Shakeela
-
ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో..
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. 2021లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.షకీలా సినిమా థియేటర్స్‌లో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు వర్షన్ కోసం ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని చాలామంది షేర్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే, తెలుగు వర్షన్ కూడా మరో రెండురోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది.ఈ సినిమాతో షకీలా ప్రయాణం చాలామందిని ఆలోచింప చేస్తుంది. ఇండస్ట్రీలో నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా.. శృంగార తారగా ఎలా మారింది అనేది చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడటంతో ఈ మూవీకి పెద్ద మైనస్ అయింది. ఆపై ఇందులో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటంతో కూడా ఇబ్బందిగా మారింది. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను చూపించారు. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. -
తెలుగు ఇండస్ట్రీలోనూ వేధింపులు.. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకే అంటేనే..: షకీల
హేమ కమిటీ నివేదికతో మలయాళ ఇండస్ట్రీ వణికిపోతోంది. ఇక్కడ ఆర్టిస్టులను బానిసల్లా చూస్తున్నారని, పలుకుబడి ఉన్న పెద్దలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని సదరు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో పలువురు మలయాళ సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను బహిర్గతం చేస్తున్నారు.వేధింపులు..ఈ నేపథ్యంలో నటి షకీల సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ ఇండస్ట్రీ ఒక్కటే కాదు తమిళ చలనచిత్ర పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించింది. హిందీలో అంటారా? అక్కడ క్యాస్టింగ్ కౌచ్ కన్నా నెపోటిజమే ప్రధాన సమస్య అని.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులను ఎదగనీయకుండా అడ్డుపడతారంది. టాలీవుడ్లో మరీ ఎక్కువకేవలం తాము మాత్రమే రాణించాలని చూస్తారని పేర్కొంది. తెలుగులో అయితే లైంగిక వేధింపులు తారాస్థాయిలో ఉన్నాయంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటుందా? అని తమ మేనేజర్లను అడుగుతారని, అందుకు ఓకే అంటేనే సినిమాలో ఛాన్సిస్తారని ఆరోపించింది. -
నేను అలాంటి చిత్రాల్లో నటించలేదు.. కిరణ్ రాథోడ్ ఆవేదన
హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్ రాథోడ్. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! తమిళంలో కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్ సహా ప్రముఖ హీరోలతో నటించిన కిరణ్.. సినిమా ఛాన్సులు పీక్‌లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు బిగ్‌బాస్-7లో కనిపించిన కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఒక యూట్యుబ్ ఛానల్ కోసం ఆమెను నటి షకీల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: వంద కోట్ల స్టార్ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?) చాలా ఏళ్లుగా తనపై వస్తున్న రూమర్స్ గురించి కిరణ్ ఇలా చెప్పారు. 'నేను ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల చిత్రాల్లో నటించ లేదు. కానీ మీడియా నాపై ఎందుకు అలాంటి వార్తలను ప్రచారం చేసిందో తెలియదని కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది.' తమిళ్లో జెమిని సినిమా తర్వాత ఓవర్‌నైట్ స్టార్ అయిన కిరణ్ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. వాడి వల్లే సినిమా ఛాన్సులు తగ్గాయి గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను నటించాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఏవరైనా ఆఫర్లు ఇస్తే తప్పకుండా మళ్లీ నటిస్తాను. అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. సినిమా ఆఫర్లు ఇచ్చి రాత్రికి ఫోన్ చేస్తారు ప్రేమించిన వాడు దూరం అయ్యాడు.. చేతిలో సినిమాలు లేవు. అలాంటి సమయంలో కొందరు సినిమా ఛాన్స్ ఉందని కాల్ చేస్తారు. మీకు మంచి పాత్ర ఉందని కూడా ఆఫర్ చేశారు. ఎవరైతే ఆఫర్లు ఇస్తామని చెప్పారో మాట్లాడిన అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేస్తారు. తనతో గడపాలంటూ ఫ్లాట్‌కు రమ్మంటారు. అలా ప్రతిరోజూ చాలామంది రాత్రి అయితే కాల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు అర్థం అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరూ స్నేహితులు లేరు.. ఎవరూ సాయం చేయరు. అని తన పాత రోజులను గుర్తు చేసుకుంది. యాప్‌లో గ్లామర్ ఫోటోలు, వీడియోలు సినిమా అవకాశాలు లేకపోవడంతో అదే సమయంలోనే నేనొక యాప్‌ని ప్రారంభించాను. అందులో నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాను. అది చూసి నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తారనుకున్నాను. కానీ వారితో పాటు మరికొందరు డబ్బులిస్తామంటూ కమిట్మెంట్ అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒకరి పేరు చెప్పనవసరం లేదు.. ఆ సమయంలో ఇలా చాలా మంది కాల్ చేశారు. తర్వాత దానిని ఆపేశాను. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎలాంటి ఆఫర్లు రాలేదు.. ఇప్పుడు కూడా కొన్ని తప్పుడు కాల్స్ వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. నేను శృంగార నటిని కాదు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది నేనొక్కదాన్నే కాదు. చాలా మంది నటీమణులు చేస్తారు. కానీ నేను పోస్ట్ చేస్తే మాత్రం మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను ఎలాంటి శృంగార చిత్రాల్లో నటించలేదు, వీడియోలు చేయలేదు. నాకిష్టమైన బట్టలు వేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తాను. కానీ కొందరు మాత్రం కమిట్మెంట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తారు. ఇంటర్నెట్లో వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని నటి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరణ్‌పై ఆరోపణలు సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్ రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by KEIRA RATHORE (@kiran_rathore_official) -
సీనియర్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై దాడి!
సీనియర్ నటి, బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ షకీలాపై దాడి జరిగింది. ఆమె పెంపుడు కుమార్తె శీతల్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షకీలా పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిందని షకీలా తెలిపింది. మాట్లాడేందుకు పిలవగా.. తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని వెల్లడించింది. తాను సర్ది చెప్పందుకు యత్నించగా.. తనపైనే దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. (ఇది చదవండి: అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా?) అంతే కాకుండా గొడవ సమయంలో అక్కడే ఉన్న మహిళా లాయర్‌తో శీతల్ తల్లి అసభ్యకరంగా మాట్లాడిందని షకీలా ఆరోపించింది. మరోవైపు అదే పోలీస్ స్టేషన్లో షకీలాపై కూడా శీతల్ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువైపులా ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఆమె షకీలా అన్న కుమార్తెనని సమాచారం. -
హీరో అల్లరి నరేశ్ తండ్రి నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు: షకీల
టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో టార్చర్ వల్ల సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల.. విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగాడని ఆరోపించింది. విచిత్ర అతడి పేరు చెప్పాల్సింది తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు. అడ్జస్ట్ అయిపో.. ఇంకో సినిమా ఇస్తా.. తనతో అడ్జస్ట్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అప్పుడు నేను.. సర్, ఇప్పుడీ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా ఛాన్స్ నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా లేదు అని ముఖం మీదే చెప్పాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు పిలిచి అడిగినా చెప్తా.. అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని చెప్పుకొచ్చింది షకీల. ఈమె వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న షకీల ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టింది. రెండు వారాలకే హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయింది. చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. చివరకు.. -
అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా?
సౌత్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ అభిమానులను పలకరించింది. అయితే మొదట అడల్డ్ మూవీల్లో కనిపించిన షకీలా.. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో ఆమె పెద్ద సంచలనం. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ షేక్ అయ్యేది. తమిళనాడుకు చెందిన షకీలా సౌత్ చిత్రసీమను తన గ్లామర్‌తో ఊపేసింది. అయితే నవంబర్ 19న, 1973లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించింది. ఆమె తన బాల్యమంతా నెల్లూరులోనే పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే చిత్రంతో షకీలా సినీ ప్రస్థానం మొదలెంది. తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఆమె తన తన పేరు శృంగార తారగానే అభిమానుల్లో ముద్ర పడిపోయింది. కానీ తన జీవిత కథ అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది. తనకు పదహారేళ్ల వయసులోనే తల్లే స్వయంగా వ్యభిచారంలోకి పంపినట్లు వెల్లడించింది. తాను నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగార తారగా చూపేందుకు పరిమితమయ్యాయని.. తనలో నటిని బయటికి తీసేందుకు ఎవ్వురూ ప్రయత్నించలేదని షకీలా తన ఆత్మకథలో రాసుకొచ్చింది. అప్పట్లోనే దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా షకీలా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి. అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. తన జీవితంలో తన ఆమె తల్లితో పాటు సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. -
బిగ్ బాస్: జోవికా తండ్రి ఎవరంటూ కామెంట్లు.. ఫైర్ అయిన షకీలా
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తెనే ఈ జోవిక. కోలీవుడ్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. దీంతో షో పట్ల భారీగా అంచనాలు పెరిగాయి. జోవిక బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టగానే అందరూ స్టార్ కిడ్, బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి తీసుకున్నారు అనుకున్నారు కానీ ఆమె ఆడుతున్న విధానం చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.18 ఏళ్ళ వయసులో ఆమె బ్యాలెన్స్, మెచ్యూరిటీ లెవెల్స్ మామూలుగా లేవని మెచ్చుకుంటున్నారు. ప్రతి మాటలో ఫైర్ ఉంటుంది. మాటల్లో తడబాటు ఉండదు. చెప్పాల్సిన విషయాన్ని పర్ఫెక్ట్గా చెబుతుంది. ఇలా తన గేమ్ ప్లాన్‌తో ఆమె దూసుకుపోతుంది. జోవికా కోసం షకీలా ఫైట్ ఇలాంటి సమయంలో ఆమె తండ్రి ఎవరు..? సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీంతో జోవికా వ్యక్తిగత జీవితం గురించి బిగ్ బాస్ ప్రేక్షకులలో పెద్ద చర్చనీయాంశమైంది. జోవిక వనిత మొదటి భర్త ఆకాష్‌కి పుట్టిన కూతురు. అయితే గతంలో వనిత రెండో భర్త చేసిన వాదన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. జోవికా తండ్రి ఆకాష్ కాదని, ప్రేమికుడని చెప్పాడు. ప్రస్తుతం జోవికా బిగ్ బాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఇది నచ్చన కొందరు పీఆర్ టీమ్ వారు ఇలాంటి విషయాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి షకీలా స్పందించి తెరపైకి వచ్చింది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిపై ఫైర్ అయింది. జోవికా తండ్రి ఆకాష్ అని షకీలా బలంగా చెప్పింది. అనుమానాలు లేవనెత్తే వారిని పరుషమైన భాషలో షకీల తిప్పికొట్టింది. అడిగేవారికి వేరే పని లేదు. ఇతరుల బెడ్రూమ్లలోకి వచ్చి చూస్తున్నారా..? అంటూ విరుచుకుపడింది. జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు: షకీలా 'జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు. జోవికాకు ఒక సోదరితో పాటు ఒక సోదరుడు ఉన్నారు. జోవికా పుట్టిన సమయం నుంచి నాకు తెలుసు. ఇదంతా చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఇలాంటి తప్పుడు మాటలు అంటే ఎదుటి వారు భాద పడుతారని కూడా ఎలా కామెంట్లు చేస్తారు..? ఏమీ ఆలోచించకుండా ఇతరుల బెడ్రూమ్లలోకి చొరబడే వారి కోసమే నేనొకటి అడుగుతున్నా.. ఇంతకూ నీ తండ్రి ఎవరు..? ఒకసారి సమాధానం చెప్పండి. పిల్లల తండ్రి ఎవరో తల్లికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి ఆకాష్. జోవిక పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె పేరు పెట్టే రోజు నేను అక్కడ ఉన్నాను. 18 ఏళ్లు నిండిన పిల్లపై ఇలాంటి మాటలా..? ఆ చిన్నారిని ఎవరూ బాధపెట్టకూడదు. గతంలోనే జోవికా తల్లి చెప్పింది.. ఆ పాపకు తండ్రి ఆకాష్ అని. అంతకంటే ఇంకేం కావాలి..? జోవికాకు పెళ్లి చేయాలి, నాన్న ఎవరో కూడా తెలియదని ఆమెపై నిందలు వేస్తే ఎలా..? అలాంటి వారు నా ముందుకు వస్తే కచ్చితంగా కొడతాను.' అని షకీలా హెచ్చరించింది. చిన్న వయసులోనే చదువు మానేసినా జోవికా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని షకీలా కూడా చెబుతోంది. షకీలా తన జీవితంలోని అనేక దశలలో వనితతో ఓదార్పుగా ఉండేది. వారిద్దరూ 20 ఎళ్లకు పైగా మంచి స్నేహితులు. -
నా కుటుంబమే నరకంలోకి తోసింది: షకీలా
దక్షిణ భారత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో షకీలా అంటే పెద్ద సంచలనమే. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే.. ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన సినిమాను వాయిదా వేసుకోవాల్సిందే.. అలా ఆమె సినిమాల దాటికి భారీ చిత్రాలే కొట్టుకుపోయాయి. తమిళనాడుకు చెందిన షకీలా సౌత్ చిత్రసీమను తన గ్లామర్‌తో ఊపేసింది. ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి. అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. అంతేకాకుండా తనకు వచ్చే సంపాదనలో కొంతమేరకు సామాజిక సేవా రంగంలో కూడా ఆమె ఖర్చుచేస్తుంది. కుటుంబ పోషణ కోసం షకీలా చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని షకీలా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పింది. తన సినిమా కెరియర్‌తో పాటు జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా షకీలా షేర్ చేసుకుంది. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రపంచం ఆమె ప్రతిభను సరిగ్గా వినియోగించుకోలేదని. కేవలం తన బాడీ బ్యూటీని చూపించి డబ్బు సంపాదించేందుకే ఉపయోగించుకున్నట్లు ఆమె మరోసారి గుర్తుచేసింది. డబ్బు కోసం తన శరీరాన్ని మొదట ఉపయోగించింది తన సొంత తల్తే అని షకీలా వెల్లడించింది. గతంలో ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా ఇదే విషయాన్ని చెప్పింది. ఆమ్మ వల్లే మగవాళ్లతో పరిచయం షకీలా మాట్లాడుతూ.. 'చిన్న వయసులోనే నేను బలంగా కనిపించేదానిని. వయసుకు మించి నా హైట్ ఉండేది. నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదాన్ని. దారిలో చాలా మంది నన్ను తదేకంగా చూసేవారు. కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో డబ్బు పెద్ద సమస్యగా ఉండేది. మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునేదానిని కాదు.. కానీ ఆ సమయంలో ఆమ్మ కొట్టేది. నాకు వేరే మార్గం లేక నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదానిని.' అని షకీలా అన్నారు. ఈ ఇంటర్వ్యూలో, షకీలా మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోకి రాకముందు కూడా, డబ్బు కోసం తన కుటుంబం తనను పురుషుల గదికి పంపేదని చెప్పింది. ఏం చేయాలో తెలియక షకీలా అందుకు సిద్ధపడిందని ఆ మాటలను బట్టి అర్థమవుతోంది. 'మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగా చాలా డబ్బు సంపాదించారు. నన్ను అదే దారిలో వెళ్లమన్నారు. కానీ నేను సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నా శరీరం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచేవారు. అందుకు నాకు చాలా బాధగా ఉండేది. ఆర్టిస్ట్‌గా ఉండే అర్హతలు నాకు ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కోరుకోలేదు. కెమెరా ముందు నన్ను కీలుబొమ్మలా వాడుకున్నారు' అని షకీలా అన్నారు. తన జీవితంలో తన సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. అమె మరికొన్ని రోజులు ఉండుంటే ఆమెకు మరికొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బును పలు సామాజిక సేవలకు ఉపయోగించేదని ఆమె అభిమానులు చెప్పుకొచ్చారు. -
షకీలా 2 వరాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
-
షకీల పారితోషికం ఎంతో తెలుసా? హౌస్‌లో అందరికంటే ఎక్కువ!
బిగ్‌బాస్ షో.. ఇక్కడికి కొందరు పేరు కోసం వస్తారు. మరికొందరు డబ్బు కోసం వస్తారు. కానీ కొందరే మంచి పేరుతో బయటకు వెళ్తుంటారు. మిగతావాళ్లంతా అప్పటివరకు ఉన్న పేరును కూడా చెడగొట్టుకుంటారు. తమ ప్రవర్తనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుని అప్రతిష్టపాలవుతారు. అందుకే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఎంతోమంది దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అతికొద్ది మంది మాత్రమే ట్రై చేస్తే పోలా అని హౌస్‌లో అడుగుపెడతారు. అలా ఈ సీజన్లోనూ ఓ కంటెస్టెంట్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఆవిడే షకీలా. కేవలం తనకు పిలుపు వచ్చింది కదా అని ఏడో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఒక రకంగా ఆమె ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచే జరిగింది. శృంగార తారగా అప్పటివరకు గుర్తింపు ఉన్న ఆమె.. బిగ్‌బాస్ పుణ్యమా అని షకీలా అమ్మగా మారింది. పద్ధతిగా రెడీ అవుతూ, అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ, కుటుంబ పెద్దగా ఎంతో హుందాగా వ్యవహరించింది. అయితే నామినేషన్స్ అంటే చాలు బెంబేలెత్తిపోయేది షకీలా. చివరకు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్న ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరి బిగ్‌బాస్ నుంచి షకీలా ఎంత డబ్బు తీసుకుందనుకుంటున్నారు? అక్షరాలా మూడు లక్షల 75 వేలు. ఇది రెండు వారాలకు అనుకునేరు, కాదు! ఆమె ఒక్క వారానికే మూడున్నర లక్షల పై చిలుకు పారితోషికం తీసుకుంది. ఈ లెక్కన ఆమె రెండు వారాలకుగానూ దాదాపు రూ.7 లక్షల పైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: గీతూ సూటి ప్రశ్నలు.. నువ్వేంటి నన్ను అడిగేదని షకీలా ఫైర్.. రతికా గురించి ఏం చెప్పిందంటే? షకీలా ఎలిమినేట్.. కొన్నాళ్లు ఈమెని ఉంచాల్సింది! -
ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా
బిగ్‌బాస్ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్ లైన్లో ఉంది ప్రిన్స్ యావర్ అనుకున్నారు. కారణం కిరణ్‌లాగే అతడికి కూడా తెలుగు రాదు. ఇంకేముంది, తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం అని అందరూ ఊహించారు. కానీ ప్రిన్స్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఊహించినట్లే జరిగింది.. గేమ్‌లో ఫైర్‌బ్రాండ్‌లా ఆడుతూ చెలరేగిపోయాడు. తన టీమ్‌ను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ప్రిన్స్ గ్రాఫ్ పెరిగి సేఫ్ జోన్లో అడుగుపెట్టాడు. ఇక హౌస్‌లో పెద్దగా ఏ గొడవల జోలికి పోని షకీలా ఎలిమినేట్ కావచ్చని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. రెండో వారం షకీలా అమ్మ ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. నువ్వేంటి నన్ను అడిగేది? షకీలా ఫైర్ గీతూ రాయల్ అడిగే పదునైన ప్రశ్నలకు అంతే పదునుగా సమాధానాలిచ్చింది. హౌస్‌లో మీరు శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా? అని అడగ్గా నేను బ్యాచ్‌లో ఉన్నానని చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అని గీతూపై ఫైర్ అయింది. హౌస్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అని అడగ్గా తానేదీ ప్లాన్ చేయలేదని చెప్పింది. పిలిస్తే వచ్చాను తప్ప ఏదో ఆశయం పెట్టుకుని ఇక్కడకు రాలేదని పేర్కొంది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గురించి కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడింది. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది 'అమర్ దీప్.. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రిన్స్ యావర్.. వెధవ, కేవలం తనకున్న బాడీని ఉపయోగించి శారీరక బలంతో అంచెలంచెలు ఎదుగుతానంటే అది అసాధ్యం. పల్లవి ప్రశాంత్.. బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. పాపులారిటీ అనే డ్రగ్ ప్రశాంత్‌కు ఎక్కేసింది. ఆట సందీప్ హౌస్‌లో ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తి. రతిక అందంగా కనిపించే పాము.. నేను చస్తే హౌస్‌లో ఉన్న 14 మంది రావాలి. అదీ నాకు కావాల్సింది' అని చెప్పుకొచ్చింది షకీలా. -
షకీలా ఎలిమినేట్.. ప్రోమోలోనే తెలిసిపోయిందిగా!
బిగ్‌బాస్ తెలుగు 7లో మరొకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేపు గణపతి పండగ కావడంతో వినాయకుని పాటతోనే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. కంటెస్టెంట్లతో ఈరోజు ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఆటలో మీకు ఎవరు భళ్లాల దేవ? ఎవరు కట్టప్ప? అని ఆట ఆడించాడు. ప్రియాంక.. శివాజీని కట్టప్పగా పేర్కొంది. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్క్రీన్‌పై కాస్ట్యూమ్ కనిపిస్తుంది. ఆ కాస్ట్యూమ్ చూసి అదేం సినిమానో గుర్తు చేయాలి. ఇలాంటి ఫన్ గేమ్‌లు ఇస్తే మనోళ్లకు తెగ సంబరం.. పోటీపడి మరీ ఆడారు. మధ్యలో తేజ ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్పు వేస్తానని ట్రై చేసి తన పరువు తానే తీసుకున్నాడు. చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ప్రశాంత్, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, తేజకు కొమ్ములు పెట్టారు. అయితే అదే ప్రోమోలో షకీలా పక్కన తేజ, ప్రశాంత్ కొమ్ము లేకుండా కనపడ్డారు. మరో ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిన వ్యక్తి వెనకాల వెళ్తూ కనిపించారు. వారిలో శోభా, గౌతమ్ ఉన్నారు. మిగిలిందల్లా షకీలా ఒక్కరే.. దీంతో షకీలా అమ్మ ఎలిమినేట్ అయిందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. చదవండి: హర్ష సాయి హీరోగా మెగా మూవీ.. టీజర్ చూశారా? డైలాగులు అదిరిపోయాయి! -
బిగ్‌బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అన్న రేంజ్లో యాక్టింగ్ చేస్తున్నారు. కొందరు నిజాయితీగా ఆడుతుంటే మరికొందరు పక్కవాళ్లను తొక్కేయాలనే ఆలోచిస్తున్నారు. ఆడటం చేతకానివాళ్లు ఫుటేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. ఈ షో ఫస్ట్ వీక్‌లో తెలుగు రాని కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ నామినేషన్స్‌లో ఉన్నారు. తెలుగు రాని ప్రిన్స్ ఎలిమినేట్ కావచ్చని అంతా అనుకున్నారు. కానీ తన ఆటతో చెలరేగిపోయి ఆటగాడినే అని నిరూపించుకున్నాడు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యేట్లు కనిపించడం లేదు. మిగిలినవారిలో షకీలా, తేజకు తక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపిస్తోంది. తేజ అంతో ఇంతో కామెడీ చేస్తున్నాడు, కానీ షకీలా పెద్దగా పర్ఫామెన్స్ చేసిందే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షకీలాను ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శృంగార తారగా ముద్ర పడ్డ షకీలా.. బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చి తాను కూడా అందరిలాంటే సాధారణ మహిళే అని నిరూపించింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతానని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. ఎటువంటి గొడవలకు పోకుండా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది. నిజాయితీగా గేమ్ ఆడిందే తప్ప కంటెంట్ ఇవ్వాలని ఎక్కడా అతి చేయలేదు. ఈ షోకి వచ్చి షకీలా అమ్మగా పేరు తెచ్చుకుంది. చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో.. -
ప్రియుడి వల్ల ప్రెగ్నెన్సీ.. అమ్మ అబార్షన్ చేయించింది: షకీల
బోల్డ్, అడల్ట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితమైంది షకీలా. సౌత్‌లో దాదాపు అన్ని భాషల్లో నటించిన ఈమె రియల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఒకరిని ప్రేమించి గర్భం దాల్చగా చివరకు అబార్షన్ చేయించుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్లో పాల్గొన్న ఆమె ఈ షోకి వెళ్లడానికి ముందు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్నవయసులోనే ప్రెగ్నెన్సీ షకీలా మాట్లాడుతూ.. 'నేను గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాను. నా బాయ్‌ఫ్రెండ్ వల్ల నేను గర్భం కూడా దాల్చాను. కానీ అప్పుడు నాది చిన్నవయసు కావడంతో అబార్షన్ చేయించుకున్నాను. మా అమ్మకు నేను అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదు కూడా! అందుకే తీసేయించుకున్నాను. నేను చేసింది సరైనదే అని నా అభిప్రాయం. నిజానికి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే నాకు పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేవి కావు. కొన్నిసార్లు ఆలస్యమయ్యేవి. లోపాలు రావచ్చు, అందుకనే.. అందుకే లైట్ తీసుకున్నాను. కానీ మా అమ్మ మాత్రం నా పొట్టను అదే పనిగా గమనించింది. ఏమైందని అడిగితే ఏం లేదని చెప్పి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి అబార్షన్ చేయించింది. నేను పిల్లల్ని కనేందుకు అది సరైన సమయం కాదని తను భావించింది. ఒకవేళ కాదని నేను ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో లోపాలు ఉండవచ్చు. అందుకే అబార్షన్ చేయించుకుని మంచి పనే చేశాను. అప్పుడు ప్రేమించి వ్యక్తితో నేనిప్పటికీ టచ్‌లో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి అమ్మగా కాగా తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసిన షకీలా తర్వాతి కాలంలో ఆ ఇమేజ్ను చెరిపేసుకునేందుకు ప్రయత్నించింది. కుక్ విత్ కోమలి రెండో సీజన్లో పాల్గొంది. తనలోని పాకశాస్త్ర నైపుణ్యాన్ని వెలికి తీసింది. అంతేకాకుండా తన ఇమేజ్ను మార్చుకునే ప్రయత్నం చేసింది. ఈ షోలో పాల్గొన్నప్పటి నుంచి షకీలా కాస్త షకీలా అమ్మగా మారింది. కన్నడ బిగ్‌బాస్ 2లోనూ పాల్గొన్న ఈమె ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ షో 7లో ఉంది. చదవండి: రాజకీయ ఎంట్రీకి అంతా ముందే సిద్ధం చేసుకుంటున్న దళపతి! -
శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ ఎప్పుడు ఏం చెప్పినా చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు కంటెస్టెంట్లు. అయితే వీరు అలర్ట్‌గా ఉన్నప్పుడు కాదు, తనకు నచ్చినప్పుడు మాత్రమే టాస్కులు పెడతా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు బిగ్‌బాస్. మరి అప్పటివరకు చేసేదేంటి చెప్మా? అని హౌస్మేట్స్ బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. కొందరు ఇంటి పనులు చేస్తుంటే మరికొందరు అప్పుడప్పుడు ఏదో ఒక పని చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం.. ఇలా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ పోతున్నారు. శివాజీ ప్లాన్ అమల్లో పెట్టిన షకీలా అయితే స్వతాహాగా నటుడైన శివాజీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకుని షకీలాకు చెత్త ఐడియా ఇచ్చాడు. రాత్రిపూట దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేయాలన్నాడు. రాత్రిపూట అందరి నిద్ర పాడు చేయడం కరెక్ట్ కాదేమో అని క్షణమైనా ఆలోచించలేదు షకీలా. శివాజీ చెప్పినదానికి తలూపుతూ అర్ధరాత్రి ప్లాన్ అమల్లో పెట్టింది. నిద్రలో నుంచి సడన్‌గా లేచి కళ్లు పెద్దవి చేస్తూ, ఎవరో వస్తున్నారని మాట్లాడుతూ అందరినీ హడలెత్తించింది. షకీలాను చూసి వణికిపోయిన తేజ ఈ ప్రాంక్‌కు సృష్టికర్త అయిన శివాజీ.. ఏం కాలేదమ్మా, ఎవరూ రాలేరని బుజ్జగిస్తూ ఆమెను నిద్రపుచ్చాడు. అదంతా డ్రామా అని తెలియని మిగతా కంటెస్టెంట్లు మాత్రం దడుసుకుని చచ్చారు. టేస్టీ తేజ అయితే షకీలా సడన్‌గా లేచి ఏదేదో మాట్లాడటం చూసి వణికిపోయాడు. ఆమె ప్రవర్తన చూసిన హౌస్మేట్స్ భయంతో రాత్రంతా జాగారం చేశారు. ఏదైనా ప్రాంక్ చేస్తే అందరూ నవ్వుకునేలా ఉండాలే కానీ తిట్టుకునేలా ఉండకూడదు. కానీ వీళ్లు చేసిన పని వల్ల ఇంటిసభ్యులంతా నిద్రకు దూరమయ్యారు. నామినేట్ చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్ తీరా చావు కబురు చల్లగా చెప్పినట్లు తెల్లవారుజామున షకీలా అదంతా ప్రాంక్ అని దామినితో చెప్పుకొచ్చింది. షాకైన దామిని రాత్రిపూట అలా చేయడం చాలా తప్పు అని ముఖం మీదే చెప్పేసింది. దీంతో ఓ క్షణంపాటు తాను చేసింది తప్పేమోనని ఆలోచనలో పడ్డ షకీలా.. ఈ కారణంతో నామినేట్ చేస్తే ఊరుకునేది లేదంది. నామినేషన్స్ కోసం కారణాలు వెతుక్కునే కంటెస్టెంట్లకు ఈ ప్రాంక్ ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా దొరకనుంది. శివాజీ మాట విని షకీలా తన కొమ్మను తానే నరుక్కున్నట్లయింది. నిజంగా తనకు ఏదైనా జరిగినా ఇకపై ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. చదవండి: 'రెమ్యునరేషన్ సగం వెనక్కిచ్చేశాడు, ఇంకేం చేయాలి.. అలాంటి వ్యక్తితో ఇకపై విజయ్ సినిమాలు చేయడు!' -
మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను తల్చుకుని ఏడ్చేసిన రతిక.. పల్లవి ప్రశాంత్ ఫేక్!
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. బిగ్‌బాస్ టాస్క్ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఆడుతున్నారు. ఐదువారాల ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని బిగ్‌బాస్ ఆశ పెట్టగానే హౌస్హేట్స్ మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు మెప్పించగా మరికొందరు ఓవరాక్షన్ చేశారు. మరోపక్క అల్లరిపిల్లగా కనిపించే రతిక మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇంతకీ తాజా(సెప్టెంబర్ 7) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో ఓసారి చూసేద్దాం.. లేడీ గెటప్‌లో ప్రిన్స్ బిగ్‌బాస్ తనను ఇంప్రెస్ చేసినవారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే ఛాన్స్ ఇస్తానన్నాడు. దీంతో అమర్దీప్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో, రతిక.. బ్రహ్మీ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని తనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్‌బాస్‌ను చెడామడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు. తనకు కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరకడంతో యాక్టింగ్ పేరుతో బిగ్‌బాస్‌ను నానామాటలు అని, అడ్డొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు. మెలికలు తిరిగిన రతిక అటు గౌతమ్‌ను శివాజీ బీపీ చెక్ చేయమని, రతికను స్టెతస్కోప్‌తో అందరి గుండె ఏం చెప్తుందో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్‌బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు. మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా.. అంటూ పాట పాడుతూ పరికిణీలో స్టెప్పులేసింది. ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్‌బాస్ రతికను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది. అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది. ఏళ్లుగా మిస్ అవుతున్నా ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని బిగ్‌బాస్ అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుంది. 'మిస్ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్ ఫీలింగ్ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్ అవుతున్నాను. ఈ టాపిక్ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్‌బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని పేర్కొంది. దీనికి బిగ్‌బాస్ బదులిస్తూ.. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్ అని పాట ప్లే చేశాడు. ప్రశాంత్ ఫేక్.. అనంతరం షకీలాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గాసిప్స్ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీంతో షకీలా మాట్లాడుతూ.. 'ప్రశాంత్ స్ట్రాంగ్, కానీ ఫేక్ అనిపిస్తుంది. రతిక.. ప్రశాంత్‌ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. గౌతమ్- శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలూ ఫేక్ రిలేషన్సే..' అని పేర్కొంది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగ్ ఇచ్చిన బ్యాడ్జ్‌లను తాజా ఎపిసోడ్లో పంచాడు. పెరుగన్నం బ్యాడ్జ్ శుభశ్రీకి ఇచ్చాడు. ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్‌కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. బర్గర్ బ్యాడ్జ్‌ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు. డాక్టర్‌బాబు- మోనితల ట్రాక్ ఇంతలో తేజను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఇంట్లోని గాసిప్స్ గురించి ఆరా తీశాడు. 'శోభాకు కనెక్ట్ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్‌బాబు- మోనితల గురించి హౌస్‌లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్‌ను ఫేక్ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ ఎపిసోడ్లో బిగ్‌బాస్ తనను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. చదవండి: ఐ బొమ్మ వార్నింగ్ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్! -
హీరోయిన్ను డైరెక్ట్‌గా ముద్దు పెట్టమని తేజ గోల.. చివరికి సాధించాడుగా!
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు షురూ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందునుంచీ బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్మేట్స్ తెగించి ఉన్నారు. ఓ పక్క టాస్కుల్లో ఉత్తేజంగా ఆడుతూనే మరోపక్క తోటి కంటెస్టెంట్లతో బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే యమ జోరుగా ఉన్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. హౌస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్ రతిక రోస్‌ను బుట్టలో పడేశాడు. తన మనసే ఇచ్చేస్తానని రతిక అనడంతో ప్రశాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాజాగా టేస్టీ తేజ కూడా ఇలాంటిది తనకేమైనా వర్కవుట్ అవుతుందేమోనని ప్లాన్ చేశాడు. శుభశ్రీ రాయగురు తేజను అమ్మాయిలా రెడీ చేసేందుకు రెడీ అయింది. అతడి ముఖానికి మేకప్ అద్ది, పిలకజుట్టు వేసింది. అనంతరం లిప్‌స్టిక్ పూస్తుండగా డైరెక్ట్‌గా పెదాలతో లిప్‌స్టిక్ వేయొచ్చుగా అని అడిగాడు. తేజ మాటలు విని షాకైన శుభశ్రీ.. అలాంటి పప్పులు ఉడకవంటూ అతడి చెంపపై లిప్‌స్టిక్ రుద్దింది. అయినా సరే తేజ పట్టువిడవకుండా తనకు డైరెక్ట్‌గా లిప్‌స్టిక్ కావాలని గోల చేశాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా.. ఓస్ అంతేనా.. అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్‌స్టిక్ మరకలు పడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని చెప్పుకొచ్చింది షకీల. చదవండి: బిగ్‌బాస్: కండబలం కంటే బుద్ధిబలం గ్రేట్ అని నిరూపించారు! -
అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..
ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు.. అన్నట్లుగా బిగ్‌బాస్ ఏడో సీజన్లోనూ ఎన్నో వింతలు- విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో కళకళలాడే హౌస్‌లో ఈసారి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. పోనీ వారికి సకల సౌకర్యాలు కల్పించారా? అంటే.. అదీ లేదు! 14 మందికి సరిపడా బెడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఈ బెడ్స్ సంపాదించుకోవడానికి ఏదో టాస్క్ పెట్టేట్లు ఉన్నాడు బిగ్‌బాస్. అందరితో కలిసిపోయిన టేస్టీ తేజ అదేదో ఈపాటికే చేసి ఉంటే కంటెస్టెంట్లకు కొంత ఉపశమనం లభించేది, కంటి నిండా నిద్రపోయే భాగ్యం దక్కేది. ఇకపోతే ఈ వారం శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్, షకీలా, దామిని నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో టేస్టీ తేజ సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయాడు. అలాగే అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ గొడవలు కూడా పెట్టేస్తున్నాడు. యూట్యూబ్‌లో సెలబ్రిటీలతో భోజనాలు చేస్తూ ఇంటర్వ్యూ చేసే అతడు తాజాగా హౌస్‌లో షకీలాను సైతం ఇంటర్వ్యూ చేసి తన మనసులో సందేహాలను తీర్చేసుకున్నాడు. అసలు మీరెందుకు అలాంటి సినిమాలే చేశారు? అని అడిగాడు. 500కు పైగా సినిమాలు దీనికి షకీలా స్పందిస్తూ.. ఆ సమయంలో నాకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయాను. అప్పట్లో నాకు అడల్ట్ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకుముందు చిన్నచిన్న గ్లామర్ చిత్రాలు చేశాను. నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు.. అలాంటి సినిమాల్లో చేస్తే తప్పేంటనిపించింది అని బదులిచ్చింది. అలాంటి సినిమాలు ఎన్ని చేశారని అడగ్గా.. 500కు పైగా చేశానంది షకీలా. మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా? అని అడగ్గా.. డబ్బులు బాగా వచ్చేవి కదా.. అందుకే ఏమీ అనలేదు. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటి? అని అడిగేసరికి తేజ తన ప్రశ్నల పరంపరకు చెక్ పెట్టాడు. ట్రాన్స్జెండర్లే తన పిల్లలు అయితే తన సొంత సోదరే తన దగ్గరున్న డబ్బంతా తీసుకుని మోసం చేసిందని బిగ్‌బాస్ షో లాంచ్ రోజే తన ఏవీలో చెప్పుకుని బాధపడింది షకీల. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ట్రాన్స్జెండర్లను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది. 2014లో కన్నడ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. కానీ నెల రోజులు తిరగకముందే ఎలిమినేట్ అయింది. చదవండి: అదితి శంకర్ రచ్చ.. నెక్స్ట్ టార్గెట్ విజయ్? అంటూ కామెంట్స్.. -
నాన్న కొట్టాడు, సినిమాలు లేక నాలుగేళ్లు ఖాళీగా ఉన్నా: షకీల
బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. షకీలా తల్లిది నెల్లూరు, తండ్రిది చెన్నై. తన ఫ్యామిలీ గురించి షకీల మాట్లాడుతూ.. 10వ తరగతి ఫెయిల్ కావడంతో తండ్రి చితకబాదాడు. ఆయన మేకప్‌మెన్ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్ స్మితను చూశాను. నన్ను సిల్క్ స్మిత చెల్లెలిగా సెలక్ట్ చేశారు. చాలా సినిమాల్లో నన్ను దుస్తులు విప్పేయమంటున్నారు నాన్న అని చెప్తే.. చేయనని చెప్పేయ్ అని సులువుగా అనేవారు. నాన్న చనిపోయాక హాట్ రోల్స్ చేశాను. నా డబ్బులన్నీ మా అక్క చూసుకునేది. తను బాగుపడింది. నా సినిమాకు సెన్సార్ ఇవ్వకుండా ఆపేశారు. నాలుగేళ్లు ఖాళీగా ఉన్నాను. నేను నేనుగా ఉండటమే నా బలం' అని చెప్పుకొచ్చింది. షకీల 50 మందికి పైగా ట్రాన్స్జెండర్ల బాగోగులు చూసుకుంటోంది. వారిలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు స్టేజీపైకి వచ్చి షకీల గురించి చెప్తూ ఎమోషనలయ్యారు. -
'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే
తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'బిగ్‌బాస్'. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి కాగా, తాజాగా ఆదివారం ఏడో సీజన్ అట్టహాసంగా మొదలైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. తనదైన మార్క్ చమత్కారాలతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ఎంటర్టైనింగ్గా నడిపించారు. స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ షోకి ఎవరెవరు వచ్చారు? లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇకపోతే 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్‌తో హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. ఈ సీజన్ అంతా కూడా ఎవరి ఊహకు అందని విధంగా ఉల్టా పల్టాగా సాగబోతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక హౌసులోకి తొలి కంటెస్టెంటుగా 'జానకి కలగనలేదు' సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టింది. తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ 7వ సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా 'జానకి కలగనలేదు' సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా ఈసారి గెలిచే.. హౌస్ నుంచి బయటకు వెళ్తానని శపథం చేసింది. ఈమె స్వతహాగా యూట్యూబర్ కావడంతో స్వయంగా బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి తిరిగి చూపించింది. అయితే ఈసారి హౌసులో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్నిచర్, హౌసులో ఉండే అర్హత కూడా మీరే సంపాదించుకోవాలి అని నాగార్జున ప్రియాంకతో చెప్పుకొచ్చారు. ఎవరీ ప్రియాంక? పేదింట పుట్టిన ప్రియాంక జైన్ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ప్రస్తుతం తను నటిస్తున్న ఓ సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి ప్రియాంక ఇక్కడ కూడా ఓ వెలుగు వెలుగుతుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి.. ఫస్ట్ టాస్క్ ఇచ్చేసిన నాగ్ హాలోగ్రామ్ ద్వారా హౌసు లోపలికి వెళ్లిన నాగార్జున.. ప్రియాంకని యాక్టివిటీ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పిన హౌస్ట్ నాగార్జున. వీకెండ్ మాత్రమే కాదు ఇకపై ప్రతి క్షణం హౌసులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తానని చెప్పారు. అలానే ఓ సూట్ కేసు చూపించి, ఎవరికీ కనిపించకుండా దాన్ని దాచేయమని నాగ్.. ప్రియాంకతో చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అది దొరికితే అందులో ఉన్న పవర్ వాళ్లకు దక్కుతుందని నాగ్ చెప్పారు. దీంతో జైలు వాష్ రూమ్ లోని కమోడ్ వెనక ప్రియాంక ఆ సూట్ కేసుని దాచిపెట్టింది. రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ బిగ్ బాస్ హౌసులోకి రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ హీరో శివాజీ ప్రవేశించారు. పలు తెలుగు సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చాలారోజుల నుంచి సినిమాల్లో నటించట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎవరీ శివాజీ? బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారాడు శివాజీ. హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయి నుంచి హీరో రేంజ్‌కు ఎదిగాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్ రిలీజైంది మాత్రం మాస్టర్. ఈ సినిమాకుగానూ అతడు రూ.15 వేలు అందుకున్నాడు. అందరు కుర్రాళ్లలాగే ఆ డబ్బుతో అమ్మకు బంగారం కొనిచ్చాడు శివాజి. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్ర, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. నితన్కు జయం, దిల్, సంబరం సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. రాజకీయాల్లో ప్రవేశించాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్ నటుడిగా తన తొలి చెక్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని శివాజీ అప్పటి రోజులని గుర్తుచేసుకున్నారు. అలానే నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి గ్లామర్ విషయంలో తనకు తిట్లు పడతుంటాయని అన్నారు. ఇకపోతే కోడిపిల్లల్ని పెంచి, సంక్రాంతికి వాటిని అమ్మి తమని పోషించేదని శివాజీ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొనిచ్చాని శివాజీ చెప్పుకొచ్చాడు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామిని.. మూడో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాస్ట్ బేబీ పాటతో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎవరీ దామిని? పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దామిని. ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయినా తర్వాతి కాలంలో తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. దామిని సోదరి మౌనిమ సైతం సింగర్‌గా రాణిస్తోంది. ఈమె బాహుబలి: ద కన్‌క్లూజన్‌లో పాటలు ఆలపించింది. కాగా దామిని.. 2011లో పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు సినిమాలో పాడే అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా పాటలే కాకుండా సొంతంగా ఆల్బమ్స్ కూడా చేస్తోంది దామిని. స్టేజీ షోల ద్వారా సైతం తన గాత్రంతో సంగీతప్రియులను ఉర్రూతలూగిస్తోంది. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. 'బ్యాడ్ బాయ్' పాటకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు. ఎవరీ ప్రిన్స్ యావర్? ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో ఓ సీరియల్లో నటించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇఇష్టపడతారు. అందుకే వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐదో కంటెస్టెంట్‌గా నటి శుభశ్రీ బిగ్ బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ శుభశ్రీ ప్రవేశించింది. ట్రెండింగ్ సాంగ్ 'సమ్మోహనుడా' స్టెప్పులేసి, గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ శుభశ్రీ? శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్‌గా లాయర్.. కానీ సినిమాలు చేస్తుంది. తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. ఒడిశాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఐదుగురికి ఫస్ట్ టాస్క్ పెట్టిన నాగ్ తొలి కంటెస్టెంట్ ప్రియాంకకు ఇచ్చిన సూట్ కేసులో ఉన్న క్యాష్ తీసుకుని హౌసు నుంచి వెళ్లిపోమని ఆమెకు నాగ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె నో చెప్పి క్యాన్సిల్ చేసుకుంది. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఆ సూట్ కేసుని తీసుకుని బయటకెళ్లిపోవడానికి ససేమిరా అన్నారు. తొలుత రూ.20 లక్షలు, ఆ తర్వాత రూ.25 లక్షలు, అనంతరం రూ.30 లక్షలు అని హోస్ట్ నాగ్ ఆఫర్ చేసినా సరే అందరూ నో అంటే నో అని చెప్పేశారు. ఆరో కంటెస్టెంట్‌గా షకీలా బిగ్ బాస్ హౌసులోకి ఆరో కంటెస్టెంట్‌గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు అయినా ఈమె తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఒకప్పుడు షకీలా అని ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పుకొచ్చింది. అలానే ఈమె చూసుకుంటున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ని(తంగం & షాషా) నాగ్ స్టేజీపైకి పిలిచారు. ఎవరీ షకీలా? బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె గతంలోనూ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బిగ్ బాస్ హౌసులోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చారు. 'దళపతి' పాటకు స్టెప్పులేసి తన గ్రాండ్ ఎంట్రీని చాటుకున్నారు. ఇకపోతే ఈ మధ్య 'నీతోనే డ్యాన్స్' షోలో సందీప్ విజేతగా నిలవడం విశేషం. ఎవరీ సందీప్? టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే! అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి నీతోనే డ్యాన్స్ కప్ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్ అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆట సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్ జరుగుతుందా? ఆట సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి! ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటి శోభాశెట్టి బిగ్ బాస్ హౌసులోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీకదీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. జిమ్మిక్కి పొన్ను పాటకి మంచి స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే శోభాశెట్టితో మాట్లాడిన హోస్ట్ నాగార్జున.. హౌసులో ఎవరైనా సరే బ్యూటీఫుల్ అని చెబితే శోభాకు వీకెండ్ లో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు. ఎవరీ శోభాశెట్టి? శోభా శెట్టి అంటే గుర్తుపడతారో లేదో కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలనే మోనిత అలియాస్ శోభా శెట్టి. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఇంత పాపులారిటీ ఉన్న చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదట! ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్ సాయంతో దాన్ని నెట్టుకొచ్చేదట. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు సీరియల్లో మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైంది. మరి బిగ్‌బాస్ షోతో వారి మనసులు కూడా దోచుకుంటుందేమో చూడాలి! తొమ్మిదో కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ.. బిగ్ బాస్ హౌసులోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ వచ్చాడు. తన గురించి చెబుతూ ఫన్ క్రియేట్ చేశాడు. ఈసారి హౌసులో ఇతడు మంచి కామెడీ జనరేట్ చేస్తాడని ఏవీ చూస్తేనే అర్థమైపోయింది. ఇకపోతే టేస్టీ తేజ.. థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎమ్.టెక్ చేశాడు. ఎవరీ టేస్టీ తేజ? టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. తరచూ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్న ఇతడు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. మరి అతడి కల ఎంతమేరకు నెరవేరుతుందో చూడాలి! పదో కంటెస్టెంట్‌గా నటి రతిక బిగ్ బాస్ హౌసులోకి యువ నటి రతిక.. పదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌసులోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఎవరీ రతిక? రతిక రోజ్ అచ్చ తెలుగమ్మాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ముందుగా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో నటించింది. నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీసాఫీసర్‌గా మెప్పించింది. తనకంటూ ఫేమ్ రావాలని బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి ఈ అమ్మడు ఈ షో ద్వారా ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి! స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ 'ఖుషి' ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ హౌసులోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగ్ తో ఫన్ జనరేట్ చేశాడు. ఇక హీరోయిన్ సమంత ఎక్కడా అని నాగ్, విజయ్ దేవరకొండని అడగ్గా ఆమె అమెరికాలో ఉందని, త్వరలో తిరిగొస్తుందని చెప్పాడు. అలానే సీజన్ ప్రారంభమైన తొలిరోజే ఓ స్టార్.. హౌసులోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫర్నిచర్ టాస్క్.. రూమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇకపోతే హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి పదిమంది కంటెస్టెంట్స్ మధ్య.. గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ పర్యవేక్షణలో ఓ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో స్టోర్ రూమ్ నుంచి ఫర్నిచర్.. బయట మార్క్ చేసిన ప్లేసులో పెడితే అవన్నీ కంటెస్టెంట్స్ కి చెందుతాయని నాగార్జున అన్నారు. అనంతరం వీళ్లలో బాగా కష్టపడిన శుభశ్రీకి డీలక్స్ రూమ్, ఆట సందీప్ కి స్టాండర్డ్ రూమ్ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా హీరో గౌతమ్ బిగ్ బాస్ హౌసులోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 'ఆకాశ వీధుల్లో' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఎంట్రీతోనే చేతికి బేడీలు వేసి, ఓ టాస్క్ కూడా ఇతడికి నాగార్జున ఇచ్చాడు. ఎవరీ గౌతమ్? డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ షోలో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్‌కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. అతడికి ఉన్న ఆసక్తి మేరకు హీరోగానూ మారాడు. ఆకాశవీధుల్లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన అతడు డాక్టర్‌ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి! పన్నెండో కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్ పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ రాథోడ్.. పన్నెండో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తెచ్చిన 'జెమిని' సినిమాలోని పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఎవరీ కిరణ్ రాథోడ్? కిరణ్ రాథోడ్.. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్ వదిలేసుకుంది. 2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి తన రీఎంట్రీకి బిగ్‌బాస్ 7 ఎలా ఉపయోగపడుతుందో చూడాలి! పదమూడో కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ గత కొన్నిరోజుల నుంచి అనుకున్నట్లుగానే యువరైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌసులోకి పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన గురించి ఎమోషనల్ అయ్యాడు. ఎవరీ పల్లవి ప్రశాంత్? వ్యవసాయం అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్.. తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. రైతు బిడ్డను అన్నా.. అంటూ ప్రతిసారి ఎమోషనల్ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్‌కు వెళ్లాలనేది తన కల అని నిత్యం చెప్తూ ఉండే ఇతడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు, అక్కడివరకు బానే ఉంది.. కానీ హౌస్‌లో కూడా సింపథీ ప్లాన్ వర్కవుట్ చేయాలనుకుంటే మాత్రం కష్టమే.. మరి ఇతడి గేమ్ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో తేలనుంది. పద్నాలుగో కంటెస్టెంట్‌గా అమర్దీప్ బిగ్ బాస్ హౌసులోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. 'పూనకాలు లోడింగ్' పాటకు సూపర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ఎవరీ అమర్దీప్? తెలుగబ్బాయి అమర్దీప్. విదేశాల్లో చదువుకున్న ఇతడికి సినిమాలపై ఆసక్తి ఉండేది. మొదట పరిణయం అనే షార్ట్ ఫిలిం చేయగా అది బాగా క్లిక్ అయింది. దీంతో ఆఫర్స్ వచ్చాయి. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ చేశాడు. అక్కడి నుంచి సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేశాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. జనాల్లో పాపులారిటీ పెరగడంతో సీరియల్ హీరోగా మారాడు. అప్పుడప్పుడూ షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం సినిమాలు కూడా చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు అమర్దీప్. అయితే బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఐదో సీజన్లోనే ఇతడు దగ్గరయ్యాడు. అప్పుడు మానస్‌కు సపోర్ట్ చేసేందుకు బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడు అమర్. తన మాటలతో, ప్రవర్తనతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ సీజన్లో రావడం ఖాయం అనుకున్నారంతా! కానీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు షోలో అడుగుపెట్టాడు బుల్లితెర హీరో. గతేడాది నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్న అమర్ భార్యతో కలిసి షోలో పాల్గొంటాడునుకున్నారు. కానీ చివరకు ఒక్కడే వచ్చేశాడు. ఇక పదిహేనో కంటెస్టెంట్ అనే నాగ్ చెప్పేసరికి హీరో నవీన్ పొలిశెట్టి వచ్చాడు. అతడిని హౌసులోకి పంపిన తర్వాత గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ముగించేశారు. సోమవారం ఎపిసోడ్ లో హౌస్‌మేట్స్‌తో అతడు చేసే ఎంటర్ టైన్మెంట్ చూపించనున్నారు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. దాదాపు సోషల్ మీడియాలో వినిపించిన వాళ్లే హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత సీజన్ 20 మంది.. లాంచ్ ఎపిసోడ్లో వచ్చారు. మరి ఈసారి ఆ నంబర్ తగ్గించారా? లేకపోతే మిగిలిన వాళ్లని వారం వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు వాళ్లిద్దరి ఎంట్రీ ఖాయం
-
వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్ చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు. తాజాగా పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి బహిరంగంగానే మాట్లాడింది. (ఇదీ చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) 90వ దశకంలో హాట్ నటిగా వెలుగొందిన నటి షకీలా తమిళంలోనే కాకుండా పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ చిత్రాల్లోనే నటించే షకీలా.. ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన నటనను ప్రదర్శిస్తోంది. తమిళ్ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' షో తర్వాత షకీలా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది. అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది వడివేలు గురించి ప్రేమ ప్రియ కామెంట్ నా సినిమా కెరీయర్ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి. ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళ్తాను.. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్‌తో చెప్పించి వెనక్కి పంపేవారు. ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది.' అని ప్రేమ ప్రియ తెలిపింది. బెదిరించారు ఒక దర్శకుడు నన్ను ఫోన్లో బెదిరించాడు. నేను యూట్యూబ్ ఛానెల్లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్ ఇచ్చారు. అందుకు నేను బయపడలేదు. వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను. 2010లో వచ్చిన విజయ్ 'సురా' సినిమాలో వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం ఏంటో చెప్పరు.' అని ప్రేమ ప్రియ తెలిపింది. వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు వడివేలుపై మీ-టూ ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అని షకీలా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా వడివేల్కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా
ఒకప్పుడు నటి షకీలా ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయి అంటే మలయాళ సూపర్‌స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అంతటి చరిత్ర ఉన్న శృంగార కథానాయకి షకీలా. ఒకప్పుడు మలయాళంలో గంటల కాల్షీట్స్ ఇచ్చి నటించిన మోస్ట్ వాంటెడ్ నటి. (ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!) బహుభాషా నటిగా గుర్తింపు పొందిన షకీలా ఒక సమయంలో చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నం కూడా చేశారు. అదే విధంగా తన జీవిత చరిత్రను కూడా రాసుకున్నారు. అలాంటి నటి ప్రస్తుతం అడపా దడపా వస్తున్న అవకాశాల్లో నటిస్తూ సీరియళ్లలో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నారు. అయితే షకీలా బాగా ఆస్తులు కూడబెట్టారని, బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి వార్తలపై స్పందించిన షకీలా ఒక భేటీలో పేర్కొంటూ నిజమే తాను చాలా ఆస్తులు సంపాదించుకున్నానన్నారు. ఒకప్పుడు రోజుకు రూ.4 లక్షలు తీసుకున్నానని చెప్పారు. అయితే తన సంపాదన అంతా ఆదాయ శాఖాధికారులు సోదాలు చేస్తారని తన సోదరి ఆస్తులు రాయించుకుని మోసం చేసినట్లు తెలిపింది. అలాంటిది తనకు ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు వదంతులు పుట్టిస్తున్నారని.. నిజానికి సొంత ఇల్లు కూడా లేక తాను అద్దె ఇంటిలో ఉంటున్నట్లు నటి షకీలా పేర్కొంది. (ఇది చదవండి: రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్) -
షకీలా గొప్పమనసు.. సంబంధం లేకపోయినా అండగా నిలిచింది!
సౌత్ ఇండస్ట్రీలో షకీలా పేరు తెలియని ఉండరేమో. అంతలా పేరు సంపాదించింది ఆమె. అయితే ఆమె ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. తమిళంలో ప్లేగర్ల్స్ అనే చిత్రంతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయికగా నటించింది. ఆ తర్వాత కిన్నెర తుంబికళ్ అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 110 సినిమాల్లో నటించిన షకీలా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు దక్షిణ చిత్రసీమలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షకీలా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగింది. అయితే గత 15 ఏళ్ల నుంచి అడల్ట్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్య ఉన్న చోటుకు వెళ్లి దాన్ని పరిష్కరించటానికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా షకీల ఓ అపార్ట్మెంట్ వాసులకు అండగా నిలిచారు. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. అందులో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే ఆ అపార్ట్మెంట్ యజమాన్యం వారి నుంచి అక్రమంగా మెయింటెన్స్ వసూలు చేస్తోంది. దాదాపు వారి నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అంత డబ్బులు కట్టలేమంటూ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వారి అపార్ట్‌మెంట్‌కు మాత్రమే నీళ్లు రాకుండా నిలిపేసింది. ఈ చర్యలతో గత మూడు రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. వేధింపులు భరించలేక వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న షకీల అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. షకీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారికి మద్దతుగా నిరసన చేయడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అందరూ మోసం చేశారు, ఎవర్నీ నమ్మను: షకీలా
Shakeela: నటనతో రెండు దశాబ్దాలకు పైగా సినీప్రియులను అలరించింది షకీలా. ఈ మధ్యే ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్ రిలీజవగా అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తనను అందరూ మోసం చేశారని వాపోయింది. ఎవరినీ అంత సులభంగా నమ్మాలనుకోవడం లేదని తెలిపింది. బంధువులు తన దగ్గర ఆర్థిక సాయం పొందిన తర్వాత మోసం చేశారని పేర్కొంది. షకీలా బయోపిక్ డైరెక్టర్ ఇంద్రజిత్ లోకేశ్‌ను గుడ్డిగా నమ్మినందుకు పశ్చాత్తాపపడుతున్నానంది. 'ఇంద్రజిత్ లోకేశ్ సినిమా షూటింగ్ ప్రారంభం అవడానికి ముందు నాతో చర్చించాడు. కానీ తర్వాత అతడికి నచ్చినట్లుగా స్క్రిప్ట్ మార్చేశాడు. ఈ బయోపిక్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. ప్రస్తుతం నా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ సినిమాల్లో కొన్ని సహాయక పాత్రలు చేస్తున్నా. అలాగే దవ్వు మాస్టర్ అనే కన్నడ సినిమా చేస్తున్నా. ఇందులో పెంపుడు కుక్కతో ప్రేమలో పడే మహిళ పాత్రలో కనిపిస్తాను' అని షకీలా చెప్పుకొచ్చింది. -
ఆ వార్తలను నమ్మొద్దు.. వీడియో రిలీజ్ చేసిన షకీలా
చెన్నై: తన గురించి ప్రసారం అవుతున్న వదంతులను నమ్మొద్దని సంచలన నటి షకీలా పేర్కొన్నారు. శృంగార తార షకీలా ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. షకీలా మరణించారన్నదే ఆ వార్త. ఈ ప్రచారంతో షకీలా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. ఈమె మిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తను దత్తపుత్రికతో తీసుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. మిలా లేకపోతే తాను లేను తనకు జీవితమే లేదు తనకు తోడు మిలానే అని షకీలా పేర్కొన్నారు. దత్తపుత్రికతో షకీల (పైల్) Actress #Shakeela dismisses rumors about her and her health.. She is doing absolutely fine..@Royalreporter1 pic.twitter.com/ut41SrRGG4 — Ramesh Bala (@rameshlaus) July 29, 2021 -
సెన్సార్ వద్ద ఇబ్బందులు..అందుకే సొంతంగా ఓటీటీ : షకీలా
నటి షకీలా 1990వ కాలంలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన షకీలా త్వరలోనే డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా తన చిత్రాలతో పాటు ఇతర సినిమాలను రిలీజ్ చేస్తానని పేర్కొంది. తన కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తూ రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన షకీలా ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. డైరెక్టర్ రమేష్ కావలి చెప్పిన స్క్రిప్ట్ తనకు బాగా నచ్చాయని, గోవాలో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతుకాకుండా ఈ రెండు సినిమాల్లోనూ తన కూతురితో కలిసి నటించానని పేర్కొన్నారు. గతంలో ఓ సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకే సొంతంగా తమ ఓటీటీ సంస్థలో సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
నిరుపేదల కడుపు నింపుతున్న షకీలా
చెన్నై: నటనతోనే కాదు.. పేదలకు అన్నం పెట్టి దాతృత్వం కూడా చూపగలనని.. నటి షకీలా నిరూపించుకుంటున్నారు. కరోనా కాలంలో ఆమె సామాజిక సేవకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ.. రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు. -
ప్రేమలో ఉన్నాను..కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : షకీలా
పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఒకానొక దశలో స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే షకీలా సినిమా కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదుడుగులు చవి చూశారు. తనను అర్థం చేసుకునే వాడు దొరకకపోవడంతో.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని పలు సార్లు చెప్పారు షకీలా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. గతంలోనూ తనకు బాయ్ ప్రెండ్స్ చాలామందే ఉన్నారని, అయితే వాళ్లు అందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది. 'ప్రస్తుతం నేను ఒకరితో లవ్‌లో ఉన్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. లవ్ అంటే లవ్ అంతే. ఇప్పటికే 43 ఏళ్లు వచ్చాయి. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పటివరకు ఏడుగురితో రిలేషన్లో ఉన్నా. ఈ వయసులో లవ్ ఏంటి అని అనుకోవాల్సిన పని లేదు. నాకు 43. అతనికి 30 తను నాకంటే చిన్నవాడు. కానీ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అయినా నేను పెళ్లైన వ్యక్తితో లవ్‌లో లేను కదా అతని ఫ్యామిలీని డిస్ర్టబ్ చేయడానికి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇందులో తప్పేం ఉంది' అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఎవరితోనూ సీక్రెట్ రిలేషన్ పెట్టుకోవడం లేదని, ఒకరితో విడిపోయిన తర్వాతే మరొకరితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాని పేర్కొంది. ఇక గతంలో తమిళంలో ప్రసారమయ్యే ఓ షోలో పాల్గొన్న షకీలా..తన కూతురిని పరిచయం చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిల్లా నా కుమార్తె అంటూ ఓ యువతిని పరిచయం చేశారు. అయితే మిల్లా ట్రాన్స్‌జెండర్ అని, చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం డిజైనర్‌గా పని చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇటీవలె షకీలా బయోపిక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఐదు భాషల్లో రిలీజైంది. చదవండి : కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది? -
కాంగ్రెస్‌లోకి నటి షకీలా
టీ.నగర్: ప్రముఖ గ్లామర్ తార నటి షకీలా గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలయాళ చిత్రాల్లో నటించి పేరొందిన షకీలా రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. షకీలా శుక్రవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌కు వచ్చి పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నిర్వాహకులను కలిసి సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈమె శనివారం నుంచి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా..
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. పార్టీల విస్తృత ప్రచారంతో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. తాజాగా ఓ హాట్ బ్యూటీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆలస్యంగానైనా ఓ పార్టీలో చేరారు. ఆమెనే అప్పటి తరాన్ని కవ్వించి సెగలు రేపిన నటి షకీలా. 200కు పైగా సినిమాల్లో నటించి.. శృంగార తారగా పేరుపొందిన షకీలా ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారో వేచి చూడాలి. దక్షిణాది భాషల్లో వందల సినిమాల్లో షకీలా నటించారు. కామెడీ పాత్రలతో పాటు హాట్ సీన్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో షకీలా పని చేయనున్నట్లు సమాచారం. షకీలా సినీ ప్రవేశం 18 ఏళ్ల వయసులో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాలు చేశారు. ఆమె జీవితం ఆధారంగా గతేడాది ‘షకీలా’ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. చదవండి: ‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా
‘షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్. స్టార్ హీరోలకు సైతం దక్కని పాపులారిటీని సొంతం చేసుకున్నారు షకీలా. ఆ తరువాత ఉన్నట్లుండి కెరీర్లో ఢీలా పడ్డారు. కారణం ఏదైనా ఆ తరువాత మాత్రం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. కాగా షకీలా సినిమా కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదుడుగులు చవి చూశారు. తనను అర్థం చేసుకునే వాడు దొరకకపోవడంతో.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు షకీలా. ఇదంతా పక్కనపెడితే గత కొద్ది రోజులుగా తెరకు దూరంగా ఉన్న షకీలా ఇటీవల మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. తమిళ బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘కుకు విత్ కోమలి’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న షకీలా.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓ రోజు ఈ షోలో తన కుమార్తెని పరిచయం చేసి కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు షకీలా. మిల్లా నా కుమార్తె అంటూ షకీలా ఓ యువతిని పరిచయం చేశారు. ఇది చూసి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు. అసలు షకీలా వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఆలోచించడం ప్రారభించారు. ఈ ప్రశ్నలకు షకీలా సమాధానం ఇచ్చారు. మిల్లా తన సొంత కుమార్తె కాదని.. చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నానని తెలిపారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే మిల్లా ట్రాన్స్‌జెండర్. కుమార్తెని పరిచయం చేస్తూ షకీలా భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మిల్లా చిన్నప్పుడే నేను తనని దత్తత తీసుకున్నాను. ఆమెను నా సొంత కూతురిలా పెంచుకున్నాను. కష్టకాలంలో నాకు మిల్లా చాలా సపోర్ట్ చేసింది. నేను కూడా ఆమెకు చాలా సపోర్ట్ ఇచ్చా. నేనంటే ఆమెకు ఎంతో ప్రేమ’’ అన్నారు. కాగా మిల్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా గడుపుతున్నారు. అలగే మోడల్‌గా ప్రయత్నిస్తున్నారు. చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
నేనంటేనే ఇవ్వరు
‘‘షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా బయోగ్రఫీ అంటే ఎంత కష్టపడి సెన్సార్ తీసుకుని ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న విడుదలవుతున్న ‘షకీలా’ సినిమాని ఎంటర్టైన్మెంట్ మోటివ్లోనే చూడండి. ఈ సినిమా నా లైఫ్ గురించి అనే కాదు, కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం జరిగింది’’ అన్నారు షకీలా. నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షకీలా’. రీచా చద్దా, పంకజ్ త్రిపాఠి, ఎస్తర్లు కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లోకేష్ రచించి, దర్శకత్వం వహించారు. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వని, శరవణ ప్రసాద్ నిర్మించారు. ఎస్తర్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. షకీలా లైఫ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. యూఎఫ్ఓ ప్రతినిధి లక్ష్మణ్, రాజీవ్ పిళ్లై, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. -
షకీలా కష్టాలతో...
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్ఓ మూవీస్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘షకీలా’ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్లో చూపించారు. ‘‘బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: సదీప్ మలాని, కెమెరా: సంతోష్ రాయ్ పతజే. -
‘షకీలా’ తెలుగు ట్రైలర్
1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ రాను రాను ఆమె క్రేజీ తగ్గిపోయింది. ఆమె సినిమాలు కనుమరుగైపోయాయి. కొంతమంది ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్ లంఖేష్. బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షకీలా శృంగార నాయికగా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీలక అంశాలతోపాటు ఆమె జీవితంలోని మరిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. -
తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా..
చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని షకీలా అన్నారు. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఆమె బయోపిక్ ఇప్పుడు షకీలా పేరుతోనే ఐదు భాషల్లో రూపొందింది. ఇందులో షకీలా పాత్రలో నటి ఏస్తర్ నటించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి షకీలా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం షకీలా అని తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందుపరచలేదని.. చిత్రానికి ఏది అవసరమో దాన్ని చెప్పినట్లు తెలిపారు. ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమని అన్నారు. తాను చేసిన తప్పులను కూడా ఈ చిత్రంలో చూపినట్లు తెలిపారు. ఈ చిత్రం నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు. అయినా తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమని షకీలా పేర్కొన్నారు. -
‘షకీలా’ సినిమా టీజర్ విడుదల
ముంబై: దక్షిణాది ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్నారు. సామీ మ్యాజిక్ ప్రొడక్షన్లో ఇంద్రజీత్ లంఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ గురువారం విడుదలైంది. తెర వెనుక షకీలా ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇక టీజర్ విషయానికొస్తే.. 1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరు షకీలా. సంక్షోభ సమయంలో 90ల్లో సినిమా హాళ్లను ఆర్థికంగా ఆదుకున్న ఆమె సినిమాలకు అప్పుట్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. అటువంటి నటి జీవితం ఆధారంగా సాగే ఈ సినిమా ఇప్పుడు 2020లో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు థియేటర్లలో వినిపించనుంది అంటూ ఈ టీజర్ సాగుతోంది. (చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ) అయితే 1990లో దక్షిణాది సినీ పరిశ్రమలో శృంగార తారగా రాణించిన షకీలా సంప్రదాయ ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. 16 ఏళ్ల వయసులోనే పరిశ్రమకు వచ్చిన ఆమె అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఇక షకీలా టీజర్ విడుదలైన సందర్భంగా నటి రిచా చద్దా స్పందిస్తూ.. ‘చివరికి ఈ సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా వంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రజల జీవితాల్లో నవ్వును, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్న. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన సినిమా హాళ్లను ఈ ఏడాది షకీలా సినిమాతో సంతోషంగా ముగుస్తుందని ఆశిస్తున్న. దక్షిణాదిన ప్రసిద్ది చెందిన ఆమె కథను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలుసుకోవడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. 1990లో సంక్షోభ సమయల్లో సినిమా హాళ్లకు స్థిరమైన వ్యాపారాన్ని అందించిన ఆమె సినిమాలు.. ఇప్పుడు 2020లో థియేటర్లను కూడా ఆర్థికంగా ఆదరిస్తుందో లేదో చూడాలి కూడా’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. (చదవండి: తనిష్క్ యాడ్‌లో నా జీవితం కనిపిస్తోంది: నటి) -
కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ
తండ్రి ఆమెను చిన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లి బతుకుతెరువుకు ఆమె దేహం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించింది. సొంత అక్క ఆమె సంపాదించినది అంతా తీసేసుకుంది. మగ ప్రపంచం ఆమెను నిండా మోసం చేసింది. నెల్లూరు నుంచి వెళ్లి కేరళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తయారైన సినిమా ‘షకీలా’ ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు షకీలా. షకీలా జీవితానుభవాలు, సినిమాలో అవి వస్తున్న విధం గురించి కథనం. సినిమాలలో సగటు ప్రేక్షకుల వినోదం కోసం ‘క్లబ్ డాన్సర్’ల పేరుతో స్త్రీల శరీర ప్రదర్శన ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అలాంటి పాటలను ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. వాటిని పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు కూడా. కాని గతంలో వాటి కోసంగా వేరే తారలు ఉండేవారు. వారికి సంప్రదాయ ప్రేక్షకుల దృష్టిలో తక్కువ చూపు ఉండేది. హిందీ సినిమాలలో తొలి క్లబ్ డాన్సర్‌గా హెలెన్ చరిత్ర సృష్టించారు. హెలెన్ స్ఫూర్తితో ఆ తర్వాత సౌత్‌లో కూడా చాలామంది తారలు కేవలం క్లబ్ డాన్సర్లుగా తమ కెరీర్లు మలుచుకున్నారు. దక్షిణాది సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, అనురాధ ఆ తర్వాతి కాలంలో సిల్క్ స్మిత చాలా పేరు సంపాదించారు. అయితే ఈ రంగంలో ఉన్న తారలు, ఘర్షణాయుతమైన జీవితం మిగిలిన వారి జీవితాలకు సంబంధించి వెలికి రాలేదు. కాని సిల్క్ స్మిత హటాన్మరణం పెద్ద న్యూస్‌గా మారింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శృంగార నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో సినిమా ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. కాని ఈమె డాన్సర్ కాదు. అది తేడా. నెల్లూరు నుంచి షకీలా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉండే కోట. దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి బంధువులంతా టైలరింగ్ వంటి చిన్న పనులే చేసేవారు. షకీలా తండ్రి చాంద్ బాషా బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. అక్కడే షకీలా జీవితం సినిమా ప్రపంచం వైపు మెల్లగా మళ్లింది. అయితే జీవితం గడవాలంటే అవసరమైన ‘రాజీ’ పడాల్సిందేనని తల్లి షకీలాను ఒప్పించి ఆమెను సినిమా పరిశ్రమలోకి పంపింది. తల్లికి గాని, షకీలాకు గాని చదువు లేదు. మిగిలిన సంతానం కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. 1995లో షకీలా తొలి శృంగార చిత్రం ‘ప్లేగర్ల్స్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన మలయాళ సినిమా ‘కిన్నరతుంబిగల్’ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. షకీలా మద్రాసులో ఉంటూ మలయాళ సినిమాలలో విస్తృతంగా నటించడం మొదలెట్టారు. 30–40 కేంద్రాలు పెద్ద హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తీయాలి. అన్ని సెంటర్లలో బాగా ఆడాలి. కాని షకీలా నటించిన సినిమాలు ముప్పై నలబై కేంద్రాలలో ఓ మోస్తరు ఆడినా డబ్బు వచ్చేసేది. సాధారణంగా షూటింగ్ అయ్యాక సదరు నటీనటులు ఇళ్లకు వచ్చి స్నానాలు చేస్తారు. కాని షకీల షూటింగ్లో ప్రధానమైన సీన్ల షూటింగ్ అయ్యాక దర్శకులు ‘ఒక ఫ్యాంటసీ సీన్’ అనో, ‘ఒక స్నానం సీన్’ అనో అడిగి చివరి గంటల్లో ఆ సీన్లు తీసేవారు. వాటి కోసం షకీల ప్రత్యేకంగా నటించాల్సి వచ్చేది. 1995–2000 మధ్య కాలంలో షకీలా సినిమాలు మలయాళ రంగాన్ని ఊపేశాయి. శృంగార చిత్రాలు ఎవరు నటించినా ‘షకీలా సినిమా’ అనేంతగా ఆమెకు ఇమేజ్ వచ్చింది. ఒక్క భాషలో ఆమె నటిస్తే అన్ని భాషల్లోనూ అవి డబ్ అయ్యేవి. ఇంకా నేపాల్, శ్రీలంకలలో కూడా రిలీజ్ అయ్యేవి. ‘రోజుకు మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి’ అని షకీలా చెప్పుకున్నారు. మలయాళ సూపర్స్టార్లు ఆమె సినిమా కలెక్షన్లు చూసి నామోషీ ఫీల్ అయ్యారని, ఆమె సినిమాలు విడుదల కాకుండా చూశారని ఒక వార్త ఉంది. 2002లో షకీల ఇక మీదట తాను అలాంటి సినిమాలలో నటించనని ప్రకటన చేసి వాటిని విరమించుకున్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆ కెరీర్ సజావుగా లేదు. ఆమె సంపాదించిన డబ్బులో ఏదీ ప్రస్తుతం ఆమె దగ్గర లేదు. ఆమె అతి సామాన్య జీవనం గడిపే స్థితికి చేరుకున్నారు. అయిన వారే ‘మా అమ్మ నన్ను బంగారు బాతులా చూసింది. నా ఆర్థిక లావాదేవీలన్ని నా పెద్దక్క చూసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలు నా డబ్బు ఆమె దగ్గర ఉండిపోయింది. అది నాకు ఇవ్వలేదు. మా అమ్మ నా పేరున ఏదైనా ఆస్తి ఉంటే నేను వేరుగా వెళ్లిపోయి స్థిరపడతానని అసలు ఏ ఆస్తీ నా పేరున కొననివ్వలేదు. నా వాళ్లు నా సంపాదనతో స్థిరపడి తమ వేడుకలకు నేను వస్తే నన్ను బంధువులకు పరిచయం చేయడానికి ఇబ్బంది పడే స్థితికి వచ్చారు. అందుకని ఇప్పుడు వాళ్లందరితో తెగదెంపులు చేసుకున్నాను. నాకు ఎవరూ లేరు’ అని షకీల చెప్పుకున్నారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. తమిళనాడులో ఉండే ట్రాన్స్జెండర్ల సమూహం ఆమెను తమ మనిషిగా స్వీకరించింది. వారే ఇప్పుడు షకీల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు. ‘నాతో రిలేషన్లో ఉన్న మగవారు కూడా నాకు దూరమైపోయారు’ అని ఆమె అన్నారు . ఆత్మకథ– సినిమా షకీలా ఆత్మకథ మలయాళంలో ‘షకీలా ఆత్మకథ’ పేరుతో విడుదలైంది. అది అక్కడ చర్చకు పాత్రమైంది. హిందీలో ఆమె కథ స్ఫూర్తిగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి రీచా చద్దా ముఖ్యపాత్రలో సినిమా తయారైంది. అది ఈ సంవత్సరం మొదలులోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతోంది. అదీ నేరుగా థియేటర్లలో. ‘సినిమా రంగంలోకి రావాలనుకున్న యువతులు ఇక్కడ గ్లామర్, పేరుతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందుకు ఈ సినిమా కథ ఉపయోగపడుతుంది’ అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ అన్నాడు. రిచా చద్దా ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘మసాన్’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందారు. ‘షకీలా’ సినిమా కచ్చితంగా విమర్శకులు మెచ్చే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి చేసిన ఒక వినూత్న ప్రయాణం ఈ కథ. ఇది సమాజంలో ఉండే నిచ్చెనలను, పాములను కూడా చూపిస్తుంది. ఇది నమ్మకాలను, నమ్మకద్రోహాలను కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో కూడా హెచ్చరిస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
షకీలా కుటుంబ కథా చిత్రం
షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు. సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సందర్భంగా షకీలా మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవ్వటం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా, ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలున్నాయి. అన్ని రకాల కథలను చేస్తానని నిరూపించటం కోసం కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వి.ఎన్, హీరో విక్రాంత్, సినిమాటోగ్రాఫర్ కరామ్‌తోత్ పాల్గొన్నారు. -
‘షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా’
`'నేను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అది ట్రిబ్యునల్‌లో ఉంద’ ని నటి షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదివారం షకీల ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం' సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘‘ షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్’’ అని అన్నారు. 24 క్రాఫ్ట్స్ బ్యానర్స్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. -
ఆడవాళ్లకు అనుమతి లేదు
మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ అని అడల్ట్ కంటెంట్ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ అనే చిత్రం రూపొందింది. రమేశ్ కావలి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. సాయిరామ్ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ రైట్స్‌ను షకీలాగారు తీసుకున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్ చూశాను. మంచి వినోదం ఉంది’’ అన్నారు షకీలా. -
గిరిజన యువతి కథ
‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొట్టు’. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఎస్.ఎస్ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి. కుమార్ బాబు ‘బొట్టు’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథే ఈ సినిమా. ‘కాంచన, గంగ’ చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ ఇబ్బందుల వల్ల చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు రివైజింగ్ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్ పొందాం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్. -
ఆ హీరోతో కలిసి పనిచేయాలనుంది: షకీల
చెన్నై , పెరంబూరు: శృంగార తార షకీలాకు రాజకీయాలపై మనసు మళ్లింది. ఈ భామ ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో అక్కడి సూపర్‌స్టార్స్‌కే దడ పుట్టించారు. షకీలా చిత్రం విడుదలవుతుందంటే ప్రముఖ స్టార్స్ తన చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి నటిని మలయాళ చిత్ర పరిశ్రమ అంతా కలిసి అణగదొక్కిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిన్న పాత్రలకే పరిమితమైన షకీలా బయోపిక్ బాలీవుడ్లో తెరకెక్కుతుండడం విశేషం. అయితే తాజాగా షకీలాకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. నటుడు కమలహాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యంలో చేరాలనుకుంటున్నట్లు తెలిపింది. కమలహాసన్ నటన అంటే చాలా ఇష్టమని, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో అతను నటించిన చిత్రాలనే చూస్తుంటానని తెలిపింది. కొత్త ఆలోచనలతో ఆయన ప్రవేశ పెట్టనున్న పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పింది. అందుకే ఆయన పార్టీలో చేరి పని చేయాలనుకుంటున్నట్లు నటి షకీలా ఒక భేటీలో పేర్కొంది. -
నేనూ అలాగే ఉంటా!
బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్‌లు యాక్టింగ్‌ను ప్లాన్ ఏ గా భావించి ప్లాన్ బీగా నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఇప్పుడీ జాబితాలోకి మరో నటి రిచా చద్దా చేరారు. ఆమె కూడా ప్లాన్ బీగా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘‘ఒక్క యాక్టింగ్ పరంగానే కాదు వీలైనన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను భాగం అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా మారే అవకాశం వచ్చింది. న్యూయార్క్‌కి చెందిన నా క్లోజ్ ఫ్రెండ్ సుచంటి తలాటి ఓ టీనేజ్ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఆమె నన్ను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయమని అడిగినప్పుడు నిర్మాతగా నాకు ఇదొక అవకాశంగా కనిపించింది. ఈ రోజుల్లో అందరూ ఒక్క పనితోనే ఆగిపోవడం లేదు. మల్టిఫుల్ వర్క్స్ చేస్తున్నారు. నేనూ అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు. ప్రస్తుతం షకీల బయోపిక్ ‘షకీల’లో ఆమె æనటిస్తున్నారు. -
పోర్న్ స్టార్ కాదు!
సినిమా ప్రపంచంలో షకీలా పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1990లో వెండితెరపై ఓ వెలుగు వెలిగారామె. అప్పట్లో ఆమె నటించిన కొన్ని అడల్ట్ సినిమాలు విదేశీ భాషల్లోనూ డబ్ చేశారు. అనేక వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇన్ని ఆసక్తికర విషయాలు ఉన్న ఆమె జీవితం ఆధారంగా ‘షకీలా’ అనే బయోపిక్ రూపొందుతోంది. రీచా చద్దా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై ‘షకీలా.. పోర్న్ స్టార్ కాదు’ అని ఉంది. ‘‘షకీలాను అందరూ పోర్న్ స్టార్‌గానే ఆలోచిస్తారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ బయోపిక్‌లో షకీలా కూడా గెస్ట్ రోల్ చేశారు. వేసవిలో రిలీజŒ కానుంది. -
షకీలా.. బోల్డ్ ఫస్ట్ లుక్
సౌత్‌లో శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన నటి షకీలా. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటి ఇచ్చిన షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ‘షకీలా నాట్ ఏ పోర్న్ స్టార్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చడ్డా టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఉన్న రిచా ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, ఎస్తర్ నొరొహ, రాజీవ్ పిల్లైలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నాకు నేనే అతిథి...
... అంటున్నారు నటి షకీల. శృంగార తారగా ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితాన్ని మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్రబృందానికి తెలిపానని షకీల గతంలో చెప్పారు. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్ లంకేష్ కోరడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట ఆమె. -
షకీలా బయోపిక్‌పై ఇంట్రేస్టింగ్ న్యూస్
సెన్సేషనల్ స్టార్ షకీలా పేరు మీద బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా పోషిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్. షకీలా అడల్ట్ స్టార్ గా మారడానికి కారణాలు తెరపై చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట. కాగా ఈ మూవీలో అతిథి పాత్రలో నటించవలసిందిగా షకీలాను దర్శకుడు ఇటీవల కోరినట్లు సమాచారం. దీనికి షకీలా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తారగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటి షకీలా. 90వ దశకంలో ఆమె సినిమాలకు యమ క్రేజ్ ఉండేది. ఒకానొక దశలో ఆమె సినిమా కలెక్షన్ల ముందు బడా స్లార్ల మూవీల కలెక్షన్లు కూడా వెలవెలబోయేవి. షకీలా మూవీ రీలీజ్ అవుతుందంటే చాలు.. వారం రోజుల పాటు బడా హీరోల సినిమాలు వాయిదా పడేవి. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
ఈ షకీలా వేరు!
సెన్సేషనల్ స్టార్ షకీలా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శీలవతి’. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో రాఘవ ఎమ్. మహేశ్, వీరు బాసింశెట్టి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ నెల 17న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. షకీలా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా కెరీర్లో 250వ చిత్రం. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఉత్కంఠతను రేకెత్తించేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సెన్సార్ ట్రబుల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎదుర్కొని సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యాం. కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం. ఈ సినిమా చూశాక ఇంతకుముందు షకీలా వేరు ఈ సినిమా తర్వాత షకీలా వేరు అని ప్రేక్షకులు అంటారు. సాయిరామ్ బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. అర్జున్, గీతాంజలి, అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. -
నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను: షకీలా
‘నిజాలు దాచి బయోపిక్ తీసి ఉపయోగమేంటి?’ అంటున్నారు నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి రీచా చద్దా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ కోసం షకీలాను కలుసుకున్నారు రీచా. ఈ బయోపిక్ గురించి షకీల మాట్లాడుతూ – ‘‘రీచాకు, నాకు మధ్యలో ఒక కామన్ పాయింట్ కనిపించింది. ఫిజికల్ సిమిలారిటీ గురించి కాదు, మా ఇద్దరి ఆలోచనా విధానం గురించి అంటున్నాను. రీచా కూడా నాలానే ధైర్యవంతురాలు, ఫ్రీగా ఆలోచించే మనిషి. స్క్రిప్ట్స్‌లో ఉన్న లేయర్స్‌ని కూడా అర్థం చేసుకోగల నటి. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నిబంధనలు పెట్టడం లేదు. నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను. నిజాలు దాచాలనుకున్నప్పుడు బయోపిక్ తీసి ఉపయోగమేముంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
శీలవతికి సర్టిఫికెట్ ఇవ్వని సెన్సార్ బోర్డు
-
సెన్సార్ సభ్యులకు ‘శీలవతి’ రిక్వెస్ట్
చాలా కాలం తరువాత షకీలా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా శీలవతి. ఈ సినిమా షకీలా 250వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచిస్తున్నారు. కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశాం ఈ పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. మరి షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
సీక్రెట్ స్టార్
ఎవరైనా వాళ్ల జీవితం గుట్టుగా ఉండాలి అనుకుంటారు.ఎంత పాపులర్ అయినా పర్సనల్ లైఫ్‌ని ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటారు.ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినాగుట్టుగా ఉంచకూడదనుకునేది ఒకటి ఉంటుంది.అదే ఫ్యాన్స్.ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇండస్ట్రీలో అంత సక్సెస్ఫుల్.షకీలాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.కానీ ఒక్కరూ బయటపడరు.అందుకే ‘సీక్రెట్ స్టార్’. చాలా రోజుల తర్వాత ‘శీలవతి’ సినిమా చేస్తున్నారు. ఇది మీకు 250వ సినిమా. వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మూవీ కూడా లేదేమో? ఎగ్జాట్లీ. ఇన్ని సినిమాలు చేసినా ఆర్టిస్ట్‌గా నాకు తృప్తి లేదు. నటిగా నేను చాలా కేపబుల్. మంచి అవకాశాలిస్తే బాగా చేయగలను. కానీ రాలేదు. ఇలా చెబితే కొంతమంది డైరెక్టర్స్ ఫీలవుతారేమో. ‘మేం మంచి చాన్సులే కదా ఇచ్చాం’ అని వాళ్లనుకోవచ్చు. కానీ చేసినప్పుడు, భవిష్యత్తులో నా క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు నాకు శాటిస్ఫ్యాక్షన్ ఉండాలి కదా. ‘శీలవతి’లో మంచి పాత్ర చేశా. ఈ చిత్రదర్శకుడు సాయిరామ్ దాసరిని ఒక ఆడియో ఫంక్షన్లో కలిశాను. ‘మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెబితే ‘వెయిట్ చేయండి. మంచి స్క్రిప్ట్‌తో వస్తా’ అన్నాడు. అన్నట్లుగానే మంచి పాయింట్‌తో వచ్చాడు. అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. నేను డబ్బు సంపాదించడానికే వచ్చాను. నా ఫ్యామిలీ కోసం ఆర్టిస్ట్ అయ్యాను. సంపాదించాను. ఫ్యామిలీ అంటే ఎంతమంది? ఇద్దరు అక్కలు, ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలు, ఆ తర్వాత మరో అక్క (ఆవిడ చిన్నప్పుడే చనిపోయింది), తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, చెల్లెలు. అమ్మానాన్న. లార్జ్ ఫ్యామిలీ. మా అక్క పెళ్లి చేసుకున్నాక కూడా మా ఇంట్లోనే ఉండేది. ఒక అన్న డ్రగ్ అడిక్ట్. తమ్ముడు టెన్త్ ఫెయిల్. ఎవరూ సెటిల్ అయ్యే పరిస్థితి లేదు. మా కష్టాలు పోగొట్టడానికి ఇంటి బాధ్యతను మోశాను. మీకన్నా పెద్దవాళ్లు ఉండగా మీరే ఎందుకు బాధ్యత తీసుకున్నారు? నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఒకసారి అమ్మ çపప్పుచారు పలచగా చేస్తే.. ‘ఏంటి? ఇలా ఉంది’ అనడిగాను. ‘నువ్వు సరిగ్గా చదువుకుని ఉంటే నర్స్ అయ్యేదానివి. ఇదిగో ఇలా కష్టపడుతున్నాం’ అనేసరికి బాధగా అనిపించింది. నిజానికి నాకు చదువు అబ్బలేదు. కష్టాలన్నీ నా వల్లే అని అమ్మ అనడంతో ఏదైనా చేయాలనుకున్నాను. ఆ టైమ్‌లో ఎదురింటి వాళ్ల ద్వారా సినిమా ఆఫర్ వచ్చింది. డబ్బులు ఇస్తారా అని అడిగితే? ‘సెలెక్ట్ అయితే ఇస్తాం’ అన్నారు. సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో (1990లలో) ఏడువేల ఐదువందల రూపాయలు ఇచ్చారు. మా ఇంటి అద్దె 700. అప్పటికి ఇంటి అద్దె కట్టి 23 నెలలైంది. అంత కష్టాల్లో ఉండేవాళ్లం. షూటింగ్లో ఇచ్చే డ్రెస్సుల గురించి అభ్యంతరం చెప్పిన సందర్భాలున్నాయా? నాన్న నాతో పాటు షూటింగ్‌కి వచ్చినా, లొకేషన్లోకి వచ్చేవారు కాదు. నేను లోపలికి వెళ్లగానే కాస్ట్యూమ్స్ ఇచ్చేవారు. ‘ఇదేంటి ఇలా ఉన్నాయ్?’ అని అడిగితే.. ‘మీ నాన్నతో మేం మాట్లాడాంలే’ అనేవారు. డాడీతో మాట్లాడాక నేను మాట్లాడ్డానికి ఏముంటుంది? నోరు మూసుకుని ఆ బట్టలేసుకుని వాళ్లెలా చెబితే అలా చేసేదాన్ని. షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికెళ్లేటప్పుడు ‘డాడీ.. మీతో వాళ్లు హిందీలో మాట్లాడుతున్నారు. మీరేమో అర్థం కాకుండా అన్నింటికీ తలూపుతున్నారు. నా దగ్గరేమో మీతో మాట్లాడానంటున్నారు. ఒకసారి నా కాస్ట్యూమ్స్, క్యారెక్టర్ గురించి అడగండి’ అనేదాన్ని. ‘సరే’ అనేవారు. అయితే మళ్లీ మామూలే. చివరికి ‘ఇది తప్పదు’ అని నా మైండ్ ప్రిపేర్ అయిపోయింది. పోనీ మీకు వచ్చిన ‘ఇమేజ్’ తెలిశాక ‘సినిమా లు మానెయ్’ అని మీ అమ్మానాన్న అనలేదా? అమ్మ ఎప్పుడూ అనలేదు. డాడీ మాత్రం రెండు సందర్భాల్లో అన్నారు. ‘కడవుళ్’ అనే తమిళ సినిమా కోసం ఓ మామిడి తోటలో పాములతో డ్యాన్స్ చేస్తున్నా. ‘ఒకవేళ ఆ పాములు కరిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?’ అని ఎవరో డాడీతో అన్నారట. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక డాడీ, నేనూ వెళుతున్నప్పుడు ‘ఇక సినిమాలు వద్దమ్మా’ అన్నారు. అప్పటికి నా సిస్టర్స్‌కి పెళ్లయింది. ‘నీక్కూడా పెళ్లి చేస్తాను. నువ్వూ సెటిల్ అయిపో’ అన్నారు. ఇది జరిగిన నెలకు మరో సాంగ్ షూట్లో పాల్గొంటూ పై నుంచి జారి పడ్డా. అప్పుడు కూడా డాడీ సినిమాలు మానేయమన్నారు. అయితే అప్పటికే ఇంట్లోవాళ్లకు కొన్ని కంఫర్ట్స్ చూపించేశాను. మళ్లీ వాళ్లను కష్టాల్లోకి దించడమా? అనిపించింది. అదే రోజు రాత్రి డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో సినిమాలు ‘వదలకూడదు’ అని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాను. మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డారు. మరి వాళ్లు మీ ఫ్రొఫెషన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు? కుటుంబం కోసమే కష్టపడుతున్నాను కాబట్టి నన్నెంతో అభిమానిస్తారని నమ్మాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక మలయాళం మేగజీన్ కోసం ఫ్యామిలీ ఫొటో అడిగితే.. మా అక్క వాళ్ల పిల్లలు వద్దని రాలేదు. మా తమ్ముడూ రాలేదు. నాకు దగ్గరగా ఉండే నా చెల్లెలూ రాలేదు. ఫొటోగ్రాఫర్ ఇంటికొచ్చిన పరిస్థితిలో నాకెలా ఉంటుందో ఊహించండి. ఫ్యామిలీ ఫొటో అంటే చివరికి నేను, మా అన్నయ్య కూర్చున్నాం. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను, నా పేరు కావాలి. కానీ నాకు ఫొటో అవసరం అయినప్పుడు వాళ్లు రాలేదు. మీవాళ్లు మిమ్మల్ని ఓన్ చేసుకోకపోవడంతో పాటు మనీ వైజ్‌గా మోసం చేశారా? అవును. ఒకానొక దశలో సినిమాలు మానేసి, హ్యాపీగా సెటిలవుదామనుకున్నా. మా అమ్మగారు సరిగ్గా చదువుకోలేదు. చిన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించింది మా అక్కే. తనంటే నమ్మకం. నా ఆర్థిక లావాదేవీలన్నీ మా అక్క చూసుకునేది. ఇక బ్రేక్ తీసుకోవాలనుకున్నాక డబ్బు గురించి అడిగితే.. ‘నో బ్యాలెన్స్’ అంది. నా డబ్బులన్నీ ఎవరికో ఇచ్చిందట. వాళ్లు ఇవ్వలేదట. అలా అనే చెప్పింది. అప్పుడు మళ్లీ జీరోతో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే దయనీయ స్థితిలో లేను కానీ, కొన్నేళ్లు పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని నా బాధ. షకీలాను ట్రెడిషనల్‌గా చూపించాలని ఒక్కరూ అనుకోలేదా? లేదా మీరూ రెడీగా లేరా? నేనెప్పుడూ రెడీ. ఫుల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఇచ్చి చూడమనండి. అప్పుడు తెలుస్తుంది.. ఆర్టిస్ట్‌గా నేనేంటో. అందుకే నేను ‘శీలవతి’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. షకీలాని గ్లామర్‌గానే చూస్తామని ఆడియన్స్ ఎప్పుడైనా అన్నారా? వాళ్లు ఏ పాత్ర చేసినా చూస్తారు. నా ఇండస్ట్రీయే నన్ను వేరే రకంగా చూస్తే నేనేం చేయాలి? ఇప్పటివరకూ చాలాసార్లు ప్రేమలో పడ్డారట. షకీలాని లవర్‌గా చూస్తారు కానీ వైఫ్‌గా అంగీకరించడానికి ఎవరూ ఇష్టపడటంలేదా? తప్పంతా నాదే. నన్ను ప్రేమించినవాళ్లంతా ఫ్యామిలీని వదిలేసి నాతో వచ్చేయ్ అనేవారు. కానీ మా ఫ్యామిలీలో సంపాదించేవాళ్లు లేరు. నా స్వార్థం చూసుకుంటే మావాళ్లను ఎవరు చూస్తారు? ఇదొక్కటే నాకు ప్రాబ్లమ్‌గా ఉండేది. ఒకటే చెప్పేదాన్ని ‘ఐ లవ్ మై మదర్’ అని. అందుకోసం ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. అమ్మ చనిపోయాకా సెటిల్ కాలేకపోయాను. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచిస్తారు? నేను ఆలోచించానని గర్వంగా చెప్పుకుంటాను. నేను తల్లి కాలేదు. నా తల్లిని బాగా చూసుకున్నాను. తోడబుట్టినవాళ్లను అమ్మలా చూసుకున్నా. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హాయిగా ఉండాలని మీకు ఉండదా? ఎందుకుండదండి? నేను ఆడదాన్ని కాదా? ముఖ్యంగా మూడేళ్లుగా చాలా ఒంటరితనం ఫీలవుతున్నా. ఇప్పుడైతే డిప్రెషన్లోనే ఉన్నాననాలి. ఒంటరిగా నిద్రపోవాలంటే భయమేస్తోంది? ఏదైనా జరిగితే ఎవరుంటారు? హాస్పిటల్‌కి వెళ్లాలంటే తోడు ఎవరొస్తారు? అని ఆలోచన వస్తుంది. నాకు ఓదార్పు కావాలి. తనివి తీరా ఏడవడానికి ఒక ‘భుజం’ కావాలి. ఒక భరోసా కావాలి. ప్రేమను షేర్ చేసుకోవటానికి ఒక పార్టనర్ కావాలి. నేనెవర్నీ మోసం చేయలేదు. అబద్ధాలు ఆడలేదు. నేనే నేరం చేయలేదు. నాకెందుకీ ఒంటరితనం? నా బాధలో న్యాయం ఉంది కదండీ. ఎగ్జాట్లీ.. మీ నుంచి ఇంత విన్నాక మీకో ‘సోల్‌మేట్’ దొరికితే బాగుండు అని మాకూ అనిపిస్తోంది. మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారట.. మిగతా ప్రేమల్లా ఇది కూడా రహస్యమేనా? అది జరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? మీవైపు నుంచి ఆలోచిస్తే మీరు చేసిన క్యారెక్టర్స్ మీకు కరెక్ట్‌గా అనిపించవచ్చు. కానీ గతంలో మీరు చేసిన కొన్ని సినిమాలు యంగ్‌స్టర్స్ చెడిపోయే విధంగా ఉన్నాయి. ఏమంటారు? ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేసిన మొదటి ఆర్టిస్ట్‌ని నేను కాదు కదా. సెక్స్ అన్నది ఎవరండి మొదలుపెట్టారు. షకీలాతో మొదలైందా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కదండి. గ్లామర్ సినిమాలు నాతోనే మొదలయ్యాయా? అంతకుముందు లేవా? నా చిన్నప్పుడు నేను కూడా చూశాను. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక కొన్ని చోట్ల ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని అలాంటి సినిమాలు చూపించడంలేదా? నా తమ్ముడు చూశాడని తెలిసి, ఒక్కసారి తన్నాను కూడా? నేనేం ఓపెన్‌గా చూపించలేదు కదా. నేను న్యూడ్‌గా కనిపించానా? నేను మెసేజ్ ఇచ్చానని చెప్పి ఎవరినైనా మోసం చేశానా? ఇప్పుడు నేనలాంటి సినిమాలు చేస్తున్నానా? మరి.. యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను యంగ్‌స్టర్స్‌ని చెడగొట్టానని ఎలా అనగలరు? నేను నా కోసం చేసుకున్నాను. నా ఖర్మ ఏంటంటే నాకన్నీ అలాంటి సినిమాలే ఇచ్చారు. నాకు సినిమాకు లక్ష రూపాయలు ఇస్తుంటే మా అమ్మానాన్న గురించి స్వార్థంగా ఆలోచించాను తప్పితే సమాజం గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా కడుపు నింపుకుని, మావాళ్ల కడుపు నింపాలనుకున్నాను. కష్టాలు పోగొట్టుకోవడానికి ‘శృంగార తార’ అని పేరు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరంలేదు కదా.. వేరే పాత్రలు చేసి ఉండొచ్చేమో? ఫస్ట్ మూవీ ‘ప్లే గర్ల్స్’ చేసినప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. ఆ సినిమా పేరు, నా క్యారెక్టర్ నాకు చెప్పలేదు. సిల్క్ స్మిత చెల్లెలి క్యారెక్టర్ చేయించారు. ఫలానా క్యారెక్టర్ చేస్తే కెరీర్ ఇలా టర్న్ అవుతుంది, ఇలాంటి ఇమేజ్ వస్తుందని ఊహించేంత వయసు లేదు. పరిస్థితులూ ఆలోచించనివ్వలేదు. అమ్మానాన్న చేయమన్నారు. చేశాను. శరీరాన్ని బయటపెట్టే దుస్తులు వేసుకుని నలుగురిలో నటించడం, శృంగార సన్నివేశాలు చేయడం బిడియం అనిపించలేదా? ఇలా చెబితే ‘ఛ.. నిజమా?’ అని నమ్మరేమో. నాకిప్పటికీ సిగ్గేనండి. శరీరాన్ని ప్రదర్శించాలని ఏ ఆడదీ అనుకోదు. నా దురదృష్టమో ఏమో నాకలాంటి చాన్సులే వచ్చాయి. అందుకే నేను సెకండ్ టేక్ తీసుకోను. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే ‘పీడ వదిలిపోతుంది’ అనుకుంటూ కెమెరా ముందుకెళ్లేదాన్ని. ఒక్క టేక్‌లో చేయడం కోసం నేను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే దాన్ని. రెస్ట్ ఉండేది కాదు. నేను పని చేసిన డైరెక్టర్స్, కెమెరామేన్ ఎవరినైనా అడగండి.. నా లైఫ్‌లో నేను రెండో తీసుకున్నానా? అని. దేవుడి మీద కోపంగా ఉందా? అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధువు ఆ దేవుడే. అందుకే కోపం, ప్రేమ.. రెండూ తన పైనే. ‘నన్ను చూసుకో దేవుడా’ అని మొరపెట్టుకుంటుంటాను. ఇలాంటి ప్రొఫెషన్ ఇచ్చినందుకేనా దేవుడంటే కోపం? ఆ విషయంలో దేవుడి మీద కోపం లేదండి. నేను డాక్టర్ అయినా కూడా నంబర్ వన్ డాక్టర్ అయ్యుండేదాన్నేమో. నేనేం చేసినా నంబర్ వన్‌గా ఉండాలని ముందే బలంగా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. నాకు డబ్బు కావాలి. పాపులార్టీ కావాలి. ఈ రెండూ సంపాదించుకోవడం కోసం ఆ దేవుడు ఒక రూట్ ఇచ్చాడు. దానికి నేను చాలా హ్యాపీ. నా బాధంతా ఫ్యామిలీ కోసం ఇంత చేశామే, వాళ్లెందుకు నన్ను ఓన్ చేసుకోలేదని. ‘షకీలా ఏం తప్పు చేసింది’ అని వాళ్ల కళ్లు ఆ దేవుడు తెరిపించలేదు ఎందుకు? అనుకుంటాను. – డి.జి. భవాని -
వెరీ స్పెషల్
‘‘ఇది నాకు 250వ సినిమా. మంచి పాత్ర చేశా. తర్వాతి సీన్ ఏంటి? అనేది నాక్కూడా తెలియకుండా డైరెక్టర్ స్క్రీన్‌ప్లే రాశారు. కథకు న్యాయం జరగాలని నిర్మాతలు రాజీపడకుండా తీశారు. ఇది నాకు వెరీ స్పెషల్ మూవీ’’ అన్నారు షకీలా. ‘జి’ స్టూడియోస్ సమర్పణలో షకీలా ముఖ్య తారగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టి నిర్మించిన చిత్రం ‘శీలవతి.’ కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘షకీలాగారితో ఇది నా రెండవ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని గీతాంజలి (ఫ్రూటీ) అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు గణేష్. మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా... సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం ‘శీలవతి’. నాకు, షకీలాగారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్‌లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. ఆమె చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు షకీలా వేరు.. ఈ సినిమా తరువాత షకీలా వేరు అనేట్లుగా ఈ సినిమా ఉంటుంది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్. హారర్, కామెడీ ఉంటుంది’’ అన్నారు. -
త్వరలో సెట్స్ మీదకు షకీలా బయోపిక్
నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర బయోపిక్ వెండితెర సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తార తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా అంగీకరించింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 16 ఏళ్ల వయసులోనే సినీ రంగం ప్రవేశం చేసిన షకీలా ఒక దశలో స్టార్ హీరోలకు కూడా గట్టిపోటినిచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ స్టార్లు కూడా ఆమె సినిమాలో పోటి పడాలంటే వెనకడుగువేసేవారు. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
భార్యపై కోపంతో మానవ మృగంగా..
ఇస్లామాబాద్ : భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో మానవ మృగంగా మారాడు. అభం శుభం తెలియని ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి చంపాడు. ఆపై భార్యపై హత్యాయత్నం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. అహ్మద్ యార్(40) అనే వ్యక్తికి భార్య షకీలాతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భార్య కూతుళ్లను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న యార్ శనివారం తన ముగ్గురు కుమార్తెలు జైనాబ్(1), జమీరా(7), మరియం(5)లను ఇంట్లోనే ఉరి వేసి చంపాడు. అపైన కత్తి తీసుకుని అత్తవారింటికి వెళ్లి భార్యను చంపేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి యార్ను పట్టుకున్నారు. స్థానికుల సమాచారం అందించటంతో పోలీసులు వచ్చి యార్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. -
సౌదీలో ఉద్యోగం పేరుతోమాయలేడి మోసం
♦ తమ కుమార్తెను సౌదీలో సేఠ్‌లకు విక్రయించిందని ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ♦ ఇండియాకు రప్పించాలని వేడుకోలు ♦ విచారించి న్యాయం చేస్తానన్న ఎర్రగుంట్ల సీఐ ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మహాత్మానగర్ కాలనీకి చెందిన షకీల విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలను సౌదీ, కువైట్, దుబాయి లకు తీసుకెళ్లి సేఠ్‌లకు విక్రయిస్తోందని బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన నూర్జహాన్, హైదర్‌వలి దంపతులు శనివారం ఎర్రగుంట్ల సీఐ రాజేంద్రప్రసాద్‌ను కలిసి సౌదీలో నరకం అనుభవిస్తున్న తమ కూతురు ఫరీదాను ఇండియాకు తీసుకురావాలని వేడుకున్నారు. బాధితుల కథనం మేరకు.. దంపతుల చిన్న కూతురు ఫరీదా డిగ్రీ వరకు చదివింది. అక్కడే ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసిది. వీరి కుమారుడు అనంతపురంలోని ఆర్డీటీలో చదువుకుంటూ క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు ఎర్రగుంట్లకు వచ్చేవాడు. ఆ సమయంలో షకీల కుమారుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో షకీల వీరి ఇంటికి వెళ్లి తాను విదేశాలకు ఏజెంటుగా పనిచేస్తూ అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికింది. మీ కూతురిని కూడా సౌదీకి పంపండ ని చెప్పింది. పలుమార్లు ఆమెతో సంబంధమున్న ఈశ్వరయ్య అనే వీఆర్వోను వెంట తీసుకుని కారులో వీరి ఇంటికి వచ్చి ఒత్తిడి చేసింది. వీరి కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూతురిని సౌదీకి పంపేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఫరీదాతో పాటు వీరిని ఆమె ఢిల్లీకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి సౌదీకి పంపింది. అక్కడ ఇళ్లలో పాచి పనులు చేసేందుకు పంపగా సేఠ్లు తన పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫరీదా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విలపించింది. ఇండియాకు రావాలని వారి నుంచి తప్పించుకొని వస్తే సేఠ్లు అక్కడి పోలీసులకు అప్పగించారని, ఆ తర్వాత వారే స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లి తాము చెప్పినట్లు వినకపోతే ఇక్కడే చంపి ఇండియాకు శవాన్ని పార్సిల్ చేస్తామని బెదిరించారు. వారంరోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచి నరకం చూపించారని ఫరీదా తన బాధను ఫోన్లో చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. ఏజెంట్ షకీలపై సీఐకి ఫిర్యాదు సౌదీలో నరకం అనుభవిస్తున్న తమ కుమార్తెను ఇండియాకు పిలిపించాలని ఏజెంట్ షకీలాను అడిగితే సౌదీకి వెళ్లింది ఏదో ఒక పని చేసేందుకు కదా, అక్కడ పాచి పనులతో పాటు ఇతర పనులు చేయాల్సిందేని బెదిరిస్తోందని వీరు వాపోయారు. అనంతపురం ఎస్పీని కలిసి విన్నవించుకుంటే ఆయన ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు పంపించారని తెలిపారు. దీనిపై విచారణ చేస్తామని సీఐ రాజేంద్రప్రసాద్ వారికి చెప్పారు. -
వైవాహిక జీవితంపై నమ్మకం లేదు : షకీలా
మోసం చేశారు శృంగార తారలు తమ అంగాంగ నృత్య ప్రదర్శనలతో యువతను గిలిగింతలు పెట్టించినా అందులో కొందరు నిజ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న వాళ్లేనని చెప్పక తప్పదు.అందుకు దివంగత ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత జీవితాన్నే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇక అలాంటి పలు సమస్యలను ఎదుర్కొన్న మరో నటి షకీలా. ఈ మె నట జీవితం ఒక సంచలనమే. 1990-2000ల ప్రాంతంలో మలయాళ చిత్ర పరిశ్రమను తన శృంగార నటనతో ఏలారనే చెప్పాలి. అక్కడ సూపర్‌స్టార్స్ మమ్ముట్టీ, మోహన్‌లాల్ చిత్రాలను మించి షకీలా చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. షకీలా చిత్రం విడుదలవుతుందంటే స్టార్స్ భయపడిపోయి వారి చిత్రాల వి డుదలను వాయిదా వేసుకునే వారంటే నటి షకీలా ఆకర్షణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో షకీలా చిత్రాలపై సెన్సార్ తన కత్తెర్ల కు బాగా పని చెప్పడమే కాకుండా సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత తను చెన్నైకి మకాం మార్చి తమిళం, తెలుగు భాషల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోయారు. అందుకు తనపై కుట్ర జరిగిందని షకీలా తీవ్రంగా ఆ రోపిస్తున్నారు. అలాంటి తార తాజాగా వివాహ జీవితంపై నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కా రు. అంతేకాదు షకీలా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాల గురించి ఈ సంచలతార ఏమంటున్నారో చూద్దాం. నా జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ అంకేశ్ అనుమతి కోరారు. నేను అందుకు అనుమతించాను. ఆ చిత్రంలో నా సినీ జీవిత అంశాలతో పాటు, వ్యక్తిగత విషయాలు చోటు చేసుకుంటాయి.అందులో నా పాత్రను పోషించడానికి బాలీవుడ్ భామలు సన్నిలియోన్, బిపాసా బసులలో ఒకరిని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నప్పుడు చాలా సంపాదించాను.నాలుగు కోట్ల బడ్జెట్ తయారైన మమ్ముట్టి చిత్రం కంటే 15 లక్షల వ్యయంతో నిర్మించిన నా చిత్రం అధిక వసూళ్లను సాధించేది. అలాంటిది నాపై కుట్ర పన్ని అక్కడ నుంచి నన్ను పంపేశారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును నా కుటుంబానికి చెందిన ఒకరు మోసం చేసి లాక్కున్నాడు. ఇక నా వివాహం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. నిజానికి నాకు వివాహ జీవితంపై నమ్మకం లేదు. అందువల్ల అవివాహితగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాను. అని షకీలా పేర్కొన్నారు. నటి సిల్క్‌స్మిత జీవిత కథ హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ద దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కి విజయం సాధించింది. మరి రేపు షకీలా జీవిత కథ తెరపై,తెర వెనుక ఎలాంటి సంచలనాన్ని కలిగిస్తుందో వేచి చూద్దాం. -
'ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ'
90లలో సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సష్టించిన శృంగార తార షకీలా ఇండస్ట్రీలోని పరిస్థితులపై నోరు విప్పింది. స్టార్ హీరోలు కూడా వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సమయంలో కూడా తన సినిమాలతో మంచి వసూళ్లను రాబట్టిన షకీలా ఆ తరువాత తన సినిమాల హవా తగ్గటం పై స్పందించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా గ్లామర్ పాళ్లు బాగానే ఉన్నప్పటికీ తన సినిమాలనే అశ్లీల చిత్రాలుగా చూపించారని, ముఖ్యంగా కేరళ ఇండస్ట్రీలో స్త్రీలకు సరైన గౌరవం లేకపోవటం, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కావటం మూలంగానే ఇలా జరిగిందని తెలిపింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయన్న షకీలా, ఈ తరం హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగకపోయినా ఉన్నంతలో మంచి ఫేమ్ తో పాటు డబ్బు సంపాదించుకొని తరువాత ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని, ఇది చాలా మంచి పరిణామమంటోంది. వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో ఎంతో నష్టపోయానని, తన మేనేజర్ తో పాటు సొంత వారు కూడా తన డబ్బు తీసుకొని తనను మోసం చేశారని తెలిపింది. -
షకీలా టార్గెట్ ఎవరు?
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,అన్యాయాలను ప్రశ్నించిన ఓ మహిళ కథే ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదే వి హీరో హీరోయిన్లుగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సమర్పకులు సయ్యద్ అఫ్జల్ మాట్లాడుతూ-‘‘షకీలా గారు చెప్పిన దాని కన్నా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఈ కథ తెలిసిన కొంతమంది రాజకీయనాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వెనుకాడం’’ అని అన్నారు. షకీలా మాట్లాడుతూ -‘‘ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్, పాటలు: సయ్యద్ అఫ్జల్, బొబ్బా, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్. -
స్త్రీ ఆదిపరాశక్తిగా మారితే...
స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఎవరో రావాల్సిన పనిలేదు. ఆడదే ఆదిపరాశక్తిగా మారి జరుగుతున్న వాటికి సమాధానం ఇవ్వచ్చనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా మెంటా సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకురాలు మాట్లాడుతూ-‘‘యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్-కార్తీక్, మాటలు: సాయి-నండూరి వీరేష్, ఎడిటింగ్: సునిల్ అళహరి, కెమెరా: కె. శ్రీనివాసరెడ్డి, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, సహనిర్మాత: జల్లేపల్లి నరేశ్.. -
సందేశంతో షకీలా సినిమా
నటిగా దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీలా దర్శకురాలిగా మారి, చేసిన చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. నరేష్, శ్వేతా శైన్, శ్రీదేవి ముఖ్య తారలుగా సయ్యద్ అఫ్జల్ సమర్పణలో మెంటా సత్యనారాయణ ఈ చిత్రం నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ - ‘‘ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం చేశాం. తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే ఆడవాళ్లు మహాశక్తిగా మారాలని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్, వినోదాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్. -
సంచలనాలు సృష్టించనున్న షకీల!
షకీల.ఆ పేరులోనే వైబ్రేషన్లు ఉన్నాయి. ఒకప్పుడు మళయాల సినిమా రంగాన్ని ఏలిన తెలుగు హీరోయిన్ షకీల తన జీవితంలోని నిజాలను బయటపెట్టి సంచలనాలు సృష్టించబోతోంది. కుర్రకారుని ఉర్రూతలూగించే తన సినిమాలతో మాలీవుడ్ వెండితెరను మహారాణిలా పాలించిన ఈ శృంగార తార సినిమా విడుదల అవుతుందంటే చాలు పెద్ద పెద్ద హీరోలకే ముచ్చెమటలు పట్టేవి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన స్టార్ హీరోల సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఇప్పుడు ఆ హీరోయిన్ తన జీవిత చరిత్ర ఆధారంగా తానే కధానాయికగా ఓ సంచలన చిత్రం నిర్మించబోతోంది. ఆ సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయని ఆమె చెబుతోంది. దాంతో కొందరు పెద్దలకు తమ బండారం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని వణుకుపుడుతోంది. వెండితెర నటీమణుల జీవితాలతో గతంలో ఎన్నో సినిమాలు తెరకి ఎక్కాయి. డర్టీ పిక్చర్ లాంటి సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి. కలెక్షన్లే కాకుండా, అవార్డుల వర్షం కూడా కురిపించాయి. తెర వెనుక చీకటి నిజాలు, హీరోయిన్లు కష్ణాలు, వారు ఎదుర్కొనే అవమానాలు, మానాభిమానాలను కాపాడుకోవడానికి వారు పడేపాట్లను ఇటీవల షకీల బయటపెట్టారు. దాంతో గుమ్మడికాల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కొందరు పెద్దలు ఉలిక్కిపడ్డారు. అందరూ పెద్దలు కాదని వాళ్ళలో కొందరు గద్దల కూడా ఉన్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ నిజాలన్నీ కలిపి షకీల సినిమా కూడా తీస్తున్నారు. సినీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తాను పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న చీత్కారాలు, వేధింపులతో ఏకంగా షకీల గతంలో ఓ పుస్తకమే రాశారు. ఈ పుస్తకం సంచలనాలకు కేంద్రబిందువైంది. ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఆ సినిమాలో తానే లీడ్ రోల్లో నటించబోతోంది. పుస్తకం అందరికీ చేరడానికి కొంత సమయం పడుతుంది. అదే సినిమా అయితే జనాల్లోకి చాలా తేలికగా చొచ్చుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన తరువాత కొందరు నొచ్చుకొవడం ఖాయం. అందుకే నిజాలు తెలిస్తే తనను చంపేసినా చంపేస్తారని షకీల అనుమానం కూడా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీల రూపొందించే ఈ సినిమా నిర్మాణం పూర్తి అయితే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం. - శిసూర్య -
రీల్ పై రియల్ లైఫ్ చూపిస్తా:షకీలా
-
మహాశక్తిగా మారాలి...
దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించారు షకీలా. ఆ అనుభవంతో తొలి ప్రయత్నంగా ఆమె ‘రొమాంటిక్ టార్గెట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. నరేష్, శ్వేత, శ్రీదేవి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను షకీలా తెలియజేస్తూ - ‘‘ప్రస్తుత సమాజంలో తమపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఆడవాళ్లు మహాశక్తిగా మారి ఎలా ఎదుర్కోవాలి? అని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, నిర్మాత: మెంటా సత్యనారాయణ. -
చాలామంది బయటకు చెప్పరు...నేను చెబుతున్నాను!
కొవ్వొత్తి ... తాను కరుగుతూ... చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తుంది. షకీలా కూడా అంతే. తన కోసం కన్నా... తనను నమ్ముకున్నవారి కోసమే అష్టకష్టాలు పడింది. పైకి సీతాకోక చిలుకలా కనిపించే ఈ గొంగళి పురుగు లాంటి గ్లామర్ ప్రపంచంతో ఇరవై ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది. ఫైనల్‌గా తనకు మిగిలింది... ‘సెక్సీ క్వీన్’ అనే బిరుదు మాత్రమే. సెంటు స్థలం లేదు... సొంత ఇల్లు కూడా లేదు... నమ్మినవాళ్ళే నట్టేట ముంచారు... ఒంటరిగా వచ్చింది.. ఒంటరిగా మిగిలింది... అందరికీ ఆమె ఎద ఒంపులే కనిపిస్తాయి. కానీ, ఆ గుండెల మాటున గడ్డకట్టిన కన్నీటి సంద్రం ఎవరికీ కనిపించదు.. ‘ఎ’ సర్టిఫికెట్ తార అనిపించుకున్న షకీలా తన లైఫ్‌ను ‘ఎ’ టూ ‘జెడ్’ ఆవిష్కరించింది. చాలా రోజుల తరువాత మళ్ళీ తెర మీదకొచ్చారు. ఇంత గ్యాప్ ఎందుకని? షకీలా: (ఠక్కున అందుకుంటూ...) నిజంగానే గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇప్పటికి అయిదేళ్ళ పైగా నాకు తెలుగు సినిమాల ఆఫర్లు లేవు. అయితే, తమిళ, మలయాళ, కన్నడాల్లో చేస్తున్నా. నాలుగేళ్ళుగా కన్నడంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. తెలుగులో లాగా ఏదో కామెడీ కోసమని పెట్టే పాత్రలు కాక, పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషిస్తున్నా. ఇతర భాషల్లో ఇన్ని పాత్రలు చేస్తున్నప్పటికీ, తెలుగులో నన్నెందుకు పిలవడం లేదో తెలియదు. అసలు ఇప్పటి దాకా ఏయే భాషల్లో సినిమాలు చేశారు? షకీలా: తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో చేశా. హిందీలో ‘హత్యారా’ అని ఒకే సినిమాలో నటించా. ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు? షకీలా: ఎవరైనా ఎల్.కె.జి తరువాత యు.కె.జి. చదువుతారు కదా! అలాగే, నేను కూడా ఆర్టిస్టు నుంచి దర్శకురాలినయ్యా. ఆర్టిస్టుగా మొదలైన నేను అక్కడే ఎందుకు ఆగిపోవాలి. నా ఈ 20 ఏళ్ళ నట జీవితంలో ఎంతోమంది దర్శకులనూ, వాళ్ళు పనిచేసే విధానాన్నీ దగ్గర నుంచి గమనించా. ‘నేనెందుకు దర్శకత్వం వహించకూడద’ని పదేళ్ళుగా నా మనసులో ఉంది. నిజం చెప్పాలంటే, అప్పటి నుంచి అవకాశం రాలేదు. ఏవో ప్రయత్నాలు చేయడం, అవి మొదట్లోనే ఆగిపోవడం జరిగింది. మరి ఒకేసారి తెలుగు - హిందీల్లో ఇప్పుడు మాత్రం ఛాన్సెలా వచ్చింది? షకీలా: నిర్మాతలనుసమన్వయం చేసుకొని, సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడం నాకు మొదట్లో తెలియదు. తీరా ఇప్పుడు సీనియర్ దర్శకుడు స్వర్గీయ కట్టా సుబ్బారావు కుమారుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ వల్ల ఈ ప్రాజెక్ట్ కుదిరింది. చెన్నైలో మా ఇంటి మేడ మీద కట్టా సుబ్బారావు గారు వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఆయన, మా నాన్న గారు మంచి మిత్రులు. వాళ్ళ ఇల్లు కూడా కోడంబాక్కమ్‌లోని డెరైక్టర్స్ కాలనీలోనే! అప్పటి నుంచి మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము రాజోలులో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, వస్తుండేవాళ్ళం. అలా మేము చాలా క్లోజ్. నేను చెప్పిన కథ విని, ఈ సినిమాను ఆర్గనైజ్ చేసింది ఆయనే. అలా నా దర్శకత్వంలో తొలి చిత్రం మొదలైంది. కానీ, మునుపే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొచ్చాయే! షకీలా: అవును. గత ఏడాది ‘నీలకురింజి పూత్తు’ అనే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నా. ఆ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. నిజజీవితంలో నా లాగా చాలా సాహసోపేతంగా ఉండాలి. ఆ పాత్రకు రంజిత లాంటి పలువురు నటీమణులను అనుకున్నా. కానీ, ఆ పాత్రను నేనే పోషించాలని నిర్మాత పట్టుబట్టాడు. నేనేమో వేరే వాళ్ళను పెడదామన్నా. అలా అభిప్రాయభేదాల వల్ల ఆ సినిమా ఎనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది. మొదలు కాకుండానే, ఆగిపోయింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తానన్న సంగతి తెలిసి, కట్టా శ్రీకర్ ప్రసాద్ సోదరుడు కణ్ణా నాకు ఎంతో సాయపడ్డాడు. నాకు ఒక ట్యూటర్ లాగా అన్నీ చెప్పింది ఆయనే. మీ దర్శకత్వంలోని ఈ తొలి సినిమాకు ‘పార్ట్ వన్’ అని పేరు పెట్టారట? షకీలా: లేదు.. లేదు... అలాగని మొదట అనుకున్నాం. కానీ, ఆ పేరు పెడితే, అదేదో నా ఆత్మకథ ఆధారంగా తీస్తున్న సినిమా అనుకొనే ప్రమాదం ఉందని భావించాం. అందుకే, సరైన టైటిల్ చూసి, త్వరలోనే ప్రకటిస్తా. నిజానికి, గత ఏడాది చివరలోనే ‘షకీలా ఆత్మకథ’ అంటూ మలయాళంలో మీ ఆత్మకథ పుస్తకంగా వచ్చింది కదా! ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది? షకీలా: తేజ దర్శకత్వంలో ‘కేక’ చిత్రానికి పనిచేసినప్పుడు కెమేరామన్ పి.సి. శ్రీరామ్ గారు నాతో మాట్లాడుతూ, ‘నీ లాంటి అమ్మాయి నీ కథ ఏమిటన్నది రాయాలి. అది అందరికీ తెలియాలి. దాని ద్వారా నలుగురికీ ఉపయోగం’ అన్నారు. అప్పటి నుంచి నా బుర్రలో ఆ ఆలోచన తిరుగుతూ ఉంది. కానీ, నాదేమీ మహాత్మా గాంధీ జీవితం కాదు, మదర్ థెరెసా జీవితం కాదు. ప్రతి నటి జీవితంలో ఉన్నవే నా జీవితంలోనూ ఉన్నాయి, జరిగాయి. అయితే, ఒక మనిషిగా... ఆ తరువాత నటిగా నాకు ఎదురైన అనుభవాలు చెప్పడం వల్ల కొందరికైనా ఉపయోగపడతాయన్నందు వల్లే నా కథకు పుస్తక రూపమిచ్చా. కేరళలోని క్యాలికట్‌కు చెందిన అషాద్ బతేరీ అనే మంచి కవి, రచయిత నా ఆత్మకథ రాస్తానంటూ వచ్చారు. నా కథ మొత్తం ఆయనే మలయాళంలో రాశారు. నాకు మలయాళం చదవడం రాదు. అందుకే, అందులో ఏముందో నాకే తెలీదు (నవ్వులు). కానీ చదివినవాళ్ళంతా బాగుందన్నారు. మరి, మీ ఆత్మకథను తెలుగుతో పాటు, ఇతర భాషల్లో తెచ్చే ఆలోచన ఏదీ లేదా? షకీలా: నిజం చెప్పాలంటే, ఆ మలయాళ పుస్తకం అధికారిక ఆవిష్కరణ కూడా ఇప్పటి దాకా జరగలేదు. అయినా, ఇప్పటికే 5 వేల కాపీలు అమ్ముడైపోయింది. ఆ విషయంలో రచయితతో నేను దెబ్బలాడాను కూడా. దుబాయ్‌లో బుక్‌ఫెస్టివల్‌లో బాగుంటుందని పెట్టామనీ, అలా ఆవిష్కరణ జరగకుండానే జనంలోకి వెళ్ళిపోయిందనీ వివరణ ఇచ్చాడు. ఇప్పుడీ పుస్తకాన్ని తెలుగు, కన్నడంలో కూడా అనువదిద్దామని ప్రచురణకర్తలు అడుగుతున్నారు. మాట్లాడుకొని, ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు - ఇన్ని భాషలు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అసలింతకీ మీది ఏ ఊరు? షకీలా: (నవ్వేస్తూ...) ఒక్క కన్నడం తప్ప ఈ భాషలన్నీ అచ్చంగా ఆ మాతృభాషీయులు మాట్లాడినట్లే మాట్లాడగలను. మద్రాసులో పుట్టి పెరిగా కాబట్టి తమిళం కొట్టినపిండి. మలయాళంలో నటించా... అదీ బాగా వచ్చు. ఇంగ్లీషు మీడియమ్‌లో చదివా కాబట్టి, ఇంగ్లీషు సరేసరి. ముస్లిమ్ అమ్మాయిని కాబట్టి, ఆటోమేటిగ్గా హిందీ వచ్చు. ఇక, తెలుగంటారా? అది నా మాతృభాష. మా అమ్మ చాంద్ బేగమ్‌ది నెల్లూరు. తెలుగు మాట్లాడేది. మా నాన్న చాంద్ బాషాది తమిళనాడు. ఆయనకు ఉర్దూ, తమిళమే వచ్చు. వీటి వల్ల, నాకిన్ని భాషలొచ్చు. ఇన్ని భాషా చిత్రాలతో జనానికి దగ్గరయ్యా. మీ అసలు పేరే షకీలానా? పేరు చివర ‘జాన్’ అని ఉందేమిటి? షకీలా: అవును. ఆ పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. మా అమ్మానాన్నకు మేము ఏడుగురు సంతానం. నేను అయిదోదాన్ని. నా పూర్తి పేరు ముస్లిమ్ పద్ధతిలో - షకీలా జాన్. అక్కకీ, చెల్లెలికీ మంచి పేరు పెట్టారనీ, నా పేరు నాకు నచ్చలేదనీ నాన్నతో గొడవపడేదాన్ని. అప్పుడాయన అసలు విషయం చెప్పారు. ఆయన వయసులో ఉండగా, సుశీల అనే అమ్మాయిని ప్రేమించారట. ఆ ప్రేమ సక్సెస్ కాలేదు. ఆ అమ్మాయికి గుర్తుగా, ఆ పేరు ధ్వనించేలా షకీలా అని పెట్టారట. అయితే, షకీలా జాన్ అనే ముస్లిమ్ పేరును స్కూల్ రికార్డుల్లో రాస్తున్నప్పుడు, క్రైస్తవ పద్ధతిలో జె.ఓ.హెచ్.ఎన్. - జాన్ అనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశారు. నా సర్టిఫికెట్లలో, చివరకు నా పాస్‌పోర్ట్‌లో కూడా అదే ఉంది. దాంతో, అదేమిటని చాలామంది పొరపడుతుంటారు. ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? షకీలా: మా నాన్న మద్రాసులో ‘కలై సెల్వి రిక్రియేషన్ క్లబ్’ నడుపుతుండేవారు. అందులో ఆయనకు నష్టం వచ్చింది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. అప్పటికి నేను ఎనిమిదో తరగతి తప్పాను. సరిగ్గా చదవడం లేదని మా నాన్న ఇంటి బయట నన్ను కొడుతుండడం చూసి, ఎదురింట్లో ఉన్న సినిమా ఆఫీసులోని మేకప్‌మ్యాన్ ఆపాడు. సినిమాల్లో నన్ను నటించమంటే, మా నాన్న సరే అన్నారు. ఆయన తీసుకువెళ్లి, చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు. ఆ సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెలి పాత్రతో సినిమా రంగ ప్రవేశం చేశా. మీతో లాభం పొంది, ఇంట్లోవాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని విన్నాం. నిజమా? షకీలా: అవును నిజమే. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే, మా అక్క పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ వచ్చా. వాళ్లను నేను పెంచలేదు కానీ, చిన్నప్పుడు నేను ఎలాగూ బాగా బతకలేదని, వాళ్లయినా దర్జాగా ఉండాలని వాళ్ల కోసం ఎంతో ఖర్చు చేశా. కానీ, మా అక్క నాకంటూ ఏదీ కొననివ్వ లేదు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అలా నేను సంపాదించినదంతా వాళ్ళకే ఖర్చు పెట్టా. నా వాళ్ళను నమ్మా. నా సంపాదనంతా పోగొట్టుకున్నా. నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మా నాన్న సహా మా కుటుంబమంతా మద్రాసులో ఏ ఇంట్లో అద్దెకు దిగిందో ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నా. నాకంటూ ఇవాళ్టికీ సొంత ఇల్లు, స్థలం - ఏదీ లేదు. కానీ, ఒకానొక దశలో మీకు భారీ పారితోషికం ఇచ్చినట్లున్నారు! షకీలా: అవును. తొలి చిత్రం ‘ప్లే గర్ల్స్’కు నా రెమ్యూనరేషన్ రూ. 2 వేలే. కాస్తంత పేరొచ్చాక, పరిశ్రమను ఊపేసిన నా సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘కిన్నార తుంబిగళ్’ (తెలుగులో ‘కామేశ్వరి’గా అనువాదమైంది) చిత్రానికి అయిదు రోజులకు 20 వేలు. తీరా పొగమంచు తదితర కారణాల వల్ల ఆ సినిమా త్రివేండ్రం దగ్గర పొన్ముడిలో 21 రోజులు షూటింగ్ చేశారు. అలా మొదలై, నటిగా రోజుకు రూ. 2 లక్షలు, 3 లక్షల దశ దాకా ఎదిగా. కోట్లు సంపాదించా. ఇక్కడే పోగొట్టుకున్నా. అంత సంపాదన పోగొట్టుకున్నానని బాధపడుతున్నారా? షకీలా: డబ్బు పోయింది నిజమే. కానీ, నేను ఎవరికిచ్చా...? మా అక్కకు, నా రక్త సంబంధీకులకే కదా! కాబట్టి, నేను వేరెవరినో నిందించడానికి వీల్లేదు. నా అనుకొని నమ్మినవాళ్ళే ఇవాళ నన్ను పిల్లలకు దూరంగా పెట్టడం, నాతో మాట్లాడవద్దనడం బాధించింది. నా వాళ్ళను నమ్మాను. మోసపోయాను. (చేతిని గుండెల మీద ఆనిస్తూ) అదే నాకు నొప్పిగా ఉంది. అందుకే, నా దృష్టిలో మా అక్క చచ్చిపోయింది. ఏమైనా, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాది మంచి మనసు. నేనెప్పుడూ అవతలివాళ్ళకు మేలే చేశా. ఎవరినీ ఏమార్చలేదు. కాబట్టి, ఆ అల్లా నాకు మంచే చేస్తాడు. అదే నా నమ్మకం. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా? షకీలా: బాగా నమ్ముతా. నేను లావుగా, నల్లగా ఉంటా. అతిలోక సౌందర్యరాశినేమీ కాదు. అయినా సరే, ఇవాళ ఇన్ని లక్షల మంది అభిమానం సంపాదించి, ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆ దేవుడిచ్చిన వరమే. నేను ఇస్లామ్‌ను నమ్ముతా. ఈ మధ్యే షిర్డీకి వెళ్ళొచ్చా. పదేళ్ళ వయసులో అనుకుంటా, ఓసారి తిరుపతి వెళ్ళా. మళ్ళీ ఎన్నో ఏళ్ళుగా తిరుపతి వెళ్ళాలని కోరిక. ఈ మధ్యే తమ్ముడితో కలసి, తృప్తిగా దర్శనం చేసుకొచ్చా. అయితే, దేవుడి దగ్గరకెళితే, ఫలానాది కావాలని అడగను... అడగలేను. అడగకుండానే అన్నిటిలో ఆయన ఆశీస్సులిచ్చాడు. ఇంకేం కావాలి! అయితే, ఇవేవీ తెలియని చిన్న వయసులో తిరుపతికెళ్ళినప్పుడు దేవుడి వైభోగం చూసి, ‘నిన్నే పెళ్ళి చేసుకుంటా’ అన్నాను. (నవ్వులు...) తరువాత దేవుడు కాకపోయినా... దేవుడు లాంటి భర్త కావాలని మీరెప్పుడూ ఆలోచించలేదా? షకీలా: (వెంటనే అందుకుంటూ... బాధగా...) నేనూ ఆడపిల్లనేనండీ! నాకూ మనసుంటుంది! ఇప్పటి దాకా చేసుకోలేదంటే, నాకు పెళ్ళి అవసరం లేక కాదు. నన్ను నన్నుగా ప్రేమించేవాడు రాక! ఇప్పటి దాకా మీరు ఎవరినీ ప్రేమించలేదా? మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా? షకీలా: ఎందుకు ప్రేమించలేదు. ఆ జాబితా చాలా పెద్దదే. నేను సిన్సియర్‌గా ప్రేమించినా, వాళ్ళు మాత్రం ప్రేమిస్తున్నామంటూనే, నా ఫ్యామిలీ వద్దని దూరం పెడుతున్నారు. వాళ్ళు నన్నే గనక నిజంగా ప్రేమిస్తే, నా కుటుంబాన్ని కూడా అక్కున చేర్చుకోవాలి కదా! అంటే, వాళ్ళు నన్ను కాదు... నా దగ్గర ఉన్న వేరే దేనినో ప్రేమిస్తున్నారన్న మాట! ఆ మోసం తట్టుకోలేక, వాళ్ళనే వదులుకున్నా. ఇంతమంది దగ్గర మోసపోయిన మీకు కోపం, ద్వేషం లేవా? షకీలా: చూడండి. ఇలాంటివన్నీ ఈ సినిమా రంగంలో జరిగేవే. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడమూ మామూలే. సినిమాల్లోనూ చూపించారు. అందరికీ జరిగేదే నాకూ జరిగింది. కాకపోతే, చాలామంది బయటకు చెప్పరు, నేను చెబుతున్నాను. అంతే తేడా! మీ ఆత్మకథలో కూడా ఇవన్నీ చెప్పారా? షకీలా: అఫ్కోర్స్ చెప్పా! నేను అబద్ధాలు చెప్పలేదు, రాయలేదు. కాకపోతే, నన్ను మోసం చేసిన వాళ్ళ పేర్లేవీ బయటపెట్టలేదు. ఎందుకంటే, నేనివాళ పది మందికి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానూ అంటే అది నా రెక్కల కష్టంతో సాధించిన విషయం. అలాంటి నేను ఇలాంటి కొందరి పేర్లు చెప్పి, నా ద్వారా వాళ్ళనెందుకు ఫేమస్ చేయాలి? అందుకే, పేర్లు చెప్పలేదు. అయితే... ఒక్క మాట. నాకు వాళ్ళు మీద కక్ష లేదు. ఎదురై పలకరిస్తే, మామూలుగానే మాట్లాడుతున్నా. చిన్నప్పుడు స్కూల్లో ఎదురైన ‘చైల్డ్ ఎబ్యూజ్’ గురించీ ఆత్మకథలో రాశారట... షకీలా: అవును రాశాను. మద్రాసులో నేను సరస్వతీ విద్యాలయ, జవహర్ విద్యాలయ - ఇలా రకరకాల స్కూల్స్‌లో చదివాను. అప్పట్లో కొందరు మాస్టర్లు క్లాసులో పనిష్మెంట్ ఇచ్చే మిషతో నాతో అసభ్యంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. ఆ వయసులో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక నేను పెదవి విప్పలేదు. ఎవరితోనూ ఫిర్యాదు పూర్వకంగా ప్రస్తావించ లేదు. ఇప్పటికీ అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే, నాలా నోరు విప్పకపోతే కష్టమని చెప్పడం కోసం ఆ సంగతులు ప్రస్తావించాను. అయితే, ఎన్నో ఏళ్ళ క్రితం సంగతులు కాబట్టి ఇప్పుడెందుకు లెమ్మని ఇక్కడ కూడా పేర్లు బయటపెట్టలేదు. మీ సినిమా రిలీజంటే మలయాళ స్టార్ల చిత్రాల్ని వాయిదా వేసుకున్నారంటారు... షకీలా: అలా జరిగిందని పత్రికల వాళ్ళే రాశారు. నాకు నిజానిజాలు తెలియవు. ‘షకీలా సినిమా’ అని ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే, ‘ఆండవన్’ (తమిళంలో దేవుడు అని అర్థం) కరుణ. అప్పుడూ, ఇప్పుడూ నేను ఒకే వ్యక్తిని. మరి, మీకు స్టార్ల నుంచి బెదిరింపులు రాలేదా? షకీలా: అలాంటివి ఎప్పుడూ రాలేదు. పైగా, నాకు వాళ్ళందరితో సత్సంబంధాలుఉన్నాయి. వాళ్ళ సినిమాల్లో కూడా నటించాను. మోహన్‌లాల్‌తో ‘ఛోటా ముంబయ్’లో నటించా. నేనంటే పడకపోతే, గొడవ ఉంటే... వాళ్ళ సినిమాల్లో నన్ను నటించనివ్వరుగా! (నవ్వు...) ‘షకీలా చిత్రాలు’గా పేరుపడ్డ ‘అలాంటి’ సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడలేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరూ ఏమీ అనేవారు కాదా? షకీలా: నేనెప్పుడూ బాధ పడలేదు. మా నాన్న ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు, ఎనిమిదో తరగతి తప్పిన నేను సినీ రంగంలోకి వచ్చాను. ‘నా కుటుంబం కష్టాల్లో ఉంది. వాళ్ళను గట్టెక్కించాలి. నేను అనుకున్న మంచి జీవితం వాళ్ళకివ్వాలి’ - అప్పట్లో అదే నా ఆలోచనంతా. 1994లో సినీ రంగానికి వచ్చా. 1996 - 97లో అనుకుంటా... మా నాన్న చనిపోతూ మా అమ్మ చేయి పట్టుకొని, అమ్మనూ, తమ్ముడు సలీమ్‌నూ నాకు చూపిస్తూ, ‘వాళ్ళ బాధ్యత చూసుకోమన్నట్లు’గా సైగ చేస్తూనే, కన్నుమూశారు. వినడానికి సినిమా కథలా అనిపించినా, ఇది వాస్తవం. నా మీద ఆధారపడిన వీళ్ళకు ఏదో చేయాలనే నా తపన అంతా. అందుకే, నాకు వచ్చిన సినిమాలన్నిటిలో నటించాను. ఆ సంగతీ మా వాళ్ళకూ తెలుసు. అలా కష్టపడి సంపాదించి, మా అక్క, అన్న, వాళ్ళ పిల్లలు - అందరినీ నిలబెట్టేందుకు శ్రమించా. ‘అవసరంలో ఉన్నా’మంటూ అడిగితే చాలు... లేదనకుండా డబ్బులిచ్చా. దానధర్మాలు చేశా. కిడ్నీలు చెడిపోవడంతో మా అమ్మకు లక్షలు ఖర్చు పెట్టి, వైద్యం చేయించా. (కొంచెం బాధగా) అయినా అమ్మను దక్కించుకోలేకపోయా. కానీ, మీ మీద ‘అశ్లీల చిత్ర తార’ అనే విమర్శలొచ్చాయి. సినీ రంగంలో కూడా చాలామంది మిమ్మల్ని లోకువగా చూశారు... షకీలా: ఐ డోంట్ కేర్! నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడ్డా. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు నేను క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నా. అయినా సరే, ఇప్పటికీ నన్ను ఏ సినీ ఫంక్షన్లకూ పిలవరెందుకో అర్థం కాదు. 2001లో మలయాళంలో 97 చిత్రాలొస్తే, అందులో 30 మీవే. అలా హవా నడుస్తున్న రోజుల్లోనే ఉన్నట్టుండి ‘ఆ చిత్రాల’ నుంచి తప్పుకోవడానికి కారణం? షకీలా: నిజం చెప్పాలంటే, రకరకాల గెటప్‌లతో కూడిన భిన్నమైన పాత్రలు నాకు ఇచ్చేవారు. వారు చెప్పినట్లు నటించేదాన్ని. అయితే, రిలీజయ్యాక హాలులో వాటిని చూసే తీరిక ఉండేది కాదు. ఒకసారి ఇలాగే ఓ మంచి గెటప్‌తో, ఓ సినిమాలో నటించాను. నా మీద చక్కటి సన్నివేశాలు చిత్రీకరించారు. తీరా రిలీజయ్యాక, నా మేకప్ మ్యాన్ రవి ఆ సినిమా చూసి వచ్చాడు. సినిమా, నా పాత్ర ఎలా ఉన్నాయని అడిగితే, ‘అందులో ఎంతసేపటికీ చిన్న తువ్వాలు కట్టుకొని తిరిగే దృశ్యాలు తప్ప ఇంకేమీ లేవన్నాడు. దాంతో, నేను చాలా ఫీలయ్యాను. ఇక అప్పటికప్పుడు మద్రాసులో తమిళ జర్నలిస్టులందరినీ పిలిచి, ‘ఆ తరహా’ సినిమాల్లో నటించనంటూ ప్రకటించాను. ఇదంతా జరిగింది 2001 చివరలో! అప్పటికే నేను తీసుకున్న 23 సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశాను. అలా ఆ అధ్యాయం ముగిసింది. ‘ఆ పాత్రల’ నుంచి క్యారెక్టర్ నటిగా ఎలా మారారు? కష్టం కాలేదా? షకీలా: హ్యాట్సాఫ్ టు డెరైక్టర్ తేజ. ‘జయం’ (2002)లో లెక్చరర్ పాత్ర ఇచ్చి, కెరీర్‌కు కొత్త మార్గం చూపెట్టారు. ఆ విషయంలో ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! ఆయన నాకు పెద్దన్న లాంటివాడు. అప్పటి నుంచి గత పన్నెండేళ్ళుగా మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో క్యారెక్టర్లు వేస్తున్నా. స్తవ సన్న్యాసినిగా నటించాలని కోరిక అని గతంలో చెప్పేవారు... షకీలా: ఆ కోరిక తీరింది. మలయాళంలో ఏడేళ్ళ క్రితం రూపొందించిన ఓ చిత్రంలో అలాంటి పాత్ర చేశా. కానీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సినీ నటి సంఘవి నటించిన ‘నాన్సీ’ అనే తమిళ సీరియల్లో కూడా అలాంటి వేషం వేశా. అది వీక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది భాషలన్నీ మాట్లాడే మీరు డబ్బింగ్ చెప్పుకొనే ప్రయత్నం చేయలేదేం? షకీలా: చూడండి. మన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆ డబ్బింగ్ కళాకారులకు కూడా రెండొందలో, మూడొందలో వస్తాయి. కుటుంబం గడుస్తుంది. వాళ్ళ కడుపెందుకు కొట్టడం? (నవ్వుతూ...) ఇప్పుడు నేను చేసే మహత్తరమైన పాత్రలకు నాకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటే, నాకేమైనా జాతీయ అవార్డులొస్తాయా ఏమిటి? జీవితం, గడచిన కాలం, కెరీర్ పట్ల ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా? షకీలా: నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళాను. భగవంతుడు నాకంటూ ఈ దోవ ఇచ్చాడు. ఇందులో ముందుకు వెళ్ళాను. ఎప్పుడైనా, నాకు వచ్చిన పనిని నిజాయతీగా చేశాను. ఎవరినీ మోసం చేయలేదు. నావి సెక్స్ సినిమాలనీ, సాఫ్ట్ పోర్ట్ సినిమాలనీ అన్నవాళ్ళు ఇవాళ సన్నీ లియోన్ లాంటి తారలను అంగీకరిస్తున్నారు కదా! ఏమైనా, మన దక్షిణాదిలో సిల్క్ స్మిత తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ కాలం అందరి దృష్టినీ ఆకర్షించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచింది నేనే. అయామ్ హ్యాపీ. మళ్ళీ జన్మంటూ ఉంటే... షకీలా: షకీలా గానే పుడతాను. ఇప్పటి లానే మంచిగా జీవిస్తూ, పదిమందికీ చేతనైన మంచి చేస్తాను. - రెంటాల జయదేవ దేవుడిచ్చిన బిడ్డ నేనెప్పుడూ ఒంటరిగా లేను. నాకు భయం. ఎప్పుడూ మా అమ్మ నా పక్కనే ఉండేది. ఆమెకు ఒంట్లో బాగా లేనప్పుడు కూడా ఆమె మంచం పక్కనే పడుకొనేదాన్ని. అలాంటిది మా అమ్మ చనిపోయాక ఒంటరి నయ్యా. చుట్టాలు కూడా మొహం చాటేశారు. ‘జియారత్’ (సమాధిపై పూలు చల్లుతూ నివాళి ఇవ్వడం) చేసే దాకా కూడా ఎవరూ లేరు. మమ్మీ పోయాక కనీసం ఇంట్లో వంటైనా చేయలేదు. తినీ తినకుండా ఉండి పోయేదాన్ని. అలాంటి స్థితిలో తంగం అనే ఈ అబ్బాయి దేవుడు పంపినట్లుగా నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నాకు అచ్చం మా అమ్మలా వంట చేసేది, మందులు ఇచ్చేది వీడే. నన్ను మమ్మీ అనే పిలుస్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళినా, అనుక్షణం నా బాగోగుల గురించి ఫోన్లో అడుగుతూనే ఉంటాడు. రెండు రోజులకని వెళ్ళినవాడు కూడా రెండు గంటల్లోనే వెనక్కి వచ్చేస్తాడు. అల్లా మీద ఒట్టు... వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఇప్పుడు వీడే నాకు దిక్కు. నాదగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! ఇప్పటికి ఓ ఇరవై మంది నాకు జీవితంలో ఎదురయ్యారు. అందరూ అందరే! తెలుగు, తమిళ, మలయాళాల్లో పేరున్న ఒక హీరో నన్ను ప్రేమించానన్నాడు. అతను చిన్నప్పటి నుంచీ నాకు తెలిసినవాడు, మిత్రుడు కూడా! అయిదేళ్ళు ‘రిలేషన్షిప్’లో ఉన్నాం. కానీ, సదరు హీరో ఎంత దుర్మార్గుడంటే, రోజూ కొట్టి, కొట్టి హింసించేవాడు. తన ఒంటి మీద కూడా గాయాలు చేసుకొనేవాడు. శాడిస్టులా ప్రవర్తించేవాడు. అయినా మత్తు దిగిపోయాక, క్షమించమని అడిగేసరికి మెత్తబడేదాన్ని. కానీ, చివరకు అతను నాకు ద్రోహం చేశాడు. ఆ బంధం తెగిపోయింది. తరువాత తమిళనాట కొత్తగా ఏర్పడిన ఓ హీరో గారి రాజకీయ పార్టీ ప్రముఖుడు నన్ను ప్రేమించానన్నాడు. అదీ కట్ అయిపోయింది. ఇలా... ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరలో ఓ వ్యక్తి నన్ను సిన్సియర్‌గానే ప్రేమిస్తున్నానంటున్నాడు. అదెంత కాలమో! -
దర్శకురాలైన షకీలా
శృంగార తారగా ఉర్రూతలూపిన షకీలా ఇప్పుడు కొత్త అవతారమెత్తారు. నిన్న మొన్నటి దాకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టారు. తొలిసారిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని సిగ్నేచర్ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం వివరాలను షకీలా, నిర్మాణ బృందం వివరించారు. ‘‘దర్శకత్వం వహించాలన్నది చాలా రోజులుగా నా కోరిక. అది ఇన్నాళ్ళకు తీరింది. ఈ చిత్రంతో దర్శకురాలిగా నా ప్రయాణం మొదలైంది’’ అని షకీలా అన్నారు. ‘‘కథానాయిక ప్రధానంగా సాగే ఈ చిత్రానికి’’ కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా షకీలావే కావడం విశేషం. ‘‘దాదాపు 20 ఏళ్ళుగా సినీ రంగంలో నటుడిగా ఉన్నా. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి, అఫ్జల్ సమర్పణలో, వెంకటేశ్వరరావు, బాబా, కట్టా శ్రీకర్ ప్రసాద్ తదితరుల సహకారంతో ఈ సినిమాను తీస్తున్నా’’ అని నిర్మాత మెంటా సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రం తెలుగు రూపంలో నరేశ్ (అలియాస్ నరేంద్ర) హీరో కాగా, హిందీ వెర్షన్లో కథానాయక పాత్రను పాత తరం సినీ విలన్ నాగభూషణం మనుమడైన భూషణ్ పోషిస్తున్నారు. ‘‘ఎంతో అనుభవమున్న దర్శకురాలి లాగా ఈ చిత్రాన్ని ఎంతో బాగా షకీలా అక్క తీశారు’’ అని భూషణ్ చెప్పారు. శ్వేత, శ్రీదేవి ఈ చిత్రంలో కథానాయికలు. ‘‘ఏప్రిల్ 20 నుంచి జూన్ 12 మధ్య దాదాపు 50 రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల విభిన్న లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తన 113వ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్న సీనియర్ కెమేరామన్ కంకణాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభిషేక్, కార్తీక్‌లు సంగీతం అందించగా, నందమూరి బెనర్జీ కూర్పు జరుపుతున్న ఈ చిత్రంలో షకీలా సైతం కానిస్టేబుల్‌గా ఓ భిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ‘‘అత్యాచారాలు, అన్యాయాలను మహిళే ఎదిరిస్తే ఎలా ఉంటుందన్నది నాదైన శైలిలో తీశా’’ అంటున్న షకీలా డెరైక్టర్‌గానూ సంచలనం రేపుతారేమో చూడాలి. -
షకీలా ఆత్మకథతో సినిమా!
ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు రాకూడదని అప్పట్లో మలయాళ హీరోలు ఓ నిబంధన విధించారు. అయితే, ఆ తర్వాత వారికి షకీలా టెన్షన్ లేకుండాపోయింది. ఆమె హాట్ చిత్రాలు చేయడం మానుకున్నారు. కొంచెం నీట్‌గా ఉండే పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఆత్మకథ రాశారు షకీలా. అప్పట్లో షకీలా సినిమాల్లానే ఇప్పుడీ ఈ పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. ఈ ఆత్మకథ చదివిన షకీలా ఫ్రెండ్స్.. ‘దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ ఆలోచన షకీలాకి కూడా నచ్చింది. దక్షిణాది భాషలతో పాటు, సౌత్‌లోనూ షకీలా నటించారు కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారామె. కె. తిరుమల్ దర్శకుడు. ఓ ప్రముఖ తారతో తన పాత్రను నటించజేయాలనుకుంటున్నారు షకీలా. -
సంచలనాలు రేపుతున్న షకీలా ఆత్మకథ