్ గారు, చిన్నారులు ఆశ్రిత గరగ, శ్రిత భాగవతుల ఆలపించారు. మయూర అకాడమీ గురువులు శ్రీ రమణ కరణం గారు కొరియోగ్రఫీ, డా. పద్మ మల్లెల సంగీతం సమకూర్చిన శ్రీ పెయ్యేటి రంగారావుగారి శ్రీ సీతా రాముల పరిణయ వేడుక గీతాన్ని అనిరుధ్ కరణం, లోహిత గొళ్లపల్లి కూచిపూడి నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.నృత్యాలయ డాన్స్ టెంపుల్ నుంచి విద్యార్థులు భరతనాట్యం ఫ్యూజన్ నృత్యం తో అందరినీ అలరించారు. లాలిత్య, సౌమ్య, సంతోషి గార్లు గణేశ, సరస్వతీ ప్రార్థన తో నృత్య అభినయంతో కార్యక్రమానికి శుభారంభం చేసారు. కార్యక్రమానికి సుశ్మిత విన్నకోట వ్యాఖ్యాత గా వ్యవహరించారు.సకల కళా దర్శిని అధ్యక్షురాలు శ్రీమతి విజయ గొల్లపూడి మాట్లాడుతూ, జూలై 2022 వ సంవత్సరంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఆశీస్సులతో సకల కళా దర్శిని, సిడ్నీ, ఆస్ట్రేలియా సకల కళలకు వేదికగా నెలకొల్పటం జరిగింది అన్నారు. ఇంకా ఈ సకల కళాదర్శిని వేదికపై గత ఫిబ్రవరిలో ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి తో, పేరొందిన లలిత సంగీత కళాకారులతో గాన విభావరి నిర్వహించాము. ప్రస్తుతం మన సనాతన ధర్మ ప్రచారం లో భాగంగా భగవద్గీత పారాయణ నెల నెల ఒక అధ్యాయం చొప్పున ప్రపంచ వ్యాప్తంగా నెల నెల నిర్వహించటము జరుగుతోంది. ఇప్పటివరకు ఐదు అధ్యాయాలు జయప్రదంగా జరుపుకున్నాము.వచ్చే ఆదివారం ఆరవ అధ్యాయ పారాయణ జరుపుకోబోతున్నాము.ఈ సకల కళా దర్శిని నెల కొల్పటంలో ముఖ్య ఉద్దేశ్యం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం ఎంతో అమూల్యమైనవి, తరగని విలువైన సంపద. ఇది తర తరాలకు అనంత వాహిని లా ప్రవహించేలా అందచేయటం బాధ్యతగా భావించాను. అమ్మ భాషతో అనుబంధం ఉండాలి. మన తెలుగునాట అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వారి లోని కళా నైపుణ్యాన్ని గుర్తిస్తూ, ప్రపంచానికి తెలియచేయాలి. అలాగే స్థానికంగా ఉన్న చిన్నారులు, కళాకారులకు కూడా ఈ సకల కళా దర్శిని ఒక చక్కని వేదికగా నిలవాలి అనే అకాంక్ష. ముఖ్యంగా సాహిత్యం, మన తెలుగు భాషా, సంస్కృతులు పరిమళాలు ఎల్లెడలా వ్యాపించాలి. మన మాతృభూమికి దూరంగా ఉంటున్నాము అన్న వెలితి లేకుండా, ఎక్కడ ఉన్నా తెలుగు వారమే, ఖండ ఖండాతరాలలో మన తెలుగు ఉనికిని, ప్రతిభా పాటవాలను చాటుకుంటు, అటకెక్కకుండా అవకాశాలను ఏర్పరుచుకోవడమే ముఖ్య ఆశయం అని సకల కళా దర్శిని సంస్థ లక్ష్యాలను విశదీకరించారు.విజయ మాధవి గొల్లపూడి రచించిన కథల సంపుటి 21 కథలు, జూలై 21 వ తేదీన పవిత్ర గురు పౌర్ణమి రోజున ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ రెస్టారెంట్ గ్రూప్ అధినేత ‘రాజ్ వెంకట రమణ’ చేతులతో పుస్తక ఆవిష్కరణ చేసారు.‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటి కి ప్రముఖ చిత్ర కళాకారులు శ్రీ కూచి సాయి శంకర్ గారు ముఖ చిత్రాన్ని అందించారు.పుస్తకం లోని గురువచనం ముందుమాటగా ‘ప్రియమైననీకు’ లేఖారూప కథ తీపి జ్ఞాపకాల స్నేహబంధాన్ని వివరించిన తీరు మధురంగా ఉంది. ఇలా ఒక్కో కథలో ఒక్కోప్రత్యేకత, సున్నితమైన భావాలు, మానవీయత, విలువలు కలిగిన జీవితం లోని పరమార్థం…వంటి సార్వకాలీన, సార్వజనీన విషయాలను మృదువైన, శక్తివంతమైన శైలిలో, హృదయానికి హత్తుకునేలా రచించిన రచయిత్రి సంస్కారానికి, ప్రతిభకి అభినందనలు” అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటలను చదివి వినిపించారు సుశ్మిత.శ్రీమతి చావలి విజయ ‘నీ జీవితం నీ చేతిలో’ 21 కథల సారాంసాన్ని, రచయిత్రి శైలిని వివరిస్తూ, చక్కని సమీక్ష ను అందచేసారు. రచయిత్రి విజయ గొల్లపూడి గారికి సీస, తేటగీతి పద్యమాలికలతో శ్రీమతి విజయ చావలి గారు అభినందన మందారమాలను అందచేశారు. గతంలో తెలుగు పలుకు పత్రికకు 15 ఏళ్ళు సంపాదకునిగా వ్యవహరించిన శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటిపై పుస్తక సమీక్ష చేశారు.కవి, రచయిత శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన ‘రంగానందలహరి’ పుస్తకాన్ని ఎసెట్ పాయింట్ హోమ్స్ సంస్థ అధినేత రామ్ వేల్ గారు ఆవిష్కరించారు.రంగానందలహరి పుస్తకానికి ప్రణవి గొల్లపూడి ముఖచిత్రాన్ని అందించారు. రంగానందలహరి లోని కావ్య గీతికలను తెలుగు పండితులు శ్రీ తూములూరి శాస్త్రి గారు సమీక్ష చేసారు. తెలుగు భాషాభిమానులను ఈ పుస్తకం అందరినీ చదివింపచేస్తుంది. రాకేందు శేఖరా, ఏడుకొండల ఏలికా రంగానందలహరి లో రచయిత వాడిన పదప్రయోగాలపై శ్రీ పెయ్యేటి రంగారావు గారిని ప్రశంసించారు.శ్రీ తూములూరి శాస్త్రి గారు రంగారావుగారికి అభినందనలతో ప్రశంసా పత్రాన్ని అందించారు.గీ. తెలుగు పదముల సొగసులు తీయదనము వెలుగు జిలుగులు ఆనంద వీచికలతొ రంగరించిన కవితా తరంగ రంగ విహరి! ఈ రంగ యానంద లహరి లహరి! సీ. భక్తిభావము నించ పదకవితాపితా మహుడు కొండొకచోట మదిని నిల్చు సందేశములు పంచ సందోహమెంచగా గురజాడ జాడలే గుర్తు తెచ్చు మానవతావాద మహితోక్తు లందించ నాయని నండూరి నడకలెచ్చు భావకవిత్వంపు పరువాలు పండించ దేవులపల్లియే దీప్తినిచ్చుగీ. భక్తి ఆసక్తి సంసక్తి రక్తి యుక్తి నించి మించిన సాహితీ నియత శక్తి భావ విద్వత్ స్వభావ ప్రభావ మంత రంగరించిరి కవితల రంగరాయ!క. తియ్యని కవితా విరులతొ నెయ్యము సేయంగ మిగుల నేర్పరులౌగా పెయ్యేటి రంగరాయా! వెయ్యారుల వందనములు వినతులు సేతున్! వేద పండితులు శ్రీ నేతి రామకృష్ణ గారు రంగానందలహరి కావ్యగీతికలను సమీక్ష చేసారు. వేదికపై అలంకరించిన రచయితలకు, పండితులకు పుష్పగుచ్ఛం, శాలువాలతో సత్కరించారు.కార్యక్రమానికి విచ్చేసిన డా. చెన్నప్రగడ మూర్తి, డా. జ్యోతి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఓలేటి మూర్తి గారు, శ్రీ పోతుకూచి మూర్తిగారు కళాకరులందరికీ ప్రశంసా పత్రాలను అందచేసారు. -
యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జి ల్లా: కొట్లాడి తెచ్చుకున్న తెలంగా ణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తుల ను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సా మాజిక అంశాల్లో వచి్చన మార్పు లు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పు స్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాస్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని చెప్పారు. రచయితలు ప్ర జల పక్షాన ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉధృతమైంద ని గుర్తు చేస్తూ మరోసారి కవులు కళాకారులు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్ సర్కారు తిరోగమన దిశగా ఆలోచించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.పదేళ్ల తెలంగాణ పాలనలో ప్రజలకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదని కేసీఆర్ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బాలమల్లు, శరత్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు, బీఆర్ఎస్ యువ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి రాసిన ‘హౌ టు బయ్ ఆన్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకాన్ని కూడా కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో సమగ్ర ఎన్నికల ప్రక్రియలో పారీ్టల పాత్ర, ఓటర్లు, తదితర అంశాలతో ఈ పుస్తకం రాశారు. -
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారేరీ?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. వారి తరువాత జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఫుల్‌టైం బిజినెస్‌లు చేసేవాళ్లు రాజకీయాల్లోకి పార్ట్‌టైంగా రావడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు’అని సీఎం పేర్కొన్నారు. మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌస్’పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి అంశాల గురించి పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడేందుకు, విజ్ఞప్తి చేసేందుకు ఎవరూ కనపించని పరిస్థితి నెలకొందన్నారు. దేశ పరిపాలనలో మన పాత్ర ఉండాలి.. ‘జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నట్లుగానే దేశ పరిపాలనలో, నిర్ణయాల్లో మన పాత్ర ఉండాలి. గతంలో ప్రధాని పదవి ఉత్తరాది వారికి ఇస్తే రాష్ట్రపతి దక్షిణాది నుంచి అయ్యేవారు. ఇక్కడి వారు ప్రధాని అయితే ఉత్తరాది నేతకు రాష్ట్రపతి అవకాశం దక్కింది. అలాగే కేంద్ర కేబినేట్‌లోనూ గతంలో కనీసం ముగ్గురు కీలక మంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి కారణాలు విశ్లేషించి ఏం చర్యలు తీసుకోవాలన్నది అనుభవజు్ఞలైన రిటైర్డ్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సూచించాలి. విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జాతీయ స్థాయిలో మన ప్రాభవం చాటేలా మళ్లీ మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కీలక అంశాలతో మాజీ గవర్నర్ రామ్మోహన్రావు రాసిన పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించా: రామ్మోహన్రావు తాను రచించిన పుస్తకం ఎన్నో వెలుగులోకి రాని చారిత్రక అంశాలకు వేదికగా నిలుస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మెహన్‌రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి రంగయ్య నాయుడు ఐపీఎస్ అధికారిగా, రాజకీయనాయకుడిగా తన అనుభవాలు, నాటి పరిస్థితులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు దారులు.. చరిత్రకు సాక్ష్యాలు
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్‌లో ఆవిష్కరించుకున్నారు ప్రవాసాంధ్రులు. లండన్‌లో డాక్టర్ ప్రదీప్ చింతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అవుతాల, షాన్ పద్మనాభన్, శ్రీనివాసన్ జనార్థన్, విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు. నేటి తరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఎన్నో అంశాలను, రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ఘటనలను దేవులపల్లి అమర్ పుస్తకం ద్వారా లైవ్‌లో ఉంచారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్, వైస్రాయ్ వేదికగా చంద్రబాబు చేసిన పనులను రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి రూపొందించిన ఈ పుస్తకం.. భావి తరాలకు ఓ గైడ్‌గా ఉంటుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ఎన్నో వాస్తవాలు.. పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చినట్టయిందని తెలిపారు. ఈ ప్రయత్నం చేసిన దేవులపల్లి అమర్‌ను ప్రశంసించారు. -
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్‌గా, రిఫరెన్స్ మెటీరియల్‌గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు. మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు. పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. -
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
రాహుల్‌పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్‌ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్‌గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్‌లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్‌కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్‌ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్‌హీరో’ పుస్తకంతో రైటర్‌గా మారింది. రైటర్‌గా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
‘తెలంగాణ ఎడిషన్ 50 ఇన్స్పైరింగ్ ఉమెన్’ పుస్తకం ఆవిష్కరణ
-
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్‌స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
బ్రేలి లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం
-
కథలన్నీ సలీమ్వి... సంభాషణలు నావి
(జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ రచయితలు సలీమ్ జావేద్ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్ లైఫ్’ విడుదల సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్డమ్ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం. రాజేష్ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మేన్ ఇమేజ్ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్ కపూర్ హీరోగా ‘మిస్టర్ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు) -
'మట్టి మనిషి' ఫిల్మ్ ప్రివ్యూ బాగుంది: నటుడు హర్షవర్దన్
నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన ‘కవితా చిత్రమ్’ పుస్తకావిష్కరణ, బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మట్టి మనిషి’ ఫిల్మ్ ప్రివ్యూ రామనాయుడు స్టూడియోస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథి గా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ, మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూలో నటుడు, రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి ఒక శాస్త్రజ్ఞుడని , నిరుత్సాహపడుతున్న రైతులకు ఆయన స్పూర్తి అని కొనియాడాడు. ‘వెంకటరెడ్డి స్ఫూర్తితో తీసిన ‘మట్టి మనిషి’ డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ..సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయడమే నా ప్రక్రియ . ఇది 2004 లో పేటెంట్ చేయబడింది. ఒక రైతు గా నేను చేసినవే పేటెంట్ కోసం రాశాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతధంగా ఆమోదించారు. దీని గురించి ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది.’ అన్నారు ఈ కార్యక్రమంలో షేడ్స్ స్టూడియో సి.ఇ.ఓ దేవీ ప్రసాద్, బాసంగి సురేష్, చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పౌర హక్కుల కోసం పోరాడిన కన్నభిరాన్
లక్డీకాపూల్: పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడిన శక్తి కేజీ కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ’వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కేజీ కన్నభిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను కల్పనా కన్నభిరాన్ ఆంగ్లంలో అనువదించగా.. ‘ది స్పీకింగ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించింది. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. సభలో ఇంగ్లిష్ పుస్తక అనువాదకర్త, ఎడిటర్ కల్పన, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లా డారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. -
ఆర్థిక నేరాలపై ఎస్‌హెచ్‌వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్ అధికారులకు(ఎస్‌హెచ్‌వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీ సర్స్ మెస్‌లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) డీజీ ఉమేష్ష్రాఫ్ రచించిన ‘ఎకనామిక్ అఫెన్సెస్–హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్ పోలీస్ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్ ష్రాఫ్ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్ డీజీ పి.ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఉమేష్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, శివధర్‌రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్, విజయ్ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు. -
సాహితీ లోకానికి ఇది ఓ కరదీపిక
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహిత్యలోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ ఓ కరదీపికగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ గ్రంథం అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్య అధ్యయనానికి దోహదం చేస్తుందన్నారు. తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో కలిసి మంగళవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుంచి మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. గోనబుద్దారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, పోతన, భాస్కర రామాయణ కవులు, మారన, గౌరన, గోపరాజు ఇంకా ఆనాటి సంప్రదాయ కవిత్వ పంక్తిలో తెలంగాణది సింహభాగమని వివరించారు. గౌరీశంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథం ‘‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురస్కార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జర్నలిస్ట్ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. రచయిత, జర్నలిస్ట్ విజయార్కె రాసిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరువేసుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి పాల్గొన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
దివంగత సీఎం వైఎస్‌ది గోల్డెన్ పీరియడ్: చాడ
హుస్నాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్ పీరియడ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం చాడ వెంకట్‌రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్‌లో జరిగిన లాకప్‌డెత్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు. నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నియంతృత్వాన్ని ఉద్యమంలా తీసుకెళ్తోంది
సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకువెళ్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ ఆరోపించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కె.బాలగోపాల్ 13వ స్మారకోపన్యాసాన్ని ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, సుధ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అరుంధతీరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ వి«ధానాలకు కులమతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి కావడం వల్లే 8ఏళ్లలోనే అదానీ 8 బిలియన్ డాలర్లనుంచి 139 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగాడన్నారు. భవిష్యత్‌లో ఇదే వరుసలో అమిత్‌షా కుమారుడు కూడా రానున్నాడని చెప్పారు. అదానీని ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్ చేయడం కోసమే 2014లో మోదీ.. అదానీ విమానంలో వచ్చి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి, ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక, విప్లవ శక్తులు మరింత ఎక్కువగా ప్రజల మధ్య పనిచేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మహిళలను మరింత అణచివేసేందుకే హిజాబ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిఫ్టన్ డి రాజోరియో మాట్లాడుతూ... మోదీ ఫాసిజానికి ఫేస్‌లాంటి వాడన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కులు మరింతగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పీయూసీఎల్ నాయకులు నిహిర్ దేశాయ్, హెచ్ఆర్ఎఫ్ నాయకులు జహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ రచించిన ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ అనే పుస్తకాన్ని అరుంధతీరాయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
అల్లూరి రామలింగయ్య 100వ జయంతి వేడుకలు.. బుక్ లాంఛ్ కార్యక్రమం( ఫోటోలు)
-
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.