వైవాహిక జీవితంపై నమ్మకం లేదు : షకీలా | Shakeela movie Postponed | Sakshi
Sakshi News home page

వైవాహిక జీవితంపై నమ్మకం లేదు : షకీలా

Published Sun, Jan 3 2016 2:00 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

వైవాహిక జీవితంపై నమ్మకం లేదు : షకీలా - Sakshi

వైవాహిక జీవితంపై నమ్మకం లేదు : షకీలా

 మోసం చేశారు
 శృంగార తారలు తమ అంగాంగ నృత్య ప్రదర్శనలతో యువతను గిలిగింతలు పెట్టించినా అందులో కొందరు నిజ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న వాళ్లేనని చెప్పక తప్పదు.అందుకు దివంగత ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత జీవితాన్నే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇక అలాంటి పలు సమస్యలను ఎదుర్కొన్న మరో నటి షకీలా. ఈ మె నట జీవితం ఒక సంచలనమే. 1990-2000ల ప్రాంతంలో మలయాళ చిత్ర పరిశ్రమను తన శృంగార నటనతో ఏలారనే చెప్పాలి. అక్కడ సూపర్‌స్టార్స్ మమ్ముట్టీ, మోహన్‌లాల్ చిత్రాలను మించి షకీలా చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి.
 
  షకీలా చిత్రం విడుదలవుతుందంటే స్టార్స్ భయపడిపోయి వారి చిత్రాల వి డుదలను వాయిదా వేసుకునే వారంటే నటి షకీలా ఆకర్షణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో షకీలా చిత్రాలపై సెన్సార్ తన కత్తెర్ల కు బాగా పని చెప్పడమే కాకుండా సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత తను చెన్నైకి మకాం మార్చి తమిళం, తెలుగు భాషల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోయారు. అందుకు తనపై కుట్ర జరిగిందని షకీలా తీవ్రంగా ఆ రోపిస్తున్నారు.

 అలాంటి తార తాజాగా వివాహ జీవితంపై నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కా రు. అంతేకాదు షకీలా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాల గురించి ఈ సంచలతార ఏమంటున్నారో చూద్దాం. నా జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ అంకేశ్ అనుమతి కోరారు. నేను అందుకు అనుమతించాను. ఆ చిత్రంలో నా సినీ జీవిత అంశాలతో పాటు, వ్యక్తిగత విషయాలు చోటు చేసుకుంటాయి.అందులో నా పాత్రను పోషించడానికి బాలీవుడ్ భామలు సన్నిలియోన్, బిపాసా బసులలో ఒకరిని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
 
 మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నప్పుడు చాలా సంపాదించాను.నాలుగు కోట్ల బడ్జెట్ తయారైన మమ్ముట్టి చిత్రం కంటే 15 లక్షల వ్యయంతో నిర్మించిన నా చిత్రం అధిక వసూళ్లను సాధించేది. అలాంటిది నాపై కుట్ర పన్ని అక్కడ నుంచి నన్ను పంపేశారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును నా కుటుంబానికి చెందిన ఒకరు మోసం చేసి లాక్కున్నాడు. ఇక నా వివాహం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. నిజానికి నాకు వివాహ జీవితంపై నమ్మకం లేదు. అందువల్ల అవివాహితగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాను. అని షకీలా పేర్కొన్నారు. నటి సిల్క్‌స్మిత జీవిత కథ హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ద దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కి విజయం సాధించింది. మరి రేపు షకీలా జీవిత కథ తెరపై,తెర వెనుక ఎలాంటి సంచలనాన్ని కలిగిస్తుందో వేచి చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement