![Malayalam Actress Minu Muneer has Accused Balachandra Menon](/styles/webp/s3/article_images/2024/09/29/minu.jpg.webp?itok=iNYM3P0Z)
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మలయాళ డైరెక్టర్‌పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.
అయితే గతంలోనూ ఫేస్‌బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment