హేమ కమిటీ నివేదికతో మలయాళ ఇండస్ట్రీ వణికిపోతోంది. ఇక్కడ ఆర్టిస్టులను బానిసల్లా చూస్తున్నారని, పలుకుబడి ఉన్న పెద్దలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని సదరు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో పలువురు మలయాళ సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను బహిర్గతం చేస్తున్నారు.
వేధింపులు..
ఈ నేపథ్యంలో నటి షకీల సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ ఇండస్ట్రీ ఒక్కటే కాదు తమిళ చలనచిత్ర పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించింది. హిందీలో అంటారా? అక్కడ క్యాస్టింగ్ కౌచ్ కన్నా నెపోటిజమే ప్రధాన సమస్య అని.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులను ఎదగనీయకుండా అడ్డుపడతారంది.
టాలీవుడ్‌లో మరీ ఎక్కువ
కేవలం తాము మాత్రమే రాణించాలని చూస్తారని పేర్కొంది. తెలుగులో అయితే లైంగిక వేధింపులు తారాస్థాయిలో ఉన్నాయంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటుందా? అని తమ మేనేజర్లను అడుగుతారని, అందుకు ఓకే అంటేనే సినిమాలో ఛాన్సిస్తారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment