‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు.
కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment