Hema Committee Report
-
'అ చిత్రాలు చూడాలంటూ.. డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు'!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా మలయాళ డైరెక్టర్‌పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.అయితే గతంలోనూ ఫేస్బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది. -
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
హేమా కమిటీలు మాకొద్దు: ఐశ్వర్య రాజేశ్
సినిమా పరిశ్రమలో నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని నివేదికను ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం విడుదల చేసిందో, అప్పటి నుంచే నటీమణుల్లో ఒక ధైర్యం, తెగింపు వచ్చినట్లుంది. ఒక్కొక్కరూ తమ చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. అది ఇప్పుడు కోలీవుడ్ వరకూ పాకింది. దీంతో కోలీవుడ్‌లోనూ హేమా కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలనే డిమాండ్ రావడంతో, దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) అలాంటి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అలాంటి కమిటీ తమిళ చిత్రపరిశ్రమకు అవసరం లేదనే అభిప్రాయాన్ని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొనడం ఆసక్తిగా మారింది. నటిగా చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన నటి ఐశ్వర్యరాజేశ్. ఆదిలో చిన్న చిన్న పాత్రలు పోషించి స్వశక్తితో ఎదిగిన ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ పాత్రలనే కాకుండా దక్షిణాది ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక భేటీలో హేమా కమిటీ గురించి స్పందిస్తూ తనకు అలాంటిదేమీ జరగలేదు అన్నారు. అలాంటివి జరగకూడదనే కోరుకుందాం అన్నారు. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికి అలాంటి ఒక విషయం జరగలేదు. అందువల్ల తమిళ చిత్రపరిశ్రమలో హేమా కమిషన్ లాంటిది అవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా జరిగితే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని, అందుకు కారకులైన వారిపై కఠినశిక్ష వేయాలని పేర్కొన్నారు. మహిళల రక్షణే ముఖ్యం అని నటి ఐశ్వర్యరాజేశ్ అన్నారు. -
జస్టిస్ హేమా కమిటీ నివేదికపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగానే మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హేమా కమిటీ రిపోర్ట్‌లోని అంశాలు సంచలనం రేపాయి. దీంతో ఇతలర చిత్రపరిశ్రమలలో కూడా చలనం వచ్చింది. తాజాగా ఈ అంశం గురించి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీమణులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకునేందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.ఎం.సురేశ్ పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందని ప్రముఖులతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ జరిపిన ఈ మీటింగ్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్.ఎం సురేశ్ ఇలా చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని, వాటిని సరిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో నటీమణులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారిని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అనే టాపిక్ గురించి చర్చించామని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం తాము ఏం చేయబోతున్నామో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.హేమా కమిటీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. కొద్దిరోజుల క్రితం ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
మాలీవుడ్ సినీ చరిత్ర: దళిత నటి ఇంటినే తగులబెట్టేశారు!
మలయాళంలో హేమ కమిటి రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో మాలీవుడ్ వణుకుతోంది. అయితే మహిళలపై దురాగతాలు, వేధింపులు ఇప్పుడే కాదు.. మాలీవుడ్ పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచే ఉన్నాయి. అప్పట్లోనే స్త్రీలపై దాడులు జరిగాయి. చాలా మంది కుల వివక్షకు గురయ్యారు. మలయాళ తొలి హీరోయిన్‌కి అయితే కేరళను వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళ ఇండస్ట్రీ 1920లో ఏర్పడింది. తొలి సినిమా విగతకుమారన్. ఈ చిత్రంలో పికె రోసీ హీరోయిన్గా నటించింది. మలయాళ తొలి హీరోయిన్, భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి రోసీ.ఓ దళిత కుటుంబంలో పుట్టడమే రోసీకి శాపంగా మారింది. ఆమె విగతకుమారన్ చిత్రంలో నాయర్(పెద్ద కులం) మహిళగా నటించడాన్ని ఓ వర్గం ప్రజలు సహించలేకపోయారు. సినిమా విడుదలను అడ్డుకున్నారు. థియేటర్‌పై రాళ్ల దాడి చేశారు. అంతేకాదు ఆమె ఇంటిని కూడా తగులబెట్టేశారు. అగ్ర వర్ణాలా వేధింపులు తట్టుకోలేక..ప్రాణ భయంలో రోసీ మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్లింది.సమాజంలోని అనేక వర్గాలలో, ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశంలేని రోజుల్లోనే రోజీ సినిమాల్లోకి వచ్చి పెద్ద సాహసమే చేసింది. అంతేకాదు తొలి సినిమాలోనే అగ్రవర్ణ మహిళగా నటించి కుల వివక్షకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. రోసీ చేసిన ప్రయత్నం చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.మలయాళంలో ఇప్పటికీ కుల వివక్ష ఉందని చాలా మంది నటీనటులు చెబుతున్న మాట. కులం చూసి అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారట. తమ కులం వాడు అయితే ఒక పాత్ర.. తక్కువ కులం వాడు అయితే మరో పాత్రలు ఇస్తూ వివక్ష చూపించడం ఇంకా కొనసాగుతుంది.ఇక మహిళలపై జరుగుతున్న దురాగతాలు అంతా ఇంతా కాదు. అయితే నటీమణులెవరు తమకు వస్తున్న వేధింపులపై అంత త్వరగా స్పందించరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు తమకు వచ్చిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఇప్పుడు ‘హేమా కమిటీ’ వల్ల చాలా మంది తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరిగింది. ఆ దాడి వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ రిపోర్ట్ ఆలస్యంగా 2024 ఆగస్టులో బయటకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలు కుల వివక్షకు గురైతే..ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సినిమా చాన్స్‌లు రావాలంటే కాంప్రమైజ్, అడ్జస్ట్ కావాల్సిందే. హేమ కమిటీ రిపోర్ట్‌తోనైనా మాలీవుడ్ మారిపోయి మంచి పరిశ్రమగా ఎదగాలని కోరుకుందాం. -
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ఉండాలి!
మలయాళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతర భాషల్లోనూ హేమా తరహా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీనటులు కోరుతున్నారు. వేధింపుల ఘటనలపై తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత స్పందిస్తూ– ‘‘చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల అనుభవాలను నాతో చాలామంది పంచుకున్నారు. సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని పలువురు మహిళలు నాతో చె΄్పారు. అయితే నాకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు. నేను చూడలేదు కాబట్టి వేధింపులు జరగలేదని కాదు. కేవలం సినిమా అనే కాదు.. రాజకీయ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)కి ధన్యవాదాలు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. సెట్స్‌లో మహిళలకు భద్రత కల్పించేలా నిబంధనలను తీసుకురావడం, అలాగే వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లు, సినిమా పరిశ్రమలోని ఇతర విభాగాలు వినకపొవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ఉన్నట్లే మహిళలకు సంబంధించిన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను’’ అని పేర్కొన్నారు. -
నేనూ ఆ బాధితురాలినే.. జస్టిస్ హేమ కమిటీపై సిమ్రాన్
మలయాళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదక తర్వాత ఒక్కోక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారు. దీంతో అదే తరహా కమిటీని తమ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలకు చెందిన సినీ నటీనటులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ రియాక్ట్ అయ్యారు.పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. దీనికి అంతం ఎప్పుడో అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా నటి సిమ్రాన్ కూడా తానూ వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. ఈ ఉత్తరాది భామ కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించారు. యువత కలల రాణిగా వెలుగొందిన సిమ్రాన్ వివాహానంతరం నటనకు దూరం అయినా, తాజాగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా ఈమె ఆ మధ్య పేట చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి రీ ఎంట్రీకి మార్గం వేసుకున్నారు.తాజాగా ఒక భేటీలో సిమ్రాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నటీమణుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకే దారి తీస్తోందన్నారు. కాగా తానూ అలాంటి బాధితురాలినేనని చెప్పారు. ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణమన్నారు. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరు ? మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందన్నారు. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలం అని, అందుకు సమయం తప్పనిసరిగా అవసరం అన్నారు. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. -
ప్రేమమ్ హీరో పై రేప్ కేసు నమోదు..
-
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి
‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది. అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... – సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన మరో ΄ోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్ షేర్ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు. -
నన్ను ఆ విషయం అడగొద్దు: హీరోయిన్ ఆండ్రియా
ప్రస్తుతం సినీ రంగంలో లైంగిక వేధింపుల అంశం హాట్ టాపిక్ అయిపోయింది. మలయాళ చిత్రసీమలో జరుగుతున్న ఘోరాలపై హేమా కమిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది జరిగిన దగ్గర నుంచి నటీమణులు కనిపిస్తే చాలు.. లైంగిక వేధింపులు, కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించే అడుగుతున్నారు. వీటికి కొందరు సమాధానాలు చెబుతుండగా.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవలే అని ఊరుకుంటున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?)ఇప్పుడు నటి, సింగర్ ఆండ్రియాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. తిరువణ్నమలైలో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా.. ఇది పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడగ్గా.. ఆ విషయం తనను అడగొద్దని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆండ్రియానేనా ఇలా సమాధానం ఇచ్చింది అనే మాట్లాడుకుంటున్నారు. తెలుగులో 'మజాకా' అనే సినిమా చేసిన ఆండ్రియా.. 'యుగానికొక్కడు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్, కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నంతలో కాస్త బిజీగా ఉంది.(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్) -
మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?
హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని గత కొన్నిరోజులుగా ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్‌తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగోళ్లకు కూడా తెలిసిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నివిన్ ఆరో వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు.'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు. 'ప్రేమమ్' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Nivin Pauly (@nivinpaulyactor) -
తారల వెనుక చీకటి సర్దుబాట పడితేనే కెరీర్ దారిలోకి?
‘పనికి తగ్గ జీతం’ అనేది కామన్. అయితే పనితో పాటు ‘వేరే పనులు’ కూడా చేయాలి... లేకపోతే పని పోయే అవకాశం ఉంది. సినిమా పరిశ్రమకి చెందిన పలువురు నటీమణులు అంటున్న మాట ఇది. అయితే తాము ఎదుర్కొంటున్న ఈ రకమైన ఒత్తిడి గురించి నటీమణులు అంత త్వరగా బయటపెట్టరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు పెదవి విప్పితే, ఇప్పుడు మలయాళంలో ‘హేమా కమిటీ’ వల్ల ఎందరో తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ విషయాల్లోకి....చాలా అవకాశాలు కోల్పోయా!: చార్మిలా‘‘నా కెరీర్లో చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. దర్శకుడు హరిహరన్, నిర్మాత ఏంపీ మోహనన్ నా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంకా ఓ 28 మంది నాతో అభ్యంతరకరంగా వ్యవహరించారు’’ అని నటి చార్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏయన్నార్, లక్ష్మీ జంటగా నటించిన ‘్రపాణదాత’ (1992)లో వీరి కూతురిగా నటించిందామె. భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూ΄÷ందించిన ‘అసాధ్యురాలు’లో నటించారు. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్‌గా నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన చార్మిలా మలయాళంలో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ మలయాళ మీడియాతో చార్మిలా మాట్లాడుతూ – ‘‘హరిహరన్ డైరెక్షన్లో మలయాళ చిత్రం ‘పరిణయం’ (1994) అంగీకరించా.అదే సినిమాలో నటుడు విష్ణు కూడా నటించాల్సింది. ‘చార్మిలా అడ్జెస్ట్మెంట్కి ఒప్పుకుంటుందా’ అని విష్ణు ద్వారా హరిహరన్ అడిగించారు. ‘ఒప్పుకోదు’ అని విష్ణు చెప్పడంతో తనని, నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. అడ్జస్ట్ కాకపోవడంతో చాలా సినిమాలు కోల్పోయాను. నేను చాలామంది పేర్లు బయటపెట్టకపోవడానికి కారణం నాకో కొడుకు ఉన్నాడు. తల్లిగా నా బాధ్యతలు నాకున్నాయి కాబట్టి ఈ ఘటనలకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకోవడంలేదు’’ అన్నారు. ఇంకా మలయాళ నిర్మాత ఎంపీ మోహనన్ గురించి చెబుతూ– ‘‘అర్జునన్ పిళ్లయుమ్ అంజు మక్కళుమ్’ (1997) నిర్మాత ఎంపీ మోహనన్ ఆ సినిమా చివరి రోజు షూటింగ్ పూర్తయ్యాక తన హోటల్ గదికి రమ్మంటే, నా స్టాఫ్‌తో కలిసి వెళ్లాను. మోహనన్, అతని ఫ్రెండ్స్ నాపై అత్యాచారం జరపడానికి ట్రై చేశారు. నేను తప్పించుకుని బయటపడ్డాను. నేనైతే బయటపడ్డాను కానీ వాళ్లు జూనియర్ ఆర్టిస్టులపై అత్యాచారం జరిపారు. నేను నాలుగు భాషల్లో (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ) సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఘటనలు మలయాళ పరిశ్రమలోనే ఎక్కువ’’ అని చార్మిలా పేర్కొన్నారు.ఇది వేకప్ కాల్ – సోమీ అలీ 1990లలో తాను హిందీ సినిమాలు చేసినప్పుడు లైంగిక దాడులు ఎదుర్కొన్నానని ఇటీవల సోమీ అలీ పేర్కొన్నారు. ‘‘కెరీర్లో కొనసాగాలంటే రూమ్‌కి వెళ్లాల్సిందే, లేకపోతే కుదరదు లాంటి హెచ్చరికలు నాకొచ్చాయి. కెరీర్ కోసం కొందరమ్మాయిలు అలా రూమ్‌లకు వెళ్లి, మర్నాడు ఉదయం ఇబ్బందిగా, సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఘటనలు చూశా. కానీ ఆ వ్యక్తులు మాత్రం ‘ఫ్యామిలీ మేన్’లా చలామణీ అవుతుంటారు. నాకు ఎదురైన చేదు అనుభవాల వల్లే ‘నో మోర్ టియర్స్’ ఫౌండేషన్ ఆరంభించా. ఇక మలయాళ పరిశ్రమలోని హేమా కమిటీ ఓ వేకప్ కాల్ లాంటిది’’ అని సోమీ అన్నారు. ఎవరూ ఎవర్నీ బలవంత పెట్టరు: కామ్యా పంజాబీ‘‘గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం టీవీ రంగం క్లీన్‌గా ఉంది. ఇక్కడ (హిందీ టెలివిజన్ రంగాన్ని ఉద్దేశించి) ఏ మురికి (మహిళలపై లైంగిక దాడులు, క్యాస్టింగ్ కౌచ్‌లను ఉద్దేంచి) లేదు. ఎవరు ఎవర్నీ ఫోర్స్ చేయడం లేదు. స్క్రిప్ట్‌లోని రోల్‌కు సరిపోయి, మనలో నటించే ప్రతిభ ఉంటే చాలు. చాన్స్‌లు వస్తాయి’’ అని బుల్లితెర ఫేమ్ కామ్యా పంజాబీ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘వినోద రంగంలో ప్రస్తుతం మహిళలకు సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉందంటే అది టీవీ విభాగంలోనే. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే అది పరస్పర అంగీకారంతోనే. అమ్మాయి సమ్మతించకపోతే ఏదీ జరగదు. ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరు. కొందరు పురుషులు ఉమనైజర్స్గా ఉండొచ్చు.. కాదనడం లేదు’’ అన్నారు కామ్య.మలయాళంలో అత్యంత ప్రతిభ గల దర్శకుడిగా హరిహరన్‌కి పేరుంది. జాతీయ అవార్డు సాధించిన పలు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో చార్మిలా కోల్పోయిన ‘పరిణయమ్’ ఒకటి. ‘శరపంచరమ్, పంచాగ్ని, ఒరు వడక్కన్ వీరగాథ, సర్గమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు హరిహరన్. మలయాళ సినిమాకి చేసిన కృషికిగాను కేరళ అత్యున్నత పురస్కారం అయిన ‘జేసీ డేనియల్ అవార్డు’ని కూడా అందుకున్నారు ఈ దర్శకుడు.దర్శకుడు హరిహరన్పై చార్మిలా చేసిన ఆరోపణలను మలయాళ నటుడు విష్ణు ధ్రువీకరించారు. ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ – ‘‘తను సర్దుబాటుకి ఒప్పుకుంటుందా? అని చార్మిలాని అడిగి, తెలుసుకోమని డైరెక్టర్ నాతో అన్నారు. చార్మిలా తిరస్కరించిన విషయాన్ని నేను హరిహరన్‌తో చె΄్పాను. దాంతో ‘పరిణయం’ సినిమా చాన్స్‌ని చార్మిలా కోల్పోయారు’’ అని విష్ణు పేర్కొన్నారు.ఆరు సినిమాలు చేస్తేనే సభ్యత్వం వచ్చింది: మినూ మునీర్ మలయాళ తార మినూ మునీర్ తన పట్ల నటులు జయసూర్య, ఇడవెల బాబు, నటుడు–నిర్మాత మణియన్‌పిల్ల రాజు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో సభ్యత్వం ΄÷ందాలంటే 3 చిత్రాల్లో నటిస్తే చాలట. కానీ తాను 6 సినిమాల్లో నటించినా సభ్యత్వం ఇవ్వలేదని మిను పేర్కొన్నారు. ‘అమ్మ’లో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇడవెల బాబుకి ఫోన్ చేసి, సభ్యత్వం గురించి అడిగారట మిను. ‘‘మెంబర్షిప్ ఫామ్ పూర్తి చేయడానికి తన ఫ్లాట్‌కి రమ్మన్నాడు ఇడవెల. వెళ్లి, ఫామ్ పూర్తి చేస్తుండగా నా మెడపై ముద్దు పెట్టాడు. నేను వెంటనే అక్కణ్ణుంచి వెళ్లిపోయా’’ అన్నారు మినూ మునీర్.నాపై ఆరోపణలు అవాస్తవం – నివిన్ పౌలి మలయాళ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇప్పటికే 15 మందికి పైగా నటులపై కేసులు నమోదు అయినట్లు వార్తలు ఉన్నాయి. తాజాగా నివిన్ పౌలి పేరు తెరపైకి వచ్చింది. ఓ మూవీలో చాన్స్ ఇప్పిస్తామని మోసం చేసిన ఆరుగురిలో నివిన్ పౌలి కూడా ఉన్నారని, ఇది 2023 నవంబరులో దుబాయ్‌లో జరిగిందని ఓ మహిళ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిందనే వార్త వినిపిస్తోంది. దాంతో ‘‘నాపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదు. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నా లీగల్ టీమ్ చూసుకుంటుంది’’ అని నివిన్ పౌలి తెలిపారు.కన్నడంలోనూ హేమా కమిటీలాంటిది కావాలి: శ్రుతీ హరిహరన్మలయాళంలో ఉన్నట్లుగా కన్నడ పరిశ్రమలోనూ హేమా లాంటి కమిటీ ఉండాలని కన్నడ నటి శ్రుతీ హరిహరన్ అంటున్నారు. ‘‘హేమా కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ పరిశ్రమ గౌరవాన్ని దిగజార్చేలా ఉందన్న కొందరి మాటలతో ఏకీభవించను. సినిమా అనేది మంచి కళ. ఆ కళలో ఉన్న కొన్ని విషయాలను మార్చే టైమ్ వచ్చింది. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలి’’ అని శ్రుతీ హరిహరన్ పేర్కొన్నారు. ఇక గతంలో నటుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్ కొన్ని ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే తాను అలాంటి పనులు చేయలేదంటూ అర్జున్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.మహిళా నాయకత్వం ఉండాలి: ఏక్తా కపూర్కరీనా కపూర్ లీడ్ రోల్లో హన్సల్ మెహతా దర్శకత్వంలో రూ΄÷ందిన హిందీ చిత్రం ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్లో చిత్రనిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలో మహిళలకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు వారు మహిళల భద్రతను గురించి కొంత ఆలోచన చేస్తారు. అలాగే నాయకత్వం బలంగా ఉండేలా తోటి మహిళలు తోడ్పాటు అందించాలి. నివేదికలు వచ్చినప్పుడు చదువుతాం... చాలా తెలుసుకుంటాం. కానీ మహిళల సాధికారికత, భద్రత విషయాల్లో పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన వాతా వరణం నెలకొల్పాలి’’ అన్నారు. ‘‘మహిళలకు మెరుగైన పని వాతావరణం ఉండేలా పురుషులు కూడా బాధ్యతగా చొరవ తీసుకోవాలి’’ అని హన్సల్ అన్నారు. -
హేమా కమిటీ నివేదికపై హైకోర్టులో పిటిషన్
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్కడి పరిశ్రమలో పనిచేసే మహిళలు లైంగికదాడికి గురౌతున్నారని హేమా కమిటీ పేర్కొంది. కొద్దిరోజుల క్రితం ఆ నివేదికను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమిటీ అందించింది. దీంతో చాలామంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.తాజాగా హేమా కమిటీ నివేదికపై జరిగే విచారణను సీబీఐకి వదిలేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు న్యాయవాదులు ఏ జన్నాత్, అమ్యతా ప్రేమ్జిత్లు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించాలని పిటిషన్లో వారు డిమాండ్ చేశారు. హేమా కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన వారికి భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. సినిమా రంగంలో మహిళల భద్రతకు చట్టం అవసరమని ఈమేరకు కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. -
అంతిమంగా సినిమా బతకాలి: మమ్ముట్టి
మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్‌లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. ⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్‌ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి. -
సారీ... నాకు తెలియదు: రజనీకాంత్
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి హీరో రజనీకాంత్ తనకు ఏమీ తెలియదంటూ స్పందించడం సినిమా వాసులను ఆశ్చర్యపరుస్తోంది.చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల కోసం జస్టిస్ హేమా కమిటీ తరహాలో కోలీవుడ్‌లోనూ ఓ కమిటీ రావాలంటారా? అనే ప్రశ్నకు రజనీకాంత్ స్పందిస్తూ– ‘‘సారీ... ఆ అంశం గురించి నాకేమీ తెలియదు’’ అంటూ జబాబు చెప్పారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
మాలీవుడ్ ను నాశనం చేయకండి అంటున్న మోహన్ లాల్.. సమంత సెన్సేషనల్ స్టేట్ మెంట్..
-
షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి
ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్‌కు చెందిన సజీర్ (33), దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)అవి నిజం కాదు సజీర్ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్‌లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే?సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ రంజిత్ని సంప్రదిస్తే ఒక హోటల్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్) -
మనకూ కావాలి‘హేమ’ కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి వీలుగా జస్టిస్ కె.హేమ కమిటీ తరహాలో సబ్ కమిటీని నియమించాలని నటి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇచి్చన నివేదికపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా సమంత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి బాటలు వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు 2019లో నెలకొలి్పన ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’కూడా డబ్ల్యూసీసీ గ్రూప్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..’అని సమంత సూచించారు. -
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్‌లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్‌లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సమంత రియాక్షన్
-
ప్రముఖ నటుడు లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్‌లాల్‌తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం. లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా..మోహన్‌లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్‌గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్‌లాల్‌కు చెప్తే మంచి పని చేశావన్నాడు.ఛాన్సులు తగ్గిపోయాయి..కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ -
తెలుగు ఇండస్ట్రీలోనూ వేధింపులు.. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకే అంటేనే..: షకీల
హేమ కమిటీ నివేదికతో మలయాళ ఇండస్ట్రీ వణికిపోతోంది. ఇక్కడ ఆర్టిస్టులను బానిసల్లా చూస్తున్నారని, పలుకుబడి ఉన్న పెద్దలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని సదరు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో పలువురు మలయాళ సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను బహిర్గతం చేస్తున్నారు.వేధింపులు..ఈ నేపథ్యంలో నటి షకీల సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ ఇండస్ట్రీ ఒక్కటే కాదు తమిళ చలనచిత్ర పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించింది. హిందీలో అంటారా? అక్కడ క్యాస్టింగ్ కౌచ్ కన్నా నెపోటిజమే ప్రధాన సమస్య అని.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులను ఎదగనీయకుండా అడ్డుపడతారంది. టాలీవుడ్లో మరీ ఎక్కువకేవలం తాము మాత్రమే రాణించాలని చూస్తారని పేర్కొంది. తెలుగులో అయితే లైంగిక వేధింపులు తారాస్థాయిలో ఉన్నాయంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటుందా? అని తమ మేనేజర్లను అడుగుతారని, అందుకు ఓకే అంటేనే సినిమాలో ఛాన్సిస్తారని ఆరోపించింది. -
ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ
రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా గొంతు విప్పి చెప్తున్నారు. తప్పు చేసినవారు దర్జాగా తిరుగుతుంటే బాధిత మహిళ మాత్రం ఎందుకు నరకయాతన అనుభవించాలంటోంది నటి ఖుష్బూ సుందర్.ఆడవారికే ఎక్కువ వేధింపులుఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఖుష్బూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఆడవారిని దూషించడం, వేధించడం, ఛాన్సులు కావాలంటే కాంప్రమైజ్ అయిపోమని కోరడం.. ఇలాంటివి ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. పురుషులకన్నా మహిళలకే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వారే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ వేధింపులను అరికట్టాల్సిన బాధ్యత హేమకమిటీపై ఎంతైనా ఉంది. భయపడకండిఅమ్మాయిలూ.. మీరు అనుభవిస్తున్న బాధ గురించి మాట్లాడండి, అప్పుడే దానిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల పరువు పోతుందనో, నిందలు వేస్తారనో ఆలోచించకండి. నిజంగా వేధింపులకు గురైతే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉంది? అంటారేమో! అప్పటి తన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేం కదా.. నా కన్నతండ్రి నన్ను లైంగికంగా వేధించాడని గతేడాది బయటపెట్టాను. ఆడదానికే పుడతారుఈ విషయం చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని చాలామంది అడిగారు. నిజమే! ముందు చెప్పాల్సిందే. కాకపోతే అది నా కెరీర్ కోసం కాంప్రమైజ్ అయిన వ్యవహారం కాదు. నేను కింద పడినప్పుడు నన్ను పట్టుకోవాల్సిన చేతులు... నేను జారిపోతున్నపుడు నిలబెట్టాల్సిన చేతులే నన్ను ఇబ్బంది పెట్టాయి. రక్షించాల్సిన వ్యక్తి చేతుల్లోనే వేదనకు గురయ్యాను. మగవాళ్లందరికీ ఒకటే చెప్తున్నా.. బాధితులవైపు నిలబడండి, వారికి మద్దతివ్వండి. ప్రతి పురుషుడు ఒక ఆడదానికే పుడతాడు. అమ్మ, అక్క, చెల్లి, టీచర్, ఆంటీ, ఫ్రెండ్స్.. ఇలా ఎంతోమంది ఆడవారి వల్లే మీరిప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.ప్రారంభంలోనే ఆశలు ఛిద్రంమాతో నిలబడండి. మమ్మల్ని రక్షించండి. మీకు జన్మనిచ్చినవారిని, ప్రేమను పంచినవారిని గౌరవించండి. మహిళలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడండి. మనం కలిసి పనిచేస్తేనే బలంగా ముందడుగు వేయగలం. కుటుంబం అండ లేని ఆడవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఆశలతో పల్లెటూరు నుంచి వస్తే ఆదిలోనే వారి కలలు ఛిద్రమైపోయినవారూ ఉన్నారు.తలవంచాల్సిన అవసరం లేదుఇకనైనా ఆడవారిని దోచుకోవడం ఆగిపోవాలి. ఒక్కసారి నో అన్నాక ఎవరికీ తలవంచాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని తాకట్టుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఎంతోమంది స్త్రీలకు.. ఒక తల్లిగా, మహిళగా నేను అండగా నిలబడతాను' అని రాసుకొచ్చింది. కాగా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఖుష్బూ గతేడాది షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 💔 This moment of #MeToo prevailing in our industry breaks you. Kudos to the women who have stood their ground and emerged victorious. ✊ The #HemaCommittee was much needed to break the abuse. But will it?Abuse, asking for sexual favors, and expecting women to compromise to…— KhushbuSundar (@khushsundar) August 28, 2024చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో