
ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య కోకిలపై యూట్యూబర్ అజు అలెక్స్‌తో కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్ తనను రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులకు వివరించారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై విష ప్రచారం చేస్తోందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని నటుడు బాల ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ అజు అలెక్స్ ఛానెల్‌లో తనపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారని బాల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 8, 2023లోనే ఎలిజబెత్‌తో తాను విడిపోయినట్లు బాలా పోలీసులకు వెల్లడించారు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.
ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడుతూ..' కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇదో వెబ్ సిరీస్‌లా సాగుతోంది. నేనేమైనా రేపిస్టునా?, ఒక మహిళపై ఏడాదిన్నర పాటు అత్యాచారం ఎలా చేయగలను? నాకు ఇప్పటికే సర్జరీ జరిగింది. నా శస్త్రచికిత్స సమయంలో ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది' అని బాల అన్నారు. ఓ వ్యక్తితో కలిసి ఆమె తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన భార్య కోకిల మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment