చెన్నై:సుమారు 40 ఏళ్లకుపైగా తన చిత్రాలకు సంబంధించిన సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ప్రసాద్ స్టూడియోలో ఒకరోజు ఇళయరాజాకు ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని మద్రాసు హైకోర్టు ప్రసాద్ స్టూడియో నిర్వాహకులను ప్రశ్నించింది. సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒక రూమును ప్రత్యేకంగా కేటాయించారు. ఆ గదిలోనే ఇళయరాజా తన చిత్రాలకు సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే గత ఏడాది ఆ గదిని వేరే కార్యక్రమానికి కేటాయించడంతో ఇళయరాజాని ఖాళీ చేయాల్సిందిగా స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment