
చిత్ర యూనిట్‌తో షకీలా
చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని షకీలా అన్నారు. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఆమె బయోపిక్ ఇప్పుడు షకీలా పేరుతోనే ఐదు భాషల్లో రూపొందింది. ఇందులో షకీలా పాత్రలో నటి ఏస్తర్ నటించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి షకీలా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం షకీలా అని తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందుపరచలేదని.. చిత్రానికి ఏది అవసరమో దాన్ని చెప్పినట్లు తెలిపారు.
ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమని అన్నారు. తాను చేసిన తప్పులను కూడా ఈ చిత్రంలో చూపినట్లు తెలిపారు. ఈ చిత్రం నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు. అయినా తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమని షకీలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment